సైబర్‌ నేరాలపై వినూత్నంగా అవగాహన | DoT Ordered Telecom Operators To Play Cybercrime Awareness Caller Tunes 8 To 10 Times Daily For A Period Of Three Months | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై వినూత్నంగా అవగాహన

Published Sun, Dec 22 2024 8:52 AM | Last Updated on Sun, Dec 22 2024 11:54 AM

DoT ordered telecom operators to play cybercrime awareness caller tunes 8 to 10 times daily for a period of three months

దేశంలో సైబర్‌ నేరాలు అంతకంతకూ పెరుగుతుండడంతో టెలికం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలర్‌ ట్యూన్స్‌ ద్వారా సైబర్‌ నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నడుం బిగించింది. ఈ మేరకు టెలికం కంపెనీలకు ఆదేశాలు వెలువరించింది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది.

హోమ్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ ఈ కాలర్‌ ట్యూన్స్‌ను టెలికం కంపెనీలకు అందిస్తుంది. టెలికం కంపెనీలు మొబైల్‌ కస్టమర్లకు ప్రతిరోజు 8–10 కాల్స్‌కు ఈ సందేశాన్ని వినిపిస్తాయి. ప్రతి వారం కాలర్‌ ట్యూన్‌ను మారుస్తారు. ఇలా మూడు నెలలపాటు కాలర్‌ ట్యూన్స్‌ ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని కాల్స్‌ భారత్‌లో నుంచే వచ్చినట్లు కనిపిస్తాయి. వాస్తవానికి అందులో చాలా వరకు అంతర్జాతీయ స్పూఫ్డ్‌ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని వెంటనే గుర్తించి బ్లాక్‌ చేసే వ్యవస్థను కేంద్రం, అలాగే టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు రూపొందించారు.

ఇదీ చదవండి: ‘భారత్‌ మార్కెట్‌కు కట్టుబడి ఉన్నాం’

ఇటీవల నకిలీ డిజిటల్‌ అరెస్టులు, ఫెడెక్స్‌ స్కామ్‌లు, ప్రభుత్వం, పోలీసు అధికారులుగా నటించడం మొదలైన కేసులలో సైబర్‌ నేరస్థులు ఇటువంటి అంతర్జాతీయ స్పూఫ్డ్‌ కాల్స్‌ చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2024 నవంబర్‌ 15 వరకు 6.69 లక్షలకు పైగా సిమ్‌ కార్డ్‌లు, 1,32,000 ఐఎంఈఐలను కేంద్రం బ్లాక్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement