
గవర్నర్‌కు ఘనస్వాగతం
బూర్గంపాడు: భద్రాచలం శ్రీరామ పట్టాభిషేకానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సారపాకలో ఘనస్వాగతం లభించింది. సారపాకలోని ఐటీసీ అనుబంధ భద్రాచలం పబ్లిక్‌స్కూల్ ఆవరణలోని హెలీప్యాడ్‌కు చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న గవర్నర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపు గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం భద్రాచలం రామాలయానికి వెళ్లారు. శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు తిరిగి వచ్చిన అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత హెలీప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్ వెళ్లారు.
రెడ్ క్రాస్ సేవలు విస్తృతపరచాలి
రెడ్ క్రాస్ సేవలు మరింతగా విస్తృతపరచాలని రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్ వర్మ సూచించారు. ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం గవర్నర్‌ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం శాఖ ప్రతినిధులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా భద్రాచలం రెడ్‌క్రాస్ సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం గవర్నర్ పలు సూచనలు చేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులు ఎస్‌ఎల్ కాంతారావు, శ్రీనివాసరావు, సూర్యనారాయణ, రాజారెడ్డి, గాలిబ్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటన సాగిందిలా...
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో సోమవారం గవర్నర్ పర్యటన 3: 31 గంటల పాటు సాగింది. ఉదయం 10:59 గంటలకు సారపాక ఐటీసీలోని బీపీఎల్ స్కూల్ హెలీప్యాడ్‌లో దిగారు. అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, 11:28 గంటలకు అక్కడి నుంచి భద్రాచలానికి రోడ్డుమార్గాన బయల్దేరారు. 11:42 గంటలకు రామాలయం, లక్ష్మీతయారు అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకుని పట్టాభిషేకానికి హాజరయ్యారు. 12:55 గంటలకు మిథిలా స్టేడియం నుంచి బయల్దేరి ఐటీడీఏకు వెళ్లారు. అక్కడ గిరిజన మ్యూజియం ప్రారంభించి, 1:58 గంటలకు తిరిగి ఐటీసీ గెస్ట్‌హౌస్ చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.