
రోడ్డు ప్రమాదంలో కార్మిక నాయకుడి మృతి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మిక నాయకుడు సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. సింగరేణి మాజీ ఉద్యోగి, టీబీజీకేఎస్ నాయకుడు, కాంట్రాక్ట్ కార్మిక పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ (58) కొత్తగూడెం నుంచి గౌతంపూర్‌లోని తన ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో మరో ద్విచక్రవాహనంపై కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు ఇద్దరు యువకులు వెళ్తున్నారు. ఈ క్రమంలో ధన్‌బాద్ పోచమ్మ గుడి వద్ద రోడ్ క్రాస్ చేస్తుండగా ఢీకొట్టారు. దీంతో శంకర్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 ద్వారా సింగరేణి ప్రధానాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా శంకర్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడిగా కార్మిక సమస్యల పరిష్కారానికి, ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు అనేక పోరాటాలు చేశారు. మృతిపట్ల బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతోపాటు ఎండీ రజాక్ తదితరులు సంతాపం తెలిపారు.