కలుపు తీసేందుకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్‌ వచ్చేస్తున్నాయ్‌! | Mit Alumnus Founded Farmwise Uses Hulking, autonomous Robots | Sakshi
Sakshi News home page

పొలాల్లో కలుపు తీసేందుకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్‌ వచ్చేస్తున్నాయ్‌

Published Sun, Apr 9 2023 9:41 AM | Last Updated on Sun, Apr 9 2023 9:43 AM

Mit Alumnus Founded Farmwise Uses Hulking, autonomous Robots - Sakshi

వ్యవసాయ సాంకేతిక పరికరాల తయారీ కంపెనీ ‘ఫార్మ్‌వైస్‌’ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణుల సాయంతో రైతులకు పనికొచ్చే సరికొత్త పరికరానికి రూపకల్పన చేసింది. పొలంలోని కలుపును ఏరిపారేసే రోబోను ‘వల్కన్‌’ పేరుతో రూపొందించింది.

ఈ రోబో పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. ఇందులోని ‘ఇంటెలిజెంట్‌ ప్లాంట్‌ స్కానర్‌’ పనికొచ్చే మొక్కలేవో, పనికిరాని కలుపుమొక్కలేవో  కచ్చితంగా గుర్తించగలదు.

కలుపు మొక్కలను ఇట్టే గుర్తించి, వాటిని క్షణాల్లోనే సమూలంగా ఏరిపారేస్తుంది. దీనిని ట్రాక్టర్‌కు అమర్చుకుని, పొలంలో ఒకసారి ఇటూ అటూ నడిపితే చాలు, మొత్తం కలుపునంతటినీ పూర్తిగా ఏరిపారేస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement