
Ghibli & style (గిబ్లీ–స్టైల్) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. అందరూ తమ ఫొటోలను ఏఐకి ఇచ్చి, దాని ద్వారా గిబ్లీ–స్టైల్ ఫొటోలను పొందుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ అప్‌డేట్ కారణంగా చాలామంది OpenAI దగ్గరయ్యారు. ఈ ట్రెండ్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, చివరకు OpenAI సీఈవో శామ్ ఆల్ట్‌మాన్ వచ్చి ‘మీరు కాస్త నిదానించండి. ఇవతల మా ఉద్యోగులు పనిభారంతో చాలా ఒత్తిడికి గురవుతున్నారు’ అని యూజర్లను అభ్యర్థించేంత. మరి బొమ్మలకు ఇంత ప్రచారం కల్పించిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయనే సీటల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గ్రాంట్ స్లాటన్.
మార్చి 26న స్లాటన్ తన భార్య, కుక్కపిల్లతో కలిసి దిగిన ఫొటోను OpenAI ద్వారా గిబ్లీ–స్టైల్ బొమ్మగా మార్చి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఆ ఫొటో వైరల్‌గా మారింది. అందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమకూ అలాంటి ఫొటోలు తయారు చేసుకోవాలని ఉందన్నారు. 50 మిలియన్ల మందిపైగా ఆ పోస్ట్ చూశారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల్లోనే ఈ విషయం ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారింది. ఇప్పటివరకు 5 కోట్ల 10 లక్షల వ్యూస్ వచ్చాయి.
చదవండి: జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!
కొందరు ఆ ఫొటోను మెచ్చుకోగా, మరికొందరు దాన్ని విమర్శిస్తూ.. ‘అది చిత్రకారుల గౌరవాన్ని దెబ్బతీస్తోందని’ కామెంట్లు చేశారు. మొత్తానికి ఆ ఫొటో ట్రెండ్ సృష్టించడంతో OpenAI ఆ విషయాన్ని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టింది. అందరు యూజర్లు గిబ్లీ–స్టైల్ ఫొటోలు తయారు చేసుకునే అప్‌డేట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అలా మనం తయారుచేస్తున్న ఫొటోల వెనుక గ్రాంట్ స్లాటన్ చేసిన పని ఉందన్నమాట!
tremendous alpha right now in sending your wife photos of yall converted to studio ghibli anime pic.twitter.com/FROszdFSfN
— Grant Slatton (@GrantSlatton) March 25, 2025