
అకాల వర్షంతో పంట నష్టం
దుమ్ముగూడెం : మండలంలోని రామారావుపేటలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. గ్రామంలో సుమారు 60 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వడగాళ్ల వానకు మిగతా గ్రామాల్లో కూడా పంటనష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గింజలు రాలిపోయాయని పేర్కొన్నారు. గాలి దుమారంతో ఇళ్లపై రేకులు లేచిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, తాగేందుకు నీళ్లు లేక చేతి బోరు దగ్గర నుంచి నీళ్లను తెచ్చుకున్నామని గ్రామస్తులు తెలిపారు. చెట్టు విరిగిపడి పంచాయతీ ట్రాక్టర్ కూడా ధ్వంసమైంది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.
గాలిదుమారంతో రాలిన మామిడి
చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లిలో గాలిదుమారం, వడగళ్ల వానతో మామిడి పంట దెబ్బతిన్నది. ఆదివారం రాత్రి వడగళ్ల వర్షం కురియడంతో తోటలోల మామిడికాయలు రాలిపోయాయి. దీంతో పలువురు రైతులు నష్టపోయారు.

అకాల వర్షంతో పంట నష్టం