Bhadradri District News
-
వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
దమ్మపేట: అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి వచ్చే వేధింపులు తాళలేక, పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన మడిపల్లి శ్రీనివాసరావు(48) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం మందలపల్లి, రంగువారిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. కాగా అప్పు తిరిగి చెల్లించాలని అప్పిచ్చిన వ్యక్తులు వేఽధింపులకు గురిచేశారు. దీంతో శ్రీనివాసరావు మనోవేదన చెంది బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
మూడు రోజుల వ్యవధిలో దంపతులు మృతి
తిరుమలాయపాలెం: మూడు రోజుల కిందట గుండెపోటుతో భర్త మృతి చెందడాన్ని తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుతోనే మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలోని ఏలువారిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దిండు ఉపేందర్ గత సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆవేదనతో ఉన్న ఆయన భార్య పద్మ (50)ను తిరుమలాయపాలెంకు చెందిన అన్న తురక వెంకన్న తమ ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఉపేందర్ చిన్న కర్మ చేయాల్సి ఉండడంతో బుధవారం ఏలువారిగూడెం వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబంలోనే కాక గ్రామంలో విషాదాన్ని నింపింది. -
ప్రజాహక్కుల రక్షణ కమ్యూనిస్టుల బాధ్యత
● సీపీఎం 24వ మహాసభల తీర్మానాల ఆధారంగా పోరాటాలు ● యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు ఖమ్మంమయూరిసెంటర్: ప్రజాహక్కుల పరిరక్షణను కమ్యూనిస్టులు బాధ్యతగా భావిస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ.రాఘవులు తెలిపారు. ఇందులో భాగంగానే ఇటీవల మధురైలో జరిగిన పార్టీ 24వ ఆలిండియా మహాసభల్లో ఆహారం, ఇల్లు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, పింఛన్లు దేశంలోని పౌరులందరి హక్కులుగా చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈ తీర్మానాల అమలుకు ఉద్యమాలు నిర్వహించాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మధురైలో సభలకు హాజరై గుండెపోటుతో మృతి చెందిన ఖమ్మంకు చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభ ఖమ్మంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తే కార్మికులు సంక్షేమ ఫలాలు కోల్పోనున్నందున వచ్చేనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు. అలాగే, నూతన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని చెప్పారు. కాగా, హక్కుల సాధనకు ఉద్యమిస్తూ, ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడమే శ్రీకాంత్‌కు నిజమైన నివాళి అని తెలిపారు. కష్టాలొస్తే గుర్తొచ్చేది కమ్యూనిస్టులే.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టులు అండగా నిలుస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. మంత్రి పదవి ఇవ్వకపోతే సంగతి చూస్తామని సీఎంను హెచ్చరించడం.. అలాంటి వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చెబుతున్నారంటే పార్టీ శ్రేణులు గీత దాటే పరిస్థితులు వచ్చినట్టేనని చెప్పారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం పోరాడాల్సిన దశలో ప్రజా మన్ననలు పొందిన శ్రీకాంత్ దూరం కావడం నష్టదాయకమని తెలిపారు. ఈ సభలో సీపీఎం ఏపీ, తెలంగాణ, ఉమ్మడి జిల్లా నాయకులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, సీహెచ్.బాబూరావు, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, బుగ్గవీటి సరళ, వై.విక్రమ్, యర్రా శ్రీకాంత్ సతీమణి సుకన్య, కుటుంబీకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు దండి సురేష్, యర్రా బాబు, రామాంజనేయులు, పునుకొల్లు నీరజ, డాక్టర్ యలమందలి రవీంద్రనాథ్, గుర్రం ఉమామహేశ్వరరావు, మెంతుల శ్రీశైలం, చిన్ని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై నిఘా
కొత్తగూడెంటౌన్: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత నేరస్తులపైనా దృష్టి సారించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వారిపై చర్య తీసుకోవాలని అఽధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా పని చేయాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరస్తులకు శిక్షపడేలా పని చేయాలన్నారు. పెట్రోల్ బ్లూకోల్డ్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100 కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అన్నారు. జిల్లా ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం గత నెలలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, సతీష్‌కుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్‌రాజు వెల్లడి -
మందు.. ‘ఫుల్’ ఆదాయం
● 2023–24తో పోలిస్తే 24–25లో పెరిగిన అమ్మకాలు ● 2024 మే నెలలో రూ.237 కోట్ల మద్యం అమ్మకాలతో రికార్డు ● మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో రూ.2,294 కోట్ల సేల్స్ వైరా: మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతుండగా.. ప్రభుత్వానికి అంతే మొత్తంలో ఆదాయమూ పెరుగుతోంది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో వైరాలోని ఐఎంఎల్ డిపో ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైన్స్, బార్లకు రూ.2,294 కోట్ల విలువైన మద్యం సరఫరా కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో 210 వైన్స్, మూడు క్లబ్‌లు, 50 బార్లు ఉన్నాయి. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,281 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2024–25కు వచ్చేసరికి అమ్మకాలు మరింత పెరిగాయి. సహజంగా ఏటా వేసవిలో బీర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇందులో భాగంగానే గత ఏడాది మే నెలలో రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ నెలలో శుభకార్యాలు ఉండటం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఏపీలో ఎన్నికల నేపథ్యాన ఇక్కడి నుంచి మద్యం సరఫరా అయిందని తెలుస్తోంది. ఇక గత ఏడాది సెప్టెంబర్ 30న ఒకేరోజు 45 వేల కేసుల మద్యం, 16,500 కేసుల బీర్లు అమ్ముడవడం.. వీటి విలువ రూ.33 కోట్లు ఉండడం విశేషం. పెరిగిన బీర్ల ధరలు.. తగ్గిన డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచడంతో వేసవిలో బీర్ల అమ్మకం ఎలా ఉంటుందోనని మద్యం షాపుల యజమానుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్లకు అంతగా డిమాండ్ లేనట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో స్ట్రాంగ్ బీర్ ధర రూ.160 ఉండగా ఇ ప్పుడు రూ.190కి, లైట్ బీరు రూ.150 నుంచి రూ.180 కి చేరింది. గతంలో రోజుకు 8 వేల నుంచి 10 వేల కేసులు అమ్ముడయ్యే బీర్లు 7 వేల కేసులు దాటడం లేదని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి పెరిగిన బీర్ల ధరలు అమల్లోకి రాగా ఈ నెల 11వ తేదీ వరకు రూ.60 కోట్ల విలువైన 2,92,000 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అయితే, బీర్లకు డిమాండ్ తగ్గినా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం గణనీయంగా నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు నెల విక్రయాలు (రూ.కోట్లలో) 2024 ఏప్రిల్ 181 మే 237 జూన్ 210 జూలై 180 ఆగస్టు 196 సెప్టెంబర్ 184 అక్టోబర్ 152 నవంబర్ 134 డిసెంబర్ 225 2025 జనవరి 201 ఫిబ్రవరి 181 మార్చి 201 మొత్తం రూ.2,294 -
మూడేళ్లు కష్టపడితే భవిష్యత్ మీదే..
● విద్యార్థులకు కలెక్టర్ సూచన ● లక్ష్మీదేవిపల్లి డిగ్రీ కళాశాలలో మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల పాల్వంచరూరల్ : డిగ్రీ విద్యార్థులు మూడేళ్లు కష్టపడి చదివితే ఆ తర్వాత భవిష్యత్ బాగుంటుందని, జీవితాంతం సుఖపడే అవకాశం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. చదువును నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవని చెప్పారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ అటాన్‌మస్ కళాశాలలో బుధవారం ఆయన ప్రథమ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉంటారని, తద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. అంతేకాక విశాలమైన తరగతి గదులు, క్రీడామైదానంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పైనా ఆసక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఆటలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతాయన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.పద్మ మాట్లాడుతూ.. కళాశాల అటానమస్ హోదా పొందిన తర్వాత తొలిసారిగా పరీక్షలు నిర్వహించి సకాలంలో మూల్యాంకనం చేసి కలెక్టర్ చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ పాటిల్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ ఫ్రొఫెసర్ వై.చిన్నప్పయ్య, అటాన్‌మస్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వేముల కామేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాధవి, అధ్యాపకులు డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ కొండలరావు, విజయప్రసాద్, శెట్టి స్వరూపరాణి, పి.శ్రీనివాసరావు, శ్రీదేవి, లీల, దీపిక, విమల, కావ్య, కరీమాపర్వీన్, హారిక, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి గనుల పరిసర ప్రాంతాలు, సంస్థ కార్మికులు, వారి పిల్లలు, ప్రభావిత ప్రాంత నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే మందమర్రి, రామగుండం ఏరియాల్లో సంస్థ ఆధ్వర్యాన శిక్షణ కేంద్రాలు కొనసాగుతుండగా, భూపాలపల్లిలోనూ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ రీజినల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావును సింగరేణి జీఎం(కార్పొరేట్ హెచ్ఆర్డీ) జి.రఘుపతి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో డీజీఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మూగజీవాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ గుండాల: అడవుల్లో మూగజీవాలకు నీటి సదుపాయం కల్పించడంతో పాటు వాటి రక్షణ కోసం సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని గణపురం, పాలగూడెం ప్లాంటేషన్లను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీరందించాలని, ప్లాంటేషన్ చుట్టూ ట్రెంచ్‌లు ఉండాలని అన్నారు. అడవుల్లో జంతువులకు ఏర్పాటు చేసిన తొట్లలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండాలన్నారు. వేటగాళ్ల ఉచ్చులకు జంతువులు బలికాకుండా నిఘా పటిష్టం చేయాలని, వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో అడవులకు నిప్పు పెట్టకుండా జాగత్ర చర్యలు తీసుకోవాలని, ప్రమాదవశాత్తు కాలిపోతున్న ప్రదేశాలను వెంటనే ఆర్పివేయాలని ఆదేశించారు. అడవులు, అటవీ జంతువుల రక్షణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమ కలప రవాణాపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఇల్లెందు ఎఫ్డీఓ కోటేశ్వరరావు, గుండాల రేంజర్ నర్సింహారావు, డీఆర్ఓ బాలాజీ, సిబ్బంది కోటేశ్వరావు, రవి, వెంకన్న తదితరులు ఉన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
పాల్వంచ: తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట బుధవారం పోలీసులను ఆశ్రయించింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ యువతి అదృశ్యంపై ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు యువతి, పునుకుల గ్రామానికి చెందిన యువకుడు కలిసి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తాము ప్రేమించుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మట్టి తరలింపుపై ఫిర్యాదు చుంచుపల్లి: మండల పరిధిలోని బృందావనం వద్ద ప్రభుత్వ అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకుని ఇతర అవసరాలకు మట్టిని తరలిస్తున్నారని బుధవారం స్థానికులు చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణకు ఫిర్యాధు చేశారు. దీనిపై సిబ్బందితో విచారణ చేపట్టి నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. పదో తరగతి విద్యార్థిని అదృశ్యం పాల్వంచరూరల్: ఐదు రోజుల క్రితం ఇంట్లో నుంచి రాత్రి సమయంలో బయటకు వెళ్లిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామపంచాయతీలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. ఈ నెల 11వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. విద్యార్థిని తండ్రి బుధవారం ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు భద్రాచలంఅర్బన్: పట్టణంలోని శిల్పినగర్ కాలనీలో నెలకొన్న ఫ్లెక్సీ వివాదంలో బుధవారం ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శిల్పినగర్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫెక్సీని చింపి వేసిన వేసిన ఘటనకు సంబంధించి ఇరువర్గాల వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో మాటామాట పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సుభాష్‌నగర్ కాలనీకి చెందిన రాహుల్తేజ్ అనే వ్యక్తి శిల్పినగర్‌కు చెందిన రఘుతోపాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు చేశాడు. రాహుల్తేజ్పై కూడా రఘు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యంటేకులపల్లి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. టేకులపల్లి పంచాయతీ రేగులతండా గ్రామానికి చెందిన ధరావత్ కవితకు మధిరకు చెందిన యువకుడితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9, 7 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సుమారు మూడు నెలల క్రితం కవిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. పలుచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె తల్లి బాణోతు భామిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో మహిళ మృతిఅశ్వారావుపేటరూరల్: కాలినడకన వెళ్తున్న ఓ మహిళ అకస్మాత్తుగా కిందపడి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన ఎస్కే జరీనా(55) కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేటలోని డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉండే తన మరిది ఖలీల్ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం తోటి కోడలితో కలిసి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై కుప్పకూలి పడిపోయింది. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి గుండెపోటుకు గురై మృతి చెందిందని తెలిపారు. -
అన్నదాతకు ‘అకాల’ దెబ్బ
● జిల్లాలో ఇటీవల రోజూ కురుస్తున్న వర్షం ● కల్లాల్లోనే తడుస్తున్న ధాన్యం ● వరికోతలకూ ఆటంకం బూర్గంపాడు: అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ముమర్మంగా వరికోతలు, ధాన్యం అమ్మకాల సమయంలో కురుస్తున్న వానలు కలవరపరుస్తున్నాయి. గాలి దుమారంతో కోతకు వచ్చిన వరి నేలకొరుగుతోంది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. గత పది రోజులుగా జిల్లాలో ఏదో ఓ ప్రాంతంలో గాలిదుమారంతో కూడిన వర్షాలు పడుతుండగా పంటలు పాడవుతున్నాయి. మంగళవారం రాత్రి పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు తీశారు. బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వారావుపేట, ఇల్లెందు, అశ్వాపురం, గుండాల మండలాల్లో భారీ గాలులతో కూడిన వర్షం కురవగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలు చేసి టార్పాలిన్లు, పరదాలు కప్పుతూ కొంతమేర కాపాడుకునే ప్రయత్నం చేశారు. నత్తనడకన కొనుగోళ్లు.. జిల్లాలో పలువురు రైతులు ఇప్పటికే ధాన్యం కోసినా తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేయడం, ఉదయం ఆరబెట్టడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. బూర్గంపాడు మండలంలో పలుచోట్ల రాశుల కిందకు వర్షపు నీరు చేరి ధాన్యం తడిసింది. దీన్ని తిరిగి ఆరబెట్టుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మరో రెండురోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు, వ్యాపారులు.. అకాల వర్షాలతో వరి పొలాలు బురదమయంగా మారాయి. దీంతో పంట కోసేందుకు రైతులు ట్రాక్బెల్ట్తో నడిచే హార్వెస్టర్ల కోసం పోటీ పడుతున్నారు. గంటకు రూ. 3,500 చొప్పున చెల్లించి వరి కోతలు చేపడుతున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టడం కూడా కష్టం అవుతుండడంతో ప్రభుత్వ మద్దతు ధర కోసం వేచిచూడకుండా తక్కువ ధరలకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన సన్నరకం ధాన్యానికి కూడా ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించినా.. రైతులు అవేవీ పట్టించుకోకుండా ఏదో ఒక ధరకు అమ్ముకోవాలని చూస్తుండగా.. ఇదే అదనుగా వ్యాపారులు, మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. -
గిన్నిస్ బుక్‌లో సంపత్‌నగర్‌వాసికి చోటు
టేకులపల్లి: మండలంలోని సంపత్ నగర్ గ్రామానికి చెందిన కుడితేటి రమేష్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన హోలెల్ మ్యూజిక్ స్కూల్ ప్రోత్సాహంతో క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో అతను పాల్గొన్నాడు. ఏకకాలంలో 1,090 మంది సంగీత కళాకారులు కీ బోర్డు ప్లే చేశారు. వారిలో 1,046 మంది సుమారు నిమిషం నిడివి కలిగిన వీడియో క్లిప్‌లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ కూడా ప్రతిభ చూపి రికార్డు సాధించాడు. నిర్వాహకులు మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. 10 మంది స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీఖమ్మంసహకారనగర్: గత ప్రభుత్వ హయాంలో 317 జీఓ ద్వారా ఉపాధ్యాయ దంపతుల్లో ఒక్కొక్కరు ఒక్కో జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో వీరికి స్పౌజ్ కేటగిరీ ద్వారా బదిలీకి అవకాశం కల్పించగా రాష్ట్రంలో 165మంది ఉపాధ్యాయులను వారి భాగస్వామి పనిచేస్తున్న జిల్లాలకు కేటాయించారు. ఇందులో పది మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానుండగా, అంతే సంఖ్య ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లనున్నారు. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేయడంపై టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆయా ఉపాధ్యాయులు ఈనెల 22న ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ అయి.. 23న కొత్త జిల్లాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ కమిషన్ సభ్యుడిని కలిసిన నాయకులు సింగరేణి(కొత్తగూడెం): జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్‌ను ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్లో బుధవారం సింగరేణి కాలరీస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సమస్యలపై త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. విజిలెన్స్ అఽధికారుల వేధింపులు, ప్రమోషన్లు పెండింగ్‌లో పెట్టడం వంటివి సరికాదని అన్నారు. అసోషియేషన్ నాయకులు ఆంతోటి నాగేశ్వరరావు, ఆరెపల్లి రాజేందర్, బందెల విజేందర్, మొగిలిపాక రవికుమార్, చెరిపెల్లి నాగరాజు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీఅశ్వాపురం: మండల కేంద్రంలో బస్సు, లారీ స్వల్పంగా ఢీకొన్న ఘటన బుధవారం జరిగింది. మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు వైపు వెళ్తున్న లారీ అశ్వాపురంలో స్టేట్ బ్యాంక్ ఎదుట బస్సును ఢీకొని, సైడ్ రాసుకుంటూ దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో సుమారు అరగంట సేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వచ్చి పునరుద్ధరించారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతిచర్ల: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందిన ఘటన దానవాయిపేటలో బుధవారం రాత్రి జరిగింది. మండలంలోని బోటిగూడేనికి చెందిన తాటి మహేష్(29) దానవాయిపేట వైపు నుంచి ఆర్.కొత్తగూడెం వైపు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్.కొత్తగూడెం వైపు నుంచి దానవాయిపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రుడిని స్థానికులు సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి 108 అంబులెన్సులో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీపీఓల విధులపై 19న సెమినార్ ఖమ్మంసహకారనగర్: గ్రామ పాలన ఆఫీసర్ల (జీపీఓ) ‘విధులు – బాధ్యతలు’అంశంపై ఈ నెల 19న ఖమ్మంలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేందర్‌రావు తెలిపారు. భూభారతి చట్టంలోని అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జీపీఓలుగా వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చిన ఉమ్మడి జిల్లాలోని వీఆర్వోలు, వీఆర్ఏలు హాజరుకావాలని సూచించారు. -
సీతారామలో ఏదీ?
‘రాజీవ్’ స్ఫూర్తి..ప్రారంభం కాని డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు ● నెలల తరబడి కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ● గతంలో శరవేగంగా పూర్తయిన రాజీవ్ లింక్ కెనాల్ ● ప్రాజెక్టు ఫలాలు ‘భద్రాద్రి’కీ అందించాలంటున్న రైతులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు ఎక్కువ మంది భద్రాద్రి జిల్లాలో ఉంటే.. గరిష్ట ప్రయోజనాలు మాత్రం ఖమ్మం జిల్లాకే దక్కుతున్నాయనే విమర్శలున్నాయి. దీనికి తోడు ఈ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. పూర్తి కాని టెండర్ల ప్రక్రియ.. జిల్లా పరిధిలో నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల కోసం గతేడాది అక్టోబర్‌లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమై వేగంగా సాగుతోంది. మరోవైపు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనులకు గతేడాది అక్టోబర్‌లోనే టెండర్లు పిలిచారు. అప్పటి నుంచి వివిధ కారణాలతో టెండర్ల గడువు పొడిగిస్తూ 2025 జనవరి వరకు లాగారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు చేపట్టే కంపెనీల ఎంపిక ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకు అగ్రిమెంట్లు జరగలేదు. దీంతో నిర్మాణ పనులు ఇంకా మొదలే కాలేదు. ఫలితంగా పనులకు అనువుగా ఉండే వేసవి సమయం వృథా అవుతుండగా.. అంచనా వ్యయం కూడా పెరుగుతోంది. 2024 జూలైలో ఇరిగేషన్ అధికారులు సమర్పించిన రిపోర్టులో జిల్లా పరిధిలోని నాలుగు ప్యాకేజీల నిర్మాణ అంచనా వ్యయం రూ.1,656 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ. 1,773 కోట్లకు చేరుకుంది. ‘రాజీవ్’ ఆదర్శంగా.. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. గోదావరి జలాలను తక్షణమే ఖమ్మం జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేందుకు రాజీవ్ లింక్ కెనాల్‌కు శ్రీకారం చుట్టడంతో పాటు సుమారు రూ.100 కోట్లు మంజూరు చేసింది. అధికారులు యుద్ధప్రాతిపదికన భూ సేకరణ చేపట్టారు. అటవీ శాఖ అనుమతులు సాధించారు. కాలువ నిర్మాణానికి అడ్డంకులు ఎదురైనప్పుడు జాతీయ రహదారుల సంస్థ, గ్యాస్ సరఫరా కంపెనీలతో చర్చలు జరిపారు. ప్రత్యేక అనుమతులపై విదేశాల నుంచి ఇంజనీర్లను రప్పించి పంప్‌హౌస్‌ల్లో మోటార్లను సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహించారు. వెరసి రికార్డు సమయంలో రాజీవ్ కెనాల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అదే స్ఫూర్తితో భద్రాద్రి జిల్లాలో నిర్మించాల్సిన 1, 2, 7, 8 డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు కూడా చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అప్పుడే ప్రాజెక్టు నిర్వాసిత జిల్లాగా పేరున్న ‘భద్రాద్రి’కి కొంతైనా న్యాయం జరుగుతుందని అంటున్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తాం సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించి మొత్తం ఎనిమిది ప్యాకేజీల పనులు చేపడుతున్నాం. ఇందులో జిల్లాకు సంబంధించిన నాలుగు ప్యాకేజీల టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో అగ్రిమెంట్లు చేసి పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. – రవికుమార్, నీటి పారుదలశాఖ డిప్యూటీ సీఈడిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప్యాకేజీ వివరాలిలా.. ప్యాకేజీ కొత్త ఆయకట్టు నిర్మాణ వ్యయం లబ్ధిపొందే (ఎకరాల్లో) (రూ. కోట్లలో) నియోజకవర్గాలు 1 41,813 రూ. 523 పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట 2 36,231 రూ. 262 కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట 7 63,310 రూ. 521 అశ్వారావుపేట 8 38,598 రూ. 467 అశ్వారావుపేట, సత్తుపల్లి రైతులకు పైసా ప్రయోజనం లేదు.. సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాలువ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయి రెండేళ్లు దాటినా ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు ప్రారంభించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు నయా పైసా ప్రయోజనం కలగలేదు. ఎట్టకేలకు 2024 ఆగస్టులో ఈ ప్రాజెక్టులోని మూడు పంపుహౌస్‌లను ప్రారంభించిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో 1,49,952 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి తెచ్చేలా 1, 2, 7, 8 ప్యాకేజీల కింద డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత అయినా జిల్లా పొలాల్లోకి గోదావరి జలాలు ప్రవహించే రోజులు దగ్గర్లోకి వచ్చాయనే నమ్మకం కలిగింది. -
హరినాధుడికి పొంచి ఉన్న ముప్పు
● గతంలోనే దెబ్బతిన్న కల్యాణ మండపం ● మాడ వీధుల విస్తరణతో మరింత ప్రమాదం ● అభివృద్ధి ప్లాన్‌లో చేర్చితే ఆలయానికి ఆదరణ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి కూత వేటు దూరంలో ఉన్న కుసుమ హరినాధ ఆలయానికి ముప్పు పొంచి ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ గుడి రామాలయానికి ఉత్తర దిక్కులోని గుట్టపై ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 100 ఏళ్ల క్రితమే నిర్మించినట్లుగా చెబుతుండగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. దీంతో ఈ ఆలయ అభివృద్ధిని సైతం రామాలయ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చాలని, తద్వారా భక్తుల, పర్యాటకుల రాక పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మాడ వీధులు విస్తరిస్తే.. రామాలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణకు ఇటీవల ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు నిర్వాసితులకు రూ.34 కోట్ల నష్ట పరిహారం కూడా అందజేసింది. ఇక వారి నుంచి భూమి తీసుకోవడమే మిగిలి ఉంది. మాడ వీధుల విస్తరణకు సేకరించే భూమి వెనుక భాగంలో ఉన్న గుట్టపైనే ఈ కుసుమ హరినాధ ఆలయం ఉంది. గతంలోనే ఈ గుట్టను ఆక్రమించి కొంతమేర నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పుడా స్థలాల్లో అభివృద్ధి పనులు చేస్తే గుట్ట కింది భాగం కొద్దిమేర దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి తోడు శతాబ్దం క్రితం నిర్మించిన ఆలయం కావడంతో ప్రాభవం లేక పురాతనంగా మారింది. గుట్టపై భాగంలో ఆలయం వద్ద ఉన్న కల్యాణ మండపం సైతం ఇటీవల కుంగి కొంత పడిపోయింది. గతంలో రథసప్తమి రోజున ఈ మండపంలోనే కుసుమ హరినాధుల కల్యాణం నిర్వహించేవారు. అది పూర్తిగా శిథిలం కావడంతో ప్రస్తుతం ఆలయంలోనే జరిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆలయం చెంతన అభివృద్ధి పనులు చేపడితే మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయాభివృద్ధిపై దృష్టి పెట్టాలి.. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కుసుమ హరినాధ ఆలయాన్ని ప్రమాదం నుంచి తప్పించడంతో పాటు భక్తుల రాక పెంచేలా రామాలయ అభివృద్ధి ప్రణాళికలో దీన్ని కూడా భాగం చేయాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా రామాలయానికి అనుబంధంగా ఉన్న శివాలయానికి వచ్చే భక్తులు ఈ దేవస్థానాన్ని కూడా దర్శించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక రంగనాయకుల గుట్టపై ఉన్న కాటేజీలు, రామదాసు జ్ఞాన మందిరం, రంగనాధ స్వామి ఆలయానికి వెళ్లేందుకు ఇటువైపు నుంచి మార్గం దగ్గరవుతుంది. రామాలయానికి వచ్చే భక్తులు ప్రస్తుతం అక్కడికే పరిమితమవుతున్నారు. ప్లాన్‌లో చేర్చి దీన్ని కూడా అభివృద్ధి చేస్తే శివాలయం, కుసుమ హరినాధాలయం, రంగనాయకుల ఆలయాలు సైతం భక్తులకు చేరువవుతాయి. ఇక పడమర దిక్కున ఉన్న నరసింహస్వామి వారి ఆలయానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన గత మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చారు. దీన్ని తీగల వంతెనగా మార్చి నరసింహాలయం, అటు నుంచి గోదావరి వరకు నిర్మిస్తే నేరుగా ఉపాలయానికి, అక్కడి నుంచి గోదావరి కరకట్ట వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. తద్వారా భద్రాచలానికి కొత్త సొబగులు చేకూరే అవకాశం ఉంటుంది. ప్రతిపాదనలు పంపాం ఇటీవల పడిపోయిన కల్యాణ మండపం, శిథిలావస్థకు చేరుకున్న ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రమాద పరిస్థితుల నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని నివేదికలో కోరాం. – సుదర్శన్, ఈఓ, కుసుమ హరినాధాలయం -
పోషకాహారంతోనే ఆరోగ్యం
● ఈ నెల 22 వరకు పోషణ్ అభియాన్ పక్షోత్సవాలు ● ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన ● జిల్లాలోని 2,060 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహణ భద్రాచలంఅర్బన్: మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యం పెంపొందించేందుకు ఈ నెల 8వ తేదీ నుంచి పోషణ్ అభియాన్ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోషకాహారం ఆవశ్యకతను వివరించేలా జిల్లావ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పూర్తి స్థాయిలో పోషకాహారమందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలపై ప్రదర్శనలు చేపట్టామని, తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి ఎన్ఆర్సీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పండ్లు, కూరగాయలు, వ్యాయామం వల్ల జరిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. పక్షోత్సవాల్లో అంగన్వాడీ సిబ్బందితో పాటు వైద్యారోగ్య, ఆర్డ్‌బ్ల్యూఎస్, గ్రామపంచాయతీ, వ్యవసాయ శాఖల అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నారు. ఆరోగ్యం పరిశీలన, సూచనలు పోషణ పక్షోత్సవాల్లో గర్భిణులు, చిన్నారుల బరువు, ఆరోగ్యాలను పరిశీలిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యత, పోషకాహారం ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటిపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్‌ను పరిశీలిస్తున్నారు. గర్భిణుల సంరక్షణలో భర్తల పాత్రపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2060 అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాదిలోపు చిన్నారులు 49,627 మంది, ఆరేళ్ల లోపు చిన్నారులు 13,012 మంది, గర్భిణులు 6,337 మంది, బాలింతలు 6,336 మంది ఉన్నారు. కాగా పోషకాహారం లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నాం. సీమంతం, అన్నప్రాసన, అక్షరభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీని ద్వారా గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించవచ్చు. రక్తహీనత వంటి సమస్యలు రాకుండా చూడొచ్చు. –స్వర్ణలత లెనినా, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
కొర్రమేను పెంపకంతో సిరులు
● చేపల పెంపకంలో రాష్ట్రానికే ఆదర్శం కావాలి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపు సూపర్‌బజార్(కొత్తగూడెం): సిరులు పండించే కొర్రమేను చేపల పెంపకంతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కొర్రమేను చేపల పెంపకంపై జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులు, వ్యవసాయ శాఖ ఏపీఎంలకు కొత్తగూడెం క్లబ్లో మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయం అన్ని సమయాల్లో కలిసిరాక పోవచ్చని, ప్రకృతి సహకరిస్తేనే అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. అందుకే ఒకసారి పెట్టుబడితో నిరంతరం ఆదాయం వచ్చే చేపల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కొర్రమేను చేప ఎలాంటి వాతావరణానికై నా తట్టుకుంటుందని అన్నారు. వీటి పెంపకానికి ఎక్కువ భూమి కూడా అవసరం లేదని, పావుగుంట స్థలంలో నీటి ట్యాంక్, మరో పావుగుంటలో ఫామ్‌పాండ్ నిర్మిస్తే చాలని, దాణాతో కలిపి మొత్తం సుమారు రూ 3.50 లక్షలతో తయారు చేసుకోవచ్చని వివరించారు. ఒక్కో చేపపిల్ల ఖరీదు రూ.15 ఉంటుందని, 1000 పిల్లలు పెంచితే అందులో 900 చేతికొచ్చినా కిలో రూ.300 చొప్పున ఏడు నెలల్లో రూ.2.70 లక్షలు చేతికొస్తాయని చెప్పారు. ఈ యూనిట్ స్థాపనకు పీఎంఈజీపీ పథకం ద్వారా 35 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. ఉపాధి పథకం ద్వారా ఫామ్‌పాండ్ ఉచితంగా నిర్మించుకోవచ్చని అన్నారు. జిల్లాలోని రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు అధిక సంఖ్యలో కొర్రమేను చేపల పెంపకం చేపట్టాలని సూచించారు. చేపలకు రోజుకు ఐదుసార్లు దాణా వేయాలని, పిల్లలను నాలుగు నెలలు ట్యాంకర్లో పెంచిన తర్వాత వాటిని నీటి కుంటలో వేస్తే పెద్ద పరిణామంలో ఎదుగుతాయని అన్నారు. రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు కొర్రమేను చేపల పెంపకం చేపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్వా కనెక్ట్స్ సంస్థ వారు చేపల పెంపకం, మార్కెటింగ్ తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, వ్యవసాయాధికారి బాబూరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ తిరుపతయ్య, మత్స్య శాఖ ఏడీ ఇంతియాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రెంచ్ పనుల అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లాపురంలో ఆదివాసీలు, అటవీ శాఖ అధికారుల మధ్య మంగళవారం పోడు వివాదం చోటుచేసుకుంది. అధికారులు సోమవారం ట్రెంచ్ కొట్టే పనులు చేపట్టారు. ఆ పనులు కొనసాగించేందుకు మళ్లీ మంగళవారం వెళ్తుండగా గ్రామ పొలిమేరలోనే ఆదివాసీలు అడ్డుకున్నారు. తమకు పట్టాలున్న భూముల్లో ట్రెంచ్ పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. అయితే తాము సాగు భూముల జోలికి వెళ్లడం లేదని, అడవికి సరిహద్దుగా మాత్రమే ట్రెంచ్ పనులు చేపట్టామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూముల వద్దకు వెళ్లనిచ్చేది లేదని భీష్మించడంతో అటవీ శాఖ అధికారులు వెనుదిరిగారు. అడవికి సరిహద్దుగా ట్రెంచ్ పనులు చేసుకోవాల్సిన అధికారులు.. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్న భూముల్లోనూ పనులు చేపట్టారని ఆదివాసీలు ఆరోపించారు. కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకునేందుకు ఒక రైతు చెట్ల కొమ్మలను నరికితే దీన్ని సాకుగా తీసుకుని పట్టా భూముల్లో ట్రెంచ్ పనులు చేపట్టడం అన్యాయమని అన్నారు. ఈ విషయమై కొమరారం ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ చలపతిరావును వివరణ కోరగా.. పట్టా భూమి పక్కనే ఉన్న అడవిని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసినట్లుగా గుర్తించామని, అడవికి, పట్టా భూములకు సరిహద్దును నిర్ధారించేందుకే ట్రెంచ్ పనులు చేపట్టామని చెప్పారు. తమ ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు.ఎల్లాపురంలో పోడు వివాదం -
రజతోత్సవ సభకు కదం తొక్కాలి
ఇల్లెందు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం యావత్ దేశమే కాదు ప్రపంచంలోని తెలుగు వారంతా ఎదురుచూస్తున్నారని.. ఈ సభకు గులాబీ సైన్యం కదం తొక్కి విజయవంతం చేయాలని ఎంపీ వద్ది రాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఇల్లెందులో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన డొల్ల అని తేలడంతో తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సూర్యచంద్రులు ఉన్నంత కాలం కేసీఆర్ పేరు తెలంగాణ చరిత్రలో ఉంటుందని చెప్పారు. హామీలేవీ అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని ఎంపీ కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ అధికారులు కాంగ్రెస్ నేతలకు వత్తాసుగా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చర్యలు తప్పవన్నారు. హనుమకొండ సభను బీఆర్ఎస్ శ్రేణులు పండుగగా భావించాలని సూచించారు. ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, దిండిగాల రాజేందర్ తదితరులు ఇల్లెందు 8వ వార్డులో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. ఇంకా ఈ సమాశంలో మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు, సేవాలాల్ సేన వ్యవస్థాపకులు సంజీవనాయక్, లక్కినేని సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గత ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఆశించిన సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు సంజీవనాయక్ ఈ సభకు హాజరుకావడం చర్చనీయాంఽశంగా మారింది. సన్నాహక సదస్సులో ఎంపీ రవిచంద్రరాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆరే.. దమ్మపేట : సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎంపీ రవిచంద్ర అన్నారు. మండలంలోని పార్కలగండిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ తేవడం వల్లే నేడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులు ఆ తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ సభకు నియోజకవర్గం నుంచి 1000 మందిని తరలిస్తామని తెలిపారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సోయం వీరభద్రం, సున్నం నాగమణి, వగ్గెల పూజ, రావు జోగేశ్వరరావు, దారా యుగంధర్, తూతా నాగమణి, దొడ్డా రమేష్, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, దారా మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
నాలుగేళ్లకే నేలమట్టమా !
● కుప్పకూలిన ‘సీతారామ’ ప్యాసేజ్ పిల్లర్ ● ఇదేం నాణ్యత అంటూ సర్వత్రా విస్మయం ● అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతుల ఆరోపణములకలపల్లి : సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువపై రూ.కోటి వ్యయంతో నిర్మించిన సూపర్ ప్యాసేజ్ పిల్లర్ నాలుగేళ్లకే నేటమట్టం కావడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, పనుల్లో నాణ్యత లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు. 20 రోజుల క్రితమే పిల్లర్ కూలిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా.. సుమారు ఏడాది కాలంగా రాకపోకలు నిలిపివేశారని రైతులు అంటున్నారు. వీకే రామవరం పంప్‌హౌస్ –2 నుంచి కమలాపురంలోని పంప్‌హౌస్ –3కు వెళ్లే ప్రధాన కాల్వపై 48.30 కిలోమీటర్ వద్ద నాలుగు పిల్లర్లతో సూపర్ ప్యాసేజ్ నిర్మించారు. రెండు పిల్లర్లు కాల్వలో, కాల్వకు కుడివైపున సిమెంట్ రివిట్మెంట్లో ఒకటి, ఎడమ పక్కన మరోకటి నిర్మించారు. ఐతే పూసుగూడెం నుండి కమలాపురం వెళ్లే ప్రధాన కాలువలో ఎడమ పక్కన పిల్లర్ కూలిపోయింది. ఇరిగేషన్ అధికారులు ఇరవై రోజుల క్రితం ఘటన జరిగిందని చెపుతున్నా, సుమారు ఏడాది క్రితమే పిల్లర్ నేటమట్టమైనట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈక్రమంలో అసలు పిల్లర్ ఎలా కూలింది అనే విషయంలోనూ స్పష్టత కరువైంది. పిల్లర్ కింద మట్టి కదిలి, పునాది కదలడంతో పిల్లర్ కూలిపోయిందని ఇరిగేషన్ అఽధికారులు చెపుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కాలువ కుడివైపున రివిట్మెంట్లో ఉన్న పిల్లర్‌కు కూడా ప్రమాదం పొంచిఉండే అవకాశం ఉంది. ఇదే పద్ధతితో పిల్లర్ బేస్మెంట్ కదిలితే ఆ పిల్లర్కూడా కూలిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోప్యత ఎందుకో..? ఏడాది క్రితమే పిల్లర్ నేలమట్టమైందని రైతులు అంటుండగా 20 రోజుల క్రితమే కూలిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ 20 రోజులు మాత్రం గోప్యత ఎందుకు పాటించారనేది ప్రశ్నార్థకంగా మారింది. పిల్లర్‌ను పునర్నిర్మించాలని యోచిస్తున్న అధికారులు.. కూలిపోవడానికి కారణమేంటని సమగ్ర అధ్యయనం చేశారా లేక ఇష్టారీతిన పనులు సాగిస్తారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్యాసేజ్ నిర్మించిన కాంట్రాక్ట్ ఏజన్సీ పని మొత్తం పూర్తయ్యాక కూడా రెండేళ్ల పాటు నిర్వహణ బాధ్యత చూడాల్సి ఉంటుందని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటుండగా.. అసలు పని పూర్తికాకుండానే పిల్లర్ కూలడం నాణ్యతను తెలియజేస్తోంది. సమగ్ర విచారణ చేపట్టాలి అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వంతోనే పిల్లర్ కూలిపోయింది. దీంతో ప్రజాధనం వృథా అయింది. రూ.కోటితో నిర్మించిన ప్యాసేజ్ ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నూపా భాస్కర్, మాస్‌లైన్ నాయకుడు పనులు ప్రారంభించాం 20 రోజుల క్రితమే పిల్లర్ కూలిపోయింది. తిరిగి ఇప్పటికే పనులు ప్రారంభించాం. బేస్మెంట్ లోతు పెంచి, పకడ్బందీగా పిల్లర్ నిర్మిస్తాం. ప్రజాధనం వృథా కాకుండా కాంట్రాక్టరే ఖర్చు భరించేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లర్ కూలినందునే తాత్కాలికంగా ప్యాసేజ్ దారి మూసేశాం. – రాంబాబు, ఇరిగేషన్ డీఈ -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క బ్యారేజీ నుంచి నీరు విడుదలసూపర్బజార్(కొత్తగూడెం)/అశ్వాపురం : జిల్లాలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి నీరు విడుదల చేయనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం తెలిపారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీరు అడుగంటుతోందని, దీంతో రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బంది కలుగకుండా మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో తుపాకులగూడెంలోని బ్యారేజీ నుంచి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని వివరించారు. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భద్రాద్రి తలంబ్రాలకు ఆదరణ భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కొనుగోలు చేసే భక్తుల సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగింది. శ్రీరామనవమికి భద్రాచలం రాలేని భక్తుల ఇంటివద్దకే తలంబ్రాలు అందించాలని ఆర్టీసీ కార్గో సంకల్పించింది. గత నెల 15 నుంచి ఈనెల 7 వరకు రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో సిబ్బంది తలంబ్రాలు అందించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బుక్ చేసుకున్నారు. గతేడాది ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా 4,500 మంది మాత్రమే బుక్ చేసుకోగా ఆర్టీసీకి రూ.6.79 లక్షల ఆదాయం వచ్చింది. ఈసారి 4,948 మంది బుక్ చేసుకోగా రూ.7.47 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గల 11 ఆర్టీసీ రీజియన్లలో పరిధిలో 2024లో 47,092 బుకింగ్‌లకు రూ.71,10,892 ఆదాయం రాగా, ఈ ఏడాది 82,147 మంది బుక్ చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 40 వేల తలంబ్రాల ప్యాకెట్లు కార్గో ద్వారా అందజేయగా రూ.60.40 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా 42 వేల మంది భక్తులకు త్వరలోనే తలంబ్రాలు అందిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
పాలక మండలికి మోక్షమెప్పుడో ?
జీఓ వచ్చి నెల కావొస్తున్నా ప్రమాణస్వీకారం ఊసే లేదు పాల్వంచరూరల్ : అమ్మవారు వరమిచ్చినా అధికారులు కరుణించని చందంగా ఉంది పెద్దమ్మతల్లి ఆలయ పాలక మండలి పరిస్థితి. ఆలయ పాలకమండలి కోసం 13 మంది పేర్ల జాబితాతో ప్రభుత్వం మార్చి 19న జీఓ నంబర్ 112 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయినా దేవాదాయ శాఖ అధికారులు ఇంకా ప్రమాణ స్వీకారానికి మోక్షం కల్పించడం లేదు. జీఓ వచ్చిన ఏడు రోజుల తర్వాత అంటే గత నెల 26న జాబితాలో పేర్లున్న వారందరనీ ప్రమాణస్వీకారోత్సవానికి ఈఓ ఆహ్వానించారు. దీంతో వారంతా ఆలయం వద్ద గల ఈఓ కార్యాలయానికి వెళ్లారు. అయితే స్థానికులకు కమిటీలో అవకాశం కల్పించాలంటూ ఇద్దరు యువకులు గుడి ఎదుట గల వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలపగా, మరి కొందరు ఈఓ కార్యాలయం ఎదుట అందోళన చేశారు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలిచిపోయింది. మొదట 14 మందితో.. పెద్దమ్మతల్లి ఆలయ పాలకవర్గం ఎన్నిక విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వం రెండుసార్లు జీఓలు జారీ చేయడం వివాదానికి దారితీసింది. మొదట గతనెల 6వ తేదీన 14 మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. అయితే ఈ కమిటీపై వివాదం తలెత్తడం, అధికారులు, మంత్రులకు ఫిర్యాదులు అందడంతో ఆ జీఓను రద్దుచేసి గతనెల 19న జీఓ నంబర్ 112 ద్వారా 13 మందితో కూడిన మరో జాబితా విడుదల చేశారు. ఇప్పుడు ఈ జీఓ వచ్చి కూడా 27 రోజులు కాగా, మరో మూడు రోజుల్లో ఈ జాబితా కూడా రద్దయ్యే అవకాశం ఉందని పాలకమండలిలో చోటు దక్కిన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ రజినీకుమారిని వివరణ కోరగా.. పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఉన్నతాధికారుల నుంచి మరోసారి ప్రొసీడింగ్స్ రావాల్సి ఉందని, రాగానే చేయిస్తామని చెప్పారు. -
ఆలయ హుండీ చోరీకి యత్నం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం గ్రామ శివారులోని శ్రీచిలకలగండి ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. ఆలయం లోపల ఉన్న ఐరన్ హుండీని గుర్తుతెలియని దుండగులు సుమారు 15 మీటర్ల దూరంలో ఆలయం వెనక వైపునకు తీసుకెళ్లి తాళాలను తెరిచేందుకు యత్నించగా.. తెరుచుకోకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన సిబ్బంది గుర్తించి, స్థానిక పోలీసులకు సమచారం అందించారు. ఏఎస్ఐ యాకూబ్అలీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఇటీవల వచ్చిన గాలి దుమారంతో ఆలయంలోని సీసీ కెమెరాలు కాలిపోగా, చోరీకి వచ్చిన దుండగులను గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది. -
అన్యమత ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు
ములకలపల్లి : ఏజెన్సీ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను అగౌరవపరుస్తూ ఓ వ్యక్తి అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నాడని రాజీవ్‌నగర్ గ్రామస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మత మార్పిడికి యత్నిస్తున్న అతడిపై చర్య తీసుకోవాలని కోరారు. చికిత్స పొందుతున్న మహిళ మృతి పాల్వంచరూరల్: భర్తతో గొడవపడి పురుగులమందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని నాగారంకాలనీకి చెందిన, నవభారత్ కంపెనీలో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న తేజావత్ లాల్‌బాబు భార్య కల్యాణి (26) తన భర్త పనికి రావడం లేదని ఈ నెల 8వ తేదీన పురుగులమందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి తండ్రి భీముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. గ్రామపంచాయతీ ఈఓపై దాడికి యత్నం ముగ్గురిపై కేసు నమోదు భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాస్‌పై మంగళవారం ఓ మాంసం వ్యాపారి దాడికి యత్నిచాడు. చర్ల రోడ్డులో గల హోండా బైక్ షోరూం ఎదుట ఉన్న ఓ మాంసం దుకాణం కింద ఉన్న డ్రెయినేజీలో పూడికతీత కోసం సిబ్బంది ప్రయత్నించగా సదరు దుకాణం వ్యాపారి అడ్డుకున్నాడు. ఇదే విషయంపై ఈఓ శ్రీనివాస్ సదరు దుకాణం నిర్వాహకుడిని అడిగేందుకు వెళ్లగా ఒక్కసారిగా కుర్చితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి అక్కడే ఉన్న కర్ర మొద్దులను ఈఓపైకి విసిరేశాడు. పూడికతీతకు వచ్చిన పొక్లెయిన్‌పై దాడికి చేయగా, అద్దం పగిలింది. దీంతో ఈఓ శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గ్రావెల్ తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు మణుగూరురూరల్: మండలంలోని సాంబాయిగూడెం గ్రామంలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రావెల్ తవ్వకాలు చేపట్టి లారీలు, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. మంగళవారం గ్రావెల్‌ను తరలిస్తున్న లారీలను గ్రామస్తులు నిలిపి వేసి ఆందోళన చేపట్టారు. లారీలు, ట్రాక్టర్లతో తోలకాలు చేపడుతుండడంతో రోడ్లు పాడైపోయి దుమ్ము, ధూళి ఎగిసిపడి ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. అంతేకాకుండా పర్యావరణానికి నష్టం కూడా వాటిల్లుతోందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ గ్రావెల్ తవ్వకాలు, తోలకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. కలప పట్టివేత దుమ్ముగూడెం: మండలంలోని జిన్నెలగూడెం – చింతగుప్ప గ్రామాల మధ్య నిల్వ చేసిన 15 టేకు దిమ్మెలను రేంజర్ కమల ఆధ్వర్యంలో మంగళవారం పట్టుకున్నారు. వాటిని రేంజ్ కార్యాలయానికి తరలించారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు మట్టి ట్రాక్టర్ల పట్టివేత జూలూరుపాడు: అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. జూలూరుపాడు ప్రభుత్వ స్థలంలో తవ్విన మట్టిని రెండు ట్రాక్టర్లలో తరలిస్తుండగా స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఇద్దరు డ్రైవర్లు పాపకొల్లుకు చెందిన అశోక్, జూలూరుపాడుకు చెందిన ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. మట్టి ట్రాక్టర్లను తహసీల్దార్‌కు అప్పగించనున్నట్లు ఎస్ఐ రవి వెల్లడించారు. -
ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా దమ్మపేట వాసి
దమ్మపేట: ఏపీలోని అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు దమ్మపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పసుమర్తి మల్లికార్జునరావును నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సలహాదారుడుగా నియమిస్తూ మంగళవారం జీఓ జారీ చేసింది. మల్లికార్జునరావు గతంలో ఏపీలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఘనంగా అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం పాల్వంచ: పట్టణంలోని అల్లూరి సెంటర్ వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో మంగళవారం జిల్లా ధూప, దీప, నివేదన ఆత్మీయ అర్చక సంఘం సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నావరుజుల ప్రసాద్‌శర్మ, అధికార ప్రతినిధి మరింగంటి భార్గవాచార్యులు ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు పురాణం కిరణ్‌కుమార్‌శర్మ, ప్రధాన కార్యదర్శి పాడికంటి సంతోష్‌కుమార్, కోశాధికారిగా కౌత ప్రసాద్‌శాస్త్రి, కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పంచాంగ ఆవిష్కరణ చేయించి ఐడీ కార్డులు ఆవిష్కరించారు. పాస్టర్కు గిన్నిస్‌బుక్‌లో స్థానం పాల్వంచ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పాల్వంచ వాసి, కాంట్రాక్టర్స్ కాలనీ ఇండియన్ పెంతికోస్త్ చర్చి పాస్టర్ మర్రి ఏసుదాసు స్థానం పొందారు. ఇటీవల హైదరాబాద్ మణికొండలో న్యూలైఫ్ చర్చ్‌లో జరిగిన, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సరళీ స్వరాలు కీబోర్డ్ ప్లే చేసినందుకు స్థానం పొందారు. నిర్వాహకులు ఆగస్టీన్ దండింగి వేణుగోపాల్ చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. మంగళవారం పలువురు ఏసుదాసును అభినందించారు. వేసవిలో దాహం తీర్చే చలివేంద్రం టేకులపల్లి: వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని అన్నదానం తర్వాత జలదానం అనేది గొప్ప కార్యమని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.మహేందర్ అన్నారు. మంగళవారం పిండిపోలు రామయ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మనపల్లిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ రంగస్వామి, సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు, బొమ్మనపల్లి సబ్‌స్టేషన్ ఏఈ పిండిపోలు బుజ్జికన్నయ్య, ఏడీఈ హేమచంద్రబాబు, దేవ్‌సింగ్, నాగుల్‌మీరా, చరణ్, షకీల్, వసీం, యాకూబ్, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. కేసు నమోదు ములకలపల్లి: చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్హెచ్ఓ ప్రకాష్‌రావు కథనం మేరకు.. చాపరాలపల్లి గ్రామానికి చెందిన అర్జున్‌రావు తన ఇంటి ఆవరణలో పశువుల షెడ్డు నిర్మించుకొంటుండగా అదే గ్రామానికి చెందిన బాణోతు బాలాజీ దుర్భాషలాడాడు. అనంతరం ఇంటి ప్రహరీని బద్ధలు కొడతామని, ట్రాక్టర్ ఎక్కించి చంపుతామని బెదిరించారు. అర్జున్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య నేలకొండపల్లి: తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని నాచేపల్లికి చెందిన నల్లగొండ యశ్వంత్(18) ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఆతర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నట్లు తెలియగా, వారు మందలించారు. దీంతో బౌద్ధక్షేత్రం వద్ద ఓ వెంచర్లో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించగా.. తండ్రి రాంబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నాసిరకం విత్తనం..రైతు పతనం..
రైతులను నిండా ముంచిన మొక్కజొన్న ● నాణ్యత లేని విత్తనాలతో బెండు కంకులు ● లబోదిబోమంటున్న రైతులు ● ముఖం చాటేస్తున్న విత్తన కంపెనీ డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లు జూలూరుపాడు: పలు కంపెనీలకు చెందిన ఆడ, మగ మొక్కజొన్న విత్తనాలు రైతులను నిండా ముంచాయి. మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆడ, మగ మొక్కజొన్న పంటను సుమారు 1000 ఎకరాల్లో సాగు చేయగా.. వినోభానగర్‌లో 400 ఎకరాల్లో పంట వేశారు. విత్తనాలు వేసే సమయంలో వివిధ కంపెనీల డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లు రైతులకు మాయమాటలు చెప్పి పంటను కొనుగోలు చేస్తామని, పంట పండకపోతే పరిహారంగా రూ.75,000 నుంచి రూ.80 వేలు ఇస్తామని, పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.20,000ల నుంచి రూ.30,000 నగదు ఇవ్వడం, ఎకరానికి 3.5 – 4 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, మెట్రిక్ టన్నుకు రూ.33,000 నుంచి రూ.35,000 ఇస్తామని, ఎకరానికి రూ.లక్ష లాభం వస్తుందని నమ్మబలికారు. 90 – 100 రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆశపడిన రైతులు ఆడ, మగ మొక్కజొన్న పంటను సాగు చేశారు. కంపెనీల ప్రతినిధులు కొందిరికి ఒప్పంద పత్రాలు ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకుండా దాటవేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా కంపెనీ వారు ఇచ్చిన నగదుకు సంబంధించి ఖాళీ ప్రామిసరీ నోట్‌పై సంతకాలు తీసుకున్నారు. మూడు నెలల్లో ఏపుగా పెరిగిన మొక్కజొన్న మొక్కలకు విత్తనాలు లేని బెండు కంకులు వచ్చాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వినోభానగర్‌లో సుమారు 150 ఎకరాల్లో పంట దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లకు ఫోన్ చేస్తే తమకు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఫోన్ కూడా ఎత్తడం లేదని, గట్టిగా నిలదీస్తే ఏమైనా చేసుకోండంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తాము సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు సంబంధిత కంపెనీలకు చెందిన డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్ల వద్ద ఉండటం ఆందోళన కల్గిస్తోందని రైతులు వాపోతున్నారు. సంబంధిత మొక్కజొన్న కంపెనీలపై వ్యవసాయశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా, మండల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆడ, మగ మొక్కజొన్న పంటలను పరిశీలించి, న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఖాళీ ప్రామిసరీ నోట్‌పై సంతకం పెట్టా.. ఓ విత్తన కంపెనీ వారు ఆడ, మగ మొక్కజొన్న పంట సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.20 వేలు చొప్పు న 5.5 ఎకరాలకు డబ్బులు ఇచ్చారు. నగదు ఇచ్చిన తరువాత ఖాళీ ప్రాంసరీ నోట్‌పై సంతకం పెట్టి కంపెనీ ఆర్గనైజర్‌కు ఇచ్చాను. కంపెనీ ఆర్గనైజర్ చెప్పిన మాయమాటలు విని పత్తి పంటను తొలగించి ఆడ, మగ మొక్కజ్నొ పంట సాగుచేస్తే విత్తనాలు లేని బెండు కంకులు రావడంతో తీవ్రంగా నష్టపోయాను. –గంగావత్ లక్ష్మణ్, రైతు వినోభానగర్ పరిహారం ఇస్తామని చెప్పారు.. ఆడ, మగ మొక్కజొన్న పంట పండకపోతే నష్ట పరిహారంగా ఎకరానికి రూ.80 వేలు ఇస్తామని చెప్పారు. కంపెనీ డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. పలుమార్లు ఫోన్ చేస్తే గానీ లిఫ్ట్ చేస్తున్నారు. కానీ, నష్ట పరిహారం గురించి మాట్లాడటం లేదు. ఈ అంశంపై వ్యవసాయశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాం. విత్తన కంపెనీలపై ఇప్పటికై నా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి. –భూక్యా బాలు, రైతు, వినోభానగర్ అధిక దిగుబడి వస్తుందని నమ్మించారు.. ఓ కంపెనీకి చెందిన విత్తనాలు వేస్తే బెండు కంకులు రావడంతో తీవ్ర నష్టం వచ్చింది. 40 శాతం పండి 60 శాతం పండకపోతే ఎకరానికి రూ.80 వేలు ఇస్తామని చెప్పారు. విత్తనకంపెనీ వారు నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి మోసం చేశారు. బాండు పేపర్ రాసి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.20 వేలు ముందుగా ఇచ్చి ఖాళీ ప్రాంసరీ నోట్‌పై సంతకం పెట్టించుకొని తీసుకున్నారు. ఇప్పుడు ప్రాంసరీ నోట్ అడిగితే ఇవ్వడం లేదు. –భూక్యా రాంబాబు, రైతు, వినోభానగర్ టేకులపల్లిలో.. టేకులపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ఓ విత్తన కంపెనీ ప్రతినిధులు ఆడ, మగ మొక్కజొన్న విత్తనోత్పత్తి కోసం రైతులకు సాగు ఖర్చులు ఇచ్చి పంట పండిన తరువాత కొనుగోలు చేస్తామని రైతులతో ఒప్పందం చేసుకున్నారు. మంగళితండాకు చెందిన ఆంగోతు సేవ్యా 10 ఎకరాలు, తేజావత్ పూల్‌సింగ్ ఎకరం, దారావత్ నాగ రెండున్నర, తేజావత్ దళ్‌సింగ్ 3, లాకావత్ రాజు 2, లాకావత్ రాజేశ్ ఒకటి, రెడ్డి 3, శంకర్ 3, గుగులోత్ రాంజీ ఒకటి, కోటేశ్వర్రావు 2, మోతీలాల్ 7, నారాయణ 2, భూక్య రాములు 2, భూక్య దశరథ్ 7.. చుక్కాలబోడు, గోలియాతండా తదితర గ్రామాలకు చెందిన సుమారు వందకుపైగా రైతులు 1,500కు పైగా ఎకరాల్లో ఆడ, మగ మొక్కజొన్న సాగు చేశారు. పంట దెబ్బతింటే ఎకరానికి రూ.70 వేలు, పండితే క్వింటాకి రూ.2,600 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పారు. ఒప్పందం ప్రకారం ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో సాగు ఖర్చు కోసం రూ.20 వేలు వేసింది. రైతులు సాగు చేశారు. మూడు నెలల్లో రావాల్సిన పంట నాలుగు నెలలు పట్టిందని, అది కూడా కంకి పూత, కాత సరిగా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు పంటను కోసి సిద్ధంగా ఉంచారని కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేస్తే రావడం లేదని, స్పందించడం లేదని వాపోయారు. నమ్మించి ఆశ పెట్టి తీరా పంట పాడైతే కంపెనీ ప్రతినిధులు స్పందించడం లేదని, ఇప్పటికే వేల రూపాయలు, శ్రమ పోయిందని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. -
సుముహూర్తాలు వచ్చేశాయ్..
● ఏప్రిల్‌లో బలమైన ముహూర్తాలు ● నేటి నుంచి 30 వరకు పెళ్లిళ్ల సీజన్ ● వివాహాలతో కళకళలాడనున్న మండపాలు భద్రాచలంఅర్బన్: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన, మహోన్నతమైన ఘట్టం. నూతన వధూవరులు నూరేళ్లు కలిసి జీవించాలంటే ముహూర్త బలం ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారికి ఈ నెలలో సుముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే సాధారణంగా ఒక నెలలో ఒకటి, రెండూ, మూడూ లేదా నాలుగైదు ముహూర్తాలు ఉంటాయి. కానీ, ఏప్రిల్‌లో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ రాలేదు. ఏప్రిల్‌లో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో వేలాది వివాహాలు జరగనున్నాయి. ఏప్రిల్‌లో 13వ తేదీ నాటికి మూఢాలు వెళ్లిపోతాయి. సూర్యుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఏప్రిల్‌లో 13 తేదీ వరకు అంటే దాదాపు సగం రోజులు పెళ్లి ముహూర్తాలు లేవు. కానీ, ఆ తర్వాత మరో సగం రోజుల్లో అంటే కేవలం 16 రోజుల్లో 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ ప్రత్యేకం ఏప్రిల్‌లో మొత్తం తొమ్మిది ముహూర్తాలు ఉన్నాయి. ఇంత ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సాధారణంగా పెళ్లి ముహూర్తం కుదరాలంటే చాలా అంశాలను పరిశీలించాలి. జాతకాలు, గ్రహస్థితి, తారాబలం, వధూవరుల గణన, రాశిఫలం ఇలా ఎన్నో అంశాలు కలిస్తేనే ఒక మంచి పెళ్లి ముహూర్తం సెట్ అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి వేడుక చేయాలనుకుంటే ఏప్పిల్‌లో మంచి ముహూర్తం కుదురుతుందంటున్నారు. ఈ ముహూర్తాల్లో ఏదో ఒకటి కచ్చితంగా సెట్ అవుతుందని పండితులు చెబుతున్నారు. మార్చి 30 ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం, బహుళ పక్షం పాఢ్యమి తిథి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. వారి జాతక రీత్యా ఏఏ నక్షత్రానికి మంచి ముహూర్తం ఉందో తెలుసుకుని ముహూర్తాలు నిర్ణయించుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. మంచి తరుణం పెళ్లిళ్లు చేసుకునేందుకు విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్‌లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. వారి వారి జాతకాల రీత్యా సరిపడా ముహూర్తాలు పెట్టుకోవచ్చు. పెళ్లి ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి తరుణం. –విశ్వనాథశర్మ, అర్చకులు, భద్రాచలం -
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
దుమ్ముగూడెం: మండలంలోని సీతానగరం, పెద్దనల్లబల్లి, ములకపాడు గ్రామాల్లో మావోయిస్టు పార్టీ కి వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరిట మంగళవారం వాల్‌పోస్టర్లు వెలిశాయి. అందులో మావోయిస్టుల్లారా! నిత్యం ఆదివాసీలపై ఆధారపడి బతికే మీకు.. అడవులే ఆధారంగా జీవనోపాధి పొందుతున్న ఆదివాసీలను అడవుల్లోకి రావొద్దని చెప్పే అధికారం ఎవరిచ్చారు?.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది?.. మీరు అమర్చిన మందుపాతరల వల్ల ఇప్పటికే చాలామంది అమాయక ఆదివాసులు చనిపోయారు.. ఎందరో శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు.. ఇన్ఫార్మర్ల నెపంతో దారుణ హత్యలు చేస్తున్నారు.. ఇలాంటి దుశ్చర్యలు ఆపకపోతే పోరాటం చేస్తామని పోస్టర్లలో ఉంది. -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన
కొత్తగూడెంటౌన్: తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని ఆరోపిస్తూ ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు కదలనని భీష్మించింది. బాధితురాలు కొర్రా నిరోష మాట్లాడుతూ.. సూజాతనగర్ మండలం సర్వారం నందతండాకు చెందిన తన భర్త కానిస్టేబుల్ అని, తమ మధ్య గొడవలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో మరో మహిళతో కావాలని తనపై ఏప్రిల్ 11న అక్రమ కేసు పెట్టించారని, తన భర్త డిపార్ట్మెంట్లో పనిచేస్తుండటంతో తనకు పోలీసులు మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించింది. ఈ విషయమై టూటౌన్ సీఐ రమేశ్‌కుమార్‌ను వివరణ కోరగా ఏప్రిల్ 11వ తేదీన రామవరానికి చెందిన మహిళ తనను కొర్ర నీరజ కొట్టిందని కేసు పెట్టిందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందన్నారు. అక్రమంగా కేసు పెట్టారంటూ ఆరోపణ -
రోడ్డు ప్రమాదంలో కార్మిక నాయకుడి మృతి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మిక నాయకుడు సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. సింగరేణి మాజీ ఉద్యోగి, టీబీజీకేఎస్ నాయకుడు, కాంట్రాక్ట్ కార్మిక పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ (58) కొత్తగూడెం నుంచి గౌతంపూర్లోని తన ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో మరో ద్విచక్రవాహనంపై కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు ఇద్దరు యువకులు వెళ్తున్నారు. ఈ క్రమంలో ధన్‌బాద్ పోచమ్మ గుడి వద్ద రోడ్ క్రాస్ చేస్తుండగా ఢీకొట్టారు. దీంతో శంకర్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 ద్వారా సింగరేణి ప్రధానాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా శంకర్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడిగా కార్మిక సమస్యల పరిష్కారానికి, ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు అనేక పోరాటాలు చేశారు. మృతిపట్ల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతోపాటు ఎండీ రజాక్ తదితరులు సంతాపం తెలిపారు. -
బడుగు వర్గాల ఆశాజ్యోతి.. అంబేడ్కర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): అంటరానితనంతో ఎదురైన అవమానాలనే ఆయుధాలుగా మలుచుకుని ప్రపంచ మేధావిగా ఎదిగిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్లో సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్‌రాజుతో కలిసి పాల్గొన్న కలెక్టర్.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జయంతి రోజునే కాకుండా ప్రతి రోజూ ఆ మహనీయుడిని స్మరించుకోవాలని, అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైన అన్ని హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చారని చెప్పారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వారు కాదని, అందరి వాడని అన్నారు. ఆయన సిద్ధాంతాలను నేటి తరా ల వారు తెలుసుకోవాలని సూచించారు. సామాజిక రుగ్మతలు అనుభవించి భావితరాల భవిష్యత్‌కు రుగ్మతలు అడ్డుకారాదని హక్కులు కల్పించారని అన్నారు. అంబేడ్కర్ వంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో జన్మించడం అందరికీ గర్వకారణమని అన్నారు. ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ.. యువతలో ఉన్న శక్తిని సమాజోద్ధరణకు ఉపయోగించడమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అన్నారు. ఆయనకు ప్రతీ కుటుంబంలోనూ ఓ అభిమాని ఉండాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, సూపరింటెండెంట్ హనుమంతరావు, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఉత్సవ కమిటీ కన్వీనర్ మారపాక రమేష్, కో కన్వీనర్లు కొప్పరి నవతన్ కుమార్, వేమూరి లక్ష్మీబాయి, సంభారపు నాగేందర్, కనుకుంట్ల నిర్మల, ఎం.లక్ష్మీబాయి, భార్గవి, కూరపాటి రవీందర్, బి.పుష్పలత, కుమారస్వామి, కరిసె రత్నకుమారి, ఆర్.మాధవి, జి.కల్పన, ఎం.సాయిసుధీర్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ నివాళి -
అకాల వర్షంతో పంట నష్టం
దుమ్ముగూడెం : మండలంలోని రామారావుపేటలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. గ్రామంలో సుమారు 60 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వడగాళ్ల వానకు మిగతా గ్రామాల్లో కూడా పంటనష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గింజలు రాలిపోయాయని పేర్కొన్నారు. గాలి దుమారంతో ఇళ్లపై రేకులు లేచిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, తాగేందుకు నీళ్లు లేక చేతి బోరు దగ్గర నుంచి నీళ్లను తెచ్చుకున్నామని గ్రామస్తులు తెలిపారు. చెట్టు విరిగిపడి పంచాయతీ ట్రాక్టర్ కూడా ధ్వంసమైంది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. గాలిదుమారంతో రాలిన మామిడిచండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లిలో గాలిదుమారం, వడగళ్ల వానతో మామిడి పంట దెబ్బతిన్నది. ఆదివారం రాత్రి వడగళ్ల వర్షం కురియడంతో తోటలోల మామిడికాయలు రాలిపోయాయి. దీంతో పలువురు రైతులు నష్టపోయారు. -
ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లేవి..?
● ఏరియా ఆస్పత్రుల నుంచి బాధితుల తరలింపునకు ఇక్కట్లు ● మండల కేంద్రాల్లో ఉండే 108 వాహనాలపైనే ఆధారం ● అవి గ్రామాలకు వెళ్తుండటంతో సకాలంలో అందని వైద్యంఇల్లెందు: జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులకు అంబులెన్స్‌లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మండలానికో 108 వాహనం ఉందని, వాటినే వినియోగించుకోవచ్చనే భావనతో ఆస్పత్రుల అంబులెన్సులను తొలగించారు. వాటి డ్రైవర్లను ఇతర అవసరాలకు ఉపయోగించుకున్నారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, భధ్రాచలం, అశ్వారావుపేట, చర్ల ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఆస్పత్రికీ అంబులెన్సు సౌకర్యంలేదు. గత పదేళ్ల కాలంగా ఉన్న అంబులెన్సులు కూడా తొలగించారు. ఆయా ఆస్పత్రుల నుంచి అత్యవసర వైద్యం కోసం ఖమ్మం, వరంగల్ వంటి ఆస్పత్రులకు తరలించాలంటే 108 వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రమాద, అనారోగ్య బాధితుల కోసం అవి గ్రామాలకు వెళ్తుండటంతో సకాలంలో ఏరియా ఆస్పత్రులకు రావడంలేదు. దీంతో ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా రోగులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రాణాలు కోల్పోతున్నారు.. జిల్లా కేంద్ర ప్రధానాస్పత్రి, ఏరియా ఆస్పత్రితోపాటు జిల్లాలో జిల్లాలో 29 పీహెచ్‌సీలు, 10 యూపీహెచ్‌సీలు, 376 సబ్ సెంటర్లు ఉన్నాయి. పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల నుంచి ఏరియా ఆస్పత్రులకు రిఫరల్ పేషెంట్లు వస్తుంటారు. వారికి ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు కొత్తగూడెం, ఖమ్మం తరలించాల్సి ఉంటుంది. 108 వాహనాలు సమయానికి రాకపోవడంతో వైద్యసేవలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. గత శనివారం రాత్రి ఇల్లెందుకు చెందిన లోథ్ కార్తీక్ సోనూ గుండెపోటుతో అనారోగ్యం పాలు కావటంతో ఇల్లెందు ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్యం అందించాక డాక్టర్లు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 108కు ఫోన్ చేస్తే అంబులెన్ వచ్చేసరికి గంట దాటింది. దీంతో పరిస్థితి విషమించి బాధితుడు మృతి చెందాడు. అదే ఏరియా ఆస్పత్రికి అనుసంధానంగా అంబులెన్స్ ఉంటే రోగిని సకాలంలో తరలించి ఉన్నత వైద్యం అందించిన ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండేది. ప్రైవేటు అంబులెన్స్‌ల్లో తరలించాలంటే బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఇల్లెందు నుంచి ఖమ్మానికి తరలిస్తే సుమారు రూ. 4 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇలా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు అందుబాటులో లేక, ప్రైవేటు వాహనాలకు ఖర్చు పెట్టలేక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.. ఇల్లెందు, మణుగూరు, చర్లలో తప్పనిసరిగా అంబులెన్స్‌లు కావాలని కలెక్టర్ దృష్టికి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఏరియా ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రికి కనీసం 40 నుంచి 60 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఉంటే సకాలంలో వైద్యం అందించవచ్చు. సీఎస్ఆర్ ఫండ్‌తో మంజూరు చేయాలని లేఖ కూడా అందించాం. ఎంపీ ల్యాడ్స్ నిధుల కోసం ఎంపీలకు కూడా సమస్యను వివరించాం. –డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్ -
కుడా.. ఏదీ మండలి జాడ?
కొత్తగూడెం వ్యూఅక్టోబర్లో ఉత్తర్వులు.. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2024 అక్టోబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. కుడా ఏర్పాటుతో జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితమే కొత్తగూడెం, పాల్వంచ పూర్తి స్థాయి పట్టణాలుగా రూపాంతరం చెందాయి. అయితే గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ రెండు పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. ఈ రెండు మున్సిపాటీలు వేటికవే అన్నట్టుగా ఉండడంతో సమీకృత అభివృద్ధి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు సైతం వేర్వేరుగా ఉండడంతో ప్రతీసారి రోడ్లు, డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, మరమ్మతు వంటి రొటీన్ పనులే జరుగుతున్నాయి. కార్పొరేషన్‌గా కొత్తగూడెం.. కొత్తగూడెం – పాల్వంచ పట్టణాలను కలుపుతూ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 2024 జూన్ 20న విజ్ఞప్తి చేశారు. దీనిపై అనేక తర్జనభర్జనల అనంతరం గత జనవరి 4న జరిగిన కేబినెట్ భేటీలో కొత్తగూడెం కార్పొరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత చట్టపరమైన అడ్డంకులు లేకుండా మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కార్పొరేషన్ బిల్లు ఆమోదం పొందింది. కొత్తగూడెం – పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని నాన్ షెడ్యూల్ గ్రామాలు ఏడింటిని కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రేపో మాపో గెజిట్ కూడా జారీ కానుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో వడివడిగా అడుగులు పడుతున్నా.. కుడా పాలక మండలి విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నిధులు తెచ్చే ‘ప్రణాళిక’.. కుడాకు పాలకమండలి ఏర్పాటైతే దాని పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక, దానికి అవసరమైన నిధులను సేకరించే పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు పట్టణాల పరిధిలో వందల ఎకరాల భూములు ఉన్నా.. అవి రెవెన్యూవా లేక అటవీ శాఖవా, షెడ్యూల్ ఏరియానా, నాన్ షెడ్యూల్లో సింగరేణి లీజుకు తీసుకున్న భూములా అనేది తేలడం లేదు. ప్రస్తుతం ఉన్న పాలనా విభాగాలు ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. అయితే కుడా లాంటి చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటైతే భూముల లెక్కల్లో స్పష్టత వచ్చేందుకు ఆస్కారం ఉంది. పనులు చేపట్టేందుకు అదనంగా ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అందుబాటులోకి వస్తుంది. చట్టపరంగా నిధుల సమీకరణ, పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యమవుతుంది. పట్టణాల్లో తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనకు మున్సిపాలిటీలు పని చేస్తుండగా.. కుడా ద్వారా ఇతర అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ రెండు పట్టణాల ఉమ్మడి అవసరాల ఆధారంగా సరికొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు వీలుంటుంది. పాలకులు లేని కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా ఏర్పాటుచేస్తూ గతేడాది అక్టోబర్‌లోనే ఉత్తర్వులు పాలక మండలిపై మాత్రం దృష్టి పెట్టని ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోని జంట పట్టణాలు చివరి అంకానికి చేరిన కార్పొరేషన్ ఏర్పాటు రూపురేఖలు మారనున్నాయ్.. గత ఏడాది కాలంగా కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల దశ దిశ మార్చే అనేక అంశాలు చోటుచేసుకున్నాయి. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు కొత్తగూడెంలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా అప్‌గ్రేడ్ చేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను కొత్తగూడెంలో నెలకొల్పేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి తోడు ఇల్లెందు – కొత్తగూడెం హైవే (ఎన్‌హెచ్ 930పీ) పనులు టెండర్ల దశలో ఉండగా కొత్తగూడెం – పాల్వంచకు సంయుక్తంగా బైపాస్ రోడ్డు, ఆటోనగర్, జూపార్కు తదితర ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొత్తగూడెం – పాల్వంచల అభివృద్ధికి సంయుక్తంగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం నెలకొంది. -
పర్యాటకుల ఆదరణ పొందాలి
● గిరిజన మ్యూజియాన్ని పరిశుభ్రంగా ఉంచాలి ● ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలం : ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన గిరిజన మ్యూజియం పర్యాటకుల ఆదరణ పొందేలా ఉండాలని పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఆయన మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యాటకులు భారీగా తరలివస్తున్నందున మ్యూజియాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, కళాతృష్ణ ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి, వర్షాకాలాల్లో కళాఖండాలు చెడిపోకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రద్దీ పెరుగుతున్నందున టికెట్ కౌంటర్లను విడివిడిగా ఏర్పాటు చేయాలని, సందర్శకులకు గిరిజన వంటకాలు తాజాగా అందించాలని ఇన్చార్జ్ వీరస్వామిని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేయొద్దని, పర్యాటకులకు మరిచిపోని అనుభూతి కల్పించాలని అన్నారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి.. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా పీఓ ఘనంగా నివాళులర్పించారు. ఐటీడీఏ యూనిట్ అధికారులతో కలిసి ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులు, మహిళలు, కార్మిక, కర్షకుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీఈ హరీష్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏసీఎంఓ రమణయ్య, జీసీడిఓ అలివేలు మంగతాయారు, మేనేజర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్చరీ డెవలప్మెంట్ కమిటీలో స్థానం
ఖమ్మం స్పోర్ట్స్: ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ద్వారా దేశవ్యాప్తంగా విలువిద్యకు మరింత ప్రాచుర్యం తీసుకురావడం, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేలా ఎనిమిది మందితో కూడిన డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి, ఒలింపిక్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్యకు స్థానం దక్కింది. తెలంగాణ నుంచి ఈయనకు మాత్రమే సభ్యుడిగా స్థానం దక్కగా, కమిటీ చైర్మన్‌గా ఏఏఐ ఉపాధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ, కన్వీనర్‌గా సుమంత చంద్ర మహంతి వ్యవహరిస్తారు. సభ్యులుగా శంకరయ్యతో పాటు జంయాంగ్ థ్సెరింగ్ నంజ్యాల్(లఢాఖ్), కె.దేవానంద సింగ్(మణిపూర్)తో పాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు సంజీవ్ సింగ్, పూర్ణిమ మహతో, జివాంజొత్ సింగ్ తేజ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా తీర్చిదిద్దిన శంకరయ్య.. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. విలువిద్యలో సహజసిద్ధమైన ప్రతిభ కలిగి ఉండే గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా కృషి చేశారు. కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్‌కు వ్యాయామ ఉపాధ్యాయులుగానే కాక భద్రాచలం ఐటీడీఏ క్రీడాధికారిగానూ పనిచేశారు.సభ్యుడిగా పుట్టా శంకరయ్యకు అవకాశ ం -
పత్తి రైతుపై విత్తన పోటు..
● ఈ ఏడాది ఒక్కో ప్యాకెట్‌పై రూ. 37 పెంపు ● ఆరేళ్లుగా ఏటా పెరుగుతున్న విత్తన ధరలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న దూది రైతులు బూర్గంపాడు: పత్తి రైతుపై ఈ ఏడాది కూడా విత్తన భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పత్తి విత్తనాల ధరలను పెంచుతూ విత్తన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 475 గ్రాముల ప్యాకెట్‌పై ధర రూ.37 పెంచాయి. దీంతో ప్యాకెట్ రేటు రూ.901కు చేరింది. ఆరేళ్లుగా పత్తి విత్తనాల ధరలు ఏటా పెరుగుతున్నాయి. ఈసారి పెరిగిన ధరలతో జిల్లాలోని రైతులపై రూ.2.05 కోట్ల అదనపు భారం పడనుంది. 2.20 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంటగా పత్తికి మొదటిస్థానం దక్కింది. ఎకరం సాగుకు 2 నుంచి 3 ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయి. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండగా, చాలామంది రైతులు ఆ పద్ధతిలోనే పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎకరాకు 3 నుంచి 4 విత్తన ప్యాకెట్లు అవసరమవుతున్నాయి. విత్తనాలు వేశాక వర్షాలు సరిగా కురకవపోతే మళ్లీ తిరిగి విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో సుమారు 5 లక్షల విత్తనాల ప్యాకెట్లు ప్రతి ఏటా అవసరముంటున్నాయి. వివిధ కంపెనీల పత్తి విత్తనాలను ఆయా డీలర్ల వద్ద కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఒక్కోసారి కొన్ని కంపెనీల విత్తనాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి రెట్టింపు ధరలకు కూడా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు రైతులపై మరింత భారం మోపుతున్నాయి. ఐదేళ్లలో రూ.171 పెంపు గడిచిన కొన్నేళ్లుగా పత్తి విత్తనాల ధరలు పెరుగుతున్నాయి. 2020–21లో ప్యాకెట్ ధర రూ.730 ఉండేది. 2021–22కు రూ.767కు చేరింది. 2022–23లో అది రూ.810కి పెరిగింది. 2023–24లో రూ.853కు, 2024–25లో రూ.864కు చేరింది. ఈ ఏడాది 2025–26లో ప్యాకెట్ ధర.901కు పెరిగింది. ఐదేళ్ల వ్యవధిలో పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.171 మేర పెరిగింది. విత్తన ధరలతోపాటు ఎరువులు, పురుగుమందులు, కూలీల రేట్లు ఏటా పెరుగుతుండటంతో పత్తి రైతులపై పెట్టుబడి భారం పెరుగుతోంది. పెరుగుతున్న పెట్టుబడి అనుగుణంగా పత్తి ధరలు పెరగకపోవటం రైతులకు నష్టం కలిగిస్తోంది. గత రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో పత్తికి మద్దతు ధర దక్కలేదు. దీంతో సీసీఐ రంగంలోకి రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. రైతుల ఆగ్రహం పత్తి విత్తనాల ధరల పెంపుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా ప్రభుత్వం విత్తనాల ధరలను పెంచేందుకు అనుమతినివ్వటం తమపై భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు రాయితీలు ఇవ్వకుండా.. ప్రభుత్వాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలను పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వటం సరికాదని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ఆరేళ్లలో విత్తన ధరలు పెరిగిన తీరు(రూ.లలో) ఏడాది ధర పెరిగినది 2020-21 730 --- 2021-22 767 37 2022-23 810 43 2023-24 853 43 2024-25 864 11 2025-26 901 37 -
ఓపెన్ బెంచ్ ప్రెస్ పోటీల్లో ప్రతిభ
మణుగూరు టౌన్: ఖమ్మంలో ఆదివారం జరిగిన రెండుజిల్లాల స్థాయి ఓపెన్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో మణుగూరు యువకుడు పర్శిక పాండురాజు ప్రతిభ చూపాడు. గోల్డ్‌మెడల్ కై వసం చేసుకున్నాడు. ఈ మేరకు జిమ్ ట్రైనర్ నాగరాజు సోమవారం వివరాలు వెల్లడించారు. పాండురాజు గతంలో కూడా రెండు బంగారు పతకాలు సాధించాడని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన తల్లాడ/ముదిగొండ: పదిహేను రోజుల క్రితం ధాన్యం కోతలు పూర్తిచేసి కల్లాల్లో ఆరబెట్టినా కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు సోమవారం ఖాళీ పురుగు మందుల డబ్బాలతో నిరసన తెలిపారు. తల్లాడ మండలంలోని కిష్టాపురంలో ధాన్యం సిద్ధం చేసినా గన్నీ సంచులు ఇవ్వడం లేదని, వర్షానికి నష్టపోయే ప్రమాదముందని వారు వాపోయారు. అధికారుల తీరు మారకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించగా.. అధికారులు తేమ శాతం తగ్గగానే కాంటా వేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే, ముదిగొండ మండలం గోకినేపల్లి రైతులు ఖమ్మం–కోదాడ రహదారిపై ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మూడు రోజులైనా కాంటా వేయకపోవడంతో అకాల వర్షానికి నష్టపోయామని తెలిపారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణకూసుమంచి/రఘునాథపాలెం: కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో జై భీమ్ బహుజన సంఘం ఆధ్వర్యాన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాలను సోమవారం రాజుపేట గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ త్యాగనిరతి, దేశానికి వారు అందించిన సేవలను కొనియాడారు. అలాగే, రఘునాథపా మండలం మంచుకొండలో అంబేడ్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అవిష్కరించారు. ఈకార్యక్రమంలో గుత్తా రవి, భూక్యా లక్ష్మణ్‌నాయక్, అజ్మీరా వీరునాయక్, మందా సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. తల్లి మందలించిందని ఆత్మహత్య మధిర: వంట పని నేర్చుకోకపోతే ఎలా అని తల్లి మందలించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధిర శ్రీనగర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. మధిరలోని కోల్డ్‌స్టోరేజీలో పనిచేసి యాదగిరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఈక్షిత(24) వివాహం జరగగా ఆమె కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 16న ఈక్షిత కుమారుడికి అన్నప్రాసన ఉండడంతో వంట పని నేర్చుకోవాలని ఆమె తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో గదిలోకి వెళ్లిన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏదో పనిపై వెళ్లి ఉంటుందని భావించిన కుటుంబీకులు కాసేపటికి చూడగా తలుపు గడియ వేసినట్లు గమనించారు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే ఈక్షిత మృతి చెందింది. వడదెబ్బతో మేకల కాపరి మృతిఇల్లెందురూరల్ : మండలంలోని బోయితండా గ్రామపంచాయతీ లక్ష్మీనారాయణతండాకు చెందిన మేకల కాపరి బానోత్ హేమ్లా (55) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. మేకలను మేపేందుకు సోమవారం ఉదయం అడవికి వెళ్లిన హేమ్లా మధ్యాహ్నం ఇంటికి వచ్చాక సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. హేమ్లాకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలికొత్తగూడెంటౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రతీ ఒక్కరు ఆప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అఽధికారి పి.పుల్యయ్య తదితరులు పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సింగరేణి గనుల్లో నీరు చేరింది. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో వరద నీరు నిలవడంతో సోమవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కిష్టారం ఓపెన్‌కాస్ట్‌లో 5వేల టన్నులు, జేవీఆర్ ఓసీలో 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. -
19 తులాల బంగారం రికవరీ
ఇల్లెందు: పోలీసులు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, సొత్తు రికవరీ చేశారు. సోమవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్.చంద్రభాను వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. పట్టణంలోని సివిల్ లైన్ సత్యనారాయణపురం వెళ్లే రోడ్లో ఉన్న బి.కుమారస్వామి ఇంట్లో ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగింది. 19 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. 5 వేల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మూడు పోలీసు బృందాలు నిందితుడికి కోసం గాలింపు చేపట్టాయి. సోమవారం పట్టణంలో బుగ్గవాగు సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ యువకుడు తారసపడ్డాడు. పోలీసులను గమనించి పారిపోతుండగా పట్టుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడు ప్రాంతానికి చెందిన రాజ్‌పుత్ కోరీ రాహుల్ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి సొత్తు రికవరీ చేశారు. అతనిపై గతంలో హైదరాబాద్‌లోని పలు స్టేషన్లతోపాటు ఇల్లెందు, కొత్తగూడెం టూ టౌన్ ప్రాంతాల్లో ఆరు చోరీ కేసులు ఉన్నాయి. సత్వరమే కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు డీఎస్పీ రివార్డు అందజేశారు. సమావేశంలో సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు పఠాన్ నాగుల్ మీరా ఖాన్ పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ -
శిశుగృహకు కవల ఆడపిల్లలు
చింతకాని: కవల ఆడ శిశువుల అదృశ్యంపై ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. దత్తత తీసుకున్న వారి నుంచి ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు శిశువులను చేరదీసి ఖమ్మంలోని శిశుగృహకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీకి చెందిన నల్లగాజు మల్లేశ్–ఉమ దంపతులకు గతంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా గత నెల 31న ఉమ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో వారిని పోసించడం భారంగా భావించిన మల్లేశ్.. ఆస్పత్రిలోనే వేర్వేరు కుటుంబాల వారిని దత్తత ఇచ్చాడు. అయితే, శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు వారి ఇంటికి వెళ్లిన ఆశ కార్యకర్త, అంగన్వాడీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించగా ఈనెల 11న అధికారులు మల్లేష్ ఇంటికి అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. పిల్లల్ని పోషించలేని స్థితిలో తమ బంధువులకే దత్తత ఇచ్చామని మల్లేశ్ సమాధానం చెప్పాడు. కానీ నిబంధనలకు విరుద్ధంగా దత్తత ఇవ్వడంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా సోమవారం నాటికి శిశువులను తీసుకొస్తానని లేఖ రాసి ఇచ్చాడు. ఆ కుటుంబాల నుంచి స్వాధీనం ఆడశిశువులు ఇద్దరిని పిల్లలు లేని తమ దగ్గరి బంధువులకే ఇచ్చామని మల్లేశ్ అధికారులను నమ్మించాడు. ఎట్టి పరిస్థితుల్లో వారిని రప్పించాలని సూచించిన అధికారులు విచారణ చేపట్టగా పిల్లలను ఖమ్మంలోని ఇద్దరు వేర్వేరు దంపతులకు దత్తత ఇచ్చినట్లు తేలింది. ఈక్రమాన డబ్బు చేతులు మారినట్లు ప్రచారం జరిగినా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇక సోమవారం దత్తత తీసుకున్న వారి నుంచి శిశువులను మల్లేశ్ దంపతులు తీసుకురాగా, వారి ఇంటికి ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు వెళ్లి పిల్లలను పోసిస్తారా, తమకు అప్పగిస్తారా అని ప్రశ్నిస్తే తామే పోషిస్తామని సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందున దంపతులు పోషిస్తారనే నమ్మకం లేకపోవడంతో మల్లేశ్ దంపతులు, శిశువులను ఖమ్మంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. కమిటీ చైర్పర్సన్ కౌన్సెలింగ్ ఇచ్చాక శిశువులను శిశుగృహలో ఉంచాలని నిర్ణయించారు.దత్తత తీసుకున్న వారి నుంచి స్వాధీనం -
మరణంలోనూ వీడని బంధం
నేలకొండపల్లి: పెళ్లినాటి బాసలను ఆయన యాది మరువలేదు. చివరి వరకు పట్టిన చేయి వీడనని ఇచ్చిన మాటను ఆచరించడమే కాక మరణంలోనూ ఆమె వెంటే నడిచాడో భర్త. నేలకొండపల్లి మండలంలోని రామచంద్రాపురానికి చెందిన బూధాటి హనుమరెడ్డి(81) – యశోద(76) దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. యశోద ఆదివారం ఇంట్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడగా తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటి నుంచి ఆందోళన చెందుతున్న హనుమరెడ్డి.. యశోద మృతి విషయం తెలియగానే గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులను ఆస్పత్రికి తరలించగా గంట వ్యవధిలోనే మృతి చెందాడు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా.. ఒకే ట్రాక్టర్‌పై మృతదేహాలను ఉంచి అంతిమయాత్ర నిర్వహించాక అంత్యక్రియలు పూర్తిచేశారు. వరకట్న వేధింపులతో ఆత్మహత్యమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడిన నవ్య మృతిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బ్రాహ్మణ బజార్‌కు చెందిన శ్రీపాద ఉత్తరాచారి పెద్ద కుమార్తె నవ్య(21)కు ఇల్లెందు మండలం ధర్మారం తండాకు చెందిన రవిచంద్రాచారితో గతేడాది డిసెంబర్ 26న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.50 వేల కట్నం ఇచ్చారు. కాగా, రవిచంద్రాచారి, ఆయన తల్లిదండ్రులు తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. పలుమార్లు పంచాయితీ నిర్వహించినా వారి తీరు మారలేదు. దీంతో నవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. భార్య చనిపోయిన గంట వ్యవధిలోనే భర్త మృతి -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం శివారు సమ్మక్క గద్దెల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి తెల్లూరి ప్రసాద్, రవీందర్, బాబా ఫకృద్దీన్, జోయెల్ కారులో పాల్వంచకు బయలుదేరారు. సమ్మక్క గద్దెల వద్ద ఎదురుగా వచ్చిన లారీ నేరుగా కారును ఢీకొట్టడంతో కారులోని నలుగురు గాయపడగా.. వారిని 108 ద్వారా ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తెల్లూరి ప్రసాద్, రవీందర్‌కు తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు సిఫార్సు చేశారు. బాబా ఫకృద్దీన్, జోయెల్ చేతి భాగంలో గాయాలయ్యాయి. గడ్డివామి దగ్ధం టేకులపల్లి: మంటలు చెలరేగి గడ్డివామి దగ్ధమైన ఘటన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తతండా(జీ)కు చెందిన రైతు బానోత్ కిషన్ తన పశువుల కోసం సుమారు 250 కట్టల గడ్డివామి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివామిపై నిప్పులు పడటంతో మంటలు చెలరేగి వామి మొత్తం కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం అగ్నిమాపక వాహనం వచ్చి మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఆర్పివేశారు. సుమారు రూ.25 వేలు నష్టం వాటిల్లిందని కిషన్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధం అశ్వారావుపేటరూరల్: గాలి దుమారంతో ఓ ఇంట్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగు ఇళ్లు కాలిపోయిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలకోని దురదపాడు జీపీ పాలగుంపు గ్రామానికి చెందిన నల్లబెల్లి స్వప్న పూరింట్లో గాలి దుమారంతో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. ఇదే సమయంలో గాలి దుమారం రావడంతో అదే గ్రామానికి చెందిన మడకం రాము, కొర్సా భద్రమ్మ, గీగా బాబూరావుకు చెంది పూరిళ్లకు మంటలు అంటుకొని పూర్తిగా ఆహుతయ్యాయి. ఆయా ఇళ్లలో ఉన్న ధాన్యం బస్తాలు, జీడిగింజలతోపాటు బియ్యం బస్తాలతోపాటు ఇతర సామగ్రి కాలిపోయయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు బాధితులు వాపోతున్నారు. కాగా, ఘటన జరిగిన గ్రామానికి అగ్ని మాపక వాహనం ఆలస్యంగా చేరుకుందని, దీంతో తీరని నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. లోన్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై కేసు పాల్వంచ: ప్రైవేట్ బ్యాంక్‌లో లోన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీకి చెందిన భాషబోయిన అశోక్‌కుమార్‌కు వద్దని చెప్పినా వినకుండా తిప్పరపు విజయ్ అనే వ్యక్తి రూ.20 లక్షల లోన్ ఇప్పిస్తానని ఒప్పించాడు. 20 రోజుల్లో వస్తుందని, ముందస్తు రూ.3,19 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో అశోక్‌కుమార్ డబ్బులను గత డిసెంబర్లో ఇచ్చాడు. అయినప్పటికీ లోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ సుమన్ అజయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ముదిగొండ మండలంలోని పండ్రేగిపల్లి గ్రామానికి చెందిన షేక్ సోహెల్ (25) సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లిలో బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నేలకొండపల్లిలోని ప్రభుత్వ కాలేజీ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై మరమ్మతుల కోసం ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య బూర్గంపాడు: లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిర్యాల మమత (28)కు తొమ్మిదేళ్ల కిందట మిర్యాల అశోక్‌తో వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా అదే గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు మమతను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గొడవలు కూడా జరిగాయి. దుర్గాప్రసాద్ వేధింపులు, బెదిరింపులు ఎక్కువ కావటంతో ఆమె రెండు రోజుల కిందట ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శతాధిక వృద్ధురాలికి సన్మానం
జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పొట్ట నర్సమ్మను ఆమె కుటుంబీకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఇటీవల లక్ష్మీనర్సమ్మ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనర్సమ్మ నాలుగు తరాల కుటుంబీకులు ఆమెకు శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. జిల్లా ‘కుంగ్‌ఫూ’ కమిటీ ఎన్నిక కొత్తగూడెంటౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంగ్‌ఫూ, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ప్రకాశం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఐ.ఆదినారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పి.కాశీహుస్సేన్, కోశాధికారిగా బి.కనకరాజు, ఉపాధ్యక్షులుగా ఎస్కే హుస్సేన్‌ఖాన్, కె.శ్రీనివాస్, బి.మల్లికార్జున్, ఐ.మోహన్‌రావు, వై.సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులుగా బి.బుచ్చయ్య, ఎం.రాజయ్య, హరిబాబు, ఎస్.సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి బి.సాగర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు లీల శ్రీనివాస్, ఎస్.సతీశ్, ఎం.దామోదర్, బాబు, వి.శ్రీకాంత్, ఎస్.రమేశ్‌ను ఎన్నుకున్నట్లు అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. నేటి నుంచి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి అందుబాటులోకి మొదటి యూనిట్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ సేవలు మణుగూరురూరల్: మండలంలోని చిక్కుడుగుంట ప్రాంతంలోని 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో మొదటి యూనిట్లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ సేవలు ఆదివారం నుంచి మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. గతేడాది జూన్ 29వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో మొదటి యూనిట్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన విషయం విదితమే. పది నెలలుగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అంతరాయం ఏర్పడటంతో 2024–25 వార్షిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పవచ్చు. పది నెలల తర్వాత మరమ్మతులు పూర్తవడంతో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం బిగించారు. సోమవారం నుంచి బీటీపీఎస్ ద్వారా 1080 మెగావాట్ల విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరగనున్నట్లు బీటీపీఎస్ సీఈ బిచ్చన్న తెలిపారు. మంత్రి తుమ్మలను కలిసిన ఏపీ రైతులు దమ్మపేట: ఏపీకి చెందిన పామాయిల్ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మలను ఏపీ పామాయిల్ రైతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి మాట్లాడారు. ఏపీలో పండిన పామాయిల్ గెలలను అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు గాను హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంపై పిడుగుపాటు వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిడుగు పడి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అంగన్వాడీ కేంద్రంపై పిడిగు పడటతో రికార్డులు, పిల్లల ఆట వస్తువులు, భోజన పదార్థాలు కాలి బూడిదయ్యాయి. భారీ వర్షానికి విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పాడింది. -
ఆన్లైన్ అవస్థలు..
కొత్తగూడెంఅర్బన్: నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని గత నెల ప్రారంభించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ పథకం కింద అర్హులైన వారికి రూ.4 లక్షల వరకు రుణం అందించనున్నారు. బ్యాంకులతో లింకేజీ అయిన రుణాలు, లింకేజీ లేకుండా మరికొన్ని రుణాలను అందించనున్నారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసేందుకు గానూ సోమవారంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియనున్నది. దీంతో దరఖాస్తులు ఇంకా చేయకుండా అర్హత ఉన్న వారు మీసేవ, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మూడు రోజులుగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన సర్వర్ పూర్తిగా డౌన్ అయింది. కొన్ని సందర్భాల్లో అసలు ఓపెన్ కూడా కావడం లేదు. వివరాలన్నీ నమోదు చేసిన తరువాత సబ్మిట్ చేస్తే అప్రూవ్ రావడానికి ఒక్కో దరఖాస్తుకు గంట నుంచి రెండు గంటలు పడుతోంది. దరఖాస్తు అప్రూవ్ అయితే వివరాలకు సంబంధించి వారి సెల్‌కు సమాచారం వస్తుంది. అందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో దరఖాస్తుదారులంతా ఎప్పడు మెసేజ్ వస్తుందోనని మీసేవ, ఆన్లైన్ సెంటర్లలో పగలు, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్నారు. సర్వర్ డౌన్ కావడం, ఒక్క దరఖాస్తుకు గంటల తరబడి సమయం పడుతుండటంతో ఆయా సెంటర్ల నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా చాలామంది రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఇష్టపడడం లేదు. కొన్ని సెంటర్ల వారు ఆన్లైన్ చేయడం లేదని తేల్చిచెబుతుండటంతో ఇతర సెంటర్లకు పరుగులు పెడుతున్న పరిిస్థితి ఉంది. ఒక్క దరఖాస్తు ఆన్లైన్ చేయడానికి సెంటర్ల వారు రూ.100 వసూలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మళ్లీ రాత్రి 11 గంటల తరువాత సర్వర్ వేగంగా పనిచేస్తోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వర్ ఇబ్బంది పెట్టడం వల్ల అర్హత కలిగిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కార్యాలయాల్లో ఇవ్వాల్సిందే.. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సర్వర్ డౌన్ కావడం వల్ల కొందరు సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి అడిగితే.. ఆన్లైన్ కాకపోయినా కూడా వారి దరఖాస్తులను ధ్రువపత్రాలతో కలిపి పట్టణం అయితే మున్సిపాలిటీలు, మండలం అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇవ్వాలని సూచిస్తున్నారు. కానీ, అధికారికంగా ప్రకటనలు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఆన్లైన్ చేయకపోతే అసలు దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరనే అనుమానం దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతోంది. అసలు పథకంపై అవగాహన కల్పించడంలో కూడా సంబంధిత అధికారులు విఫలం చెందారని, ప్రభుత్వ లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. సర్వర్ డౌన్ కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, గడువును పెంచి, ఆ సమయంలో పథకంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు. ‘రాజీవ్ యువ వికాసం’దరఖాస్తుకు బారులు సర్వర్ డౌన్‌తో గంటల తరబడి నిరీక్షణ నేటితో ముగియనున్న గడువు జిల్లాలో వచ్చిన దరఖాస్తులు.. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. రుణాల కోసం వ్యవసాయ రంగాలకు చెందిన వారు అయితే 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు, వ్యవసాయేతర రంగాలకు చెందిన రుణాలకు అయితే 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారులు తెలిపారు. అయితే రుణాలకు సంబంధించి ముఖ్యమైన 75 రకాల స్కీంలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే శనివారం వరకు జిల్లాలో ఎస్సీ – 9,746, బీసీ – 16,632, మైనార్టీ – 13,655 దరఖాస్తులు వచ్చినట్లు ఆయా శాఖల అధికారులు వెల్లడించారు. సోమవారం చివరి రోజు కావడంతో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిలిపివేసిన నిత్యకల్యాణాలను ఆదివారం పునఃప్రారంభించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కాగా వరుస సెలవు దినాలు రావడంతో దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు. స్వామి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణంలో సైతం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీ నెలకొంది. -
హత్యకు ప్రణాళిక.. ఐదుగురు అరెస్ట్
ఖమ్మంఅర్బన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేయించేందుకు ఐదుగురు కలిసి ప్రణాళిక రచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్‌గా రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) సీఐ భానుప్రకాష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండలం సువర్ణపూరానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాము తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి దంపతుల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. ఖమ్మంరూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్‌ను సంప్రదించి హ త్య విషయమై వివరించాడు. వెంకట్ తన స్నేహి తుడు, రౌడీషీటర్ అయిన పగడాల విజయ్‌కుమార్ అలియాస్ చంటిని పరిచయం చేశాడు. హత్యకు రూ.20 లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్తను కిడ్నాప్ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి రూ.1,50,000 నగ దు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. కాగా, సదరు వ్యక్తి ఏప్రిల్ 11న ఖమ్మంఅర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సువర్ణాపురానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ కొండూరి రామాంజనేయులు, దంతాల వెంకటనారాయణ (కారుడ్రైవర్, బారుగూడెం, ఖమ్మంరూరల్), పగడాల విజయ్‌కుమార్ (చంటి – బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), వేముల కృష్ణ (బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), బుర్రి విజయ్ (డెకరేషన్ వర్కర్, బృందావన్‌కాలనీ పువ్వాడఅజయ్‌నగర్, ఖమ్మం) ఆదివారం నగర శివారులోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, ఒక ఎయిర్ గన్, రూ.90,000 నగదు, 5 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాష్ వివరించారు. -
మొక్కల రక్షకుడికి కన్నీటి వీడ్కోలు
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మంరూరల్: మొక్కల రక్షకుడు.. వృక్షాల ప్రేమికుడు వనజీవికి ఆదివారం కన్నీటి వీడ్కోలు పలికారు. పద్మశ్రీ దరిపల్లి రామయ్య పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు కవులు, కళాకారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులతో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వృక్ష సంపదను పెంచేందుకు రామయ్య చేసిన సేవలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అధికారిక లాంఛనాలతో రామయ్య అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు మొక్కలు నాటుతూ కడసారి వీడ్కోలు పలికారు. ఖమ్మంరూరల్ తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి రామయ్య పాడె మోశారు. ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సిబ్బందితో కలిసి వైకుంఠథామంలో మొక్కలు నాటి వందనం చేశారు. మొక్కల పెంపకం, రక్షణకు రామయ్య చేపట్టిన ప్రచార కార్యక్రమాల బోర్డులను ఆయన కుటుంబ సభ్యులు ధరించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అధికార లాంఛనాలతో వనజీవి అంత్యక్రియలు -
వ్యయప్రయాసలు
స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలేక..భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి దశాబ్దం కావొస్తున్నా జిల్లా కేంద్రంలో పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకన (స్పాట్ వాల్యూయేషన్)కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో మారుమూల ఏజెన్సీ దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు ఎగ్జామినర్లుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే స్పాట్‌కు వెళ్లి విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలు విన్నవించినా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వీడటంలేదు. ఏజెన్సీ ఉపాధ్యాయుల తిప్పలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి సుమారు 150 ఉపాధ్యాయులు వెళ్లి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మణగూరు, చర్ల వంటి మారుమూల ప్రాంత ఉపాధ్యాయులు ఖమ్మం వెళ్లి, అక్కడ వారు ఇచ్చే అలవెన్సులతో విధులను నిర్వర్తించడం భారంగా మారుతోంది. వసతి, భోజనం తదితర ఖర్చులకు ప్రభుత్వం అందచేసే రోజువారీ వేతనం సరిపోవటం లేదని ఎగ్జామినర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో స్పాట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే లాడ్జి, ఆహార ఖర్చుల ఆదాతో పాటు ఇంటి నుంచి వచ్చి వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూల్యాంకన కేంద్రానికి ప్రత్యేకంగా సెంటర్ కోడ్, అసిస్టెంట్ కమిషనర్, డెవలప్మెంట్ అధికారులు, కావాల్సిన ఇతర వసతులు ఉన్నాయి. అయినా మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన యాద్రాద్రి, సూర్యాపేట, సిరిసిల్ల వంటి జిల్లాల్లో స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారని, కానీ భద్రాద్రి జిల్లాలో ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కలెక్టర్, డీఈఓ స్పందించి జిల్లాలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఖమ్మంలోనే పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం దశాబ్దం కావొస్తున్నా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయని అధికారులు అలవెన్సులు సరిపోక ఏజెన్సీ ఉపాధ్యాయుల ఇక్కట్లు పదేళ్లు కావొస్తున్నా.. 2014లో జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. దీంతో ఐటీడీఏలో ఉన్న డీఈఓ పోస్టును జిల్లాకు కేటాయించి జిల్లా విద్యాశాఖ అధికారిని నియమించారు. పదో తరగతి, ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్ష పేపర్లను నిబంధనల ప్రకారం ఇక్కడే మూల్యాంకనం చేయాలి. జిల్లా ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా జిల్లా కేంద్రంలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షల పేపర్లు.. రెండింటిని ఇక్కడే మూల్యాంకనం చేయాలి. ఇందులో కేవలం సప్లిమెంటరీ పరీక్షలకు స్పాట్ సెంటర్‌ను 2017లో నిర్వహించినా అనంతరం మళ్లీ ఖమ్మం మార్చారు. గతంలో ఇంటర్ మీడియట్ పేపర్ల మూల్యాంకనం ఖమ్మం జిల్లాలోనే ఉండగా గతేడాది నుంచి భద్రాద్రి జిల్లా కేంద్రంలోనే నిర్వహిస్తున్నారు.ఎన్నిమార్లు విన్నవించినా... జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో మార్లు విన్నవించాం. అయినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల దూర ప్రాంతాల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – ఎస్.విజయ్‌కుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కొత్త జిల్లా కావడంతో.. మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు అన్ని వసతులు కావాలి. నిపుణులైన సిబ్బంది ఉండాలి. వీటి వల్ల ఆలస్యమైంది. మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. వచ్చే ఏడాదికి అనుమతులు వస్తే జిల్లా కేంద్రంలోనే స్పాట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. –ఎం.వెంకటేశ్వరాచారి, డీఈఓ -
విద్యుత్ అంతరాయాల తగ్గింపునకు చర్యలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యుత్ సరఫరాలో అంతరాయాల సమయం తగ్గించేందుకు 33 కేవీ, 11 కేవీ సుదూరమైన లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ జి.మహేందర్ తెలిపారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. బ్రేక్‌డౌన్ సమయంలో, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాల వల్ల లైన్ మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా విద్యుత్ అంతరాయం కలిగిన భాగాన్ని ఫాల్ట్ ఇండికేటర్ విభజిస్తుందని పేర్కొన్నారు. దీంతో అంతరాయం ఎక్కడ జరిగిందో వెంటనే విశ్లేషించి అక్కడికే వెళ్లి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. తద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 17–33 కేవీ, 47–11 కేవీ విద్యుత్ ఫీడర్లలో ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లను బిగించేందుకు సాంకేతికంగా 33 కేవీ లైన్లలో 35, 11కేవీ లైన్లలో 122 ప్రదేశాలను గుర్తించామన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ -
పడిపోతున్న బియ్యం కొనుగోళ్లు
పాల్వంచరూరల్: నిన్నామొన్నటి వరకు లాభాల పంట పండిన బియ్యం వ్యాపారం డీలా పడుతోంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం ప్రభావంతో కొనుగోళ్లు మందగిస్తున్నాయి. ఈ నెలలో గిరాకీ తగ్గిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లాలో సుమారు 300 పైనా బియ్యం దుకాణాలు ఉండగా, పాల్వంచలోనే 50కి పైగా బియ్యం దుకాణాలు ఉన్నాయని, అన్నింటా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వాపురం, అశ్వారావుపేట తదితర పట్టణాల్లో బియ్యం దుకాణాలు ఎక్కువగా ఉండగా, వాటిపై ఆధారపడి సుమారు 600 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్న విషయం విదితమే. ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున అందజేయడంతో లబ్ధిదారులు అందరూ తీసుకుంటున్నారు. పక్షం రోజులుగా తగ్గిన కొనుగోళ్లు ఈ నెల ఆరంభం నుంచి సన్న బియ్యం కొనుగోళ్లు తగ్గాయి. ప్రైవేట్ దుకాణాల్లో కేజీ సన్న బియ్యం కొత్తవి రూ.42కు పైగా విక్రయిస్తున్నారు. పాత బియ్యం కేజీ రూ.50 నుంచి రూ.55 చొప్పున అమ్ముతున్నారు. నూకలు కేజీ రూ.28 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో బియ్యం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని వ్యాపారాలు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు రూ.50 లక్షల వ్యయం కలిగిన 10 టన్నుల బియ్యం విక్రయించేవారమని, పక్షం రోజుల నుంచి క్వింటా బియ్యం కూడా అమ్ముడుపోవడం లేదని పేర్కొంటున్నారు. విక్రయాలపై సన్నబియ్యం పంపిణీ ప్రభావం గిరాకీ తగ్గిందని చెబుతున్న వ్యాపారులు కొనుగోళ్లు తగ్గాయి అనేక సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం చేస్తున్నాను. సాధారణంగా రోజుకు 5 నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యం విక్రయిస్తా. ఈ నెల 1 నుంచి రోజుకు రెండు క్వింటాలే అమ్ముడవుతున్నాయి. షాపు అద్దె రూ.10వేలు, వర్కర్‌కు రూ. 10 వేలు, కరెంట్ బిల్లు రూ. వెయ్యి ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు. –వెంకటేశ్వర్లు, బియ్యం వ్యాపారి -
ఆర్టీసీ.. ఆన్లైన్
సత్తుపల్లి టౌన్ : ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక బస్సుల్లో ప్రయాణికులు, కండక్టర్లు టికెట్ల సమయంలో ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలకు తెరపడనుంది. ఖమ్మం రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఆర్టీసీ డిపోల్లోని రిజర్వేషన్ బస్సుల్లో ఐ–టిమ్స్‌ను ప్రవేశపెట్టారు. రీజియన్‌లో 530 బస్సులు ఉండగా.. 40 రాజధాని బస్సులు, 75 సూపర్‌లగ్జరీ బస్సులు, 10 లహరి బస్సుల్లో తొలివిడతగా డిజిటల్ చెల్లింపు విధానం ప్రారంభమైంది. నూతన సాఫ్ట్వేర్ అనుసంధానంతో.. రిజర్వేషన్ బస్సుల్లో ఉన్న పాత టిమ్‌ల స్థానంలో ప్రస్తుతం ఛలోయాప్ పేరిట నూతన సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేసిన కొత్త ఐ–టిమ్ మిషన్(ఇంటర్నెట్ టికెట్ ఇస్యూ యింగ్ మిషన్)లు అందుబాటులోకి వచ్చాయి. క్యూఆర్ కోడ్‌తో.. ఈ బస్సుల్లో టిమ్ మిషన్‌లోని క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి మొబైల్ యాప్‌లతో స్కానింగ్ చేసి నేరుగా టికెట్ చార్జీలను చెల్లించవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించే విధంగా ఆధునిక టిమ్ యంత్రాలను రిజర్వేషన్ బస్సుల్లో ప్రవేశపెట్టారు. త్వరలో రీజియన్‌లోని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో సైతం ఈ నగదు రహిత చెల్లింపు విధానం అమలుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది.డిపో ఐ – టిమ్స్ బస్సులు సత్తుపల్లి 22ఖమ్మం 43కొత్తగూడెం 08భద్రాచలం 31మణుగూరు 22మధిర 07 క్యూ ఆర్ కోడ్‌తో బస్సుల్లో చెల్లింపులు రిజర్వేషన్ బస్సుల్లో అందుబాటులోకి ఐ – టిమ్స్ డిజిటల్ చెల్లింపులతో నగదు లేకున్నా బేఫికర్అన్ని బస్సుల్లో అమలు చేస్తాం డిజిటల్ పేమెంట్లతో ఐ టిమ్ మిషన్లను రిజర్వేషన్ బస్సుల్లో ప్రవేశపెట్టాం. ఇది ప్రయాణీకులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. చిల్లర సమస్య ఉండదు. ఏ సర్వీస్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయో, ప్రతీది రికార్డ్ అవుతుంది. నగదుతో పాటు, నగదు రహిత సేవలను అన్ని బస్సుల్లో అమలు చేస్తాం. – సరిరామ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఖమ్మం -
వణికిస్తున్న వరుణుడు
ఉరుములు మెరుపులతో భారీ వర్షం పాల్వంచరూరల్/అశ్వాపురం/గుండాల/చండ్రుగొండ/దుమ్ముగూడెం: పలుచోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేక చోట్ల రాళ్లు పడ్డాయి. గాలిదుమారానికి పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రైతులు పరదాలు కప్పి ఉంచారు. కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో చేతికి వచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలిదుమారంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాల్వంచ మండలం సోములగూడెం, జగన్నాథపురం, నాగారం, పాండురంగాపురం, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో వర్షం కురవడంతో వీధుల్లో వరద ప్రవహించింది. చండ్రుగొండ మండలంలో కోత దశలో ఉన్న మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో రాళ్ల వర్షం కురిసింది. గాలిదుమారానికి మొక్కజొన్న చేన్లు నేలవాలాయి. గత వర్షాలకు నేలమట్టమైన మొక్కజొన్న చేన్లు ఇప్పుడిప్పుడే కొద్దిగా పైకి లేస్తున్నాయని, మళ్లీ గాలి దుమారంతో పూర్తిగా పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులకు దుమ్ముగూడెం మండలంలోని శ్రీనగర్ కాలనీ గ్రామానికి చెందిన జిలకర రమేష్ రేకులషెడ్డు ఇల్లు కూలి పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఈదురుగాలులు, వర్షానికి అశ్వాపురం మండలం తుమ్మలచెరువు ఆయకట్టు కింద కోతకు వచ్చిన వరిపొలాలు నేలవాలాయి.బూర్గంపాడు: యాసంగి పంట చేతికి వచ్చే సమయంలో అన్నదాతలను వరుణుడు వణికిస్తున్నాడు. పదిరోజులుగా జిల్లాలో ఏదో ప్రాంతంలో గాలి దుమారంతో కూడిన వానలు పడుతున్నాయి. ప్రస్తుతం యాసంగి వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, కోసిన ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెడుతున్నారు. రోజూ సాయంత్రం వాన పడుతుండటంతో ఆరబోసిన ధాన్యం కుప్ప నూర్పి పరదాలు కప్పి కాపాడుకుంటున్నారు. మళ్లీ ఉదయం ఆరబోసుకుంటున్నారు. పగలంతా తీవ్రమైన ఎండలు, సాయంత్రం గాలి దుమారంతో కూడిన వర్షాలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలుగా తరలిద్దామంటే తేమశాతం ఎక్కువగా ఉందని, అక్కడ కొనుగోళ్లు జరగటం లేదు. దీంతో విసుగు చెంది రైతులు తక్కువ ధరలకే మిల్లర్లకు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం గాలి దుమారంతో కూడిన వాన పడింది. పాల్వంచ, గుండాల, కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురిసింది. అశ్వాపురం మండలంలో కొన్నిచోట్ల వడగాళ్ల వానలు కూడా పడ్డాయి. రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులతో వెళ్లి టార్పాలిన్లు కప్పుకున్నారు. బూర్గంపాడు మార్కెట్‌యార్డులో ఆరబెట్టిన ధాన్యంపై వర్షంలోనే పరదాలు కప్పుకున్నారు. యార్డులోని సిమెంట్ ప్లాట్‌ఫామ్‌లపై వచ్చే వరదను రాశుల కిందకు రాకుండా వరిపొట్టుతో కట్టలు వేసుకున్నారు. జిల్లాలో పది రోజులుగా గాలివానలు ముమ్మరంగా సాగుతున్న వరికోతలు ధాన్యం కాపాడుకునేందుకు అన్నదాతల ఉరుకులు పరుగులు -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు విశేష పూజలు జరిపారు. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైకోర్టు జడ్జి శరత్‌ను కలిసిన కలెక్టర్ జితేష్బూర్గంపాడు: హైకోర్టు జడ్జి శరత్‌ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. భద్రాచలం వచ్చిన న్యాయమూర్తిని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కలిశారు. జిల్లాలోని పరిస్థితులపై వారు కొద్దిసేపు ముచ్చటించారు. వెంకన్న సన్నిధిలో నూజివీడు జడ్జి పూజలుఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఏపీలోని నూజివీడు స్పెషల్ కోర్డు న్యాయమూర్తి జస్టిస్ వి. కృష్ణమూర్తి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు శాస్త్రోక్తంగా ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదం అందించి ఆశీర్వదించారు. నేటి ప్రజావాణి రద్దుసూపర్బజార్(కొత్తగూడెం): డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం సెలవు కావడంలో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈవిషయాన్ని గమనించి దరఖాస్తులు అంజేయడానికి కలెక్టేట్‌కు రావొద్దని కలెక్టర్ సూచించారు. నేటి గిరిజన దర్బార్ రద్దుభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమాన్ని ప్రభుత్వ సెలవు రోజు కావడంతో రద్దు చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలోని యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండరని, గిరిజనులు గమనించి అర్జీలు సమర్పించేందుకు కార్యాలయానికి రావద్దని పేర్కొన్నారు. పర్యాటకుల జలవిహారంపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 362 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్‌లైఫ్ శాఖ రూ.13,285 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,180 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
రైస్ పుల్లింగ్ మిషన్ పేరుతో బురిడీ
బూర్గంపాడు: రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకానికి ఉందని మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం బూర్గంపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ రాజేశ్ కథనం ప్రకారం.. శనివారం సిబ్బందితో సారపాకలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా.. అదుపులోకి తీసుకుని విచారించడంతో రైస్ పుల్లింగ్ మిషన్ ఉందని నమ్మించి పలువురిని మోసగించామని ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో చర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన కొమరం రాజబాబు వద్ద రూ.లక్ష తీసుకున్నారు. అతను రైస్ పుల్లింగ్ మిషన్ అడుగగా మరో రూ.లక్ష కావాలని డిమాండ్ చేయగా.. జనవరి 25న రాజబాబు డబ్బుతో మండలంలోని క్రాస్‌రోడ్డు వద్దకు వచ్చాడు. ఈ ముఠా రాజబాబును కొట్టి రూ.లక్ష తీసుకుని కారులో పరారైంది. వీరితో పాటు జంగారెడ్డిగూడెంనకు చెందిన నారాయణ ఉన్నారు. కాగా, భద్రాచలంలో కొందరిని కలిసి రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకానికి ఉందని నమ్మించి మోసగించేందుకు యత్నిస్తున్న ఈ ముఠా సారపాకలో పోలీసులకు పట్టుబడింది. ఈ ముఠాలో పాల్వంచలోని తెలంగాణనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ దొనకొండ సురేశ్‌బాబు, భద్రాచలం పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ అబ్దుల్ రవూఫ్, చర్ల మండలం విజయకాలనీకి చెందిన టైలర్ ఉర్ల శ్రీనివాసరావు ఉన్నారు. జంగారెడ్డిగూడెంనకు చెందిన నారాయణ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ.1.90 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్ఐ వెల్లడించారు. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
పాల్వంచ: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. శనివారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో సీఐ సుంకరి రమేశ్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పుణె జిల్లా, ధౌండ్ తాలూకా, పింపల్గాం గ్రామానికి చెందిన సాగర్ హరిదాస్ దోబ్లే, నీలేశ్, కిషోర్ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ ధరకు గంజాయిని ఒడిశాలోని మల్కన్‌గిరిలో కొనుగోలు చేసి కారులో అమర్చారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా పుణెకు తరలిస్తుండగా పాల్వంచ వద్ద ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకరి రమేశ్, హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకటేశ్, విజయ్‌కుమార్, ఉపేందర్ పట్టుకున్నారు. కారులో ఉన్న 51.27 కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.28.80 లక్షలు, అన్ని వస్తువులు కలిపి రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను సీఐ ప్రసాద్‌కు అప్పగించారు. రూ.28.80 లక్షల గంజాయి, కారు స్వాధీనం -
● బతుకుబండి సాగుతోంది..
పాత బైక్‌తో ఐస్ క్రీమ్ వ్యాపారం కరకగూడెం: కష్టపడి పనిచేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. సృజనాత్మకతతో పాత ద్విచక్రవాహనం ముందు భాగంలో ఉండే చక్రాన్ని తొలగించి దాని స్థానంలో రెండు చక్రాల ఐస్ క్రీమ్ బండిని అమర్చుకొని ఊరూరు తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు. రంగురంగుల కాగితాలు, బొమ్మలతో బండిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి రోజుకు మంచి ఆదాయం పొందుతున్నాడు. ఈ యువకుడి కృషిని అందరూ అభినందిస్తున్నారు. -
నేడు రాత పరీక్షలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న కెమిస్ట్–1, ఈ గ్రేడ్–1, సెక్యూరిటీ జమేదార్ టీఎస్ గ్రేడ్–26 పోస్టులకు ఈ నెల 13న సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. కెమిస్ట్–1, ఈ గ్రేడ్–1 పోస్టుకు 13 మంది దరఖాస్తు చేసుకోగా, జమేదార్ పోస్టులకు 78 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి యాజమాన్యం హాల్ టికెట్లు పంపిణీ చేసింది. ఈ నెల 13న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఐఎన్టీయూసీ నేతకు వినతి మణుగూరుటౌన్: జేఏంఓల ప్రమోషన్ పాలసీలో మార్పులు చేయాలని కోరుతూ.. ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు శనివారం ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ–1 గ్రేడ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంటేనే జేఎంఓ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉందని, ఏ–1 గ్రేడ్‌కు రావడానికి ఉద్యోగులకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. ఉద్యోగ విరమణ దశలో అర్హత పొందుతున్నారని, ఫలితంగా గత నోటిఫికేషన్లో 87 పోస్టులకు గాను 15 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది ఎంపికయ్యారన్నారు. సమస్యను గుర్తించి త్వరితగతిన నోటిఫికేషన్ జారీ అయ్యేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్యయాదవ్, జయరాజు, దారా సుకుమార్ ఉన్నారు. బెల్లం, పటిక పట్టివేత కొత్తగూడెంఅర్బన్: నిషేధిత నాటుసారాయికి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా శనివారం కొత్తగూడెం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ జయశ్రీ, ఎస్ఐ శ్రీహరిరావు కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని పెద్దబజార్లో బెల్లం ఉందనే సమాచారంతో ఎకై ్సజ్ ఎస్ఐ శ్రీహరిరావు తన సిబ్బందితో దాడి చేసి, ట్రాలీలో ఉన్న 360 కేజీల బెల్లం, 15 కేజీల స్పటికం పట్టుకున్నారు. ట్రాలీని ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించి, బెల్లం కొనుగోలు చేసిన రాంకుమార్, డ్రైవర్ మంగీలాల్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నది పెద్ద వాహనమని, సమాచారం వెల్లడించే సమయంలో చిన్న వాహనం చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు షురూ.. కొణిజర్ల: మండలంలోని తనికెళ్లలో ఐదు రాష్ట్రాలస్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత దుమ్ముగూడెం: మండలంలోని చిన్ననల్లబల్లి అటవీ శాఖ చెక్‌పోస్టు మీదుగా ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న కలపను సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు పరిశీలిస్తుండగా కలప పట్టుబడింది. ఈ మేరకు ట్రాక్టర్‌ను అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించగా, కలప విలువ రూ.లక్ష వరకు ఉండొచ్చని తెలిసింది. గుండెపోటుతో యువకుడు మృతి ఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు ఏరియాకు చెందిన లోదు కార్తీక్సోనూ (24) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. అయితే, ఆయన అస్వస్థతకు గురికాగానే కుటుంబీకులు, స్నేహితులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉన్నందున కొత్తగూడెం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ కుటుంబీకుల వినతితో వైద్యం చేస్తుండగానే కార్తీక్ మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబీకులు వైద్యుడిని నిలదీయగా ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలిసి సీఐ మత్తుల సత్యనారాయణ చేరుకుని నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు. క్రికెట్ ఆడుతూ కుప్పకూలి... ఇల్లెందు: బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఇల్లెందు సబ్‌జైల్ బస్తీకి చెందిన ఆంటోనీ విమల్ (30) గుండెపోటుతో మృతి చెందారు. మరికొందరు ఉద్యోగులతో కలిసి ఆయన అక్కడ శనివారం క్రికెట్ ఆడుతూనే కుప్పకూలినట్లు తెలిసింది. ఈ విషయమై అందిన సమాచారంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఆడపిల్లలు పుట్టారని అక్రమంగా దత్తత?
చింతకాని: మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు.. మూడో కాన్పులోనూ ఆడపిల్ల అని తెలియగా అబార్షన్ చేయించడమే కాక.. నాలుగో కాన్పులో కవల ఆడ శిశువుల జన్మించడంతో శిశువులను బంధువులకు దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ విషయం తెలిసి ఐసీడీఎస్ అధికారులు శిశువుల ఆచూకీపై ఆరా తీస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీకి చెందిన నల్లగాజు మల్లేష్ – ఉమ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మూడో కాన్పులోనూ గర్భంలో ఆడపిల్ల పెరుగుతోందని తెలియగా ఉమ అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చగా గత నెల 31న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో కవల శిశువులను ఆస్పత్రిలోనే ఉమ తన అక్కకు దత్తత ఇచ్చేసి ఇంటికి వచ్చారు. మూడు రోజుల క్రితం ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కలిసి ఉమ, శిశువు ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లగా శిశువులు కానరాలేదు. ఏమైందని ఆరా తీయగా పోషించలేకనే బంధువులకు దత్తత ఇచ్చామని బదులిచ్చారు. అనంతరం ఐసీడీఎస్ సీడీపీఓ కమలప్రియ, ఏసీడీపీఓ శివకుమారి, సూపర్వైజర్ పద్మావతి కలిసి మల్లేష్ ఇంటికి వెళ్లగా ఆయన ‘మా పిల్లలు మా ఇష్టం.. ఏమైనా చేసుకుంటాం.. అడగానికి మీరెవరు’ అంటూ దురుసుగా సమాధానం చెప్పారు. చట్టానికి లోబడి దత్తత ఇవ్వాలని, అలాకాకుండా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఉంటున్న ఉమ అక్కకు పిల్లలను దత్తత ఇచ్చామని, సోమవారం వరకు తీసుకొస్తామని, లేనిపక్షంలో ఏ చర్యలైనా తీసుకోవచ్చని లేఖ రాసి ఇచ్చారు. కాగా, ఐసీడీఎస్ అధికారులకు వీడియో కాల్ ద్వారా కవల ఆడ శిశువులను చూపించారు. ఆలస్యంగా బయటపడడంతో అధికారుల విచారణ -
అగ్నిప్రమాదాలతో జాగ్రత్త
రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ●● జిల్లాలో ఐదు ఫైర్స్టేషన్లు ● ప్రమాదం జరిగితే డయల్–101కు సమాచారం ఇవ్వాలి కొత్తగూడెంటౌన్: వేసవికాలం వస్తే అగ్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. గ్రామీణ ప్రాంతాల్లో గడ్డివాములు, గుడిసెల్లో పంటలు కోసిన తర్వాత వాటికి నిప్పు పెట్టే విషయంలో అజాగ్రత్తగా ఉంటే నిప్పు రవ్వలు ఎగసిపడి ఇతర ఇళ్లకు అంటుకుని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి మురహరి క్రాంతికుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదాల నుంచి ఎలా బయట పడాలి, ఎలా రక్షించుకోవాలనే విషయాలను ప్రాక్టికల్‌గా డ్రిల్ చేసి అవగాహన కల్పిస్తారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట ఫైర్ స్టేషన్ల పరిధిలో 51 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 28 మంది ఉన్నారు. మరో 23 మంది కొరత ఉంది. 1944లో ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్ యార్డ్‌లోని నౌకలో అగ్ని ప్రమాదం సంభవించగా, విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారు. వారి జ్ఞాపకార్థం వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మూడేళ్లలో జరిగిన ఘటనలు.. ● 2022లో మొత్తం 351 అగ్ని ప్రమాదాలు సంభవించగా.. రూ.2,62,4000 నష్టం వాటిల్లింది. 62 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2023లో మొత్తం 265 అగ్నిప్రమాదాలు జరగగా రూ.32,19,6000 నష్టం జరిగింది. రూ.15,31,64000 సొత్తును రక్షించారు. 77 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2024లో మొత్తం 232 అగ్నిప్రమాదాలు సంభవించాయి. రూ.07,38,10,000 నష్టం వాటిల్లింది. 66 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2025లో మార్చి వరకు మొత్తం124 అగ్నిప్రమాదాలు జరిగాయి. రూ.1,12,40,007 నష్టం జరిగింది. 66 ఘటనల్లో మనుషులు, పశువును రక్షించారు. డయల్101కి సమాచారం ఇవ్వాలి ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మూడేళ్లలో 972 ప్రమాదాలు సంభవించగా దాదాపు రూ.13,88,70,007 ఆస్తులకు నష్టం వాటిల్లింది. జిల్లాలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్నతాధికారులకు అధికారులకు నివేదిస్తాం. ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే డయల్–101కు సమాచారం ఇవ్వాలి. మురహరి క్రాంతికుమార్, డీఎఫ్ఓ ఈ సూత్రాలు పాటించాలి.. అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, దుకాణ సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. అపార్డుమెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌మాళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతి ప్లాట్‌కు నీరు అందేలా పైపులైన్‌ను ఏర్పాటు చేయాలి. షాపుల్లో మండే స్వభావం ఉన్న వస్తువులను పెట్టకూడదు ఇంట్లో ఉండే సిలిండర్లకు వేడి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇళ్లల్లో, షాపుల్లో వెంటిలేషన్‌ను సరిగ్గా ఉండేలా చూడాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. గృహాలు, రైస్‌మిల్లులు, ఆఫీసులు, దుకాణాల్లో నాణ్యమైన కరెంట్ వైరింగ్ చేయించుకోవాలి. -
పాత ఇనుప దుకాణంలో అగ్నిప్రమాదం
పాల్వంచ: పాత ఇనుమ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని తెలంగాణనగర్ వద్ద గల బీఎల్ నాయుడుకు చెందిన పాత ఇనుప దుకాణం యార్ద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సిగరేట్ తాగి పడేయడంతో చెత్తకు అంటుకుని మంటలు చెలరేగాయి. స్క్రాప్‌నకు వచ్చిన సుమారు పది కార్లకు నిప్పంటుకుని భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ ఆఫీసర్ పుల్లయ్య ఆధ్వర్యంలో సిబ్బంది ఆయూబ్, ఉదయ్, ప్రతాప్, వెంకటేశ్వర్లు మంటలను ఆర్పివేశారు. కారు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతిపాల్వంచరూరల్: ద్విచక్రవాహనంపై రిటైర్డ్ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన, భద్రాచలం ఐటీడీఏ ఈఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన కటుకూరి నాగభూషణం (63) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఎదురుగా భద్రాచలంవైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగభూషణాన్ని ఖమ్మం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కోయిల విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. మృతుడికి భార్య పవిత్ర, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెంలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండాల మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇర్ప కృష్ణ (40) మృతిచెందాడు. ఎల్లాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరైన కృష్ణ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కొమరారం పోలీసులు కృష్ణను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే కృష్ణ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ తెలిపారు. సివిల్ లైన్లో చోరీ.. ఇల్లెందు: పట్టణంలోని సివిల్లైన్లో పెద్దపల్లి కుమారస్వామికి చెందిన ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు కుమారస్వామి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పరిశీలించారు. 18 తులాల బంగారం, రెండు జతల వెండి పట్టీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. -
బ్రహ్మోత్సవాలు ‘పరిపూర్ణం’
భద్రాచలం వద్ద గోదావరిలో వైభవంగా చక్రస్నానంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో గత నెల 30న ప్రారంభమైన వసంత ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం స్వామివారి సుదర్శన చక్రానికి చక్రస్నానం కమనీయంగా జరిపారు. సుదర్శన చక్రాన్ని, ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పవిత్ర గోదావరి వద్దనున్న పునర్వసు మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు మండపంలో స్నపన తిరుమంజనం, హారతి సమర్పించారు. అనంతరం గోదావరిలో సుదర్శన చక్రానికి సంప్రదాయబద్ధంగా చక్రస్నానం జరిపారు. సాయంత్రం ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు నిర్వహించారు. యాగశాలలో పుష్పయాగం, పూర్ణాహుతిలతో బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేశారు. సాయంత్రం శేష వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ గావించారు. ఈ పూజల్లో ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామాలయంలో భక్తుల రద్దీ వరుస సెలవుల నేపథ్యంలో శనివారం రామాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మూడు రోజుల సెలవులతోపాటు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో హనుమాన్ మాలధారులు భద్రగిరికి తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకోగా, మాలధారులు మాల విరమణ గావించారు. నేటి నుంచి నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బేడా మండపంలో నిలిపివేసిన నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. స్వామివారి నూతన పర్యంకోత్సవం ఈ నెల 22వ తేదీన జరపనున్నారు. పవళింపు సేవలు కూడా అదే రోజు నుంచి నిర్వహించనున్నారు. ఆదివారం చిత్తనక్షత్రం సందర్భంగా సుదర్శన హోమ పూజలను జరుపుతారు. -
సవాళ్లను స్వీకరించారు
● మైనింగ్ రంగంలో మహిళా ఇంజనీర్లు ● భూగర్భ గనుల్లో మేనేజ్మెంట్ ట్రైనీలు ● సింగరేణిలో 38 మంది అధికారిణులుపోలీస్ చేతిలో లాఠీలా ఈ మహిళల చేతిలో కనిపించే ఊత కర్రను బంటన్ స్టిక్ అంటారు. భూగర్భ గనుల్లోకి వెళ్లినప్పుడు ఈ కర్రతో పైకప్పును కొట్టడం ద్వారా ఆ ప్రదేశం పనికి అనుకూలంగా ఉంది లేనిది గుర్తిస్తారు. అయితే నిన్నామొన్నటి వరకు ఈ స్టిక్ పట్టుకునే హక్కు పురుషులదే. కఠినమైన పరిస్థితులు ఉండే భూగర్భ గనుల్లో ఈ పని చేయలేరంటూ ఈ అవకాశం మహిళలకు ఇవ్వలేదు. అదంతా కాలం చెల్లిన అభిప్రాయమని నిరూపిస్తున్నారు ఈ యంగ్ విమెన్ మైనర్స్. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంనో చాన్స్ దేశంలో బొగ్గు తవ్వకాలకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం పురుషులతో సమానంగా మహిళలకు గనుల్లో పని చేశారు. పని ప్రదేశాల్లో ఉండే కఠినమైన పరిస్థితులు, మహిళల భద్రత దృష్ట్యా స్వాతంత్య్రం వచ్చాక గనుల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పించడంపై చట్టపరంగా నిషేధించారు. ఆ ప్రభావం సింగరేణిపై కూడా పడింది. దీంతో 2000 ఆరంభం వచ్చే సరికి నర్సులు, డాక్టర్లు, క్లరికల్ పోస్టులు తప్పితే మిగిలిన చోట్ల మహిళలకు అవకాశమే లేకుండా పోయింది. 2017 తర్వాత కారుణ్య నియామకాల ద్వారా మరికొందరికి అవకాశం దక్కినా అవి కూడా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకే పరిమితమయ్యాయి. భిన్నమైన మార్గంలో సింగరేణి బొగ్గు గనులను దృష్టిలో ఉంచుకుని 1970వ దశకంలో కొత్తగూడెంలో మైనింగ్ కాలేజీ ప్రారంభమైంది. దశాబ్దాల పాటు ఈ కాలేజీలో బాలికలకు ప్రవేశం ఇవ్వలేదు. 2013లో తొలిసారిగా ఇంజనీరింగ్ మైనింగ్ బ్రాంచిలో మహిళలకు ప్రవేశం కల్పించారు. తొలి బ్యాచ్‌లో ఐదుగురు, రెండో బ్యాచ్‌లో ఏడుగురు చేరారు. అలా చేరిన, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కృష్ణవేణి అందరిలా కాకుండా సవాల్ విసిరుతూ మైనింగ్ రంగంలోకి వచ్చింది. బంధువులు, స్నేహితులు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్ వరకు బ్రాంచి మార్చుకోవాలంటూ సూచించారు. కానీ ఐదుగురు బాలికలు స్థిరంగా నిలబడ్డారు. దీంతో మైనింగ్ కోర్సు మహిళలకు కూడా అనే భావనకు బలం వచ్చింది. ఆ మరుసటి ఏడాది బ్యాచ్‌లో కొత్తగూడెం పట్టణానికే చెందిన రమ్యశ్రీ చేరింది. చిన్నప్పటి నుంచి సింగరేణి వాతావరణంలో పెరగడంతో ఇందులోనే కెరీర్ ఎంచుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత బ్యాచ్‌లో అనుపమ వచ్చి చేరింది. అలా మైనింగ్ కోర్సులో అడ్మిషన్లు తీసుకునే బాలికల సంఖ్య నిలకడగా ఉంటూ వస్తోంది. ఆ ఫలితంగానే కేఎస్ఎం, జేఎన్టీయూ (మంథని)తో పాటు మరో ఐదు ప్రైవేటు కాలేజీలు సైతం మైనింగ్ కోర్సును మహిళలకు ఆఫర్ చేస్తున్నాయి. అడ్డంకులు దాటుకుని.. మహిళలు మైనింగ్ ఇంజనీరింగ్ చదవడమేంటనే మాటలు వింటూనే కోర్సు పూర్తి చేశారు. అప్పటికీ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో మహిళా ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా విమెన్ మైనింగ్ గ్రాడ్యుయేట్లు వెనక్కి తగ్గలేదు. ప్రైవేటు కంపెనీల్లో ఆఫర్లు వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు వెళ్లారు. సాధారణంగా గనుల తవ్వకాలు జరిగే ప్రదేశాలు చాలా వరకు రిమోట్ ఏరియాలుగానే ఉంటాయి. రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదు. దుమ్ము ధూళి ఎక్కువ. ఎండా వానలు లెక్క చేయకుండా పని చేయాలి. దీనికి తోడు బయటి రాష్ట్రాల్లో ఉండే భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లు విభిన్నం. అయినా వారు వెరవలేదు. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే మైనింగ్ ఇండస్ట్రీలో సమర్థంగా పని చేశారు. మైనింగ్ ఫీల్డ్ ఒక్కటే కాదు ఆహారం, సంస్కృతి, కాలుష్యం ఏవీ తమ పట్టుదల ముందు దిగదుడుపే అని నిరూపించారు. సగర్వంగా నిలిచారు గనుల్లో మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం తొలిసారిగా 2024లో జారీ చేసిన నోటిఫికేషన్లో మేనేజ్మెంట్ ట్రైనీలుగా మహిళలకు సింగరేణి అవకాశం కల్పించింది. దీంతో ఒక్కసారే 38 మంది ఇంజనీర్లు గనుల్లో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. వీరంతా సింగరేణిలోని వివిధ ఏరియాల్లో సమర్థంగా విధులు నిర్వహిస్తూ హమ్ కిసీ సే కమ్ నహీ అంటూ భవిష్యత్ తరాలకు బాటలు వేస్తున్నారు. దృక్పథం మారాలి ఒక అబ్బాయి ఏదైనా పని చేయడంలో విఫలమైతే కేవలం ఆ అబ్బాయి ఒక్కడే విఫలం అయ్యాడు అని అంటారు. అదే ఎవరైనా ఒక అమ్మాయి ఒక పని చేయడంలో తడబడితే చాలు, అమ్మాయిలంతా ఇంతే, ఏ పని చేయలేరంటూ ముద్ర వేస్తారు. ఈ ఆలోచన తీరులో మార్పు రావాలి. – కృష్ణవేణిమొదట్లో వినేవాళ్లు కాదు మేనేజ్మెంట్ ట్రైనీలుగా మా సూచనలు పాటించేందుకు కార్మికులు మొదట్లో సందేహించే వారు. మేము ఎంత విపులంగా చెప్పినా పురుష అధికారుల దగ్గరకు వెళ్లి కన్ఫర్మ్ చేసుకునే వాళ్లు. కానీ త్వరగానే మార్పు వచ్చింది. మహిళా అధికారులకు మద్దతు పెరిగింది. – రమ్యశ్రీ -
మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● మణుగూరులో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం బూర్గంపాడు/అశ్వాపురం/మణుగూరుటౌన్/ కరకగూడెం/పినపాక: మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పినపాక నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మణుగూరు మండలం కూనవరంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే విద్య ప్రాముఖ్యతను చాటారని పేర్కొన్నారు. మణుగూరు డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.4.33 కోట్లతో నిర్మించనున్న 30 అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రామానుజవరం–గొల్ల కొత్తూరు పీతురు వాగుపై రూ.1.90 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు, పగిడేరు–రామానుజవరం మార్గంలో పగిడేరు వాగుపై రూ.1.50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వాపురం మండలం బీజీకొత్తూరు స్టేజీ నుంచి గ్రామానికి రూ.63 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, జగ్గారంలో జగ్గారం నుంచి కుర్సంవారిగూడెం వరకు రూ.1.92 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. జగ్గారంలో అభయాంజనేయస్వామి ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ పూజలు చేశారు. బూర్గంపాడు– సోంపల్లి గ్రామాల మధ్య రూ.90 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, బూర్గంపాడులోని గౌతమిపురం వద్ద బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక మండలంలో సుమారు రూ. 4 కోట్లతో నిర్మించునున్న బీటీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. మల్లారం గ్రామంలో చిలకమ్మ దేవాలయ అభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుడు రామనాథానికి ఆర్థికసాయం చేశారు. కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామ బొడ్రాయి వద్ద నుంచి సమీపంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. స్వార్థ రాజకీయాలకు చిరునామా బీజేపీ బీజేపీ స్వార్థ రాజకీయాలకు చిరునామా అని, రాజ్యాంగ వ్యవస్థలను తన స్వార్థానికి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని, ఏఐసీసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమం ఏడాదిపాటు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, త్వరలోనే నూతన అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందిస్తామని అన్నారు. కాగా గోదావరి వరద ముంపు నుంచి బూర్గంపాడు మండలాన్ని కాపాడాలని, బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని, మద్యం తాగి విధులకు హాజరవుతున్నారని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో మానుకోట ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, తుక్కాని మధుసూదన్‌రెడ్డి, బేతం రామకృష్ణ, కమటం నరేష్, ఓరుగంటి భిక్షమయ్య, పోలేబోయిన శ్రీవాణి, చందా సంతోష్, బట్టా విజయ్‌గాంధీ, పీరినాకి నవీన్, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పోలెబోయిన తిరుపతయ్య, ఎర్ర సురేష్, కాటబోయిన నాగేశ్వరరావు, శివ, సామా శ్రీనివాసరెడ్డి, రవి, అబ్దుల్లా, సర్వేశ్వరరావు సీపీఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి భూ భారతి చట్టం అమలు భూ సమస్యల పరిష్కారానికి ఈనెల 14 నుంచి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెస్త్నుట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ, ఇప్పుడూ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే గిరిజన ప్రాంతానికి సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చే జూన్ 2 నుంచి నియోజకవర్గానికి 4, 5 వేల మంది లబ్ధిదారులకు చేయూతనిచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 14 నెలల్లోనే పినపాక నియోజకవర్గంలో రూ.30కోట్ల మేర రోడ్లు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నేతృత్వంలో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు విజయవంతం చేశారని, శభాష్ రాహుల్ అంటూ అశ్వాపురం మండలం బీజీకొత్తూరు వద్ద ఐటీడీఏ పీఓను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. -
సమ్మర్ క్యాంపులు..
సర్కారు స్కూళ్లలో ప్రణాళికలు రూపొందిస్తున్న విద్యాశాఖ అధికారులు ● వివిధ రకాల క్రీడల్లో, యోగా శిక్షణకు ఏర్పాట్లు.. ● ప్రైమరీలో రీడింగ్, రైటింగ్ నైపుణ్యం పెంచే చర్యలు ● వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 23వ తేదీతో విద్యా సంవత్సరం ముగియనుండగా, 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఫైనల్ ఎస్ఏ–2 పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో పాఠశాలల్లోనే సమ్మర్ క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. సమ్మర్ క్యాంపుల్లో గతంలో యోగా శిక్షణ ఇచ్చేవారు. ఈయేడాది అన్ని రకాల క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పాఠశాలలో రూ.20 వేల విలువైన అన్ని రకాల క్రీడా పరికరాలు వచ్చి ఉన్నాయి. క్రీడల నిర్వహణ, శిక్షకుల, ఎలా శిక్షణ ఇవ్వాలి తదితర అంశాలపై ఎంఈఓలు, హెచ్ఎంలతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సమ్మర్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠ్యంశాలు, బోధనలు లేని క్రీడలతో పాటుగా వినోదాత్మక అంశాలను కూడా జోడించి క్యాంపులు నిర్వహించనున్నారు. దీంతో వేసవి సెలవుల్లో కూడా పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. విత్తనాల సేకరణకు ప్రత్యేక బహుమతులు ఈ నెల 24 నుంచి వేసవి సెలవుల్లో విద్యార్థులు విత్తనాలు సేకరించాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సూచించారు. పూలు, పండ్లు, ఆకుకూరలకు సంబంధించిన విత్తనాలను సేకరించి, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాక ఆ విత్తనాలను పాఠశాలలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎక్కువగా విత్తనాలు సేకరించిన విద్యార్థులు, పాఠశాలలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించనున్నారు. సేకరించిన విత్తనాలను ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి అడవుల్లో చల్లే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు.. జిల్లాలో 1,299 ప్రభుత్వ పాఠశాలల్లో 63,399 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ సమ్మర్ క్యాంపులు జరిగే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం పెంచేందుకు రీడింగ్, రైటింగ్ నోట్ పుస్తకాలను అందజేయనున్నారు. ఇళ్ల వద్దనే రీడింగ్, రైటింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైమరీ విద్యార్థులు వారు ఆడేగలిగే క్రీడల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్, షటిల్, ఫుట్‌బాల్, చెస్ వంటి క్రీడలు నిర్వహించనున్నారు. ఎండదెబ్బ తగలకుండా విద్యార్థులకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాల్లో ఉన్న ఎల్ఈడీ టీవీల్లో విద్యార్థులకు ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను సైతం ప్రదర్శించనున్నారు. ఇక ఉపాధి హామీ కార్మికులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నారు. నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టనున్నారు. -
కనుల పండువగా..
● ఆకట్టుకున్న సీతారాముల వసంతోత్సవం ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలుభద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరాయి. శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం బ్రహ్మోత్సవాలలో నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపటం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం రంగుల హోళీగా భావించే వసంతోత్సవం కనుల పండువగా జరిపారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన బేడా మండపంలో నిత్యకల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. అర్చకులు విశ్వక్షేన పూజ, పుణ్యావాచనం తదితర ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. తొలుత మూలమూర్తులకు, అనంతరం లక్ష్మీ అమ్మవారికి, ఆండాళ్ అమ్మవారికి, భద్రుని గుడి, ఆంజనేయస్వామి వార్లకు చివరగా ఉత్సవమూర్తులకు వసంతాన్ని చల్లారు. నూతన వధూవరులైన సీత, రామయ్యలను ఎదురెదురుగా ఉంచి జరిపిన వసంతోత్సవ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. భక్తులపై స్వామివారి వసంతాన్ని చల్లి అర్చకులు ఆశీర్వదించారు. సూర్యప్రభ వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, నవాహ్నిక తిరుకల్యాణ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. చివరి రోజున చక్రతీర్థం, సాయంత్రం పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలను జరపనున్నారు. ఆదివారం నుంచి స్వామి వారి నిత్యకల్యాణాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. -
ముత్యాలమ్మ గుడిలో కూలిన వందేళ్ల చెట్టు
పాల్వంచ: పట్టణంలోని గాంధీనగర్‌లోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలోని వందేళ్లకు పైబడిన పాల చెట్టు గురువారం రాత్రి కూలింది. రెండు రోజుల కిందట వీచిన గాలికి చెట్టు కొంత వరకు ఒరిగింది. గురువారం మొత్తం కూలి ముత్యాలమ్మ గుడిపై పడటంతో ధ్వసమైంది. పక్కనే ఉన్న రెండు రేకుల ఇళ్లపై కూడా పడటంతో దెబ్బతిన్నాయి. ఇంటి బయట పడుకున్న బాగం సుకన్య, సుగుణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్‌రావు, రెవెన్యూ ఆర్ఐ తదితరులు సందర్శించారు. పాఠశాలలో తప్పిన ప్రమాదం వంటగది స్లాబ్ పెచ్చులు ఊడి పడి వంటమనిషికి గాయాలు టేకులపల్లి: మండలంలోని బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలోని వంట గది స్లాబ్ పెచ్చులు ఊడి వంటచేస్తున్న మహిళపై పడ్డాయి. వంటలపైనా పడటంతో అవి దెబ్బతిన్నాయి. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెచ్చులు ఊడి పడుతున్న సమయంలో అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి వంటమనిషి సరోజ బయటపడింది. కానీ, ఆమె చేతికి గాయమైంది. శిథిలావస్థలో ఉన్న కిచెన్‌షెడ్‌కు మరమ్మతులు చేయాలని గత డిసెంబర్ 31న జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో తీర్మానం చేసి, ఉన్నతాధికారులకు పంపించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎస్పీ ఆకస్మిక తనిఖీ ములకలపల్లి: ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ రోహిత్‌రాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు అర్ధగంట పాటు పోలీస్ స్టేషన్లో గడిపిన ఎస్పీ.. క్రైం వివరాలు, కేసుల తాలూకూ రికార్డులు పరిశీలించారు. ఈ విషయమై ఎస్ఐ కిన్నెర రాజశేఖర్‌ను వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్పీ స్టేషన్‌ను సందర్శించినట్లు తెలిపారు. ఎస్పీ వెంట పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ ఉన్నారు. వేధింపులపై ఏఎస్పీకి ఫిర్యాదు భద్రాచలంటౌన్: చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న ఆశ వర్కర్‌ను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్న ఘటనపై బాధితురాలు శుక్రవారం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. చర్లలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న పందా రమేశ్ కొంతకాలంగా ఆశ వర్కర్‌ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు అతని భార్య, అత్తలకు విషయం చెప్పింది. దీంతో రమేశ్ అలా ఎందుకు చెప్పావని వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న బాధితురాలిని దుర్భాషలాడుతూ దాడి చేశాడు. చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో తనకు ప్రాణహాని ఉందని, రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన్నట్లు ఆశ్వ వర్కర్ తెలిపారు. మహిళ అదృశ్యంపై కేసు టేకులపల్లి: వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ సురేశ్ కథం ప్రకారం.. టేకులపల్లి మండలం చింతలంక గ్రామానికి చెందిన ప్రమీలకు ఇదే గ్రామానికి చెందిన గుమ్మడి సుధాకర్‌తో కొన్నేళ్ల కిందటే వివాహమైంది. కొంతకాలంగా ప్రమీల తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ నెల 1వ తేదీన ఇంట్లో తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వెతికినా దొరక్కపోవడంతో శుక్రవారం బాధితురాలి తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. కొనసాగుతున్న అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు తల్లాడ: మండలం కుర్నవల్లిలో నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం రెండోరోజుకు చేరాయి. వేంకటాచలపతి దేవాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యాన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు జరిగిన మ్యాచ్‌లో ఏపీలోని వైజాగ్ జట్టుపై తమిళనాడు జట్టు విజయం సాధించింది. శనివారం పోటీలు ముగియనుండగా, విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. దరఖాస్తుదారుల పడిగాపులుచుంచుపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఆన్లైన్ కష్టాలు తప్పడం లేదు. రెండు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ తరుచూ మొరాయిస్తోంది. మరోవైపు గడువు మూడు రోజులే మిగిలి ఉంది. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. గంటల కొద్దీ మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించగా తాజాగా ఆఫ్లైన్లోనూ అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక నమూనా దరఖాస్తులను జిల్లాకు పంపగా, ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. కానీ ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఆన్లైన్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. -
మొక్కజొన్న లోడు లారీని అడ్డుకున్న రైతులు
జూలూరుపాడు: మొక్కజొన్న కంకులు తీసుకెళ్తున్న లారీని జూలూరుపాడులో రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. పంటకు డబ్బు చెల్లించకుండా విత్తన కంపెనీ బాధ్యులు జూలూరుపాడులోని ఓ వే బ్రిడ్జి వద్ద లారీలో లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా, చండ్రుగొండ మండలం పోకలగూడెం, గానుగపాడు, బాల్యాతండా, జూలూరుపాడు మండలం గంగారంతండాకు చెందిన రైతులు అడ్డగించారు. వివిధ కంపెనీల ఏజెంట్లు ఎకరాకు 4 – 5 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పి, అలా జరగకపోతే రూ.75 వేలు పరిహారం ఇస్తామని నమ్మించినట్లు తెలిపారు. కానీ, పరిహారం చెల్లించకపోగా పండిన పంటకు డబ్బు చెల్లించకుండా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గ్రామాల నుంచి కంకులతో లారీని జూలూరుపాడు వే బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చి, సాయంత్రం వరకు డబ్బు ఇవ్వకపోవడంతో అడ్డుకున్నామని తెలిపారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించగా, విత్తన కంపెనీలపై ఫిర్యాదు చేశారు. కాగా, రైతులను నమ్మించి మోసం చేసిన మొక్కజొన్న విత్తన కంపెనీ డీలర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐయూకేఎస్ నాయకుడు బానోత్ ధర్మా డిమాండ్ చేశారు. రైతులు భూక్యా లక్ష్మణ్, వస్రాం, బాలు, మంగీలాల్, రాంబాబు, ప్రసాద్, వెంకటేశ్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
జింక పిల్ల స్వాధీనం
దమ్మపేట: అడవిలో దారి తప్పి, మేకల గుంపులోకి చేరిన మచ్చల జింక పిల్లను ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ కరుణాకరచారి కథనం ప్రకారం.. శుక్రవారం మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ మేకలను మేత కోసం గ్రామ శివారుకు తోలుకుని వెళ్లారు. ఈ క్రమంలో మచ్చల జింక పిల్ల తమ గొర్రెల గుంపులో కలవడం గమనించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలపగా.. రేంజర్, సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని జింక పిల్లను స్వాధీనం చేసుకుని, రేంజర్ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఆ జింక పిల్లను కిన్నెరసాని అభయారణ్యానికి సురక్షితంగా తరలించామని రేంజర్ తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోటేశ్వరరావు, బీట్ ఆఫీసర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. కత్తితో ఇద్దరిపై దాడి చర్ల: మండలంలోని పూసుగుప్పకు చెందిన ఓ వ్యక్తి ఆటో నడుపుతూ మద్యం మత్తులో ద్విచక్రవాహనం మీదకు పోనిచ్చాడు. ఆటోను ఇలా నడపటమేంటని ప్రశ్నించడంతో మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ప్రశ్నించిన ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. క్షతగాత్రుల కథనం ప్రకారం.. పూసుగుప్పకు చెందిన పండా కృష్ణమూర్తి గురువారం రాత్రి మద్యం సేవించి, ఆటో నడుపుతూ అదే గ్రామానికి చెందిన తాటి భూపతి, సోడే వినోద్పైకి పోనిచ్చాడు. తర్వాత వారిద్దరు పూసుగుప్పకు వెళ్లి ఓ షాపు వద్ద కూల్ డ్రింక్స్ తాగుతుండగా అక్కడ ఉన్న పండా కృష్ణమూర్తిని ప్రశ్నించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి కత్తితో వీరిద్దరిపై దాడి చేశాడు. గాయపడిన ఇద్దరినీ స్థానికులు చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా ప్రథమ చికిత్స అనంతరం 108లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా, కత్తితో దాడి చేసిన పండా కృష్ణమూర్తిని స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చర్ల పోలీసులు తెలిపారు. -
జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి
జూలూరుపాడు/చండ్రుగొండ: జిల్లాలోని రైతులకు గోదావరి జలాలు ఇచ్చాక మిగులు నీటిని పక్క జిల్లాకు ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి, కేరళ రాష్ట్ర ఇన్చార్జి గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కిసాన్ మోర్చా నాయకులు వినోభానగర్ గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్‌ను పరిశీలించారు. మద్దుకూరు గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ నీళ్లను జిల్లాలోని అన్ని చెరువులను నింపాకే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు గోదావరి జలాలు ఇవ్వకుండా సాగర్ నీళ్లు వస్తున్న కాలువకే మళ్లించడం దుర్మార్గమని విమర్శించారు. అకాలవర్షాలు, గాలిదుమారాలకు పంటలు నష్టపోయిన బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు చిలుకూరి రమేష్, చావా కిరణ్ కుమార్, రమేష్, నంబూరి రామలింగేశ్వరరావు, మాదినేని సతీష్, నున్నా రమేష్, సిరిపురపు ప్రసాద్, చంద్రశేఖర్, నల్లమోతు రఘుపతిరావు, జుబ్బురి రమేష్, భోగి కృష్ణ, గుగులోతు రాజేష్, భూక్యా కుమార్, గుగులోతు రాంబాబు పాల్గొన్నారు. -
వాగు.. బాగుపడేనా..?
● మొదలుకాని బుగ్గవాగు సుందరీకరణ పనులు ● గత జనవరిలో జరిగిన శంకుస్థాపన ● రూ.9 కోట్లతో టెండర్ పూర్తి ● కాగితాలకే పరిమితమైన ఒప్పందం ఇల్లెందు: ఇల్లెందు మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం జరిగినా పనులు మొదలు పెట్టడం లేదు. ఈ ఏడాది జనవరి 22న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. టీయూఎఫ్ఐడీసీ, డీఎంఎఫ్ నిధులు రూ.9 కోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నిధులతో బుగ్గవాగు సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే బుగ్గవాగు పూడిక తీయకపోతే నీరు ఇళ్లల్లోకి వస్తోంది. దీంతో బుగ్గవాగు ప్రక్షాళన కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో వాగు వెంట ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్లు రిటైన్ వాల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇరు వైపులా వాకింగ్ ట్రాక్‌లు వాగులో చెత్తా చెదారం వేయకుండా ఫెన్సింగ్ నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన జరిగిన జనవరిలో పనులు మొదలై ఉంటే వచ్చే వర్షాకాలం నాటికి అంటే జూన్ – జూలై వరకు పూర్తయ్యే అవకాశం ఉండేది. కానీ, సుందరీకరణ మొదుల కాకపోవటంతో వచ్చే వర్షాకాలాన్ని తలచుకుని పట్టణ ప్రజలు.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం.. పట్టణం మధ్య నుంచి ప్రవహించే బుగ్గవాగు ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. ఎంతో మంది వాగులోకి వచ్చి నిర్మాణాలు చేసుకున్నారు. ఇళ్లు, దుకాణాల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను వాగులో వదిలేస్తుండటంతో పూడిక పేరుకుపోతోంది. అధిక వర్షాలకు వాగు పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచుతోంది. బుగ్గవాగు మీద రెండు చోట్ల లోలెవల్ కాజ్‌వేలు ఉన్నాయి. వాగు పొంగితే కాజ్‌వేల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. చెత్తాచెదారం కాజ్వే ఖానాలకు అడ్డుపడి నీరు పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఒకవైపు బుగ్గవాగు, అలుగు వాగుల వల్ల అటు సత్యనారాయణపురం, ఇటు ఇల్లెందులపాడు ప్రజలకు వరదపోటు తప్పటం లేదు. కాగా, పట్టణం మధ్య నుంచి అంటే హిందూ శ్మశాన వాటిక నుంచి స్టేషన్ బస్తీ చివరి వరకు కిలోమీటర్ దూరం ఈ వాగు ప్రవహిస్తోంది. నంబర్–2 బస్తీ, ఎల్బీఎస్నగర్, స్టేషన్బస్తీలకు ముప్పు ఉంటుంది. సత్యనారాయణపురం 1, 2వ వార్డులకు అలుగు వాగు ఆటంకంగా మారింది. ఈ వాగు మీద బ్రిడ్జి నిర్మాణం ఊసే లేదు. ఏటా వాగు ఉప్పొంగటం వాగు దాటకుండా ఎటు ప్రజలు అటే నిలిచిపోవటం సర్వసాధారణంగా మారింది. గత వర్షాకాలంలో ఓ వ్యక్తి వాగు దాటుతూ బైక్‌తో సహా కొట్టుకుపోయి కొంత దూరంలో ఒడ్డుకు చేరాడు. సత్యానారాయణపురం వాసులకు పట్టణం నుంచి వెళ్లాలంటే బర్లపెంట రహదారి వైపు బుగ్గవాగు మీద లోలెవర్ కాజ్వే ఉన్నప్పటికీ వాగు పొంగితే ఆటంకంగా మారుతుంది. చొరవ తీసుకోవాలి.. గత జనవరిలో శంకుస్థాపన జరిగినా నేటి వరకు పనులు మొదలు పెట్టలేదు. వచ్చే వర్షాకాలం నాటికి పూడిక తీసే పనులు అయినా పూర్తి కాకపోతే కష్టంగా మారుతుంది. అధికారులు తక్షణం చొరువ తీసుకోవాలి. టెండర్, ఒప్పందం జరిగినా ఎందుకు చేపట్టడం లేదో అంతుపట్టడం లేదు. –దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇప్పటికై నా మొదలు పెట్టాలి.. బుగ్గవాగు ప్రధానంగా 4వ వార్డు గుండా ప్రవహిస్తోంది. వర్షాకాలం వాగు ఉప్పొంగితే ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతారు. సుందరీకరణ వేగంగా చేపట్టి వర్షాకాలం నాటికి పూర్తి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. –సయ్యద్ ఆజమ్, మాజీ కౌన్సిలర్ ఇల్లెందు పాలకవర్గం లేక.. గత జనవరిలో పాలక వర్గం పదవీ కాలం ముగిసింది. పాలక వర్గం లేకపోవటం వల్ల అభివృద్ధి కుంటు పడిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా ఇప్పట్లో ఎన్నికలు పెట్టే స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించటం లేదు. ఎన్నికల ఊసే లేకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పట్టణంలో సగభాగం గుండా ప్రవహించే ఈ వాగు ప్రక్షాళన, సుందరీకరణ జరిగితేనే కంటి నిండా నిద్రపోయే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కొత్తగూడెంఅర్బన్: గుర్తు తెలియని వ్యక్తి కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామంలోని బస్సు షెల్టర్ వద్ద 70 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి స్పృహతప్పి పడిపోయి ఉండగా, మైలారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, మృతుడు మైలారంలో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. సింగరేణి ఉద్యోగి కాజీపేటలో ఆత్మహత్య సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని సెంట్రల్ వర్క్‌షాపులో టర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న యూ.సంజయ్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులతో కాజీపేటలోని తన అమ్మమ్మ ఇంట్లో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వర్క్‌షాపు ఉద్యోగులు, జీఎం దామోదర్, డీజీఎం ప్రకాశ్, ఇంజనీర్ నారాయణ, సూపర్వైజర్లు, సింగరేణి ఉద్యోగులు, యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. బియ్యం లారీ పట్టివేత అశ్వాపురం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని మండల కేంద్రంలో గౌతమీనగర్ కాలనీ వద్ద గురువారం రాత్రి అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. బియ్యం మణుగూరు నుంచి పాల్వంచకు లారీ (ఏపీ20టీఏ 3366)లో తరలిస్తుండగా సీఐ అశోక్‌రెడ్డి వాహనాల తనిఖీల్లో పట్టుకున్నారు. లారీలో సుమారు 100 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు సమాచారం. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి, అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన లారీడ్రైవర్ శ్రీనుపై కేసు నమోదు చేశామని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. -
జమలాపురంలో మాజీ సీజేఐ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా వారికి ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత వారికి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు.. శేషవస్త్రాలు, ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ కె.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామికి పూజలు చేసిన జస్టిస్ ఎన్.వీ.రమణ -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సుజాతనగర్: కుమారుడిని తీసుకొని రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తండ్రి మృతి చెందగా ఆరేళ్ల కుమారుడికి గాయాలైన ఘటన సుజాతనగర్ సెంటర్లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నుంచి ఎనిమిదేళ్ల కిందట వలస వచ్చిన పొడియం దినేశ్ (39) ములకలపల్లి మండలం ధర్మన్ననగర్లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. శుక్రవారం ఆయన సుజాతనగర్ మండలంలోని రాఘవపురంలో తన సోదరుడు గంగయ్య వద్ద ఉన్న కుమారుడు భీమాను తీసుకుని సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న భద్రాచలం డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేశ్ మృతి చెందగా, భీమాకు గాయాలయ్యాయి. కాగా, ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ మేరకు ఆర్టీసీ డ్రైవర్ కోటగిరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు. దిక్కు లేని స్థితిలో కుటుంబం రోడ్డు ప్రమాదంలో దినేశ్ చనిపోగా, గాయపడిన ఆయన కుమారుడు భీమాను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, ఆయనను ఆరా తీస్తే వివరాలు చెప్పలేకపోగా, తండ్రి మృతి చెందాడనే బాధలో తన గాయాలను మర్చిపోయి చికిత్సకు సహకరించలేదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, దినేశ్ చనిపోయిన విషయం తెలిసిన ఆయన భార్య లక్ష్మి, మిగతా పిల్లలతో ఆస్పత్రికి చేరుకుని భీమాను పట్టుకుని రోదించడం కలిచివేసింది. అయితే, వలస వచ్చిన కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆయన భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. ఆయన కుమారుడికి గాయాలు -
గాలిదుమారానికి నేలరాలిన మామిడి
అశ్వారావుపేటరూరల్: అకాల గాలిదుమారం, వర్షం కారణంగా మామిడి, పొగాకు రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. మండలంలోని వినాయకపురం, మల్లాయిగూడెం, తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం, ఆసుపాకతోపాటు పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి సమయంలో వచ్చిన గాలి దుమారం కారణంగా సుమారు 150 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. మరో 50 ఎకరాల్లో మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. పసుపులేటి సుబ్బారావుకు చెందిన తోటలో సుమారు 15 టన్నుల మామిడి కాయలు నేలరాలాయి. మల్లాయిగూడెంలో ఉప్పల దుర్గప్రసాద్‌కు చెందిన 10 ఎకరాల మామిడి తోటలో వందల సంఖ్యలో కాయలు రాలిపోవడంతోపాటు కొమ్మలు విరిగిపడ్డాయి. అశ్వారావుపేటలోని శివయ్యబజార్ వద్ద కొబ్బరి చెట్టు విరిగి, రోడ్డుకు అడ్డంగా పడింది. మండలంలోని చెన్నాపురం –గాండ్లగూడెం మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, వైర్లు తెగిపోవడంతో పలు గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. ఆయా గ్రామాల్లో తాగునీటి పథకాల బోర్లు పని చేయక గిరిజనులు తాగునీటి కోసం అవస్థ పడ్డారు. -
రజతోత్సవ సభను జయప్రదం చేయండి
భద్రాచలంటౌన్: భద్రాచలం నియోజకవర్గం నుంచి భారీగా హాజరై బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. స్థానిక రాఘవ నిలయం (రెడ్డి సత్రం)లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఏప్రిల్ 27న గులాబీ పార్టీ పండుగ రోజని, ఆ రోజు గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని తెలిపారు. సమావేశంలో పినపాక మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, దిండిగాల రాజేందర్, మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, రాంబాబు, నర్సింహమూర్తి, దొడ్డి తాతారావు, ఆకోజు సునీల్, కణితి రాముడు, బుచ్చయ్య, రేసు లక్ష్మి, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబందించిన వాల్‌పోస్టర్లను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ స్థాపించి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపుమేరకు వరంగల్‌లో ఈ నెల 27న బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, భూక్య సోన, కొట్టి వెంకటేశ్వర్లు, మంతెపూరి రాజుగౌడ్, బత్తుల వీరయ్య పాల్గొన్నారు. -
పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: వచ్చే విద్యా సంవత్సరానికి పటిష్ట ప్రణాళిక తయారు చేసుకోవాలని, విద్యారంగంలో జిల్లాను ముందుస్థాయిలో నిలపాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో ఎంఈఓలు, హెచ్ఎంలతో శుక్రవారం నిర్వహించిన వార్షిక సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు విత్తనాలు సేకరించాలని, ఎక్కువ సేకరించిన పాఠశాలకు కాంప్లెక్స్ స్థాయిలో రూ.1000, మండల స్థాయిలో రూ. 5000, జిల్లాస్థాయిలో రూ. 50000 నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అనంతరం జిల్లాలోని 3,4,5 తరగతుల పిల్లలకు ఒక్కొక్కరికి రెండు నోటు పుస్తకాలను అందించే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. వేసవిలో విద్యార్థులు అభ్యసనకు దూరం కాకుండా ఐటీసీ సంస్థ ఇచ్చిన నోట్ పుస్తకాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. కాగా శుక్రవారం కొత్తగూడెం మండలంలోని హనుమాన్ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలను అందించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి, అధికారులు ఏ.నాగరాజు శేఖర్, ఎస్.మాధవరావు, ఎస్. శ్రీనివాస్, ఐటీసీ అధికారి చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
ఇల్లెందురూరల్: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కుమారుడు ఊకే ప్రభాకర్ (45) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. అనారోగ్యంతో గతేడాది నవంబర్ 24న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మృతి చెందారు. అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రభాకర్‌ను మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ బుధవారం గుండె సంబంధిత శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేక గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రభాకర్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.విద్యుదాఘాతంతో గేదెలు మృతిదమ్మపేట: విద్యుత్ వైర్లు తెగిపడటంతో రెండు గెదేలు, దూడ మృతి చెందిన ఘటన మండలంలోని రంగువారిగూడెం గ్రామ పంచాయతీ వెంకటరాజాపురం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని వెంకటరాజాపురం గ్రామానికి చెందిన దుంగల నాగమణి తన రెండు గెదేలు, దూడను గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో మేత కోసం తోలుకుని వెళ్లింది. గెదేలు మేస్తుండగా అకస్మాత్తుగా 11 కేవీ విద్యుత్ వైరు తెగిపోయి గెదేలపై పడింది. దీంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి ఆదుకోవాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సీతారాంపురం శివారు వాగు నుంచి ఇసుక తోలుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, అనుమతిపత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్లర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.పీవీకే–5 గనిలో ప్రమాదంకాంట్రాక్ట్ కార్మికుడికి గాయాలుసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పద్మావతి ఖనిలో కంటిన్యూస్ మైనర్(సీఎమ్మార్) వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు జయపాల్‌కు గాయమైంది. ఇతను గెయిన్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తున్నాడు. గురువారం గనిలో సీఎంఆర్ వద్ద పనిచేస్తున్న క్రమంలో పైనుంచి బొగ్గుపెళ్ల పడి తలకు గాయమైంది. వెంటనే కార్మికుడిని సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా సదరు కంపెనీ నిర్వాహకులు ప్రమాద విషయాన్ని బయటికి పొక్కకుండా ప్రయత్నించారు. గాయపడిన కార్మికుడిని ఎవరూ కలిసే వీలులేకుండా అడ్డుకుని గెస్ట్ హౌస్‌లో ఉంచారు.మందుపాతరలు నిర్వీర్యంచర్ల: చర్ల మండల శివారు రాంపురం అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన నాలుగు శక్తిమంతమైన మందుపాతరలను గురువారం కోబ్రా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని బీమారం క్యాంపునకు చెందిన కోబ్రా 204 బెటాలియన్‌కు చెందిన పోలీసు బలగాలు సమీప అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బీమారానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మందుపాతరలను గుర్తించారు. బాంబు డిస్పోజబుల్ బృందం వచ్చి ప్రెజర్‌బాంబు, మూడు బీరు బాటిల్ బాంబులుగా నిర్ధారించి, అక్కడే నిర్వీర్యం చేశారు. దీంతో పోలీసులకు పెనుప్రమాదం తప్పిందని బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు. -
పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పురోగమనంలో పయనిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరోగమన దిశలో పయనిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, మాజీ ఎంపీపీలు బాదావత్ శాంతి, భూక్య సోన, బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, రాజుగౌడ్, కాపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సభకు తరలిరావాలి మణుగూరు రూరల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు. మండలంలోని గుట్టమల్లారంలో గురువారం జరిగిన పినపాక నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నప్పుడు చుట్టూరా తిరిగి అధికారం లేనప్పుడు దొంగల్లా వ్యవహరిస్తున్న వారందరిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు -
మృతుడి గుర్తింపు.. అంత్యక్రియలు
ఖమ్మంవైద్యవిభాగం: ఏన్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తి మృతి మృతదేహాన్ని గుర్తించగా, ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం చుంచుపల్లి వాసులు, కుటుంబీకులు ఆ మృతదేహం గోడి విజయబాబుదిగా గుర్తించారు. విజయబాబు మతిస్థిమితం కోల్పోయినట్లు చెబుతూ, అంత్యక్రియలు నిర్వహించే స్థోమత లేదని అన్నం ఫౌండేషన్‌ను సంప్రదించారు. దీంతో ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు నేతృత్వాన బల్లేపల్లి వైకుంఠధామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్ప పువ్వు పానకం ధ్వంసంమణుగూరు టౌన్: మండలంలోని పగిడేరు పెద్దిపల్లి గొత్తికోయ గుంపులో నిల్వ ఉంచిన ఇప్ప పువ్వు పానకాన్ని ఎకై ్సజ్, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ధ్వంసం చేశారు. సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో గొత్తికోయ గుంపు, పగిడేరు గ్రామాల్లో దాడులు నిర్వహించి 800 లీటర్ల ఇప్ప పువ్వు పానకాన్ని పారబోశారు. ‘అవి రేషన్ బియ్యమే..’ములకలపల్లి: తాము పట్టుకున్న లారీలో ఉన్నవి రేషన్ బియ్యమేనని ఎస్సై కిన్నెర రాజశేఖర్ తెలిపారు. ఎటువంటి అనుమతిపత్రాలు లేకుండా బియ్యం తరలిస్తున్న లారీని మండల పరిధిలోని జగన్నాథపురం శివారులో మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకుని, స్టేషన్‌కు తరలించిన విషయం విదితమే. లారీలో ఉన్నవి రేషన్ బియ్యమా? కాదా? నిర్ధారించేందుకు సివిల్ సప్లై డీటీ సుంకర శ్రీనివాసరావు బియ్యం శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపారు. కాగా ల్యాబ్ రిపోర్టులో రేషన్ బియ్యంగా తేలినట్లు ఎస్సై తెలిపారు. లారీలో 50 కేజీల బరువుగల 700 బస్తాలు ఉన్నాయని, మొత్తం 34 టన్నుల పీడీఎస్ రైస్‌ను అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మణుగూరు టౌన్: మణుగూరు యువకులు జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపి ఈ నెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారని స్కై జిమ్ కోచ్ పొడిశెట్టి నాగరాజు గురువారం తెలిపారు. ఖమ్మంలో 53,72,77 కేటగిరీలలో లక్ష్మణ్, ఖైరుద్దీన్, ఖమర్, హఫీజ్, 93 కేటగిరీలో మాథిన్, 66 కేటిగిరీలో జిమ్ ట్రైనర్ నాగరాజు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువకులను పలువురు అభినందించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతిదమ్మపేట : రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సూర్యాపేట జిల్లా కాసరబండ గ్రామానికి చెందిన మచ్చ ఎల్లయ్య (37) మండలంలోని గట్టుగూడెం గ్రామంలో వేరుశెనగ కోత కోసే పనికి వచ్చాడు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఖమ్మం నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎల్లయ్యకు తీవ్రగయాలు కాగా, స్థానికులు 108 అంబులెన్స్‌లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్యదమ్మపేట : యువకుడి ఆత్మహతపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన గీగా శివ (28) పంపు ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులపాలు కావడంతో బుధవారం భార్యతో గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో అదే రోజు ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు. భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణఅశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురంలో భూ వివాదంలో గురువారం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. గ్రామంలో 190/1 సర్వే నంబర్లో ఎకరం 20 కుంటల భూమిపై గ్రామస్తులకు, సారపాకకు చెందిన కనకమేడల హరిప్రసాద్ కుటుంబసభ్యులకు ఏళ్లుగా వివాదం నెలకొంది. గ్రామ కంఠం భూమి అని రెవెన్యూ అధికారులు నిర్ధారించి గ్రామ పంచాయతీకి అప్పగించారని గ్రామస్తులు చెబుతుండగా, తమకు తాత ముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి అని హరిప్రసాద్ కుటుంబీకులు చెబుతున్నారు. హైకోర్టును ఆశ్రయించగా, తనకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని గురువారం హరిప్రసాద్ తన అనుచరులతో జేసీబీని తీసుకుని వచ్చాడు. భూమికి ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేయగా రామచంద్రాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హరిప్రసాద్ అనుచరుడి కారు అద్దాలు పగిలాయి. సీఐ అశోక్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. ఈ క్రమంలో సివిల్ డ్రస్‌లో ఉన్న సీఐ గన్‌మెన్ రమేష్‌ను హరిప్రసాద్ అనుచరుడిగా భావించి అతనిపై ఓ వ్యక్తి చేయి చేసుకోగా, గ్రామస్తులు నిలువరించారు. అనంతరం ఇరువర్గాలు అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఆక్రమిత భూముల్లో జామాయిల్ నరికివేతఅశ్వారావుపేట: ఆక్రమిత అటవీ భూముల్లో సాగవుతున్న జామాయిల్ తోటలను ఆక్రమణదారులు నరికివేశారు. వినాయకపురం అటవీ ప్రాంతంలోని దమ్మపేట రేంజ్ తిరుమలకుంట సెక్షన్ దిబ్బగూడెం బీట్‌లో అడవులను ఆక్రమించుకుని కొందరు కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఈ నెల 3న ‘అటవీ భూమి ఆక్రమణ’అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. మరుసటి రోజు దమ్మపేట రేంజ్ అధికారి కరుణాకరాచారి విచారణ నిర్వహించి ఆక్రమణలు ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కానీ ఏ ఒక్కరిపైనా కేసులు నమోదు చేయలేదు. పైగా అటవీభూమిలో ఉన్న సంపద ప్రైవేటు వ్యక్తులు తరలించుకుపోతున్నా అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. అటవీశాఖ, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులు సైతం అటవీ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అటవీశాఖకు చెందిన ఓ అధికారి భోరోసాతోనే జామాయిల్ నరుకుతున్నట్లు సమాచారం. దీనిపై ఓ బీట్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా దురుసుగా సమాధానం చెప్పారని సమీప రైతులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై దమ్మపేట రేంజ్ అధికారి కరుణాకరాచారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. -
మక్కలు కొనేదెప్పుడో..?
● మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ● మద్దతు ధర కంటే తక్కువ చెల్లిస్తున్న వ్యాపారులు ● ఆందోళన చెందుతున్న మొక్కజొన్న రైతులు ఇల్లెందురూరల్: జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట చేతికొచ్చింది. యాభై శాతానికి పైగా నూర్పిడి కూడా పూర్తి కావడంతో మక్కలను కల్లాల్లో ఆరబెట్టారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తామని ఇటీవల మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆశించిన దిగుబడి రాకున్నా కనీసం మద్దతు ధరైనా దక్కుతుందని భావించారు. ప్రకటన వెలువడి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడ లేకపోవడం, మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 11 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 11 చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇల్లెందు, చల్లసముద్రం, కొమరారం, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, మర్కోడు, శెట్టుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేటతోపాటు దిగుబడిని బట్టి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 16,938 ఎకరాల్లో సాగు జిల్లాలో ప్రస్తుత యాసంగిలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 16,938 ఎకరాలుగా నమోదైంది. అనధికారికంగా (పట్టాదారు పాస్‌పుస్తకాలు లేని భూములు) మరో పదివేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఇందులో అత్యధిక విస్తీర్ణం ఇల్లెందు ఏజెన్సీలోనే సాగవుతోంది. సాధారణంగా వానాకాలం కంటే యాసంగిలోనే మొక్కజొన్న దిగుబడి అధికంగా ఉంటుంది. కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈసారి మొక్కజొన్న దిగుబడి తగ్గింది. ఎకరానికి 30 క్వింటాళ్లు దాటడం లేదు. ఈ చొప్పున జిల్లావ్యాప్తంగా సుమారు 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు.. ప్రస్తుత సీజన్లో ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2,225 మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వాతావరణంలో మార్పులు, తరచూ వర్ష సూచనలతో ఆందోళనకు గురై వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అదే అదునుగా వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారని, క్వింటాల్‌కు రూ.2 వేల నుంచి చెల్లించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏటా మక్కల కొనుగోళ్ల సమయంలో ఎర్రజెండా పార్టీలు రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి మద్దతు ధరను నిర్ణయించే సంప్రదాయం ఇల్లెందు ఏజెన్సీలో ఉంటుంది. ఈసారి కూడా సమావేశం నిర్వహిస్తామని పది రోజుల క్రితం ప్రకటించినా.. ఆ తర్వాత మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. తక్కువకే విక్రయిస్తున్నాం మొక్కజొన్న కంకులను నూర్పిడి చేసి పక్షం రోజులైంది. వాతావరణంలో మార్పులు, వర్ష సూచనతో ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో క్వింటా రూ.2,050కి విక్రయించాను. క్వింటాకు రూ.200 నష్టపోయాను. – మంచె శ్రీను, రైతు, కొమరారం, ఇల్లెందు మండలంకేంద్రాలు ప్రారంభించాలి ఏటా మొక్కజొన్న కొనుగోళ్లు యాభైశాతం పూర్తయిన తరువాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తోంది. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. ఇప్పటికే అత్యధిక మంది రైతులు నూర్పిడి పూర్తి చేసి పంట విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్క్‌ఫెడ్ తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – అజ్మీర సీతారాం, రైతు, బోయితండా, ఇల్లెందు మండలం -
పురిటిగడ్డపై ప్రత్యేక దృష్టి
● ఇల్లెందు ప్రాంతానికి నష్టం కలగనివ్వం ● ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ ఇల్లెందు: బొగ్గు గనులకు పుట్టినిల్లయిన ఇల్లెందుకు ఢోకా ఉండదని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని, ఎలాంటి నష్టం కలగనివ్వబోమని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన చట్టం సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం ఇల్లెందు జేకే ఓసీలో జరిగిన ఫిట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల కాలంలో నాటి పాలకులు ఇల్లెందుపై శీతకన్ను ప్రదర్శించారని ఆరోపించారు. ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోతున్నా గుర్తింపు సంఘాల నాయకులు పట్టించుకోలేదని విమర్శించారు. నూతన గనుల ప్రారంభానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఇల్లెందు ఏరియాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నూతన గనుల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రైవేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు వచ్చేలా చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇల్లెందు జేకే ఓసీ పొడిగింపు ఆదేశాలు, అనుమతులు త్వరలోనే వస్తాయని అన్నారు. పూసపల్లి ఓసీ కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఇక్కడి కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం జనక్‌ప్రసాద్, నర్సింహారెడ్డి, త్యాగరాజులను ఘనంగా సత్కరించారు. సమావేశంలో జనరల్ సెక్రటరీ వికాస్కుమార్ యాదవ్, ఆల్బర్ట్, జె.వెంకటేశ్వర్లు, గోచికొండ సత్యనారాయణ, భూక్యా నాగేశ్వరరావు, మహబూబ్, కళ్లం కోటిరెడ్డి, పడిదల నవీన్, కొండూరి చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
పావు గంటలోనే ప్రక్రియ
● రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ● పైలట్‌గా మూడు కార్యాలయాల్లో అమలు ● తొలిరోజు చిన్నచిన్న సమస్యలు మినహా సాఫీగానే.. ● వచ్చే నెల 1నుంచి అన్ని కార్యాలయాల్లో అమలుకు కసరత్తు ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెం అర్బన్: ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం రోజంతా వేచి ఉండకుండా ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ముందుగానే సమయాన్ని నిర్దేశించుకుని స్లాట్ బుక్ చేసుకునే విధానాన్ని అమలుచేస్తుండగా, పావు గంటలోనే ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజులు ఇచ్చేస్తున్నారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఇక స్లాట్ దొరకని వారు, బుక్ చేసుకోలేని వారి కోసం ప్రతిరోజు సాయంత్రం 5 – 6 గంటల మధ్య వాకిన్ విధానంలో ఐదు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాగా, ఉమ్మడి జిల్లాలోని మూడు కార్యాలయాల్లో గురువారం మొదలైంది. తొలి రోజు మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 68 స్లాట్లు బుక్ కాగా, 66 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే, వాకిన్ విధానంలో ఏడు దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు వెల్లడించారు. స్లాట్ బుక్ చేసుకుని.. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ పూర్తవడానికి సమయం పడుతుండడం.. ఒకే సమయంలో ఎక్కువ మంది వస్తే అధికారులు దస్తావేజులను సక్రమంగా పరిశీలించలేని పరిస్థితి ఎదురయ్యేది. దీంతో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం అమలుకు నిర్ణయించగా, పైలట్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కూసుమంచి, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను జాబితాలో చేర్చారు. గురువారం మొదలైన ఈ విధానంలో భాగంగా స్లాట్ బుక్ చేసుకున్న సమయం ఆధారంగా వచ్చిన వారి దస్తావేజులను అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అంతేకాక రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అందజేశారు. వచ్చే నెల 1వ తేదీ నుండి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి రానుంది. చిన్న చిన్న సమస్యలు మినహా.. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం స్లాట్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో తొలిరోజు సర్వర్‌లో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. సర్వర్ నెమ్మదించడం, డాక్యుమెంట్ వివరాలను నమోదు చేస్తున్న సమయంలో వాటికవే డిలీట్ కావడంతో మళ్లీ మొదటి నుంచి నమోదు చేయాల్సి వచ్చింది. దీంతో వీటిని సరిచేసి, ఇంకొన్ని అంశాలను సైట్లో చేరిస్తే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగుతుందని అధికారులు వెల్లడించారు. అధికారుల పర్యవేక్షణ ఉమ్మడి జిల్లాలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకావడంతో అధికారులు పర్యవేక్షించారు. జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు ఖమ్మం, కూసుమంచి కార్యాలయాల్లో, చిట్ రిజిస్ట్రార్ కార్తీక్ కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. స్లాట్ బుక్ చేసుకుని డాక్యుమెంట్లతో సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వచ్చిన క్రయవిక్రయదారులకు పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేయడం, ఆపై పది నిమిషాల్లో పత్రాలు ఇవ్వడం విశేషం. బయోమెట్రిక్, ఫొటో, డాక్యుమెంట్ల పరిశీలన, స్కానింగ్ అంతా ఈ సమయంలోనే పూర్తయింది. తొలి రోజు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల వివరాలు.. కార్యాలయం స్లాట్ ద్వారా వాకిన్ మొత్తం రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు ఖమ్మం ఆర్వో 3 1 06 37కూసుమంచి 1 3 00 1 3కొత్తగూడెం 22 0 1 23 -
విద్యుత్ ఉద్యోగులకు వైద్య శిబిరం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్తగూడెంలోని సర్కిల్ కార్యాలయ ఆవరణలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు 100 మంది విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, కార్డియాలజీ విభాగాల వారు పరీక్షించి తగిన సూచనలు చేశారు. కేన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించారు. విద్యుత్ ఎస్ఈ జి మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ కోట్ల బాలరాజు, కార్డియాలజిస్ట్ డాక్టర్ మజీద్, విద్యుత్ డీఈ ఎన్.కృష్ణ, కొత్తగూడెం, పాల్వంచ డీఈలు జి.రంగస్వామి, పీఎస్వీఎస్ నందయ్య, సర్కిల్ కార్యాలయ ఏఓ శ్రీధర్, టెక్నికల్ ఏడీఈ కె. రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లోనూ చార్జీల పెంపు
● విద్యార్థినులకు కాస్మొటిక్స్, డైట్ బిల్లులు పెంచుతూ నిర్ణయం ● ఉమ్మడి జిల్లాలో 28 కేజీబీవీలు.. 8,480 మంది బాలికలు ● పెరిగిన చార్జీల అమలుతేదీపై కొరవడిన స్పష్టతపాల్వంచరూరల్ : ఎట్టకేలకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో కాస్మొటిక్స్, డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 13న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులకు చార్జీలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా కేజీబీవీ విద్యార్థినులకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అమలు చేసిన చార్జీలకు, నిత్యం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లుల్లో తేడాలు ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ క్రమంలో కస్తూ ర్బా విద్యార్థినులకూ డైట్, కాస్మొటిక్స్ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. గతంలో అన్ని తరగతులకూ ఒకే చార్జీలు.. గతంలో 6 నుంచి ఇంటర్మీడిఝెట్ వరకు అన్ని తరగతుల విద్యార్థినులకు డైట్ చార్జీలు నెలకు రూ.1,225, కాస్మొటిక్స్ చార్జీలు రూ.100 చెల్లించేవారు. కాగా, తాజా నిర్ణయం ప్రకారం 6, 7 తరగతుల వారికి డైట్ చార్జీలు రూ.1,330 చొప్పున, కాస్మొటిక్స్ చార్జీలు రూ.175 చెల్లించాలని నిర్ణయించారు. ఇక 8, 9, 10 తరగతుల విద్యార్థినులకు డైట్ చార్జీలు రూ.1,540, కాస్మొటిక్స్ చార్జీలు రూ.275 ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థినులకు డైట్ చార్జీలు రూ.2,100, కాస్మొటిక్స్ చార్జీలు రూ.275 చొప్పున చెల్లించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 28 విద్యాలయాల్లో.. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 14, భద్రాద్రి జిల్లాలో 14 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 6 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థినులు 4,780 మంది ఉండగా, భద్రాద్రి జిల్లాలో 3,700 మంది ఉన్నారు. బాలికలకు బలవర్థకమైన ఆహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మెనూ బిల్లులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బాలికల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో నెలలో నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్ వడ్డించడమే కాక, బుధవారం మినహా మిగితా రోజుల్లో అరటి, లేదా సీజనల్ పండ్లు, సేమియా, గులాబ్‌జామ్, అటుకులు, స్నాక్స్, పల్లీపట్టి, మిక్చర్, టీ అందించాల్సి ఉంది. పాత మెనూ ప్రకారం వాటిని అమలు చేయాలంటే విద్యార్థినులకు వచ్చే బిల్లులు సరిపోక అరకొరగా పెట్టాల్సి వచ్చేది. కొన్ని స్కూళ్లలో అయితే చికెన్, మటన్ పెట్టిన సందర్భాలు తక్కువే. గత చార్జీలతో మెనూ పక్కాగా అమలు చేయడం అధికారులకు ఇబ్బంది గానే ఉండగా ప్రస్తుతం చార్జీల పెంపుతో కేజీబీవీ కో ఆర్డినేటర్లు, ప్రత్యేకాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమలుపై కొరవడిన స్పష్టత.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యార్థినులకు పౌష్టికాహారం, కాస్మొటిక్స్ చార్జీలు పెంచినా.. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో నిర్దిష్ట తేదీ పేర్కొనలేదు. మరో 10రోజులు దాటితే వేసవి సెలవులు వస్తాయి. అయితే పెరిగిన చార్జీలు ఈ నెలలో అమలు చేస్తారా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తారా అనేది స్పష్టత రాలేదని కేజీబీవీల ప్రత్యేకాధికారులు చెబుతున్నారు. -
ఊంజల్ సేవలో కల్యాణ రామయ్య
భద్రాచలం: సీతాలక్ష్మణ సమేతుడైన కల్యాణ రామయ్యకు గురువారం వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతన వధూవరులైన సీతారాములను ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో కొలువుదీర్చిన అర్చకులు లాలలు.. జోలలు పాడారు. ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలు ఆలపించగా ఊంజల్ సేవ ఆద్యంతం ఆకట్టుకుంది. అనంతరం స్వామివారికి స్వర్ణ పూరిత సింహవాహనంలో తిరువీధి సేవ జరిపారు. 13 నుంచి నిత్యకల్యాణాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారికి వసంతోత్సవం జరపనున్నారు. శనివారం జరిపే చక్రతీర్థం, ధ్వజావరోహణం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనుండగా స్వామి వారి నిత్యకల్యాణాన్ని 13వ తేదీ నుంచి తిరిగి ప్రారంభిస్తారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటనబూర్గంపాడు: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పినపాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బూర్గంపాడులోని గౌతమీపురం – సోంపల్లి బీటీ రోడ్డు, అశ్వాపురం మండలంలో అశ్వాపురం – బీజీ కొత్తూరు, అశ్వాపురం – జగ్గారం బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మణుగూరు సమితి సింగారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగదుల నిర్మాణం, మణుగూరు – రామానుజవరం మధ్య హైలెవల్ బ్రిడ్జి, మణుగూరు – పగిడేరు మధ్య హైలెవల్ బ్రిడ్జి, పినపాక మండలంలో పినపాక – ఉప్పాక క్రాస్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పినపాక – పోతిరెడ్డిపల్లి మధ్య బీటీ రోడ్డు, పినపాక – మల్లారం మధ్య బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక పినపాక–గడ్డంపల్లి మధ్య బీటీ రోడ్డును, పినపాకలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభిస్తారు. 19న వెబినార్కొత్తగూడెంఅర్బన్: భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియా స్పెస్ వీక్ న్యూ ఢిల్లీ వారిచే ఈనెల 19న ఆన్లైన్ వెబినార్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబినార్‌లో పాల్గొనే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈనెల 17వ తేదీ లోగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానంలో ఆసక్తి, అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వివరాలకు డీఎస్ఓ(92472 96012)ను సంప్రదించాలని తెలిపారు. సాగర్ కాల్వలకు నీరు నిలిపివేత నాగార్జునసాగర్: సాగర్ కుడి, ఎడమ కాల్వ లకు గురువారం సాయంత్రం నీటి విడుదల నిలిపివేశారు. యాసంగి పంటలకు గాను అధికారులు గత ఏడాది డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు ఏకధాటిగా నీరు విడుదల చేస్తున్నారు. కుడికాల్వ కింద ఏపీలో 10.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అలాగే, ఎడమకాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్లో 115 రోజుల పాటు కుడి కాల్వకు 100టీఎంసీలు, ఎడమ కాల్వకు 74టీఎంసీల నీటిని విడుదల చేశామని అధికారులు వెల్లడించారు. -
పక్షం దాటితే.. ప్రమాద ఘంటికలే!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మే నెల రాకముందే గోదావరి వట్టిపోతోంది. దుమ్ముగూడెం ఆనకట్ట దిగువ భాగంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. దీంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక కార్యాచరణ అవసరం కానుంది. కాటన్ ఆనకట్ట నుంచే.. జిల్లాలోని మెజారిటీ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఇందుకోసం పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించడంతో పాటు ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. అయితే ఇందుకు అవసరమైన రా వాటర్‌ను అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మించిన కాటన్ ఆనకట్ట దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మిషన్ భగీరథకు ప్రతీ రోజు 150 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. గోదావరి తీరం వెంట విస్తరించిన హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, భద్రాచలం స్పెషల్ పేపర్ బోర్డ్ లిమిటెడ్లకూ ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహాలు సంతృప్తికర స్థాయిలో కొనసాగడంతో ఆనకట్ట నుంచి తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత ఎదురుకాలేదు. కానీ ఈసారి ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తేలిన బండరాళ్లు.. కాటన్ ఆనకట్టకు ఎగువన ఉన్న లక్ష్మి, సమ్మక్క బరాజ్‌ల నుంచి కనీస ప్రవాహాలే దిగువకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీటికి, ఉపయోగిస్తున్న నీటికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో క్రమంగా గోదావరి ఎండిపోతోంది. నదిలో ఎడమ వైపు మిషన్ భగీరథ, హెవీవాటర్ ప్లాంట్ ఇన్‌టేక్ వెల్స్ దగ్గరగానే ప్రవాహాలు ఉన్నాయి. కుడివైపున ఉన్న పర్ణశాల వైపు నదిలో ఇసుక మేటలు వేయగా, నదీ గర్భంలోని బండలు బయటకు కనిపిస్తున్నాయి. చివరకు సరుకు రవాణ కోసం ఉద్దేశించిన కెనాల్‌లోనూ నీటి నిల్వలు తగ్గిపోయి అడుగు కనిపిస్తోంది. దీంతో ఈ కెనాల్‌పై నిర్మించిన హైడల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. పక్షం రోజులకే.. ప్రస్తుతం బరాజ్‌లో ఉన్న 0.98 టీఎంసీల నీటి నిల్వలు ఈ నెలాఖరు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథకు సరిపోతాయనే ధీమాను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎండలు మరింతగా ముదిరితే నీటి ఆవిరి నష్టాలు పెరిగి ఈ సంఖ్య తగ్గిపోయే అవకాశముంది. పైనున్న లక్ష్మి, సమ్మక్క బరాజ్‌ల నుంచి విడుదల చేయించడంతో పాటు వచ్చే ప్రవాహాలను జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సీతమ్మ సాగర్ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా కాటన్ ఆనకట్టలో పూడిక తీత, లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేసి ప్రతీ బొట్టును ఒడిసిపట్టాల్సిన అవసరముంది.తగ్గుతున్న నీరు.. అశ్వాపురం – దుమ్ముగూడెం మధ్య గోదావరిపై నిర్మించిన ఆనకట్ట గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఆరు టీఎంసీలు. ఈ బరాజ్‌ను నిర్మించినప్పుడు డెడ్ స్టోరేజీ లెవల్ 36 మీటర్లు ఉండగా 49.5 మీటర్ల దగ్గర అలుగు పారుతుంది. అయితే 150 ఏళ్ల క్రితం నాటి నిర్మాణం కావడంతో బరాజ్‌లో భారీగా ఇసుక మేటలు వేశాయి. దీంతో బరాజ్ డెడ్ స్టోరేజీ లెవల్ 42 మీటర్లకు చేరుకోగా, నీటి నిల్వ సామర్థ్యం నాలుగు టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం 47.7 మీటర్ల ఎత్తులో 0.98 టీఎంసీల నీరే ఇక్కడ నిల్వ ఉంది. -
పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి
● అడవుల సంరక్షణ అందరి బాధ్యత ● డీఎఫ్ఓ కిష్టాగౌడ్ చండ్రుగొండ / అన్నపురెడ్డిపల్లి : అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు జిల్లా అటవీ శాఖాధికారి కిష్టాగౌడ్ అన్నారు. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లోని ప్లాంటేషన్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం చండ్రుగొండలోని రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. కొత్తగా పోడుపేరుతో అడవులను ధ్వంసం చేసినా, అక్రమించుకున్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. అడవుల్లో ఉచ్చులు, తుపాకులు, విద్యుత్ వైర్లు అమర్చి వన్యప్రాణులను వేటాడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సహకరించే వారిపై కూడా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ కోటేశ్వరరావు, రేంజర్ ఎల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
మూడింటికీ ఒక్కరే !
● పాల్వంచ మున్సిపల్ కమిషనరే కొత్తగూడెం, అశ్వారావుపేటకు ఇన్చార్జ్ ● కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ● ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కిందిస్థాయి సిబ్బందికొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో ఎ’ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడేనికి, ఇటీవలే అప్‌గ్రేడ్ అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి పర్మనెంట్ కమిషనర్లు లేరు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత ప్రస్తుతం ఆ రెండు పట్టణాలకూ ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. దీంతో ఆమె ఎక్కడా పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. అనేక పనులు పెండింగ్ పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్‌స్వామి గత నెలలో తన మాతృ సంస్థకు బదిలీ అయ్యారు. దీంతో పాల్వంచ కమిషనర్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వారావుపేట ఇటీవలే మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కాగా, అక్కడా సుజాతే ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించడం ఆమెకూ కష్టంగానే మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆమె ఎప్పుడు వస్తారు.. ఎప్పుడు వెళ్తారనే విషయాలపై కింది స్థాయి అధికారులకు స్పష్టత లేక సమన్వయం కొరవడుతోంది. దీంతో కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ అవసరాల కోసం వస్తున్న ప్రజలు సిబ్బంది లేక వెనుదిరగాల్సి వస్తోంది. ఇదిలాగే కొనసాగితే మున్సిపాలిటీ పాలన గాడి తప్పే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనుల్లో జాప్యంతో ఇక్కట్లు.. కొత్తగూడెం మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగాన్ని పరిశీలిస్తే మ్యుటేషన్ ఫైళ్లు కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇళ్లు కొనుగొలు చేసిన వారు తమ పేర్లపై మారకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఇంటి నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నెలల తరబడి మున్సిపాలిటీ చుట్టూ తిరుగాల్సి వస్తోంది. కమిషనర్ లేకపోవడంతో సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని, వచ్చిన వారు సైతం అంతంతగానే పనులు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నెల వరకు ఇంటి పన్నుల వసూళ్లు 80 శాతం దాటలేదంటే సిబ్బంది నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇష్టానుసారంగా టెండర్లు.. కొత్తగూడెం మున్సిపాలిటీలో డీఎంఎఫ్ నిధులతో వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఎంపవర్మెంట్ సెంటర్ల నిర్మాణం కోసం రెండు నెలల క్రితం ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. దీంతో కొత్తగూడెం, పాల్వంచ నుంచి దాదాపు 40 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. అయితే గత శనివారం సెలవు రోజు అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కిన కొందరు సిబ్బంది.. తమకు అనుకూలమైన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో టెండర్లు ఓపెన్ చేశారు. పని దినాల్లోనే టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉండగా రహస్యంగా సెలవు రోజు ఓపెన్ చేయడంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇలాంటి ఘటనలు కొత్తగూడెం మున్సిపాలిటీలో అనేకం జరుగుతున్నాయి. జిల్లాలో ఏ గ్రేడ్ మున్సిపాలిటీకి శాశ్వత కమిషనర్‌ను నియమించాల్సిన అవసరం ఉందని పట్ణణ వాసులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ సుజాతను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. -
12న పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా చండీహోమం నిర్వహించనున్నారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని ఈఓ ఎన్.రజనీకుమారి సూచించారు. పూర్తి వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. అడవుల పరిరక్షణ అందరి బాధ్యతడీఎఫ్ఓ కిష్టాగౌడ్ కరకగూడెం: అడవుల పరిరక్షణ అందరి బాధ్యత అని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని అనంతారం రిజర్వ్ ఫారెస్ట్ ప్లాంటేషన్లను, అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి వనరులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, అడవులను నరకడానికి ప్రయత్నించినా, వన్యప్రాణులను వేటాడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అటవీ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడవుల సంరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మణుగూరు డివిజన్ అటవీ అధికారి సయ్యద్ మక్సుద్ మొయినొద్దీన్, అనంతారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. 12 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతిపాల్వంచరూరల్ : జిల్లాలో 12 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు లైవ్‌స్టాక్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించిందని పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. తమ కార్యాలయంలో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించామని, వెటర్నరీ అసిస్టెంట్లుగా రెండేళ్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఉద్యోగోన్నతి పొందిన 12 మందిలో 8 మందిని జిల్లాలో ఖాళీగా ఉన్న వెటర్నరీ ఆస్పత్రులకు కేటాయించామని, మరో నలుగురు బదిలీపై ఖమ్మం జిల్లాకు వెళ్లారని తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలందించాంభద్రాచలంటౌన్ : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్వంలో మెరుగైన సేవలందించామని డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, పర్ణశాల, కొత్తగూడెంలో రెండు రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా 14,789 మంది భక్తులు ఈ శిబిరాలను వినియోగించుకున్నారని వివరించారు. ఏఓ బాలాజీ నాయక్, చైతన్య, మధువరన్ ఈ శిబిరాలను పర్యవేక్షించారని పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల పరిశీలన నష్టం అంచనాల్లో అధికారులు అన్నపురెడ్డిపల్లి / చండ్రుగొండ : రెండు మండలాల్లో రెండురోజులపాటు గాలిదుమారంతో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా రెండు మండలాల్లో అరకొరగా ఉన్న మామిడిపంట గాలిదుమారానికి నేలరాలింది. దీంతో రూ.లక్షల్లో నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. కోతదశలో ఉన్న వరిపంట నేలవాలింది. వర్షం పడటంతో తేమకారణంగా ధాన్యం రంగుమారుతుందని, కోత కోసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంటకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. చండ్రుగొండ, దామరచర్ల, అయన్నపాలెం, మద్దుకూరు, అబ్బుగూడెం, మర్రిగూడెం, రాజాపురం తదితర గ్రామాల్లో పర్యటించిన వ్యవసాయశాఖాధికారులు పంటనష్టం అంచనా వేస్తున్నారు. -
కుక్కల దాడిలో పందెం కోళ్లు మృతి
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం పట్టణం రామవరంలో వీధి కుక్కలు దాడి చేయడంతో పది పందెం కోళ్లు మృతి చెందాయి. బుధవారం తెల్లవారుజామున 6వ వార్డులో నివాసుముంటున్న రమేష్ పాసి ఇంట్లో వీధి కుక్కలు కోళ్లపై దాడి చేశాయి. దీంతో పది కోళ్లు మృతి చెందాయి. రామవరం ప్రధాన రహదారిలో ఉన్న మటన్, చికెన్ దుకాణాల వద్దపడేసిన వ్యర్థాలకు అలవాటు పడిన వీధి కుక్కలు.. ఆ వ్యర్థాలు దొరకకపోవడంతో కోళ్లపై దాడి చేసి, చంపి తింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనుషులపై కూడా దాడి చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఇద్దరిపై కేసు నమోదు పాల్వంచరూరల్: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామశివారులో డబ్బుల విషయంలో ఇరువర్గాలు చర్చించకుంటున్న క్రమంలో గొడవ తలెత్తిందని ఎస్ఐ.సురేష్ తెలిపారు. ఈ క్రమంలో పాకాల వెంకట్రావు, ఖాజాలు తమపై దాడి చేశారని బాధితులు ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడి ఘటనలో ఆరుగురిపై.. పాల్వంచరూరల్: దాడి ఘటనలో పోలీసులు బుధవారం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో సెల్ఫోన్ల్ వాట్సాప్ వీక్షించే క్రమంలో జగన్నాధం రాంబాబు, రవీందర్ మధ్య వాగ్వాదం నెలకొని రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈక్రమంలో రాంబాబు, అనిల్, రాములమ్మలపై రవీందర్, శాంతి, దాసరి లక్ష్మి, అశోక్, అబ్రహం, లక్ష్మి కలిసి గత నెల 9న దాడి చేశారు. బాధితుడు రాంబాబు బుధవారం ఫిర్యాదు చేయగా దాడిచేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్రవాహదారుడిపై.. పాల్వంచరూరల్: ప్రమాదానికి కారణమైన ద్విచక్రవాహనదారుడిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మాలోత్ భగవాన్ గత నెల 5న ద్విచక్రవాహనంపై వెళ్లి పెద్దమ్మగుడి వద్ద కొబ్బరికాయ తీసుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి మరో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న మున్నవన్ శ్రీను ఢీకొట్టాడు. దీంతో భగవాన్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు క్షతగాత్రుడి కాలును తొలగించారు. బాధితుడి కుమారుడు నరేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. థియేటర్ అడ్డాగా ఇసుక వ్యాపారంఇల్లెందు: పట్టణంలో మూతపడిన థియేటర్ అడ్డాగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని వాగులు, వర్రెల నుంచి తరలించి ఇసుక అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖలను మేనేజ్ చేసి వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ ఇసుకను రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. కాగా పూసపల్లి–జెండాల వాగు అటవీ ప్రాంతం నుంచి ఓ ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తుండగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో అడ్డుకున్నట్లు ఆ సంఘం నాయకులు తాటి మధు, గుమ్మడి రాంకుమార్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ సీజ్పాల్వంచ: అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నాగారం నుంచి ఇసుక తరలిస్తుండగా వెంగళరావు కాలనీ వద్ద పట్టణ పోలీసులు పట్టుకుని స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేశారు. -
పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు మణుగూరు టౌన్: పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం ఆయన జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి కొండాపురం భూగర్భ గనిని సందర్శించారు. బంకర్‌ను, మ్యాన్‌రైడింగ్ సిస్టం ద్వారా గనిని సందర్శించి పరిశీలించారు. జియోలాజికల్ కండీషన్స్, రక్షణ తదితర అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యాన్ పవర్, యాంత్రిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటేశ్వర్లు, వీరభద్రరావు, శ్యాంసుందర్, ఆర్.శ్రీనివాస్, వెంకట్రావ్, వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఈద్ మిలాప్సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్‌షాపులో బుధవారం ఈద్‌మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్క్‌షాపు ఇన్చార్జ్ శ్రీకాంత్, ఏరియా ఉపాధ్యక్షుడు రజాక్, కేశవరావు, యోహాన్, అబ్దుల్ బాసిత్, అబ్దుల్ సలాం, ఎ.ఉపేందర్‌బాబు, సత్తార్, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. దాహార్తి తీరుస్తున్న చలివేంద్రాలు పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చుంచుపల్లి: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో తగిన రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు, బయటకు వచ్చిన వారు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తాగునీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అన్ని గ్రామాలు, వార్డుల్లోనూ పూర్తిస్థాయిలో చలివేంద్రాలను అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. అంబులెన్స్‌లో ప్రసవంటేకులపల్లి: మండలంలోని రామచంద్రునిపేట పంచాయతీ పాతర్లగడ్డ గ్రామానికి చెందిన మమతకు పురిటినొప్పులు రావడంతో 108లో అంబులెన్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. నొప్పులు అధికం కావడంతో మార్గమధ్యలోనే కాన్పు పొందింది. ఈఆర్సీపీ డాక్టర్ శివ సలహా మేరకు ఆశా వర్కర్‌తోపాటు ఈఎంటీ పూర్ణచందర్, పైలట్ శ్రీనివాసరావు సేవలందించారు. ఆడ బిడ్డ జన్మించిందని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంఈటీ తెలిపారు. దుక్కిటెద్దు మృతిజూలూరుపాడు: మండలంలోని కరివారిగూడెం గ్రామంలో దుక్కిటెద్దు మొక్కజొన్న కంకులు తిని అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ రైతు సీడ్ మొక్కజ్నొ పంటను సాగు చేశాడు. పంట చేతికి రావడంతో మూడు రోజుల క్రితం రైతు కంకులు విరిచి, అక్కడక్కడా కంకులు విరవకుండా వదిలేశారు. మొక్కజొన్న పొలంలోకి మేత కోసం వెళ్లిన భూక్య తిరుపతయ్య అనే రైతు దుక్కిటెద్దు రెండు రోజులుగా కంకులు తినడంతో అనారోగ్యానికి గురైంది. పశువైద్యాధికారితో చికిత్స అందించినా చనిపోయినట్లు బాఽధిత రైతు తెలిపాడు. రూ.60 వేలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఆటో బోల్తా ముగ్గురు మహిళలకు గాయాలు పాల్వంచరూరల్: ఆటో బోల్తా పడి ముగ్గురు మహిళలు గాయపడ్డ ఘటన బుధవారం జరిగింది. మండల పరిధిలోని నర్సింహాసాగర్ గ్రామానికి చెందిన లక్ష్మ, అనూష, కనకమ్మలు తునికి కాయలను విక్రయించడం కోసం ఆటోలో పాల్వంచ వస్తున్నారు. ఈ క్రమంలో ఉల్వనూరు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. -
వైభవం.. జలవిహారం
● శ్రీ సీతారాముల వారికి గోదావరిలో తెప్పోత్సవం ● కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల వారు బుధవారం గోదావరిలో జలవిహారం చేయగా.. ఈ వేడుక అద్భుతంగా సాగింది. తొలుత స్వామి వారి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా గోదావరి వద్దకు తీసుకొచ్చారు. అలంకరించిన పడవలో స్వామి వారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ రమాదేవి గోదావరి మాతకు పసుపు, కుంకుమ సమర్పించాక స్వామి వారికి జలవిహారం గావించారు. రాత్రికి దొంగల దోపు ఉత్సవాన్ని కనులపండువగా జరిపారు. ఈ వేడుకలో ఆలయ సిబ్బంది వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామి వారికి అశ్వవాహన సేవ నిర్వహించారు. కాగా, తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఊంజల్ సేవ జరపనున్నారు. -
జల వనరుల వృద్ధికి చర్యలు
● సింగరేణి ఆధ్వర్యంలో ‘నీటి బిందువు– జలసింధువు’ కార్యక్రమం.. ● త్వరలో సింగరేణి వ్యాప్తంగా 50 చెరువుల ఏర్పాటుకు ప్రణాళిక ● మూతపడిన ఓసీ సంపులను నీటి వనరులుగా మార్చే యోచన సింగరేణి(కొత్తగూడెం): గనుల పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండు కిలోమీటర్ల పరిధిలో 50 సహజ చెరువులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కుంటల్లో నీటి నిల్వకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి ‘నీటి బిందువు–జల సింధువు’ నినాదంతో పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టనుంది. మైనింగ్ ప్రాంతంలోనూ, ప్రాంతానికి వెలుపల రెండు కిలోమీటర్ల పరిధిలోనూ సకల జీవరాశులకు, పంటలకు నీరందేలా చెరువులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసేందుకు కృషి చేస్తోంది. పంచాయతీల అనుమతులు తీసుకోని చెరువులను అభివృద్ధి చేయనుంది. నీటి కుంటలుగా ఓసీ సంపులు మూతపడిన ఓసీ సంపులను నీటి కుంటలుగా మార్చనుంది. సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ సంపుల్లో నీటిశాతం (మట్టాన్ని) పెంచనుంది. తద్వారా సమీప ప్రాంతాల్లో వాటర్ టేబుల్ (నీటిఫలకం)ను వృద్ధి చేసేందుకు, భూగర్భ జలాల పెంపుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్డంప్ల మధ్య ఏర్పడే లోతట్టు ఖాళీ ప్రదేశాలను ఇకపై చిన్నపాటి నీటి తటాకాలుగా తీర్చిదిద్దాలని, వీటిని వర్షపు నీటితో/ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి వెలువడే నీటితో నింపాలని భావిస్తోంది. కార్మికవాడలకు తాగునీరు కూడా.. సింగరేణి భూగర్భ గనుల్లో బొగ్గుతోపాటు వెలువడే నీటిని పైపుల ద్వారా ఫిల్టర్ బెడ్లకు పంపించి, శుద్ధి చేసి కార్మిక వాడలకు యాజమాన్యం తాగునీరు సరఫరా చేస్తోంది. సుమారు 130 ఏళ్లుగా ఇదే విధానం అవలంబిస్తోంది. 2018 నుంచి మాత్రం కొన్ని చోట్ల కాలనీల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తోంది. యాజమాన్యం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో శుద్ధమైన నీరు కార్మికులకు అందనుంది. జీవావరణ పరిరక్షణకు చర్యలు సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల వృద్ధికి, ఆ ప్రాంతంలో జీవావరణ పరిరక్షణకు దోహదం చేసే చర్యలు తీసుకుంటాం. పర్యావరణ అనుమతులతో త్వరలో చెరువుల పనులు ప్రారంభిస్తాం. కార్మికులకూ తాగునీటి సమస్య కూడా తీరుతుంది. –ఎన్.బలరామ్ నాయక్, సింగరేణి సీఎండీ శుద్ధమైన నీటిని అందించాలి సింగరేణి వ్యాప్తంగా చెరువులు ఏర్పాటు చేయాలని తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసి, కార్మికులకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాలి. కొత్తగూడెం ఏరియాలో సుమారు6 చెరువులనుఅభివృద్ధి చేయాలి. –ఎండీ.రజాక్, కార్మిక నాయకుడు -
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
సింగరేణి(కొత్తగూడెం): అమర వీరుల త్యాగాలు స్మరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్‌పాష అన్నారు. రుద్రంపూర్‌లో పునర్నిర్మించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు దేవూరి శేషగిరిరావు విగ్రహాన్ని, సీపీఐ రాష్ట్ర నేత బందెల నర్సయ్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. తొలుత నేతల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ సింగరేణి ప్రధాన కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి శేషగిరిరావు నాటి తెల్లదొరల దోపిడీని వ్యతిరేకించి, కార్మిక హక్కుల సాధనకు కృషి చేశారని గుర్తుచేశారు. నాయకులు బి. అయోధ్య, కొరిమి రాజ్‌కుమార్, వాసిరెడ్డి మురళి, గనిగెల్ల వీరస్వామి, తోట రాజు, ముత్యాల విశ్వనాథం, తాటి వెంకటేశ్వర్లు, డి.వెంకన్న, పుల్లారెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
● విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు ● ఐటీడీఏ పీఓ రాహుల్ మణుగూరు రూరల్/అశ్వాపురం : ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు సబ్ డివిజన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వైద్య సిబ్బందికి సూచించారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని, అశ్వాపురం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది పని తీరు, భోజన సౌకర్యంపై సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయా, భోజనం ఎలా ఉంది అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే వారిని ఆప్యాయంగా పలకరించాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వ్యాఽధితో వచ్చిన వారు పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఉత్తమ సేవలు అందించాలన్నారు. సకాలంలో విధులకు హాజరుకావాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్య తప్పదని హెచ్చరించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రకాల మందులతో పాటు వేసవికాలం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం అశ్వాపురం తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేశారు. కొత్త ఓటరు నమోదు, చేర్పులు, మార్పుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువవికాసం దరఖాస్తులను పరిశీలించారు. ఈనెల 14వరకు గడువు ఉన్నందన ఎక్కువ మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేలా ప్రచారం కల్పించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందని పీఓ దృష్టికి తేగా.. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మణుగూరు ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ గౌరీప్రసాద్, అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్లు స్వర్ణలత, రాఘవరెడ్డి, మణుగూరు ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ఏడీఎంహెచ్ఓ చైతన్య, యూడీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ప్రత్యేక బడ్జెట్ తేవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా వ్యవసాయ రంగం దిబ్బతిని సంక్షోభంలో ఉందని ఆవేదనవ్యక్తం చేశారు. స్వామినాథన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మిర్చి క్వింటాకు రూ.25 వేలు చెల్లించాలి, పత్తికి రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. అనాదిగా పోడుసాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్, జిల్లా నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, నరాటి రమేష్, సపావట్ రవి, విజయలక్ష్మి, సుబ్బారెడ్డి, బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా -
‘పేట’ అడవిలో అలజడి
● నాటు తుపాకులతో వన్యప్రాణుల వధకు వెళ్లిన వేటగాళ్లు ● తారసపడ్డ బేస్ క్యాంపు సిబ్బందిపై దాడి? ● పెనుగులాటలో నాటు తుపాకీ మిస్‌ఫైర్ ? అశ్వారావుపేట: తెలంగాణ, ఏపీ సరిహద్దు గుబ్బలమంగమ్మ ఆలయ అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తుపాకులతో సంచరిస్తున్న వేటగాళ్లు అలజడి సృష్టించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గుబ్బలమంగమ్మ గుడి సమీపంలో ఏపీకి చెందిన ఆరుగురు వ్యక్తులు నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు వచ్చారు. బేస్‌క్యాంపు సిబ్బంది గమనించడంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మిస్‌ఫైర్ చోటుచేసుకుంది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. బేస్‌క్యాంపు సిబ్బందిపై వేటగాళ్లు తుపాకీతో దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా అటవీశాఖ సిబ్బంది ఒక తుపాకీ లాక్కోగా వేటగాళ్లు పరారయ్యారు. తెల్లవారుజాము కావడంతో ఎవరూ దొరకలేదు. బుధవారం ఉదయానికి మిస్‌ఫైర్ ఉదంతం అశ్వారావుపేట ప్రజలకు తెలిసింది. పరారైన వేటగాళ్లు ఏపీ సరిహద్దులోని గోపన్నగూడెం చేరుకున్నారు. పొద్దునే తుపాకులతో కొత్త వ్యక్తులు గ్రామంలో తిరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. కొద్ది రోజులుగా జిల్లా చర్ల సరిహద్దు ఉన్న పొరుగు రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తుపాకులతో వచ్చిన వారు పోలీసులా..? మావోయిస్టులా.? వేగటాళ్లా..? అనే ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. మధ్యవర్తిని ఆశ్రయించి పట్టుబడ్డారు? బేస్‌క్యాంపు సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ కోసం వేటగాళ్లు ఆరుగురు గోపన్నగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించినట్లు సమాచారం. కొంత నగదు ఇస్తామని, తుపాకీ తెచ్చివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి మధ్యవర్తిత్వం వహిస్తూ బేస్‌క్యాంపు సిబ్బందిని సంప్రదించగా.. అటవీశాఖ సిబ్బంది అతన్ని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. మధ్యవర్తి ఇరుక్కుపోవడంతో వేటగాళ్లు దొరికినట్లు తెలుస్తోంది. కాగా ఆరుగురు వేటగాళ్లలో ముగ్గురినే అరెస్ట్ చూపడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రేంజ్ అధికారి మురళిని వివరణ కోరగా.. ఇద్దరు వ్యక్తులు తుపాకులతో ఉండగా మరో వ్యక్తి మందుగుండు సామగ్రి, నీళ్లు మోస్తున్నాడని, మరో ముగ్గురు వ్యక్తులున్నా వారికి వేటకు సంబంధం లేదని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. రెండు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే వేటతో సంబంధం లేని పొరుగు రాష్ట్రం వ్యక్తులు రాత్రి 2 గంటల సమయంలో వేటగాళ్లతో పాటు అటవీ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటవీశాఖకు చెందిన ఓ క్షేత్రస్థాయి అధికారి అనధికార అనుమతితోనే వేటగాళ్లు వేటకు వెళ్లారని, ఈ విషయం తెలియక బేస్ క్యాంప్ సిబ్బంది పట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే బేస్‌క్యాంపు సిబ్బందిపై దాడి చేసినా ముగ్గురినే అరెస్ట్ చేసి, మరో ముగ్గురిని వదిలేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేశాం : ఎఫ్ఆర్వో నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళి తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎఫ్ఆర్వో కథనం ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో అశ్వారావుపేట రేంజ్ కావడిగుండ్ల సెక్షన్ కంట్లం బీట్ పరిధిలోని అడవిలో కంట్లం బేస్ క్యాంపు సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు రెండు నాటు తుపాకులతో తారసపడగా అదుపులోకి తీసుకుని అశ్వారావుపేట రేంజ్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన వారిని విచారించగా ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామానికి చెందిన కారం రవి, కామ మంగరాజు, వంజం నవీన్‌లుగా తేలింది. వన్యప్రాణుల వేటకు వచ్చినట్లు అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. -
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
చుంచుపల్లి: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పేదరిక నిర్మూలన, పౌష్టికాహారం, సుస్థిర వ్యవసాయం, నీటి యాజమాన్య పద్ధతుల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందులో 30 శాతం నిధులు తాగునీటి పైప్‌లైన్ సౌకర్యం లేని ప్రాంతాలకు, మరో 30 శాతం నిధులు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, గృహ ఇంకుడు గుంతలు, నాడెపు కంపోస్ట్ పిట్లకు కేటాయించాలని అన్నారు. సబ్కా యోజన–సబ్కా వికాస్ పథకం ద్వారా 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని, ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పనుల ఎంపికలో విధి విధానాలు పాటించాలని, నిధుల దుర్వినియోగం జరగకుండా చూడాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి, డీపీఓ వి.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికలు ప్రదర్శించాలిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని, ల్యాబ్ పరీక్షలకు డీఆర్ఏ నిర్ణయించిన ధరలనే తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన డీఆర్ఏ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సమస్యలు, వాటి పనితీరుపై చర్చించారు. అస్పత్రుల ముందు భాగంలో అంబులెన్స్‌లు తిరగడానికి, పార్కింగ్‌కు స్థలం ఉండాలని సూచించారు. అనుమతి లేని ఆస్పత్రులతో పాటు అర్హతలేని వారు చికిత్సలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ కృష్ణప్రసాద్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మధువరన్, ఏఓ డాక్టర్ బాలాజీ, ఫైజ్ మొహినుద్దీన్, జూని యర్ అసిస్టెంట్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
● పడిపోతున్న ‘దుమ్ముగూడెం’ నీటిమట్టం
అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతోంది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో గోదావరి వట్టిపోతోంది. ఆనకట్ట సమీపంలో మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్, భారజల కర్మాగారం ఇన్‌టేక్ వెల్ ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. భారజల కర్మాగారానికి ఇన్‌టేక్‌వెల్ ద్వారా నీరు సేకరిస్తారు. ప్రస్తుతం ఉన్న నీటి మట్టంతో ఈ నెలాఖరు వరకు నీటి సమస్య ఉండదని, వచ్చే నెలలో నీటి సమస్య ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. –అశ్వాపురం -
శ్రీకాంత్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ ఔన్నత్యాన్ని చాటుతూ ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. మధురైలో జరిగిన సీపీఎం అఖిల భారత మహాసభలకు వెళ్లిన శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన అంత్యక్రియలు బుధవారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ నివాసంలో జరిగిన సంతాపసభలో అరుణ్‌కుమార్ మాట్లాడారు. జిల్లాలో విద్యార్థి ఉద్యమాభివృద్ధికి ఆయన తోడ్పడ్డారని గుర్తుచేశారు. ఆయన కుటుంబం పార్టీ కోసం నిలబడినందున, ఇప్పుడు వారికి పార్టీ చేదోడుగా నిలవాలని సూచించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. శ్రీకాంత్ లాంటి పోరాట యోధుడు దూరం కావడం బాధాకరమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. శ్రామికవర్గాల రాజ్యస్థాపనకు పనిచేసిన శ్రీకాంత్ సేవలు మరువలేనివని చెప్పారు. అనంతరం అంతిమయాత్రలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా, ఆయన పాడెను అరుణ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు మోశారు. ఇంకా మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఎం.సాయిబాబు, బి.వెంకట్, వై.వెంకటేశ్వరరావు, జూలకంటి రంగారెడ్డి, బాగం హేమంతరావు, పాలడుగు భాస్కర్, బండారు రవికుమార్, ప్రభాకర్, చావా రవి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అలాగే, దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణ జిల్లా కమిటీ బాధ్యులు షేక్ అబ్దుల్ రెహమాన్, మావిడాల ఝాన్సీ, దామల్ల జయ తదితరులు కూడా శ్రీకాంత్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. సంతాప సభలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు అరుణ్ -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బూర్గంపాడు: సారపాక గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సారపాక కండక్టర్స్ కాలనీకి చెందిన బ్రహ్మాచారి(60) వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అశ్వాపురం మండలం ఎలుకలగూడెం మోటార్‌సైకిల్‌పై వెళ్లి మంగళవారం రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు అతని కోసం పలుచోట్ల వెతికారు. బుధవారం ఉదయం సారపాక గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయని, మృతుని కుమారుడు అశోక్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు, బైక్ ఢీ: దంపతులకు తీవ్రగాయాలుజూలూరుపాడు: బైక్, కారు ఢీకొని దంపతులు గాయపడ్డ సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొమ్ముగూడెం వద్ద ఖమ్మం వైపు నుంచి కొత్తగూడెం వెళుతున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కరివారిగూడెం కాలనీకి చెందిన గుగులోత్ కోటియా, లక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీకి ఢీకొని ఆగిపోయింది. ప్రహరీ కూడా ధ్వంసమైంది. గాయపడ్డ దంపతులు కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోటియా, లక్ష్మి దంపతులు కొత్తగూడెం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
భద్రాద్రి బిడ్డ వాదనా పటిమ
● దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ తరఫున వాదించిన విష్ణువర్ధన్‌రెడ్డి ● నిందితులు ఐదుగురికి ఉరిశిక్ష విధించిన హైకోర్టు ● ఎన్ఐఏ పీపీగా రాణిస్తున్న రెడ్డిపాలెం లాయర్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు తెలంగాణ హైకోర్టు మంగళవారం మరణ శిక్ష విధించింది. ఈ కేసులో ఎన్ఐఏ తరఫున వాదించింది జిల్లా న్యాయవాది పత్తి విష్ణువర్ధన్‌రెడ్డి కావడం విశేషం. దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రసిద్ధి చెందిన సాయిబాబా గుడికి వచ్చే భక్తులే లక్ష్యంగా 2013 డిసెంబర్ 21న బాంబు పేల్చగా 18మంది మృతి చెందారు. ఇదే ఘటనలో మరో 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులకు మరణశిక్ష ఖరారు చేసింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. తొమ్మిదేళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతుండగా, 18 కుటుంబాల ఆవేదనకు కారణమైన నిందితులకు ఏ శిక్ష పడుతుందనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. కాగా, ఈ కేసులో నిందితులు తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వకుండా కోర్టు ముందు బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పి.విష్ణువర్ధన్‌రెడ్డి సమర్థమైన వాదనలు వినిపించారు. దీంతో దిల్సుఖ్నగర్ జంట బాంబుపేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది. రెడ్డిపాలెం టు హైకోర్టు విష్ణువర్ధన్‌రెడ్డి స్వస్థలం బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం కాగా, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివారు. ఆ తర్వాత జక్కం పెద్ద బుచ్చయ్య మెమోరియల్ విద్యాసంస్థలో, ఆపై ఏలూరులోని సీఆర్.రెడ్డి కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలోకి వచ్చిన విష్ణువర్ధన్‌రెడ్డి ఉమ్మడి ఏపీ హైకోర్టులో 2000 నుంచి వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కేవలం 35 ఏళ్ల వయసులోనే 2010లో ఎంపికయ్యారు. ఆ తర్వాత 2014లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కి పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా నియమితులయ్యారు. దేశరక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం తరఫున ప్రతిభావంతంగా వాదనలు వినిపిస్తూ దోషులకు శిక్ష పడేలా చూశారు. మృతుల్లో భద్రాద్రి వాసి.. 2013 డిసెంబర్ 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబుదాడిలో మృతి చెందిన వారిలో భద్రాద్రి జిల్లా యువకుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనలో కొత్తగూడెం పట్టణానికి చెందిన అజాజ్ అహ్మద్(18) ప్రాణాలు కోల్పోగా, అప్పుడు ఆయన పాలిటెక్నిక్ చదువుతున్నాడు.కీలక కేసుల్లో వాదనలు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి తొలుత ఎన్ఐఏ కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన విష్ణువర్ధన్‌రెడ్డి ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష పడేలా చేశారు. అంతకు ముందు ఎన్ఐఏ తరఫున గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు పేలుళ్ల ఘటనలోనూ ఆయన ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు పూరి జగన్నాథ్, చార్మిపై నమోదు కాగా, ఆ కేసులోనూ ప్రభుత్వం తరఫున వాదించారు. 2019లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎన్నికై న విష్ణువర్ధన్‌రెడ్డి, తెలంగాణ నుంచి 47 వేల మంది లాయర్లకు ఇండియా బార్ కౌన్సిల్లో ప్రతినిధిగా ఉన్నారు. నల్సార్ వర్సిటీకి ఎగ్జిక్యూటివ్ అకడమిక్ కౌన్సిల్ మెంబర్‌గా 2019 నుంచి, నేషనల్ లా యూనివర్సిటీ, బెంగళూరులోని అకడమిక్ కౌన్సిల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, విష్ణువర్ధర్‌రెడ్డి తండ్రి పత్తి నర్సిరెడ్డి అప్పట్లోనే బీకాం పూర్తి చేసి ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. -
నాణ్యమైన విద్యుదుత్పత్తి చేయాలి
● జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ● పాల్వంచ పర్యటనలో ఆద్యంతం ఆంక్షలుమణుగూరు రూరల్/పాల్వంచ: బీటీపీఎస్, కేటీపీఎస్ల నుంచి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయాలని టీజీ జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన మణుగూరు బీటీపీఎస్, పాల్వంచలోని కేటీపీఎస్ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను విద్యుత్ కోతల నుంచి విముక్తి చేసేందుకు, విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పలు పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు చేపడుతోందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేంతగా తెలంగాణ ఎదిగిందని తెలిపారు. కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో జెన్కో ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించి శిక్షణ పొందుతున్న ఇంజనీర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. శిక్షణతో సాంకేతిక పరిజ్ఞానం ఎంత మేర కలిగిందనే అంశంపై ఆరా తీశారు. ఆ తర్వాత కలెక్టర్ జితీష్ వి.పాటిల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. బీటీపీఎస్ రైల్వే లైన్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని జరుగుతున్న ఆందోళన, తీసుకోవాల్సిన నిర్ణయాలపై కలెక్టర్‌తో చర్చించినట్లు సమాచారం. ఆంక్షలతో పలువురి అసహనం.. సీఎండీ పర్యటనలో ఆద్యంతం ఆంక్షలు విధించడంతో పలు కార్మిక, ఇంజనీరింగ్ ఉద్యోగ సంఘాల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎండీ తొలుత గెస్ట్‌హౌస్‌కు చేరుకోగా కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. ఎంతో కాలంగా విద్యుత్ సంస్థల్లో నెలకొన్న సమస్యలపై సీఎండీని కలిసేందుకు ప్రయత్నించిన సంఘాల వారిని సైతం లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎండీ పర్యటన గతానికి భిన్నంగా సాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయా కార్యక్రమాల్లో జెన్కో డైరెక్టర్లు అజయ్‌కుమార్, సచ్చిదానందం, బి.లక్ష్మయ్య, కేటీపీఎస్చ బీటీపీఎస్ సీఈలు రత్నాకర్, పి.శ్రీనివాసబాబు, ప్రభాకర్ రావు, బి.బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు. -
పచ్చి, పుచ్చు గెలలు..!
● పామాయిల్ ఫ్యాక్టరీకి తీసుకొస్తున్న రైతులు ● నాణ్యత లేక నూనె దిగుబడిపై ప్రభావం ● పట్టించుకోని ఉద్యోగులు, అధికారులుఅశ్వారావుపేట: వేసవి కాలంలో పామాయిల్ గెలల దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ధర ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం టన్ను ధర రూ.21 వేలుగా ఉంది. అయితే పలువురు రైతులు పచ్చి, పుచ్చులు ఉన్న గెలలను ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. అధికారులు, సిబ్బంది మాత్రం గెలల నాణ్యతను పరిశీలించకుండానే అన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో గెలల నుంచి రికవరీ అయ్యే నూనె శాతం తగ్గి.. మంచి గెలలు తెచ్చిన రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఏడాది మొత్తం రైతుల శ్రమ ఈ మూడు నెలల్లో ఆవిరైపోయే ముప్పు పొంచి ఉంది. ఇదేం కొత్త కాదు.. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీని నడపకుండా అశ్వారావుపేట ఫ్యాక్టరీని మాత్రమే నడుపుతున్నారు. దమ్మపేట మండలంలో సన్న, చిన్నకారు రైతులు టన్నులోపు గెలలను అప్పారావుపేట ఫ్యాక్టరీకి చేర్చితే అక్కడి నుంచి రోజుకోసారి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి ఆయిల్‌ఫెడ్ అంతర్గత రవాణా చేస్తోంది. ఇలా నిత్యం 30 నుంచి 40 టన్నుల గెలలు అప్పారావుపేట నుంచి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వస్తాయి. టన్నుకు మించి గెలలున్న రైతులు నేరుగా అశ్వారావుపేట ఫ్యాక్టరీకే తరలించాల్సి ఉంటుంది. ఇలా రోజుకు 300 నుంచి 450 టన్నులు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వస్తాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం గత సోమవారం అశ్వారావుపేట ఫ్యాక్టరీలో అన్లోడ్ చేస్తున్న మూడు ట్రాక్టర్లను పరిశీలించగా ఒక్కో ట్రాక్టర్‌కు పది వరకు పచ్చి గెలలు, పుచ్చు గెలలు ఉన్నాయి. ఇలా నిత్యం 10 నుంచి 20 శాతం పచ్చి, పుచ్చు గెలలు వస్తే రైతులకు గిట్టుబాటు ధర దక్కదు. గతంలో ట్రాక్టర్లలో గెలలు తరలించే క్రమంలో మధలో భారీ రాళ్లు పెట్టి కార్పొరేట్ రైతులు పంపేవారు. వీటిని కన్వేయర్ వద్ద తొలగించే వారు. ఆ తర్వాత సూపర్వైజర్లను ఏర్పాటు చేయడంతో రాళ్ల రవాణా తగ్గుముఖం పట్టింది. ఇక కొంతకాలంగా వేసవిలో పచ్చి, పుచ్చు గెలల రవాణా పరిపాటిగా మారింది. గెలలను నరికి లోడ్ చేసే ముఠాకు టన్నుల వారీగా చెల్లింపులు ఉంటాయి. యజమాని లేకుండా గెలలు నరికే క్షేత్రాల్లో పచ్చి, చచ్చు, పుచ్చు గెలలు లోడ్ చేసి పంపుతారు. ముఖ్యంగా అధిక ధర ఉన్నప్పుడు కౌలు రైతులు ఇలాంటి గెలలు తరలిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. బెదిరింపులు.. తాయిలాలు గెలలు దిగుమతి చేసే సమయంలో కూలీలు పచ్చివాటిని గుర్తించి పక్కన పెడితే కొందరు రైతులు వారిని బెదిరిస్తున్నారని తెలుస్తోంది. దిగుమతి సమయంలో సూపర్వైజర్ ఉన్నా ఉపయోగం లేదు. ‘మేం తలుచుకుంటే మీ ఉద్యోగాలుండవు’ అంటూ కొందరు రైతులు బెదిరిస్తుండడంతో చిరుద్యోగులు ఏమీ చేయలేకపోతున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు నడుచుకుంటే నజరానాలు కూడా కురిపిస్తారు. గతంలో ఈ దందా సాయంత్రం వేళల్లో ఎవరూ చూడకుండా చేస్తే.. ఇప్పుడు మాత్రం పట్టపగలే సాగుతోంది. పచ్చి గెలల బాగోతం హమాలీ నుంచి మేనేజర్ దాకా తెలిసినా నోరు మెదపకపోవడం గమనార్హం. పచ్చి, పుచ్చు గెలలు వేస్తే.. పచ్చి, పుచ్చు గెలలు క్రషింగ్ చేస్తే వాటిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సుమారు 30 శాతం వరకు నూనె ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. ఏడాదిలో మూడు నెలల పాటు రికవరీపై దుష్ప్రభావం పడితే అది ఏడాది నూనె ధరపై ప్రభావం చూపుతుంది. ఆయిల్‌ఫెడ్‌కు క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రైతులు, ముఠా ఇష్టారాజ్యంగా గెలలు నరుకుతున్నా నియంత్రణ లేదు. మిగిలిన పంటల వలె తేమ, పక్వం పరిశీలించే యంత్రాలను ఆయిల్‌ఫెడ్ వినియోగించకపోవడం ఈ దుస్థితికి మరో కారణం. పరిశీలించి వెనక్కి పంపుతున్నాం ఫ్యాక్టరీకి వచ్చే గెలలను పరిశీలించాకే అన్లోడ్ చేయాలని సిబ్బందికి చెబుతున్నాం. రైతులు, సిబ్బంది కుమ్మక్కయ్యారనే విషయం మా దృష్టికి రాలేదు. పచ్చి గెలలు, చచ్చు గెలలుంటే నిర్మొహమాటంగా వెనక్కు పంపుతున్నాం. పూర్తిగా పక్వానికి వచ్చాకే గెలలను ఫ్యాక్టరీకి తీసుకురావాలని రైతులను కోరుతున్నాం. – నాగబాబు, ప్లాంట్ మేనేజర్, అశ్వారావుపేట -
వైభవంగా మహదాశీర్వచనం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు వేద పండితులు మహదాశీర్వచనం అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురాగ్యోలు ప్రసాదించాలని కోరుతూ ఈ క్రతువు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు వివరించారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామివారికి మహదాశీర్వచనం అందజేయడం అనాధిగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ ఎల్.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. చాతకొండ బెటాలియన్ అభివృద్ధికి రూ.20 లక్షలు ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెంఅర్బన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని ఆరో బెటాలియన్‌లో అభివృద్ధి పనుల కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. ఈ మేరకు నిధుల కేటాయింపు లేఖను బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్‌రెడ్డి, ఆర్ఐ జీ.వీ.రామారావుకు మంగళవారం ఖమ్మంలో అందజేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తే బెటాలియన్‌లో సెల్యూటింగ్ డయాస్, గ్యాలరీ నిర్మాణ పనులు చేపడతామని వారు వెల్లడించగా, ఎంపీ రూ.20లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఎంపీకి కమాండెంట్ కృతజ్ఞతలు తెలిపారు. రేపు జాబ్మేళాసింగరేణి(కొత్తగూడెం): పాల్వంచ డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పాన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేపీఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో 25 ఖాళీలు, ముత్తూట్ మైక్రోఫైనాన్స్ కొత్తగూడెం బ్రాంచ్‌లో 20 ఖాళీల భర్తీకి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం సింగరేణి సీఎంఓ కిరణ్ రాజ్‌కుమార్ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణే సంస్థ ధ్యేయమని సీఎంఓ కిరణ్ రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంస్థ నిబంధనల మేరకు కార్పొరేట్ మెడికల్ బోర్డును పారదర్శకంగా నిర్వహిస్తామని, దళారీ వ్యవస్థను అరికడతామని తెలిపారు. కార్మికులకు ఏదైనా జబ్బు చేస్తే సకాలంలో సరైన మందులు అందించేలా ఏడు ఏరియాల్లోని 21 డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తామని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా సింగరేణి ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. రామగుండం రీజియన్ ఆస్పత్రిలో కార్డియో క్యాత్లాబ్ ఏర్పాటు చేసి గోల్డెన్ హవర్ సేవలు అందించేందుకు రూ.13 కోట్లతో పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల్లో గర్భిణుల డెలివరీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తప్పని పరిస్థితుల్లోనే ఆపరేషన్ చేస్తామని పేర్కొన్నారు. -
పేదలకు పక్కా ఇళ్లే లక్ష్యం
● లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవచ్చు ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి ● కోయగూడెంలో ఎమ్మెల్యే, పీఓతో కలిసి శంకుస్థాపనటేకులపల్లి: పేదలంతా పక్కా ఇళ్లల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తమకు నచ్చినట్టుగానే నిర్మించుకోవచ్చని చెప్పారు. మండలంలోని కోయగూడెంలో మంజూరైన 303 ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌తో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పేదల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే పట్టుదలతో రూ.15.15 కోట్లతో 303 ఇళ్లు మంజూరు చేశామన్నారు. మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన, సహజ సిద్ధమైన ఇటుకలు, మెటీరియల్ వినియోగించాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాగానే సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయబోదని స్పష్టం చేశారు. సన్న బియ్యంతో లంచ్.. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న నేపథ్యంలో మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి సురేష్ – శశికళ దంపతుల ఇంట్లో కలెక్టర్, ఎమ్మెల్యే, పీఓ తదితరులు మధ్యాహ్న భోజనం చేశారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు తమ ఇంటికి రావడంతో సురేష్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో హౌసింగ్ పీడీ శంకర్, ఏఈ డేవిడ్, ఏటీడీఓ రాధ, సివిల్ సప్లై డీటీ పాషా, డీఎస్పీ చంద్రభాను, తహసీల్దార్ నాగభవానీ, ఎంపీడీఓ రవీంద్రరావు, మాజీ సర్పంచ్ కోరం ఉమ, కోరం సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. ఇక నువ్వు లేవవా?
మృతి చెందిన ఆవు వద్ద లేగదూడ నరకయాతన అశ్వాపురం: అశ్వాపురం మండలం రామచంద్రాపురం జీపీ శివలింగాపురం పల్లె ప్రకృతి వనం సమీపాన వేటగాళ్ల అమర్చిన ఉచ్చులో చిక్కుకుని ఆవు మృతి చెందింది. మల్లెలమడుగు జీపీ వలస ఆదివాసీ గుంపునకు చెందిన సోడె లక్ష్మయ్య ఆవు నాలుగు రోజులుగా కానరాకపోగా, మంగళవారం శివలింగాపురంలో చనిపోయి కనిపించింది. అయితే, నాలుగు రోజులుగా తల్లి కనిపించక 20రోజుల వయస్సు కలిగిన లేగదూడ తల్లడిల్లుతోంది. ఇంతలోనే ఆవు మృతి చెందిందనే సమాచారంతో రైతు కుటుంబం వెళ్తుండగా వారితో పాటు వచ్చిన లేగ దూడ తల్లిని తట్టి లేపేందుకు, పాలు తాగేందుకు యత్నించడం అందరినీ కలిచివేసింది. -
ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఉండాల్సిందే..
కొత్తగూడెంఅర్బన్: ఆహార సంబంధిత వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ఫోస్టాక్ ఫుడ్ సేఫ్టీ శిక్షణ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొంది ఉండాలని డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్, ఫోస్టాక్ ట్రైనర్ ప్రవీణ్ తెలిపారు. పాన్ ఇండియా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ భాగస్వామి, జాతీయ ఆహార భద్రత సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, ఆమోదించిన ఫోస్టాక్ శిక్షణ, సర్టిఫికెట్ కార్యక్రమం మంగళవారం డీఎంహెచ్ఓ సమావేశపు హాల్లో నిర్వహించగా.. వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కల్తీని గుర్తించాలని తెలిపారు. ఎవరైనా ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తినుబండారాలకు సంబంధించి దుకాణాదారులు, వ్యాపారులంతా ఫుడ్ లైసెన్స్‌తో పాటు ఫోస్టాక్ ట్రైనింగ్ సర్టిఫికెట్‌ని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేవీజీవీఎం సౌత్ ఇండియా ఇన్‌చార్జ్‌లు టి.సింధు, ఇ.మోహన్‌బాబు, కొత్తగూడెం జిల్లా టీం హెడ్ శివకల్పన, జిల్లా ఎగ్జిక్యూటివ్‌లు సోహెల్, యాకూబ్, శేఖర్, షఫీ, సమీర్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఈ నెల 20వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగే పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు 720 మంది ఉండగా మూడు పరీక్ష కేంద్రాలు, 826 మంది ఇంటర్ విద్యార్థులకు గాను నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని, పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘యువిక’కు దమ్మపేట గురుకులం విద్యార్థి దమ్మపేట/నేలకొండపల్లి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహిస్తున్న యువ విజ్ఞాని కార్యక్రమ్(యువిక)కు నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లికి చెందిన విద్యార్థి బారి ఉదయ్ ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన బారి వెంకన్న–సునీత దంపతుల కుమారుడు ఉదయ్ దమ్మపేటలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పాఠశాల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆసక్తి పెంచేందుకు ‘యువిక’ కార్యక్రమం నిర్వహిస్తుండగా 15రోజుల శిక్షణకు ఆయన ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఉదయ్‌ను జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఎం.ధనలక్ష్మి, గ్రామస్తులుపోలంపల్లి నాగేశ్వరరావు, మరికంటి ఉమ తదితరులు అభినందించారు. ఆఫ్‌టైప్ మొక్కలకు నష్టపరిహారం ఇవ్వాలి అశ్వారావుపేటరూరల్: ఆఫ్‌టైప్ మొక్కలతో తీవ్రంగా నష్టపోయిన పామాయిల్ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ఆయిల్‌పాం రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్ చేశారు. మండలంలోని నారంవారిగూడెంలోని ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం ధర్నా చేయగా.. ఆయన మాట్లాడారు. ఆయిల్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు అందించిన ఆఫ్‌టైప్ మొక్కలతో తీరని నష్టం వాటిల్లిందని, బాధిత రైతులను గుర్తించి తక్షణమే నష్ట పరిహారం అందించాలని కోరారు. అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల పరిధిలో ఆయిల్ రిఫైనరీ యూనిట్, ఐఐఓపీఆర్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయిల్‌ఫెడ్ డివిజనల్ అధికారి నాయుడు రాధాకృష్ణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యలమంచిలి వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, రైతులు తుంబూరు మహేశ్వరరెడ్డి, తలసీల ప్రసాద్, కారం శ్రీరాములు, ఆళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేడు వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్ ఖమ్మంవ్యవసాయం: పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించేందుకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జోన్–1 నుంచి జోన్–7 వరకు 373 మంది వెటర్నరీ అసిస్టెంట్ల(పశువైద్య సహాయకులు)లో అర్హులకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లు(పశుసంపద సహాయకులు)గా పదోన్నతి కల్పిస్తారు. జోన్–4లోకి వచ్చే హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి 46 మంది అర్హత సాధించగా, బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి కౌన్సెలింగ్‌లో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.వెంకటనారాయణతో పాటు మరో అసిస్టెంట్ డైరెక్టర్, కార్యాలయ మేనేజర్ పాల్గొని, రోస్టర్ ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తారు. బొలేరో వాహనం బోల్తా చర్ల: మండలంలోని దండుపేటలో మంగళవారం రాత్రి మిర్చి లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం బోల్తా పడింది. చర్లకు చెందిన టీఎస్28 టీఏ 1573 నంబర్ గల బొలేరో వాహనం కొత్తపల్లి నుంచి మిర్చి లోడుతో గుంటూరుకు బయలుదేరింది. దండుపేట మూలమలుపు వద్ద అదుపుతప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. -
అకాల వర్షం.. ఆగమాగం..
ఇల్లెందురూరల్/అశ్వారావుపేటరూరల్/గుండాల/పాల్వంచరూరల్/టేకులపల్లి: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో చేతికందే దశలో ఉన్న పంటల నేలరాలాయి. ప్రధానంగా ఇల్లెందు, అశ్వారావుపేట, గుండాల, ఆళ్లపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, పాల్వంచ, టేకులపల్లి తదితర మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట గింజదశక చేరకోగా భారీ వర్షాలతో పంట నీటమునిగింది. మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న 50 శాతానికి పైగా కోయగా, మిగిలిన పంట గాలిదుమారంతో నేలవాలింది. కోసిన మొక్కజొన్నలు సైతం కల్లాల్లో ఆరబెట్టగా వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న గింజలు మొలకలు వస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో ఈ మూడింటితో పాటు వేరుశనగ, ముగన, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. గుండాల మండలంలో పంటలతో పాటు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పలువురు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడి రవాణాకు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు విరిగిపడి అనేక గ్రామాల్లో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు, బాధితులు వేడుకుంటున్నారు. అయితే మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మాత్రం జిల్లాలో వరికి పెద్దగా ముప్పు వాటిల్లలేదని, మొక్కజొన్న పంటకు మాత్రం కొంతమేర నష్టం జరిగిందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,562 ఎకరాల్లో మామిడి సాగు కాగా, అందులో 20 శాతం మేర నేలరాలినట్టు అంచనా వేస్తున్నారు. టేకులపల్లి: మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. గంగారం, సంపత్‌నగర్, చింతోనిచెలక, బోడు గ్రామాల్లో మామిడి కాయలు రాలిపడ్డాయి. -
చేతబడి నెపంతో వ్యక్తి హత్య
దుమ్ముగూడెం: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా చేతబడులంటూ కొందరు హత్యలు చేస్తున్నారు. జడ్.వీరభద్రాపురం గ్రామానికి చెందిన కొమరం రాముడు(53)ను చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఉరి వేసి చంపి, గోనె బస్తాలో కుక్కి, చెరువులో పడేసిన అమానవీయ ఘటనకు సంబంధించి సీఐ అశోక్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కొమరం రాముడు గత మార్చి 11వ తేదీన గ్రామంలో జరిగిన వివాహానికి భార్యతో కలిసి వచ్చాడు. అనంతరం భార్య ఇంటికి వెళ్లగా రాముడు రాకపోవడంతో ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మార్చి 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన కొమరం వెంకటేశ్, మణుగూరు మండలం చిన్నరావిగూడెంవాసి పద్దం బాలరాజు మంగళవారం తామే హత్య చేశామని పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కాగా, రెండు నెలల కిందట వెంకటేశ్ తమ్ముడు కొమరం రాంబాబు చర్ల వెళ్తుండగా.. కొమరం రాముడు ఎట్టు వెళ్తున్నావని ప్రశ్నించాడని, చర్ల వెళ్తున్నానని చెప్పడంతో ‘నువ్వు చచ్చిపోతావ్’ అని అన్నాడని వెంకటేశ్ పోలీసులకు తెలిపాడు. చర్ల నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో రాంబాబు మృతి చెందాడని, కొన్నేళ్ల కిందట తన తండ్రి మృతి చెందాడని, తన భార్య సైతం పక్షవాతానికి గురైందని, దీనికంతటికీ కారణం కొమరం రాముడు చేతబడి చేశాడని చెప్పాడు. దీంతోనే తన బావమరిది పద్దం బాలరాజుతో కలిసి, రాముడుకు మద్యం తాగించి ఉరివేసి చంపి, గోనె బస్తాలో మూటగట్టి చెరువులో పడేశామని విచారణలో అంగీకరించాడు. కాగా, మంగళవారం గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి గజఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించామని సీఐ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని చెరువులో పడేసిన వైనం -
ఎక్కడి చెత్త అక్కడే..
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంలో రెండు రోజుల పాటు పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలిగింది. దీంతో దేవస్థానం చుట్టూ ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. అపరిశుభ్రత తాండవిస్తోంది. క్యూలైన్లు, పురవీధుల్లో చెత్తాచెదారం కుప్పలుగా పడి ఉంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు దుర్గంధం భరించలేకపోతున్నారు. భక్తులకు అందజేసేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్యాకెట్ల బస్తాలను అలాగే వదిలేయడంతో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీధుల్లో చెత్త వేయడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డ్రమ్ములను తరలించకపోవడంతో అందులో నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. కరకట్టపైన, చెట్ల కింద చెత్త అలాగే పేరుకుపోయింది. -
మళ్లీ ట్రాఫిక్ పాట్లు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో సోమవారం వీవీఐపీల తాకిడి పెద్దగా లేకపోయినా స్థానికులు ట్రాఫిక్పాట్లు తప్పలేదు. శ్రీరాముడికి పట్టాభిషేకం జరపగా, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కోరం కనకయ్య కూడా పాల్గొన్నారు. వీరితోపాటు ముగ్గురు, నలుగురు వీఐపీలు మాత్రమే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఆదివారం రాత్రి చాలా సేపు వరకు బారికేడ్లు తొలగించకుండా స్థానికులను ఇబ్బందికి గురిచేశారు. సోమవారం ఉదయం గవర్నర్ భద్రాచలం వచ్చే 20 నిమిషాల ముందు నుంచే బ్రిడ్జి సెంటర్లో ట్రాఫిక్ నిలిపివేయగా భక్తులు, ద్విచక్రవాహనదారులు ఎండ వేడి కారణంగా అవస్థ పడ్డారు. మిథిలా స్టేడియంలో పట్టాభిషేకం కార్యక్రమాన్ని గవర్నర్ ముగించుకుని ఐటీడీఏలో గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించేందుకు బయలుదేరిన సమయంలో కూడా బ్రిడ్జి సెంటర్ నుంచి ఐటీడీఏ రోడ్డు వరకు అన్ని వాహనాలను ఆపేశారు. అనంతరం ఐటీడీఏలో కార్యక్రమాలను ముగించుకుని గవర్నర్ సారపాకకు తిరిగి వెళ్తున్న క్రమంలో మరోసారి ఐటీడీఏ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ఉన్న కాలనీల వీధుల్లోని వాహనాలను మెయిన్ రోడ్డు మీదకు రాకుండా దాదాపు 20 నిమిషాల వరకు నిలిపివేశారు. భద్రాచలంలో 6,7 తేదీల్లో జరిగిన శ్రీరామనవమి, పట్టాభిషేకం కార్యక్రమాలలో పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో పాటు, భక్తులు, స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు. వాహనాలు నిలిపివేయడంతో స్థానికుల అవస్థ -
గవర్నర్‌కు ఘనస్వాగతం
బూర్గంపాడు: భద్రాచలం శ్రీరామ పట్టాభిషేకానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సారపాకలో ఘనస్వాగతం లభించింది. సారపాకలోని ఐటీసీ అనుబంధ భద్రాచలం పబ్లిక్‌స్కూల్ ఆవరణలోని హెలీప్యాడ్‌కు చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న గవర్నర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపు గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం భద్రాచలం రామాలయానికి వెళ్లారు. శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు తిరిగి వచ్చిన అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత హెలీప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్ వెళ్లారు. రెడ్ క్రాస్ సేవలు విస్తృతపరచాలి రెడ్ క్రాస్ సేవలు మరింతగా విస్తృతపరచాలని రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్ వర్మ సూచించారు. ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం గవర్నర్‌ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం శాఖ ప్రతినిధులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా భద్రాచలం రెడ్‌క్రాస్ సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం గవర్నర్ పలు సూచనలు చేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులు ఎస్ఎల్ కాంతారావు, శ్రీనివాసరావు, సూర్యనారాయణ, రాజారెడ్డి, గాలిబ్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన సాగిందిలా... భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో సోమవారం గవర్నర్ పర్యటన 3: 31 గంటల పాటు సాగింది. ఉదయం 10:59 గంటలకు సారపాక ఐటీసీలోని బీపీఎల్ స్కూల్ హెలీప్యాడ్‌లో దిగారు. అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, 11:28 గంటలకు అక్కడి నుంచి భద్రాచలానికి రోడ్డుమార్గాన బయల్దేరారు. 11:42 గంటలకు రామాలయం, లక్ష్మీతయారు అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకుని పట్టాభిషేకానికి హాజరయ్యారు. 12:55 గంటలకు మిథిలా స్టేడియం నుంచి బయల్దేరి ఐటీడీఏకు వెళ్లారు. అక్కడ గిరిజన మ్యూజియం ప్రారంభించి, 1:58 గంటలకు తిరిగి ఐటీసీ గెస్ట్‌హౌస్ చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. -
ఫిల్టర్‌బెడ్‌లో ఇసుక మార్పిడి
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లో నీటిని శుద్ధి చేసే ఇసుకను మారుస్తున్నారు. పదిహేను రోజులుగా పనులు నిర్వహిస్తున్నారు. 2010లో ఫిల్టర్ బెడ్ నిర్మించి, అధునాతన గ్రావిట్ ర్యాపిడ్ ఫిల్టరేషన్ పద్ధతిలో తాగునీరు శుద్ధి చేస్తున్నారు. ఇల్లెందులపాడు తాగునీటి చెరువు నుంచి నీటిని తరలించి, ఇక్కడ శుద్ధి అనంతరం పట్టణంలోకి వదులుతున్నారు. అయితే ఫిల్టర్‌బెడ్‌లో నీటి శుద్ధి ప్రక్రియలో ఇసుకను నాలుగైదేళ్లకోసారి మార్చాల్సి ఉండగా, ప్రారంభం నుంచి ఇప్పటివరకు మార్చలేదు. ఎట్టకేలకు గత పాలకవర్గం రూ. 25 లక్షలు కేటాయించి ఇసుక మార్పిడి పనులు చేపట్టింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ గత 15 రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇందుకోసం చీరాలలోని సముద్ర తీరం నుంచి ఇసుక, గులకరాళ్లు తెప్పించారు. ఫిల్టర్‌బెడ్‌లో గులక రాళ్లు, ఇసుక పొరలు పొరలుగా అమర్చుతున్నారు. పొరలపై రా వాటర్ వదిలితే ఇసుక, రాళ్లు నీటిలోని మలినాలు, మడ్డిని ఫిల్టర్ చేస్తాయి. అనంతరం నీరు పైపుల నుంచి సంప్‌లో చేరాక, ప్రజలకు సరఫరా చేస్తారు. పేరుకుపోయిన మలినాలను నెలకోసారి తొలగిస్తారు. ఇక్కడ రెండు బెడ్లు ఉండగా, ఒకదానిలో మరమ్మతులు చేపడుతున్నారు. మరో బెడ్ నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న ఇసుక తొలగింపు ఫిల్టర్‌బెడ్ మీడియా చేంజ్ పనులు మరో 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ‘రా’వాటర్ ఫిల్టరైజేషన్ను ఢోకా ఉండదు. కాగా పట్టణంలోని మూడొంతుల జనాభాకు ఈ ఫిల్టర్‌బెడ్ నుంచే తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇల్లెందులో రూ.25 లక్షలతో సాగుతున్న పనులు సముద్ర తీరం నుంచి సేకరించిన గులక రాళ్ల వినియోగం తాగునీటి శుద్ధి వ్యవస్థ మెరుగయ్యేలా మరమ్మతు పనులు వేగంగా చేపట్టాలి పట్టణ ప్రజలకు నీరందించే ఫిల్టర్ బెడ్లో ఇసుక మార్పిడి ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి. వేసవి కాలం కావడంతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి. నాణ్యతలో రాజీ పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పట్టణవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి. – కొడారి రాజేందర్, ఇల్లెందు మరో 15 రోజుల్లో పూర్తి.. మున్సిపల్ ఫిల్టర్‌బెడ్‌లో ఇసుక మార్పిడి ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇక్కడ రెండు బెడ్లు ఉండగా, ఒక బెడ్లో నీటిని నిలిపి వేసి, మరో బెడ్లో ఇసుక, రాయి లేయర్ల వారీగా వేస్తున్నాం. ఈ ప్రక్రియ మరో 15 రోజులో పూర్తి అవుతుంది. నీటి శుద్ధికి ఢోకా ఉండదు. –సీహెచ్ శ్రీకాంత్, కమిషనర్, ఇల్లెందు -
ట్రాన్స్జెండర్లను గౌరవంగా చూడాలి
కొత్తగూడెంటౌన్: ట్రాన్స్జెండర్లను, సెక్స్ వర్కర్లను అందరూ గౌరవించాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని భవిత సెంటర్లో ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. న్యాయమూర్తి బియ్యం అందజేసి మాట్లాడారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ నెల ఉచితంగా బియ్యం ఇస్తామని, పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలని సెక్యూర్ ఎన్జీఓ ప్రాజెక్టు మేనేజర్ రాజేంద్రప్రసాద్‌ను ఆదేశించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్‌రావు, సెక్యూర్ ఏన్జీఓ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలివీసీలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి హన్మకొండ: ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం ఆయన 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను పరిశీలిస్తూ అంతరాయం ఎదురైతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడినా, ట్రిపింగ్, బ్రేక్డౌన్లు వచ్చినా త్వరగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, పంట కోతలు జరుగుతున్నందున పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీసుల మంజూరులో వేగం పెంచాలని, అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సీఎండీ ఆదేశించారు. విజేతలకు బహుమతుల ప్రదానంకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లాస్థాయి మ్యాక్స్ అండ్ సైన్స్ క్విజ్ కార్యక్రమం ముగింపు ఉత్సవానికి డీఈఓ వెంకటేశ్వరాచారి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్టీయ్ర ఆవిష్కార అభియాన్ కార్యక్రమంలో భాగంగా 8, 9తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయిలో మ్యాథ్స్, సైన్స్ క్విట్ పోటీలు నిర్వహించారు. 9వ తరగతి విభాగంలో సీహెచ్.రేణుక, లక్ష్మీమణి, ఎస్.సుబ్రహ్మణ్యం, ఎం.భరత్ చంద్ర, 8వ తరగతి విభాగంలో బి. జాహ్నవి, కే.భవ్య శ్రీ, ఎన్.గీతిక బహుమతులు గెలుచుకున్నారు. డీఈఓ బహుమతులు అందించి మాట్లాడారు. పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు హాజరుకాగా, కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఏ.నాగరాజశేఖర్, ఎస్కే సైదులు, ఎన్.సతీష్ కుమార్ పాల్గొన్నారు. నవమితో ఆర్టీసీకి ఆదాయం భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఈ నెల 6,7 వ తేదీల్లో జరిగిన శ్రీ రామనవమి, పట్టాభిషేకం సందర్భంగా ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో భద్రాచలం డిపోకు సుమారు రూ.9.5 లక్షల ఆదాయం పెరిగింది. సాధారణంగా భద్రాచలం డిపో పరిధిలో రోజూ 92 సర్వీసులు నడుపుతుండగా, రూ. 23 లక్షల వరకు ఆదాయం వస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా 5న అదనంగా మరో 26 సర్వీసులు తిప్పగా రూ.3 లక్షల మేర ఆదాయం పెరిగింది. 6న అదనంగా 30 సర్వీసులు నడపగా రూ. 4.50 లక్షలు, 7వ తేదీన అదనంగా 16 సర్వీసులు నడపగా రూ. 2 లక్షల వరకు ఆదాయం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మద్యానికి బానిపై ఆత్యహత్య ఇల్లెందు: ఇల్లెందు మండలం ధనియాలపాడు సమీపాన జామాయిల్ తోటలో ఓ వ్యక్తి ఆత్యహత్య పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కారేపల్లి మండలం చెన్నంగులగడ్డకు చెందిన డి.సురేష్(38) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబంలో గొడవలు జరుగుతుండగా, సోమవారం ధనియాలపాడు సమీపాన జామాయిల్ తోటలో ఉరి వేసుకున్నాడు. ఘటనపై ఆయన భార్య వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్‌మీరా తెలిపారు. -
రోజుకు 8 గంటలు పనిచేయాలి
● యంత్రాల వినియోగం పెంచాలి ● 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు ● సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ వెల్లడి మణుగూరు టౌన్: ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పనిచేయాలని, యంత్రాల వినియోగాన్ని 22 గంటలకు పెంచాలని సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ అన్నారు. సోమవారం ఆయన మణుగూరు ఏరియాలోని పీకేఓసీ, కొండాపురం భూగర్భగని, మణుగూరు ఓసీలను సందర్శించారు. ఓసీ–2లో నూతన సైట్ ఆఫీస్‌తో పాటు కేపీయూజీ మైన్ రెస్క్యూ స్టేషన్‌ను, ఓసీ–4 ప్రీ వెయిట్ ట్రక్ లోడింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యంత్ర సామర్థ్య వినియోగంలో పీకేఓసీ ఉత్తమ గని అవార్డు సాధించడం అభినందనీయమని, కార్మికులు, అధికారులు ఇదే ఒరవడి సాగించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని అధిగమించి 127 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు, కోలిండియా నుంచి సింగరేణికి గట్టి పొటీ ఎదురవుతోందని, దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బ్లాక్‌ల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌తో పాటు కొత్తగూడెం వీకే, ఇల్లెందులోని రొంపేడు ఓసీ, గోలేటి(బెల్లంపల్లి) ఓసీలను ప్రారంభించేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా 245.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, వీటిని 1000 మెగావాట్లకు పెంచాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ రంగాల వ్యాపార విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మణుగూరు పీవీ కాలనీ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్సీ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్‌ను నియమిస్తామన్నారు. అంతకుముందు కార్మికులతో కలిసి క్యాంటీన్లో అల్పాహారం చేసి నాణ్యతపై ఆరా తీశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ, ఎల్.వి.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం దుర్గం రాంచందర్, జీఎంలు సురేశ్, శ్రీనివాసరెడ్డి, ఎస్ఓటు డైరెక్టర్ కేవీరావు, ఏజీఎం బొజ్జ రవి, అధికారులు లక్ష్మీపతిగౌడ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి, వెంకట్రావ్, రమేశ్, శ్రీనివాస్, అనురాధ, బాబుల్ రాజ్, యూనియన్ నాయకులు రాంగోపాల్, కృష్ణంరాజు, వెంకటరత్నం పాల్గొన్నారు. -
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా యూసీఈ
● అప్‌గ్రేడ్ చేస్తూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం ● కొత్తగూడేనికి ప్రత్యేక గుర్తింపు ● అందుబాటులోకి కొత్త కోర్సులుకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(యూఈసీ – కేయూ)ను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. ఈ కళాశాల దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉండగా 300 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లూ ఎర్త్ సైన్సెస్ కోర్సు చదవాలంటే సెంట్రల్ యూని వర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేది. కొత్తగూడెంలోనే ఈ కోర్సులు అందుబాటులోకి రానుండడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లా వాతావరణం కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే. ఇక అలాంటివాటిపై అధ్యయనం చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు సీఎంకు వినతులు ఇవ్వగా ఇప్పుడు ఆయన కృషి ఫలించినట్టయింది. సహజ వనరులు, మినరల్స్ ఉన్న కొత్తగూడెంలో యూనివర్సిటీ ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం సింగరేణి, వివిధ కంపెనీల్లో పని చేస్తున్న వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు.. ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ కానుండగా అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్‌కు బాటలు వేసే అవకాశం ఉంటుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లతో జిల్లాకు జాతీయస్థాయిలో పేరు రానుంది. ఈ యూనివర్సిటీలో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్యా పెరగనుంది. కేయూ నుంచి విడిపోనుంది.. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో ఈ కాలేజీ కేయూ నుంచి విడిపోనుంది. 1978లో స్కూల్ ఆఫ్ మైన్స్‌గా ఓయూ పరిధి నుంచి కొత్తగూడెంలో పీజీ సెంటర్ ఏర్పాటైంది. తొలినాళ్లలో బీఈ మైనింగ్‌తో పాటు ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులు ఉండగా, కేయూ ఏర్పాట య్యాక 1996లో ఆ పరిధిలోకి చేర్చి కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చారు. ఆ సమయాన ఈఈఈ, సీఎస్ఈ, 2010లో ఐటీ, ఈసీఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినా మధ్యలో ఎమ్మెస్సీ జియాలజీ కోర్సు తొలగించా రు. ఇప్పుడు కేయూ నుంచి విడిపోతున్నందున బోధన, బోధనేతర పోస్టులే కాక కాలేజీ ఆస్తులన్నీ బదలాయిస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో 41 అధ్యాపకుల పోస్టులకు గాను ప్రస్తుతం 16మంది రెగ్యులర్, మిగతా వారు కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. 106 నాన్‌టీచింగ్ పోస్టులకు 60 మంది పనిచేస్తున్నారు. వర్సిటీగా అప్‌గ్రేడ్ కాగా పోస్టులు పెరిగే అవకాశముంది. ఇక ఈ కాలేజీలో నియామకమైన అసోసియేట్ ప్రొఫెసర్లు బిక్షాలు, వెంకటరమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాధిక, సుమలత కేయూలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరి డిప్యూటేషన్లు రద్దు చేస్తారా, ఆప్షన్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
ఆదివాసీ సంస్కృతి అందరికీ తెలియాలి
● గిరిజన మ్యూజియం ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● గుడ్ జాబ్ అంటూ పీఓకు కితాబుభద్రాచలంటౌన్: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో ప్రాచుర్యం ఉందని, వాటి ప్రత్యేకతలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన గిరిజన మ్యూజియాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మ్యూజియంలో పొందుపర్చిన ప్రతీ వస్తువు విలువైనదని, వీటిని సేకరించడం గొప్ప విషయమని అన్నారు. పూర్వీకులు ఎలాంటి జీవనం గడిపారో ఈ వస్తువులను చూస్తే అర్థమవుతోందని అన్నారు. పూర్వపు గుర్తులతో పాటు ఆదివాసీ పల్లెలు గుర్తొచ్చేలా ఆహ్లాద వాతావరణం సృష్టించడం అభినందనీమన్నారు. గుడ్జాబ్ అంటూ కితాబు.. ఆదివాసీల అచార వ్యవహారాల వస్తువులను సేకరించి ఒకచోట చేర్చడం సామాన్యమైన విషయం కాద ని, ‘గుడ్ జాబ్’ అంటూ పీఓ రాహుల్‌ను గవర్నర్ అ భినందించారు. మ్యూజియాన్ని మరింతగా అధునికీకరించేలా కృషి చేసి పర్యాటకులు, సందర్శకుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వంటలు బాగున్నాయి.. మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులోని స్టాళ్లను సందర్శించిన గవర్నర్.. ఆదివాసీ వంటకాల్లో బొద్ది కూర పచ్చడిని రుచి చూసి బాగుంది అన్నారు. ‘తెలుగు రాక రుచి చెప్పలేకపోతున్నా దీన్ని ఏమంటారు’ అని ఇంగ్లిష్‌లో అడిగారు. భాష రాక మాట్లాడలేక పోతున్నా.. ఏమీ ఎనుకోకండి అని ఆదివాసీ మహిళలతో అన్నారు. ఈసారి తెలుగు నేర్చుకుని వచ్చి అన్ని వంటల రుచులు చెబుతానని అనగా.. మహిళలు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారు తయారు చేసి మూలికల అయిల్, ఇప్ప లడ్డూలతో పాటు పలు రకాల స్వీట్లు గవర్నర్‌కు ఇవ్వగా వాటికి డబ్బు చెల్లించారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, పీఓ బి.రాహుల్, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కోయ భాషలో పలకరించిన తుమ్మల మ్యూజియం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన విద్యార్థులతో కోయ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ‘నాటే చదవ మిన్నారే.. రోడ్డుకు మంచిక మిన్నాకే’ అంటూ కోయభాషలో యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంత్రి తుమ్మల కోయ భాషలో అనర్గళంగా మాట్లాడగా అందరూ ఆసక్తిగా విన్నారు. -
వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం
● అయోధ్యపురిగా మారిన మిథిలా స్టేడియం ● రాజదండం, రాజముద్రిక, రాజ ఖడ్గాలకు పూజలు ● సిరియపాదుక శ్రీ ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు ● పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మమంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పట్టాభిషేకానికి హాజరైన భక్తజనంరాజ లాంఛనాలతో పట్టాభిషేకం.. పట్టాభిషేక రాజ లాంఛనాల అలంకరణ మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. ముందుగా రాజదండాన్ని శ్రీరాముడి కుడిచేతిలో ఉంచారు. ఆ తర్వాత రాజముద్రిక తొడిగారు. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతాదేవికి, రామమాడను లక్ష్మణుడికి అలంకించారు. శ్రీరాముడికి ఇరువైపులా చామరాలు ఉంచి, ఆపై స్వర్ణఛత్రాన్ని స్థిరం చేశారు. చివరగా రాజఖడ్గాన్ని రామయ్య ఎడమ చేతిలో ధరింపజేశారు. స్వర్ణ ఛత్రం నీడలో రాజముద్రిక, రాజదండం, రాజఖడ్గం ధరించిన తర్వాత పట్టాభిషేకం కార్యక్రమాన్ని రుత్విక్కులు ప్రారంభించారు. మండపత్రయంలోని మూడు కలశాల్లోని సమస్త దేవతలు, సమస్త జలాలు, రామపరివారంతో కూడిన మంత్రించిన జలాన్ని శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపి చివరగా మంగళహారతి సమర్పించారు. మండప్రతయ ఆరాధన.. రుత్విక్కరణం తర్వాత పండితులు మండపత్రయ పూజలు ప్రారంభించారు. శ్రీరాముడి పట్టాభిషేకానికి సమస్త దేవతలు, సమస్త నదీ, సముద్ర జలాలతో పాటు రామపరివారాన్ని ఆవాహన చేయడం ఈ మండపత్రయ ఆరాధన ప్రధాన ఉద్దేశం. పట్టాభిషేకం వేదిక దిగువ భాగాన మూడు కలశాలను ఏర్పాటు చేశారు. మధ్య కలశంలో సముద్ర, నదీ జలాలను ఆవాహన చేశారు. ప్రధానంగా తూర్పున పూరీ, దక్షిణాన ధనుష్కోటీ, పశ్చిమాన ద్వారకకు చెందిన సముద్ర జలాలు అవాహన చేయగా ఆగ్నేయం నుంచి గంగా, నైరుతి నుంచి కృష్ణా, వాయువ్యం నుంచి గోదావరి, ఈశాన్యం నుంచి కావేరీ నదీ జలాలను ఆవాహన చేశారు. నదీ, సముద్ర జలాలను ఆవాహన చేసిన కలశానికి కుడివైపున ఉన్న కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు రామపరివారాన్ని ఆవాహన చేశారు. ఇందులో తూర్పున హనుమ, పడమర లక్ష్మణ, ఉత్తరాన శతృఘ్నుడు, దక్షిణాన భరతుడు, ఆగ్నేయంలో అంగదుడు, వాయువ్యంలో సుగ్రీవుడు, ఈశాన్యంలో విభీషణుడు, నైరుతిలో జాంబవతుడిని ఆవాహన చేశారు. ఎడమవైపు కలశంలో అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. పట్టాభిషేకం చేసే రాజముద్రికలో లక్ష్మీదేవిని, రాజదండంలో విశ్వక్సేనుడిని, చామరలో వైనతేయుడు, గరుత్మంతుడు, ఖడ్గంలో నందకుడు, స్వర్ణఛత్రంలో అనంతుడు, పాదుకల్లో ఆదిశేషుడు, దేవేరులు ధరించే ఆభరణాల్లో భూదేవిని ఆవాహన చేశారు. మండపత్రయ ఆరాధాన ముగిసిన తర్వాత శ్రీరాముడికి అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి ఆనాటి శ్రీరాముడి పాలన విశిష్టతలను వివరించారు. ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి.. పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని సీతాసమేత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి భక్తుల కోలాహలం నడుమ ప్రధాన ఆలయం నుంచి ప్రత్యేక పల్లకీలో ఉదయం 10:17 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అర్చకులు మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం చేసేందుకు వీలుగా పండితులు రుత్విక్కులైన వశిష్టుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడిని తమలో ఆవాహన చేసుకున్నారు. హనుమంతుని మెడలో ముత్యాల దండ.. రామయ్య పట్టాభిషేకం అనంతరం రామయ్యకు ముత్యాల దండ ధరింప చేశారు. ఇదే దండను సీతాదేవి మెడలోనూ ధరింపచేశారు. చివరకు అదే దండను ఆంజనేయుడి మెడలో వేశారు. దీంతో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ముగియగా.. పట్టాభిషేకం అనంతరం సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు తాతగుడి సెంటర్ వరకు రథోత్సవం నిర్వహించారు. రథస్థం రాఘవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ అని బ్రహ్మ పురాణం చెబుతోందని, రథోత్సవంలో శ్రీ రాముడిని సేవించిన వారికి ముక్తి లభిస్తుందని అర్చకులు వివరించారు. సిరియ తిరువుడి పట్టాభిషేకం.. వాల్మీకి రామయాణంలో పట్టాభిషేకానికి ముందు రోజు శ్రీరాముడు అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్తారు. దీంతో ముందుగా శ్రీరాముడి పాదుకలకు పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత రామయణ క్రమంలో సుగ్రీవుడికి, విభీషణుడికీ పట్టాభిషేకాలు జరిగాయి. ఆ తర్వాతే శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. అయితే విష్ణువుకు అన్ని అవతారాల్లోనూ గరుత్మంతుడు సేవలు అందించగా రామావతారంలో మాత్రం హనుమంతుడు సేవ చేశాడు. దీంతో గరుత్మంతుడిని పెరియ తిరువుడిగా, హనుమంతుడిని సిరియ తిరువుడిగా కొలుస్తారు. శ్రీరాముడి పాదుకలతో మొదలైన పట్టాభిషేక మహోత్సవం సిరియ తిరువుడైన హనుమంతుడి పట్టాభిషేకంతో ముగిసింది. పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వం తరఫున గవర్నర్ పట్టువస్త్రాలు అందించడం ఆనవాయితీ. ఈ క్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో హెలీకాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రధాన ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పట్టాభిషేకం జరిగే అయోధ్యాపురికి చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కేంద్రం అవుతుంది
కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తుండడం హర్షణీయం.యూనివర్శిటీ ఏర్పాటుతో విద్యార్థులు జియాలాజీ, ఎలక్ట్రికల్, మైనింగ్, వాతావరణ శాఖ, అఫ్లైడ్ఫిజిక్స్, క్వాంటం ఫిజిక్స్ వంటి కోర్సుల్లో అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్‌తో పాటు కొత్తగూడెం ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. – జగన్మోహన్రాజు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అందరికీ మేలు జరుగుతుంది ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీతో అందరికీ మేలు జరుగుతుంది. ఇంజనీరింగ్ తరువాత ఎర్త్ సైన్సెస్ కోర్సుల్లో చేరాలంటే రాష్ట్రాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ సీట్లు దొరుకుతాయో, లేదో తెలియదు. ఎందరికో సమయం, డబ్బు వృథా అయింది. కొత్తగూడెంలో యూనివర్సిటీ వస్తే విభిన్న కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. – వి.సృజన, ఈఈఈ విద్యార్థినిశాస్త్రవేత్తలుగా.. ఇంజనీరింగ్ కళాశాల అప్‌గ్రేడ్ కావడం సంతోషం. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఏర్పాటయ్యే కొత్త కోర్సుల్లో చేరి విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. – నివేదిత, సీఎస్ఈ విద్యార్థిని● -
ఈదురు గాలులు.. వడగళ్లవాన
అశ్వారావుపేటరూరల్: జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సోమవారం అశ్వారావుపేట మండలంలో అకాల వర్షం, గాలి దుమారం రావడంతో మామిడి, మొక్కజొన్న పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అశ్వారావుపేట, వినాయకపురం, మామిళ్లవారిగూడెం, ఆసుపాక, మల్లాయిగూడెం తదితర గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. రామన్నగూడెం, పండువారిగూడెం, అనంతారం, నారాయణపురం, గాండ్లగూడెం గ్రామాల్లో పొలాల్లో ఉన్న మొక్కజొన్న, వేరుశెనగ, నాటు పొగాకు వర్షం కారణంగా స్వల్పంగా తడిసినట్లు రైతులు తెలిపారు. వాగొడ్డుగూడెం–రామన్నగూడెం మార్గంలో పలు చోట్ల ప్రధాన రహదారిపై వృక్షాలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విరిగిపడ్డ చెట్లుదమ్మపేట: మండలంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీగా వర్షం పడింది. దుమ్ముతో కూడిన ఈదురు గాలులు బలంగా వీచాయి. అంకంపాలెం, పట్వారిగూడెం, బాలరాజుగూడెం, జగ్గారం, మొద్దులగూడెం, మల్కారం గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. తీవ్రమైన గాలుల ప్రభావానికి బాలరాజుగూడెం, అంకంపాలెం గ్రామాల శివారులో రోడ్డుపై చెట్లు పడిపోగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పార్కలగండి ఆశ్రమ పాఠశాలలో పెద్ద చెట్టు వేళ్లతో సహ పక్కకు ఒరిగిపోయింది. మామిడి, మొక్కజొన్న పంటలకు స్వల్పం నష్టం జరిగింది. కూలిన విద్యుత్ స్తంభాలు పాల్వంచరూరల్: మండలంలో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. గాలివానకు ఉల్వ నూరు కొత్తూరు గ్రామాల మధ్య చెట్లు విరిగిపడ్డాయి. మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఏఈ రవీందర్ జగన్నాథపురం సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వర్షానికి వీధుల్లో వరద ప్రవహించింది. పంట పొలాల్లో ఆరబెట్టిన ధాన్యం, మిర్చి రాశులు తడవకుండా పరదాలు కప్పుకుని రక్షించుకున్నారు. వర్షం రెండు రోజులపాటు ఉంటుందని వాతవరణశాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయంగుండాల: ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి బలమైన గాలులు వీయడంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు ఆటంకం కలిగింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మామిడి తోటలల్లో కాయలు రాలిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు లేచిపోయాయి. ఉరుములు, పిడుగులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇల్లెందు: ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వర్షంతో 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ ఆఫీస్ వద్ద ఓ చెట్టు విరిగి కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో అంతరాయం ఏర్పడింది. -
సమన్వయంతో సాఫీగా..
● భద్రాచలంలో ఘనంగా ముగిసిన శ్రీరామనవమి, పట్టాభిషేకం ● పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, సమీక్షించిన మంత్రులు పొంగులేటి, తుమ్మల భద్రాచలం: రామభక్తులంతా భక్తితో ఎదురుచూసిన శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా జరిగాయి. పట్టాభిషేకం కార్యక్రమంతో ముఖ్య ఘట్టాలన్నీ పూర్తయ్యాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణోత్సవాలు గత నెల 30న మొదలుకాగా, ఈ నెల 6న శ్రీరామనవమి, సోమవారం పట్టాభిషేకం జరిగాయి. ఈ వేడుకలు చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వయంగా ఈ వేడుకలకు హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దీంతో వేడుకల నిర్వహణకు జిల్లా యంత్రాంగం నెల రోజుల నుంచి శ్రమిస్తోంది. ఎండ నుంచి ఉపశమనం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో భద్రాచలం ఒకటి. మార్చి నుంచే ఇక్కడ మండే ఎండలు మొదలవుతాయి. ఈసారి నవమి వేడుకలు ఏప్రిల్ 6న రావడంతో ఎండ, ఉక్కపోత నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మిస్ట్ ఫాగ్ సిస్టమ్‌ను చలువ పందిళ్ల కింద ఏర్పాటు చేశారు. ప్రతీ పది నిమిషాలకు ఓసారి భక్తులపై సన్నని చిరుజల్లులు కురవడంతో ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం లభించింది. తొమ్మిదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఈ వేడుకలకు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవస్థానం వెబ్‌సైట్‌ను ఆధునీకరించడంతోపాటు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. తీరని సమస్యలు భద్రాచలం వచ్చే భక్తులకు తాగునీరు అందించేందుకు నవమి రోజు వాటర్‌బాటిళ్లు విరివిగా అందుబాటులో ఉంచారు. కానీ ఒకరోజు ముందే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం చేరుకున్నారు. ఇక్కడే వండుకుని నిద్ర చేసి కల్యాణ వేడుకలు చూడాలనుకునే భక్తులకు నీటి సమస్య, వసతి సమస్య వేధించింది. ప్రతీసారి అందుబాటులో ఉండే భారీ తాత్కాలిక షెడ్లు ‘ప్రసాద్’ పనులతో ఈసారి కనిపించలేదు. వీఐపీ తాకిడి పెరగడంతో ఉభయ దాతల టికెట్లకు కోత పడింది. కొద్ది మంది ఖర్చు చేసి ఈ టికెట్లు కొనుగోలు చేసినా వీఐపీ గ్యాలరీ, లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్ల వల్ల వారికి కల్యాణవేదిక సరిగా కనిపించలేదు. ఎప్పటిలాగే మిథిలా స్టేడియం గ్యాలరీల్లో కూర్చున్న భక్తులకు పందిళ్లే అడ్డుగా వచ్చాయి. ఎల్ఈడీ తెరలపై కల్యాణ వేడుకలు వీక్షిస్తూ సంతృప్తి చెందాల్సి వచ్చింది. కరకట్ట, గోదావరి తీర ప్రాంతాలతో పాటుగా పట్టణంలో ముఖ్యకూడల్లో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఊహించని స్థాయిలో భక్తుల రాక పెరగగా.. తాత్కాలిక వసతి లేక కరకట్ట, గోదావరి ఒడ్డునే సేద తీరారు. సమష్టిగా కృషి.. నవమి వేడుకలను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధిలు సమష్టిగా పని చేశారు. మిథిలా స్టేడియంలో జరిగే పనులను మంత్రి పొంగులేటి స్వయంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఆ తర్వాత నవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజులు అధికారులతో సమన్వయం చేసుకున్నారు. నీటి, ట్రాఫిక్ సమస్యలు తప్పితే వేడుకలు సాఫీగా జరిగాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
చేపలకు వల వస్తే.. బైక్ చిక్కింది
అశ్వారావుపేటరూరల్: చెరువులో చేపల వేటకు వెళ్లిన గిరిజనులకు బైక్ దొరికింది. ఆదివారం మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామ శివారులో ఊర చెరువులో స్థానిక గిరిజనులు చేపల వేటకు వెళ్లారు. వలలు వేయగా ద్విచక్రవాహనం చిక్కింది. అందరూ కలిసి నీళ్లలో ఉన్న బైక్‌ను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. నంబరు ఆధారంగా విచారించిన పోలీసులు బైక్ బూర్గంపాడుకు చెందిన రవీందర్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. బాధితుడికి సమాచారం ఇవ్వగా, తన బైక్ సుమారు 8 నెలల క్రితం చోరీకి గురైనట్లు చెప్పినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. బైక్ చోరీ, చెరువు నీళ్లలో పడేయటం వెనుక కారణాలేమిటో విచారిస్తామని పేర్కొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో సోమవారం శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున ఐడీఓసీలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేసేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. శ్రీరామనవమికి వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో కిన్నెరసానిని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 428 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.15,355, 200 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.11,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
పులకించిన భక్త గిరి
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ● అభిజిత్ లగ్నంలో ఒక్కటైన జానకిరాములు ● కల్యాణోత్సవానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ● 11.57 గంటలకు మండపం వద్దకు మఖ్యమంత్రి ● కల్యాణం అనంతరం సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనంకల్యాణ ఘట్టాలు ● ఉదయం 9:50 గంటలు : కల్యాణ మండపానికి దేవేరుల ఆగమనం ● 10:22 : విశ్వక్సేన పూజ ● 10:33 : పుణ్యావాచనం ● 10:49 : శ్రీయోద్వాహం ● 11:13 : యోక్త్రా బంధనం, యజ్ఞోపవీత ధారణ ● 11:17 : శ్రీరాముడికి పాద ప్రక్షాళన ● 11:19 : అలంకరణ ● 11:26 : మధుపర్క నివేదన ● 11:33 : మహా సంకల్పం ● 11: 46 : కన్యాదానం ● 11:57 : పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి ● మధ్యాహ్నం 12:01 గంటలు : అభిజిత్ లగ్నంలో వధూవరుల తలలపై జీలకర్ర బెల్లం ● 12:13 : మాంగళ్య ధారణ ● 12:22 : తలంబ్రాల వేడుక ● 12:36 : స్వామి, అమ్మవార్లకు హారతి సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు తన్మయత్వంతో వేడుకలను కనులారా వీక్షించి పులకించిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీ సమేతంగా వేడుకలకు హాజరై స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 8 గంటలకు మొదట గర్భగుడిలో మూలవిరాట్‌కు లఘు కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ, కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించాక అభిజిత్ లగ్నంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచి పెళ్లి తంతు కొనసాగించారు. మధ్యాహ్నం 12:13 గంటలకు మాంగళ్యధారణ జరగగా ఆ తర్వాత తలంబ్రాల వేడుక, హారతి సమర్పణతో వివాహ తంతు ముగిసింది. చివరగా సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించారు. లగ్నానికి కొంచెం ముందుగా.. షెడ్యూల్ టైం ప్రకారం ఉదయం 10:45 గంటలకు భద్రాచలం ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకోవాలి, అక్కడ పూజా కార్యక్రమాలు చూసుకుని ఉదయం 11:10 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ ఆయన ఆలయానికి చేరుకునేసరికే ఉదయం 11:32 గంటలైంది. దీంతో అభిజిత్ లగ్నం సమయానికి సీఎం రేవంత్‌రెడ్డి కల్యాణ మండపానికి చేరుకుని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తారా అనే సందేహాం ఏర్పడింది. సాధారణంగా సీతారాముల వివాహ తంతులో అలంకరణలు, మధుపర్కం నివేదించిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు. మధుపర్కం కార్యక్రమం ముగిసినప్పటికీ సీఎం కల్యాణ మండపానికి చేరుకోకపోవడంతో ఆ తర్వాత ఘట్టమైన కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అర్చకులు ప్రారంభించారు. ఈ క్రమంలో అభిజిత్ లగ్నానికి మూడు నిమిషాల ముందు.. అంటే 11:57 గంటలకు రేవంత్‌రెడ్డి కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. వెంటనే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ ఘట్టం ముగియగానే అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12:01గంటల సమయంలో వధూవరులైన సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. ఆ తర్వాత ఇతర మంత్రులు, శ్రీరామదాసు, తూమూ నర్సింహదా సు వంశీయులు, త్రిదండి పీఠం, టీటీడీ తరఫున, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వస్త్రాలు సమర్పించారు.ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసే కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండలం సారపాకలోని ముత్యాలమ్మ గుడి దగ్గరున్న నాయక్‌పోడు తెగకు చెందిన బూరం శ్రీనివాస్ ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. ఇంటి ముందు కారు దిగి అక్కడున్న ప్రజలకు అభివాదం, దగ్గరగా ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ లోపలికి వెళ్లారు. శ్రీనివాస్ తల్లి పద్మావతి సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురెళ్లి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. అప్పటికే సీఎం రాక సందర్భంగా ‘ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయొద్దు. రోజు మీ ఇంట్లో ఎలా వంటలు చేస్తారో.. ఎలా తింటారో అవే ఏర్పాట్లు ఉండాలి’ అని జిల్లా అధికారులు సూచించడంతో రెండు గదులు ఉన్న ఆ ఇంట్లో మొదటి గదిలో సీఎం భోజనం చేసేందుకు చాప పరిచారు. మునక్కాయ కూర.. గోంగూర చట్నీ భోజనానికి సీఎం రేవంత్‌రెడ్డి కూర్చున్న వరుసలో బూరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీఎస్ శాంతికుమారి కూర్చోగా ఎదురు వరుసలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కూర్చున్నారు. మంత్రి తుమ్మల భోజనం వడ్డింపు ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో భాగంగా నిల్చునే ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు రోజువారీగా ఉపయోగించే స్టీలు పళ్లెంలో సన్నబియ్యంతో చేసిన అన్నం, పులిహోర, పాయసం, గోంగూర చట్నీ, మునక్కాయ, దోసకాయ, టమాటా కూరలను వడ్డించారు. వీటితో పాటు మజ్జిగ, పెరుగు, పానకం కూడా సిద్ధం చేశారు. ఖమ్మం వంటలు బాగుంటాయి వడ్డింపు మొదలు పెట్టగానే ‘ఖమ్మం వంటలు బాగుంటాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటి ముద్ద తింటూనే.. ‘ఇంతకుముందు తుమ్మలనే ఈ వంటలు నాకు పరిచయం చేశారు’ అని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. భోజనం చేస్తూ మధ్యమధ్యలో ప్రభుత్వం అందిస్తున్న మహిళలకు ఉచిత బస్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ పథకాలు ఎలా ఉన్నాయంటూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను సీఎం అడిగారు. పెరుగుతో భోజనం పూర్తి చేశారు. అంతకు ముందే రేవంత్‌రెడ్డికి వడ్డించే భోజనాన్ని ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు (టెస్ట్ అండ్ టే్స్ట్) పరిశీలించారు. వీళ్లకు ఉద్యోగం చూడండి.. భోజనం పూర్తయిన తర్వాత శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి సాయం చేయాలంటూ సీఎంను పద్మావతి కోరారు. దీంతో వారికి అవసరమైన సాయం చేయాలంటూ కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చివరగా శ్రీనివాస్ తల్లిదండ్రులు శంకర్రావు, పద్మావతికి రేవంత్‌రెడ్డి వస్త్రాలు అందజేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:21 గంటల వరకు మొత్తంగా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పాటు సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలం పర్యటన కొనసాగింది. -
రామయ్యకు నేడు పట్టాభిషేకం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజున పట్టాభిషేకం వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుడిని చేయనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్ ఇలా.. ● ఉదయం 9–45కు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో హెలికాప్టర్ ప్రారంభం ● 10.45కు సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు ● 11.20 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి వస్తారు ● 11.45కు దేవస్థానం నుంచి మిథిలా స్టేడియానికి చేరుకుంటారు ● 12.45 వరకు స్టేడియంలో పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షిస్తారు ● 12,45కు స్టేడియం నుంచి బయలుదేరి 1 గంటకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు ● 1.25కు హెలీప్యాడ్‌కు.. ఆతర్వాత 1.30కు హెలీకాప్టర్‌లో పయనం -
పెద్దమ్మతల్లి ఆలయంలో ముగిసిన ఉత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా సాగుతున్న శ్రీదేవి వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజున శ్రీరామనవమి కూడా కలిసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు నాద నీరాజనం, సూక్తి పారాయణం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, శ్రీలలితా సహస్రనామ హవనం, పూర్ణాహుతి తదితర పూజలు చేశాక అమ్మవారికి హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు.. బీఆర్ఎస్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆయన పెద్దమ్మతల్లి సన్నిధికి రాగా.. అర్చకులు, ఈఓ ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. -
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
● తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ● భద్రాచలంలో ఎప్పటిలాగే సామాన్య భక్తులకు తప్పనిపాట్లు ● కౌంటర్ల సమాచారం లేక తలంబ్రాల కోసం అవస్థలు ● మూడుసార్లు ట్రాఫిక్ నిలిపివేతతో ఎండలో అల్లాడిపోయారు.. ● షామియానాలు లేక చెట్ల కిందనే సేదదీరాల్సిన పరిస్థితి ● కరకట్ట సమీపంలో తాగునీరు దొరకలేదని పలువురి ఆవేదన ● కల్యాణానికి గతంకంటే భక్తులు పెరగగా..ఆ స్థాయిలోలేని వసతులు తాగునీరు దొరకలేదు 30 ఏళ్లుగా కల్యాణానికి వస్తున్నాం. ప్రతీసారి మా గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాల వారం ఏలూరు నుంచి భద్రాచలానికి మూడు రోజులపాటు కాలినడకన చేరుకుని ఇక్కడ కల్యాణం, పట్టాభిషేకం చూసి తిరిగి వెళ్తాం. ఈ సారి కూడా వచ్చాం. కానీ వంటా వార్పు చేసుకునేందుకు కరకట్ట ప్రాంతంలో తాగునీరు దొరకలేదు. – పెద్దింటి రమ, కై కలూరుచెట్ల కిందే సేదదీరాం.. రెండు రోజులపాటు ఇక్కడే ఉండి రామయ్య కల్యాణం, పట్టాభిషేకం చూడాలని 20 కుటుంబాల వారం ట్రాలీ తీసుకుని వచ్చాం. తలదాచుకునేందుకు రామాలయ ప్రాంతంలో షామియానాలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో కరకట్ట కింద రోడ్డుకు ఇరువైపులా చెట్ల కిందనే సేదదీరాం. – రాము, ఆకివీడుఎల్ఈడీ స్క్రీన్లు లేవు.. కల్యాణాన్ని తిలకించేందుకు మిథిలా స్టేడియంలో మాత్రమే ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశా రు. రాజమండ్రి నుంచి వచ్చిన మాకు మిథిలా స్టేడియంలోకి వెళ్లే అవకాశం దొరకలేదు. స్టేడియం బయట కూడా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే బాగుండేది. కల్యాణాన్ని తంతును మైకులో మాత్రమే వినాల్సి వచ్చింది. ప్రత్యక్షంగా చూడలేక పోయాం. – ఈశ్వర్రావు, రాజమండ్రిదర్శనం కష్టంగా మారింది... వ్యయ ప్రయాసలకోర్చి రామ య్య కల్యాణానికి వస్తే.. స్వా మివారిని దర్శించుకోవడం కష్టతరంగా మారింది. క్యూలై న్లు లేకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. మహిళలు, పిల్లలు, వృద్ధులను వెనుకకు నెట్టివేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే రామయ్య దర్శనంగా సులువుగా జరిగిదే. – దుర్గా, పోతులూరు ఇరవై ఏళ్లుగా వస్తున్నా... రామయ కల్యాణం కనులారా వీక్షించేందుకు 20 ఏళ్లుగా భద్రాచలం వస్తున్నాను. ఎండలు మస్తుగా ఉన్నాయి. టీవీలో వస్తాది కల్యాణం చూడు నాన్న అని నా బిడ్డలు చెప్పినా.. వినకుండా నా భార్య, నేను వచ్చాం. టీవీలో కంటే రామయ్య కల్యాణం దగ్గరుండి చూస్తేనే మనస్సు నెమ్మదిస్తుంది. – కేశవరావు, నల్లగొండఏర్పాట్లు బాగున్నాయి.. రామయ్య కల్యాణం చూసేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఐదేళ్లుగా భద్రాచలం రామయ్య కల్యాణం చూసేందుకు వస్తున్నాను. ఆలయ అధికారులు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు ఇంకా ఎక్కువ వేస్తే బాగుండేది. – నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం, ఏపీతలంబ్రాల కోసం ఇబ్బంది.. కల్యాణం అనంతరం ఒక్కసారిగా జనం స్టేడియం నుంచి బయటకు రావడంతో తలంబ్రాల ఎక్కడ దొరుకుతాయే తెలియక ఇబ్బంది పడ్డాం. మొదటిసారి రామయ్య కల్యాణం చూసేందుకు భద్రాచలం వచ్చాం. తలంబ్రాల కోసం ప్రచారం తక్కువగా చేస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. – వెంకటరమణ, మంగళగిరి, ఏపీశ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాతోపాటు పలు రాష్ట్రాల నుంచి భద్రాచలం తరలివచ్చారు. చాలామంది శనివారమే చేరుకోగా, ఆదివారం ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నాణాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మిథిలా స్టేడియానికి చేరుకుని కల్యాణం వీక్షించారు. గతేడాది కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అయితే భక్తుల సంఖ్య తగినట్లు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు దొరకక ఇబ్బందులు పడ్డారు. షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో కరకట్ట పక్కన చెట్ల కిందనే సేదదీరారు. ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు కల్యాణం వీక్షించలేకపోయారు. ఇక ఎప్పటిలాగే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రతీసారి విమర్శలు ఎదుర్కొంటున్నా పోలీసు శాఖ తీరు ఈ సారి కూడా మారలేదు. బారికేడ్ల వద్ద సామాన్య భక్తులను నిలిపివేసి, తమశాఖ వారిని మాత్రం అనుమతించారని పలువురు ఆరోపించారు. –భద్రాచలం అర్బన్/భద్రాచలంటౌన్/చర్ల వీవీఐపీ, వీఐపీలు.. శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, తెలంగాణ హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ నందా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరహరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ఇంటెలిజెన్స్ డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి, హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ జడ్జి వెంకట్, హైదరాబాద్ సిటీ సివిల్ జడ్జి భవాని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తులు రాజగోపాల్, వసంత్‌పాటిల్, కొత్తగూడెం న్యాయమూర్తి భానుమతి, భద్రాచలం న్యాయమూర్తి శివనాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, మట్టారాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు పొదెం వీరయ్య, మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సినీతారలు కొణిదల నిహారిక, వితిక షేరు వేడుకల్లో పాల్గొన్నారు. బస్టాండ్‌లోకి రాని ఏపీ బస్సులు వేడుకలకు ఏపీ నుంచి భక్తులకు అధిక సంఖ్యలో వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నడిపిన బస్సులను బస్టాండ్‌లోకి అధికారులు అనుమతించలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిలిపివేయగా, రామాలయం నుంచి కిలోమీటర్ మేర కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. చాలామంది భక్తులకు విషయం తెలియక బస్టాండ్‌కు చేరుకుని ఆందోళన చెందారు. మండుటెండలో నడుస్తూ మైదానానికి చేరుకున్నారు. 25 మంది కుటుంబాలకు అప్పగింత శ్రీసీతారామ చంద్రస్వామివారి కల్యాణం తిలకించేందుకు వచ్చి 25 మంది వృద్ధులు తప్పిపోయి మిథిలా స్టేడియం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కేంద్రం వద్ద ఉండిపోయారు. దీంతో అధికారుల పలు మార్లు మైక్ ద్వారా ప్రచారం చేసి వారిని కటుంబ సభ్యులకు అప్పగించారు. కనిపించని తలంబ్రాల కౌంటర్లు కల్యాణం అనంతరం తలంబ్రాల కోసం భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. వీవీఐపీలు వెళ్తుండటంతో పోలీసుల హడావుడి నడుమ ప్రధాన రహదారికి చేరుకున్న భక్తులు తలంబ్రాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 80 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించినా.. అన్నీ ఆలయ చుట్టుపక్కలే ఉన్నాయి. సరైన సూచికలు లేకపోవడంతో పలువురు గందరగోళానికి గురయ్యారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రెండు కౌంటర్లు ఉన్నా తోపులాట జరిగింది. ఇక భక్తులను నియంత్రించాలని పోలీసులు బందోబస్తు విధులు మాని తలంబ్రాల కోసం ఎగబడ్డారు. ఒకేట కాకుండా ప్రధాన కేంద్రాల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. చెట్ల కిందే సేద రామయ్య కల్యాణానికి వచ్చిన భక్తులను అసౌకర్యాలు వెంటాడాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీరు, షామియానాలు వంటి సౌకర్యాలు సరిపడా ఏర్పాటు చేయలేదు. గతంలో కరకట్టకు వెళ్లే ప్రాంతంలో, రామాలయం ఎదురుగా పెద్ద ఎత్తున షామియానాలు ఏర్పాటు చేసేవారు. ఈసారి ఏర్పాటు చేయకపోవడతో రెండు రోజులుగా కరకట్ట సమీపంలో ఉన్న చెట్ల కిందనే సేదదీరారు. ఇక రెండు రోజులపాటు ఇక్కడే ఉండి కల్యాణం, పట్టాభిషేకం తిలకించేందుకు పిల్లాపాపలతో ఊర్లకు ఊర్లుగా పలువురు కదిలిరాగా.. వారికి వంటా వార్పు చేసుకునేందుకు కనీసం నీళ్లు కూడా దొరకలేదు. రామాలయ పరిసర ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో మిథిలా స్టేడియంలోకి వెళ్లలేని భక్తులు కల్యాణం వీక్షించలేకపోయారు. రామయ్య కల్యాణ క్రతువును మైకుల్లోనే వినాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. తీరు మారని పోలీస్ వీఐపీల తాకిడి పెరగడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకాగా, ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షణలో 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరిలో కొందరు కేవలం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సేవలు చేయడమే సరిపోయింది. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. ఎప్పటిలాగే పోలీసు వాహనాలను, పోలీసు సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడంతో సామాన్య భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల వాదనలకు దిగారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరులో మాత్రం మార్పు రావడం లేదని పలువురు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో అవస్థ.. భద్రాచలంలో మూడుసార్లు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం రేవంత్ కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు 30, 25 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో ద్విచక్రవాహనదారులు మండుటెండల్లోనే ఉండాల్సి వచ్చింది. ఎండ వేడిమిని తట్టుకోలేక కొందరు అసహనం వ్యక్తం చేస్తూ బైక్‌ల హారన్ మోగించారు. ఆ తర్వాత బ్రిడ్జి సెంటర్ నుంచి సారపాక వెళ్తన్న వాహనాలను పంపించే క్రమంలో ప్రతి 15 నిమిషాలకు వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను పోలీసులు చక్కదిద్దలేకపోయారు. ఫలితంగా 3, 4 గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. కొందరు స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికుల వద్ద నుంచి ప్రతి వస్తువుపూ అధిక ధరలు వసూలు చేసి జేబులు నింపుకున్నారు. 25 ఏళ్లుగా సైకిల్ పైనే.. భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఓ భక్తుడు 25 ఏళ్లుగా సైకిల్‌పై వస్తున్నాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పెద్దపల్లవపాలేనికి చెందిన కొల్లాటి రాధాకృష్ణ స్వామికి రాముడంటే ఎనలేని భక్తి. ఏటా కల్యాణానికి సైకిల్‌పై వస్తూ, స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనమవుతున్నాడు. ఆదివారం కూడా సైకిల్‌పైనే వచ్చాడు. కాగా, గత నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాకు సైకిల్‌పైనే వెళ్లి వచ్చిన్నట్లు రాధాకృష్ణ స్వామి తెలిపాడు. అడ్డుగా గొడుగులు..భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణం కనులారా వీక్షించేందుకు టికెట్లు కొని స్టేడియానికి భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. టికెట్ల కోతతో పాటు వీవీఐపీ, వీఐపీల తాకిడి పెరగటంతో కొందరు నిలబడే వీక్షించాల్సి వచ్చింది. దీనికితోడు స్టేడియానికి ఎదురుగా ఉన్న సెక్టార్లలో లైవ్ టెలికాస్టింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న గొడుగులతో వెనుక వైపు ఉన్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ. వేలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుగోలు చేసినా స్వామివారి కల్యాణం ప్రశాంతంగా చూడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
చుంచుపల్లి: జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సీఎస్సార్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన 70 ట్రై మోటర్ సైకిళ్లను ఆదివారం దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీ అభివృద్ధి సంస్థ వినూత్న కార్యక్రమాల ద్వారా సమాజ సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి, గ్రామాల్లో మౌలిక వసతులు, దివ్యాంగులకు చేయూత నందించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమని అన్నారు. దివ్యాంగులు మోటార్ సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో అడవులు అంతరించి పోకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత దివ్యాంగులపై ఉందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం వివిధ సంస్థలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలో పోడు కొట్టడం ద్వారా కొంత అటవీ విస్తీర్ణం తగ్గిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. అడవులు, చెట్ల నరకివేతతో మానవాళి మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ స్కైలాబ్, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డివిజన్ మేనేజర్లు చంద్రమోహన్, కవిత, గణేష్ తదితరులు పాల్గొన్నారు.టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ పొదెం వీరయ్య -
1,800 మందితో బందోబస్తు
భద్రాచలంఅర్బన్: ఉత్సవాలకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ రోహిత్‌రాజు పర్యవేక్షణలో 1,800 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. అదనపు ఎస్పీ, 16 మంది డీఎస్పీలు, 66 మంది సీఐలు, 186 ఎస్ఐలు, 859 మంది ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 208 మహిళా కానిస్టేబుళ్లు, 414 మంది హోంగార్డులతోపాటు, ఆర్ముడ్ రిజర్వుడు సిబ్బంది, బాంబ్ డిస్బోజబుల్ బృందాలతో పాటు 50 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు కలిగి ఉండటంతో భద్రాచలం చేరుకునే మార్గాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలిసూపర్బజార్(కొత్తగూడెం): స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. మొదట కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన బాబూజీ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలకపాత్ర పోషించారని, అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు పోరాడారని గుర్తుచేశారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, అధికారులు అనసూర్య, సంజీవరావు, రమాదేవి, భాస్కర్ పాల్గొన్నారు. అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అనంతం ఈఓ రజనీకుమారి అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను జడ్జికి అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
సీతమ్మ అందాలు.. రామయ్య గోత్రాలు.!
