ట్రాన్స్‌జెండర్లను గౌరవంగా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్లను గౌరవంగా చూడాలి

Apr 8 2025 10:52 AM | Updated on Apr 8 2025 10:52 AM

ట్రాన

ట్రాన్స్‌జెండర్లను గౌరవంగా చూడాలి

కొత్తగూడెంటౌన్‌: ట్రాన్స్‌జెండర్లను, సెక్స్‌ వర్కర్లను అందరూ గౌరవించాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని భవిత సెంటర్‌లో ట్రాన్స్‌ జెండర్లు, సెక్స్‌ వర్కర్లకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. న్యాయమూర్తి బియ్యం అందజేసి మాట్లాడారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ నెల ఉచితంగా బియ్యం ఇస్తామని, పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలని సెక్యూర్‌ ఎన్జీఓ ప్రాజెక్టు మేనేజర్‌ రాజేంద్రప్రసాద్‌ను ఆదేశించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పి. నిరంజన్‌రావు, సెక్యూర్‌ ఏన్జీఓ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ అధికారులు

అప్రమత్తంగా ఉండాలి

వీసీలో ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

హన్మకొండ: ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్‌ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం ఆయన 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్‌ సరఫరాను పరిశీలిస్తూ అంతరాయం ఎదురైతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. చెట్లు విరిగి విద్యుత్‌ లైన్లపై పడినా, ట్రిపింగ్‌, బ్రేక్‌డౌన్లు వచ్చినా త్వరగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, పంట కోతలు జరుగుతున్నందున పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీసుల మంజూరులో వేగం పెంచాలని, అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సీఎండీ ఆదేశించారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లాస్థాయి మ్యాక్స్‌ అండ్‌ సైన్స్‌ క్విజ్‌ కార్యక్రమం ముగింపు ఉత్సవానికి డీఈఓ వెంకటేశ్వరాచారి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్టీయ్ర ఆవిష్కార అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా 8, 9తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయిలో మ్యాథ్స్‌, సైన్స్‌ క్విట్‌ పోటీలు నిర్వహించారు. 9వ తరగతి విభాగంలో సీహెచ్‌.రేణుక, లక్ష్మీమణి, ఎస్‌.సుబ్రహ్మణ్యం, ఎం.భరత్‌ చంద్ర, 8వ తరగతి విభాగంలో బి. జాహ్నవి, కే.భవ్య శ్రీ, ఎన్‌.గీతిక బహుమతులు గెలుచుకున్నారు. డీఈఓ బహుమతులు అందించి మాట్లాడారు. పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు హాజరుకాగా, కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఏ.నాగరాజశేఖర్‌, ఎస్కే సైదులు, ఎన్‌.సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

నవమితో ఆర్టీసీకి ఆదాయం

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలో ఈ నెల 6,7 వ తేదీల్లో జరిగిన శ్రీ రామనవమి, పట్టాభిషేకం సందర్భంగా ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో భద్రాచలం డిపోకు సుమారు రూ.9.5 లక్షల ఆదాయం పెరిగింది. సాధారణంగా భద్రాచలం డిపో పరిధిలో రోజూ 92 సర్వీసులు నడుపుతుండగా, రూ. 23 లక్షల వరకు ఆదాయం వస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా 5న అదనంగా మరో 26 సర్వీసులు తిప్పగా రూ.3 లక్షల మేర ఆదాయం పెరిగింది. 6న అదనంగా 30 సర్వీసులు నడపగా రూ. 4.50 లక్షలు, 7వ తేదీన అదనంగా 16 సర్వీసులు నడపగా రూ. 2 లక్షల వరకు ఆదాయం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మద్యానికి బానిపై

ఆత్యహత్య

ఇల్లెందు: ఇల్లెందు మండలం ధనియాలపాడు సమీపాన జామాయిల్‌ తోటలో ఓ వ్యక్తి ఆత్యహత్య పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కారేపల్లి మండలం చెన్నంగులగడ్డకు చెందిన డి.సురేష్‌(38) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబంలో గొడవలు జరుగుతుండగా, సోమవారం ధనియాలపాడు సమీపాన జామాయిల్‌ తోటలో ఉరి వేసుకున్నాడు. ఘటనపై ఆయన భార్య వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.

ట్రాన్స్‌జెండర్లను  గౌరవంగా చూడాలి
1
1/1

ట్రాన్స్‌జెండర్లను గౌరవంగా చూడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement