
విద్యుత్ ఉద్యోగులకు వైద్య శిబిరం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్తగూడెంలోని సర్కిల్ కార్యాలయ ఆవరణలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు 100 మంది విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, కార్డియాలజీ విభాగాల వారు పరీక్షించి తగిన సూచనలు చేశారు. కేన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించారు. విద్యుత్ ఎస్‌ఈ జి మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ కోట్ల బాలరాజు, కార్డియాలజిస్ట్ డాక్టర్ మజీద్, విద్యుత్ డీఈ ఎన్.కృష్ణ, కొత్తగూడెం, పాల్వంచ డీఈలు జి.రంగస్వామి, పీఎస్‌వీఎస్ నందయ్య, సర్కిల్ కార్యాలయ ఏఓ శ్రీధర్, టెక్నికల్ ఏడీఈ కె. రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.