
సాక్షి, అమరావతి: కరోనా పరీక్షలు మూడు కోట్ల మైలు రాయిని దాటాయి. గడిచిన 24 గంటల్లో చేసిన 21,360 పరీక్షలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,00,04,569 నమూనాలను పరీక్షించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం ట్రేస్, టెస్ట్, ట్రీట్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కరోనా పాజిటివ్ కేసు నమోదైన వెంటనే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసి ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంటోంది.
117 మందికి పాజిటివ్
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,095కి చేరింది. ఒక్క రోజులో 241 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,52,718కి చేరింది. తాజాగా ఒకరు మృతితో మొత్తం మరణాలు 14,416కి చేరాయి. ఇంకా యాక్టివ్ కేసులు 2,961 ఉన్నాయి.