ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఉండాల్సిందే..
కొత్తగూడెంఅర్బన్: ఆహార సంబంధిత వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ఫోస్టాక్ ఫుడ్ సేఫ్టీ శిక్షణ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొంది ఉండాలని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, ఫోస్టాక్ ట్రైనర్ ప్రవీణ్ తెలిపారు. పాన్ ఇండియా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ భాగస్వామి, జాతీయ ఆహార భద్రత సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, ఆమోదించిన ఫోస్టాక్ శిక్షణ, సర్టిఫికెట్ కార్యక్రమం మంగళవారం డీఎంహెచ్‌ఓ సమావేశపు హాల్‌లో నిర్వహించగా.. వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కల్తీని గుర్తించాలని తెలిపారు. ఎవరైనా ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తినుబండారాలకు సంబంధించి దుకాణాదారులు, వ్యాపారులంతా ఫుడ్ లైసెన్స్‌తో పాటు ఫోస్టాక్ ట్రైనింగ్ సర్టిఫికెట్‌ని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేవీజీవీఎం సౌత్ ఇండియా ఇన్‌చార్జ్‌లు టి.సింధు, ఇ.మోహన్‌బాబు, కొత్తగూడెం జిల్లా టీం హెడ్ శివకల్పన, జిల్లా ఎగ్జిక్యూటివ్‌లు సోహెల్, యాకూబ్, శేఖర్, షఫీ, సమీర్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.


