
మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 1,502 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో 63,717 కరోనా పరీక్షలు చేశారు. 24 గంటల్లో 1,525 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు 2,68,73,491. కాగా కొత్తగా 16 మంది కరోనా వైరస్‌తో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 19,90,916 ఉండగా, ప్రస్తుతం 14,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి.