
రెండు కోతులు పోట్లాడుకుంటే.. పాపం అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ప్రాణం పోయింది
క్రైమ్: నంద్యాల జిల్లా వెలుగోడులో విషాదం చోటు చేసుకుంది. కోతుల పోట్లాటలో ఓ వ్యక్తి బలయ్యాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై రెండు కోతులు పోట్లాడుకోగా.. ఒక కోతి మరో కోతిపైకి ఇటుకను విసిరింది. అది కిందపడి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడ్ని రఫీగా గుర్తించారు పోలీసులు.
కూరగాయల కోసం ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో రఫీపై కోతి విసిరిన ఇటుక పడింది. రఫీకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.