
పెట్రోల్ కొట్టించేందుకు వచ్చిన మహిళ పెట్రోల్ పంపులో టాయిలెట్ కోసం వెళితే తాళం వేసి ఉంది. ఆ రెస్ట్‌రూమ్‌కు సంబంధించిన తాళం పెట్రోల్ పంపు మేనేజర్ ఇంటికి తీసుకెళ్లడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే పోలీసులు స్పందించి తాళం పగులగొట్టి రెస్ట్‌రూమ్ తెరిపించారు. అనంతరం ఆ మహిళ వినియోగదారుల ఫోరమ్‌లో సంబంధిత ఘటనపై ఫిర్యాదు చేశారు. 2024లో కేరళలోని పయ్యోలిలో జరిగిన ఈ సంఘటనపై ఫోరమ్ విచారణ జరిపి పెట్రోల్ పంపు యాజమాన్యంపై రూ.1.65 లక్షలు జరిమానా విధించారు. పెట్రోల్ పంపులో వినియోగదారులకు ఉచితంగా ఎలాంటి వసతులుంటాయో కింద తెలుసుకుందాం.
ఇదీ చదవండి: ప్రయాణంలో రైలు టికెట్ చిరిగిపోతే ఫైన్ కట్టాలా?
దేశంలోని పెట్రోల్ బంకులు వినియోగదారులకు భద్రతను పెంచడానికి వారి సౌలభ్యం కోసం అనేక సదుపాయాలు అందిస్తాయి.
ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. కాసేపు ఆ ఫిల్టర్ పేపర్‌ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్‌పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా పరిగణించవచ్చు.
పెట్రోల్ బంకులు వాహనాల్లో సరైన టైర్ ప్రెజర్ ఉండేందుకు వీలుగా ఉచిత ఎయిర్ ఫిల్లింగ్ సేవలను అందిస్తాయి.
అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల్లో ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో ఉండాలి.
పెట్రోల్ బంకులు అవసరమైతే ఎమర్జెన్సీ కాల్స్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతించాలి.
ప్రయాణీకుల కోసం శుభ్రమైన, భద్రత కలిగిన వాష్‌రూమ్‌లు అందుబాటులో ఉండాలి.
శుభ్రమైన త్రాగునీరు తరచుగా ఉచితంగా అందించాలి.