
నేటి ప్రజావాణి రద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో సోమవారం శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున ఐడీఓసీలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేసేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. శ్రీరామనవమికి వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో కిన్నెరసానిని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 428 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.15,355, 200 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.11,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.