
న్యూఢిల్లీ: డీప్ టెక్ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహా య మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
దేశ అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ప్రతి భారతీయుడికి తగు అవకాశాలు కల్పించేలా నవ భరతం ఉండాలన్నది ప్రధాని ఆకాంక్షని ఆయన చెప్పారు. కేరళలోని క్యాథలిక్ బిషప్ హౌస్ క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ఈ విషయాలు తెలిపారు.