
ఆలయ హుండీ చోరీకి యత్నం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం గ్రామ శివారులోని శ్రీచిలకలగండి ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. ఆలయం లోపల ఉన్న ఐరన్ హుండీని గుర్తుతెలియని దుండగులు సుమారు 15 మీటర్ల దూరంలో ఆలయం వెనక వైపునకు తీసుకెళ్లి తాళాలను తెరిచేందుకు యత్నించగా.. తెరుచుకోకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన సిబ్బంది గుర్తించి, స్థానిక పోలీసులకు సమచారం అందించారు. ఏఎస్‌ఐ యాకూబ్‌అలీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఇటీవల వచ్చిన గాలి దుమారంతో ఆలయంలోని సీసీ కెమెరాలు కాలిపోగా, చోరీకి వచ్చిన దుండగులను గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది.