
చేపలకు వల వస్తే.. బైక్ చిక్కింది
అశ్వారావుపేటరూరల్: చెరువులో చేపల వేటకు వెళ్లిన గిరిజనులకు బైక్ దొరికింది. ఆదివారం మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామ శివారులో ఊర చెరువులో స్థానిక గిరిజనులు చేపల వేటకు వెళ్లారు. వలలు వేయగా ద్విచక్రవాహనం చిక్కింది. అందరూ కలిసి నీళ్లలో ఉన్న బైక్‌ను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. నంబరు ఆధారంగా విచారించిన పోలీసులు బైక్ బూర్గంపాడుకు చెందిన రవీందర్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. బాధితుడికి సమాచారం ఇవ్వగా, తన బైక్ సుమారు 8 నెలల క్రితం చోరీకి గురైనట్లు చెప్పినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. బైక్ చోరీ, చెరువు నీళ్లలో పడేయటం వెనుక కారణాలేమిటో విచారిస్తామని పేర్కొన్నారు.