సాక్షి, అమరావతి: జీ–20 సమావేశాల తర్వాత అత్యధికంగా ట్విట్టర్‌లో ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ అన్న పదమే ట్రెండింగ్‌లో ఉంది. శనివారం ఉదయం స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు అవినీతిపై పెద్దఎత్తున చర్చ జరిగింది.
కరప్షన్ కింగ్ సీబీఎన్ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ శనివారమంతా ట్విట్టర్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది. నెటిజన్లు ఉదయం నుంచి ఈ హ్యాష్ ట్యాగ్‌తో లక్షలాది పోస్టులను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
ఏమో, తెలియదు, గుర్తులేదు... మర్చిపోయా -బాబోరు#ScamSterChandrababu#scamstarchandrababu#BanYellowMediaSaveAP#EndOfTDP pic.twitter.com/fl7hzLSWua
— 🇮🇳 కాటేపల్లి శేషుయాదవ్ 🇸🇱 (@sesuyadav) September 9, 2023
దీంతోపాటు స్కామ్ స్టార్ చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్‌లు కూడా ట్రెండింగ్‌లో నిలిచాయి. జీ–20 సమావేశాల సందర్భంగా జాతీయ మీడియా చంద్రబాబు అంశాన్ని ఈ వార్తలకు ఎక్కువ సమయం కేటాయించకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగి రూ.30 కోట్లకుపైగా ఆస్తులను అటాచ్ చేసిన విషయాన్ని జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్తావించింది.
స్కాం స్టార్....#SkillDevelopmentScam#Rcpm#ScamsterChandrababuలా pic.twitter.com/Vb5fPfAip1
— Surya naga prasad Kudupudi (@Suryanagaprasa1) September 10, 2023
చదవండి: స్కిల్ స్కామ్: సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment