
ట్రాఫిక్.. టెన్షన్!
‘ఎర్త్ సైన్సెస్’కు సీఎం ఆమోదం
ట్రాఫిక్ పరిష్కారానికి కసరత్తు
● ఏటా నవమికి భద్రాచలంలో రాకపోకలకు ఇక్కట్లు ● ఈసారి ముందస్తు కార్యాచరణగా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆమోదం తెలిపారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోనే మొట్టమొదటిది కావడంతోపాటు సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. కాగా సహజ వనరులు, మెరుగైన అవకాశాలు ఉన్న మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి తుమ్మల చొరవ చూపి పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు.
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన శ్రీరామనవమినే. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణాన్ని తిలకించి తిరిగి భక్తులు తమ గమ్యస్థానాలకు వెళ్లే సమయంలో ఏటా తిప్పలు తప్పడం లేదు. ప్రతీ సంవత్సరం అధికార యంత్రాంగం సమీక్షలైతే నిర్వహిస్తోంది కాని దీనికి పూర్తిస్థాయి పరిష్కారాన్ని కనుగొనలేకపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పదేళ్లుగా నత్తనతకగా సాగుతున్న రెండో వంతెనను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో గతేడాది అప్పటి కలెక్టర్ ప్రియాంక ఆల ప్రారంభించారు. దీని కారణంగా గతేడాది ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కొంత మేర తగ్గినా, స్వామి వారి కల్యాణం కోసం వచ్చే భక్తగణంతో భద్రాద్రి పట్టణం కిక్కిరిసిపోతోంది.
ఇంటికే రామయ్య తలంబ్రాలు..
రామయ్య తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే చేరవేస్తారు. ఇందుకోసం రూ.151 చెల్లించాల్సి ఉండగా, పోస్టల్ శాఖలో రూ.150 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 వరకు బుకింగ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
ఆకాశాన్నంటుతున్న వసతి గదుల రేట్లు..
రాముల వారి కల్యాణం సందర్భంగా భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రైవేట్ వసతి గదుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. భద్రాచలంలో సుమారు 70 లాడ్జీలు ఉండగా.. వీటిల్లో 695 రూములను కేటగిరీలుగా విభజించి 50 శాతం రెవెన్యూ శాఖ అధికారులకు, 25 శాతం పోలీస్ శాఖకు, మిగిలిన 25 శాతం ప్రైవేట్ లాడ్జీలకు కేటాయించారు. సాధారణ రోజుల్లో ఒక లాడ్జీ రూ.2,500 ఉంటే ఇప్పుడు రూ.25వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం.
అద్భుతంగా వెదురు ఉత్పత్తులు..
చండ్రుగొండ : వెదురు ఉత్పత్తుల తయారీ అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ దేవిప్రసాద్ అన్నారు. మండలంలోని బెండాలపాడు గ్రామశివారులో ఉన్న బ్యాంబో క్లస్టర్‌ను శనివారం ఆయన సందర్శించారు. వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెదురు ఉత్పత్తుల తయారీదారులకు సాంకేతికత జోడించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం వెదురు నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ విద్యాచందన, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, సెక్రటరీ రోహిత్, క్లస్టర్ చైర్మెన్ ఈసం నాగభూషణం, డైరెక్టర్లు మల్లం కృష్ణయ్య, బొర్రా సురేష్, వర్సా శ్రీను, పద్దం రమేష్, రవి, సైదులు పాల్గొన్నారు.