Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Farmers Likely To Move High Court For Lands Captures Of Capital1
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి

Sonia Gandhi And Rahul Gandhi Names In ED Chargesheet2
నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. చార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్‌ పేర్లు

ఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు ఈడీ భారీ షాకిచ్చింది. వీరిద్దరి పేర్లను ఈడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల జప్తునకు నోటీసులిచ్చిన ఈడీ.. తాజాగా సోనియా, రాహుల్‌ పేర్లను చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఈనెల 25వ తేదీన రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనుంది.కాగా, కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఏజెఎల్‌, యంగ్ ఇండియన్‌పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్.. నేషనల్ హెరాల్డ్ న్యూస్‌ ప్లాట్‌ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్‌లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. యంగ్ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రయత్నించిందని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే రూ. 661 కోట్ల ఏజెఎల్‌ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులిచ్చింది. ఈడీ కార్యాలయాల వద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునేషనల్ హెరాల్డ్ కేసు చార్జి షీట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్‌ పార్టీ నిరసనకు సిద్‌ధమైంది. రేపు(బుధవారం) ఈడి కార్యాలయాలవద్ద ధర్నాకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందిన, ప్రతిపక్షాలపై ఇది నేరుగా చేస్తున్న దాడిగా అభివర్ణించింది. ప్రతీకార రాజకీయాలకు ఇది పరాకాష్టని,ఈ అంశంపై తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.

Ex Minister Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu3
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్‌ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు

సాక్షి, విజయవాడ: ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ‘‘రాజధాని కోసం రైతుల నుంచి దాదాపు 34 వేల ఎకరాలు తీసుకున్నారు. అంతకు ముందే వాగులు, కొండలు, రోడ్లు అన్నీ కలిపి దాదాపు 58 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2700 ఎకరాలు మాత్రమే. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. ఇప్పుడు అదనంగా మరో 44 వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు. రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పుచేశారు.. ఇంకా 69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘రెండు కళ్ల సిద్ధాంతంతో పరోక్షంగా ఉమ్మడి ఏపీ విభజనకు దోహదపడ్డారు. మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా హమీని ఎగ్గొట్టేసింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు సరైన పోరాటం చేయడం లేదు. ప్రజలకు ఉపయోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదు. ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ చేయమని చెప్పడం చంద్రబాబు అనాలోచిత.. తొందరపాటు చర్య. పెద్ద పెద్ద ధనవంతులకు, కార్పొరేట్లను బాగుచేయడం కోసం ఇలాంటివి చేయడం సరికాదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో పేదలను గాలికి వదిలేశారు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్లకు మేలు జరిగేలా పనిచేస్తున్నారు. మీ నిర్ణయాల వల్ల ప్రజలు, రైతులు, విద్యార్ధులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 58 వేల ఎకరాలుంటే మళ్లీ 44 వేల ఎకరాలు తీసుకోవడం దేనికి. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ 44 వేల ఎకరాలు తీసుకుంటున్నారా చంద్రబాబు. పొలం ఉన్న రైతు అమ్ముకోలేడా... రైతు తరపున మీరు అమ్ముతారా?. ప్రభుత్వం ఉన్నది.. రియల్ ఎస్టేట్ వాళ్లను బాగుచేయడానికా?. 40 అంతస్తుల బిల్డింగ్‌లు ప్రజలకు ఒరిగేదేంటి. ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన. ప్రజలకు మేలు చేయకుండా మెట్రో రైలు జపం చేయడమెందుకు?’’ అంటూ శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.‘‘ఏపీలో ఉన్న ఆరు ఎయిర్ పోర్టులు సరిపోవా.. మళ్లీ కొత్తవి పెట్టడం దేనికి?. అమరావతిలో 5 వేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఎవరడిగారు.. ఎవడికి కావాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలని ఎవరడిగారు. శ్రీకాకుళంలో నాలుగైదు ఎకరాలున్న వాళ్లు కూడా బెజవాడలో తాపీ పనులు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలో కావాల్సింది ఎయిర్ పోర్టు కాదు.. పంటలకు సాగునీరు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు చనిపోతుంటే నీకు కనిపించడం లేదా?. చంద్రబాబు ఆలోచనలో ఇప్పటికైనా మార్పు రావాలని నేను కోరుతున్నా. పి4 గురించి తర్వాత ముందు సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి చంద్రబాబు. కేంద్రం ఇచ్చేది కాకుండా రైతులకు 14 వేలు ఇస్తామన్నారు.. ఏమైపోయింది ఆ హామీ?. మెట్రోరైళ్ల పై ఉన్న శ్రద్ధ రైతులపై ఎందుకు లేదు చంద్రబాబూ’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.చంద్రబాబు పి4 స్కీంపై సెటైర్లు చంద్రబాబు పి4 స్కీంపై వడ్డే శోభనాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు. పి4 విధానం అంటున్నారు మంచిదే. డబ్బున్నవాళ్లు పేదలకు సాయం చేయడం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన మూడు విద్యాసంస్థలు మీ నాయకులవే. మీకు చేతనైతే నారాయణ, భాష్యం విద్యాసంస్థల్లో పది శాతం పేద విద్యార్ధులకు సీట్లు ఇప్పించండి. పేదల కోసం హెరిటేజ్ నుంచి మీరేమీ ఇవ్వరా? మీ హెరిటేజ్ నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ప్యాకెట్లైనా ఇవ్వొచ్చు కదా?పేదల కోసం హెరిటేజ్ కూడా మేలు చేస్తుందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తే మిమ్మల్ని చూసి మరికొంతమంది సాయం చేసేందుకు ముందుకు వస్తారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు.

Cm Revanth Reddy Warning To Mlas4
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం.. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్‌ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్‌పై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని పిలుపునిచ్చారు.‘‘ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి. దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం..ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా. హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు...బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది...కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయి. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సన్న బియ్యం మన పథకం.. మన పేటెంట్, మన బ్రాండ్’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

Do You ABout GNWL PQWL RSWL WL Words Means in Train Tickets5
ట్రైన్‌ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్‌!

ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన.. ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యాలకు చేరుస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రతిరోజూ 13,000 ప్యాసింజర్ రైళ్లను నడుపుతోంది. ట్రైన్ల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ.. పండుగల సీజన్‌లో టికెట్ బుక్ చేసుకోవడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ సాహసించి టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్‌పై WL, PQWL, GNWL, RSWL వంటి పదాలు కనిపించే ఉంటాయి. ఇవి మీ బుకింగ్ స్థితిని సూచిస్తాయి. అంతే కాకుండా రైలులో మీకు సీటు లభిస్తుందో లేదో నిర్ణయిస్తాయి. ఈ పదాల అర్థం ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం.డబ్ల్యుఎల్ (WL): డబ్ల్యుఎల్ అంటే వెయిటింగ్ లిస్ట్‌ అని అర్థం. అంటే మీరు వెయిటింగ్ టిస్టులో ఉన్నారని ఈ పదం సూచిస్తుంది. టికెట్స్ కన్ఫర్మ్‌ అయిన వారు ఎవరైనా వారి టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. మీకు సీటు లభించే అవకాశం ఉంటుంది.జీఎన్‌డబ్ల్యూఎల్ (GNWL): GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న సమయంలో ఇలా ఉంటే.. మీకు బెర్త్ కన్ఫర్మ్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. జనరల్ వెయిటింగ్ లిస్ట్.. అనేది ప్రారంభ స్టేషన్ లేదా సమీపంలోని ఏదైనా ఇతర ప్రధాన స్టేషన్ నుండి బుక్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది. ఇతర వెయిటింగ్ లిస్ట్ బుకింగ్‌లతో పోలిస్తే GNWL టిక్కెట్లు కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!పీక్యూడబ్ల్యుఎల్ (PQWL): PQWL అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. అంటే ఇలాంటి టికెట్లకు సీటు కన్ఫర్మ్‌ అవకాశం చాలా తక్కువ. రైలు నిలిచిపోయే స్టేష‌న్‌కు ఒక‌టి రెండు స్టేష‌న్ల ముందు వ‌ర‌కు కూడా వీటిని ఇస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో మార్గమధ్యలో ఉన్న రెండు స్టేషన్‌లకు ఈ లిస్టును చూపిస్తారు.ఆర్ఎస్డబ్ల్యుఎల్ (RSWL): RSWL అంటే రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ అని అర్థం. ఇందులో కూడా సీటు కన్ఫర్మ్‌ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

Devotees From Flying Drones In Tirumala6
Tirumala: తిరుమలలో మరో అపచారం

తిరుమల,సాక్షి: తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్‌తో భక్తులు షూట్‌ చేశారు. భక్తుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్‌తో చిత్రీకరించిన మహారాష్ట్ర భక్తుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, పోలీసులకు అప్పగించారు.శ్రీవారి ఆలయంపై డ్రోన్‌ ఎగుర వేయడంపై విచారణ చేపట్టారు. విచారణలో మహారాష్ట్ర భక్తుడు సుమారు 15 నిమిషాల పాటు డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించినట్లు తేలుస్తోంది.

