సెలవులకు వచ్చాడు.. శవమై మిగిలాడు.. | - | Sakshi
Sakshi News home page

సెలవులకు వచ్చాడు.. శవమై మిగిలాడు..

Published Wed, Jul 19 2023 12:14 AM | Last Updated on Wed, Jul 19 2023 9:00 AM

- - Sakshi

భద్రాద్రి: రెండు రోజులు సెలవు రావడంతో ఇంటికి వచ్చిన పదో తరగతి విద్యార్థి పాముకాటులో మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని తడికలపూడి పంచాయతీ పాతతడికలపూడి గ్రామానికి చెందిన కల్తీ కోటయ్య, ముత్తమ్మ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సందీప్‌ దమ్మపేట గురుకులంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు భరత్‌ (15) పాల్వంచ గురుకులంలో పదో తరగతి చదువుతున్నాడు.

ఆది, సోమ రెండు రోజులు సెలవులు రావడంతో భరత్‌ శనివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి గుడిసెలో కుటుంబ సభ్యులు ముగ్గురూ నేలపై పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున తల్లిదండ్రులు నిద్ర లేచేసరికి ఇంటి గడప వద్ద కట్ల పాము కనిపించగా స్థానికుల సాయంతో చంపారు. సుమారు 7 గంట ల సమయంలో భరత్‌ని నిద్ర లేపేందుకు యత్నించగా నోట్లో నురుగు వస్తుండటంతో పరిశీలించగా చెవి దగ్గర గాట్లు కనిపించాయి.

ఉదయం వారు చంపిన కట్ల పాము కరిచినట్లుగా భావించి సులానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ భరత్‌ మృతి చెందాడు. భరత్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement