అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
పాల్వంచ: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఖమ్మం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. శనివారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌లో సీఐ సుంకరి రమేశ్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పుణె జిల్లా, ధౌండ్ తాలూకా, పింపల్‌గాం గ్రామానికి చెందిన సాగర్ హరిదాస్ దోబ్లే, నీలేశ్, కిషోర్ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ ధరకు గంజాయిని ఒడిశాలోని మల్కన్‌గిరిలో కొనుగోలు చేసి కారులో అమర్చారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా పుణెకు తరలిస్తుండగా పాల్వంచ వద్ద ఖమ్మం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుంకరి రమేశ్, హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకటేశ్, విజయ్‌కుమార్, ఉపేందర్ పట్టుకున్నారు. కారులో ఉన్న 51.27 కేజీల గంజాయి, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.28.80 లక్షలు, అన్ని వస్తువులు కలిపి రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను సీఐ ప్రసాద్‌కు అప్పగించారు.
రూ.28.80 లక్షల గంజాయి,
కారు స్వాధీనం


