
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బలహీన గ్లోబల్ సంకేతాలతో ఆరంభంలోనే శుక్రవారం 300 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్388 పాయింట్లు నష్టపోయి 52631 వద్ద, నిప్టీ 115 పాయింట్లు పతనంతో 15665 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
టైటన్, ఎం అండ్‌ఎం, టాటా మెటార్స్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్ర, సిప్లా, టీసీఎస్, విప్రో, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి.
కాగా గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్‌పై ఇన్వెస్టర్లు ఆందోళన నేపథ్యంలో ఆసియా స్టాక్‌లు నష్టపోతున్నాయి. దీనికి తోడు వాల్ స్ట్రీట్ ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 21 శాతం పతనాన్ని నమోదు చేసింది . 1970 తర్వాత అత్యంత దారుణమైన పతనమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.