
డబ్బు పొదుపు చేసుకోవాలనుకునేవారు సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనే చూస్తారు. అందులోనూ కొంత ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు ఎమున్నాయా అని వెతుకుతారు. అలాంటి వారికోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) అందిస్తున్న 'అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్' స్కీమ్ నిలిపివేసింది.
గతంలో ఎస్‌బీఐ.. తన అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గడువు ముగిసినప్పటికీ దానిని పొడిగించింది. అయితే ఇప్పుడు గడువును పొడిగించకపోగా.. స్కీమును ఏప్రిల్ 1 నుంచి నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అధిక వడ్డీ ఇచ్చే ఈ పథకాన్ని బ్యాంక్ నిలిపివేసింది.
ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా.. సాధారణ పెట్టుబడిదారులకు సంవత్సరానికి 7.10 శాతం వడ్డీని, 400 రోజుల డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని అందించింది. ఇకపై ఈ స్కీమ్ అందుబాటులో ఉండదని తెలియడంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.