
రజతోత్సవ సభను జయప్రదం చేయండి
భద్రాచలంటౌన్: భద్రాచలం నియోజకవర్గం నుంచి భారీగా హాజరై బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. స్థానిక రాఘవ నిలయం (రెడ్డి సత్రం)లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఏప్రిల్ 27న గులాబీ పార్టీ పండుగ రోజని, ఆ రోజు గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని తెలిపారు. సమావేశంలో పినపాక మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, దిండిగాల రాజేందర్, మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, రాంబాబు, నర్సింహమూర్తి, దొడ్డి తాతారావు, ఆకోజు సునీల్, కణితి రాముడు, బుచ్చయ్య, రేసు లక్ష్మి, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో శుక్రవారం బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు సంబందించిన వాల్‌పోస్టర్లను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ స్థాపించి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపుమేరకు వరంగల్‌లో ఈ నెల 27న బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, భూక్య సోన, కొట్టి వెంకటేశ్వర్లు, మంతెపూరి రాజుగౌడ్, బత్తుల వీరయ్య పాల్గొన్నారు.