
సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి నాలుగు లక్షల మంది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి విక్రయించాడనే ఆరోపణలపై ఒక వ్యక్తిని త్వరలో అరెస్టు చేస్తామని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' తెలిపారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి దొంగలించిన నాలుగు లక్షల నెంబర్లు, వ్యక్తిగత సమాచారం.. అక్రమ వలసలు, అమెరికా పౌరులు కానివారు ఓటు వేయడానికి అనుమతిస్తామని మస్క్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. సామాజిక భద్రత, వైద్య సంరక్షణ, నిరుద్యోగ భృతి, ఐఆర్ఎస్ వాపసులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ, పత్రాలు లేని వలసదారులు ప్రయోజనాలను పొందడాన్ని డెమొక్రాట్లు సులభతరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
విపత్తు సహాయానికి ఉద్దేశించిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని మస్క్ ఆరోపించారు. జాతీయ విపత్తుల వల్ల బాధపడుతున్న అమెరికన్లకు సహాయం చేయడానికి ఉద్దేశించిన ఎఫ్ఈఎమ్ఏ నిధులను దారి మళ్లించి, న్యూయార్క్‌లోని లగ్జరీ హోటళ్లకు అక్రమంగా నివసించేవారి కోసం చెల్లించడానికి ఉపయోగించారని అన్నారు.
🚨 ELON MUSK: "Someone is going to be arrested tomorrow. He actually stole 400,000 social security numbers & personal information from the Social Security database and was selling social security numbers in order for people to basically steal money from Social Security." pic.twitter.com/1hjl1Umcup
— DogeDesigner (@cb_doge) April 1, 2025