
సాక్షి, అనంతపురం : జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషాపై నిర్భయ కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ మహిళ ఉద్యోగి సల్మా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గం వ్యవసాయ శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తాను, డిప్యూటేషన్ అడిగితే కోరిక తీర్చమన్నాడని బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుతం జేడీ హబీబ్ బాషా సెలవుల్లో ఉన్నారు. గతంలో ఆయన గుంటూరులో డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సమయంలోనూ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.