
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ప్రైవేట్ కాలేజ్ బస్సులు దగ్ధం చేశారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు దగ్ధం
అమలాపురంలో విధ్వంసం కొనసాగుతోంది. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ముమ‍్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని ఆందోళనకారులు దగ్ధం చేశారు.
చదవండి: (MLC Ananta Babu Case: చట్టం ముందు ఎవరైనా ఒక్కటే: సజ్జల)