
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కొత్తగూడెంఅర్బన్: గుర్తు తెలియని వ్యక్తి కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామంలోని బస్సు షెల్టర్ వద్ద 70 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి స్పృహతప్పి పడిపోయి ఉండగా, మైలారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, మృతుడు మైలారంలో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.
సింగరేణి ఉద్యోగి
కాజీపేటలో ఆత్మహత్య
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని సెంట్రల్ వర్క్‌షాపులో టర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న యూ.సంజయ్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులతో కాజీపేటలోని తన అమ్మమ్మ ఇంట్లో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వర్క్‌షాపు ఉద్యోగులు, జీఎం దామోదర్, డీజీఎం ప్రకాశ్, ఇంజనీర్ నారాయణ, సూపర్‌వైజర్లు, సింగరేణి ఉద్యోగులు, యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు.
బియ్యం లారీ పట్టివేత
అశ్వాపురం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని మండల కేంద్రంలో గౌతమీనగర్ కాలనీ వద్ద గురువారం రాత్రి అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. బియ్యం మణుగూరు నుంచి పాల్వంచకు లారీ (ఏపీ20టీఏ 3366)లో తరలిస్తుండగా సీఐ అశోక్‌రెడ్డి వాహనాల తనిఖీల్లో పట్టుకున్నారు. లారీలో సుమారు 100 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు సమాచారం. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి, అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన లారీడ్రైవర్ శ్రీనుపై కేసు నమోదు చేశామని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.