శ్రీకాంత్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ ఔన్నత్యాన్ని చాటుతూ ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. మధురైలో జరిగిన సీపీఎం అఖిల భారత మహాసభలకు వెళ్లిన శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన అంత్యక్రియలు బుధవారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ నివాసంలో జరిగిన సంతాపసభలో అరుణ్‌కుమార్ మాట్లాడారు. జిల్లాలో విద్యార్థి ఉద్యమాభివృద్ధికి ఆయన తోడ్పడ్డారని గుర్తుచేశారు. ఆయన కుటుంబం పార్టీ కోసం నిలబడినందున, ఇప్పుడు వారికి పార్టీ చేదోడుగా నిలవాలని సూచించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. శ్రీకాంత్ లాంటి పోరాట యోధుడు దూరం కావడం బాధాకరమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. శ్రామికవర్గాల రాజ్యస్థాపనకు పనిచేసిన శ్రీకాంత్ సేవలు మరువలేనివని చెప్పారు. అనంతరం అంతిమయాత్రలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా, ఆయన పాడెను అరుణ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు మోశారు. ఇంకా మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఎం.సాయిబాబు, బి.వెంకట్, వై.వెంకటేశ్వరరావు, జూలకంటి రంగారెడ్డి, బాగం హేమంతరావు, పాలడుగు భాస్కర్, బండారు రవికుమార్, ప్రభాకర్, చావా రవి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అలాగే, దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణ జిల్లా కమిటీ బాధ్యులు షేక్ అబ్దుల్ రెహమాన్, మావిడాల ఝాన్సీ, దామల్ల జయ తదితరులు కూడా శ్రీకాంత్ మృతదేహం వద్ద నివాళులర్పించారు.
సంతాప సభలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు అరుణ్
శ్రీకాంత్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి


