
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఆన్‌లైన్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్ పర్ఫామెన్స్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం, ఈరోజు ఉదయం 8:15 గంటలకు ఈ అంతరాయం ప్రారంభమైంది. 11:45 గంటలకు సమస్య తీవ్రమై 800 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.
వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా.. ఏప్రిల్ 1 మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవల వంటి డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉండవని.. ఈ అంతరాయానికి క్షమించమని ఎస్‌బీఐ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇదీ చదవండి: రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడు
డౌన్‌డెటెక్టర్ ప్రకారం, సుమారు 64 శాతం మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు, 33 లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంతరాయం నుంచి బయటపడటానికి కస్టమర్లు యూపీఐ లైట్, ఏటీఎమ్ ఉపయోగించుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
— State Bank of India (@TheOfficialSBI) April 1, 2025