Capex cycle
-
పీఎల్‌ఐను మించిన విధానాల రూపకల్పన
భారతదేశం గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా నిలదొక్కుకుంటున్నందున ప్రభుత్వం ఉద్యోగ కల్పన, మూలధన వ్యయం (క్యాపెక్స్) అనే రెండు కీలక లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన వైఖరితో కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) వంటి ప్రస్తుత పథకాల ఫలితాలను పరిగణలోకి తీసుకొని కొత్త విధానంలో పరిమితులను పెంచేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ తయారీలో భారతదేశ వాటాను పెంచుతూ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నందున ఈ వ్యూహాత్మక మార్పు అవసరమని భావిస్తున్నారు. దీన్ని రూపొందించడంలో కీలక అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.తయారీలో పురోగతిభారత్ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారం, పీఎల్ఐ పథకం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్పాదక శక్తి కేంద్రంగా మారాలని దీర్ఘకాలిక లక్ష్యంగా ఏర్పరుచుకుంది. అందుకోసం కొన్ని విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుత ప్రయత్నాలు ఆశించిన ఆర్థిక పరివర్తనను పూర్తిగా అందించలేదు. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన పీఎల్ఐ పథకం నిర్దిష్ట విభాగాల్లో ప్రొడక్షన్‌ను పెంచింది. కానీ, చైనా వంటి ప్రపంచ పోటీదారులకు ధీటుగా అవసరమైన విస్తృతమైన పారిశ్రామిక వృద్ధిని సృష్టించడంలో విఫలమైంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉత్పత్తి లక్ష్యాల కంటే ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చే కొత్త విధానాన్ని తీసుకురావాలని పరిశీలనలో పడింది.పెద్ద మొత్తంలో ఉద్యోగాలు..కొత్తగా రానున్న విధానానికి ఉపాధి కల్పన కీలకం కానుంది. దేశంలో పెరుగుతున్న యువ శ్రామిక శక్తితో స్థిరమైన, మంచి వేతనంతో ఉద్యోగాలను సృష్టించడం చాలా ముఖ్యం. ఇది ఆర్థిక అవసరంతోపాటు పార్టీలకు అతీతంగా రాజకీయంగా కూడా లబ్ధి చేకూరే అంశం. దేశంలో కొన్ని పరిశ్రమలు లక్షలాది మందికి ఉపాధిని అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, తోలు వస్తువులు.. వంటి తయారీ పరిశ్రమలు పెద్దమొత్తంలో ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతాయి. వీటికి ప్రోత్సాహకాలను అనుసంధానం చేయడం ద్వారా నిరుద్యోగాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో దీనివల్ల భారీగా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తుంది.ఇదీ చదవండి: తెల్లవారితే మారే రూల్స్ ఇవే!మూలధన వ్యయానికి పెద్దపీటమెరుగైన ఉత్పాదకతకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు అవసరం. దీన్ని గ్రహించిన ప్రభుత్వ వర్గాలు మూలధన వ్యయానికి పెద్దపీట వేసింది. కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు, విద్యుత్ సరఫరా వ్యవస్థల్లోకి గణనీయమైన పెట్టుబడులను మళ్లించాలని భావిస్తుంది. క్యాపెక్స్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, సరఫరా గొలుసు సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భారతీయ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త విధానంలో భాగంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలకు మరింత మూలధనాన్ని సమకూర్చవచ్చు. ఇది ప్రైవేట్ పెట్టుబడులు పెంచుతూ ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. -
2030 నాటికి రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..
దేశీయ కార్పొరేట్ కంపెనీల మూలధన వ్యయం పెరుగుతోంది. దాంతో 2030 నాటికి సుమారు రూ.115-125 లక్షల కోట్లు రుణాన్ని సమీకరించనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ భారీ నిధులు ఆయా కంపెనీలకు మూలధన వ్యయం (CAPEX), వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (NBFC) ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించబోతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో భవిష్యత్తులో మౌలిక సదుపాయాల రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ పెట్టుబడుల్లో సింహభాగం అందుకే ఖర్చు చేస్తాయని భావిస్తున్నారు.రుణ కేటాయింపులు ఇలా..మూలధన వ్యయం: మొత్తం రుణంలో సుమారు రూ.45-50 లక్షల కోట్లు కాపెక్స్‌కు కేటాయిస్తారు. ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి, వివిధ పరిశ్రమల్లో కొత్త సౌకర్యాలను సిద్ధం చేయాడానికి ఈ పెట్టుబడి కీలకం.వర్కింగ్ క్యాపిటల్, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్: మిగిలిన రూ.70-75 లక్షల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్ అవసరాలను తీరుస్తాయి. కార్పొరేట్ ఎకోసిస్టమ్‌లో కార్యకలాపాలు సజావుగా, లిక్విడిటీ ఉండేలా ఈ ఫండ్స్ దోహదపడతాయి.మౌలిక సదుపాయాలు: కార్పొరేట్ కంపెనీ అభివృద్ధిలో భాగంగా మొత్తం పెట్టుబడుల్లో దాదాపు మూడొంతుల వాటాను మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తారు. ఇందులోనూ ప్రధానంగా కింది విభాగాల్లో ఖర్చులు పెరగన్నాయని చెబుతున్నారు.రవాణా: కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల్లో పెట్టుబడులు పెడుతారు.ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణ, పవర్ గ్రిడ్ల ఆధునీకరణకు ఇన్వెస్ట్ చేస్తారు.పట్టణాభివృద్ధి: పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణం, నీటి సరఫరా, పారిశుద్ధాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతారు.ఇదీ చదవండి: 2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..సవాళ్లు, అవకాశాలురుణ ఆధారిత కార్పొరేట్ కంపెనీల విస్తరణ అపారమైన అవకాశాలను అందిస్తున్నప్పటికీ ఈ విధానంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకులు, కార్పొరేట్ బాండ్లు, బాహ్య వాణిజ్య రుణాలు(ఈసీబీ) సహా ఫైనాన్సింగ్ ఎకోసిస్టమ్ వార్షికంగా 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చడానికి ఈ వృద్ధి సరిపోకపోవచ్చు. ఇది రూ.10-20 లక్షల కోట్ల నిధుల అంతరానికి దారితీస్తుంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి కార్పొరేట్ బాండ్ మార్కెట్ కీలకపాత్ర పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మౌలిక సదుపాయాలకు కేటాయింపులు.. దేనికి ఖర్చు చేస్తారంటే..
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు మూలధన వ్యయాన్ని (CAPEX) పెంచడంపై బడ్జెట్లో దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.11.21 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది రూ.11.11 లక్షల కోట్లతో పోలిస్తే 0.9% ఎక్కువ. అయితే, 2024-25 సంవత్సరానికి సవరించిన అంచనా రూ.10.18 లక్షల కోట్లతో పోలిస్తే ఈ కొత్త కేటాయింపులు ప్రణాళికాబద్ధమైన పెట్టుబడుల్లో పెరుగుదల నమోదు చేశాయి.మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి మూలస్తంభంగా నిలుస్తాయి. ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో వేసిన అంచనా పద్దుల ప్రకారం కింది విభాగాల్లో ఖర్చు చేసే అవకాశం ఉంది.ఎందుకోసం ఖర్చు చేస్తారంటే..లాజిస్టిక్స్, ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడానికి రోడ్డు, రైలు, నౌకాశ్రయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా స్మార్ట్ సిటీలు, పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతారు. సమాన అభివృద్ధి, మార్కెట్ల సౌలభ్య కోసం గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తారు. ప్రపంచం సుస్థిర భవిష్యత్తు దిశగా పయనిస్తున్న తరుణంలో ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులపై ఖర్చు చేస్తుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సౌర, పవన, జలవిద్యుత్ ప్రాజెక్టులను విస్తరిస్తుంది. మొత్తం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేస్తుంది.డిజిటలైజేషన్ కోసం..సుస్థిర వ్యవసాయ, పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహిస్తుంది. డిజిటలైజేషన్‌పై, ఈ విభాగంలో వినూత్న విధానాల అమలుకు ఖర్చు చేస్తారు. డిజిటల్ వృద్ధికి తోడ్పడటానికి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, 5జీ నెట్‌వర్క్‌లను పెంచేందుకు కృషి చేస్తారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ, పారదర్శకతను మెరుగుపరిచేందుకు ఈ-గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌లపై ఇన్వెస్ట్ చేస్తారు. డిజిటల్ బెదిరింపుల నుంచి రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ సదుపాయాలను బలోపేతం చేస్తారు.హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఆసుపత్రులు, క్లినిక్‌లు, వైద్య పరిశోధన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. విద్యా నాణ్యతను పెంచడానికి పాఠశాలలు, కళాశాలలు, వృత్తి శిక్షణా కేంద్రాలపై పెట్టుబడి పెడుతారు. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్‌లో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్ఎంఎస్ఎంఈలపై..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. వృద్ధి, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈలకు రుణాలు అందుబాటులో ఉంచేందుకు మూలధనాన్ని ఖర్చు చేస్తారు. ఎంఎస్ఎంఈలకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఉత్పాదకతను మెరుగుపరచడానికి కొత్త సాంకేతికతలను అవలంబించడంలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వాలి. -
ప్రభుత్వ మూలధన వ్యయాలు తగ్గుతాయ్!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో మూలధన వృద్ధికి కోత పెట్టే అవకాశం ఉందని విదేశీ బ్రోకరేజ్ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. మార్చితో ముగిసే 2024–25 వార్షిక బడ్జెట్లో మూలధన వృద్ధి రేటు 17 శాతం అయితే, రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చని విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 4.5 శాతానికి (2024–25లో 4.9 శాతం) కట్టడి చేయడమే లక్ష్యంగా కొత్త బడ్జెట్లో మూలధన వ్యయాలకు కోత పెట్టే వీలుందని పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్..?లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాని నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు, సంక్షేమ పథకాలకు బడ్జెట్ నిధులు కేటాయింపు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 11 త్రైమాసిక కనిష్ట స్థాయి 5.4 శాతం తగ్గుదలకు ప్రభుత్వ మూలధన వ్యయాల్లో తగ్గుదల ఒక కారణం. ఆర్బీఐ ద్రవ్య పరపతి కఠిన విధానమూ ఇందుకు దారితీసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్ దీర్ఘకాలిక ఆర్థిక విధానం గురించి కూడా విస్తృత స్థాయిలో చర్చించే వీలుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే తయారీ, సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆయా రంగాలకు రుణ లభ్యత, గ్రామీణ గృహ నిర్మాణాలకు ప్రోత్సాహం, ధరల స్థిరత్వానికి ఫుడ్ చైన్ పటిష్టత వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించే వీలుంది. -
మూలధన వ్యయాల వృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ మూలధన వ్యయాల వేగవంతంపై కేంద్రం దృష్టి సారించింది. రూ. 500 కోట్లకు మించిన వ్యయానికి సంబంధించిన నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 11.11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను(మూలధన వ్యయం) బడ్జెట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ఇది 11.1 శాతం ఎక్కువ. సార్వత్రిక ఎన్నికల కారణంగా కొన్ని నెలలపాటు మందగించిన ప్రభుత్వ వ్యయాలను తిరిగి వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 15 నెలల కనిష్ట స్థాయిలో 6.7 శాతంగా నమోదుకావడానికి ఎన్నికల సందర్భంగా మూలధన వ్యయాల్లో నెమ్మదే కారణమన్న విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన వ్యయాలకు సంబంధించి అనుమతించిన తాజా సడలింపులను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ), సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సీఎన్ఏ), మంత్లీ ఎక్స్పెండిచర్ ప్లాన్ (ఎంఈపీ), స్కీమ్ అలాగే నాన్–స్కీమ్ ఖర్చుల కోసం మంత్రిత్వ శాఖలు రూపొందించిన త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ)లు సీలింగ్‌ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలు మరోవైపు రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్), టెలికాం శాఖ కోసం బడ్జెట్ మూలధన వ్యయాలపై జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరమని అన్నారు. సంవత్సరంలో మిగిలిన నెలల్లో వ్యయాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ క్యాపెక్స్ కేటాయింపులు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.42 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుత 2024–25లో 90% వృద్ధితో రూ. 2.72 లక్షల కోట్లకు ఎగశాయి. 2024–25కు సంబంధించిన క్యాపెక్స్ ప్రణా ళికల గురించి ఎంఓఆర్టీహెచ్ సెక్రటరీ కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికమంత్రికి సెక్రటరీ తెలియజేసినట్లు సమాచారం. క్యాపెక్స్ వ్యయాల వేగవంతంపై ఆర్థిక మంత్రి వివిధ మంత్రిత్వశాఖలు, సమావేశమవుతున్నారు. -
పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయం
దేశంలో ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం 54% పెరుగుతుందని అంచనా. 2023-24లో రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్న ఈ పెట్టుబడులు ఈ ఏడాదిలో రూ.2.45 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆర్బీఐ ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది. పెరుగుతున్న దేశీయ డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ నిర్వహణ, స్థిరమైన క్రెడిట్ డిమాండ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి..వంటి చాలా అంశాలు ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొంది. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు ప్రధానంగా మౌలిక వసతులు సదుపాయానికి, రోడ్లు, వంతెనలు, విద్యుత్..వంటి ప్రాజెక్ట్‌లను రూపొందించడానికి వెచ్చిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇదీ చదవండి: ఆటోమేషన్తో మహిళలకు అవకాశాలుబ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా భారీగా నిధులు పొంది వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సదుపాయాల ద్వారా రానున్న 3-5 ఏళ్లల్లో ఆదాయం సమకూరనుంది. మూలధన పెట్టుబడులు పెరగడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థకు దూసుకుపోతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందుతాయి. దేశీయ ఉత్పత్తి పెరుగుతోంది. ఎగుమతులు హెచ్చవుతాయి. ఫలితంగా స్థూల దేశీయోత్పత్తి అధికమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ప్రపంచ టాప్ 10 కంపెనీలు ఇవే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీల మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా వాటి విలువ మారుతుంది. 2023 సంవత్సరానికిగాను సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ను బట్టి ప్రపంచంలో టాప్ 10 కంపెనీలను సూచిస్తూ ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. కంపెనీల ర్యాంకును అనుసరించి కిందివిధంగా ఉన్నాయి. 1. యాపిల్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.230 లక్షల కోట్లు. సీఈఓ: టిమ్‌కుక్ కంపెనీ ప్రారంభం: 1976 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 2. మైక్రోసాఫ్ట్ సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.214 లక్షల కోట్లు. సీఈఓ: సత్యనాదెళ్ల కంపెనీ ప్రారంభం: 1975 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 3. సౌదీ అరమ్‌కో సెక్టార్: ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్ క్యాపిటల్: రూ.177 లక్షల కోట్లు. సీఈఓ: అమిన్ హెచ్.నజెర్ కంపెనీ ప్రారంభం: 1933 ప్రధాన కార్యాలయం: సౌదీ అరేబియా ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా! 4. ఆల్ఫాబెట్(గూగుల్) సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.133 లక్షల కోట్లు. సీఈఓ: సుందర్ పిచాయ్ కంపెనీ ప్రారంభం: 1998 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 5. అమెజాన్ సెక్టార్: ఈ కామర్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.116 లక్షల కోట్లు. సీఈఓ: యాండీ జెస్సీ ఫౌండర్: జెఫ్‌బెజోస్ కంపెనీ ప్రారంభం: 1994 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 6. ఎన్విడియా సెక్టార్: టెక్నాలజీ మార్కెట్ క్యాపిటల్: రూ.83 లక్షల కోట్లు. సీఈఓ: జెన్సన్ హువాంగ్ కంపెనీ ప్రారంభం: 1993 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 7. మెటా ప్లాట్‌ఫామ్స్(పేస్బుక్) సెక్టార్: సోషల్ మీడియా మార్కెట్ క్యాపిటల్: రూ.65 లక్షల కోట్లు. సీఈఓ: మార్క్ జూకర్బర్గ్ కంపెనీ ప్రారంభం: 2004 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ 8. బెర్క్‌షైర్ హాత్వే సెక్టార్: ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ క్యాపిటల్: రూ.63 లక్షల కోట్లు. సీఈఓ: వారెన్‌బఫెట్ కంపెనీ ప్రారంభం: 1839 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 9. టెస్లా సెక్టార్: ఆటోమోటివ్ మార్కెట్ క్యాపిటల్: రూ.57 లక్షల కోట్లు. సీఈఓ: ఎలాన్‌మస్క్ కంపెనీ ప్రారంభం: 2003 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ 10. ఎలి లిల్లి సెక్టార్: ఫార్మాసూటికల్స్ మార్కెట్ క్యాపిటల్: రూ.45 లక్షల కోట్లు. సీఈఓ: డేవిడ్ ఏ.రిక్స్ కంపెనీ ప్రారంభం: 1876 ప్రధాన కార్యాలయం: యూఎస్ఏ -
రికవరీ కనబడుతోంది: నోమురా
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా తన తాజా పరిశోధనా పత్రంలో పేర్కొంది. కొత్త పెట్టుబడుల్లో ఇప్పటివరకూ నెలకొన్న క్షీణత సమస్య సమసిపోతున్నట్లు నోమురా తెలిపింది. అయితే వ్యాపార కార్యకలాపాల్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి ప్రైవేటు రంగంలో పెట్టుబడుల వ్యయం పెరగాల్సిన అవసరం ఉందని విశ్లేషించింది. ఈ సందర్భంగా సీఎంఐఈ (సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ) గణాంకాలను నోమురా ఉటంకించింది. డిసెంబర్ క్వార్టర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కొత్త ప్రాజెక్టుల పెట్టుబడులు 4.9 శాతంగా నమోదుకానున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 3.6 శాతమేనని వివరించింది. స్థిరత్వానికి సూచన : 2007 నుంచీ కొత్త పెట్టుబడులు పడిపోతూ వస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా నోమురా ప్రస్తావిస్తూ, ఈ విషయంలో డిసెంబర్ క్వార్టర్లో అందుతున్న ఫలితం హర్షణీయమని తెలిపింది. స్థిరత్వానికి ఇది తొలి సంకేతమని పేర్కొంది. అయితే ఒక్క ప్రైవేటు రంగం విషయాన్ని చూసుకుంటే మాత్రం గణాంకాలు నిరుత్సాహంగా ఉన్నాయని వివరించింది.