trending
-
ప్రియుడితో 'అభినయ' నిశ్చితార్థం.. వివరాలు ఇవే (ఫోటోలు)
-
షాడో మిక్స్డ్ ఫోజులతో శ్రియారెడ్డి.. ఫర్పెక్ట్ ఆవుట్ఫిట్తో (ఫొటోలు)
-
రోజాపూరెక్కల మధ్య సీతాకోక చిలుకలా...ఎవరీ బ్యూటీ (ఫొటోలు)
-
స్వర్గం భూమ్మీదకు వచ్చిందా?.. అందాల లోకం.. వారెవ్వా వనాటు
స్వర్గం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు?. ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి!. ఒకవేళ అది భూమ్మీద గనుక ఉంటే.. అది అచ్చం ‘వనాటు’(Vanuatu)లాగే ఉంటుందని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తుండగా.. దాని గురించి వెతికే వాళ్ల సంఖ్యా ఒక్కసారిగా పెరిగిపోయింది.ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ని వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా.. ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు వనాటు ప్రధాని జోథం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కాసేపటికే.. ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్ట్ చేశారు.‘‘వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే’’ అని సందేశం ఉంచారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్ సెక్షన్లో సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు.వనాటు.. ఎక్కడుంది?ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై(Y) ఆకారంలో ఉంటుందీ దేశం. ఇందులో 65 ద్వీపాల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐల్యాండ్‌లో ఉండే పోర్టువిల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలామాన్ ద్వీపాలు, న్యూ కాలేడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జులై 30న వనాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ వనాటు వాటు. ప్రస్తుత జనాభా దాదాపు మూడున్నర లక్షలు. ‘‘దేవుడితో మేం నిలబడతాం’’ అనేది ఆ దేశపు నినాదం.అగ్నిపర్వతాలు.. భూకంపాల నేలఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్-ఏప్రిల్ మధ్య వర్షాలు, తుపాన్లు సంభవిస్తుంటాయి. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండడం మూలంగా భూ కంపాలు షరామాములుగా మారాయి. అయితే కిందటి ఏడాది డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా.. 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందాల లోకం.. వనాటులో ఉన్న వృక్ష, జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమ్మీద ఎక్కడా కనిపించని జీవ జాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా.. దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం.. నిర్మానుష్యమైన తీరాలు, కొన్ని ద్వీపాల్లో లాగున్లూ.. ఓ ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం.. వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో ‘ప్యారడైజ్ ఆఫ్ ది ఎర్త్’గా నిలబెట్టాయి.టూరిజం కోసమే..టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80 శాతం వ్యవసాయమే చేస్తుంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడీపీలో 65 శాతంగా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో.. పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తారు. అలాగే.. సంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్ద పీట వేస్తుంటారు. పెంటెకాస్ట్ ఐల్యాండ్‌లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వస్తుంటారు. బొంగులలాంటి నిర్మాణలను ఎత్తుగా పేర్చి.. చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్లు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాల్లో.. పాపం ఒక్కోసారి ప్రాణాలు పొగొట్టుకుంటారు కూడా. పన్నులు లేవు, కానీ..వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో.. వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీలాండరింగ్‌కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్.. ఆయుధాల అక్రమ రవాణాలకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్ట్‌లో చేర్చింది. అలాగే.. 2017లో వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్స్ లీక్.. అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక.. 2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్‌కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్ర నాథ్ ఘోష్‌కు వందల కోట్ల విలువ చేసే పైనాన్షియల్ గ్యారెంటీలను అనధికారికంగా కట్టబెట్టారని బరాక్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే.. ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చని.. కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం. -
ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. ఫోటోలు
-
Divi Vadthya: నెలవంక సైతం సిగ్గుపడే అందం దివి సొంతం (ఫోటోలు)
-
రీతూ చౌదరికి ఆల్రెడీ పెళ్లయిందా? అందుకేనా ఆ సలహా! (ఫోటోలు)
-
#HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం
Jagan Birthday Shakes Social Media: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం నేడు. అయితే.. ముందు నుంచే ఈ కోలాహలం నడిచింది. మొన్నా.. నిన్నంతా.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోషల్ మీడియా హోరెత్తగా.. ఇవాళ హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ తో ఊగిపోతోంది. ఇవాళ జననేత పుట్టిన రోజు సందర్భంగా.. వైఎస్సార్సీపీ తరఫున, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. కానీ, ఈలోపే సోషల్ మీడియా దద్దరిల్లడం మొదలైంది. జగన్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ దుమ్మురేపేస్తోంది. ఎక్స్(మాజీ ట్విటర్)లో ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో వైయస్ జగన్ బర్త్‌డే కొనసాగుతోంది.#HBDYSJagan#HBDYSJagananna#HbdysJagansir200K Tweets Done & Dusted✅🔥#HBDYSJagan pic.twitter.com/mrLVHcdqTr— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 21, 2024తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలలా, విదేశాల నుంచి కూడా #HBDYSJagan తో పాటు అనుబంధ హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బకు హేటర్స్ సైతం పోటాపోటీ పోస్టులు వేయలేక చల్లబడ్డారు. ఇంకోపక్క.. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్.. వైఎస్సార్సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబురాలు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో కూకట్పల్లి, పంజాగుట్టలో వేడుకలు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. శివమెత్తి లేచిన అభిమానం 🔥🔥@ysjagan #HBDYSJagan #YSJagan pic.twitter.com/5gl8NZwhUT— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) December 20, 2024ఏ యేడు కాయేడు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ బర్త్‌డే పోస్టుల రూపంలో సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఎక్స్‌లో టాప్ త్రీ పొజిషన్లోనే సుమారు 10 గంటలకు పైగా కొనసాగడం.. మామూలు విషయం కాదు. తెల్లవారుజాము నుంచి పోస్ట్ చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఒక్క ఎక్స్‌లోనే కాదు.. ఇటు వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో, మరోవైపు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్‌బుక్‌లోనూ జగన్ బర్త్ డే సందర్భంగా అభిమానం ఉప్పొంగుతోంది.ఇదీ చదవండి: ఎవరేమన్నా.. జగన్ విషయంలో ఇదే అక్షర సత్యం! -
మెడలో తాళిబొట్టు.. మోడ్రన్ డ్రెస్‌లో కీర్తి సురేష్ ట్రెండింగ్ (ఫోటోలు)
-
ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త పెళ్లి కూతురు.. ఇంకొందరు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్అంబానీ చిన్న కోడలు రాధిక మర్చెంట్ 2024 ఏడాదికిగాను గూగుల్ సెర్చ్‌లో ట్రెండింగ్‌లో నిలిచారు. ముఖేశ్అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులైలో రాధిక మర్చెంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరై సందడి చేశారు. దాంతో అంబానీ కోడలు గురించి చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలిసింది.2024లో రాధిక మర్చెంట్తోపాటు మరికొందరు ట్రెండింగ్‌లో నిలిచారు.1. వినేష్ ఫొగాట్: భారతదేశపు రెజ్లింగ్ స్టార్రెజ్లర్ వినేష్ ఫొగాట్ 2024లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ పోటీలో 100 గ్రాముల అధిక బరువుండి దానికి అర్హత సాధించలేకపోయారు.2. నితీష్ కుమార్: బిహార్ రాజకీయ వ్యూహకర్తబిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు, పొత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.3. చిరాగ్ పాశ్వాన్: రాజకీయ నాయకుడుదివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మోడీ 3.0 కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.4. హార్దిక్ పాండ్యా: క్రికెటర్క్రికెట్లో ఆల్ రౌండర్‌గా పేరున్న హార్దిక్ పాండ్యా మోడల్ నటాసా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.5. పవన్ కళ్యాణ్: రాజకీయ నాయకుడుప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.6. శశాంక్ సింగ్: కొత్త క్రికెట్ స్టార్శశాంక్ సింగ్ ఐపీఎల్ క్రికెట్లో తన అద్భుతమైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు.7. పూనమ్ పాండే: మోడల్, నటిగర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి చెందినట్లు ఆమె అనుచరులు తెలిపారు. తర్వాత అది ఫేక్ అని, తాను బతికే ఉన్నానని చెప్పింది.8. రాధిక మర్చెంట్: అంబానీ కోడలుజులైలో అనంత్ అంబానీతో గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో రాధికా మర్చంట్ పేరు వైరల్‌గా మారింది.9. అభిషేక్ శర్మ: క్రికెటర్క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.10. లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు2024 పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్య సేన్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. -
తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి.. 20 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనలు (ఫొటోలు)
-
బామ్మ ఫ్యాషన్ రేంజ్ మాములుగా లేదుగా.. అదిరిపోయే స్టన్నింగ్ స్టిల్స్..!
-
వైరల్ 'రియా'.. అసలు ఈ అమ్మాయి ఎవరంటే? (ఫొటోలు)
-
సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న జబర్దస్త్ వర్ష (ఫోటోలు)
-
ఫెమినా మిస్ ఇండియా 2024 విజేత నికితా పోర్వాల్ (ఫొటోలు)
-
పచ్చని అందాల నడుమ కేతిక సోయగాలు (ఫొటోలు)
-
బిగ్‌బాస్ ఫేమ్ అశ్విని దుబాయ్ అందాల ట్రీట్ (ఫొటోలు)
-
పులుల కంటే ఎక్కువగా బలిగొన్నాయని తెలుసా?
-
హేట్ టు లవ్.. నాలుక మడతేసిన ట్రంప్
-
బడిలో మంటలు.. చిన్నారుల సజీవదహనం
తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రైమరీ స్కూల్లో మంటలు చెలరేగి చిన్నారులు సజీవ దహనం అయ్యారు. మరణించవాళ్లంతా 5 నుంచి 12 ఏళ్లలోపువాళ్లే కావడం గమనార్హం. ప్రమాద తీవ్రతను మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.కెన్యాలో తూర్పు ఆఫ్రికా వెంట పాఠశాలల్లో గత కొంతకాలంగా అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాజధాని నైరోబీకి 170కిలోమీటర్ల దూరంలో.. మధ్య కెన్యా నైయేరీ కౌంటీలో ఘోరం చోటు చేసుకుంది.హిల్‌సైడ్ ఎండారషా ప్రైమరీ పాఠశాల వసతి గృహంలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు.తీవ్రంగా గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకి రాలేదు. #BREAKINGTragic news from Kenya as at least 17 children have lost their lives in a devastating fire at Hillside Endarasha Academy in Kieni, Nyeri.Bodies were burned beyond recognition.#Kenya #SchoolFire #HillsideEndarasha #Tragedy #BreakingNewspic.twitter.com/sDskxUYBxQ— Mr. Shaz (@Wh_So_Serious) September 6, 2024 మృతదేహాలు గుర్తుపట్టలేనంతంగా కాలిపోయాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఘటనపై అధ్యక్షుడు విలియమ్ రుటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ స్కూల్లో సుమారు 800 చిన్నారులు వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా 17 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల తొలగింపు తర్వాత మరిన్ని మృతుల సంఖ్యపై స్పష్టత రావొచ్చని అధికారులు అంటున్నారు. గతంలో.. 2016లో నైరోబీలోని ఓ బాలికల పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించారు. 1994లో టాంజానియాలోని కిలిమంజారో రీజియన్‌లో ఓ స్కూల్లో మంటలు చెలరేగి 40 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. -
ఈ దేశాల్లో మహిళలకు రక్షణ కరువు.. భారత్ ఎక్కడంటే?
కోల్‌కతా దారుణ హత్యాచార ఘటనో లేదంటే.. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల వల్లనో స్పష్టమైన కారణం తెలీదు.. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఇవిగో అంటూ ఒక జాబితా ట్రెండ్ అవుతోంది. ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంటడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలోని దేశాల్లో ఉన్న పరిస్థితులు తెలుసుకోండి..దక్షిణాఫ్రికాఇప్పటివరకు మహిళలకు రక్షణ లేని దేశాలలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ రోడ్లపై ఒంటరిగా నడిచే మహిళలకు భద్రత చాలా తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ మహిళా ప్రయాణికులు ఒంటరిగా ప్రయాణాలు చేయటం, డ్రైవింగ్ లేదా కాలినడకలో బయటకు వెళ్లటం మంచిది కాదని పలు కథనాలు వెల్లడించాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రపంచంలోనే ఆడవారికి రక్షణ విషయంలో చాలా ప్రమాదకరమైన దేశం దక్షిణాఫ్రికా అని పేర్కొంది. ఇక్కడ కేవలం 25 శాతం మంది మహిళలు మాత్రమే తాము ఒంటరిగా రోడ్లపై నడుస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు భావించటం గమనార్హం.భారతదేశంఆసియాలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ తరచుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇటీవల ఓ స్పానిష్ జంట భారత్‌తో తాము హింస అనుభవించినట్లు నమోదైన కేసు కూడా వైరల్‌గా మారింది. భారత్‌లో మహిళలు లైంగిక వేధింపులు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలకు పరిశీలిస్తే.. బలవంతంగా కార్మికులుగా మార్చటం, లైంగిక వేధింపు ఘటనలు పెరగటం, మానవ అక్రమ రవాణా ఇప్పటికీ దేశ భద్రతను దెబ్బతీస్తోందని తెలుస్తోంది.ఆఫ్ఘనిస్తాన్తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని రాయిటర్స్ నివేదించింది. అయితే ఇక్కడ లైంగిక హింస కంటే.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవటం, బాలికల చదువుపై నిషేధాలు విధించటం వంటి వాటివల్ల మహిళలు ఆఫ్ఘనిస్తాన్ తమకు సురక్షితమైన దేశం కాదని భావిస్తున్నట్లు ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇక్కడ తాలిబన్లు అమలు చేసే నిబంధనలు మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయి.సిరియామహిళలు తీవ్రమైన లైంగిక, గృహ వేధింపులకు గురవుతున్న మరో దేశం సిరియా. ఇక్కడ మహిళలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. మధ్య ప్రాచ్య దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో సిరియా ఒకటి.సోమాలియామహిళల హక్కులు, భద్రతను పట్టించుకోని మరో దేశం సోమాలియా. రాయిటర్స్ నివేదించిన ప్రకారం.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు పెంచుకోవటం పరంగా మహిళలకు ఇక్కడ చాలా సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. హానికరమైన సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను పాటించటం ఇక్కడి మహిళలకు శాపంగా మారుతోంది.సౌదీ అరేబియామహిళల హక్కులలో సౌదీ అరేబియా కొంత పురోగతి సాధించినప్పటికీ త్రీవమైన లింగ వివక్ష కొనసాగుతోంది. పని ప్రదేశాల్లో ఉండే రక్షణ, ఆస్తి హక్కులకు సంబంధించి ఇక్కడి మహిళలకు సౌదీ అరేబియా సురక్షితంకాని దేశంగా మిగిలిపోయింది.పాకిస్తాన్‌ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, మహిళల పట్ల వివక్ష చూపించటంలో మహిళలకు రక్షణలేని దేశాల జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి మహిళలకు హానికరమైన మత, సాంప్రదాయ పద్ధతులు సవాలుగా మారుతున్నాయి. ఇక్కడి మహిళపై దారుణమైన పరువు హత్యలు నమోదు కావటం గమనార్హం.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోఈ దేశంలో చట్టవిరుద్ధం, కక్షపూరిత అల్లర్ల కారణంగా లక్షలాది మంది ప్రజలు దారుణమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మరోవైపు.. ఇక్కడి మహిళలు తీవ్రమైన వేధింపుల బారినపడుతున్నారని పేర్కొంది.యెమెన్తరచూ మానవతా సంక్షోభాలకు గురవుతున్న యెమెన్ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులు మహిళలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే ఈ దేశం మహిళలకు సురక్షితమైన దేశం కాదని పలు వార్తలు వెలువడ్డాయి.నైజీరియా నైజీరియాలో మహిళలకు రక్షణ లేకపోవడాని అక్కడి ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ సంస్థ కారణమని ప్రజలు నమ్ముతారు. తీవ్రవాదులు పౌరులను హింసించటం, మహిళలను అత్యాచారం, హత్యలు చేయటం వంటి చర్యలకు పాల్పడుతుంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. నైజీరియన్ మహిళలు హానికరమైన సాంప్రదాయ పద్ధతులు పాటించటం, మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. దీంతో ఈ దేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా మిగులుతోంది. -
Megha Akash : హీరోయిన్ మేఘా ఆకాశ్ నిశ్చితార్థం (చిత్రాలు)
-
ఘనంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,రహస్యల పెళ్లి (ఫొటోలు)
-
ఈ బ్యూటీ చాలా క్యూటీ..అందంతో పిచ్చెక్కిస్తోంది నయన్ సారిక 'ఆయ్'(ఫొటోలు)
-
హాలీవుడ్ రేంజ్‌కు కాబోయే అక్కినేని కోడలు..! (ఫొటోలు)
-
క్రిటిసిజం పట్టించుకోను.. నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
Inaya Sultana : సొగసులు ఒలకబోస్తున్న ఇనయా సుల్తానా..(ఫొటోలు)
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (ఫొటోలు)
-
Nabha Natesh: ‘డార్లింగ్’ ప్రీ రిలీజ్ వేడుక మెరిసిన నభా నటేష్ (ఫొటోలు)
-
సింపుల్‌గా స్టార్ హీరో శివకార్తికేయన్ కుమారుడి బారసాల ఫంక్షన్ (ఫోటోలు)
-
మగువల మనసు దోచే స్కర్ట్... సూపర్ స్టయిల్! (ఫోటోలు)
-
నటి సోనాక్షి సిన్హా వివాహం.. ఫొటోలు వైరల్
-
ElectionsResults ఫీవర్.. ట్రెండింగ్‌లో AP హవా
ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్ చేస్తే కౌంటింగ్ అప్డేట్, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్ సైతం ఎన్నికల రిజల్ట్స్ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఆయా పార్టీలు, పార్టీల సానుభూతిపరులు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో.. ఆయా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. అయితే 542 లోక్‌సభ స్థానాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కువ హ్యాష్ ట్యాగులు సోషల్ మీడియాలో నడుస్తుండడం గమనార్హం.ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బిగ్ విక్టరీ, వైఎస్ జగన్ అగెయిన్, ఏపీ ఎన్నికల ఫలితాలు, పిఠాపురంలో పవన్ భవితవ్యం ఏంటి?, ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?, కూటమికి వచ్చే సీట్లు ఎన్ని? టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈసారైనా గెలుస్తారా?.. ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.ఎన్డీయే-ఇండియా కూటమి గెలుపోటములు, ఒడిషా ఫలితం, దేశవ్యాప్తంగా పాతిక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. కేవలం ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ ఆ ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది. -
రోజురోజుకి అందం పెంచుతున్న కృతి శెట్టి (ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యాతో విడాకులంటూ వార్తలు.. ట్రెండింగ్‌లో నటాషా (ఫొటోలు)
-
Rajinikanth: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న రజినీకాంత్ (ఫొటోలు)
-
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
-
ఒకే ఒక్కడు.. పుట్‌బాల్ స్టార్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటన (ఫొటోలు)
-
ముంబై అతలాకుతలం..బీభత్సం సృష్టించిన గాలివాన (ఫొటోలు)
-
AP:మండుటెండను లెక్క చేయకుండా.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
-
Met Gala 2024 : అరంగేట్రంలోనే అదుర్స్..ఎవరీ మోనా (ఫొటోలు)
-
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. ఫోటోలు
-
Sai Pallavi Unseen Photos: హైబ్రిడ్ పిల్లా ‘సాయిపల్లవి’ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Hyderabad Rain Photos: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
-
సముద్రం అంచున విమానం ఇల్లు.. అదిరిపోయే ఫొటోలు
-
దుబాయ్‌లో దంచికొట్టిన వాన.. సముద్రాన్ని తలపిస్తున్న ఎడారి దేశాల (ఫొటోలు)
-
మేమంతా సిద్ధం : అడుగడునా సీఎం జగన్‌కు జననీరాజనం (ఫొటోలు)
-
RCB Vs MI Highlights Photos: ఇషాన్, సూర్యకుమార్‌ల విధ్వంసం ముంబై ఘనవిజయం (ఫొటోలు)
-
Allu Arjun HD Images: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)
-
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. జనజీవనం అతలాకుతలం (ఫొటోలు)
-
Proddatur Sabha Photos: జగనన్నా.. మీ వెంటే మేము (ఫొటోలు)
-
Proddatur Meeting Photos: దద్దరిల్లిన ప్రొద్దుటూరు.. విపక్షాలకు వణుకు పుట్టేలా..(ఫొటోలు)
-
తరగని అభిమానం.. చెదరని ప్రేమ.. ఇది కేవలం జగనన్నకు మాత్రమే సాధ్యం (ఫొటోలు)
-
CM Jagan Bus Yatra Photos: బస్సు యాత్రలో జననేత జగనన్నకు సాదర స్వాగతం (ఫొటోలు)
-
బ్యూటిప్స్: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు!
కొంతమంది స్కిన్ చాలా మెరిసిపోతుంది. మరి కొంతమందికి మాత్రం డ్రై స్కిన్, మొటిమలు, టాన్, పిగ్మంటేషన్, మచ్చలు, డల్ స్కిన్ వంటి సమస్యలు ఉంటాయి. వీటి వల్ల చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పతారు. నలుగురిలోకి వెళ్ళలేరు. అయితే, విటమిన్ ఇ చర్మానికి సంబంధించిన అనేక సమస్యల్ని దూరం చేస్తుంది. మరి దీనిని ఎలా అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏయే లాభాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇలా చేయండి.. చర్మ సమస్యలకి విటమిన్ ఇ చక్కటి ఉపశమనం. ఇందుకోసం టీ స్పూన్ బొప్పాయి జ్యూస్, టీ స్పూన్ రోజ్ వాటర్‌ని తీసుకోవాలి. అందులోనే విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్కిన్ టోన్ పెరగడానికి: కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్‌ని అంతే పరిమాణంలో పెరుగు, గుడ్డుతో కలపండి. దీనిని బాగా మిక్స్ చేయండి. దీనిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి. తర్వాత శుభ్రం చేయండి. ముఖం మెరిసిపోతుంది. విటమిన్ ఈ ఆయిల్‌ని కలబందతో కలిపి కూడా వాడొచ్చు. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది. కాంతిమంతంగా మారుతుంది. టీ స్పూన్ పరిమాణంలో గ్రీన్ టీ తీసుకోండి. అందులోనే తేనె కూడా వేయండి. తర్వాత కొద్దిగా విటమిన్ ఇ ఆయిల్ వేయండి. వీటన్నింటిని కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ఇవి చదవండి: చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు -
Vijayawada Riverfront Park Photos: సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించిన రివర్ ఫ్రంట్ పార్కు (ఫొటోలు)
-
Allu Arjun Vizag Airport Photos: వైజాగ్‌లో బన్నీకి అదిరిపోయే రేంజులో వెల్కమ్ (ఫొటోలు)
-
Adult Film Stars Serial Deaths: అదీ ఒక సినీ పరిశ్రమే.. అక్కడా చీకట్లెన్నో! (ఫొటోలు)
-
సోషల్ మీడియాలో ‘సిద్ధం’ సంచలనం
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్‌లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో ఎక్స్,Cలు నిండిపోయాయి. సాధారణంగా ఎక్స్‌లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకించారు. లైవ్ సభల్లో టాప్.. ‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్‌లో ఎన్టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్‌పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు నిదర్శనంగా ఈ సభ నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మనవడి కోసం వచ్చాను మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. – అద్దంకి వేదిక వద్ద ప్రైవేట్ డ్రోన్ ‘సిద్ధం’ సభా వేదిక వద్ద కుడి వైపు ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన మంత్రి అంబటి రాంబాబు దాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేకుండా ఇక్కడ డ్రోన్ ఎలా ఎగరవేస్తున్నారు? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఇలా దొంగచాటుగా డ్రోన్లను పంపడం కాకుండా ధైర్యముంటే నేరుగా రావాలని నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. -
థియేటర్లలో రాని క్రేజ్.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోన్న థ్రిల్లర్ మూవీ!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 16వ థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ.. నెల రోజులు కాకముందే సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ దక్కింతుకుంటోంది. ఓటీటికి వచ్చిన ఒక్క రోజులోనే నంబర్‌వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చినా.. 24 గంటల్లోనే ఇండియా వ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు రూ.27 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మించారు. The magic has now reached every home in the country 💫 Magical Entertainer #OoruPeruBhairavakona is entertaining every household and Trending #1 in India on @PrimeVideoIN ❤️🔥 - https://t.co/sDCJn9vPA7@sundeepkishan’s much-anticipated, A @Dir_Vi_Anand Fantasy@VarshaBollamma… pic.twitter.com/KV2bzeVgxe — AK Entertainments (@AKentsOfficial) March 9, 2024 -
కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగు సఫారీ చేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
దిమ్మతిరిగే ఫొటోస్ వదిలిన హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
మృణాల్ అలాంటి పిలుపు.. ఏం కావాలంటోన్న విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ టీజర్ నంబర్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అంతే కాకుండా మృణాల్ ఠాకూర్ క్యూట్‌గా విజయ్ను పిలుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఏవండీ.. ఏవండీ.. అంటూ మృణాల్ పిలవగా.. ఆ.. ఏం కావాలి? అంటూ మన హీరో రిప్లై ఇచ్చాడు. దీనికి మృణాల్ నవ్వులు చిందిస్తూ చిందులు వేస్తూ కనిపించింది. మృణాల్ అలా ప్రేమగా పిలవడంతో మా సెట్ వెలిగిపోతోందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో మీరు చూసేయండి. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. #FamilyStar trending at No 1 ❤️ And @mrunal0801 is glowing in your love and lighting up our set with “THE PILUPU”https://t.co/gRbhprx4rV pic.twitter.com/D4d8u17jgR — Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2024 -
Sowmya Janu Photos: హోంగార్డ్‌పై దాడి..ట్రెండింగ్ లో నటి సౌమ్య జాను (ఫొటోలు)
-
గూగుల్ నాకందుకే ప్రమోషన్ ఇవ్వలేదు: మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు
Google employee: వివక్షపూరితమైన పని సంస్కృతిపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న టెక్ దిగ్గజం గూగుల్‌పై ఒక మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోణలు చేశారు. తన శరీర రంగు తెలుపు అయినందుకే గూగుల్ తనకు ప్రమోషన్ తిరస్కరించినట్లు ఆరోపించారు. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో మూడు సంవత్సరాలు పనిచేసిన షాన్ మాగైర్.. 2019లో ప్రమోషన్ ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి వైదొలిగారు. "తెల్లవాడిగా ఉన్నందుకు నాకు ప్రమోషన్ రాదన్నారు. ఆ కథేంటో పబ్లిక్‌గా చెప్పమంటారా?" అంటూ మాగైర్ గతేడాది డిసెంబర్లో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు. గూగుల్ తన ఏఐ చాట్‌బాట్ జెమిని పనితీరుతో జాతి వివక్ష విమర్శలకు దారితీసిన తర్వాత గూగుల్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి మాగైర్ తాజాగా వివరించారు. తాను తెల్లగా ఉన్నందుకు ప్రమోషన్ నిరాకరించిన కంపెనీగా గూగుల్‌ని మాగ్యురే పేర్కొన్నాడు. తాను అత్యధిక పనితీరు కనబరుస్తున్న వ్యక్తులలో ఒకడిని అయినప్పటికీ తనను ప్రమోట్ చేయలేనని అతని సూపర్వైజర్ చెప్పినట్లు మాగైర్ పేర్కొన్నాడు. ‘నాకు వేరే కోటా ఉంది.. నేను ఈ విషయం నీకు చెప్పనక్కరలేదు. ఇది తెలిస్తే నన్ను తొలగిస్తారు’ అతని బాస్ స్పష్టంగా చెప్పినట్లు వివరించాడు. అయితే ఈ ఆరోపణలను గూగుల్ ప్రతినిధి ఖండించారు. “వ్యవస్థాపకులు, బోర్డు.. సిబ్బంది విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. షాన్ ప్రతిభావంతుడైన ఇన్వెస్టర్. సెక్వోయాలో అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే గూగుల్ అతని ప్రమోషన్, కెరీర్ పురోగతికి సంబంధించిన జాతి లేదా లింగ బేధాలను పరిగణనలోకి తీసుకోలేదు” అని ఆ ప్రతినిధి చెప్పారు. మాగైర్ 2016 నుంచి 2019 మధ్య గూగుల్‌లో పని చేశారు. ప్రస్తుతం ఆయన సెక్వోయా క్యాపిటల్‌లో భాగస్వామిగా ఉన్నారు. -
రూ.31వేల ఈ లేటెస్ట్ 5జీ ఫోన్ ఇప్పుడు రూ.23వేలే..!
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లలో మంచి ఆదరణ పొందిన శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రముఖ 5జీ మోడల్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో రూ.22,999 లకే అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ రూ.30,999 ప్రారంభ ధరతో గతేడాది లాంచ్ అయింది. రూ. 3,000 తగ్గింపు తాజగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్‌పై రూ. 3,000 తగ్గింపు లభించింది. దీంతో 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. 8GB +128GB వేరియంట్ దాని అసలు ధర రూ. 27,499లకు బదులుగా రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5G ఫీచర్లు FHD+ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 1080 SoC 8GB వరకూ ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 13MP సెల్ఫీ కెమెరా స్టీరియో స్పీకర్లు 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ -
గుడ్‌న్యూస్! కెనడాలో వర్క్ పర్మిట్.. కీలక మార్పులు
Canada work permit : కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త ఇది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP) కి కెనడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రెండేళ్లలోపు వ్యవధి ఉన్న మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఇప్పుడు 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి అర్హత పొందుతారు. 2024 ఫిబ్రవరి 15 నుంచి ఈ మార్పులను ఆ దేశ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అయితే 2024 సెప్టెంబరు 1 నుండి కరికులమ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు ఇకపై పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్‌కి అర్హత పొందలేరు. అలాగే దూరవిద్య, పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు కోసం ప్రత్యేక చర్యలను 2024 ఆగస్టు 31 వరకు పొడిగించింది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది కెనడాలో చదువులు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే ఓపెన్ వర్క్ పర్మిట్. పీజీడబ్ల్యూపీ హోల్డర్లు కెనడాలో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా తమకు నచ్చినన్ని గంటలు పని చేసుకోవచ్చు. పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు ఎంత కాలం ఉంటుందనేది స్టడీ ప్రోగ్రామ్ స్థాయి, వ్యవధితోపాటు పాస్‌పోర్ట్ గడువు తేదీపై ఆధారపడి ఉంటుంది. విదేశీ విద్యార్థులందరూ అర్హులేనా? కెనడాలోని ఆమోదిత విద్యా సంస్థలలో కనీసం రెండు సంవత్సరాల నిడివి ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసి తాత్కాలికంగా కొన్నాళ్లపాటు కెనడాలో ఉండాలనుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ 3 సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP)కి అర్హులు. ఇక మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల విషయానికి వస్తే కనీసం 8 నెలలు (లేదా 900 గంటల క్యూబెక్ క్రెడెన్షియల్స్ ) వ్యవధి ఉండాలి. అన్ని ఇతర అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత వరకు మాస్టర్స్ డిగ్రీ వ్యవధి 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది సర్టిఫికేట్ లేదా డిప్లొమా ప్రోగ్రామ్‌లకు వర్తించదు. -
ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయ్..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులకు జీతం ఆఫర్లు 30 నుంచి 40 శాతం తగ్గాయి. అంతర్జాతీయ స్థూల ఆర్థిక మార్పులు, ఐటీ రంగం మందగమనం నేపథ్యంలో ఈ పతనం ఏడాది క్రితమే మొదలైందని పరిశ్రమలో ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో కొన్ని నెలల క్రితం మార్పు ప్రారంభమైంది. 2021-2022లో కోవిడ్ మహమ్మారితో ఉద్యోగ నియామకాల స్తంభనకు దారితీసిన తర్వాత తక్కువ పే ప్యాకర్లు సాధారణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సిరీస్ A ఫండింగ్‌ని దాటిన ప్రారంభ దశ స్టార్టప్‌ల ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు చెప్పినట్లుగా నివేదక పేర్కొంది. “ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలు ప్రారంభించాయి. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా నియామకాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి" అని ఆ ఎక్స్పర్ట్ తెలిపారు. మంచి టెక్ టాలెంట్ ఉన్న చాలా మంది ప్రస్తుతం మార్కెట్లో వాస్తవిక వేతనాలతో అందుబాటులో ఉన్నారని, అలాంటి కొంతమంది నిపుణులను తాము నియమించుకుంటున్నట్లు ఐవీక్యాప్ వెంచర్స్ వ్యవస్థాపకుడు విక్రమ్ గుప్తా తెలిపారు. పెద్ద సంఖ్యలో సీనియర్ టెక్ టాలెంట్లను స్టార్టప్‌లు ఎంపిక చేసుకుంటున్నాయని కార్న్ ఫెర్రీ ఇండియా ఎండీ నవనిత్ సింగ్ చెబుతున్నారు. ఉద్వాసనకు గురైన, పెద్ద టెక్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన అభ్యర్థులతో తాము మాట్లాడుతున్నామని, వారు 30 శాతం వరకు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మైఖేల్ పేజ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. -
Bank holiday : ఈరోజు బ్యాంకులు పనిచేస్తాయా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి సంవత్సరం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఇందులో గెజిట్ పబ్లిక్ హాలిడేస్తోపాటు ముఖ్యమైన పండుగలు ఉంటాయి. అయితే ఈ జాబితాలో ప్రాంతీయ పండుగలు, సందర్భాలను బట్టి రాష్ట్రాల వారీగా సెలవులు ఉండవు. ఆర్బీఐ జాబితా ప్రకారం.. 2024 ఫిబ్రవరిలో మొత్తం 11 బ్యాంకు సెలవులు ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం బ్యాంకులు పనిచేస్తాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి దృష్ట్యా మహారాష్ట్ర అంతటా బ్యాంకులు పనిచేయవు. మిగతా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు సోమవారం సాధారణ పని దినం ప్రకారం పనిచేస్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని శివ జయంతి అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర అంతటా జరుపుకుంటారు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ సెలవు దినం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న పండుగలా జరుపుకుంటారు. బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్లైన్ మోడ్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించవచ్చు. ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఫిబ్రవరి 4 - ఆదివారం ఫిబ్రవరి 10- రెండవ శనివారం ఫిబ్రవరి 11- ఆదివారం ఫిబ్రవరి 14- బసంత్ పంచమి (త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో సెలవు) ఫిబ్రవరి 15- లూ-నాగి-ని (మణిపూర్‌లో సెలవు) ఫిబ్రవరి 18- ఆదివారం ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ జయంతి (మహారాష్ట్రలో సెలవు) ఫిబ్రవరి 20- రాష్ట్ర దినోత్సవం (మిజోరం, అరుణాచల్ ప్రదేశ్లలో సెలవు) ఫిబ్రవరి 24- రెండవ శనివారం ఫిబ్రవరి 25- ఆదివారం ఫిబ్రవరి 26- న్యోకుమ్ (అరుణాచల్ ప్రదేశ్‌లో సెలవు) -
పుణెలో గూగుల్ కొత్త ఆఫీస్.. ఎలా ఉందో చూడండి..
Google New Office In Pune : భారత్‌లో విస్తరణను కొనసాగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్ ( Google ) ఇటీవల పుణెలోని కోరేగావ్ పార్క్ అనెక్స్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా గ్లోబల్ ఇంజినీరింగ్ బృందాల సహకారంతో అధునాతన ఎంటర్ప్రైజ్ క్లౌడ్ టెక్నాలజీల రూపకల్పన, రియల్ టైమ్‌లో సాంకేతిక సలహాలను అందించడం, ప్రొడక్ట్ ఇంప్లిమెంటేషన్ నైపుణ్యాలను అందిస్తారు. ఇక్కడ 1,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని అంచనా. పుణెలోని గూగుల్ కొత్త ఆఫీస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అర్ష్ గోయల్.. అక్కడ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉన్న పలు సౌకర్యాల గురించి తెలియజేశారు. దీనికి సంబంధించి తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. విశాలమైన ఆఫీస్‌లో అందమైన ఇంటీరియర్స్ తోపాటు నోరూరించే ఆహారంతో కేఫ్, గేమ్ జోన్, రిక్రియేషన్ రూమ్ వంటి ఆకట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. ''పుణెలో కొత్తగా ప్రారంభించిన గూగుల్ ఆఫీస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రోజు ఎలా ఉంటుందో చూడండి'' అంటూ తన ఫోలోవర్లతో వీడియోను పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 4,70,000 కుపైగా వీవ్స్, 18,000 కుపైగా లైక్‌లను పొందింది. చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు గూగుల్ కొత్త ఆఫీస్ ఇష్టపడ్డారు.అక్కడ పని చేయడానికి తాము ఇష్టపడుతున్నట్లు కామెంట్లు పెట్టారు. పుణెలో ఏర్పాటైన ఈ కొత్త ఆఫీస్‌తో గూగుల్‌కి ఇప్పుడు భారత్‌లో హైదరాబాద్‌లోని తన దేశ ప్రధాన కార్యాలయంతో సహా ఐదు కార్యాలయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Arsh Goyal (@arshgoyalyt) -
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!
Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్ దిగ్గజం గూగుల్ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్ పరిశ్రమలో లేఆఫ్‌ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్ సెర్చ్ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్‌ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్‌ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్‌కు చాలా తెలుసు" అని ఓ యూజర్ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్ హైక్ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్ సూచించారు. "The moment he told them he's going to join us, they quadrupled his offer" - Perplexity CEO @AravSrinivas on recruiting from Google (k, here's the video) pic.twitter.com/HRhrLNPrHJ — Alex Kantrowitz (@Kantrowitz) February 16, 2024 -
పెళ్లి సెలవును ఎగతాళి చేసిన బాస్.. ఉద్యోగి షాకింగ్ నిర్ణయం!
ఉద్యోగ జీవితం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. దీనికి విఘాతం కలిగినప్పుడు కొంత మంది ఉద్యోగులు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఓ ఉద్యోగి తన సోదరుడి పెళ్లి కోసం సెలవు అడిగితే ఇవ్వకపోగా ఎగతాళి చేసిన బాస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో నోయెల్ అనే ఉద్యోగి బాలీలో సోదరుడి పెళ్లి కోసం సెలవుకు దరఖాస్తు పెట్టకున్నాడు. అయితే అతని బాస్ సెలవును రద్దు చేయడంతోపాటు ఎగతాళి చేస్తూ పంపిన సందేశం చూసిన తర్వాత నోయెల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి పెళ్లికి వెళ్లకపోవడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలని నిశ్చయానికి వచ్చాడు. ఆ బాస్ అంతలా ఏమి ఎగతాళి చేశాడు.. ఉద్యోగికి బాస్‌కి మధ్య జరిగిన సంభాషణపై మైఖేల్ సాంజ్ బిజినెస్‌మన్, ఔట్సోర్సింగ్ ఎక్స్పర్ట్ టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. "ఈ వ్యక్తి పనిముట్టులా ఉన్నాడు. ఎటువంటి సంభాషణ లేకుండా ఆటోమేటిక్‌గా సెలవును రద్దు చేస్తున్నాడు" అంటూ జోడించారు. నిక్ అనే బాస్, అతని ఉద్యోగి నోయెల్ మధ్య సంభాషణ ఇలా ఉంది.. మరొక ఉద్యోగి రాజీనామా చేస్తున్నందున నోయెల్ సెలవు రద్దు చేస్తున్నట్లు బాస్ తెలియజేశాడు. ఇప్పటికే బాలీకి విమానాలకు టికెట్ల బుకింగ్ అయిపోయిందని, తన పిల్లలు వివాహ పార్టీలో ఉన్నారని తన సెలవులను రద్దు చేయొద్దని నోయెల్ బాస్‌ని వేడుకున్నాడు.ఏడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేశానని కాబట్టి రద్దు చేయడం వీలు కాదని అభ్యర్థించాడు. అయినప్పటికీ, బాలిని గమ్యస్థానంగా ఎగతాళి చేస్తూ సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని నోయెల్‌కు సూచించాడు. దీంతో కలత చెందిన నోయెల్.. ఇతర దేశాలను ఎగతాళి చేసే ఇలాంటి కంపెనీలోనా తాను పనిచేస్తున్నది అంటూ తాను ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటున్నాని అంటే జాబ్ మానేస్తున్నానని బదులిచ్చాడు. బాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. నోయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. -
#HBDYSJagan : ట్రెండింగ్‌లో దుమ్ము రేపిన సీఎం జగన్ బర్త్‌డే విషెస్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ చరిష్మా ఏపాటిదో గురువారం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సీఎం పుట్టినరోజునాడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రపంచ వ్యాప్తంగా అభినందల వెల్లువతో రికార్డులు సృష్టించింది. హెచ్‌బీడీ వైఎస్ జగన్ పేరుతో ఏర్పాటు చేసిన హ్యాష్ ట్యాగ్ ద్వారా ఎక్స్ (ట్విటర్) వేదికగా 3.50 లక్షల మందికి పైగా శుభాకాంక్షలు తెలుపడం ద్వారా ఇండియా ట్రెండింగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు సందేశం 18.1 కోట్ల మందికి చేరినట్లు ఎక్స్ గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డంకీ, సలార్ వంటి సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఒక రాజకీయ పార్టీ అధినేత పుట్టిన రోజు ఇంత ట్రెండింగ్ కావడం విశేషం. 2 గంటల పాటు ఎక్స్ ఇండియా సర్వర్ షట్‌డౌన్ అయినప్పటికీ ఈ స్థాయిలో ట్వీట్లు రావడం గమనార్హం. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి పోస్ట్‌లు వెల్లువెత్తాయి. Twitter Is Back 😎 Lets Fill This TL With @ysjagan Anna Videos 🔥 Mine 👇👇 Qoute Yours 🫡#HBDYSJagan pic.twitter.com/SZjyPSiOmf — Satish Reddy (@ReddySatish4512) December 21, 2023 దీంతో ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానం, ఆసియాలోనూ 5వ స్థానంలో హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ 55 నెలల పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపేలా రూపొందించిన ఫొటోను వైఎస్సార్సీపీ సోషల్ మీడియా గురువారం విడుదల చేసింది. ఓ వైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలతో ఈ ఫొటో ఆకర్షణీయంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం వైరల్ అయ్యింది. Next Level..🙏🏻 #HBDYSJaganpic.twitter.com/9RJbOHNZEU — 𝐴𝑎𝑛𝑎𝑛𝑦𝑎 𝑅𝑒𝑑𝑑𝑦 (@Ananyareddy_law) December 21, 2023 -
వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్!
ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ హడావుడి నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉత్కంఠభరితమైన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ సందడి చేశారు. 1983లో తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కలిశారు. బ్యాట్ పట్టి వారితో సరదాగా క్రికెట్ ఆడారు. నాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 1983 విజయం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు సంకేతంగా తాను సంతకం చేసిన బ్యాట్‌ను లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ, జిమ్మీ అమర్నాథ్, కీర్తి ఆజాద్, రవిశాస్త్రిలకు బహూకరించారు. దీనికి సంబంధిచిన వీడియోను ఎరిక్ గార్సెట్టీ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి బాటలు వేశారంటూ 1983 వరల్డ్ కప్ నెగ్గిన లెజండరీ క్రికెటర్లను అభినందిస్తూ భారత్ మరోసారి ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. భారత్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఆడుతున్న తరుణంలో గార్సెట్టీ షేర్ చేసిన ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. అత్యధికంగా వ్యూవ్స్, లైక్స్ వచ్చాయి. అలాగే పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు. Met the OGs of cricket 🏏 – '83 legends @therealkapildev, Sunil Gavaskar, @iRogerBinny, @JimmyAmarnath, @KirtiAzaad, and @RaviShastriOfc! They bowled me over with their stories from India's first cricket World Cup victory! Rooting for #TeamIndia for the World Cup final on Sunday.… pic.twitter.com/71aTKDIuax — U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) November 17, 2023 -
ఇంతింతై ట్రెండింతై...
అనగనగా ఒక జాస్మిన్ కౌర్. దిల్లీలో వస్త్ర దుకాణం నడుపుతోంది. క్లాత్స్టోర్లోకి కొత్తగా వచ్చిన పీస్‌లను ప్రమోట్ చేయడానికి వాటి ముందు కెమెరా పెట్టి ‘జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అన్నది. ఈ మాట కాస్తా సోషల్ మీడియా ట్రెండై పోయింది. ‘ఇంతింతై ట్రెండింతై’ అన్నట్లు బాలీవుడ్ వరకు వెళ్లింది. బెంగాలీ నటి, పార్లమెంట్ సభ్యురాలు నుస్రత్ జహాన్ ఈ ట్రెండ్‌కు హాయ్ చెప్పింది. ఇంతకుముందు బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోన్, సన్యా మల్హోత్రాలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వీడియోలు చేసి ‘వావ్’ అనిపించారు. ఫేమస్ డైలాగ్ ‘సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ను లిప్–సింకింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది దీపిక. దీపిక భర్త రణ్‌వీర్‌సింగ్, డైరెక్టర్–ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్ పెట్టారు. -
Twitter: ట్రెండింగ్‌లో ‘అవినీతి చక్రవర్తి బాబు’
సాక్షి, అమరావతి: జీ–20 సమావేశాల తర్వాత అత్యధికంగా ట్విట్టర్లో ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ అన్న పదమే ట్రెండింగ్‌లో ఉంది. శనివారం ఉదయం స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు అవినీతిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. కరప్షన్ కింగ్ సీబీఎన్ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ శనివారమంతా ట్విట్టర్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది. నెటిజన్లు ఉదయం నుంచి ఈ హ్యాష్ ట్యాగ్‌తో లక్షలాది పోస్టులను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఏమో, తెలియదు, గుర్తులేదు... మర్చిపోయా -బాబోరు#ScamSterChandrababu#scamstarchandrababu#BanYellowMediaSaveAP#EndOfTDP pic.twitter.com/fl7hzLSWua — 🇮🇳 కాటేపల్లి శేషుయాదవ్ 🇸🇱 (@sesuyadav) September 9, 2023 దీంతోపాటు స్కామ్ స్టార్ చంద్రబాబు, స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్లు కూడా ట్రెండింగ్‌లో నిలిచాయి. జీ–20 సమావేశాల సందర్భంగా జాతీయ మీడియా చంద్రబాబు అంశాన్ని ఈ వార్తలకు ఎక్కువ సమయం కేటాయించకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగి రూ.30 కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసిన విషయాన్ని జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. స్కాం స్టార్....#SkillDevelopmentScam#Rcpm#ScamsterChandrababuలా pic.twitter.com/Vb5fPfAip1 — Surya naga prasad Kudupudi (@Suryanagaprasa1) September 10, 2023 చదవండి: స్కిల్ స్కామ్: సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు -
''ఐఏఎస్ కొడుకు టైలర్ అవుతాడా? కనీసం ఇంజనీర్ అవ్వాల్సిందే''
యువతలోని ఒక వర్గం నుంచి బలంగా వినిపిస్తున్న నినాదం... జాయిన్ ది జోమో క్లబ్! ఒకప్పుడు ఫోమో(ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) క్లబ్లో ఉన్నవారు కూడా జోమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) లోకి వచ్చేస్తున్నారు. మెయిన్‌స్ట్రీమ్ ధోరణికి భిన్నంగా కలలు కనే ‘జోమో’ ట్రెండ్ యువతరం ‘సక్సెస్‌తో సంతోషం వస్తుందో లేదో గాని సంతోషంతో మాత్రం తప్పనిసరిగా సక్సెస్ వస్తుంది’ అంటోంది... రాజస్థాన్‌లోని కోట నగరం ‘కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచింది. తియ్యటి భవిష్యత్ కలలతో పాటు పీడకలలలాంటి ఒత్తిడి, భయం, ఆందోళన ఆ గాలిలోనే తేలియాడుతుంటాయి.ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అజిత్ కిశోర్ ఐఐటీ కోంగ్ కోసం ఇక్కడికి వచ్చాడు. తండ్రికి చెరుకుకు సంబంధింన ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉంది. ఐఐటీ–కాన్పూర్‌లో చదివిన అజిత్ సోదరుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తనకు మరో ‘ఐఐటీ పుత్రుడు’ కావాలనుకున్నాడు తండ్రి. ఫలితంగా అజిత్ కిశోర్ కోట నగరానికి అనివార్యంగా రావాల్సి వచ్చింది.అజిత్ కిశోర్‌కు ఐఐటీ అంటే బొత్తిగా ఇష్టం లేదు.‘ఆసక్తి లేకపోవడం కాదు, అందుకు తగిన ప్రతిభాసామర్థ్యాలు నాలో లేవు. నాకు సంబంధం లేని విషయానికి నేనేందుకు బాధ పడాలి?’ అంటాడు అజిత్. తరచు కోచింగ్ క్లాసులు ఎగ్గొట్టే బిహార్‌లోని పట్నాకు చెందిన రక్షిత్ కుమార్ ‘నాకు ఐఐటీ సీటు కచ్చితంగా రాదు. అయినా సరే, నటించక తప్పదు’ అని నవ్వుతూ అంటాడు. ‘దీనివల్ల టైమ్, డబ్బు వృథా కదా?’ అని అడిగితే రక్షిత్ ఇలా జవాబు ఇస్తాడు...‘నేను చదువులో యావరేజ్ స్టూడెంట్‌ని. మా నాన్నకేమో నేను ఇంజినీర్ కావాలని పట్టుదల. ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది నా కల. ఈ విషయాన్ని నాన్నకు చెబితే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు టైలర్ కావాలనుకుంటాడా? అని వెటకారంగా మాట్లాడారు. నిన్ను ఇంజినీర్‌గా చూడాలనేది నా కల. ఏం చేస్తావో, ఎలా చేస్తావో తెలియదు అని ఆర్టర్ జారీ చేశారు. కాబట్టి ఆయన మనసు నొప్పించకుండా ఇక్కడకు రావాల్సి వచ్చింది’ మధ్యప్రదేశ్ నుంచి కోట నగరానికి వచ్చిన అదితిశర్మ తండ్రి డెంటిస్ట్. తల్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్. ‘నా తల్లిదండ్రుల కలల బాధితురాలిని’ నవ్వుతూ అంటుంది అదితి. ‘ఎందుకలా?’ అని అడిగితే... ‘నా తల్లిదండ్రులు చదువులో బ్రైట్. నేను మాత్రం బ్రైట్ స్టూడెంట్ కాలేకపోయాను. అందుకు నేనేమీ బాధ పడడం లేదు. చెఫ్ కావాలనేది నా కల’ అంటుంది అదితి.అదితి శర్మలాగే ‘కోట మాత్రమే ప్రపంచం కాదు. దీనికి అవతల పెద్ద ప్రపంచం ఉంది. అక్కడ మనకు తగిన అద్భుత అవకాశాలు ఉంటాయి’ అనుకునే విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కోట లాంటి కోంగ్ సెంటర్లకు ప్రసిద్ధిగాంచిన నగరాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అదితిశర్మలాంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అదితి శర్మలాంటి వాళ్లను ఆకట్టుకుంటున్న ట్రెండ్... జోమో. ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–తప్పిపోతుందేమో అనే భయం) పాత విషయం అయిపోయింది. జోమో (జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–తప్పిపోయినందుకు ఆనందం) అనేది కొత్త ట్రెండ్‌గా మారింది. యూత్‌లో కొంతమంది నుంచి వినిపిస్తున్న ‘జాయిన్ ది జోమో క్లబ్’ నినాదాన్ని ఎలా చూడాలి?పలాయనవాదమా? కాలహరణమా? ‘చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఆదేశించగానే ఓకే చెబుతారు. తాము సాధించగలం అనుకుంటారు. ఒకసారి వృత్తంలోకి వచ్చిన తరువాత పేరెంట్స్, ఉపాధ్యాయులు, ఇతరుల నుండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వచ్చే ఒత్తిడితో సతమతమవుతారు. ఆ తరువాత పరిణామాలు ఎటో వెళతాయి. మొదటికే మోసం వస్తుంది. తల్లిదండ్రుల కలను నెరవేర్చలేకపోతున్నాను అనే బాధతో ఆత్మహత్యకు పాల్పడే వాళ్లు కూడా ఉన్నారు. దీని కంటే జోమో నయం కదా! జోమో బాయ్స్ అండ్ గర్ల్స్ తమ బలాలు, బలహీనతల విషయంలో చాలా స్పష్టంగా ఉంటున్నారు. ఇఫ్ ఐయామ్ హ్యాపీ ఐయామ్ సక్సెస్ఫుల్. సక్సెస్ అంటే అకాడమిక్, ప్రొఫెషన్ సక్సెస్ మాత్రమే కాదు’ అంటూ జోమోవాదులను సమర్థించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.‘జోమో’ కెరీర్‌కే పరిమితమైన ట్రెండ్ కాదు. సోషల్‌మీడియాలోని అనేక అంశాలు ఈ ట్రెండ్ బలపడడానికి కారణం.‘సోషల్ మీడియాలో భాగం కాకపోతే, చురుగ్గా ఉండకపోతే అందరిలా ఎగై్జట్‌మెంట్‌ను మిస్ అవుతాను, ఒంటరిని అవుతానేవె అనే భయం... ఫోమో. మరోవైపు జోమో మాత్రం అలాంటి భయాలను పక్కనపెడుతుంది. టెక్–ఫ్రీ బ్రేక్స్‌ను ఇష్టపడుతుంది’ అంటుంది దిల్లీకి చెందిన సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ భావనా బర్మీ. రెండు సంవత్సరాల క్రితం ట్రావెల్ ఇండస్ట్రీలో ‘జోమో’ ట్రెండ్ గట్టిగా వినిపించింది, ఈ ట్రెండ్‌లో భాగంగా ఆఫ్ సీజన్, జనసమూహాలు ఎక్కువగా కనిపించని, పెద్దగా జనాదరణ లేని ప్రదేశాలను ఎంచుకునేవారు. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒకే రంగానికి, ఒకే అంశానికి పరిమితమైన ట్రెండ్ కాదు. సోషల్ మీడియాలో భాగం కాకపోతే, చురుగ్గా ఉండకపోతే అందరిలా ఎగై్జట్‌మెంట్‌ను మిస్ అవుతాను, ఒంటరిని అవుతానేమో అనే భయం... ఫోమో. మరోవైపు జోమో మాత్రం అలాంటి భయాలను పక్కనపెడుతుంది. టెక్–ఫ్రీ బ్రేక్స్‌ను ఇష్టపడుతుంది. – భావనా బర్మీ, క్లినికల్ సైకాలజిస్ట్ -
Colors Swathi On Divorce Rumours: కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
ట్రెండింగ్‌లో అషూరెడ్డి (ఫొటోలు)
-
టాలీవుడ్లో పెళ్లి కాని ప్రసాద్‌లు ఇంతమంది ఉన్నారా?
టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లి టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ఇంకా 30 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లి ఊసెత్తని హీరోలు ఎవరెవరు ఉన్నారో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మధ్యే ఈ జాబితా నుంచి వైదొలిగాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ శర్వానంద్. జూన్ 3న శర్వానంద్ రక్షితారెడ్డిని వివాహమాడారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇంతలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరి నిశ్చితార్థం నేడు(జూన్ 9న) జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!) అయితే పెళ్లి ఆలోచన లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న బడా హీరోలు మాత్రం చాలా మందే ఉన్నారు. టాలీవుడ్లో బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్.. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ వయస్సు అందరికంటే ఎక్కువగానే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి మీద రోజుకో వార్త పుట్టుకొచ్చినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా మిగిలిపోయాడు. చివరకు ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పిన శర్వానంద్ కూడా ఓ ఇంటివాడు అయిపోయాడు. దీంతో ‘ఆదిపురుష్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో పెళ్లి గురించి అభిమానుల అరుపులకు సమాధానమిస్తూ.. ఎప్పుడైనా ఇక్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ హామీ ఇచ్చాడు. కానీ ఆ శుభాకార్యం ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇక ఇదే వరుసలో మరో హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు. తన చిన్న వయసు వారంతా పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో తేజ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. టాలీవుడ్లో మరో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరో రామ్ పోతినేని.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటుతున్న పెళ్లికి మాత్రం సై అనడం లేదు. ఇదే లిస్ట్‌లో విజయ్ దేవరకొండ, అడవి శేష్, బెల్లం కొండ శ్రీనివాస్, సిద్ధార్థ్, అల్లు శిరిష్, తరుణ్ ఇలా బ్యాచ్లర్ల లిస్ట్ పెద్దదిగానే ఉంది. ఎంతోమంది హీరోలు.. పెళ్లయ్యాక కూడా సక్సెస్ అయ్యారు. మరి ఈ హీరోలు మాత్రం పెళ్లి విషయాన్నే మర్చిపోయి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది.. ఈ హీరోలంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయితే చూద్దామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న కమెడియన్ కెవ్వు కార్తీక్) ---- పోడూరి నాగ ఆంజనేయులు -
పార్టీ లేదా పుష్ప? నెట్టింట వైరల్‌గా మారిన బన్నీ-తారక్‌ల చాటింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య జరిగిన సరదా చిట్‌చాట్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పుష్ప టీజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. తాజాగా నిన్న(ఏప్రిల్8)న ఆయన పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే బన్నీ అనే హాష్ టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక అల్లు అర్జున్ 41వ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ను అందించగా, ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం వైరల్‌గా మారింది. 'హ్యాపీ బర్త్‌డే బావా.ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా'.. అంటూ తారక్ అల్లు అర్జున్‌కు విషెస్ చెప్పగా.. ఆయన కూడా 'థాంక్యూ వెరీ మచ్ బావ.. హగ్స్' అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. దీనికి మళ్లీ తారక్ స్పందిస్తూ.. 'ఓన్లీ హగ్స్ ఏనా? పార్టీ లేదా పుష్ప?'(పుష్పలోని డైలాగ్)అంటూ తనదైన స్టైల్లో అడగ్గా.. దీనికి బన్నీ వస్తున్నా(NTR 30లోని డైలాగ్)అంటూ సరదాగా రిప్లై ఇచ్చారు. మొత్తంగా వీరిద్దరి మధ్య కొనసాగిన ట్విటర్ చాట్ నెట్టింట వైరల్ అవుతుంది. స్టార్ హీరోలు అయ్యిండి కూడా బావా అంటూ సరదాగా పిలచుకోవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ట్విటర్లో బావ అనే పదం ట్రెండింగ్‌లోకి వచ్చింది. తారక్-బన్నీల ట్వీట్స్‌ను రీట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. Wishing you a Very Happy Birthday Bava @alluarjun. Have a great one !! — Jr NTR (@tarak9999) April 8, 2023 Only hugs? Party Leda Pushpa? 🤣 — Jr NTR (@tarak9999) April 8, 2023 Vasthunna !! 😉 — Allu Arjun (@alluarjun) April 8, 2023 -
మెట్రోలో లవర్స్ పాడుపని.. ట్రెండింగ్‌లో వీడియోలు
సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న సోయి లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. బస్సు, మెట్రో, విమానం, రైల్లో ఆకతాయిల ఆగడాలు ఈమధ్య ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో అసాంఘిక కార్యక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పాపులర్ కావాలని చేస్తున్నారా? లేక పొరపాటుగా అలా జరిగిపోతోందా? తెలియదుగానీ మెట్రో పరువైతే బజారున పడే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో ట్విటర్లో #DelhiMetro హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో కొందరు ప్రేమికులు మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులు పెట్టుకుంటూ ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవల్‌తో దర్శనమిచ్చాడు. ఇది మరవకముందే మరో జంట సిగ్గు విడిచి లిప్ కిస్ ఇచ్చుకున్నారు. నిన్న కాక మొన్న ఓ యువతి బికినీ ధరించి మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియోలన్నీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వరుస సంఘటనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ట్విటర్లో షేర్ చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తూ.. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. #DelhiMetro హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు. कल से सिर्फ Delhi Metro में ही travel करूंगा !!!!!! pic.twitter.com/l228ZEao1q — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) April 3, 2023 View this post on Instagram A post shared by 🇮🇳मोहित गौहर 🇮🇳 (@mohitgauhar) Another video of Delhi Metro. If this is an example of WOMEN EMPOWERMENT, then alas our young generation GIRLS can be victim of such EMPOWERMENT 🤦♂️ And this is exactly what SHAMELESS FEMINISTS want. I would call it CULTURAL GEN*CIDE.#delhimetro @OfficialDMRC pic.twitter.com/BrmjBQ3u32 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) March 31, 2023 -
రూపాయిలో ట్రేడింగ్.. భారత్ ‘జీ 20’ అజెండా
ముంబై: భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ–20 సమావేశాల్లో ‘రూపాయిలో ట్రేడింగ్’ అజెండాను ముందుకు తీసుకువెళ్లాలని కేంద్రం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా కరెన్సీ ఒత్తిడిలో ఉన్న దేశాలకు రూపాయి వాణిజ్యం ఉపయోగపడుతుందని వాణిజ్య కార్యదర్శి ఇక్కడ విలేకరులతో అన్నారు. అయితే జీ–20 ఫోరమ్‌తో రూపాయి వాణిజ్యానికి నేరుగా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కీలక సమావేశం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీ–20 దేశాలు, ప్రత్యేక ఆహ్వానితులుసహా దాదాపు 100 మంది ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ సమావేశం చర్చించే అంశాల్లో వాణిజ్యం– వృద్ది మధ్య మరింత సమతౌల్యత సాధించడం, ప్రపంచ సరఫరాల చైన్‌ను ఆటుపోట్లను తట్టుకునేలా చర్యలు తీసుకోవడం, వాణిజ్యంలో చిన్న వ్యాపారాలను ఏకీకృతం చేయడం, నిబంధనలలో ఏకరూపత సాధించడం, తద్వారా లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడానికి మార్గాలు వంటి అంశాలు ఉన్నాయని బరŠాత్వల్ చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు సంబంధించి భారత్ కొన్ని సంస్కరణలను ప్రతిపాదిస్తున్నదని పేర్కొన్న వాణిజ్య కార్యదర్శి, గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే వాణిజ్య, పెట్టుబడి వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశ ఎజెండాలో ఇదే ప్రధాన అంశమని తెలిపారు. రూపాయి మారకంలో అంతర్జాతీయంగా ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించడంపై ఇతర దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు సంబంధించి 18 దేశాలకు చెందిన బ్యాంకులు.. భారతీయ బ్యాంకుల్లో 30 పైచిలుకు ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. లావాదేవీలూ స్వల్ప స్థాయిలో ప్రారంభమైనట్లు వివరించారు. రూపాయి మారకంలో చెల్లింపుల సెటిల్మెంట్కు వోస్ట్రో ఖాతాలు దోహదపడతాయి. రూపాయల్లో వాణిజ్యానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్బీఐ గతేడాది జూలైలో ప్రకటించిన తర్వాత తొలుత రష్యాకు చెందిన సిబెర్ బ్యాంక్, వీటీబీ బ్యాంక్ ఈ ఖాతాలు తెరిచాయి. -
FIFA: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. ట్రెండింగ్‌లో ఎస్బీఐ పాస్‌బుక్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరగనున్నఫైనల్తో మెగా టోర్నీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ అభిమానుల కళ్లన్నీ అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీపైనే నెలకొన్నాయి. తన కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ తన దేశం తరపున చివరి మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు ఈసారి వరల్డ్‌కప్‌లో ఐదు గోల్స్ కొట్టడమే గాక సూపర్ అసిస్ట్స్తోనూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మారడోనా తర్వాత ఆ లిగసీని కంటిన్యూ చేస్తున్న మెస్సీ ఎలాగైన ఫిఫా వరల్డకప్ కొట్టాలని కోరుకుందాం. అయితే అర్జెంటీనా ఫైనల్ చేరిన క్రమంలో భారత్‌కు చెందిన ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు చెందిన పాస్‌బుక్ ట్విట్టర్ ట్రెండింగ్ లిస్టులో నిలిచింది. అదేంటి అర్జెంటీనాతో ఎస్బీఐ పాక్బుక్కు సంబంధం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. ట్రెండింగ్‌లో నిలవడానికి కారణం ఏంటంటే అర్జెంటీనా, ఎస్బీఐ పాస్ బుక్ రంగు ఒకటి కావడమే. అర్జెంటీనా జెర్సీ లైట్ బ్లూ, వైట్ కలర్స్‌తో నిలువు చెక్స్‌తో ఉంటుంది. ఇక ఎస్బీఐ పాస్‌బుక్ అవే కలర్స్‌తో అడ్డంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎస్బీఐ పాస్‌బుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి #Win Argentina హ్యాష్‌టాగ్‌ను జత చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్బీఐ పాస్‌బుక్ ఫొటోలు ట్విటర్లో వైరల్‌గా మారింది. SBI's lunch time = Argentina's Whole Match https://t.co/u2kt12FyRX — Harshad (@_anxious_one) December 15, 2022 Reason why Indians support Argentina Indians feel if Argentina loose they will loose all their money 😉#India #FIFAWorldCup #GOAT𓃵 #FIFAWorldCupQatar2022 #Argentina #WorldCup2022 #WorldCup #finale #mumbai #Delhi #Kerala #TamilNadu #Karnataka #Bengaluru #SBI #Bank pic.twitter.com/CTi7TW5X3Y — We want United India 🇮🇳 (@_IndiaIndia) December 15, 2022 State Bank of India (SBI) is also supporting Argentina 😆#FIFA #FIFAWorldCupQatar2022 #FIFAWorldCup2022 #ArgentinaVsFrance #Argentina @TheOfficialSBI pic.twitter.com/4gRYXItziq — Maghfoor Ahmad (@maghfoormalkana) December 15, 2022 చదవండి: Lionel Messi: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు -
హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌కు పట్టంకట్టారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. అయితే, అధికారంలో ఉండి కూడా బీజేపీ ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ దళం పరాజయం చెందడానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో అనురాగ్ ఠాకూర్‌పై ట్రోల్స్‌తో ఆయన ట్రెండింగ్‌లోకి వచ్చారు. రాష్ట్ర బీజేపీలో ఠాకూర్ అంతర్యుద్ధానికి తెరలేపారంటూ కొందరు కాషాయ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. I am presuming C. R. PATIL new BJP president on card. Great leader with thumping majority in Gujarat. Anurag Thakur should be sacked from BJP for family politics over and above party lines. — 🇮🇳🌞 GIREESH JUYAL 🇮🇳🌞जय श्री राम, (@juyal3405) December 8, 2022 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రెబల్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 68 స్థానాల్లో 21 ప్రాంతాల్లో బీజేపీ రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు. రెండు చోట్ల మాత్రమే విజయం సాధించినప్పటికీ.. బీజేపీ అనుకూల ఓట్లు చీలిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అదే కాంగ్రెస్ విజయానికి సాయపడింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో బీజేపీలో మూడు వర్గాలు ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డా, సీఎం జైరాం ఠాకూర్ వర్గం. దీంతో అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగారు. ఎవరి వర్గం వారిని వారు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేయటం పార్టీ ఓటమికి కారణమైంది. మరోవైపు.. బీజేపీలో కీలక నేత, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ థుమాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వలేదు అధిష్ఠానం. దీంతో ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ సొంత జిల్లాలోనే ఐదు సీట్లలో బీజేపీ ఓడిపోవడం విమర్శలకు తావిచ్చింది. బీజేపీలో కీలక నేతలు ఉన్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఒక్కరే ప్రచారం చేసి హస్తం పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారని ఓ నెజిటన్ కామెంట్ చేశారు. In a head to head contest, in Nadda's state, in Anurag Thakur's state, against the might of the BJP's money, media and institutions, Priyanka Gandhi has defeated Modi. — Dushyant A (@atti_cus) December 8, 2022 Choice of candidates by JP Nadia & Anurag Thakur is questionable If a rebel is winning means the rebel was right candidate Also the home state of BJP Chief Nadda? Any effects of that? Look at the effect of Narendra Modi on his Home State Gujarat If BJP means business then act — Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) December 8, 2022 ఇదీ చదవండి: ఛండీగఢ్ కాదు.. షిమ్లాలోనే! కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?.. ఉత్కంఠ -
రిస్కెందుకు! గెలిచిన తర్వాత కొనేస్తే పోలా..!
రిస్కెందుకు! గెలిచిన తర్వాత కొనేస్తే పోలా..! -
.. విద్యార్థులకు కూడా అంటే బావుండదేమోసార్!
.. విద్యార్థులకు కూడా అంటే బావుండదేమోసార్! -
అమ్మ చేతి ఆఖరి వంట.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్
అమ్మ ప్రేమకు కొలమానం ఉంటుందా?.. అంతులేని మమకారాన్ని ప్రదర్శించిన ఓ అమ్మ వీడియో కోట్ల మందితో కంటతడి పెట్టిస్తోంది. ఎందుకంటే ఆమె ఆఖరి గడియలు ఉంది కాబట్టి. అయినా ఆ ఇబ్బందికర క్షణాల్లోనూ ఆమె కొడుకు కోసమే ఆలోచించింది. ప్రేమగా అతనికి వండిపెట్టింది. చైనాలో ఓ వీడియో.. సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇప్పటిదాకా కోట్ల మంది ఆ వీడియోను తిలకించడంతో రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఈ వారం మోస్ట్ సెర్చ్డ్ న్యూస్‌గా అక్కడి నిలిచింది ఆ వీడియో. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ మహిళ.. ఆఖరి క్షణాల్లో తన కొడుకు కోసం ప్రేమగా వండిపెడితే.. వ్లోగర్ అయిన ఆ కుర్రాడు కన్నీళ్లతో తీసిన వీడియో అది. దలైయాన్కు చెందిన ఓ 20 ఏళ్ల టీనేజర్.. డెంగ్ అనే మారుపేరుతో గత వారం చైనా షార్ట్‌వీడియో యాప్ డౌయిన్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. చైనా జానపద సంగీతం ఫేర్వెల్ సంగీతాన్ని ఆ వీడియోకు జత చేశాడు. ‘‘అమ్మా.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. ఇకపై ఏదీ నన్ను ఓడించదు’’ కన్నీళ్లతో ఆమెకు నివాళి ఇస్తూ క్యాప్షన్ ఉంచాడు. ‘‘మా అమ్మకి మనోధైర్యం ఎక్కువ. స్వతంత్రంగా బతకాలనుకునే మనిషి. ఈ ఫిబ్రవరిలో ఆమె(49) క్యాన్సర్ బారిన పడింది. కానీ, ఇంట్లోవాళ్లకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే.. ఆ విషయం తెలిస్తే మేం ఏమైపోతామో అని ఆమె భయం. ఆమెకి ఉన్న జబ్బు మాకు తెలిసేసరికి.. పరిస్థితి చేజారిపోయింది. అయినా అమ్మను బతికించుకునేందుకు ప్రయత్నించాం. మూడో సెషన్ కీమోథెరపీ పూర్తైన కొన్నాళ్లకు.. ఆమె ఒకరోజు హఠాత్తుగా ‘ఏం తినాలని ఉంది’ అని నన్ను అడిగింది. మార్కెట్‌కు తాను కూడా వచ్చింది. కావాల్సిన సరుకులన్నీ ఆమె ఎంచుకుంది. స్వయంగా వంట గదిలో దగ్గరుండి వండింది. మా అమ్మను అలా చూసేసరికి నా కన్నీళ్లు ఆగలేదు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతూనే ఆమె వంట చేసింది. కనీసం నన్ను దగ్గరికి కూడా రావొద్దని వారించింది. దగ్గరుండి ఆమె వడ్డించింది. ఆమె వండిన వంట.. ఎప్పటిలాగే రుచికరంగా ఉంది. దురదృష్టవశాత్తూ అదే మా అమ్మ చేతి ఆఖరి వంట అయ్యింది. ఆ మరుసటిరోజే ఆమె నిద్రలో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకాలను, చివరి క్షణాలను ఇక నేను జీవితాంతం మోయక తప్పదు అంటూ భావోద్వేగంగా ఆ వీడియోను ఉంచాడు. కేవలం ఆ షార్ట్ వీడియో డౌయిన్‌లో రెండు లక్షల దాకా లైకులు తెచ్చుకుంది. చావు.. ఎల్లప్పుడూ బతికి ఉండే ప్రేమకు ముగింపు కాదు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. తన అమ్మ చనిపోయిన తర్వాత ఆమె వండిన వంటకాలు ఫ్రిజ్‌లో ఉండిపోయాయని, వాటిని చాలాకాలం ఆమెను తల్చుకుంటూ తిన్నానని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక ఏ లోకంలో ఉన్నా ఆ అమ్మ నిన్ను చూస్తూనే ఉంటుందని ఓ మహిళ కామెంట్ చేసింది. -
Verbal Fast: ఈ ఉపవాసం ఎందుకంటే..
వెర్బల్ ఫాస్ట్.. #VerbalFast ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్. అసలు ఇదేం ఉపవాసం? అని.. దాని ఉద్దేశం ఏంటో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి.. ఇలాంటి ఉపవాసం గురించి గూగుల్‌లో కూడా ఎలాంటి హిస్టరీ లేదు. 45 ఏళ్ల అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్.. సంచలన నిర్ణయం ద్వారానే ఇది తెర మీదకు వచ్చింది. సోషల్ మీడియా వేదిక వర్బల్ ఫాస్ట్‌ను పాటించబోతున్నట్లు ప్రకటించాడు వెస్ట్. ఈ మేరకు ‘యే ’గా తన పేరును మార్చుకున్న ఆయన.. నెలరోజులపాటు ఈ ఉపవాసం ఆచరిస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. Verbal Fast అంటే.. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం. మౌన వ్రతం లాంటిదే!. అదీ నిర్దేశించుకున్న టైం వరకు!. నిమిషాల నుంచి రోజుల తరబడి ఈ ఉపవాసం కొనసాగించవచ్చు. అయితే.. కాన్యే వెస్ట్ మరో అడుగు ముందుకు వేసి ఈ నెల రోజులపాటు ఆల్కాహాల్‌కు దూరంగా ఉంటానని ప్రకటించాడు. అంతేకాదు.. అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండడంతో పాటు శృంగారంలోనూ పాల్గొనబోనని ప్రకటించాడు. దీంతో వెస్ట్ ఫ్యాన్స్.. ఈ ఫాస్ట్ ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నారు. అయితే.. ఎవరితో మాట్లాడకపోయినప్పటికీ.. సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండడని స్పష్టం చేశాడు. ప్రముఖ ఈ-సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్ మాజీ భర్త అయిన కాన్యే వెస్ట్ అలియాస్ యే.. ఈ ఉపవాసం ఎందుకు చేపడతున్నాడన్న దానిపై స్పష్టత లేదు. కాకపోతే ఈ మధ్య విద్వేషపూరిత వ్యాఖ్యలతో ఆయన సోషల్ మీడియా అకౌంట్లు.. ఆంక్షలను ఎదుర్కొన్నాయి. యూదులకు వ్యతిరేకంగా కాన్యే వెస్ట్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆ దెబ్బకు.. కాన్యే వెస్ట్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. అయితే.. ఎలన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టాక తిరిగి.. వెస్ట్ అకౌంట్లు యాక్టివ్ అయ్యాయి. తిరిగి వచ్చిన వెస్ట్.. ఇలా వెర్బల్ ఫాస్ట్‌తో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక యూదులపై చేసిన వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పీచెప్పనట్లు చెప్పాడు వెస్ట్. మరోవైపు ఈ అమెరికన్ ర్యాపర్ వ్యాఖ్యలు ఆయన బ్రాండింగ్‌పై కూడా పెను ప్రభావం చూపెట్టింది. అక్టోబర్‌లో జర్మనీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ అడిడాస్.. ఆయనతో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. గ్యాప్, బాలెన్సియాగా సైతం ఆయనతో బ్రాండింగ్ ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. ఇదీ చదవండి: విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర: మంత్రి అంబటి అమరావతి రైతులది ఫేక్ పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారని, మధ్యలోనే ఆగిపోతుందన్నారు. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర కాదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల పవన్ కల్యాణ్.. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మోదీ ఇలాకాలో ఆ సీట్లు బీజేపీకి అందని ద్రాక్షే.. 75 ఏళ్లలో ఒక్కసారీ గెలవలే..! గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు చూసుకుంటే గడిచిన 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వీడియో: కాచుకో జెలెన్ స్కీ.. ఉక్రెయిన్‌లో స్నైపర్ రైఫిల్ పేల్చిన పుతిన్ ఉక్రెయిన్‌లో కొద్దిరోజులుగా రష్యా సైన్యం దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో సామాన్య పౌరులు, రెండు దేశాలకు చెందిన సైన్యం మృత్యువాతపడ్డారు. ఇంత జరిగినా పుతిన్ మాత్రం దాడులను నిలిపివేయడం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోదీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్ దోచుకుందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్. రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రాంతాల్లో జియో 5జీ వైఫైను లాంచ్ చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్, 5జీ సిమ్ లేని యూజర్లు ఏ స్మార్ట్ఫోన్లలో అయినా ఈ 5జీ వైఫై సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. దయచేసి ‘ఓ..’ శబ్దాన్ని అనుకరించొద్దు: రిషబ్ శెట్టి విజ్ఞప్తి చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎలాంటి అంచానాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగుతో పాటు అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్-పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు టీ20 వరల్డ్‌కప్-2022లో దాయాదుల సమరం ప్రారంభానికి ముందే ఇరు దేశాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్.. పాక్‌లో అడుగుపెట్టబోయేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఘోరం.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి.. మధ్యప్రదేశ్ ఖర్గోన్లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Aunty: ఆంటీ.. అంతగొప్ప స్థాయి ఉంది!
ఆంటీ.. Aunty Trend గత 24 గంటలుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న పదం. అందుకు కారణం ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. విరామం కూడా లేకుండా సదరు సెలబ్రిటీని మీమ్స్, ట్రోలింగ్‌తో తెగ వైరల్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో నెటిజన్స్. అయితే.. ఆంటీ అనే ఈ పదం ఎలా పుట్టిందో తెలుసా?. లాటిన్ పదం అమిటా Amita, ఫ్రెంచ్ పాత పదం ఆంటే(Ante) నుంచి పుట్టుకొచ్చింది ఆంటీ అనే పదం. వాస్తవానికి ఆ రెండు పదాలకు అర్థం ఒక్కటే ‘కుటుంబ సంబంధం’ అని. కాలక్రమంలో ఒక కుటుంబంలో మహిళలకు.. బంధం కోసం ఈ పదం తీసుకొచ్చారు. అలా వాడుకలో వందల ఏళ్లుగా నడుస్తోంది ఈ పదం. ఆంటీ అంటే అత్త.. తండ్రి సోదరి. ఇది మాత్రమే కాదు.. ఆంటీ అనే బంధుత్వం ప్రకారం తల్లిదండ్రుల తోబుట్టువు కూడా. ఒక తరానికి రెండవ స్థాయి బంధువు. అంటే ఆంటీ అనే పదానికి అత్త లేదంటే పిన్ని అనే అర్థాలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం.. తల్లి తర్వాత తల్లి అంతటి స్థాయిని ఆంటీ అనే పదానికి ఇచ్చారు సమాజంలో. అయితే.. ఆంటీ అనే పదానికి నెగెటివిటీ రావడానికి కారణం.. జనాదరణ పొందిన ఒక సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతిలో పాతరోజుల్లో పిల్లలు లేని మహిళలను ఆంటీలుగా వ్యవహరించేవాళ్లు. యువతతో సంబంధాల ద్వారా వీళ్లు సమాజానికి చేటు చేసేవాళ్లనే అభిప్రాయం ఒకటి నెలకొంది. అలా అక్కడి నుంచి.. ఆ సంస్కృతి మన దేశానికి పాకింది. ఆంటీ అంటూ కొందరిని చులకనగా చూడడం నడుస్తోంది. కానీ, మాతృత్వానికి ప్రాధాన్యతనిస్తూ.. ఆంటీ(అత్త/పిన్ని)కి సమాజంలో వాస్తవ గౌరవం ఉంది. అంతెందుకు తెలుగు సంస్కృతి ప్రకారం ఎక్కడికి వెళ్లినా.. పరిచయం లేని మహిళలను ఆంటీ అని సంభోదించడం.. వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడమే!. కాబట్టి, ఆంటీ అనే పిలుపు #Ageshaming అవమానం, మహిళలను అగౌరవపర్చడం ఎంతమాత్రం కాదన్నది పలువురు నెటిజన్లు వెలిబుచ్చుతున్న అభిప్రాయం. -
కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్ వర్కింగ్ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పలమనేరు: ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్ వర్కింగ్) పద్ధతి ట్రెండింగ్‌గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. టాప్‌వర్కింగ్ ఎలా చేస్తారంటే.. జిల్లాలో ఎక్కువగా పల్ప్(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్‌వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్‌ప్లాంట్) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్‌చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్‌ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది. చిగురుదశలోనే అంటు కట్టాలి ఏటా జూలై, ఆగస్టులోనే టాప్ వర్కింగ్ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్‌వర్కింగ్ జోరుగా సాగుతోంది. (క్లిక్: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!) కొమ్మకో వెరైటీ టాప్ వర్కింగ్ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు. – డా.కోటేశ్వరావు, హార్టికల్చర్ ఏడీ, పలమనేరు మంచి రకాలను పెంచుకోవచ్చు ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ వర్కింగ్ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Azadi Ka Amrit Mahotsav: ఇంటింటా ‘తిరంగ’ ఎటు చూసినా మువ్వన్నెలే.. అన్ని వైపులా త్రివర్ణ పతాక రెపరెపలే..ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా కనిపిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ దేశం నినదిస్తోంది. 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల లోనూ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్లో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. వెంటిలేటర్‌పై రష్దీ.. తెగిపోయిన చేతుల్లోని నరాలు, దెబ్బతిన్న కాలేయం భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. రీ సర్వే కొత్తపుంతలు.. విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలత వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఉపఎన్నిక వేడిలో ఉడుకుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. రంగంలోకి ప్రియాంక? రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందా? తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా మరింత దృష్టి పెట్టేందుకు సిద్ధమైందా? ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనున్నారా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్ ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్‌పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్ టేలర్.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. Vijay Deverakonda: ఆయన కొట్టిన దెబ్బకు రోజంతా బాధపడ్డా నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్‌టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఐప్యాక్ నివేదిక.. దిద్దుబాటు చర్యలపై టీఆర్ఎస్ ఫోకస్.. ‘సోషల్’గా వెళ్లాల్సిందే! పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కరడుగట్టిన సోషల్ మీడియా వారియర్స్ (సామాజిక మాధ్యమ ప్రచారకర్తలు)ను తయారు చేసుకోవడంపై దృష్టిపెట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
అల్లరి చేసేవారే ఇలా బహిష్కరిస్తారు: అక్షయ్ కుమార్
Akshay Kumar Says Mischievous People Are Boycotting Films: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ అలరిస్తుంటాడు. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలతో పలకరించాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రక్షా బంధన్'. అయితే ఈ మధ్య 'బాయ్‌కాట్ బాలీవుడ్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్రం', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అలియా భట్ 'డార్లింగ్స్'తో పాటు అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' చిత్రాలను బహిష్కరించాలని నెట్టింట్లో ట్రోలింగ్ జరిగింది. రక్షా బంధన్ ప్రమోషన్లో పాల్గొన్న అక్షయ్ కుమార్ బాయ్‌కాట్‌పై స్పందించాడు. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా బాయ్‌కాట్' ట్రెండింగ్‌లో ఉండటం తనను బాధించిందని తెలిపాడు. 'ఇలా బాయ్‌కాట్ పేరుతో అల్లరిపాలు చేసేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అల్లరి చేసేవాళ్లు మాత్రమే ఇలా బాయ్‌కాట్ చేస్తారు. అది పర్వాలేదు. ఇది స్వేచ్ఛాయుత భారతదేశం. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినవి చేసేందుకు అనుమతిస్తారు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుందా?. అలా జరగడం లేదు కదా. ప్రజలు ఇలాంటి పనులు చేయడంలో ఎలాంటి అర్థం లేదు. మన భారతదేశాన్ని గొప్పగా పెంపొందిచడంలో తోడ్పడాలి కానీ, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి పనులు ఎవరు చేయకూడదని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల మన దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు' అని అక్కీ పేర్కొన్నాడు. కాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఒక్క అన్న, నలుగురు చెళ్లెళ్ల మధ్య అనుబంధంగా తెరకెక్కింది 'రక్షా బంధన్' చిత్రం. ఇందులో భూమి పెడ్నేకర్, సాదియా ఖతీబ్, సాహెజ్మీన్ కౌర్, స్మృతి శ్రీకాంత్, దీపికా ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కూడా విడుదల కానుంది. -
ట్విటర్లో ‘పన్నీర్ బటర్ మసాలా’ నడుస్తోంది.. మీమ్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు!
పాలతో ఏ వంటకం చేసిన రుచి అదిరిపోతుంది. అందుకే పాల ఉత్పత్తులతో చేసే ఏ వ్యాపారమైన మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే మార్కెట్లో కూడా వాటికి గిరాకీ బాగానే ఉంటుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా లాక్డౌన్, ధరల పెరుగుదల వంటి కారణలతో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు తగ్గు ముఖంపట్టాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు మునుపటి పరిస్థితుల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా సవరించిన జీఎస్టీతో ప్రజలకు షాకిచ్చిందనే చెప్పాలి. ఈ సారి జీఎస్టీ స్లాబ్‌లో పాల ఉత్పత్తులను చేర్చడంతో వ్యాపారులకు షాక్, ప్రజలపై మరింత భారం పడనుంది. గత నెలలో జరిగిన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు మరికొన్ని వస్తువుల స్లాబ్‌ను పెంచారు. సవరించిన ధరలు జూలై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో పన్నీర్, ఇతర పాల ఉత్పత్తులు ఇకపై మునుపటి కంటే ఎక్కువ ధర ఉంటుంది. ఈ జీఎస్టీ విధింపులపై ట్విటర్ వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జీఎస్టీ ప్రకారం.. పన్నీర్ పై 5 శాతం, బటర్‌పై 12 శాతం, మసాలాపై 5 శాతం విధించారు. ఈ క్రమంలో నెటిజన్లు కేంద్రం పై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ట్విట్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో #PaneerButterMasala ( పన్నీర్ బటర్ మసాలా) ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెటిజన్లు కేంద్రాన్ని విమర్శిస్తూనే ఫన్నీగా పోస్ట్‌లు పెడుతున్నారు. GST on Paneer butter masala after this GST mathmatics Exam comes new Calculation 🤣😃😂 Keep Solve pic.twitter.com/74DPCjaa58 — A. AHMAD (@ASGARAHMAD84) July 20, 2022 Paneer Butter Masala at Middle Class Homes After New GST slabs. pic.twitter.com/mfFzw5TziA — Garima Kaushik (@Garimakaushikk) July 20, 2022 Paneer Butter Masala is trending. Me in hostel : pic.twitter.com/oZHOTjhRDC — Varsha saandilyae (@saandilyae) July 20, 2022 -
'మేజర్' అరుదైన రికార్డు.. పాక్‌తో సహా 14 దేశాల్లో ట్రెండింగ్
Major Trends At Top 10 On Netflix Across 14 Countries: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలాగే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా సత్తా చాటుతోంది. అడవి శేష్ నటన, యాక్షన్ సీక్వెన్స్, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వివిధ దేశాల్లోని ప్రజలను ఆకట్టుకుంటోంది. 'మేజర్' చిత్రం ఒకటి, రెండు కాదు ఏకంగా 14 దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. తెలుగు, హిందీ భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉండగా.. బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మలేషియా, ఒమన్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక, యూఏఈ, ఖతార్, సింగపూర్ సహా 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్-10లో నిలిచింది. ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్-1లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ విషయంపై హీరో అడవి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. 'నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాపై ఆడియెన్స్ చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే' అని తెలిపాడు. India's hero is being celebrated worldwide 💥💥#MajorTheFilm is trending in Top 10 films on @NetflixIndia across 14 countries ❤️🔥❤️🔥@AdiviSesh #SobhitaDhulipala @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @sonypicsindia pic.twitter.com/sKv0jQ3IGr — Major (@MajorTheFilm) July 14, 2022 -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని చికిత్సలు: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. లంకలో కనిపిస్తే కాల్చివేత రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులను అణగదొక్కేందుకు తాత్కాలిక అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులు బయట కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తే.. తెలంగాణలో రాజకీయాల్లో ఆరా మస్తాన్ సర్వే పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది. రాబోయే ఎన్నికల్లో మరోసారి గులాబీ బాస్‌దే అధికారమని చెబుతూనే ట్విస్టులు ఇచ్చింది. సర్వే నివేదిక బీజేపీకి భారీ షాక్ ఇచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. స్కూళ్ల సెలవులు పొడిగింపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎల్లో మీడియా ఆ ఇద్దరి కోసమే! పవన్, చంద్రబాబు.. ఆ ఆరోపణలు నిరూపించగలరా? నేను సవాల్ చేస్తున్నా. చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదు..పవన్ కళ్యాణ్‌కి క్యారెక్టర్ లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. డెడికేషన్ అంటే ఇది.. గాయంతోనూ సీన్లు పూర్తి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ షూటింగ్లో గాయపడ్డాడు. లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్లో భాగంగా గాయపడినా.. ఆయన ఆ గాయాన్ని లెక్క చేయలేదట. ఎంత నొప్పిగా అనిపించినా దాన్ని పంటి కింద భరించి సీన్ కంప్లీట్ చేశాడట. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. నథింగ్ ఫోన్ (1).. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే! ఎట్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. బుమ్రా అదుర్స్.. వరల్డ్ నెంబర్ వన్! ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ వన్డే బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా మినహా మరే ఇతర టీమిండియా బౌలర్లు టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. తండ్రి వెల్డర్.. పేద కుటుంబం.. తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం వెల్డింగ్ పనులు చేసుకునే ఓ కూలీ కొడుకు జేఈఈ మెయిన్స్(తొలి రౌండ్).. అదీ మొదటి పయత్నంలోనే 99 శాతం స్కోర్ చేశాడు. ఇప్పుడా ప్రయత్నం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అతని పేరు దీపక్ ప్రజాపతి. ఏడేళ్ల వయసులో సుద్దమొద్దుగా పేరుబడ్డ ఓ పిల్లాడు.. ఇప్పుడు జాతీయ స్థాయి పరీక్షలో 99.93 శాతం స్కోర్ చేయగలడని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించలేదట. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. బ్రిటన్ ప్రధాని రేసు.. మిగిలింది ఎనిమిది మందే! బ్రిటన్ ప్రధాని పదవి రేసులో.. నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి భారత సంతతికి చెందిన హోం మంత్రి ప్రీతీ పటేల్‌తో పాటు పాక్ సంతతికి చెందిన మాజీ మంత్రులు సాజిద్ జావిద్, రెహ్మాన్ చిస్తీ తదితరులు తప్పుకున్నారు. దాంతో రిషితో పాటు మరో ఏడుగురు బరిలో మిగిలారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్ సువెల్లా బ్రేవర్మన్ కూడా ఉండటం విశేషం! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నిలబడతారనే ప్రచారం మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. వైఎస్సార్ జిల్లా పర్యటనకు సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలో ఈనెల 7,8(గురు, శుక్రవారాల్లో) తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేసింది. పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. నూపుర్ శర్మకు స్వల్ప ఊరట నూపుర్ శర్మను అరెస్టు చేయాలని దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఇందార బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన విశ్రాంత ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను మొదట రిజిస్ట్రార్ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సింగరేణిలో 40వేల కోట్ల అవినీతి.. కేసీఆర్, కేటీఆర్‌లపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్‌లపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సింగరేణిలో భారీ అవినీతి జరిగిందని, దానిని బయటపెట్టి ప్రజలకు వివరించేందుకు ఎంతదూరమైన వెళ్తానంటూ ప్రకటన చేశాడాయన. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. విండీస్‌తో సిరీస్.. శిఖర్ ధావన్‌కు బంపరాఫర్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. ఈ మేరకు విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడబోయే జట్టు వివరాలు వెల్లడించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఆ కుట్ర వెనుక పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర ఉంది: భూమన టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య పెద్ద కుట్ర జరిగిందని శాసససభ ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన శాసనసభ ఉపసంఘం వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం సమావేశమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. సల్మాన్ ఖాన్ లాయర్‌కు బెదిరింపు లేఖ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. జోధ్‌పూర్ కోర్టులోని తన చాంబర్ బయట ఈ లేఖ లభించింది. లేఖలో ‘గాయకుడు మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది. మేము ఎవరినీ వదిలిపెట్టము. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టం’ అని రాసి ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ కుదింపు.. కారణం అదేనా? బ్రిటన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. దుమ్ములేపిన పంత్.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అద్భుత ఆటతీరు కనబరిచిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. సెన్సెక్స్ జంప్, స్పైస్‌జెట్‌కు భారీ షాక్ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మెటల్, ఎనర్జీ రంగాలు తప్ప అన్ని రంగాల షేర్లు లాభ పడ్డాయి. ఆటో, ఫైనాన్స్ ఎఫ్ఎంసీజీ, ఫెర్టిలైజర్ల షేర్లు బాగా పుంజు కున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 616 పాయింట్లు ఎగిసి 53750 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 15989 వద్ద ముగిసాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఒకే క్లిక్‌లో ఇంటర్ ఫస్టియర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 2. మహా సర్కార్‌కు గవర్నర్.. గవర్నర్‌కు షిండే వర్గం లేఖ! మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగు.. తూనే ఉంది. ఈ తరుణంలో డబుల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. గవర్నర్ చుట్టూరా రాజకీయం తిప్పాలనే ఆలోచనలో ఉన్నాయి బీజేపీ, షిండే వర్గం. బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ, షిండే వర్గం భావిస్తుండగా.. ఆరోపణలు వెల్లువెత్తడంతో గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 3. థాంక్యూ సీఎం జగన్ సార్ తిత్లీ నష్ట పరిహారం చెల్లించి ఈ ప్రాంత రైతులను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజక వర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 4. తొమ్మిది నెలల తర్వాత రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆయన గవర్నర్ అధికారిక భవనానికి రావడం గమనార్హం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసైతో మాటామంతి కలిపారు కేసీఆర్. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 5. అమెరికాలో వలస విషాదం.. 42 మంది మృతి అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న మృతుల్లో దాదాపు 46కి చేరింది. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలిపారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 6. ఏపీ పాలిటిక్స్‌లో ‘మూడు ముక్కలాట’ రాజకీయ సిద్ధాంతాలు వేరైనా రహస్య ఎజెండా ఒకటిగా పెట్టుకొని విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఛీ కొడుతున్నా.. టీడీపీ అంతర్గతంగా సహకరిస్తూ లోపాయికారి రాజకీయం చేస్తోంది. బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఈ తెర చాటు రాజకీయం తెరపైకి వచ్చింది. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 7. బిజినెస్ టైకూన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత బిజినెస్ టైకూన్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు పల్లోంజీ. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 8. టీ20 ప్రపంచకప్.. సెహ్వాగ్ టాప్3లో కోహ్లికి నో ఛాన్స్..! ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా టాప్ 3 బ్యాటర్లను భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా టాప్ త్రీలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 9. క్రేజీ రూమర్.. మహేష్ 30 ఆ డైరెక్టర్‌తోనే! రాజమౌళి గురించి తెలిసి కూడా మహేశ్ బాబు కొత్తసినిమా పై ఇప్పుడే ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. మహేశ్ కెరీర్ లో తెరకెక్కే 30 చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 10. ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ అది ప్రపంచంలోనే అత్యంత విహీనమైన ముఖంగా గుర్తింపు దక్కింది. ప్రత్యేకించి పోటీల్లో సైతం నెగ్గింది. కానీ, హృదయ విదారకరమైన దాని కథే న్యాయనిర్ణేతలను కదిలించింది. మిస్టర్ హ్యాపీ ఫేస్ గురించి తెలిస్తే.. ఎవరి కళ్లు అయినా చెమ్మగిల్లడం ఖాయం. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. మారుతున్న మహా రాజకీయం మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే మహా రాజకీయాలను ఊహించని మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆటంకాలున్నా.. ఏపీలో అభివృద్ధి బాటే సంక్షేమాన్ని అడ్డుకోవడమే విపక్షం ఏకైక అజెండా. అయినా కూడా అభివృద్ధి బాటలో ఏపీ సర్కార్. గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పనుల పూర్తికి ప్రాధాన్యం. రోడ్ల నిర్మాణంతోపాటు మెరుగైన నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలన్న సీఎం జగన్. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఇవాళే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను జూన్ 22వ తేదీ(బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. డైరెక్ట్ లింక్ కోసం పూర్తి కథనం మీద క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాయి చరణ్ కన్నుమూత అమెరికా మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో నల్గొండ వాసి మృతి చెందాడు. దుండగుడి కాల్పుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయిచరణ్ (26)మృతి చెందాడు. గత రెండేళ్లుగా సాయిచరణ్ అక్కడ పని చేస్తున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ నెగ్గిన లంక సొంతగడ్డపై 1992 తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో వన్డేలో లంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. మరింత దూకుడుగా ఎలన్ మస్క్ ఉద్యోగుల తొలగింపు అంశంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లేబర్ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. మరింత దూకుడు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మస్క్ ఉద్యోగుల కోత విషయంపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్ దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ సింగర్ ప్రమఖ సింగర్ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరి పిల్లల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.అన్నాడీఎంకే వర్గపోరు.. ‘అమ్మ’ సమాధి వద్ద ఉద్రిక్తత అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కాంగ్రెస్ నిరసనలు.. రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. మూడు గంటలపాటు రాహుల్‌ను ఏకధాటిగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. లంచ్ విరామం అనంతరం మళ్లీ ప్రశ్నించారు. ఈ మధ్యలో ఆయన కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన తల్లి సోనియా గాంధీని కలిసి వచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి.. అందులోకి మరిన్ని వైద్య చిక్సితలను చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. సోనీ, జియో చేతికి ఐపీఎల్ ప్రసార హక్కులు ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ, జియో సంస్థలు దక్కించుకున్నాయి. 2023-2027 కాలానికి గాను టెలికాస్టింగ్ రైట్స్ రూ. 44,075 కోట్లకు ఆమ్ముడు పోయిటన్లు సమాచారం. బుల్లితెర ప్రసార హక్కులను రూ. 23,575 కోట్లకు సోనీ దక్కించుకోగా.. డిజిటల్ ప్రసార హక్కులను రూ. 20,500 కోట్లకు జియో సొంతంచేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సిగరెట్ ప్యాక్ మీదే కాదు.. ప్రతి సిగరెట్ పైనా హెచ్చరిక పోనుపోను పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు: రేవంత్ నేషనల్హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్ ఎదుట రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గాంధీ కుటుంబంపై బీజేపీ అక్రమ కేసులు పెడుతోంది. సోనియా గాంధీ కుటుంబంపై ఈగ వాలినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఈడీ అధికారులపై ఒత్తిడి కోసం కాంగ్రెస్ కుట్ర: స్మృతీ ఇరానీ అక్రమాలపై విచారణ జరిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఈడీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టిందని, ఇది ముమ్మాటికీ కుట్రే అని ఆమె మండిపడ్డారు. గాంధీ ఆస్తులను రక్షించేందుకు కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిందని విమర్శించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే!: మంత్రి జోగి రమేష్ పచ్చి అబద్ధాలతో పచ్చ రాతలు రాస్తూ అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితమైందని అన్నారు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. రామోజీరావుకు అబద్ధాలు మాత్రమే కనిపిస్తాయని, చంద్రబాబు పాలనలో ఏం జరగకపోయినా ఆయనకే ఓటేయాలంటాడని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్! రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి! సోమవారం మొత్తం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతననమవడంతో రోజంతా బ్లడ్ బాత్ కొనసాగింది. కేవలం ఒక్కరోజులోనే రూ7లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. బ్రహ్మాస్త్ర కోసం మెగాస్టార్ వాయిస్ ఓవర్ బాలీవుడ్ భారీ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర టీజర్‌తో పాటు నటీనటుల లుక్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ స్పెషల్ వీడియో వదిలింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్‌కు వాయిస్ అందించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ.. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఇది నిజమా? గూగుల్ అలాంటి పని చేస్తోందా ఏమిటీ!? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంటే దాని ఫలితాలు ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈ ఏ రంగంలో అయినా అతికి వెళితే చివరకు అది మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందనే భయాలు లేకపోలేదు. ఇప్పుడు అటువంటి తరుణమే వచ్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాషింగ్టన్ పోస్టు తాజాగా ప్రచురించిన కథనం ఇందుకు సంకేతామా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఎమ్మెల్యేలు మొత్తం నిరంతరం ప్రజల్లోనే ఉండాలి గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలని సీఎం జగన్ అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. అమ్నేషియా పబ్ కేసు: బెంజ్, ఇన్నోవా కార్లు ఎవరివి..? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు అని పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: సుప్రీంకోర్టు ఆగ్రహం దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. నిప్పుల కొలిమిలో వేసినా కాలిపోదు ఇది! మార్గరెట్ అట్వుడ్ రాసిన 'ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్' అనే క్లాసిక్ నవలని.. ప్రత్యేకమైన ఫైర్‌ఫ్రూఫ్ మెటీరియల్‌ని ఉపయోగించి ప్రింట్ చేశారు. ఈ బుక్కు చాలా ప్రత్యేకతలు.. ప్రింట్ చేయడం వెనుక ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలియాలంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బెంగాల్లో హీటెక్కిన పాలిటిక్స్.. జేపీ నడ్డా టూర్‌పై టెన్షన్ బెంగాల్లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ అన్నట్టు వాడివేడి పాలిటిక్స్ చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక వివాదంలో ఈ రెండు పార్టీల నేతలు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా బెంగాల్లో మరోసారి రాజకీయం వేడిక్కింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కలెక్షన్ల లాభం కన్నా విలువైందే దొరికింది బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సందర్భంగా హీరోకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. అసభ్య ప్రవర్తన?..కాలర్ పట్టి ట్రాఫిక్ ఎస్సైను చితకబాదేశారు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను చితకబాదిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దేశ రాజధానిలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టెక్నాలజీని దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్ టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్‌ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్‌పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌తో కలిసి బీజేపీ.. ఏపీకి అన్యాయం చేసింది. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ టెన్ మార్నింగ్ న్యూస్
1. ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 2. తప్పుడు నిర్ణయమే!.. మారణహోమంపై టెక్సాస్ పోలీసులు టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమంపై టెక్సాస్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జరిగిన ఆలస్యం వల్లే పసికందుల ప్రాణాలు పోయాయని, తాము తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయంగా పేర్కొంటూ క్షమాపణలు తెలియజేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 3. శతదినోత్సవ రాముడికి శతజయంతి కానుక.. ఒక నటుడు కష్టపడితే హీరో కావచ్చు. ఒక హీరో సిన్సియర్‌గా శ్రమిస్తే జనాదరణ పొందవచ్చు, బాక్సాఫీస్ హిట్లు సాధించవచ్చు. బాక్సాఫీస్ హిట్లు వచ్చిన తారలు చాలామందే ఉండవచ్చు. కానీ, ఎదిగే తన ప్రయాణంలో తాను నమ్ముకొని వచ్చిన పరిశ్రమను కూడా శిఖరాయమాన స్థాయికి తీసుకెళ్లిన మహానటులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 4. మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందొచ్చు! ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో సుమారు 200 మంకీపాక్స్ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 5. అనంతలో విషాదం.. సిలిండర్ పేలి కుటుంబం దర్మరణం జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇళ్లు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 6.సామాజిక న్యాయభేరి: మూడో రోజు యాత్ర ప్రారంభం వైఎస్సార్సీపీ సామాజిక న్యాయభేరిలో భాగంగా మూడోరోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నేడు తాడేపల్లిగూడెం నుంచి నర్సారావుపేటకు బస్సు యాత్ర జరుగనుంది. బస్సు యాత్ర సందర్భంగా స్థానిక పోలీస్ ఐ ల్యాండ్ వద్ద వైఎస్సార్ , ఇతర నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రులు నివాళులు అర్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 7. హైదరాబాద్‌లో సొంతబండే సో బెటర్ సాధారణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక, రవాణా సదుపాయాలు విస్తరిస్తాయి. కానీ గ్రేటర్లో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది.కొత్తగా మెట్రో రైలు సదుపాయం మినహా అదనంగా ప్రజారవాణా ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 8. మనసా..వాచా..ఇచ్చిన మాటే.. ఇన్నేళ్ల అజెండా మూడేళ్లు. ఒకరకంగా తక్కువే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది చాలా ఎక్కువ. మీడియా– రాజకీయాలు – వ్యవస్థలన్నీ కలిసిపోయి ఒక వర్గానికే కొమ్ముకాస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారికి వ్యతిరేకంగా జెండా ఎగురవేసి నెగ్గటమే ఒక చరిత్ర. ఆ తరవాత కూడా కుట్రలను తిప్పికొడుతూ దిగ్విజయంగా ముందుకెళ్లటం మరో చరిత్ర. అలా ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త చరిత్రను రాసుకుంటూ ముందుకెళుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 9. కేసీఆర్‌ను ఆకాశానికెత్తిన మంత్రి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్‌ను బీట్ చేసే మొగోడు ఏ రాష్ట్రంలో లేడని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండలోని తారా గార్డెన్స్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 10. రాజస్తాన్ రైట్ రైట్... ఐపీఎల్ మొదటి సీజన్–2008లో విజేతగా నిలిచిన తర్వాత పడుతూ, లేస్తూ ప్రస్థానం సాగించి... మధ్యలో రెండేళ్లు నిషేధానికి కూడా గురైన రాజస్తాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత మళ్లీ తుది పోరుకు అర్హత సాధించింది. గత మూడు సీజన్లుగా చివరి రెండు స్థానాల్లోనే నిలుస్తూ వచ్చిన ఈ టీమ్ ఈసారి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. ఆన్లైన్ గేమ్స్‌పై కేంద్రం జీఎస్టీ వసూలు ఆన్లైన్ గేమింగ్, క్యాసినో,రేస్ కోర్స్‌లపై జీఎస్టీ బాదుడుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ కంటే అది ఎక్కువే అని తెలుస్తోంది. అది ఏ మేర అంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఇది ఓ అమ్మ విజయం, పెరారివాలన్ భావోద్వేగం రాజీవ్ గాంధీ హత్య కేసులోని ఏడుగురు దోషుల్లో ఒకరు, యావజ్జీవ ఖైదీ.. ఏజీ పెరారివాలన్ అలియాస్ అరివును విడుదల చేయాలని సుప్రీం మే 18న ఆదేశించింది. 19 ఏళ్ల వయసులో అరెస్టయ్యి, గత మూడు దశాబ్దాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల వయసులో పెరారివాలన్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లాను పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. టిట్ ఫర్ టాట్: పుతిన్‌పై బ్యాన్ విధించిన కెనడా ఉత్తర అమెరికా దేశం కెనడా ఊహించని నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై నిషేధం విధించింది. పుతిన్‌తో పాటు మరో వెయ్యి మంది రష్యన్ జాతీయలు మీద(రాజకీయ నేతలు, ప్రముఖులు, అధికారులు ఉన్నారు) కూడా బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ‘ఎఫ్ 3’ మూవీ టికెట్ రేట్స్ పెంపుపై దిల్ రాజు క్లారిటీ ఎఫ్ 3 మూవీ టికెట్ ధరల పెంపుపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్ ధరలు పెంచిన విషయం విధితమే. దీంతో తాజాగా ఎఫ్ 3కి కూడా టికెట్ ధరలు పెంచుతారా? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్ రేట్స్ పెంపుపై క్లారిటీ ఇచ్చాడు మూవీ నిర్మాత దిల్ రాజు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. అడవిలో మంట.. పాక్ టిక్‌టాక్ స్టార్‌పై ఆగ్రహం పాకిస్తాన్ సోషల్ మీడియా స్టార్ హ్యుమైరా అస్గర్ షేర్ చేసిన టిక్‌టాక్ వీడియోపై యావత్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందరూ ఫైర్ అయ్యేంతలా ఆమె ఏం చేసిందంటారా? హ్యుమైరా తగలబడుతున్న చెట్ల ముందు అందంగా తయారై సుకుమారంగా నడుచుకుంటూ వెళ్లింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.కేకేఆర్ కమలేశ్ జైన్‌కు బంపరాఫర్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన సిబ్బందిలో ఒకరైన కమలేశ్ జైన్ బంపరాఫర్ కొట్టేశారు. టీమిండియా హెడ్ ఫిజియోగా ఆయన ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను ఆయన మెప్పించినట్లు సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8.2007 మక్కా మసీదు పేలుళ్లకు పదిహేనేండ్లు పూర్తి వేసవి ఉక్కపోతతో ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మక్కా మసీదులో పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఐదు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నగరంపై మాసిపోని ఈ మరకకు నేటికి పదిహేను ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. ఆనాటి నుంచి జరిగిన పరిణామాలు చూద్దాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. తీరిన బొగ్గు కొరత.. ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్ సరఫరా ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.అది కుతుబ్‌మినార్ కాదు.. సూర్య గోపురం!! తాజ్‌మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్ మినార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ అధికారి. అది కుతుబ్ మినార్ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో అసని తుఫాన్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. సర్కారు వారి పాట.. ప్రేక్షకుల రివ్యూ సుమారు రెండున్నరేళ్ల తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రత్యేకించి ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. మరి ప్రేక్షకులకు సర్కారు వారి పాట నచ్చిందా? సినిమాపై వాళ్ల అభిప్రాయం ఏంటి?.. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఎంగేజ్మెంట్ కథనాలపై స్పందించిన సోనాక్షి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు షేర్ చేస్తూ తన వేలికి ఉన్న డైమండ్ రింగ్ హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలకు ‘ఇది నాకు బిగ్ డే.. అంటూ చేసిన క్యాప్షన్పైనా స్పందించింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. నాటో కోసం ఫిన్‌ల్యాండ్ దరఖాస్తు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూరప్ కంట్రీ ఫిన్‌ల్యాండ్ నాటో దళంలో చేరేందుకు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. దేశం విడిచి పోరాదు శ్రీ లంక మాజీ ప్రధాని మహింద రాజపక్సకు భారీ షాక్ తగిలింది. ఆందోళనకారులకు భయపడి.. ఆయన తన కుటుంబం, అనుచరగణంతో భద్రంగా తలదాచుకున్న విషయం తెలిసిందే. కాస్త అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ముంబై వర్సస్ సీఎస్కే.. నిలవాలంటే గెలవాలి! ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ (మే 12) ముంబై ఇండియన్స్‌తో జరిగే కీలక పోరులో తప్పక గెలవాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా, ఓడినా ఒరిగేదేమీ లేకపోగా, సీఎస్కే ఓడితే మాత్రం ప్యాకప్ చెప్పాల్సి ఉంటుంది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఓలాకు భారీ షాక్ ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలాకు భారీ షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆ సంస్థకు సీటీవో దినేష్ రాధా కృష్ణ గుడ్ బై చెప్పగా..తాజాగా వ్యక్తిగత కారణాల వల్ల ఓలాకు రాజీనామా చేస్తున్నట్లు సీఎంఓ వరుణ్ దుబ్ ప్రకటించారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో.. 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. తాజ్ మహల్ గదుల పిటిషన్ తిరస్కరణ తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్ విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిదేహానికి కేజీహెచ్‌లో గురువారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
24 గంటలు గడవకముందే 'సర్కారు వారి పాట' రికార్డు..
Mahesh Babu Sarkaru Vaari Paata Trailer Gets 24 Million Views In Youtube: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్‌గా సముద్ర ఖని అలరించనున్నారు. మే 12న ఈ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన చిత్ర యూనిట్ మే 2న ట్రైలర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. (చదవండి: 'సర్కారు వారి పాట'ను బాగా వాడేసిన హైదరాబాద్ పోలీసులు..) ఈ ట్రైలర్ 19 గంటల్లో అంటే 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఈ వ్యూస్‌తోపాటు ఒక మిలియన్ లైక్స్ కూడా సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడే ఇన్ని లైక్స్, వ్యూస్ సాధించిన ఈ ప్రచార చిత్రం 24 గంటలు గడిస్తే మరెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి. ఈ ట్రైలర్లో మహేశ్ బాబు లుక్స్, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇదివరకు విడుదలైన పెన్నీ, కళావతి పాటలు, టీజర్ విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. (చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం) That's Super🌟 @urstrulyMahesh reporting from the top of @YouTubeIndia sir 😎#SVPTrailer Trending #1 🔥 - https://t.co/AMjXMIUh7F#SVPOnMay12@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/WuLQIWEW2u — Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2022 -
సమంత కొత్త ఫొటో.. గంటల్లో నెట్టింట వైరల్
Samantha Latest Photo Goes Viral On Social Media: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన ఫిట్నెస్ వీడియోలు, కొటేషన్స్, ప్రమోషనల్ బ్రాండ్స్ తదితర పోస్ట్‌లు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సామ్ పెట్టిన పోస్ట్ చూసి తన అభిమానులు మురిసిపోతున్నారు. 'పెద్దదాన్ని, తెలివైనదాన్ని' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేసింది. తెల్లటి పువ్వులు పట్టుకుని బ్యూటిఫుల్ స్మైల్‌తో ఉన్న సామ్ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే నెట్టింట వైరల్ అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల్లో కామెంట్స్, లైక్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల సమంత 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే అదే రోజు ఏప్రిల్ 28న సామ్ నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: ఆ రెండింటికి దూరంగా ఉండాలనుకుంటున్నా : సమంత ఎప్పటికీ కృతజ్ఞురాలినే,మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా : సమంత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. రష్యాని ఠారెత్తిచ్చిన ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే 29 ఏళ్ల స్టెపాన్ తారాబల్కా అనే ఉక్రెనియన్ ఫైటర్ పైలెట్ గత నెలలో జరిగిన యుద్ధంలో మరణించాడని వైమానికదళ అధికారులు వెల్లడించారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. Patiala Clashes: పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్ పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాటియాలలో శివసేన కార్యకర్తలకు, ఖలిస్థాన్ మద్దతుదారులకు మధ్య శుక్రవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాళీ మాత ఆలయం వెలుపల ఇరువర్గాల సభ్యులు కత్తులు ఊపుతూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. CJs-CMs conference: కొనసాగుతున్న సీఎం-న్యాయమూర్తుల సదస్సు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సు కొనసాగుతోంది. శనివారం ఉదయం విజ్ఞాన్ భనవ్‌లో మొదలైన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజ్జూ కూడా హాజరయ్యారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. నాగుపాముతోనే నాగిని డ్యాన్స్.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు బారాత్ అనే పేరు వింటే చాలూ.. పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు కొందరు. చుక్కపడిందంటే చాలూ.. సోయి మరిచి చిందులేస్తుంటారు మరికొందరు. అందునా నాగిని డ్యాన్స్‌ను ఉన్న క్రేజే వేరు. కానీ, ఇక్కడ నాగిని డ్యాన్స్ చేసి కటకటాల పాలయ్యారు. అయ్యో.. అంతమాత్రానికేనా అనుకోకండి 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఓయూలో రాహుల్ గాంధీ సభకు నో పర్మిషన్! కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించింది ఉస్మానియా యూనివర్సిటీ. రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు ! మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, నిన్నటిదాకా నేడు కేజీఎఫ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 29) కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య విడుదలైంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Vitamin B12: విటమిన్ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే.. శరీరానికి అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ బి12 ఒకటి. ఇది నీటిలో కరిగే విటమిన్. రక్తహీనత నుంచి మతిమరుపు వరకు.. నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాలుగా ఇది మనల్ని ప్రభావితం చేస్తుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. Rohit Sharma: సాహో రోహిత్.. ఆ రికార్డు ఇప్పటికీ ‘హిట్‌మ్యాన్’ పేరిటే! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు నేడు(ఏప్రిల్ 30). అతడు ఈరోజు 35వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. లాభాల్లో విప్రో రికార్డు.. ఈసారి ఫ్రెషర్లకు భారీ ఛాన్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 3,093 కోట్లకు చేరింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. ట్విటర్ డీల్‌తో టెస్లాకు భారీ దెబ్బ ట్విటర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయడం తెలిసిందే. అయితే ఆయన సీఈవోగా ఉన్న టెస్లాకు ఈ ప్రభావంతో భారీ దెబ్బ పడింది. 2. మూడు వేలకు చేరువలో కరోనా కేసులు దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. 3. పుతిన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదే పదే అణ్వాయుధం అనే పదం వాడుతుండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే తిట్టిపోశాడు. 4.ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా రియాన్ పరాగ్.. రియాన్ పరాగ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు నాలుగు క్యాచ్‌లు తీసుకున్న మూడో ప్లేయర్‌గా పరాగ్ నిలిచాడు. గతంలో కలిస్ (కోల్‌కతా నైట్‌రైడర్స్; డెక్కన్ చార్జర్స్‌పై 2011లో), గిల్‌క్రిస్ట్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్; చెన్నై సూపర్ కింగ్స్‌పై 2012లో) ఈ ఘనత సాధించారు. 5. చైనాలో మరో వైరస్.. ప్రపంచంలోనే ఫస్ట్ కేసు కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ చైనాను మరో వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. 6. ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 7. నిర్మాతతో పెళ్లి, వ్యభిచారం ఒత్తిడితో నటి ఆత్మహత్యాయత్నం గుడిలో నిర్మాతతో పెళ్లి చేసుకున్న కోలీవుడ్ సీరియల్ నటి.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి తేవడంతో నటి ఆత్మహత్యాయత్నం 8. తమిళనాడు తంజావూరులో పెనువిషాదం తంజావూరు రథయాత్రలో మంగళవారం అర్ధరాత్రి దాటాక అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్రకు కరెంట్ వైర్లు తగలడంతో.. కరెంట్ షాక్‌తో మంటలు చెలరేగి పది మందికిపైగా భక్తుల దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 9. తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? వేసవిలో మాత్రమే కనిపించే సీజనల్ ఫుడ్ తాటి ముంజలు. ఇవి చూసేందుకు చిన్నవైనా పోషకాల్లో మెండు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే దివ్య ఔషధం. ప్రకృతి వరప్రసాదంగా మారి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి తాటి ముంజల గురించి ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 10. ఆసియా క్రీడల్లో ఆడలేమన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పోటీతత్వం మరింత మెరుగు పడాలనే ఉద్దేశంతో... ఆసియా దేశాలు కాకపోయినా... ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో ఆడాలని ఒసియానియా దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) ఆహ్వానించింది. కానీ, అవి పాల్గొనమని చెప్పేశాయి. -
వందల కోట్ల భవంతిలో షారుఖ్.. ట్రెండింగ్‌లో ఇంటి నేమ్ ప్లేట్
Shahrukh Khan Luxurious Bungalow Mannat Name Plate Trending: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన అభిమాన గళం ఉంది. వెండితెరపై ఆయన సినిమా వస్తుందంటే వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. షారుఖ్ చేస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి ఫొటో వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఇందుకు కారణం షారుఖ్ ఖాన్ తన ఇంటి నేమ్ ప్లేట్ మార్చడమే. షారుఖ్ ఖాన్‌కు ముంబైలోని బాంద్రాలో భవంతి ఉన్న విషయం తెలిసిందే. తన అభిరుచికి తగినట్లుగా ఈ ఇల్లును మలుచుకున్నాడు. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది. ఈ ఇంటికి ఆయన 'మన్నత్' అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పటివరకూ ఈ ఇంటి నేమ్ ప్లేట్‌ను చాలా సార్లు మార్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్‌తో మన్నత్ నేమ్ ప్లేట్‌ను మార్చాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై షారుఖ్ అభిమానులు తమదైన శైలీలో కామెంట్లు పెడుతున్నారు. 'ఈ డిజైన్ ఎప్పటికీ ఐకానిక్‌గా ఉంటుంది', 'మన్నత్ స్టార్డమ్, ప్రేమ, భావోద్వేగం, అభిరుచి, కృషి, ఇంకా అంకితభావానికి చిహ్నం', 'దేవుడి స్వర్గం. షారుఖ్ ఖాన్ ఇంటి నేమ్ ప్లేట్ కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది.' అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ ఇంటిలో 2001 నుంచి షారుఖ్ ఖాన్, అతని కుటుంబం నివాసం ఉంటున్నారు. చదవండి: హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు This design will be forever iconic. Simple, unassuming and classy, just like you @iamsrk. Not a fan of the new one to be honest. #Mannat pic.twitter.com/Nbq8Nnrah6 — Samina ✨ (@SRKsSamina_) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని
అహ్మదాబాద్: జేసీబీ బుల్డోజర్.. ప్రస్తుతం భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. శ్రీరామ నవమి, హానుమాన్ శోభాయాత్రల సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల అనంతరం.. ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. అల్లర్లకు కారణమైన వాళ్లకు చెందిన ఇళ్లను, దుకాణాలను, ఇతర కట్టడాలను.. అక్రమ కట్టాలుగా నిర్ధారించుకుని ప్రభుత్వాలు జేసీబీ బుల్డోజర్లతోనే కూల్చేస్తున్నాయి. ఈ క్రమంలో.. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. బుల్డోజర్ ట్రెండ్‌లోకి వచ్చేశారు. ఎలాగంటారా?.. గుజరాత్ వడోదరా హలోల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ జేసీబీ ఫ్యాక్టరీని ఆయన సందర్శించాడు. #WATCH UK PM Boris Johnson along with Gujarat CM Bhupendra Patel visits JCB factory at Halol GIDC, Panchmahal in Gujarat (Source: UK Pool) pic.twitter.com/Wki9PKAsDA — ANI (@ANI) April 21, 2022 జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించిన బోరిస్.. హుషారుగా జేసీబీ బుల్డోజర్ ఎక్కి పరిశీలించి కాసేపు సందడి చేశారు. ఆ సమయంలో ఆయన వెంట.. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. ఇంకేం.. యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1947 నుంచి 2022 వరకు బోరిస్ కవర్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఎందుకంటే.. అంతకు ముందు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి.. చరఖా తిప్పారు. From Gandhi's Charkha to Modi's JCB - Boris Johnson covered the history of India from 1947 to 2022, in a day. pic.twitter.com/1N0Fcku3iT — PuNsTeR™ (@Pun_Starr) April 21, 2022 #WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k — ANI (@ANI) April 21, 2022 మహాత్ముడి రచనల్లో ఒకటైన, ప్రచురణకాని గైడ్ టు లండన్‌ను బోరిస్ కానుకగా అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గుజరాత్లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని బోరిస్.. రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్తారు. आज जेसीबी तेरा भाई चलाएगा 😎 pic.twitter.com/DIacyWBEy4 — Desi Boy 🇮🇳⚙️ (@Desi_b_o_y) April 21, 2022 #JCBKIKHUDAI .. Boris Johnson pic.twitter.com/Qu31P72iQg — Er R K DAHARWAL आर के डहरवालرکدہاروال (@DaharwalK) April 21, 2022 JCB share price pic.twitter.com/RXrJ6AsRbw — Armoured_assault (@Vivek_707) April 21, 2022 -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
జహంగీర్‌పురి కూల్చివేతలు.. మేయర్ స్పందన ఢిల్లీ జహంగీర్‌పురి బుల్డోజర్ కూల్చివేతలపై ఢిల్లీ మేయర్ స్పందించారు. శనివారం మత ఘర్షణలు జరిగిన ప్రాంతంలోనే.. బుల్డోజర్లు రంగంలోకి దిగడంతో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అదంతా మీడియా సృష్టే: కాకాణి నెల్లూరు జిల్లాలో కీలక నేతల మధ్య వైరం అంటూ వస్తున్న మీడియా కథనాలపై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఖండించారు. అనిల్ తనకు సోదరుడిలాంటి వాడని, కేవలం జిల్లా అభివృద్ధి పనుల కోసమే సీఎం జగన్‌తో భేటీ అయ్యామని ఆయన అన్నారు. ఉక్రెయిన్ తర్వాత మరో రెండు దేశాలకు.. ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు దిగి.. ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాజాగా మరో రెండు దేశాలకు హెచ్చరికలు జారీ చేశాడు. ఐపీఎల్‌కు సైన్మా ఫీవర్ ఐపీఎల్ 2022 సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్న బీసీసీఐను రెండు పాన్ ఇండియా సినిమాలు భారీగా దెబ్బకొట్టాయి. అవి రెండూ సౌత్ సినిమాలు కావడం, ఆడియొన్స్‌లో క్రేజ్ ప్రభావం ఐపీఎల్ వ్యూయర్షిప్పై పడింది. కిషన్‌రెడ్డి కీలక ప్రకటన తెలంగాణలో రైస్ మిల్లుల్లో అవకతవకలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కొన్ని రైస్ మిల్లులలో అవకతవకలు జరిగాయన్నారాయన. నజ్రియా మీద నాని ఆసక్తికర వ్యాఖ్యలు అంటే సుందరానికి.. టీజర్ లాంఛ్ సందర్భంగా హీరో నాని, తెలుగులో డెబ్యూ ఇస్తున్న మలయాళ నటి నజ్రియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎగబడి మరీ కొంటున్నారు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! వాటి ప్రత్యేకతలేంటంటే.. అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్ దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్ తేవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్.. అధికారులకు సూచించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో హోం శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌కు పేరు పెట్టిన మోదీ గుజరాత్లో గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్‌ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. ఫార్ములా వన్ స్టార్‌కు చేదు అనుభవం అభిమానులు ఫార్ములా వన్ స్టార్ చార్లెస్ లెక్లెర్కు బిగ్ షాకిచ్చారు. తనను కలవడానికి వచ్చిన అభిమానుల్లో గుర్తుతెలియని ఒక వ్యక్తి చార్లెస్ చేతికున్న ఖరీదైన వాచ్‌ను కొట్టేశాడు. ఆ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? -
విశాల్ ఐ లవ్ యూ.. ప్లీజ్ నన్ను తీసుకెళ్లు నీ కుసుమ్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్ మొత్తం ఫోన్లోనే సందేశాలు పంపుతున్నారు. లవ్ ప్రపోజల్ నుంచి పెళ్లి వేడుక వరకు అంతా స్మార్ట్ ఫోన్లోనే జరిగిపోతున్నాయి. ఒకప్పటిలా గ్రీటింగ్ కార్డు, పోస్టు కార్డుల కాలం చెల్లిపోయింది. ఇలాంటి తరుణంలో తన వద్ద ఫోన్ అందుబాటులో లేని ఓ యువతి రూ.10 నోటుపై ప్రేమ రాయబారం పంపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ పది రూపాయల నోటుపై.. "విశాల్ నా పెళ్లి ఏప్రిల్ 26న ఫిక్స్ అయ్యింది. మనం లేచిపోదాం. నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కుసుమ్" రాసి ఉంది. కుసుమ్ అనే మహిళ తన లవర్ కోసం ఇలా రాసింది. కాగా, కుసుమ్, విశాల్ ఎవరు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. కుసుమ్ అనే యువతి.. విశాల్‌ని ప్రేమిస్తోంది. కానీ, ఆమె తల్లిదండ్రులు మాత్రం కుసుమ్‌ను ఇంట్లో బంధించి.. తన దగ్గర ఫోన్ లేకుండా చేసి మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన ఆమె వివాహానికి డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఎలాగైనా విశాల్‌కు పెళ్లి విషయం తెలియాలని కుసుమ్ ఇలా చేసింది. వారిద్దరూ కలిసి బతికేందుకు విశాల్‌తో లేచిపోవడానికి కూడా రెడీ అయినట్టు నోటుపై క్లియర్‌గా రాసింది. Twitter show your power... 26th April ke Pehle kusum ka Yeh message vishal tak pahuchana hai.. Doh pyaar karne wale ko milana hai.. Please amplify n tag all vishal you know.. 😂 pic.twitter.com/NFbJP7DiUK — Crime Master Gogo 🇮🇳 (@vipul2777) April 18, 2022 అయితే, ఇది నిజంగానే రాశారా..? లేక ఎవరైనా సరదాగా రాశారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఇలా కరెన్సీ నోట్లపై రాతలు రాయడం భారతీయ చట్టాల ప్రకారం నేరం. కాబట్టి ఇలాంటి రాతలు రాయకపోవడమే మంచిదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం.. "విశాల్ సరైన సమయానికి చేరుకుంటే.. ఆమె అతనితో పారిపోతుందా?" కామెంట్స్ చేశాడు. Lets do it! Vishal your dulhaniya is waiting for you! https://t.co/P283jaF2T3 — Chinten Shah (@chintenshah) April 20, 2022 -
అమ్మో ‘డైనోసర్’ చేప.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు నివసిస్తున్నాయి. అప్పుడప్పుడు కొన్ని జీవాలను చూసి ఆశ్చర్యపోతుంటాం. యూనిమేషన్ సినిమాలు, హాలీవుడ్, కార్టూన్ ఛానెళ్లలో వింత జంతువులను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంటాం. అలాంటి జంతువులు నిజంగానే ఉన్నాయా అని అనుకుంటాం కదా.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నార్త్ అమెరికాలో వెలుగు చూసింది. సాధారణంగా మనం 50-100 కిలోల బరువున్న చేపలను చూసి ఉంటాం. కానీ, 10 అడుగులకు పైగా పొడువు, దాదాపు 500 పౌండ్ల నుంచి 600 పౌండ్ల బరువున్న చేపను చూశారా..? ఇంత సైజు, బరువు ఉన్న ఓ చేప( స్టర్జన్ ఫిష్) ఫ్రేజర్ నదిలో కనిపించింది. భయకరంగా ఉన్న ఆకృతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ స్టర్జన్ ఫిష్ వయసు ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలమే ఉంటుందని అంచనా. స్టర్జన్ చేపలు జురాసిక్ యుగం నుంచి ఉంటున్నాయని, ఇవి బతికున్న డైనోసార్స్ అని నిపుణులు చెబుతుండటం విశేషం. Giant. pic.twitter.com/K8w1yW6kek — Jamie Gnuman197... (@JGnuman197) April 10, 2022 -
రష్మిక మందనాతో పోటీపడ్డ యువకుడు.. వీడియో మామూలుగా లేదుగా..
వాషింగ్టన్: పుష్ప మూవీలో ‘సామి సామి’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్‌పై ఎంతో మంది వేసిన డ్యాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఈ పాటకు ఓ యువకుడు.. అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని వేసిన స్టెప్పులు మాములుగా లేవు. చాలా హుషారుగా, ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేశాడని నెటిజన్లు ప్రశంసిస్తునారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. భారతీయుడైన కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా తరచూ అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకొని ఆమెరికాలో డ్యాన్స్‌లు చేస్తున్నాడు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ నృత్యాలను బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు వాటిని అమెరికాలో ప్రదర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నాడు. డాన్స్ చేస్తూనే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. తాజాగా అతను స్కర్ట్ ధరించి... అమెరికా వీధుల్లో పుష్ప సినిమాలోని సామి సామి పాటకు డాన్స్ చేశాడు. ఆ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Jainil Mehta (@jainil_dreamtodance) అంతకు ముందు.. గంగూభాయ్ కతియావాడి సినిమాలోని ఝూమ్ రే గోరీ సాంగ్‌కి అదిరిపోయే గార్భా స్టెప్స్ వేశాడు. సినిమాలో ఈ సాంగ్‌ని అలియాభ్తో పిక్చరైజ్ చేయగా.. జైనిల్ అంతకుమించి అంటూ లైవ్‌లోనే స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూపించి వావ్ అనిపించుకున్నాడు. కాగా, ఇతడి డ్యాన్స్‌లను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుడగా.. మరికొందరు మాత్రం.. అమ్మాయిల డ్రెస్సులే ఎందుకు వేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Jainil Mehta (@jainil_dreamtodance) -
అంతా అతని వల్లే జరిగిందన్న పూరన్.. ఆర్సీబీతో మ్యాచ్‌పై హస్సీ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 11) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి గుజరాత్ టైటాన్స్‌ను ఓటమిని పరిచయం చేసింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఫ్రాంచైజీ.. అరంగేట్రంలోనే హ్యాట్రిక్ విజయాలు సాధించి దూసుకుపోతుండగా, సన్‌రైజర్స్ జీటి విజయాల పరంపరకు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. భువీ (2/37), నటరాజన్ (2/34), మార్కో జన్సెన్ (1/27), ఉమ్రాన్ మాలిక్ (1/39) రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌ను 162 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభినవ్ శర్మ (42), కేన్ విలియమ్సన్ (57) శుభారంభాన్ని అందించగా, ఆఖర్లో పూరన్ (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (8 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్) చెలరేగి ఎస్ఆర్హెచ్ను విజయతీరాలకు చేర్చారు. Finishing in style ✅ The Brian Lara influence 🙌 2⃣ wins in a row 🔥 The player-coach duo of @nicholas_47 & the legendary @BrianLara chat after @SunRisers' successful run-chase against #GT. 👍 👍 - By @ameyatilak Full interview 📹 🔽 #TATAIPL | #SRHvGT https://t.co/VPyVK8aiKp pic.twitter.com/AGZmrGWjWk — IndianPremierLeague (@IPL) April 12, 2022 ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన పూరన్, మ్యాచ్ అనంతరం ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ ప్రస్థానంపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన జట్టు తిరిగి గాడిలో పడటానికి బ్యాటింగ్ కోచ్ లారానే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. A face-off with familiar faces! 📹 Once we cross the line, it's bat v ball challenge! Watch the match preview with Huss!#CSKvRCB #WhistlePodu #Yellove 🦁💛 @amazonpay pic.twitter.com/XmfVV5T03l — Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2022 ఈ వీడియోతో పాటు ఇవాళ (ఏప్రిల్ 12) ఆర్సీబీతో జరుగబోయే మ్యాచ్‌పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఏమన్నాడో (ప్రివ్యూ) చూడొచ్చు. ఇందులో సీఎస్కే ఆటగాళ్ల ప్రాక్టీస్, ఇతరత్రా దృశ్యాలు ప్రధానంగా ఆకట్టుకోగా, జట్టు మాజీ సభ్యుడు డుప్లెసిస్‌ను సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆప్యాయంగా కౌగిలించుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసిక్తికర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సీఎస్కే, ఆర్సీబీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్కే ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్‌రైజర్స్ బౌలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సారూ శశిథరూర్ అదేం పని.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ఎక్కడున్నా, ఏం చేసినా కెమెరాలు వారిపై ఫోకస్ పెడుతూనే ఉంటాయి. సభ జరుగుతుండగా కొందరు నేతలు నిద్రపోవడం, ఇంకేదైనా చేయడం చూస్తుంటాం. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అలాంటి ఓ ఘటనతో సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. లోక్‌సభలో ఆయన ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడటమే ఇందుకు కారణం. దీనిపై సోషల్‌మీడియాలో సరదా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై లోక్‌సభలో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా.. శశిథరూర్ ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలేతో మాట్లాడుతూ కనిపించారు. ముందు సీటులో ఆమె కూర్చొని ఉండగా.. శశిథరూర్ వెనుక సీట్లో బల్లపై తల ఆనించి పడుకుని నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. ఓ వైపు ఫరూక్ అబ్దుల్లా సీరియస్‌గా ప్రసంగిస్తుండగా శశిథరూర్ ఫన్నీగా ఆమెతో మాట్లాడారు. It was a great speech by Farooq Abdullah. Must listen for everyone. @ShashiTharoor pic.twitter.com/STQe0yulxG — Farrago Abdullah (@abdullah_0mar) April 6, 2022 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఫర్రగో అబ్దుల్లా అనే వ్యక్తి తన ట్విట్టర్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట బీజీఎంతో శశిథరూర్ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. మరో నెటిజన్.. శశిథరూర్ అంటే ఫైర్ కాదు.. ఫ్లవర్ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. -
ట్రెండింగ్.. వార్ వేళ ఉక్రెయిన్ అమ్మాయికి భారతీయుడి ప్రపోజ్.. ఎక్కడో తెలుసా.?
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దండయాత్ర చేస్తున్నాయి. దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు తమ జన్మభూమిని వీడుతుండగా.. విదేశాలకు చెందిన వారు తమ స్వదేశాలకు తిరుగు పయణం అవుతున్నారు. ఎన్నో కష్టాలను ఓడ్చి యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్ నుంచి బయటపడుతున్నారు. కాగా, ఇప్పటికే యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఎన్నో జంటలు ఒకటయ్యాయి. బాంబుల దాడులు, కాల్పుల మోతల మధ్యే కొన్ని జంటలు పెళ్లిళ్లు చేసుకున్నాయి. ప్రేమ ముందు యుద్ధం కూడా చినబోగా.. భారత్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఉక్రెయిన్ అమ్మాయి, భారత్‌కు చెందిన అబ్బాయి ఒకటయ్యారు. తన ప్రేయసి భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే ఎయిర్‌పోర్టులో ప్రపోజ్ చేశాడు ఢిల్లీకి చెందిన హైకోర్టు న్యాయవాది అనుభవ్ భాసిన్. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కపుల్స్ లవ్ స్టోరీ హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌కు చెందిన అనుభవ్ భాసిన్, ఉక్రెయిన్‌కు చెందిన అన్నా హోరోడెట్స్కా ప్రేమించుకున్నారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని.. కొత్త జీవనం కొనసాగించాలనుకున్నారు. ఇంతతో ఊహించని యుద్దం కారణంగా మళ్లీ కలుస్తామో లేదో అన్న ఆందోళనలో ఆమె తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షితంగా భారత్‌లో అడుగుపెట్టింది. వీరి ప్రేమ గురించి అనుభవ్ భాసిన్ చెబుతూ.. ఉక్రెయిన్‌కు చెందిన అన్నా హోరోడెట్స్కా రెండున్నరేళ్ల క్రితం పరిచయమైంది. ఆమె ఓ ఐటీ కంపెనీ పనిచేస్తోంది. అయితే, అన్నా.. భారత్‌కు రాగా కరోనా కారణంగా 2020లో మొదటిసారి లాక్డౌన్ కారణంగా విమానాల రద్దుతో ఇండియాలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమె.. లాక్డౌన్ ముగిసే వరకు తన ఇంట్లోనే ఉందన్నాడు.తర్వాత వారు మళ్ళీ దుబాయ్‌లో కలుసుకున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించిదన్నాడు. ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చిందని.. తాను కూడా కీవ్‌కు వెళ్లినట్టు తెలిపాడు. అయితే, గతేడాది డిసెంబర్లో ఆమె ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నాడు. అనంతరం ఆమె తిరిగి ఉక్రెయిన్ వెళ్లిపోయింది. ఇంతలో యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్ను విడిచే క్రమంలో మూడు రోజులపాటు బాంబ్ షెల్టర్‌లో ఉన్నట్టు వివరించాడు. అనంతరం రైలు మార్గం ద్వారా, కాలినడకతో సరిహద్దును దాటింది. ఎన్నో కష్టాలతో పోలాండ్లోని క్రాకోవ్‌కు చేరుకున్నట్టు పేర్కొన్నాడు. అక్కడ తన స్నేహితులు ఆమెకు సాయం చేసిన్టటు చెప్పాడు. చివరగా ఆమె పోలాండ్లోని భారత రాయబారం కార్యాలయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాక.. వీసా రావడంతో ఆమె భారత్ చేరుకున్నట్టు తెలిపాడు. ఆమె భారత్‌కు వచ్చిన ఆనందంలో ఎయిర్‌పోర్టులోనే ప్రపోజ్ చేసినట్టు తెలిపాడు. కాగా, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం అన్నాకు ఏడాది గడువుతో వీసా ఉండగా.. ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు స్సష్టం చేశాడు. -
మురికి కాల్వలో దూకిన కౌన్సిలర్.. వెంటనే పాలాభిషేకం.. ఎందుకో తెలుసా..?
సాక్షి, న్యూఢిల్లీ: సింహాద్రి సినిమాలో సింగమలై అంటూ విలన్లను ఊచకోత కోస్తాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్టీఆర్‌కు పాలాభిషేకం చేస్తారు. ఇదే తరహాలో ఓ కౌన్సిలర్ చేసిన పనికి ప్రజలు ఫిదా అయిపోయి ఆయనకు పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా కౌన్సిలర్.. ఎందుకిలా చేశారు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలో మున్సిపల్ కార్మికులు మురికి కాలువను శుభ్రం చేయడంలేదని ఆ ప్రాంత కౌన్సిలర్‌కు వినతి పత్రాలు అందాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్.. శాస్త్రి పార్క్‌లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. అనంతరం కాలువలోని చెత్తను తొలగించారు. AAP councilor Haseeb-ul-Hasan jumps in drain during mission clean up, then milk bath much in the style of actor Anil Kapoor in the Bollywood blockbuster “Nayak”. Watch the #ViralVideo. (Video by @PankajJainClick) #AAP #Drain #MilkBath pic.twitter.com/bkBAi5PyEB — IndiaToday (@IndiaToday) March 22, 2022 ఈ సందర్భంగానే ఆ కాలువను అక్కడి అధికారులు శుభ్రం చేయడం లేదని.. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగానని హసీబ్ చెప్పడం గమనార్హం. కాలువలోని చెత్తను తొలగించిన అనంతరం ఆ ప్రాంతంలోని ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆయనను కూర్చోబెట్టి పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్ స్పందిస్తూ.. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతల స్టంట్లు మొదలయ్యాయంటూ కామెంట్స్ చేశాడు. -
మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కచ్చా బాదమ్ భుబన్.. వీడియో వైరల్
కచ్చా బాదమ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ కచ్చా బాదమ్ సాంగ్.. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఫేమస్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌తో నెటిజన్లు ఈ పాటను ఆస్వాదించారు. వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ సరదాకు పాడిన ఓ సాంగ్ తనను ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసింది. దీంతో భుబన్ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. కచ్చా బాదమ్ సాంగ్ తర్వాత భుబన్‌కు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఈ క్రేజ్‌లో అవతారమే పూర్తిగా మారిపోయింది. తాజాగా కోల్‌కతాలోని ఓ పోష్ క్లబ్లో అతగాడు రాక్‌స్టార్ అవతారంలో ప్రదర్శన కూడా ఇవ్వడం చూసి అందరూ షాకయ్యారు. ఈ క్రమంలో దక్కిన కొద్దిపాటి రెమ్యునరేషన్‌తో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. ఒక్కసారిగా అదృష్టం అడ్డం తిరిగింది. కారు నేర్చుకుంటున్న క్రమంలో అతడు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడికి ఛాతీలో బలమైన గాయమైంది. దీంతో ఆసుపత్రిలో చేరి చిక్సిత పొందాడు. అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి బయటకు రావడమే తరువాయి.. మరోపాటతో మళ్లీ సోషల్ మీడియాను తనవైపు తిప్పుకున్నారు. ‘నా కొత్త కారు’ అంటూ భుబన్ పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ‘కచ్చా బాదామ్’ భూబన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్‌స్టా రీల్స్‌తో కచ్చా బాదామ్ ఫేమస్ అయ్యింది. మొదట్లో సాంగ్ వైరల్ అయినప్పుడు.. తనకు క్రెడిట్ దక్కలేదని గోల చేసిన భూబన్, తీరా అది దక్కాక పూర్తిగా మారిపోయాడు. Kacha Badam Kaku new song after his accident ‼️💥#BhubanBadyakar#KachaBadam#BadamKaku pic.twitter.com/BOaAJhLRAq — I Love Siliguri (@ILoveSiliguri) March 5, 2022 -
ఇళ్లు అందంగా ఉండాలంటే.. నాలుగు రాళ్లు ఉన్నా చాలు!
ఇంట్లోకి ప్రకృతిని ఆహ్వానించాలంటే సహజత్వం ఉట్టిపడే అలంకరణ ఉండాలి. అందుకు రాతి కళ గొప్ప వేదిక అవుతుంది. పెద్ద రాతి నమూనాను గోడగా అమర్చినా, చిన్న చిన్న రాళ్లను ఫ్రేములుగా కట్టినా.. ఆ కళ వెంటనే చూపరులను ఆకట్టుకుంటుంది. సొంతింటి కల కోసం సంపాదనను సూచిస్తూ ‘నాలుగు రాళ్లు సంపాదించండి ’ అని హితులు సలహాలు ఇస్తుంటారు. అద్దెల్లు అయినా, సొంతిల్లు అయినా అలంకారంలో రాళ్లను రతనాలుగా మార్చేలా నవతరం వినూత్న ఆలోచనలు చేస్తోంది. గోడంత రాయి: లగ్జరీకి ప్రతిరూపం.. చూపు తిప్పుకోనివ్వని అందం వాల్ స్టోన్ది. పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల్లో అతి పెద్ద రాయిని గోడకు బదులుగా నిర్మించడంలో వారి అభిరుచి తెలిసిపోతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాల్ డిజైన్లలో కొన్నేళ్లుగా వాల్స్టోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకవేళ అంత పెద్ద స్టోన్‌ని అమర్చలేం అనుకున్నవారు కాంక్రీట్‌తో గోడ మొత్తం స్టోన్ లుక్‌తో మెరిపిస్తున్నారు. సహజత్వాన్ని ఇంటి అలంకరణలో భాగం చేయడానికి ఖరీదు అనేది పెద్ద పట్టింపుగా ఉండటం లేదు. గోరంత దీపం: గొడుగులా ఉండే టేబుల్ ల్యాంప్.. ఇంటికెంత అవసరమో మనకు తెలిసిందే. ఈ టేబుల్ ల్యాంప్ సహజత్వంతో వెలుగులు రువ్వాలంటే రాళ్లతో ఇలా సృష్టించుకోవచ్చు. ఆకర్షణ రాళ్లు: రాళ్లపై అక్షరాలు గార్డెన్‌లోనే కాదు లివింగ్ రూమ్‌లోనూ ఆకర్షణగా నిలుస్తాయి. రోజులో మనకు కావల్సిన సందేశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. కుటుంబ సభ్యుల పేర్లనూ రాసి అలంకరించుకోవచ్చు. టేబుల్ టాప్: నదీ తీరాలను సందర్శించే వారు కొందరు తమకు నచ్చిన రాళ్లను జ్ఞాపకంగా వెంట తెచ్చుకుంటారు. సెంట్రల్ టేబుల్ టాప్‌ను గ్లాస్ అమరికతో డిజైన్ చేయించుకోవాలనుకునేవారు ఇలా జ్ఞాపకాల రాళ్లను కూడా పొందిగ్గా వాడుకోవచ్చు. ప్లేట్ మ్యాట్స్: ఇప్పటి వరకు క్లాత్, జ్యూట్, ఫైబర్ వంటి ప్లేట్ మ్యాట్స్‌ను డైనింగ్ టేబుల్‌పైన అలంకరించి ఉంటారు. ఇప్పుడు ఈ స్టోన్ మ్యాట్స్‌ను ప్రయత్నించండి. మీ సృజనాత్మకతకు అతిథుల ప్రశంసలు తప్పక అందుతాయి. ఫొటో ఫ్రేమ్స్, స్టోన్ పెయింటింగ్, వాల్ డెకార్ హ్యాంగింగ్స్, ఫ్లవర్ పాట్స్.. ఇలా చిన్న చిన్న రాళ్లతో అందమైన కళాకృతులను ఆకర్షణీయంగా ఎవరికి వారు రూపొందించు కోవచ్చు. ఇందుకు కావల్సినవి కొన్ని రాళ్లు, మరికొంత గమ్. ఇంకొన్ని రంగులు. ఆర్ట్ మీ చేతిలో ఉంటే చక్కటి రాళ్లు మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. -
కొన్న రేటు రూ. 500.. అమ్మింది ఏమో రూ. 16 లక్షలకు!!!
Wooden Chair Bought From Junk Shop Brings Luck For UK Lady: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. ‘టకాటకా’మని బాదినప్పుడే తలుపు తీయాలి. ఓ మహిళ అలా చేసింది కాబట్టే ఇంట కాసుల వర్షం కురిసింది. జంక్ షాపులో కొన్న ఓ పాత కుర్చీ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎలాగో ఇది చదవండి.. ఈస్ట్ సస్సెక్స్(యూకే) బ్రిగ్టన్కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఆమధ్య ఓ కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు(మన కరెన్సీలో 500రూ. దాకా). అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. పాత సామాన్లపై ఆసక్తి ఉన్న ఓ దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద వేసిన డేట్ చూశాడు. స్టడీ చేసి దాని గొప్పతనం గురించి చెప్పడంతో ఆమె దానిని వేలంపాటకు తీసుకెళ్లింది. వేలంలో ఆమెకు 16, 250 పౌండ్లు వచ్చాయి. మన కరెన్సీలో దాని విలువ రూ. 16 లక్షల 40 వేల రూపాయలకు పైనే. ఆ కుర్చీ 20వ శతాబ్దంలో వియన్నా(ఆస్ట్రియా) ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కి చెందిందట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడట. కోలోమన్ సంప్రదాయ శైలిలను వ్యతిరేకిస్తూ.. మోడ్రన్ ఆర్ట్ వర్క్ ద్వారా ఆస్ట్రియాలో పేరు సంపాదించుకున్నారు. నిచ్చెన తరహా స్టైల్లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీనీ రూపొందించారాయన. ఇదంతా తెలిశాక ఆ మహిళ ఆ పాత కుర్చీతో ఎస్సెక్స్‌లోని స్వోడర్స్ యాక్షనీర్స్ ఆఫ్ మౌంట్ఫిట్చెట్ వాళ్లను సంప్రదించింది. వాళ్లు దానిని వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 పౌండ్లు చెల్లించి దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే.. 120 ఏళ్లు గడుస్తున్నా కుర్చీ ఇంకా ఒరిజినల్ కండిషన్లోనే ఉండడం. చదవండి: వాసి వాడి తస్సాదియ్యా! 23 ఏళ్లకే 400 కోట్ల సంపాదన! -
బోట్లకు నిప్పు అంటించిన ఘటనలో రోడ్డెక్కిన వివాదం
Fight Between Two Groups Of Fishermen In Jalaripeta ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మత్స్యకారుల మధ్య రాజుకున్న వివాదం బుధవారం మరోసారి రొడ్కెక్కింది. రింగు వలలతో వేట నేపథ్యంలో తీరంలోని మత్స్యకార గ్రామాల మధ్య మంగళవారం చిచ్చురేగిన విషయం తెలిసిందే. వాసవానిపాలెం, జాలరి ఎండాడ, మంగమారిపేటకు చెందిన కొందరు జాలర్లు రింగు వలలతో మంగళవారం వేటకు వెళ్లగా పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు అడ్డుకోవడంతో ఈ వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా పెదజాలరిపేటకు చెందిన 8 మందికి గాయాలుకాగా వాసవానిపాలెం, మంగమారిపేటకు చెందిన 6 బోట్లు దహనమయ్యాయి. అయితే బోట్లకు నిప్పు అంటించిన ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను మెరైన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ జాలరిపేటలో వాతావరణం వేడెక్కింది. జాలరిపేటలోని మత్స్యకారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాలరిపేటను ఆనుకొని ఉన్న ఆర్టీసీ కూడలికి భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. మహిళలు, యువతతో సహా వేల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టయిన మత్స్యకారులను విడుదల చేయాలంటూ వారంతా కొద్దిసేపు నిరసన గళం వినిపించారు. ఈ సందర్భంగా తెడ్డిరాజు, పరసన్న వంటి పలువురు మత్స్యకార సంఘ నాయకులు మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేసిన మత్స్యకారులను తక్షణమే విడుదల చేయాలని హెచ్చరించారు. గంటలో విడుదల చేయకుంటే బీభత్సం సృష్టిస్తామని తెడ్డి రాజు బహిరంగంగా హెచ్చరించడం, కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ర్యాలీ తీసేందుకు కొందరు మత్స్యకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని నిలువరించారు. పెదవాల్తేర్ ఆర్టీసీ డిపో కూడలి వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం మంత్రుల సదస్సుకు గైర్హాజరు రింగు వలల వివాదంపై ఇప్పటికే పలు అవగాహన సదస్సులు, సమావేశాలు మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే తాజా వివాదంతో బుధవారం మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు సమక్షంలో మరోసారి సమావేశం నిర్వహించేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఇరువర్గాల మత్స్యకార గ్రామాల పెద్దలు కలెక్టర్ ఆధ్వర్యంలో సర్క్యూట్ హౌస్‌లో నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సివుంది. అయితే ఇంతలో జాలరిపేట మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో సమావేశం నిలిచిపోయింది. పూచీకత్తుతో నిందితుల విడుదల ఈ ఘర్షణల్లో భాగంగా మంగళవారం 6 బోట్లు దహనం చేసిన విషయం తెసిందే. ఈ ఘటనకు సంబంధించి మెరైన్ పోలీసులు పిల్లా నూకన్న, వాడమదుల సత్యారావును అరెస్ట్ చేశారు. అయితే జాలరిపేట మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని విడిచిపెడుతున్నట్లు ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. మెరైన్ పోలీసులు వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు 41 నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతోపాటు పూచీకత్తులు రాయించుకొని విడిచిపెడుతున్నట్లు వెల్లడించారు. దీంతో రాత్రి 8గంటల సమయంలో నూకన్న, సత్యారావు విడుదలై నిరసన శిబిరానికి చేరుకోవడంతో ఆందోళన ముగిసింది. అయితే తీర ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు అధికారులు వెల్లడించారు. హైకోర్టు ఉత్వర్వుల అమలుకు డిమాండ్ జిల్లాలో ఎంఎఫ్ఆర్ చట్టం – 1995 ప్రకారం రింగు వలలతో చేపల వేటపై వెంటనే నిషేధం అమలు చేయాలని పెదజాలారిపేట గ్రామ సేవా సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం పెదజాలరిపేట దరి కురుపాం సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ కుల పెద్ద తెడ్డు పరసన్న మాట్లాడుతూ కొత్తగా రింగు వలలకు అనుమతులు ఇవ్వరాదని కోరారు. తాము గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే సముద్రంలో 8 కిలో మీటర్లలోపు రింగు వలలతో వేట నిషేధం అమలు చేయాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. కోర్టు ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని తాము ఇప్పటికే రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, ఆ శాఖ కమిషనర్‌ను కోరామని గుర్తు చేశారు. అయినప్పటికీ రింగువలలతో వేట చేయవద్దని చెప్పినందున తమ గ్రామ మత్స్యకారులపై మంగళవారం దాడి చేసి గాయపరచడం అన్యాయమన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేని మత్స్యశాఖ అధికారులు తమను గంగవరం నుంచి పెదనాగమయ్యపాలెం బీచ్ వరకు చేపలవేట చేయరాదని నిబంధనలు విధించడం విడ్డూరంగా వుందని విమర్శించారు. కార్యక్రమంలో తెడ్డు రాజు, తెడ్డు సత్తయ్య, ఒలిశెట్టి గురయ్య, తెడ్డు సతీష్ పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంవీపీ స్టేషన్ సీఐ రమణయ్య పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. చదవండి: దంత కళాశాలలో కీచక వైద్యుల లీలలు! -
చిచ్చర పిడుగు! ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టేందుకు కొత్త ఎత్తులు..
పరీక్షల టైంలో విద్యార్ధులు కాపీ కొట్టకుండా టీచర్లు వెయ్యి కళ్లతో కాపేసుంటారు. ఐనా! కొందరుంటారులే.. అబ్బో కాపీ కొట్టడానికి మామూలు తెలివితేటాలు చూపించరు. ఇలా కూడా కాపీ కొడతారా అనే రేంజిలో ఉంటాయి మరి పథకాలు. అసలే కరోనా కాలంలో అంతంత మాత్రపు అత్తెసురు చదువులతో ఊగిసలాడుతుంటే, కొంతమంది విద్యార్ధులు ఎలాగోల పాస్ అయితే చాలు దేవుడా అన్నట్లు పరిస్థితులను తమకనుగునంగా ఎలా మార్చుకుంటున్నారో ఈ వీడియోపై జస్ట్ ఓ శాంపిల్ లుక్కెయ్యండి. క్లాస్ రూంలో మాస్కులు ధరించి ఎగ్జాం రాస్తున్న విద్యార్ధులు ఈ వీడియోలో కనిపిస్తారు. వీళ్లలో ఓ విద్యార్ధి మాస్కులోపల స్లిప్ పెట్టి దానిని చూసి పరీక్ష రాయడం కనిపిస్తుంది. ఐతే వెనుక కూర్చున్న విద్యార్ధి ఆశ్చర్యంతో నవ్వడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతుంది. కపీ ఇలా కూడా జరుగుతుందని ఎవరూహించరని ఒకరు, కరోనా విపత్తును అవకాశంగా మార్చుకున్నాడని మరొకరు ఇలా నెటిజన్లు సరదాగా వేల కామెంట్లు చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు అది అంత మంచి మార్గం కాదనేది మనందరికీ తెలిసిందే! ఏదిఏమైనా కష్టపడేవారి కోసమే రాజమార్గాలు తెరచుకుంటాయనేది నిత్యసత్యం. మీరేమంటారు...? చదవండి: Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు! View this post on Instagram A post shared by memes | news | comedy (@ghantaa) -
అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్‌లో..
ఆన్లైన్ షాపింగ్ చేసి ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేస్తే, వాటి స్థానంలో సబ్బులు, ఇటుక రాళ్లు తెచ్చి చేతుల్లో పెట్టడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు పరిపాటైపోయాయి. తాజాగా యూకేకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి చేదులనుభవమే ఎదురైంది. సదరు వ్యక్తి ఆన్లైన్లో ఐ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ఐతే ఫోన్‌కు బదులుగా 2 వైట్ కలర్ ఓరియో క్యాడ్బరీ చాక్లెట్లు ఆర్డర్ ప్యాక్‌లో ఉండటంతో చూసి లబోదిబోమన్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన డానియెల్ కారోల్ దాదాపు రూ. 1,05, 000 లక్షల విలువైన ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రావల్సిన తేదీకి రెండు వారాలు ఆలస్యంగా డెలివరీ అందింది. దానిని ఓపెన్ చేసిన డానియెల్ లోపల ఐ ఫోన్ లేకపోవడంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. దాని స్థానంలో వైట్ టాయిలెట్ పేపర్ రోల్‌తో చుట్టిన 120 గ్రాముల వైట్ ఓరియో చాక్లెట్లు ఉన్నాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో డానియెల్ ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. పార్సిల్ తాలూకు ఫొటోలు కూడా షేర్ చేశాడు. డిసెంబర్ 2న యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఆర్డర్ చేశానని, డిసెంబర్ 17న డెలివరీ అందాల్సి ఉండగా అలా జరగలేదని ట్విటర్లో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన డీహెచ్ఎల్ డెలివరీ సర్వీస్‌ను సంప్రదించి రిప్లేస్ చేయవల్సిందిగా కోరింది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ Hi Daniel if your are having an issue with your delivery please do DM us with your shipment number and full address so we can check out what has happened. Thanks, Helen https://t.co/HfmWwImQTE — DHLParcelUK (@DHLParcelUK) December 21, 2021 -
‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి'
ఈ జిందగీలో ఎన్నో హృదయవిదారక సంఘటనలు, మనసును మెలితిప్పే ఉదంతాలు రోజూ ఎన్నెన్నో చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పేదరికం, హింస ప్రస్తుత సమాజంలో తారాస్థాయికి చేరుతుంది. పేదరికమే హింసకు కారణమౌతుందనేది అనేకమంది వాదన. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే లోపాల కారణంగా కొన్ని సందర్భాల్లో వారే నేరస్తులౌతున్నారు. ఐతే ప్రస్తుతం కొన్ని రకాల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పిల్లలకు సహాయం చేయడం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అటువంటి ఓ బాలుడికి సంబంధించిన ఓ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బాలుడి కథ వింటే మీ కళ్లు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి. వయొలిన్ వాయిస్తున్న ఇద్దరుముగ్గరు పిల్లలు కనిపించే ఈ ఫొటో వెనుక కథ ఏంటంటే... వీరిలో ఏడుస్తూ కనిపిస్తున్న పిల్లవాడు బ్రెజిల్‌కు చెందిన వాడు. మృతిచెందిన తమ టీచర్ అంత్యక్రియల్లో వయొలిన్ వాయిస్తున్నాడు. అవ్నీష్ షరన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విటర్లో హృదయాన్ని మెలిపెట్టేలా ఏడుస్తూ వయొలిన్ వాయిస్తున్న బాలుడి ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు అతని కన్నీళ్లకు కారణం కూడా తెలుపుతూ.. నేర జీవితం నుంచి బయటకు తెచ్చిన గురువు అంత్యక్రియల్లో వయొలిన్ వాయిస్తూ ఏడుస్తున్న బ్రెజిలియన్ బాలుడు (డీగో ఫ్రాజో టర్కటో) అనే క్యప్షన్‌తో షేర్ చేశాడు. ఈ ఫొటోలో మానవత్వం ప్రపంచంలోనే గట్టిగొంతుకతో మాట్లాడుతోందని కూడా రాశాడు. ఐతే అనతికాలంలో ఈ బాలుడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాల్లో వైరలయ్యింది. అనేక మంది తమ ఉన్నతమైన అభిప్రాయాలను తెలుపుతూ ఈ ఫొటోకు కామెంట్ల రూపంలో పంపుతున్నారు కూడా. వాళ్లలో ఒకరు ‘మరణించిన తన ఉపాధ్యాయుడి అంత్యక్రియల్లో బ్రెజిల్ చైల్డ్‌కు చెందిన ఈ చిత్రం మన జీవితాల్లో అత్యంత భావోద్వేగ చిత్రాల్లో ఒకట'ని అభివర్ణించారు. మరొకరేమో ‘నిజానికి ఈ భూప్రపంచంలో కేవలం టీచర్లు మాత్రమే మానవత్వాన్ని కాపాడే సామర్ధ్యం కలిగినవారని, తన హృదయం పూర్తిగా బద్ధలైనట్లు అతని కళ్లు చెబుతున్నాయ'ని ఇంకొకరు కామెంట్ చేశారు. చదవండి: ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం! This photo was taken of a Brazilian boy (Diego Frazzo Turkato),playing the violin at the funeral of his teacher who rescued him from the environment of poverty and crime in which he lived. In this image,humanity speaks with the strongest voice in the world. Pic: Marcos Tristao pic.twitter.com/MkWUd5DcBE — Awanish Sharan (@AwanishSharan) December 19, 2021 -
కడుగు.. కడుగు!! బాగా కడుగు.. ఈ దెబ్బతో కారు తళ తళ మెరిసిపోవాలి!
సొంత పనులు చేసుకోవడానికి కూడా తెగ బద్దకిస్తుంటారు కొంతమంది. ఐతే ఈ వీడియోలో కనిపించే చింపాంజీలు మాత్రం ఒళ్లొంచి ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఎవరప్పగించారోగానీ కారును నీళ్లతో శుభ్రంగా కడిగేస్తున్నాయి. జంతువులను చూసి పనులు ఎలా శ్రద్ధగా చేయాలో నేర్చుకోవాలనే విధంగా ఉంది వీటి పనితనం. మీరు ఓ లుక్కెయ్యండి! రెండు చింపాంజీలు బ్లాక్ కారుపై ఎక్కి కూర్చుని మరీ గ్లాస్‌ను నీట్‌గా రుద్ది రుద్ది కడగటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎంతో ప్రొఫెషనల్ క్లీనర్స్లా చేతితో క్లాత్ పట్టుకుని దర్జాగా కారును శుభ్రం చేస్తున్నాయి. ఇంతవరకూ మనుషులు మాత్రమే కార్లను క్లీన్ చేయడం చూశారు. ఇలా చింపాంజీలు కారును శుభ్రంచేయడం ఎప్పుడైనా చూశారా? ఐతే చింపాజీలు మనుషులను అనుకరించగలిగే తెలివైన జంతువులనే విషయం మనందరికీ తెలుసు! పిల్లలతో ఆటలాడే, మనుషులు ఉతికినట్టే బట్టలుతికే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పలుమార్లు వైరలయ్యాయి. ఇప్పుడు కారు కడిగే చింపాజీల వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లక్షల వీక్షణలు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఫ్రీ కార్ వాషింగ్ అని, ఇంటిలో అత్యంత ప్రమాదకరమైన జంతువని కొంతమంది సరదాగా ఈ వీడియోకు కామెంట్లు జోడించారు. మీరేమంటారు.. చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో.. View this post on Instagram A post shared by Wilds Planet (@wildsplanet) -
హామ్స్టెక్ కొత్త డిజైన్లు.. ఎంబ్రాయిడరీ వర్క్ కాంబినేషన్లో..
పున్నమి వెన్నెల వెలుగు పాల నురగలా ఉంటుంది. ఆకాశం నీలంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్‌కి తారల కాంతుల ఎంబ్రాయిడరీ జతగా చేరితే చూడచక్కని కళ కళ్లకు కడుతుంది. అది సల్వార్ సెట్ అయినా.. పలాజో కట్ అయినా చీరకట్టు అయినా టాప్ టు బాటమ్ వెలుగులు విరజిమ్ముతాయి. కరోనా కాలంనుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. సృజనాత్మకత కొత్తగా ముస్తాబు అవుతోంది. ప్లెయిన్ కాటన్, సిల్క్, క్రేప్.. క్లాత్‌ను అధునాతనమైన డిజైన్లతో మెరిపించవచ్చని చూపుతున్నారు నవ డిజైనర్లు. ఎంబ్రాయిడరీ, అప్లిక్, మిర్రర్ వర్క్, మోటిఫ్స్, క్లే అండ్ వాల్ ఆర్ట్, పెయింటింగ్.. ఈ అన్నింటి కాంబినేషన్‌తో హామ్స్టెక్ నవ డిజైనర్ల చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. భారతీయ సంస్కృతి, శాస్త్రీయ నృత్య రూపాలు, స్థానిక తెగల జీవనం, శిల్పాలు, దేవాలయాల నిర్మాణం.. ఇవన్నీ అంతర్లీనంగా దుస్తులపై కనిపిస్తే ఎలా ఉంటాయో ఈ డిజైన్స్‌లో తీర్చిదిద్దారు. చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! -
ట్రెండింగ్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్, మార్మోగుతున్న శ్రీరామ్ పేరు
Bigg Boss 5 Telugu, Pride Of BB5 Sreeram Trending In Twitter:బిగ్‌బాస్ షోలో మిస్టర్ కూల్ ఎవరు అనగానే రెండు పేర్లు వినిపిస్తాయి. ఒకటి మానస్, మరొకటి శ్రీరామచంద్ర. ఏదైనా గొడవ జరిగినప్పుడు మానస్ ముఖం కోపంతో ఎర్రబడుతుంది కానీ శ్రీరామ్ ఫేస్‌లో మాత్రం స్మైలే కనిపిస్తుంది. టాస్క్ అయినా, గొడవైనా, మరేదైనా సరే తన ముఖం మీద చిరునవ్వు చెదరనీయడీ సింగర్. తనకు బిగ్‌బాస్ ట్రోఫీ, ప్రైజ్‌మనీ కన్నా తెలుగు ప్రేక్షకులకు చేరువవ్వడమే ముఖ్యమని చెప్పిన వ్యక్తి ఈయన. ఈ సీజన్లో టాప్ 5కి చేరుకునేవారిలో శ్రీరామ్ తప్పకుండా ఉంటాడని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్తున్నారు. టైటిల్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే గెలిచే అవకాశాలు కాదు, గెలవడం పక్కా అంటున్నారు ఆయన అభిమానులు. తాజాగా శ్రీరామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి #PrideOfBB5Sreeram అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట రచ్చ చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌కు శ్రీరామ్ కింగ్ అంటూ అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేవలం 24 గంటల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌తో లక్షకు పైగా ట్వీట్లు చేయడం విశేషం. మొన్నటివరకు ఓ రేంజ్లో ఆడి రెచ్చిపోయిన శ్రీరామ్ ఈమధ్య కాస్త డల్ అయ్యాడు. హమీదా వెళ్లిపోయినప్పటి నుంచి అతడి స్క్రీన్ స్పేస్ బాగా తగ్గిపోయింది. అయితే అతడు వీలైనంత త్వరగా మామూలైపోయి ఎప్పటిలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. 'తిరిగి ఫామ్‌లోకి రావడానికి కొంచెం లేట్ అవుతుందేమో కానీ విన్ అవ్వడం మాత్రం పక్కా, రాసిపెట్టుకోండి', 'అతడు హౌస్‌లో ఒంటరివాడయ్యాడేమో కానీ బయటకు వచ్చాక మాత్రం కాదు' అంటూ పంచ్ డైలాగులు విసురుతున్నారు. వీరికి తోడుగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా శ్రీరామ్‌కు అండగా నిలబడ్డ విషయం తెలిసిందే. Like a Cakewalk 💥💥💥#PrideOfBB5Sreeram#SreeramaChandra#SRC pic.twitter.com/Oz3vayOvav — Sreeram Trends (@SreeramTrends) October 24, 2021 Some of the major Achievements of @Sreeram_singer#PrideOfBB5Sreeram#SreeramaChandra#SRC pic.twitter.com/3YGcDDgyKP — Sreeram Trends (@SreeramTrends) October 24, 2021 Transformation of our #PrideOfBB5Sreeram#SreeramaChandra#SRC pic.twitter.com/HcgIrMwQVF — Sreeram Trends (@SreeramTrends) October 24, 2021 -
#trending: బీరువాలో ఇలాంటి దృశ్యం చూశారా..?!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పలు కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఫార్మ కంపెనీలో జరిపిన సోదాలో ఐటీ అధికారులు 142.87కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కంపెనీకి సంబంధించి మొత్తం 16 బ్యాంకు లాకర్లతో పాటు.. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్ల రూపాయల ఆదాయం గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉందంటే బీరువా. బట్టలు పెట్టుకునే బీరువా ఫోటో వైరల్ కావడం ఏంటంటే.. మనలాంటి సామాన్యులు బీరువాలో బట్టలు పెడతారు.. కానీ సదరు ఫార్మా కంపెనీ బీరువాను డబ్బు కట్టలతో నింపింది. ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా డబ్బు కట్టలను బీరువా నిండ పేర్చింది. (చదవండి: Hyderabad: ప్రముఖ ఫార్మా కంపెనీలో సోదాలు.. రూ.142 కోట్లు సీజ్) ఈ ఫోటో చూసిన నెటిజనులు వార్నీ మా బీరువాలో బట్టలు సర్దిని తరువాత కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది.. ఇదేందిరా నాయనా ఇన్ని డబ్బు కట్టలు.. అబ్బ ఒక్క కట్ట నాకు దొరికితే లైఫ్ సెటిల్ అవుతుంది.. నోట్ల రద్దు ఫలించలేదు.. నోట్ల రంగు ఆకారం మారింది అంతే.. అరే 2000 రూపాయల నోట్లు వాడి ఉంటే.. 75 శాతం జాగా మిగిలేది.. మరిన్ని డబ్బులు దాచుకోవడానికి అవకాశం ఉండేది అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు. చదవండి: శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్ -
సోషల్ మీడియా ట్రెండిగ్‌లో #ReleaseAryanKhan
ముంబైలో క్రూయిజ్ షిప్లో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఏడుగురు అరస్టయిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం కస్టడీని 14 రోజులకు పొడిగించిన ముంబై కోర్టు, ఈ కేసును స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టుకి అప్పగించింది. దీంతో శుక్రవారం మరోసారి అతని బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది సోషల్ మీడియాలో ఆర్యన్‌కి మద్దతు తెలుపుతున్నారు. ఈ కేసు విషయమై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు షారుక్ ఫ్యామిలీకి సపోర్టుగా నిలిచారు. కాగా అతని దగ్గర డ్రగ్స్ దొరకలేదు. అతను డ్రగ్స్ తీసుకోలేదు అయినా ఇప్పటికీ జైలులో ఉంచడం కరెక్ట కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్లో #ReleaseAryanKhan ట్రేండింగ్లోకి వచ్చింది. కొన్ని ట్విట్స్ ఈ యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి. చదవండి: నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నా: ఆర్యన్ #ReleaseAryanKhan RELEASE ARYAN KHAN Rt if you are loved @iamsrk Fast Rt 500 Rt in 15 min Top 1 trends pic.twitter.com/uYXt3UYwT2 — Ayan khan (@AyanKha30668226) October 7, 2021 #ReleaseAryanKhan RELEASE ARYAN KHAN India stand @iamsrk Rt agree pic.twitter.com/Uldq4So571 — Ayan khan (@AyanKha30668226) October 7, 2021 No consumption , no Possession STILL in custody . We demand release of ARYAN Khan as soon as possible . what were these 2 BJP workers were doing with NCB , and holding accused " ARYAN KHAN WAS FRAMED #ReleaseAryanKhan — ♛Aȥαԃ♛ (@AagKaDevta) October 7, 2021 -
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రభాస్ 25వ చిత్రం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతి నిండా ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. ‘సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్’తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి కాగా.. ‘సలార్’ చివరి షూటింగ్‌లు షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. మరోవైపు ఆది పురుష్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రభాస్ 25వ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అక్టోబర్ 7న రానున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ #ప్రభాస్ 25 (#Prabhas25) ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. అంతేగాక ఈ హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో ఏకంగా టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నాడట. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాగే ప్రుభాస్ 25 చిత్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ 25వ చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నారు. బాహుబలితో ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్ చేసిన రాజమౌళియే ప్రభాస్ 25వ చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా విశేషం అంటూ ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజమందో తెలియాలంటే అక్టోబర్ 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. -
MPTC Ashwini Trending: బాబు చుట్టూ.. ‘23’
కుప్పం: కుప్పం రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల చంద్రబాబు ఏకఛత్రాధిపత్యానికి 23 ఏళ్ల అశ్వని బ్రేక్ వేశారు. కుప్పం మండలం మల్లానూరుకు చెందిన అశ్వని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా 1,073 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె పోటీ చేసిన మల్లానూరు–2 సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థికి కేవలం 70 ఓట్లే వచ్చాయి. 4 దశాబ్దాలుగా కుప్పం ఎంపీపీగా చంద్రబాబు మద్దతుదారులే చక్రం తిప్పగా, ఈ సారి ఎంపీపీ అభ్యర్థి రేసులో నిలిచి.. బాబు కోటను బద్ధలు కొట్టారు. పీజీ చదివిన అశ్వని మొదటి నుంచీ వైఎస్సార్ కుటుంబానికి అభిమాని. ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చిన వైఎస్ జగన్‌కు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. -
‘ప్లాన్ బి’ ట్రైలర్‌కి 1 మిలియన్ వ్యూస్
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ప్లాన్ బి'. కేవీ రాజమహి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందించాడు. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఏవీఆర్ నిర్మిస్తున్నాడు. డింపుల్ హీరోయిన్. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘1 మిలియన్ వ్యూస్‌తో మా మూవీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా ఉంది. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరిని థ్రిల్ కి గురిచేయడం ఖాయం’ అని చిత్ర దర్శక నిర్మాతలు అన్నారు. కాగా ఈ టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
వినాయకుడి గెటప్లోని ఈ నటుడెవరో మీకు తెలుసా?
Sri Vinayaka Vijayam Movie: కొన్ని సినిమాలు ఎప్పటికీ వన్నెతరగవు. అందుకే బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రజెంట్ చేసినా వ్యూయర్స్ ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పండుగల లాంటి టైంలో వీటి ప్రత్యేకత ఏంటో జనాలకు తెలిసి వస్తుంది కూడా. అలాంటి సినిమాల్లో ‘శ్రీ వినాయక విజయం’ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది మళ్లీ టెలికాస్ట్ ప్రొమో రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పూర్తి స్థాయిలో గణేషుడి కథను చూపిస్తూ తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘శ్రీ వినాయక విజయం’(1979). ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వినాయకుని జన్మ వృత్తాంతం చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ‘ఎవరవయ్యా.. ఎవరవయ్యా’ అంటూ సాగే గానం.. దేవులపల్లి రచన, సాలూరి స్వరాలు, సుశీలమ్మ పాడిన పాట ఇప్పటికీ పండపూట టీవీల్లో మారుమోగుతుంటుంది. అయితే ఆ వినాయకుడి గెటప్‌లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరంటూ? గూగుల్‌ను ఆశ్రయించడంతో సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. శ్రీ వినాయక విజయం చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో బాల గణేషుడిగా కనిపించింది బేబీ లక్ష్మి సుధా. ఆ తర్వాత ఏనుగు తల గెటప్‌తోనూ కాసేపు ఈ చిన్నారి అలరించింది. ఇక పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో నటించింది ఎంజీవీ మదన్‌గోపాల్ అనే ఆర్టిస్ట్. ఈయన గురించి పూర్తి సమాచారం, ఫొటో గురించి .. వెతకాలని ప్రయత్నిస్తున్నారు చాలామంది. కానీ, ఎలాంటి సమాచారం దొరకడం లేదు. అలా చాలా మంది వెతకడం వల్ల వినాయక విజయం మూవీ గూగుల్ ద్వారా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. చదవండి: ‘తండ్రి ఎవరు?’.. ఫైర్ అయిన హీరోయిన్ -
బుల్లెట్ బండికి బామ్మ స్టెప్పులు.. వామ్మో ఏ చేసింది రా బాబు !
-
బుల్లెట్ బండికి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో
సోషల్‌మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అలా ఏదైనా ఓసారి నెటిజన్లను ఆకట్టుకుంటే అవి వైరల్‌గా మారి నెట్టింట రచ్చ చేస్తుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే వాటి హవా కొంత కాలం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ‘బుల్లెట్ బండి’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజలే గాక సెలబ్రిటీల సైతం ఈ పాటకి చిందేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ తన భర్త ముందు ‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం.. శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్ బండి’ పాట ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్ వినిపిస్తోంది. దీంతో ఈ పాటకు ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లోనూ అంతకంతకు క్రేజ్ పెరుగుతోంది. అయితే ఓవైపు ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీయువకులు అలరిస్తుంటే మరోవైపు తాను కూడా తక్కువకాదంటూ ఓ వృద్ధురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ వీడియోలో.. దాదాపు 60 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ .. ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి అద్భుతమైన స్టెప్పులేసింది. తన భర్త మంచంపై కూర్చొని చూస్తుండగా.. సరిగ్గా సాంగ్‌లో రిథమ్‌కి తగ్గట్టు ఆమె డాన్స్ చేసింది. అయితే అతను మాత్రం కదలకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు, బహుశా షాక్‌లో ఉన్నాడేమో! ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్ సూపర్ బామ్మ అంటున్నారు. కొందరు ఫన్నీగా ఉందని కామెంట్ పెడుతుంటే.. మరికొందరు ‘బామ్మ నువ్వు గ్రేట్’ అని కామెంట్ పెడుతున్నారు. చదవండి: Cat Drink Pig Milk: పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘మాణికే మాగే హితే’, ఎవరీ అమ్మాయి
ఈ మధ్య తెలుగులో బుల్లెట్ బండి పాట ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఎక్కడా చూసిన, బయట ఎక్కడికి వెళ్లిన ఈ పాటే వినిపిస్తోంది. ఇక ఈ పాటకు డ్యాన్స్ చేసిన నవ వధువు ఏకంగా ‘బుల్లెట్ బండి వధువు’గా మారిపోయింది. ఇదిలా ఉంగగా బుల్లెట్ బండి పాట లాగే మరో పాట కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ రీల్ చూసిన ఈ పాటే దర్శనం ఇస్తోంది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పాట ఎంటా? అనుకుంటున్నారా!. అదేనండి ‘మాణికే మాగే హితే’ అనే తమిళ పాట. దీనికి అర్థం తెలియకపోయిన మన తెలుగు వాళ్లు సైతం ఈ పాటకు, సింగర్‌కు ఫిదా అయిపోయారు. అంతలా ఈ లిరిక్స్, ట్యూన్‌తో సింగిత ప్రియులను కట్టిపడేసి ఈ పాట బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ను సైతం ఆకట్టుకుంది. చదవండి: బిగ్‌బాస్ 5: అడ్డంగా బుక్కైన లోబో..ఆడేసుకుంటున్న నెటిజన్లు తాజాగా ఆయన సోషల్ మీడియా వేదిక ఈ పాట యూట్యూబ్‌ను లింక్‌ను షేర్ చేస్తూ ఈ పాటకు తనని ఎంతగా మంత్రముగ్ధున్ని చేసిందో వివరించారు. దీని లిరిక్స్ అర్థం కాకపోయిన తన మనసుకు ఈ పాట చెప్పలేని అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ పాట తెలుగు, హిందీ, కన్నడ, బెంగాళితో పాటు పలు భాషల్లో కూడా డబ్ అయ్యింది. అయినప్పటికి మలయాళంలోనే ఈ పాట ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. మన తెలుగు వారు సైతం దీనికి ఇన్‌స్టా రిల్స్ చేస్తున్నారు. దీంతో ఈ పాటను అంత మధురంగా ఆలపించినా ఈ సింగర్ ఎవరా అని, ఆమె పేరు ఎంటని నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ట్రెండింగ్‌గా మారింది. మరి మీరు కూడా ఆ గాయనీ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఓ లుక్కేయండి. చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే! ఇంతకి ఎవరీ ‘మాణికే మాగే హితే’ యొహాని డి సిల్వా: మాణికే మాగే హితే పాటను పాడింది శ్రీలంకలోని కొలొంబోకు చెందిన ఓ పాప్ సింగర్. ఆమె పేరు యొహాని డి సిల్వా. తను పాప్ సింగర్ మాత్రమే కాదు గేయ రచయిత, నిర్మాత, బిజినెస్ ఉమెన్ కూడా. తొలుత యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె ‘దేవియంగే బారే’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వేదికగా ఎన్నో పాప్ పాటలు విడుదల చేసి అందరి మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే ఆమెను ‘రాప్ ప్రిన్సెస్’ అనే బిరుదు కూడా వరించింది. తన పాటలతో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న యొహాని 2021 మే నెలలో మాణికే మాగే హితే పాటను ఆలపించి యూట్యూబ్ ఛానల్లో వదిలింది. చదవండి: Akshay Kumar: అక్షయ్ కుమార్ తల్లికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స అంతే ఈ పాటతో ఆమె ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందలా తనకు గుర్తింపు తెచ్చిన ఈ పాట యూట్యూబ్‌లో 8 కోట్లకు పైగా వీక్షణలను సంపాదించుకుంది. కాగా యొహాని తండ్రి మాజీ ఆర్మి అధికారి కాగా తల్లి ఎయిర్‌హోస్టెస్ అట. కూతురికి సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించి ఆమె తల్లి ప్రోత్సాహం అందించారని ఆమె ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా యొహాని డిసెల్వా గురించి తెలిసి చిన్న వయసులోనే బిబినెస్ ఉమెన్‌గా, గేయ రచయితగా, నిర్మాతగా ఎదగడం నిజంగా గొప్ప విషయం అంటూ నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. -
విరాట్ కోహ్లి కెరీర్‌కు 13 ఏళ్లు.. వింతలు, విశేషాలు
Virat Kohli.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నేటితో 13 ఏళ్లు. ఈ 13 ఏళ్లలో విరాట్ కోహ్లి సాధించిన ఘనతలు లెక్కలేనన్ని. విరాట్ కోహ్లి 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే తొలి వన్డేలో 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచిన కోహ్లి 14 మ్యాచ్‌ల తర్వాత తొలి శతకాన్ని సాధించాడు. అప్పటినుంచి సాగుతున్న పరుగుల ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే కోహ్లికి ''మిషన్ గన్'' అని ముద్దుపేరు కూడా ఉంది. టీమిండియా తరపున 254 వన్డేల్లో 12,169 పరుగులు.. 94 టెస్టుల్లో 7,609 పరుగులు.. 90 టీ20ల్లో 3,159 పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లో 43 సెంచరీలు.. టెస్టుల్లో 27 సెంచరీలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలకు( వన్డే, టెస్టు, టీ20) కెప్టెన్‌గా కొనసాగుతున్న కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ 13 ముఖ్య విషయాలు తెలుసుకుందాం. ►2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. ►2012లో 23 ఏళ్ల వయసులో తొలిసారి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ►వన్డేల్లో 1000, 4000, 5000, 6000, 7000, 8000, 9000,10వేల పరుగులు వేగంగా పూర్తి చేసిన భారత ఆటగాడిగా కోహ్లి ►విరాట్ కోహ్లి కెప్టెన్సీలో 2008 అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న టీమిండియా ►ఆడిన తొలి ప్రపంచకప్‌లోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా కోహ్లి రికార్డు ►2013లో విరాట్ కోహ్లి తొలిసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానం అందుకున్నాడు. ►ఒక టీ20 మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ఔట్ చేయడం ద్వారా కోహ్లి తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. ►2016లో తండ్రి చనిపోయిన రోజునే ఆయన గుర్తుగా రంజీ మ్యాచ్ ఆడిన కోహ్లి బ్యాటింగ్‌లో 90 పరుగులు చేశాడు. ►2012లో 10 ఉత్తమ దుస్తులు ధరించిన అంతర్జాతీయ పురుషులలో విరాట్ కోహ్లి తొలి స్థానంలో నిలిచి ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు అందుకున్నాడు. ►టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా కోహ్లి ►వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న కోహ్లి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ►క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి లీగ్‌లో అందరికళ్లా ఎక్కువ పారితోషికం(దాదాపు రూ.17 కోట్లు) తీసుకుంటున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ►టెస్టు క్రికెట్లో 63 మ్యాచ్‌ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 37 విజయాలు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లి 13 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విటర్లో ప్రస్తుతం ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి. ఒక లుక్కేయండి.. -
‘చాయ్ తాగి పో’, ‘ఊకో కాక’.. ఇవన్నీ షాపుల పేర్లండి బాబోయ్!
సాక్షి, కరీంనగర్: ‘అరేయ్.. ఎక్కడున్నవ్’.. ‘చాయ్ తాగి పో’.. ‘ఊకో కాక’.. ‘కమాన్ ఫ్రెండ్’.. రాకేన్ రోల్.. ‘చాయ్ వాలా’.. ఇవీ మనం రోజువారీ సంభాషణలో మాట్లాడుకునే పదాలు. ఇప్పుడు ఇవే పదాలు కరీంనగర్‌లోని వ్యాపార కూడళ్లలో హోర్డింగ్‌లపై దర్శనమిస్తున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. వాడుక భాష పదాలనే పేర్లుగా పెడుతున్నారు. గతంలో వ్యాపారాలకు దేవుళ్ల పేర్లు, ఇంటిలోనిపిల్లల పేర్లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు పెట్టేవారు. ఇంకొందరు పేరు బలం చూసి, సంఖ్య, శాస్త్రప్రకారంగా పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మన మాటలు.. వాడే ఊత పదాలు, వంటకాల పేర్లు, కూరగాయలు, పిండి వంటల పేర్లు హోర్డింగ్‌లకు ఎక్కుతున్నాయి. వెరైటీ పేర్లు ఇటు కస్టమర్లనూ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ యాసలో.. తెలంగాణ యాసలో చాయ్ బాబు చాయ్, మిర్చి, చాయ్, అమ్మ కర్రిపాయింట్, జస్ట్ ఫర్ యూ వంటి క్యాచీ పేర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారాలు నిర్వహించే వారు వాడుకభాషలో పేర్లు పెడుతున్నారు. అందరి నోళ్లలో నానిన పదాలతో పేర్లు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ.. కరీంనగర్లో ఏదైన షాప్ ప్రజల్లోకి వెళ్లాలాంటే పబ్లిసిటి తప్పని సరి. షాపులు, హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలు యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం చేయాలి. వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రారంభోత్సవాలు చేయించాలి. వ్యాపారం జోరుగా సాగాలంటే కూడా అదే స్థాయిలో ప్రచారం ఉండాలి. అవేవి లేకుండా కొత్త ట్రెండ్‌లో పేర్లు పెడుతూ రెట్టింపు పబ్లిసిటీ పొందుతున్నారు. జనం వాడుక భాషనే ప్రధానంగా చేసుకుని పేర్లు పెడుతున్నారు. పుల్గా ఉండాలని.. పెద్ద పెద్ద పేర్లు, నోరు తిరగని పేర్లు ఉండడం వల్ల జనానికి ఎక్కువగా గుర్తు ఉండదు. అందుకే సింపుల్‌గా అందరికీ అనువుగా గుర్తుండేలా కాస్త కొత్తగా ఉండేలా ‘తారక’ అనే పేరుపెట్టాం. పలకడానికి, వినడానికి కూడా బాగుండడంతో అందరి నుంచి స్పందన బాగుంది. – తోట కోటేశ్వర్, తారక రెస్టారెంట్, బస్టాండ్ రోడ్, కరీంనగర్ ఫ్రెండ్లీగా ఉండాలని.. అందరికీ సన్నితంగా, ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో చాయ్ తాగి పో.. పేరుతో వివిధ ఫ్లెవర్లలో టీ, స్నాక్స్ అందించే సెంటర్‌ను రెండు నెలల క్రితం ప్రారంభించా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పేరు కొత్తగా ఉండడంతో ప్రతిఒక్కరూ ఆసక్తిగా వస్తూ ఆదరిస్తున్నారు. – తాటికొండ రాజు, శివ థియేటర్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ ఆంధ్రాలో చూసి.. 12 ఏళ్ల కిత్రం కరీంనగర్లో రెడ్డి గారి వంటిల్లు పేరున మెస్ ప్రారంభించాం. ప్రజల ఆదరణ లభించింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి పేర్లు ఉండడం గమనించా. ఇక్కడ మెస్ ప్రారంభించే సమయంలో అదే ఆలోచనతో రెడ్డి గారి వంటిల్లు అని పేరు పెట్టా. అందరి ఆదరణ లభించి వ్యాపారం సాఫీగా సాగుతోంది. – బారాజు రామిరెడ్డి, డీఐజీ బిల్డింగ్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ -
టాటూ ట్రెండ్: ఒళ్లంతా పచ్చబొట్లే.. ఏమంటే ఇదో ఫ్యాషన్
సాక్షి, జగిత్యాల: ప్రస్తుత కాలంలో టాటూ ట్రెండ్‌గా మారింది. నాడు పచ్చబొట్టు నేడు టాటూ.. పేరేదైనా జీవితకాలం ఉండే జ్ఞాపకం. టాటూ అంటే యంగస్టర్స్లో విపరీతమైన క్రేజ్. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్‌గా కనిపించాలని శరీరమంతా టాటూస్ డిజైన్ వేయించుకుంటున్నారు. తమకు నచ్చిన వారి పేర్లతో పాటు నచ్చిన వ్యక్తుల ఫొటోస్ టాటూగా వేయించుకుంటున్నారు. ఇన్నర్ ఫీలింగ్స్, ఆలోచన విధానాన్ని బట్టి టాటూస్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొందరు స్టైల్ కోసం టాటూ వేయించుకుంటుండగా మరికొందరు తమకు నచ్చిన వ్యక్తులు, నాయకుల ఫొటోలతో పాటు దేవతల ఫొటోలు టాటూగా వేయించుకుంటున్నారు. ప్రెజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా రకరకాల టాటూ డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. సింపుల్ టాటూ నుంచి రకరకాల బొమ్మల టాటూలు వేయించుకుంటున్నారు. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్ డిఫరెంట్ వెరైటీస్‌లో టాటూస్ వస్తుండటంతో టాటూ లవర్స్ ఫిదా అవుతున్నారు. గతంలో కేవలం గ్రీన్ కలర్ టాటూస్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌లో టాటూస్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ మనసుకు నచ్చిన భావాలను ఒంటిపై వేయించుకుంటూ మురిసిపోతున్నారు యూత్. యూత్ ఫ్యాషన్‌గా టాటూ.. ప్రస్తుతం యూత్‌ను ఎక్కువగా ఆకర్షిస్తున్న టాటూ యంగ్‌స్టర్స్‌కు ఫ్యాషన్‌గా మారింది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వారి పేరు లేదా ఫొటోతో పాటు తాము ఇష్టపడే నాయకులు, ఆరాధించే దేవతల ఫొటోలు టాటూగా వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. తమ ఫీలింగ్స్‌ను ఎదుటి వ్యక్తులకు తెలిపేందుకు టాటూ వేయించుకుంటున్నారు. డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్.. గతంలో కేవలం గ్రీన్ టాటూ మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం డిజైనర్లు డిఫరెంట్ వెరైటీస్ అండ్ కలర్ కాంబినేషన్స్‌లో టాటూస్ వేస్తున్నారు. నార్మల్, పర్మనెంట్, సెమీ పర్మనెంట్ టాటూస్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. సింపుల్ టాటూ నుంచి మల్టీకలర్‌తో డిఫరెంట్ డిజైన్స్‌లో లైఫ్‌లాంగ్ గుర్తుండేలా టాటూ వేయించుకోవడం ప్రెజెంట్ డేస్‌లో క్రేజ్‌గా మారింది. అభిమానంతోనే.. ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అంటే నాకు కొండంత అభిమానం. అందుకే ఆయన ఫొటో నా గుండెల మీద టాటూగా వేయించుకున్నాను. ఎప్పటికీ ఆయన అడుగు జాడల్లో నడవడమే నా లక్ష్యం. అందుకే టాటూ వేయించుకుని నా అభిమానాన్ని చాటాను. – రఘువీర్‌గౌడ్ ముంజాల ఫ్యాషన్‌గా ఉండటం ఇష్టం స్టైలిష్‌గా ఉండటమంటే నాకిష్టం. అందుకు తగ్గట్టుగానే ఫ్యాషన్ బిజినెస్‌ను ఎంచుకున్నాను. నా వ్యాపారానికి ఫ్యాషన్‌గా ఉండటం అవసరం. ప్రస్తుత ట్రెండ్‌తో పాటు నా పర్సనాలిటీ కూడా అందుకు తగ్గట్టుగా ఉండటంతో టాటూ వేయించుకున్నాను. – పవన్‌సింగ్ ఠాకూర్ -
Arya Dhayal: డిజిటల్ మ్యూజిక్ సెన్సేషన్
ఎన్ని రోజులు చీకట్లో కూర్చుంటావు? ఎన్ని రోజులు నీ ఒంటరి ప్రపంచంలో ఉంటావు? కదలాలి... కదనరంగంలోకి దూకాలి కాలంతో పోటీ పడాలి. ‘కాలం మారి... కోలం మారి’ అంటోంది ఆర్యా దయాళ్. దేశీయ సంగీతానికి వెస్ట్రన్ ఫ్లేవర్ జోడించి యుకెలేలితో అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్యా. తన పాటకు పునాది సామాజిక స్పృహ అని చెబుతుంది... తాను పాడిన పాటను బిగ్‌బి అమితాబ్‌కు పంపించాలనుకుంది ఆర్యా దయాళ్. అంతే..అప్పటికప్పుడు తన గదిలో కూర్చొని ఎడ్ షీరన్ పాపులర్ సాంగ్ ‘షెడ్ ఆఫ్ యూ’ పాడి సెల్ఫోన్లో రికార్డ్ చేసి పంపించింది. కోవిడ్ చికిత్సలో భాగంగా ఆ సమయంలో ‘బిగ్ బి’ హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి అటు నుంచి స్పందన వస్తుందని అనుకోలేదు ఆర్యా. కాని ఊహించని విధంగా పెద్దాయన నుంచి పెద్ద స్పందన వచ్చింది. ‘మీరేవరో నాకు తెలియదు. కాని నాకు బాగా తెలుసు... మీలో గొప్ప ప్రతిభ ఉందని. కర్నాటక, వెస్ట్రన్ మ్యూజిక్‌ను మిక్స్ చేయడం సులువు కాదు. కాని ఆ పని మీరు చాలా సులువుగా చేశారు. మిక్సింగ్‌లో వాటి సహజత్వం మిస్ కాకుండా చూశారు. ఈరోజు మీ పాట వినడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది’ అని ట్విట్టర్లో ఆశీర్వదించారు బిగ్ బి. హరిహరన్లాంటి ప్రసిద్ధ గాయకుల నుంచి కూడా ఆర్యాకు ప్రశంసలు లభించాయి. ‘పెద్దల ప్రశంసలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి’ అని సంబరపడిపోతుంది ఆర్యా. కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన ఆర్యా దయాళ్ 2016లో రాసిన ఒక కవిత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరువాత సాహిత్యంలోనే కాదు సంగీతంలోనూ తన టాలెంట్ చాటుకుంది ఆర్యా. ‘కాలం మారి–కోలమ్ మారి–ఎన్జన్గళుమ్ అంగ్ మారి’ (కాలం మారింది. చూసే దృష్టికోణం మారింది. కాబట్టి మనం కూడా మారాలి) పాటతో డిజిటల్ మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యాకు 140,000 ఫాలోవర్స్ ఉన్నారు. తన పాటలను ఎప్పటికప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది. ఆమె లెటెస్ట్ రిలీజ్ ‘అంగనే వేనమ్’ ట్రెండింగ్ అయింది. మాస్, మసాల పాటలు కాకుండా స్త్రీలను చైతన్యపరిచే పాటలు, లింగవివక్షతను ఖండించే పాటలు పాడడం అంటే ఆర్యాకు ఎంతో ఇష్టం. ఇక తనకు ఇష్టమైన సంగీతవాయిద్యం యుకెలేలి. పచ్చటి ప్రకృతి ఒడిలో, నిశ్శబ్దం దట్టంగా ఆవరించిన ఏకాంతదేశంలో యుకెలేలి స్వరాలు ఆర్యాను కొత్త లోకాల్లోకి తీసుకువెళతాయి. ‘రా వాయిస్’ ఆమె ప్రత్యేకత. కొందరైతే ‘యుకెలేలిలాగే ఆమె స్వరం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్’ అని ప్రశంసిస్తుంటారు! -
ట్రెండింగ్‌లో నిధి అగర్వాల్ ఫొటోలు..
-
ఫుడ్ ఫర్ ‘పాజిటివ్’
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతోంది. పెద్దసంఖ్యలో రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్ అందించడం సాధ్యం కాదు కాబట్టి అధిక శాతం బాధితులకు, నాన్ సీరియస్ కేసులకు హోమ్ ఐసోలేషన్ ఏకైక మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి చికిత్స అందుకుంటున్న వారికి ఆరోగ్యకరమైన ఆహారం ఇంటి ముంగిటకే రావడం ఒక వరంలా మారింది. ప్రస్తుతం ఇళ్ల నుంచి, కేటరింగ్ సంస్థల ద్వారా ఇలా సరఫరా చేస్తున్న వారు దాదాపు 50కిపైగా ఉంటారు. అన్ని రకాల పదార్థాలతో ఫుడ్ ప్యాకేజ్ ఇలా.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉన్నవారికి హైదరాబాద్‌కు చెందిన కొన్ని కేటరింగ్ సంస్థలు ఫుడ్ ప్యాకేజ్‌లను అందిస్తూ కొత్త రకం వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఒంటరిగా నివసిస్తున్నవారితోపాటు ఇతరులకు మరీ ముఖ్యంగా తమ కుటుంబసభ్యులకు కోవిడ్ వ్యాప్తికాకుండా జాగ్రత్త పడే పాజిటివ్ రోగులకు ఇవి ఉపయుక్తంగా మారాయి. కరోనా కారణంగా కుప్పకూలిన ఫుడ్ బిజినెస్‌కి కొత్త మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించడానికి కూడా ఇది వీలు కల్పిస్తోంది. రెండేళ్లుగా అతలాకుతలమైన కేటరర్లు, రెస్టారెంట్స్ నిర్వాహకులకు ఈ ఆహార సరఫరా కొంత వరకూ ఉపశమనాన్నిస్తోంది. పలువురు కేటరర్లు, సంస్థలు ఇప్పటికే నగర వ్యాప్తంగా ఈ తరహా సేవల్ని విస్తరించారు. సోషల్ మీడియాలో ప్రచారం కేటరింగ్ సంస్థలు కోవిడ్ బాధితులకు తాము అందిం చే ఆహారం గురించి ప్రచారం కోసం సోషల్ మీడి యాను విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. వా ట్సాప్ గ్రూపులతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్లో తమ ఆఫర్లను, ప్యాకేజీలను ప్రకటిస్తూ ప్రచారం సాగిస్తు న్నాయి. బాధితుల నుంచి స్పందన కూడా బాగానే ఉంటోందని కేటరింగ్ నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్ బాధితుల నుంచి వస్తున్న ఆర్డర్ల మేరకు సమకూర్చలేకపోతున్నామని కొందరు నిర్వాహకులు చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం దీనికి ఎంత డిమాం డ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొద్ది రోజులు కోవిడ్ విజృంభణ కొనసాగుతుందన్న అంచనాలతో ఇప్పుడిప్పుడే ఈ వ్యాపారంలోకి మరికొందరు దిగుతున్నారు. ఈ క్రమంలో మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు ఈవైపు అడుగులు వేసేందుకు ప్రయ త్నిస్తున్నాయి. ఆయా సంస్థలు రూ.650 నుంచి ప్యాకేజీ ధరను నిర్ణయించాయి. అందించే ఆహార పదార్థాల నాణ్యతను బట్టి ఈ ధర రూ.9 వేల వరకు ఉంది. బాధితులకు వైద్యులు సూచించే పోషకాలన్నీ ఇందులో ఉండేలా నిర్వాహకులు చూస్తున్నారు. ఫోన్ చేసి అడ్రస్ చెబితే చాలు ఈ ‘ఇమ్యూనిటీ ఫుడ్ ప్యాకేజ్’ బాధితుల ఇంటికే నిమిషాల్లో చేరుతోంది. చారిటీ నుంచి బిజినెస్ వైపు మొదట కోవిడ్ పాజిటివ్ బాధితులకు చారిటీగా దీన్ని గత ఏడాది ప్రారంభించాం. అయితే బాధితుల సంఖ్య వందలు, వేలకు చేరడంతో బిజినెస్‌గా మార్చుకున్నాం. కానీ ఇప్పటికీ లాభాపేక్షతో చేయడం లేదు. ఇప్పటిదాకా దాదాపు 3వేల వెజ్ మీల్స్ సరఫరా చేశాం. రోజూ 300కిపైగా థాలీలు అందిస్తున్నాం. ఒకే ఇంటి నుంచి అరడజను ఆర్డర్స్ వస్తే డెలివరీ ఖర్చులు భరిస్తున్నాం. మొత్తంగా 14 రోజుల పాటు లంచ్, డిన్నర్లకు రూ.4వేలలో మినీ థాలీస్, రూ.6 వేలలో హోమ్ థాలీస్ ఇస్తున్నాం. –అనిల్ అగర్వాల్, సాయి కైలాష్ దాబా రోజుకు మూడుసార్లు 15 ఏళ్లుగా పాతబస్తీ కేంద్రంగా కేటరింగ్ బిజినెస్ చేస్తున్నాం. నెల రోజులుగా కేసుల సంఖ్య బాగా పెరగడంతో ఇప్పుడు రోజుకు 20–25 భోజనాలు సరఫరా చేస్తున్నాం. నా భార్య వంట చేస్తుంది. మా కుటుంబ సభ్యులు వాటిని డెలివరీ చేస్తారు. కనీసం 25 కి.మీ పరిధిలో ఉన్న వారికి అందించగలుగు తున్నాం. అంతకంటే దూరంగా ఉన్నవారు ఇతర యాప్స్ ఉపయోగించి ఇంటి దగ్గరకే ఆహారం రప్పించుకోవచ్చు. మా ఫుడ్ ప్యాకేజ్ ధర రూ.9వేలు. – ఆనంద్ సంఘీ, సంఘీ కేటరర్స్ ఫ్రెష్.. ఇమ్యూనిటీ బూస్ట్ ఇటీవలే కోవిడ్ ప్యాకేజ్ పేరుతో ఆహార పంపిణీ ప్రారంభించాం. తొలుత మోతీనగర్‌లోని మా ఇంట్లోనే తయారు చేసేవాళ్లం. అయితే ఆర్డర్లు పెరగడంతో మేం మూసేసిన రెస్టారెంట్ కిచెన్‌ని తిరిగి ఓపెన్ చేయాల్సి వచ్చింది. రోగులకు మంచి ఆహారాన్ని అందించడం మీద మాత్రమే తప్ప లాభాలపై దృష్టి లేదు. ఆహారంతో పాటు కేరళ నుంచి తెప్పించిన ఇమ్యూనిటీ పెంచే ఆయుర్వేదిక్ పౌడర్‌ను కూడా మేం జత చేసి ఇస్తున్నాం. దీనితోపాటు పండ్లు, సూప్స్ వంటివి కూడా ఇస్తున్నాం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి రోజుకి రూ.650తో ఇస్తున్నాం. కస్టమర్ అవసరాన్ని రోజుకి 3 విడతల వరకూ సరఫరా చేస్తున్నాం. – నిఖిల్, ది క్లౌడ్ కిచెన్ చదవండి: షాకింగ్: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య -
నటితో బిగ్‌బాస్ విన్నర్ లిప్‌లాక్.. వీడియో వైరల్
సిద్ధార్థ్ శుక్లా..హిందీ బిగ్‌బాస్ సీజన్13తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బుల్లితెర నటుడు. షెహ్నాజ్‌తో లవ్ ట్రాక్ సిద్ధార్థ్‌కు మరింత కలిసొచ్చింది. ఫలితంగా గత సీజన్ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా మరోసారి సిద్ధార్థ్ శుక్లా వార్తల్లోకి ఎక్కాడు. నటి సోనియా రథీతో సిద్ధార్థ్ లిప్‌లాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రీట్వీట్లు చేస్తూ..ఈ వీడియోను షెహ్నాజ్కి సైతం ట్యాగ్ చేస్తున్నారు. అయితే ఈ లిప్‌లాక్ వీడియో రియల్ లైఫ్‌లో జరిగింది కాదు. 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే ఓ వెబ్‌సిరీస్ కోసం చేసిన యాక్టింగ్ మాత్రమే. ఈ సిరీస్ గత రెండు సీజన్లు విజయవంతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ మూడవ సీజన్‌ను ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ప్రొడ్యూస్ చేశారు. ఓటీటీలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్ ఈ మధ్యకాలంలో అత్యంత ప్రజాధణ పొందింది. సిద్ధార్థ్- సోనియాలు ఈ రొమాంటిక్ వెబ్‌సిరీస్‌లో జంటగా నటించారు. తాజాగా వీరిద్దరి లిప్‌లాక్ వీడియో బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ 'ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అగస్త్యరావుగా నటించిన సిద్ధార్థ్ శుక్లాకు నా అభినందనలు' అంటూ కామెంట్ చేశారు. #AgastyaRao you set my heart on fire@sidharth_shukla you nailed it boss!#BrokenButBeautiful3 is a hit dude 🔥 pic.twitter.com/N6jQ1epnml — 𝒦𝒶𝓎🦋 (@kausar_nas) April 7, 2021 చదవండి: అవును.. నేను ఆ సర్జరీ చేయించుకున్నాను: అనుష్క శర్మ ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సన్నీలియోన్.. ధర ఎంతంటే? -
#AT21: ఆ వయసులో నేను..
ఇరవై ఏళ్ల క్రితం యూనివర్సిటీలో డీన్ ఆర్డర్ కాపీని డీన్ ఎదుటే ముక్కలు ముక్కలుగా చింపి డీన్ ముఖాన విసిరికొట్టిన విద్యార్థి ఈరోజు.. జీవితం ఏరోజుకా రోజు పాస్ చేస్తుండే ఆర్డర్స్‌ని విధేయుడై ఒబే చేస్తుండవచ్చు. **** ఇరవై ఏళ్ల క్రితం నాన్న పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే అమ్మ సపోర్టుతో ఇంట్లోంచి జంప్ అయిపోయి ఢిల్లీ చేరుకుని హాస్టల్ లో ఉండి, చిన్న ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అయిన అమ్మాయి ఈరోజు.. మహిళా సంక్షేమ శాఖలో పెద్ద ఆఫీసర్ గా పని చేస్తూ ఉండొచ్చు. **** మరీ ఇంత గంభీరమైనవే కాకున్నా.. ఆ వయసులో.. 21, 22 ఏళ్ల వయసులో.. తామెలా ఉన్నదీ ట్విట్టర్లో కొందరు షేర్ చేసుకుంటున్నారు! అందుకు వాళ్లకు ప్రేరణ నిచ్చింది.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఐదుగురు యువతులు.. దిశ, సఫూరా, ప్రియాంక, నవదీప్, నిఖిత. బయటి ప్రపంచంలో, ఇంటర్నెట్లో రెండు చోట్లా ఇప్పుడు యువ ప్రభంజనమే విప్లవిస్తోంది! బయటి ప్రపంచానికి ఒక ప్రతిఫలనంగా, ఒక ప్రతిధ్వనిగా సోషల్ మీడియా పల్లవిస్తోంది. రైతు ఉద్యమాన్నే చూడండి. ఇప్పుడిది మెల్లిగా ఒక యువ మహోద్యమంగా మలుపు తీసుకుంటున్నట్లే ఉంది. దిశ రవి, నవదీప్ కౌర్, నిఖితా జాకబ్, సఫూరా జర్గార్, ప్రియాంక పాల్.. అంతా తమ ఇరవైలలో ఉన్న గళాలు, స్వరాలు, శంఖారావాలు. వీళ్లలో కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు జైళ్ల బయట అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. అకస్మాత్తుగా ఇండియా కు జవసత్వాలు వచ్చినట్లయింది. నేటి యువతరం మధ్యలోకి నాటి ఇరవైల యువతీయువకులు కూడా వచ్చేసి ఆనాటి తమ పిడికిళ్లను ఉత్సాహంగా విప్పి చూపిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం తామెలా ఉద్యమించిందీ, తమనెలా పెద్దవాళ్లు నిరుత్సాహపరిచిందీ, తామెలా గెలిచిందీ, తామెలా నిలిచిందీ.. ట్విట్టర్లో ‘ఎట్ 21’ హ్యాండిల్‌తో.. ‘ఆ వయసులో నేను’ అంటూ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇప్పటి యూత్‌ని ప్రశంసిస్తున్నారు. అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. వాళ్లను ఇంతగా ప్రభావితం చేసి, వాళ్ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసిన ఈతరం యంగ్ లీడర్స్ ఈ ఐదుగురు గురించైతే తప్పకుండా తెలుసుకోవలసిందే. దిశా రవి (21) ప్రస్తుతం ఈమెపై ఢిల్లీలో విచారణ జరుగుతోంది. స్వీడన్ టీనేజ్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు భారత్‌లోని రైతు ఉద్యమ ‘వ్యూహ రచన’లో సహాయం చేసిందన్న ఆరోపణ పై బెంగుళూరు నుంచి దిశను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమెపై ‘టూల్‌కిట్’ కేసు పెట్టారు. రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కుట్రపూరితంగా ఒక ప్రణాళిక తయారైందని అనుమానిస్తూ ఆ ప్రణాళికకే పోలీసులు ‘టూల్‌కిట్’ అని పేరుపెట్టారు. దిశ ‘ఫ్రైడేస్ ఫర్ ఫార్యూన్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఎఫ్.) సంస్థ వ్యవస్థాపకురాలు. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తుంటారు. 2018లో ఎఫ్.ఎఫ్.ఎఫ్. ప్రారంభం అయింది. భవిష్యత్ వాతావరణ సంక్షోభంపై దిశ కాలేజీ స్టూడెంట్స్‌ని చైతన్యవంతులను చేస్తుంటారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. గత ఆదివారం ఆమె బెంగళూరులోని తన ఇంట్లో ఉండగా ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరపరిచారు. టూల్‌కిట్‌తో ఆమెకు ఉన్నాయని అనుకుంటున్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం దిశ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమెను విడుదల చేయాలని బెంగళూరు, ఇతర నగరాలలో విద్యార్థులు ప్రదర్శనలు జరుపుతున్నారు. సఫూరా జర్గార్ (28) సఫూరా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఎం.ఫిల్. విద్యార్థిని. 2019 పౌరసత్వం సవరణ చట్టం ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయ్యారు. అప్పటికి ఆమె గర్భిణి. 2020 ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారన్నది ఆమెపై ప్రధాన అభియోగం. ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో గత జూన్‌లో ఆమెను జైలు నుంచి విడుదల చేశారు. సఫూరా కశ్మీర్ అమ్మాయి. మానవ హక్కులు, మత సామరస్యం, శాంతియుత సహజీవనం వంటి వాటి మీద ప్రసంగాలు ఇస్తుంటారు. ప్రియాంకా పాల్ (19) ప్రియాంకకు ‘ఆర్ట్వోరింగ్’ అనే వెబ్సైట్ ఉంది. ఆమె చిత్రకారిణి, కవయిత్రి, రచయిత్రి, కథావ్యాఖ్యాత. ఎల్.జి.బి.టి. సభ్యురాలిగా తనని తాను ప్రకటించుకున్నారు. కులం, లైంగిక వివక్ష, మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ (తమ దేహాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ విశ్వాసంతో అంగీకరించడం) వంటి సామాజిక అంశాలపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో స్పష్టమైన, పదునైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గత నవంబర్‌లో ప్రియాంక, కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా మాటా మాటా అనుకున్నారు. మొదట కంగనానే ప్రియాంకను బాడీ షేమింగ్ చేయడంతో ఘర్షణ మొదలైంది. నవ్‌దీప్ కౌర్ (23) నవదీప్ కౌర్ ‘మజ్దూర్ అధికార్ సంఘటన్’ (మాస్) కార్యకర్త. ఢిల్లీ సరిహద్దులోని సింఘులో ఆమె పని చేస్తున్న ఫ్యాక్టరీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడటంపై ఆమె నోరు విప్పారు. ఫలితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఆమెపై కేసులు పెట్టింది. జనవరి 12 నుంచి కౌర్ పంజాబ్‌లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఈ దళిత యువతిపై జైల్లో లైంగిక అకృత్యాలు జరిగాయని, ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నారని సహ ఖైదీల నుంచి సమాచారం బయటికి పొక్కడంతో దేశవ్యాప్తంగా నవ్‌దీప్ కౌర్ విడుదల కోసం ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు ఆమె బెయిల్ నిరాకరణకు గురైంది. ఢిల్లీలో పీహెచ్.డీ చేస్తున్న ఆమె చెల్లెలు రజ్వీర్ కౌర్ అక్కను విడిపించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు. సోమవారం ఒక కేసులో మాత్రం ఆమెకు బెయిలు లభించింది. 50 వేల రూపాయలు కట్టి, అవసరమైన పత్రాలు అందజేస్తే ఆ కేసులో బెయిలు లభించినప్పటికీ, రెండో కేసులో కూడా బెయిల్ వచ్చేంతవరకు నవ్‌దీప్ విడుదల అయ్యే అవకాశం లేదు. నిఖితా జాకబ్ (29) టూల్‌కిట్ కేసులో ఏ క్షణాన్నయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న మరో యువతి నిఖితా జాకబ్. ముంబైలో ఆమె లాయర్. దిశా రవితో కలిసి పుణెకు చెందిన శంతను, నిఖిత టూల్ కిట్ తయారు చేశారని.. వీళ్లంతా ఖలిస్తాన్ సాను భూతి సంస్థ ‘పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్’ నిర్వహించిన జూమ్ సమావేశానికి హాజరయ్యారని పోలీసుల ప్రధాన ఆరోపణ. ముందస్తు బెయిలు కోసం నిఖిత బాంబే కోర్టును ఆశయ్రించారు. -
ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు?
ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు ఎందుకని ఆశ్చర్య పోతున్నారా? దీనిలో అంత స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా. ఇది అన్ని ఆపిల్ కంప్యూటర్ ల మాదిరిగా మాత్రం కాదు. ఈ 'ఆపిల్ -1' కంప్యూటర్ ను కంపెనీ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి 1976లో రూపొందించారు. ఆపిల్ సంస్థ నుంచి వచ్చిన తొలి కంప్యూటర్ ఇది. అమెరికాకు చెందిన కృష్ణ బ్లేక్ అనే వ్యక్తి 1978లో ఈ 'ఆపిల్ -1' కంప్యూటర్ ను సుమారు 666 డాలర్లకు కొనుగోలు చేశారు. ఇది ఇంకా పనిచేస్తుండటం విశేషం. చెక్క కేసుతో తయారు చేసిన 'ఆపిల్ -1' కంప్యూటర్ ప్రస్తుతం ఈ-బేలో1,500,000 డాలర్లకు(సుమారు రూ.11 కోట్లు) అమ్మకానికి ఉంది. 1976లో తీసుకొచ్చిన అసలు ధర కంటే ప్రస్తుతం 2,250 రెట్లు ఎక్కువ. షిప్పింగ్ ఛార్జి 450 డాలర్లు(రూ.32వేలు) అదనం. ఎవరైనా విదేశీయులు కొనుగోలు చేస్తే అంతర్జాతీయ ఛార్జీలు వర్తిస్తాయి. దీనితో పాటు ఎలా ఉపయోగించాలో తెలిపే ఒక యూజర్ మాన్యువల్ బుక్ కూడా ఉంది. "ఇది చాలా పురాతనమైన, విలువైన వస్తువు కాబట్టి దీన్ని దొంగిలించే ప్రమాదం ఎక్కువగా ఉంది అని ప్రస్తుతం ఫ్లోరిడా బ్యాంక్ ఖజానాలో భద్రపరిచినట్లు" కృష్ణ బ్లేక్ తెలిపారు. చదవండి: బిగ్ బ్యాటరీతో వస్తున్న గెలాక్సీ ఎఫ్ 62 స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు -
సమ్మర్ స్పెషల్: చిరిగినదానికి ఇంత ఖరీదా?
వేసవి కాలం రానేలేదూ అప్పుడే మధ్యాహ్నం ఎండలు దంచేస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు శీతాకాలం డ్రెస్సుల కోసం చూసిన కళ్లన్నీ ఇప్పుడు సమ్మర్వేర్ కోసం వెతుకులాట మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పైన కనిపిస్తున్న స్వెటర్ ఓ వ్యక్తి కంట పడింది. వార్నీ, ఇది సమ్మర్ స్వెటరా? అని కొన్ని క్షణాలపాటు తత్తరపాటుకు లోనైన అతడు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ నెట్టింట ఇప్పుడీ స్వెటర్ హాట్ టాపిక్‌గా మారింది. (చదవండి: ఛీ ఛీ.. అసెంబ్లీలో ఇదేం పాడుపని!) ఇటాలియన్ ఫ్యాషన్ రంగానికి చెందిన ప్రద కంపెనీ ఓ పసుపు రంగు స్వెటర్‌ను అమ్మకానికి పెట్టింది. అయితే దానికి ఎక్కడపడితే అక్కడ రంధ్రాలు పెట్టి మరీ అమ్ముతుండటం ప్రత్యేకత. పైగా దాని ధరెంత అనుకుంటున్నారు. ఇంచుమించు 90,656 రూపాయలు. ధరకు దానికి ఏమాత్రం సంబంధం లేనట్లు కనిపిస్తోన్న ఈ స్వెటర్‌ను చూసిన ఓ ట్విటర్ యూజర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'ఈ స్వెటర్ నాకు స్విస్ చీజ్‌ను గుర్తు చేస్తోంది' అని రాసుకొచ్చాడు. కొందరు నెటిజన్లు సైతం 'అవును, అది చీజ్‌ను తలపిస్తోందని లొట్టలేస్తుండగా మరికొందరు మాత్రం అదేమ్ స్వెటర్రా బాబూ' అని విమర్శిస్తున్నారు. 'అయినా చిరిగినట్లు కనిపిస్తోన్న దీనికి అన్ని వేల రూపాయలా?' అని పలువురు నోరెళ్లబెడుతున్నారు. (చదవండి: ఆస్తి 5 మిలియన్ డాలర్లు.. కానీ తినేది..) -
#TeamIndia మోత మోగింది!
న్యూఢిల్లీ: బ్రిస్బేన్‌లో టీమిండియా సత్తా చాటింది. నిర్ణయాత్మక గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి భారత్ జాతీయ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. కుర్రాళ్ల పోరాట పటిమతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి దక్కించుకుని ఆస్ట్రేలియాపై తమదే పైచేయి అని నిరూపించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియాపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో టీమిండియా హాష్టాగ్ ట్విటర్లో ట్రెండింగ్‌లో నిలిచింది. మ్యాచ్ ముగిసిన పది నిమిషాల్లోపు లక్షల్లో ట్వీట్లు, రీ ట్వీట్లతో ట్విటర్లో మోత మోగింది. (చదవండి: చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం) టీమిండియా పేరుతో అభినందనలు, శుభాకాంక్షలు, ప్రశంసలు, ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన యువ ఆటగాళ్లు శుభమన్ గిల్, రిషబ్ పంత్‌లపై మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్ విజయంలో వీరిద్దరూ ముఖ్యపాత్ర పోషించారని తెగ మెచ్చుకుంటున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత త్రివర్ణ పతాకంతో టీమిండియా ఆటగాళ్లు మైదానం అంతా కలియ తిరగడం భారత క్రికెట్ అభిమానులను ఎంతోనే ఆటగానో ఆకట్టుకుంది. ‘ప్రౌడ్ మూమెంట్’ అంటూ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ట్విటర్లో ట్రెండ్ అవుతున్న హాష్‌ట్యాగ్స్ #INDvsAUS #TeamIndia #RishabhPant Test cricket at its best 🙌 . One of the best test series I was watched every session was so exciting . Big congratulations to each and everyone from @indiancricketteam . #test #indvsaus #winnerwinnerchickendinner #teamrajasthan pic.twitter.com/WHyFpFufaZ — Deepak chahar (@deepak_chahar9) January 19, 2021