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం శనివారం కనుల పండువగా జరిగింది. శ్రీరామనవమికి ముందు రోజు వారివంశాల విశిష్టతలను, గొప్పతనాన్ని వివరించే ఈ వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గరుత్మంతుని వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం మా వంశం గొప్పదంటే ... కాదు మా వంశమే గొప్పదని చెబుతూ సీతమ్మ వారివైపు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ బృందం, రామయ్య వారివైపు కమిషనర్ శ్రీధర్ బృందం చేరి వేడుక నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి ౖవైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే ఎదుర్కోలు ఉత్సవ కార్యక్రమం జరిపినట్లు పండితులు తెలిపారు. హిందూ, ముస్లింల మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరు చల్లారు. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు. కాగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, వేదపండితుడు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, రామకోటి స్వరూప్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులను అలరించిన ఎదుర్కోలు ఉత్సవం -
తొమ్మిదేళ్ల తర్వాత..
● సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రాక ● సీఎం రేవంత్‌రెడ్డితోపాటు హాజరుకానున్న పలువురు మంత్రులు భద్రాచలం: నేడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భద్రాచలం సమీపంలోని టోబాకో బోర్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని పది నిమిషాలపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని మిథిలా స్టేడియానికి చేరుకుని కల్యాణ వేడుకల్లో భాగం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కాగా 2016లో సీఎం హోదాలో చివరిసారిగా కేసీఆర్ ఈ సంప్రదాయం పాటించారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన హాజరుకాలేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత సీఎం హోదాలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు రేవంత్‌రెడ్డి ఆదివారం వస్తున్నారు. వీఐపీల తాకిడి గతేడాది నవమి వేడుకల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఎంతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ వర్తించలేదు. కొందరు ఎమ్మెల్యేలు సాధారణ భక్తుల్లాగే వేడుకలకు హాజరయ్యారు. కానీ, ఈసారి ఉత్సవాలకు వీఐపీల తాకిడి పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రానుండటంతో వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు కిక్కిరిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ దాతల కోటా కింద జారీ చేసే టికెట్లను కూడా తగ్గించారు. జిల్లాకు మూడోసారి సీఎం రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో గతేడాది ఏప్రిల్‌లో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభానికి, ఆ తర్వాత కొత్తగూడెంలో పార్లమెంటు ఎన్నికల ప్రచార సభకు.. రెండుసార్లు వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత జిల్లాకు మూడోసారి వస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత రిజర్వ్ చేసిన 45 నిమిషాల వ్యవధిలో సీఎంను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాగా భద్రాచలంలో మెరుగులు దిద్దిన ట్రైబల్ మ్యూజియంతోపాటు మాఢవీధుల విస్తరణ పనులను ప్రారంభిస్తారని ప్రచారం సాగినా సీఎం టూర్ షెడ్యూల్లో వీటి ప్రస్తావనలేదు. కాగా సారపాకలో ఓ గిరిజనుడి ఇంట్లో సీఎం మధ్యాహ్న భోజనం చేయనుండగా, సన్నబియ్యంతో వండిన అన్నం వడ్డించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఉదయం 8:45 గంటలకు బేగం పేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10 గంటలకు భద్రాచలం హెలిప్యాడ్‌కు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 10:10 నుంచి 10:30 గంటల వరకు రిజర్వ్ టైం కాగా, 10:30 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి 10:45 గంటలకు ఆలయానికి వస్తారు. 10:45 గంటల నుంచి 11:00 గంటల వరకు దర్శనం చేసుకుని, అనంతరం మిథిలా స్టేడియం చేరుకుంటారు, 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కల్యాణ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిథిలా స్టేడియం నుంచి సారపాకకు బయల్దేరుతారు. 12:35 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తర్వాత ఐటీసీ గెస్ట్‌హౌజ్ చేరుకోనుండగా, 1:15 నుంచి 2 గంటల వరకు రిజర్వ్ టైం. 2:15 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్ బయల్దేరతారు. -
ట్రాఫిక్.. టెన్షన్!
‘ఎర్త్ సైన్సెస్’కు సీఎం ఆమోదంట్రాఫిక్ పరిష్కారానికి కసరత్తు ● ఏటా నవమికి భద్రాచలంలో రాకపోకలకు ఇక్కట్లు ● ఈసారి ముందస్తు కార్యాచరణగా ప్రత్యేక పార్కింగ్ స్థలాలుకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆమోదం తెలిపారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోనే మొట్టమొదటిది కావడంతోపాటు సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. కాగా సహజ వనరులు, మెరుగైన అవకాశాలు ఉన్న మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి తుమ్మల చొరవ చూపి పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన శ్రీరామనవమినే. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణాన్ని తిలకించి తిరిగి భక్తులు తమ గమ్యస్థానాలకు వెళ్లే సమయంలో ఏటా తిప్పలు తప్పడం లేదు. ప్రతీ సంవత్సరం అధికార యంత్రాంగం సమీక్షలైతే నిర్వహిస్తోంది కాని దీనికి పూర్తిస్థాయి పరిష్కారాన్ని కనుగొనలేకపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పదేళ్లుగా నత్తనతకగా సాగుతున్న రెండో వంతెనను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో గతేడాది అప్పటి కలెక్టర్ ప్రియాంక ఆల ప్రారంభించారు. దీని కారణంగా గతేడాది ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కొంత మేర తగ్గినా, స్వామి వారి కల్యాణం కోసం వచ్చే భక్తగణంతో భద్రాద్రి పట్టణం కిక్కిరిసిపోతోంది. ఇంటికే రామయ్య తలంబ్రాలు.. రామయ్య తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే చేరవేస్తారు. ఇందుకోసం రూ.151 చెల్లించాల్సి ఉండగా, పోస్టల్ శాఖలో రూ.150 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 వరకు బుకింగ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఆకాశాన్నంటుతున్న వసతి గదుల రేట్లు.. రాముల వారి కల్యాణం సందర్భంగా భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రైవేట్ వసతి గదుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. భద్రాచలంలో సుమారు 70 లాడ్జీలు ఉండగా.. వీటిల్లో 695 రూములను కేటగిరీలుగా విభజించి 50 శాతం రెవెన్యూ శాఖ అధికారులకు, 25 శాతం పోలీస్ శాఖకు, మిగిలిన 25 శాతం ప్రైవేట్ లాడ్జీలకు కేటాయించారు. సాధారణ రోజుల్లో ఒక లాడ్జీ రూ.2,500 ఉంటే ఇప్పుడు రూ.25వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం.అద్భుతంగా వెదురు ఉత్పత్తులు.. చండ్రుగొండ : వెదురు ఉత్పత్తుల తయారీ అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ దేవిప్రసాద్ అన్నారు. మండలంలోని బెండాలపాడు గ్రామశివారులో ఉన్న బ్యాంబో క్లస్టర్‌ను శనివారం ఆయన సందర్శించారు. వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెదురు ఉత్పత్తుల తయారీదారులకు సాంకేతికత జోడించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం వెదురు నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, సెక్రటరీ రోహిత్, క్లస్టర్ చైర్మెన్ ఈసం నాగభూషణం, డైరెక్టర్లు మల్లం కృష్ణయ్య, బొర్రా సురేష్, వర్సా శ్రీను, పద్దం రమేష్, రవి, సైదులు పాల్గొన్నారు. -
గిరిజనుడి ఇంట సీఎంకు భోజనం
● ప్రభుత్వం అందించే సన్నబియ్యంతో.. ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్బూర్గంపాడు: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణం అనంతరం సారపాకకు చెందిన గిరిజనుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఆదివారం భోజనం చేయనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో పేదల ఇంట్లో భోజనం చేసి లబ్ధిదారులతో మాట్లాడాలనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఎంఓ నుంచి శనివారం టూర్ షెడ్యూల్ కూడా విడుదలైంది. కాగా, శ్రీనివాస్ ఇంటిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇతర అధికారులు శనివారం పరిశీలించి ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతోనే అన్నం వండి పప్పు, చారు, కూర, పచ్చడితో భోజనం వడ్డిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఈనేపథ్యాన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, నాయకపోడు తెగకు చెందిన గిరిజనుడి ఇంట భోజనానికి సీఎం రావడం సంతోషకరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం గిరిజనుడి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. -
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఏరియాలోని జేవీఆర్‌ఓసీ–2లో 10 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 3 వేల టన్నులతోపాటు కిష్టారం ఓసీలో 1500 క్యూబిక్ మీటర్ల ఓబీ, జేవీఆర్‌ఓసీ–2లో 50 వేల క్యూబిక్ మీటర్ల ఓబీకి అంతరాయం వాటిల్లింది. ఎన్డీ జిల్లా కార్యదర్శి రమేశ్ విడుదల ఇల్లెందు: సీపీఐ (ఎంఎల్) ఎన్డీ జిల్లా కార్యదర్శి, ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురం గ్రామానికి చెందిన పూనెం బాబు అలియాస్ రమేశ్ శుక్రవారం ఖమ్మం జైలు నుంచి విడుదలై ఇంటికి చేరారు. గత నవంబర్ 28న ఆయన్ను ఇంటి వద్ద గుండాల పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. 20 ఏళ్లుగా ఉద్యమంలో, ముఖ్యంగా అజ్ఞాతంలో ఉన్న రమేశ్ పలు దఫాలు జైలు జీవితం గడిపారు. లింగన్న ఎన్కౌంటర్ తర్వాత ఎన్డీ దళాలు క్రమక్రమంగా తుడిచి పెట్టుకుపోయాయి. అయినా రమేశ్ మాత్రం అజ్ఞాతం వీడలేదు. అనారోగ్యంతో ఇంటికి చేరిన ఆయన పోలీసులకు చిక్కి నాలుగు నెలల నాలుగు రోజులు ఖమ్మం జైలులో గడిపారు. ఆయనపై ఇల్లెందు, బోడు, ఆళ్లపల్లి, గుండాల పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులున్నాయి. ఎన్డీ నేతలు పొడుగు నర్సింహారావు, టి.నాగేశ్వరరావు స్వాగతం పలికారు. వచ్చే నెల 19న ఆత్మలింగేశ్వరాలయం ప్రతిష్ఠాపన పాల్వంచ: పాల్వంచలోని చింతలచెర్వు వద్ద ఉన్న ప్రాచీన ప్రముఖ శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయంలో మే 15 నుంచి 19వ తేదీ వరకు జీర్ణోధరణ పూర్వక ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు కార్యక్రమాల కరపత్రాలను శుక్రవారం విడుదలచేసిన ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు మాట్లాడారు. కాకతీయుల పరిపాలనలో ప్రతాపరుద్రుడి హయాంలో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ప్రతిష్ఠాపనకు కాకతీయ వారసుడు కమల్చంద్బంజ్దేవ్, పాల్వంచ సంస్థానాదీళుల వారసులు కృష్ణకుమార్ అప్పారావు అశ్వరాయ, మధుకుమార్ అప్పారావు అశ్వరాయ, అశ్వారావుపేట పరగణాధిపతుల వారసులు దామెర కుమారమురళి మహిపాల్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. వచ్చేనెల 19వ తేదీన ఆదిశంకరాచర్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశ్వరులు విద్యారణ్య భారతీ మహాస్వామి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభాభికం ఉంటాయని తెలిపారు. సమావేశంలో యల్లావులు కోటేశ్వరరావు, యల్లావుల వెంకన్న, వల్లపు యాకయ్య, రమణ, ఫణి, సాంబయ్య, అచ్యుత్ రావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఆదివారం జరగనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ అధికారుల నుంచి భద్రాచలం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పవన్‌కల్యాణ్ శనివారం సాయంత్రమే భద్రాచలం చేరుకునే అవకాశముందని, ఆదివారం ఉదయం కల్యాణాన్ని తిలకించాక తిరిగి వెళ్తారని సమాచారం. అంతేకాక పలువురు కేంద్ర మంత్రులు, టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు కూడా భద్రాచలం రానున్నట్లు తెలిసింది. డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి పాల్వంచ: మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందడంతో పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన కొంపెల్లి వెంకటేశ్వర్లు (55) గురువారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో డ్రెయినేజీలో పడ్డాడు. వర్షం వల్ల డ్రెయినేజీ పొంగింది. వెంకటేశ్వర్లు బయటకు రాలేక మృతి చెందాడు. స్థానికులు కొంత సేపటి తర్వాత గుర్తించి, బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య స్వరూప శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలున్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్లే మృతి నవభారత్ వైన్స్ సమీపంలో డ్రెయినేజీ ఓపెన్ చేసి ఉండటంతో రాత్రి వేళ కనిపించక వెంకటేశ్వర్లు అందులో పడి మృతి చెందాడని, ఇది మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రెయినేజీ శుభ్రం చేసేందుకు పైకప్పును సిబ్బంది పగులగొట్టారని, అనంతరం అలానే వదిలేశారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. -
● నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: రామాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం భద్రాచలం పట్టణానికి చెందిన మల్లెల వెంకట శ్రీనివాస్–పార్వతి దంపతులు రూ.1,01,116 లక్ష, బీవీ సీతారామరాజు–కృష్ణవేణి దంపతులు రూ.50 వేలు విరాళం అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ● 18 ప్రాథమిక చికిత్స కేంద్రాలు.. కొత్తగూడెంఅర్బన్: శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు వైద్య సేవలందించేందుకు జిల్లా వ్యాప్తంగా 18 ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ ఎల్.భాస్కర్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 50 మంది వైద్యులు, 217 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించామని, శనివారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 5 అంబులెన్స్‌లు, సీపీఆర్ క్వాలిఫైడ్ ఎంఎల్హెచ్పీఎస్ను నియమించామని, ఏరియా ఆస్పత్రుల్లో 50 బెడ్లు, ప్రతి ప్రైవేటు నర్సింగ్ హోంలలో 5 బెడ్లు, అన్ని రకాల గ్రూప్‌ల రక్తం అందుబాటులో ఉంచామని వివరించారు. ● రేపటి నుంచి పునర్వసు దీక్షలు భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తామని ఆలయ ఈఓ ఎల్.రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పునర్వసు దీక్ష విరమణ, భద్రగిరి ప్రదక్షిణ మే 3న నిర్వహిస్తామని పేర్కొన్నారు. శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ పునర్వసు దీక్షాధారణ చేయాలని కోరారు. ● నవమికి ముస్తాబైన దర్గాఇల్లెందురూరల్: సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం వేడుకలకు మండలంలోని హజరత్ నాగుల్‌మీరా దర్గా ముస్తాబైంది. దర్గాలో పద్నాలుగేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా, ఏటా హిందూ ముస్లిం భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ ఏడాది కూడా దర్గాలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దర్గా కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శనివారం దమ్మక్క వారసుల చేత గోటితో ఒలిచిన తలంబ్రాలను దర్గాలో సమర్పించనున్నారు. 6న కల్యాణం, 7న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
పోక్సో కేసు నమోదు
ఇల్లెందు: స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పట్టణానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడి చేశాడని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల్మీరాఖాన్పఠాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిపై కేసు జూలూరుపాడు: మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ నడుపుతున్న నిర్వాహకుడిని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. జూలూరుపాడులోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద గుండెపుడి గ్రామానికి చెందిన బోడా శ్రీను చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. వెంగన్నపాలేనికి చెందిన తంబర్ల నరసింహారావు, జూలూరుపాడుకు చెందిన కంచెపోగు నరసింహారావు చికెన్ సెంటర్లోకి ప్రవేశించి విలేకరులమని చెప్పి సెల్‌ఫోన్‌తో వీడియోలు తీస్తూ, తమకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే చనిపోయిన కోళ్లు, రోగాలతో ఉన్న కోళ్లను అమ్ముతున్నట్లు పేపర్లలో రాయడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి పేర్కొన్నారు. తహసీల్‌లో పాము కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓ పాము కలకలం రేపింది. ఎలుకను వేటాడుతూ వచ్చిన పామును గుర్తించిన ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన స్నేక్ రెస్క్యూ సంతోష్‌కు సమాచారం ఇవ్వగా ఆయన చేరుకుని పామును బంధించారు. ఆ తర్వాత పామును అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఆయన తెలిపారు. -
వానాకాలంలో 6,03,124 ఎకరాల్లో సాగు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రాబోయే వానాకాలం పంటల విస్తీర్ణాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత వానాకాలం సీజన్ కంటే ఈసారి పంటల విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. గత వానాకాలంలో 5,92,264 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేయగా వచ్చే వానాకాలంలో 6,03,124 ఎకరాలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఎప్పటిలాగే వరి, మొక్కజొన్న, పత్తి, ఆయిల్‌పామ్ పంటల విస్తీర్ణం అధికంగా ఉంది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రోత్సాహంతో గతేడాది 550 ఎకరాల్లో మునగ సాగు చేయగా, ఈసారి 2,500 ఎకరాలకు చేరుకోనుంది. మునగ సాగు పెరిగే అవకాశం కలెక్టర్ ప్రోత్సాహంతో జిల్లాలో వచ్చే వానాకాలంలో మునగసాగు పెరగనుంది. గత సంవత్సరం మునగసాగు కంటే మరో నాలుగురెట్లు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉంది. లాభదాయకమైన పంట కావడంతో రైతులు మక్కువ చూపుతున్నారు. –వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారివచ్చే సీజన్‌పై అంచనా వేసిన వ్యవసాయ శాఖగత, రానున్న వానాకాలం సీజన్లలో పంటల విస్తీర్ణం వివరాలు.. పంట గత సీజన్ రానున్న సీజన్ ఆగ్రో ఫారెస్ట్రీ 28,414 28,982 వరి 1,64,663 1,60,956 మొక్కజొన్న 85,828 85,544 పత్తి 2,03,561 2,04,632 వేరుశెనగ 2,736 2,791 పండ్ల మొక్కలు 9,995 10,195 జీడిపప్పు 11,670 11,903 కోకోవ 640 652 కొబ్బరి 1,769 1,805 ఆయిల్‌పామ్ 63,486 75,000 మినుము 840 857 పెసర 128 131 కంది 1,136 1,159 మిర్చి 10,284 10,489 కూరగాయలు 492 501 ఇతర పంటలు 6,073 5,025 మునగ 550 2,500 మొత్తం 5,92,264 6,03,124 -
ఏపీ గెలలకూ ఓఈఆర్ 19.36 శాతం..
● అశ్వారావుపేటలో పరీక్షించాక నిర్ధారణ ● జగన్ హయాంలో మాదిరి టన్ను ధర చెల్లించక తప్పని పరిస్థితి అశ్వారావుపేటరూరల్: ఏపీలో రైతులు సాగుచేస్తున్న ఆయిల్‌పామ్ గెలల ఓఈఆర్ (నూనె దిగుబడి శాతం) 19.36 శాతంగా నమోదవడంతో ఆ ప్రకారం వారికి ధర చెల్లించనున్నారు. ఏపీలోని ఆయిల్‌ఫెడ్‌కు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీలు పాతవి కావడంతో నూనె దిగుబడి శాతం కేవలం 17.30గా నమోదవుతోంది. తెలంగాణలో మాత్రం ఇది 19.36 శాతం ఉండడంతో రైతులకు టన్ను గెలలకు రూ.21 వేల చొప్పున, ఏపీ రైతులకు రూ.17 నుంచి రూ.18 వేల మధ్యే అందుతోంది. ఏపీ సీఎంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ఆయిల్‌ఫెడ్ నిర్ణయించే ఓఈఆర్ ప్రకారమే ఐదేళ్ల పాటు ధర చెల్లించారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ ఓఈఆర్ ప్రకారమే టన్ను ధర చెల్లించేలా నిర్ణయించగా రైతులకు నష్టం ఎదురవుతోంది. ఈ మేరకు రైతుల వినతితో ఏపీ గెలలను అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేసి ఓఈఆర్ శాతాన్ని నిర్ధారించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో ఏపీలో రైతులు సాగు చేసిన 862 టన్నుల గెలలను బుధ, గురువారం క్రషింగ్ చేయగా 19.36 శాతంగా ఓఈఆర్ నమోదైనట్లు ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు శుక్రవారం ప్రకటించారు. ఈ ఓఈఆర్ ప్రకారం ఏపీ రైతులకు ధర చెల్లించనుండగా టన్నుకు రూ.3 వేలకు పైగా లబ్ధి జరగనుంది. కాగా, గెలల క్రషింగ్ అవకాశం కల్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్‌బాషా, అధికారులకు ఏపీ రైతు సంఘం నాయకులు బొబ్బా రాఘవరావు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: శ్రీదేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి ) ఆలయంలో శుక్రవారం వసంత మహోత్సవాలను పురస్కరించుకుని నాదానీరాజనం, సూక్తి పారాయణ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, లక్ష కుసుమార్చన, శ్రీలలితా సహస్రనామహవనం జరిపారు. అమ్మవారికి హారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ముగిసిన కుష్ఠు బాధితుల గుర్తింపు సర్వేకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ముగిసిన కుష్ఠు వ్యాధి బాధితుల గుర్తింపు సర్వే ముగిసిందని డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు వ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వే నిర్వహించామని, శుక్రవారంతో ఆన్లైన్ ప్రక్రియ కూడా ముగిసిందని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. సర్వేలో 1,702 మందిని అనుమానిత లక్షణాలు ఉన్న వారిగా గుర్తించామని తెలిపారు. 2,88,368 ఇళ్లను సందర్శించి 12,13,576 మందిని పరీక్షించామని, మొత్తం ఐదు కొత్త కేసులను గుర్తించామని వివరించారు. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. వ్యాధి కారక క్రిమి శరీరంలోకి ప్రవేశించాక లక్షణాలు బయటపడడానికి రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుందని వివరించారు. టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో శిక్షణకొత్తగూడెంఅర్బన్: రాష్ట్రంలోని హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్‌లలో మే 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటు లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత సాధించినవారు శిక్షణకు అర్హులని, ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని అడ్మిట్ కార్డు పొందాలని వివరించారు. అడ్మిషన్లు ఈ నెల 17 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని, పూర్తి వివరాలకు 99890 27943 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. 7న మ్యాథ్స్,సైన్స్ క్విజ్ పోటీలుకొత్తగూడెంఅర్బన్: మ్యాథ్స్ అండ్ సైన్స్ సర్కిల్స్ కార్యక్రమాల్లో భాగంగా 8, 9 తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో జరుగుతుందని, 8, 9 తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని, అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరుకావాలని తెలిపారు. పాల్గొనే విద్యార్థుల వివరాలు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్కు అందించాలని కోరారు. నేడు ఐజీ పర్యటన కొత్తగూడెంటౌన్: జిల్లాలో శనివారం మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యటించనున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురం హెడ్ క్వార్టర్స్‌లో విలేకరులతో సమావేశం కానున్నారని ఎస్పీ రోహిత్‌రాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమనీయం... శ్రీవారి కల్యాణం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కల్యాణం జరిపించారు. ఇటీవల నిర్మించిన వకుళామాత స్టేడియానికి శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొని వచ్చిన అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించాక కల్యాణ క్రతువు ఆరంభించారు. ఈక్రమాన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈవో జగన్మోహన్రావు దంపతులు సమర్పించారు. -
● సమన్వయంతో పనిచేయాలి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల్లో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేడుకల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రామయ్య కల్యాణానికి సీఎం రేవంత్ రెడి రానున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది శనివారం నుంచే విధుల్లో ఉండాలని ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీలు, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ● సకలం సిద్ధం స్వామివారి తలంబ్రాల పంపిణికీ 80, ప్రసాదాల పంపిణీకి 19 ప్రత్యేక కౌంటర్లు, 13 మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కల్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక అధికారులను, పారిశుద్ద్య పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రోజూ లక్షన్నర లడ్డూలను భక్తులకు అందిస్తామని, 200 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశామని వివరించారు. రెండు రోజులపాటు భద్రాచలం, సారపాకలలో ఉన్న వైన్ షాపులను మూయించాలన్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సలహాలు, సూచనలను అందించారు. ● అధికారులపై మంత్రి ఆగ్రహం కూనవరం రోడ్డులో కరకట్ట నిర్మాణ పనుల్లో ఆలస్యంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట పనులను పరిశీలించి మాట్లాడారు. మే 31 నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ దామోదర్ రావు, ఈఓ రమాదేవి పాల్గొన్నారు. -
వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రగిరి శ్రీసీతారామ చంద్రస్వామివారి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణాన్ని వైభవోపేతంగా జరిపారు. శ్రీ మహా విష్ణువుకి ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. గరుడాధివాసం కార్యక్రమాన్ని కమనీయంగా జరిపారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం ఎటువంటి విఘ్నాలూ కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనుడికి అర్చన జరిపి, కర్మణ, పుణ్యావాచనం, మూర్తి కుంభావాహన, భ్రదక మండల ఆరాధన, ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్ఠాపన జరిపారు. ● గరుడ ప్రసాదం పంపిణీ యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అర్చక పరిచారక వేద పండితులు తీసుకుని రాగా బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్ప ం, గరుడ గద్యనం, గరుడ మంగళాష్టకాలను తర్పానందంగా ప్రధానార్చకులు చదవగా గరుడ పటాన్ని మంగళ వాయిద్య ఘోష నడుమ ధ్వజారోహణం చేశారు. అనంతరం బలిహరణం జరిగింది. సంతానం లేనివారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. గరుడ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. ● నేడు ఎదుర్కోలు ఉత్సవం సీతారాముల కల్యాణ వేడుకలకు ముందు వధూవరుల విశిష్టతలను వర్ణించే, గొప్పలను వివరించే ఎదుర్కోలు ఉత్సవం శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. వేడుకల్లో హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించేలా భక్తులందరిపై పన్నీరు, గులాల్ చల్లుతారు. భద్రాచలం దేవస్థానంలో గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. నవాహ్నిక తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, సోమవారం పట్టాభిషేక మహోత్సవం జరపనున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి దంపతులు, ఏఈవోలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకుడు విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు కల్యాణంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం తానీషాను స్మరిస్తూ భక్తులపై గులాల్ చల్లే విశేషం రేపు సీతారాముల కల్యాణం, 7న పట్టాభిషేకం -
నష్టం మిగిల్చిన వర్షం..
అనుకోని వర్షం అన్ని పంటలను దెబ్బకొట్టింది.. మండే వేసవిలో కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి.. ఇక పంట చేతికొస్తుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చెప్పా పెట్టకుండా వచ్చిన వాన అన్నదాతల కంట కన్నీళ్ల వరదలు పారించింది. పాల్వంచరూరల్: వర్షానికి నేలవాలిన వరి పంట పాల్వంచ మండలంలో.. పాల్వంచరూరల్: మండలంలోని కోడిపుంజుల వాగులో తేజావత్ కీమా మిర్చి తడిసి ముద్దయింది. నారాయణరావుపేటలో దాసరి మస్తాన్‌రావుకు చెందిన ఎనిమిది ఎకరాలు, అప్పొజు సత్యనారాయణకు చెందిన ఆరు ఎకరాలు, వెంకట్రావుకు చెందిన 3 ఎకరాల వరి పంట నేలవాలింది. నాగారం, దంతలబోరు, సోములగూడెం, రంగాపురం గ్రామాల్లో వరి దెబ్బతిన్నది. ఏఓ శంకర్ రంగాపురంలో వరి పంటలను పరిశీలించారు.ఇల్లెందులో.. ఇల్లెందురూరల్: అకాల వర్షాటనికి మండలంలో మొక్కజొన్న పంట సుమారు 300 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. పూబెల్లిలో కల్లంలో ఆరబెట్టిన మొక్కజొన్న తడిసిపోవడంతో మహిళా రైతు కల్తీ కోటమ్మ చేలోనే సొమ్మసిల్లి పడిపోయింది. ఐదెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న నూర్పిడి చేసి కల్లంలో ఆరబెట్టింది. గురువారం వాహనం దొరక్కపోవడంతో తీసుకెళ్లకపోవడంతో.. భారీ వర్షం నట్టేట ముంచింది. శుక్రవారం ఉదయం చేనుకు వెళ్లిన ఆమె తడిసిన పంటను చూసి అక్కడే కుప్పకూలింది. సమీప రైతులు గమనించి ఇంటికి చేర్చారు. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి కూడా కూడా తడిసిపోయింది. ఏడీఏ లాల్‌చంద్, ఏఓ సతీశ్ గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సీపీఎం నాయకులు అబ్దుల్ నబీ, ఆలేటి కిరణ్, వజ్జ సురేశ్ కూడా పంటలను పరిశీలించారు. -
అడవికి నిప్పు.. నిర్లక్ష్యంతో ముప్పు
అశ్వారావుపేటరూరల్: వేసవి నేపథ్యంలో చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా పర్యావరణానికి, అటవీ సంపదకు తీరని ముప్పు వాటిల్లుతుంది. అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలోని ఊట్లపల్లి బీట్, వేదాంతపురం రిజర్వు ఫారెస్టులో ప్రధాన రహదారి పక్కనే మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు చెలరేగుతూ, వ్యాపించడంతో ఫారెస్టులోని చెట్లు కాలిపోగా పొగ కారణంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. దట్టమైన పొగ కారణంగా ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడ్డాల్సి వచ్చింది. కాగా, మంటల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఫారెస్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వాచర్లను పంపించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
నవమి భక్తులకు ప్రత్యేక బస్సులు
● భద్రాచలానికి 197, అక్కడి నుండి పర్ణశాలకు 30 ● హైదరాబాద్ భక్తులకు రిజర్వేషన్ కూడా.. ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం, పట్టాభిషేకానికి హాజరయ్యే భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుండి భద్రాచలానికి ఈ సర్వీసులు ఉంటాయి. అలాగే, హైదరాబాద్ నుండి భద్రాచలం, భద్రాచలం నుండి హైదరాబాద్‌కు సైతం బస్సులు ఏర్పాటు చేసి, రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవి కాక ఖమ్మం నుండి హైదరాబాద్‌కు ప్రతీ పది నిమిషాలకో బస్సు నడిపించాలని నిర్ణయించారు. ఖమ్మం రీజియన్‌లోని డిపోల నుండి భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులు, భద్రాచలం నుండి పర్ణశాలకు 30 బస్సులు నడిపించనుండగా, భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ నేతృత్వాన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రోజు వారి సర్వీసులకు అదనం భద్రాచలం నుండి హైదరాబాద్, భద్రాచలం నుండి ఖమ్మంకు రోజువారి తిరిగే వంద సర్వీసులతో పాటు అదనంగా సర్వీసులు నడిపిస్తారు. ఈనెల 6వ తేదీన అదనంగా 35సర్వీసులు, భద్రాచలం నుంచి కొత్తగూడెంకు నిత్యం తిరిగే సర్వీసులకు తోడు అదనంగా పది బస్సులు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి భద్రాచలానికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు నడుస్తాయి. భద్రాచలం నుండి మణుగూరుకు రోజు వారీగా తిరిగే ఎనిమిది బస్సులతో పాటు అదనంగా పది బస్సులు, సత్తుపల్లి నుండి 20 బస్సులు, మధిర నుండి 17 బస్సులు, ఇల్లెందు నుండి భద్రాచలానికి ఐదు బస్సులు నడిపించనున్నారు. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు కేంద్రాలకే కాక భద్రాచలం నుండి హనుమకొండ, కరీంనగర్‌కు సర్వీసులు ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కాగా, భద్రాచలం నుండి విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం వైపు వెళ్లే బస్సుల కోసం జూనియర్ కాలేజ్ మైదానంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు రెండు బస్సులు నడిపిస్తామని అధికారులు వెల్లడించారు.ప్రత్యేక సర్వీసుల సమాచారం కోసం ఫోన్ నంబర్లు డిపో సెల్ నంబర్ భద్రాచలం 99592 25987ఖమ్మం కొత్త బస్టాండ్ 99592 25979మణుగూరు 89853 61796కొత్తగూడెం 99592 25982ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో స్వామివారి కల్యాణం తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. రాకపోకల సమయాన ఎవరూ ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తాం. ఈనెల 6న భక్తుల కోసం అన్ని బస్టాండ్ల నుండి రద్దీకి అనుగుణంగా బస్సులు ఉంటాయి. అంతేకాక భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్‌కు రెగ్యులర్ సర్వీసులు తోడు అదనపు సర్వీసులు నడిపిస్తాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
● సమన్వయంతో పనిచేయాలి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల్లో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేడుకల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రామయ్య కల్యాణానికి సీఎం రేవంత్ రెడి రానున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది శనివారం నుంచే విధుల్లో ఉండాలని ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీలు, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ● సకలం సిద్ధం స్వామివారి తలంబ్రాల పంపిణికీ 80, ప్రసాదాల పంపిణీకి 19 ప్రత్యేక కౌంటర్లు, 13 మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కల్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక అధికారులను, పారిశుద్ద్య పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రోజూ లక్షన్నర లడ్డూలను భక్తులకు అందిస్తామని, 200 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశామని వివరించారు. రెండు రోజులపాటు భద్రాచలం, సారపాకలలో ఉన్న వైన్ షాపులను మూయించాలన్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సలహాలు, సూచనలను అందించారు. ● అధికారులపై మంత్రి ఆగ్రహం కూనవరం రోడ్డులో కరకట్ట నిర్మాణ పనుల్లో ఆలస్యంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట పనులను పరిశీలించి మాట్లాడారు. మే 31 నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ దామోదర్ రావు, ఈఓ రమాదేవి పాల్గొన్నారు. -
‘పెదవాగు’ ఆనకట్టకు మట్టి పరీక్షలు
అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్ట్ ఆనకట్టకు స్థానిక నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో శుక్రవారం మట్టి(సాయిల్) పరీక్షలు చేశారు. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా మండల పరిధిలోని గుమ్మడవల్లి వద్ద ఉన్న పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ తిరిగి నిర్మించేందుకు నీటిపారుదల శాఖ రూ.90 కోట్ల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రూ.40 కోట్ల నిధులను కేటాయించారు. ప్రాజెక్టు రీడిజైన్ ప్రకారంలో ఇప్పుడు ఉన్న మూడు గేట్లతోపాటు అదనంగా మరో ఐదు గేట్లతో నిర్మించేలా ప్రతిపాదించారు. దీంతో అదనపు గేట్ల నిర్మాణానికి ఆనకట్ట వద్ద అనువుగా ఉందా.? లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు చేపట్టారు. యంత్రాల సాయంతో భూగర్భంలో నుంచి మట్టి బయటకు తీస్తున్నారు. ఇలా సేకరించిన మట్టి హైదరాబాద్‌లోని పరీక్షా కేంద్రానికి పంపిస్తామని, అక్కడి నుంచి వచ్చే నివేదిక ప్రకారం ముందుకెళ్తామని స్థానిక నీటి పారుదల శాఖ ఏఈఈ శ్రీనివాస్ తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామంలో 25 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని అశ్వాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. గొల్లగూడెంలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వంతెన వద్ద ఎస్ఐ రవూఫ్, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా టాటా ఏస్ వాహనంలో మణుగూరు నుంచి పాల్వంచ తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యానిన పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువకుడిపై కేసు పాల్వంచరూరల్: బాలిక బాత్రూమ్లో స్నానం చేస్తుంటే ఇంటి పక్కన ఉన్న యువకుడు కిటికిలోనుంచి చూస్తున్నాడనే ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కేశవాపురంలో గురువారం ఓ ఇంట్లోని బాత్రూమ్లో బాలిక స్నానం చేస్తుండగా పక్క ఇంటి కిటికిలో నుంచి బాలరాజు తొంగిచూడడంతో బాలిక కేకలు వేసింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.