2030 నాటికి రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే.. | Corporate India to Raise Rs 115-125 Lakh Cr in Debt by FY30 A Focus on Infrastructure and Growth | Sakshi
Sakshi News home page

2030 నాటికి రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..

Published Sat, Mar 8 2025 4:19 PM | Last Updated on Sat, Mar 8 2025 4:26 PM

Corporate India to Raise Rs 115-125 Lakh Cr in Debt by FY30 A Focus on Infrastructure and Growth

దేశీయ కార్పొరేట్‌ కంపెనీల మూలధన వ్యయం పెరుగుతోంది. దాంతో 2030 నాటికి సుమారు రూ.115-125 లక్షల కోట్లు రుణాన్ని సమీకరించనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ భారీ నిధులు ఆయా కంపెనీలకు మూలధన వ్యయం (CAPEX), వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (NBFC) ఫైనాన్సింగ్‌ కోసం ఉపయోగించబోతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్‌ రంగంలో భవిష్యత్తులో మౌలిక సదుపాయాల రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ పెట్టుబడుల్లో సింహభాగం అందుకే ఖర్చు చేస్తాయని భావిస్తున్నారు.

రుణ కేటాయింపులు ఇలా..

మూలధన వ్యయం: మొత్తం రుణంలో సుమారు రూ.45-50 లక్షల కోట్లు కాపెక్స్‌కు కేటాయిస్తారు. ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్‌ చేయడానికి, వివిధ పరిశ్రమల్లో కొత్త సౌకర్యాలను సిద్ధం చేయాడానికి ఈ పెట్టుబడి కీలకం.

వర్కింగ్ క్యాపిటల్, ఎన్‌బీఎఫ్‌సీ ఫైనాన్సింగ్: మిగిలిన రూ.70-75 లక్షల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఎన్‌బీఎఫ్‌సీ ఫైనాన్సింగ్ అవసరాలను తీరుస్తాయి. కార్పొరేట్ ఎకోసిస్టమ​్‌లో కార్యకలాపాలు సజావుగా, లిక్విడిటీ ఉండేలా ఈ ఫండ్స్ దోహదపడతాయి.

మౌలిక సదుపాయాలు: కార్పొరేట్‌ కంపెనీ అభివృద్ధిలో భాగంగా మొత్తం పెట్టుబడుల్లో దాదాపు మూడొంతుల వాటాను మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తారు. ఇందులోనూ ప్రధానంగా కింది విభాగాల్లో ఖర్చులు పెరగన్నాయని చెబుతున్నారు.

రవాణా: కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల్లో పెట్టుబడులు పెడుతారు.

ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణ, పవర్ గ్రిడ్ల ఆధునీకరణకు ఇన్వెస్ట్‌ చేస్తారు.

పట్టణాభివృద్ధి: పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణం, నీటి సరఫరా, పారిశుద్ధాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతారు.

ఇదీ చదవండి: 2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..

సవాళ్లు, అవకాశాలు

రుణ ఆధారిత కార్పొరేట్‌ కంపెనీల విస్తరణ అపారమైన అవకాశాలను అందిస్తున్నప్పటికీ ఈ విధానంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకులు, కార్పొరేట్ బాండ్లు, బాహ్య వాణిజ్య రుణాలు(ఈసీబీ) సహా ఫైనాన్సింగ్ ఎకోసిస్టమ్ వార్షికంగా 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చడానికి ఈ వృద్ధి సరిపోకపోవచ్చు. ఇది రూ.10-20 లక్షల కోట్ల నిధుల అంతరానికి దారితీస్తుంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి కార్పొరేట్ బాండ్ మార్కెట్ కీలకపాత్ర పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement