
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా.. జవహర్ రెడ్డికి లేఖ రాశారు.
అయితే, చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు వెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టీడీపీ నేతలు వివాదస్పదంగా వ్యవహరించారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రామానుజరావు ఫిర్యాదు రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: ‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు