
నేడు రాత పరీక్షలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న కెమిస్ట్–1, ఈ గ్రేడ్–1, సెక్యూరిటీ జమేదార్ టీఎస్ గ్రేడ్–26 పోస్టులకు ఈ నెల 13న సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. కెమిస్ట్–1, ఈ గ్రేడ్–1 పోస్టుకు 13 మంది దరఖాస్తు చేసుకోగా, జమేదార్ పోస్టులకు 78 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి యాజమాన్యం హాల్ టికెట్లు పంపిణీ చేసింది. ఈ నెల 13న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
ఐఎన్‌టీయూసీ నేతకు వినతి
మణుగూరుటౌన్: జేఏంఓల ప్రమోషన్ పాలసీలో మార్పులు చేయాలని కోరుతూ.. ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు శనివారం ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్‌కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ–1 గ్రేడ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంటేనే జేఎంఓ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉందని, ఏ–1 గ్రేడ్‌కు రావడానికి ఉద్యోగులకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. ఉద్యోగ విరమణ దశలో అర్హత పొందుతున్నారని, ఫలితంగా గత నోటిఫికేషన్‌లో 87 పోస్టులకు గాను 15 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది ఎంపికయ్యారన్నారు. సమస్యను గుర్తించి త్వరితగతిన నోటిఫికేషన్ జారీ అయ్యేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్యయాదవ్, జయరాజు, దారా సుకుమార్ ఉన్నారు.
బెల్లం, పటిక పట్టివేత
కొత్తగూడెంఅర్బన్: నిషేధిత నాటుసారాయికి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా శనివారం కొత్తగూడెం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ జయశ్రీ, ఎస్‌ఐ శ్రీహరిరావు కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని పెద్దబజార్‌లో బెల్లం ఉందనే సమాచారంతో ఎకై ్సజ్ ఎస్‌ఐ శ్రీహరిరావు తన సిబ్బందితో దాడి చేసి, ట్రాలీలో ఉన్న 360 కేజీల బెల్లం, 15 కేజీల స్పటికం పట్టుకున్నారు. ట్రాలీని ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించి, బెల్లం కొనుగోలు చేసిన రాంకుమార్, డ్రైవర్ మంగీలాల్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నది పెద్ద వాహనమని, సమాచారం వెల్లడించే సమయంలో చిన్న వాహనం చూపించారనే ఆరోపణలు వచ్చాయి.
ఐదు రాష్ట్రాలస్థాయి
కబడ్డీ పోటీలు షురూ..
కొణిజర్ల: మండలంలోని తనికెళ్లలో ఐదు రాష్ట్రాలస్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
దుమ్ముగూడెం: మండలంలోని చిన్ననల్లబల్లి అటవీ శాఖ చెక్‌పోస్టు మీదుగా ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న కలపను సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు పరిశీలిస్తుండగా కలప పట్టుబడింది. ఈ మేరకు ట్రాక్టర్‌ను అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించగా, కలప విలువ రూ.లక్ష వరకు ఉండొచ్చని తెలిసింది.
గుండెపోటుతో
యువకుడు మృతి
ఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు ఏరియాకు చెందిన లోదు కార్తీక్‌సోనూ (24) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. అయితే, ఆయన అస్వస్థతకు గురికాగానే కుటుంబీకులు, స్నేహితులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉన్నందున కొత్తగూడెం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ కుటుంబీకుల వినతితో వైద్యం చేస్తుండగానే కార్తీక్ మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబీకులు వైద్యుడిని నిలదీయగా ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలిసి సీఐ మత్తుల సత్యనారాయణ చేరుకుని నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు.
క్రికెట్ ఆడుతూ కుప్పకూలి...
ఇల్లెందు: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఇల్లెందు సబ్‌జైల్ బస్తీకి చెందిన ఆంటోనీ విమల్ (30) గుండెపోటుతో మృతి చెందారు. మరికొందరు ఉద్యోగులతో కలిసి ఆయన అక్కడ శనివారం క్రికెట్ ఆడుతూనే కుప్పకూలినట్లు తెలిసింది. ఈ విషయమై అందిన సమాచారంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

నేడు రాత పరీక్షలు