
రేషన్ బియ్యం పట్టివేత
అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామంలో 25 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని అశ్వాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. గొల్లగూడెంలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వంతెన వద్ద ఎస్‌ఐ రవూఫ్, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా టాటా ఏస్ వాహనంలో మణుగూరు నుంచి పాల్వంచ తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యానిన పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
యువకుడిపై కేసు
పాల్వంచరూరల్: బాలిక బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుంటే ఇంటి పక్కన ఉన్న యువకుడు కిటికిలోనుంచి చూస్తున్నాడనే ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కేశవాపురంలో గురువారం ఓ ఇంట్లోని బాత్‌రూమ్‌లో బాలిక స్నానం చేస్తుండగా పక్క ఇంటి కిటికిలో నుంచి బాలరాజు తొంగిచూడడంతో బాలిక కేకలు వేసింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.