
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల 9 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ –2 కాంపోజిట్ పేపర్ మినహాయించి అన్ని పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ –2 కాంపోజిట్ పేపర్ ఒక్కటే ఉదయం 9.30 గంటల నుంచి 11.15 గంటల వరకు ఉంటుంది.
ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ బుధవారం షెడ్యూళ్లను ప్రకటించారు. అలాగే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్–4 పరీక్షలను కూడా ఇవే తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి విద్యార్థులు సాధించిన మార్కులను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్‌లో నిర్ణీత గడువులోగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.