
ఆర్చరీ డెవలప్‌మెంట్ కమిటీలో స్థానం
ఖమ్మం స్పోర్ట్స్: ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ద్వారా దేశవ్యాప్తంగా విలువిద్యకు మరింత ప్రాచుర్యం తీసుకురావడం, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేలా ఎనిమిది మందితో కూడిన డెవలప్‌మెంట్ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి, ఒలింపిక్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్యకు స్థానం దక్కింది. తెలంగాణ నుంచి ఈయనకు మాత్రమే సభ్యుడిగా స్థానం దక్కగా, కమిటీ చైర్మన్‌గా ఏఏఐ ఉపాధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ, కన్వీనర్‌గా సుమంత చంద్ర మహంతి వ్యవహరిస్తారు. సభ్యులుగా శంకరయ్యతో పాటు జంయాంగ్ థ్సెరింగ్ నంజ్యాల్(లఢాఖ్), కె.దేవానంద సింగ్(మణిపూర్)తో పాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు సంజీవ్ సింగ్, పూర్ణిమ మహతో, జివాంజొత్ సింగ్ తేజ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా తీర్చిదిద్దిన శంకరయ్య.. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. విలువిద్యలో సహజసిద్ధమైన ప్రతిభ కలిగి ఉండే గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా కృషి చేశారు. కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్‌కు వ్యాయామ ఉపాధ్యాయులుగానే కాక భద్రాచలం ఐటీడీఏ క్రీడాధికారిగానూ పనిచేశారు.
సభ్యుడిగా పుట్టా శంకరయ్యకు అవకాశ ం