Professor Molestation Attempt On Student In Hyderabad Central University - Sakshi
Sakshi News home page

Hyderabad: థాయిలాండ్‌ విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారయత్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత

Published Sat, Dec 3 2022 8:50 AM | Last Updated on Sat, Dec 3 2022 1:07 PM

Professor Molestation Attempt On Student In Hyderabad Central University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్‌ విద్యార్థినిపై ఫ్రొఫెసర్‌ అత్యాచారయత్నం చేశాడు. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి యత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రవిరంజన్‌పై మూడు కేసులు ఉన్నాయి.

ప్రొఫెసర్‌ రవిరంజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, సెంట్రల్‌ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్‌ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫ్రొఫెసర్‌ రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement