రామయ్యకు నేడు పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు నేడు పట్టాభిషేకం

Published Mon, Apr 7 2025 12:48 AM | Last Updated on Mon, Apr 7 2025 12:48 AM

రామయ్యకు నేడు పట్టాభిషేకం

రామయ్యకు నేడు పట్టాభిషేకం

ముఖ్య అతిథిగా హాజరుకానున్న

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజున పట్టాభిషేకం వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుడిని చేయనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

గవర్నర్‌ పర్యటన షెడ్యూల్‌ ఇలా..

● ఉదయం 9–45కు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో హెలికాప్టర్‌ ప్రారంభం

● 10.45కు సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు

● 11.20 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి రోడ్డు మార్గంలో శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి వస్తారు

● 11.45కు దేవస్థానం నుంచి మిథిలా స్టేడియానికి చేరుకుంటారు

● 12.45 వరకు స్టేడియంలో పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షిస్తారు

● 12,45కు స్టేడియం నుంచి బయలుదేరి 1 గంటకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు

● 1.25కు హెలీప్యాడ్‌కు.. ఆతర్వాత 1.30కు హెలీకాప్టర్‌లో పయనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement