
భారత్‌కు టాప్–10 ర్యాంక్
న్యూయార్క్: వర్ధమాన దేశాలలో ఏఐ ప్రయివేట్ పెట్టుబడులకు 2023లో చైనా రెండో ర్యాంకును దక్కించుకోగా.. భారత్ టాప్–10గా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ దేశాలలో ఏఐపై యూఎస్ అత్యధికంగా 67 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు వెచ్చించినట్లు వెల్లడించింది. గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇది 70 శాతంకాగా.. తద్వారా యూఎస్ టాప్ ర్యాంకులో నిలిచినట్లు తెలియజేసింది. వర్ధమాన దేశాలలో చైనా 7.8 బిలియన్ డాలర్లు, భారత్ 1.4 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు కేటాయించినట్లు తెలియజేసింది.
యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్(యూఎన్‌సీటీఏడీ) విడుదల చేసిన టెక్నాలజీ, ఇన్నోవేషన్ నివేదిక 2025లో ఈ వివరాలు తెలియజేసింది. 2033కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వెరసి డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాలు కొన్ని ఆర్థిక వ్యవస్థలకే పరిమితమవుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేటాయింపుల్లో యూఎస్, చైనా 40 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది.