
మూడు రోజుల వ్యవధిలో దంపతులు మృతి
తిరుమలాయపాలెం: మూడు రోజుల కిందట గుండెపోటుతో భర్త మృతి చెందడాన్ని తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుతోనే మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలోని ఏలువారిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దిండు ఉపేందర్ గత సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆవేదనతో ఉన్న ఆయన భార్య పద్మ (50)ను తిరుమలాయపాలెంకు చెందిన అన్న తురక వెంకన్న తమ ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఉపేందర్ చిన్న కర్మ చేయాల్సి ఉండడంతో బుధవారం ఏలువారిగూడెం వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబంలోనే కాక గ్రామంలో విషాదాన్ని నింపింది.

మూడు రోజుల వ్యవధిలో దంపతులు మృతి