
టెక్సాస్‌లో కార్యాలయం ఏర్పాటు
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా టెక్సాస్‌లోని ప్లానోలో ఆఫీసు ఏర్పాటు చేసింది. ఇది 130 సీట్ల సామర్థ్యంతో 27,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటైంది. అమెరికాలో ఇది తమకు పంతొమ్మిదో కార్యాలయమని సంస్థ తెలిపింది.
కన్సలి్టంగ్, డెలివరీ, కస్టమర్ సపోర్ట్ సర్వీసులు మొదలైన సరీ్వసులు దీని ద్వారా అందించనున్నట్లు వివరించింది. ఇదే ప్రాంగణంలో ఇన్నోవేషన్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 90 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ మహీంద్రాలో 1,50,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు.