1. ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే
రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
2. తప్పుడు నిర్ణయమే!.. మారణహోమంపై టెక్సాస్ పోలీసులు
టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమంపై టెక్సాస్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జరిగిన ఆలస్యం వల్లే పసికందుల ప్రాణాలు పోయాయని, తాము తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయంగా పేర్కొంటూ క్షమాపణలు తెలియజేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
3. శతదినోత్సవ రాముడికి శతజయంతి కానుక..
ఒక నటుడు కష్టపడితే హీరో కావచ్చు. ఒక హీరో సిన్సియర్‌గా శ్రమిస్తే జనాదరణ పొందవచ్చు, బాక్సాఫీస్ హిట్లు సాధించవచ్చు. బాక్సాఫీస్ హిట్లు వచ్చిన తారలు చాలామందే ఉండవచ్చు. కానీ, ఎదిగే తన ప్రయాణంలో తాను నమ్ముకొని వచ్చిన పరిశ్రమను కూడా శిఖరాయమాన స్థాయికి తీసుకెళ్లిన మహానటులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
4. మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందొచ్చు!
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో సుమారు 200 మంకీపాక్స్ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని ప్రకటించింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
5. అనంతలో విషాదం.. సిలిండర్ పేలి కుటుంబం దర్మరణం
జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇళ్లు కుప‍్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
6.సామాజిక న్యాయభేరి: మూడో రోజు యాత్ర ప్రారంభం
వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయభేరిలో భాగంగా మూడోరోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నేడు తాడేపల్లిగూడెం నుంచి నర్సారావుపేటకు బస్సు యాత్ర జరుగనుంది. బస్సు యాత్ర సందర్భంగా స్థానిక పోలీస్ ఐ ల్యాండ్ వద్ద వైఎస్సార్ , ఇతర నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రులు నివాళులు అర్పించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
7. హైదరాబాద్‌లో సొంతబండే సో బెటర్
సాధారణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక, రవాణా సదుపాయాలు విస్తరిస్తాయి. కానీ గ్రేటర్‌లో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది.కొత్తగా మెట్రో రైలు సదుపాయం మినహా అదనంగా ప్రజారవాణా ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
8. మనసా..వాచా..ఇచ్చిన మాటే.. ఇన్నేళ్ల అజెండా
మూడేళ్లు. ఒకరకంగా తక్కువే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది చాలా ఎక్కువ. మీడియా– రాజకీయాలు – వ్యవస్థలన్నీ కలిసిపోయి ఒక వర్గానికే కొమ్ముకాస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారికి వ్యతిరేకంగా జెండా ఎగురవేసి నెగ్గటమే ఒక చరిత్ర. ఆ తరవాత కూడా కుట్రలను తిప్పికొడుతూ దిగ్విజయంగా ముందుకెళ్లటం మరో చరిత్ర. అలా ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త చరిత్రను రాసుకుంటూ ముందుకెళుతోంది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
9. కేసీఆర్‌ను ఆకాశానికెత్తిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్‌ను బీట్ చేసే మొగోడు ఏ రాష్ట్రంలో లేడని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండలోని తారా గార్డెన్స్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
10. రాజస్తాన్ రైట్ రైట్...
ఐపీఎల్ మొదటి సీజన్–2008లో విజేతగా నిలిచిన తర్వాత పడుతూ, లేస్తూ ప్రస్థానం సాగించి... మధ్యలో రెండేళ్లు నిషేధానికి కూడా గురైన రాజస్తాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత మళ్లీ తుది పోరుకు అర్హత సాధించింది. గత మూడు సీజన్లుగా చివరి రెండు స్థానాల్లోనే నిలుస్తూ వచ్చిన ఈ టీమ్ ఈసారి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment