
సమన్వయం, జవాబుదారీతనం..
ముంచంగిపుట్టు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మండలంలో జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, జల్‌జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని, గిరిజన గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ గోపాలకృష్ణ, ఏఈ రాజేష్‌లకు సూచించారు. ముంచంగిపుట్టు మండలంలో పీఎం జన్‌మన్ గృహాలు 5,361 మంజూరు కాగా నేటికి 2 వేల గృహాల పనులు జరుగుతున్నాయని, సకాలంలో బిల్లులు అందించి, పనులు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ డీఈ రాజుబాబు, ఏఈ కృష్ణారావులకు తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ద్వారా సర్పంచులు, ఎంపీటీసీలకు తెలియకుండా పనులు జరుగుతున్నాయని, కచ్చితంగా ప్రజప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఏఈ రాములుకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్లను పూర్తి చేయాలని ఏఈ మురళీకృష్ణకు ఆదేశించారు. ఎంపీపీ అరిసెల సీతమ్మ, ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, ఈవోపీఆర్‌డీవో చిన్నాన్న, తదితరులు పాల్గొన్నారు.
అన్ని శాఖల సహకారంతో ప్రగతి పనులు
జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర దిశానిర్దేశం
ఇంజినీరింగ్ శాఖల అధికారులతో
సమీక్ష