
ఫిల్టర్‌బెడ్‌లో ఇసుక మార్పిడి
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్‌లో నీటిని శుద్ధి చేసే ఇసుకను మారుస్తున్నారు. పదిహేను రోజులుగా పనులు నిర్వహిస్తున్నారు. 2010లో ఫిల్టర్ బెడ్ నిర్మించి, అధునాతన గ్రావిట్ ర్యాపిడ్ ఫిల్టరేషన్ పద్ధతిలో తాగునీరు శుద్ధి చేస్తున్నారు. ఇల్లెందులపాడు తాగునీటి చెరువు నుంచి నీటిని తరలించి, ఇక్కడ శుద్ధి అనంతరం పట్టణంలోకి వదులుతున్నారు. అయితే ఫిల్టర్‌బెడ్‌లో నీటి శుద్ధి ప్రక్రియలో ఇసుకను నాలుగైదేళ్లకోసారి మార్చాల్సి ఉండగా, ప్రారంభం నుంచి ఇప్పటివరకు మార్చలేదు. ఎట్టకేలకు గత పాలకవర్గం రూ. 25 లక్షలు కేటాయించి ఇసుక మార్పిడి పనులు చేపట్టింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ గత 15 రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇందుకోసం చీరాలలోని సముద్ర తీరం నుంచి ఇసుక, గులకరాళ్లు తెప్పించారు. ఫిల్టర్‌బెడ్‌లో గులక రాళ్లు, ఇసుక పొరలు పొరలుగా అమర్చుతున్నారు. పొరలపై రా వాటర్ వదిలితే ఇసుక, రాళ్లు నీటిలోని మలినాలు, మడ్డిని ఫిల్టర్ చేస్తాయి. అనంతరం నీరు పైపుల నుంచి సంప్‌లో చేరాక, ప్రజలకు సరఫరా చేస్తారు. పేరుకుపోయిన మలినాలను నెలకోసారి తొలగిస్తారు. ఇక్కడ రెండు బెడ్లు ఉండగా, ఒకదానిలో మరమ్మతులు చేపడుతున్నారు. మరో బెడ్ నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న ఇసుక తొలగింపు ఫిల్టర్‌బెడ్ మీడియా చేంజ్ పనులు మరో 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ‘రా’వాటర్ ఫిల్టరైజేషన్‌ను ఢోకా ఉండదు. కాగా పట్టణంలోని మూడొంతుల జనాభాకు ఈ ఫిల్టర్‌బెడ్ నుంచే తాగునీరు సరఫరా చేస్తున్నారు.
ఇల్లెందులో రూ.25 లక్షలతో
సాగుతున్న పనులు
సముద్ర తీరం నుంచి సేకరించిన
గులక రాళ్ల వినియోగం
తాగునీటి శుద్ధి వ్యవస్థ మెరుగయ్యేలా
మరమ్మతు పనులు
వేగంగా చేపట్టాలి
పట్టణ ప్రజలకు నీరందించే ఫిల్టర్ బెడ్‌లో ఇసుక మార్పిడి ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి. వేసవి కాలం కావడంతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి. నాణ్యతలో రాజీ పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పట్టణవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి.
– కొడారి రాజేందర్, ఇల్లెందు
మరో 15 రోజుల్లో పూర్తి..
మున్సిపల్ ఫిల్టర్‌బెడ్‌లో ఇసుక మార్పిడి ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇక్కడ రెండు బెడ్లు ఉండగా, ఒక బెడ్‌లో నీటిని నిలిపి వేసి, మరో బెడ్‌లో ఇసుక, రాయి లేయర్ల వారీగా వేస్తున్నాం. ఈ ప్రక్రియ మరో 15 రోజులో పూర్తి అవుతుంది. నీటి శుద్ధికి ఢోకా ఉండదు.
–సీహెచ్ శ్రీకాంత్, కమిషనర్, ఇల్లెందు

ఫిల్టర్‌బెడ్‌లో ఇసుక మార్పిడి

ఫిల్టర్‌బెడ్‌లో ఇసుక మార్పిడి

ఫిల్టర్‌బెడ్‌లో ఇసుక మార్పిడి