Tollywood Actress Abhinaya Wedding Celebrations Goes Viral IN Hyderabad7
టాలీవుడ్ నటి అభినయ పెళ్లి.. సంబురాల్లో ఇరు కుటుంబాలు

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటి అభినయ. శంభో శివ శంబో చిత్రంలో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కర్ణాటకకు చెందిన అభినయ తెలుగు, తమిళంలోనే ఎక్కువగా పాపులర్‌ అయింది. ఇటీవలే అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్‌)తో మార్చి 9, 2025న నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా బుధవారం వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది ముద్దుగుమ్మ.అభినయ-సన్నీ వర్మల పెళ్లి వేడుక ఈ నెల 16న అంటే బుధవారం గ్రాండ్‌గా జరగనుంది. ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి సంబురాల్లో మునిగిపోయారు. ఇటీవలే తన ఫ్రెండ్స్‌కు బ్యాచ్‌లరేట్ పార్టీ ఇచ్చిన అభినయ మరి కొన్నిగంటల్లోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్‌ హాల్‌లో వారిద్దరూ ఒక్కటిగా ఏడడుగులు వేయనున్నారు. తాజాగా తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభియన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. 'నేనింతే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభినయ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్‌, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official)

YSRCP Leader Perni Nani Slams TDP And Janasena Over Waqf Act8
‘కొత్త వక్ఫ్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధం’

తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్‌ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(‍మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రెస్‌ మీట్‌లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్‌సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో‌ హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్‌కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు.

Supreme Court Questions Allahabad High Court9
అత్యాచార కేసులో అభ్యంతరకర వ్యాఖ్యలు.. అలహాబాద్ హైకోర్టుపై ‘సుప్రీం’ ఆగ్రహం

ఢిల్లీ: పలు సంచలన తీర్పులకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోన్న అలహాబాద్‌ (ఉత్తర ప్రదేశ్‌)హైకోర్టుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా తీర్పులతో సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్‌ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.మార్చి 17వ తేదీన ఓ మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రాదని పేర్కొంటూనే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది.మైనర్‌ బాలిక కేసు విచారణపై తీర్పు ఇచ్చిన తర్వాత.. ఇదే తరహా మరో కేసులో.. మరో కీలక తీర్పును వెలువరించింది. అత్యాచార ఘటనలో యువతిది స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలపై మంగళవారం సుప్రీం కోర్టు స్పందించింది.అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. తీర్పులో భాగంగా బెయిల్ ఇవ్వొచ్చు. కానీ కోర్టు ఇలా వ్యాఖ్యానించవచ్చా?.అని ప్రశ్నించింది. తీర్పులు ఇచ్చే సమయంలో జడ్జీలు చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ కేసును పరిష్కరించేటప్పుడు మేము మరిన్ని కేసులను కూడా పరిశీలిస్తాం’ అని జస్టిస్ గవాయి అన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా మాట్లాడుతూ..‘న్యాయం చేయడమే కాదు, దాని గురించి అందరూ మాట్లాడకునేలా ఉండాలి’ అని అన్నారు. అలహాబాద్‌ కోర్టు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు సామాన్యుడి దృష్టిలో ఎలా అనిపించవచ్చు అన్న విషయాన్ని జడ్జీలకు గుర్తు చేయాలని ఆయన సూచించారు. తీర్పును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అసలేం జరిగిందంటే?గతేడాది ఢిల్లీలో పీజీ విద్యార్థినిపై ఆమె క్లాస్‌మెట్‌ అత్యాచారం చేసినట్లు ఓ యువతి కేసు పెట్టింది. మద్యం మత్తులో ఉన్న తనని నిందితుడు రెండు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అయితే, బాధితురాలిపై జరిగింది అత్యాచారం కాదని, పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసినట్లు నిందితుడి తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి జైలు శిక్షను విధించింది. నిందితుడు నాటి నుంచి జైల్లో జీవితం అనుభవిస్తున్నారు. ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!తాజాగా, ఈ కేసు నిందితుడు అలహాబాద్‌లో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.స్పందించిన సుప్రీం కోర్టు పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్‌ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించింది.

Good News From The India Meteorological Department For Farmers10
రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త

సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రూతుపవనాలు రానున్నాయని.. దేశమంతా విస్తారంగా వానలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని రీజన్లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 105 శాతం వర్ష శాతానికి ఛాన్స్‌‌‌ ఉందని ఐఎండీ పేర్కొంది.జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ సారి ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.కాగా, రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement