professor
-
‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’
బెంగళూరు: ఏదైనా కళాశాలో పంక్షన్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు నృత్యం చేస్తుంటే, ఉపాధ్యాయులు వారిని ఉత్సహపరచడాన్ని, ఆనందించడాన్ని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నమైన దృశ్యం బెంగళూరులో కనిపించింది. ఇక్కడి ఒక కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ విద్యార్థుల సమక్షంలో హిప్-హాప్ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ ప్రొఫెసర్‌ను ఉత్సాహపరుస్తుండగా, అతను డాన్స్ ఇరగదీయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు.గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ(Global Academy of Technology) (గాట్) విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రొఫెసర్ పుష్ప రాజ్.. ప్లే అవుతున్న మ్యూజిక్కు అనుగుణంగా నృత్యం చేయడాన్ని చూడవచ్చు. మైఖేల్ జాక్సన్ తరహాలో నృత్యం చేశారు. కళాశాల కారిడార్‌లో ప్రొఫెసర్ నృత్యం చేస్తుండగా, విద్యార్థులు ఆనందంతో కేకలు వేశారు. కళాశాలలోని విద్యార్థులంతా అతని నృత్యాన్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పటికే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుంది.ఈ వీడియోను చూసిన యూజర్స్ సోషల్ మీడియా(Social media)లో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘నృత్యకారునిగా పుట్టారు.. లెక్చరర్‌గా బలవంతంగా మారారు’ అని రాయగా, మరొకరు ‘అతను నా గురువు కాకుంటే, నాకు ఇష్టమైన హీరో అయ్యేవారు’ అని రాశారు. మరొకరు ‘అతను తనకు నచ్చని వృత్తిలో కొనసాగుతున్నారు’ అని రాశారు. మొరొకరు *అతను మాస్టర్ జీ కాదు..డ్యాన్స్ మాస్టర్ జీ’ అని రాశారు. View this post on Instagram A post shared by 🎥🚀 (@gatalbum)ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట -
విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. నిట్ ప్రొఫెసర్ అరెస్ట్
గౌహతి: విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన కొందరు అధ్యాపకులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ బాగోతం మరువకముందే, అస్సాంలోని సిల్చార్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇదే తరహా వేధింపుల వార్తల్లో నిలిచారు. సిల్చార్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(National Institute of Technology) (నిట్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కోటేశ్వర్ రాజు ధేనుకొండ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు డాక్టర్ కోటేశ్వర్ రాజును అరెస్ట్ చేశారు. అతనిని నిట్ నుంచి కూడా సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుమల్ మహత్తా తెలిపారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా అతనిని ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో అరెస్టు చేశారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(Bachelor of Technology) విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై చర్య తీసుకోవాలని విద్యార్థులు రాత్రంతా నిరసన తెలిపారు. బాధితురాలి ఫిర్యాదులోని వివరాల ప్రకారం ప్రొఫెసర్ ఆమెను తన చాంబర్‌కు పిలిచి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపధ్యంలో బాధితురాలు ఇన్స్టిట్యూట్ అధికారులకు రాసిన లిఖితపూర్వక ఫిర్యాదులో.. ప్రొఫెసర్ తనకు వచ్చిన తక్కువ గ్రేడ్ల గురించి చర్చించేందుకు, చాంబర్‌కు పిలిచారని, ఆ తరువాత తనను అనుచితంగా తాకాడని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు గురించి తెలియగానే నిందితుడు దాక్కునేందుకు ప్రయత్నించాడని పోలీసు అధికారి తెలిపారు. అతని మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి, అతనిని, అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ తర్వాత అతనిని భారత శిక్షాస్మృతి (బీఎస్ఎన్) లోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణను భారత్ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం -
పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..!
కొందరు చిన్న వయసులోనే అసాధారణ తెలివితేటలు, ప్రతిభ సామర్థ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ అసామాన్య వ్యక్తులు అందరిలా కాకుండా చిన్న వయసులోనే పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే తథాగత్ అవతార్ తులసి. అతడి అసామాన్య ప్రతిభ గురించి తెలిస్తే నోటమాట రాదు. మరీ అతడి ప్రతిభాపాటవాలేంటో చూద్దామా..!.ఆ అసామాన్యుడే తథాగత్ అవతార్ తులసి. ఆయన సెప్టెంబర్ 9, 1987న బిహార్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తథాగత్ చిన్నప్పటి నుంచి తన అసాధారణ మేథాతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అలా తథాగత్ 9 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 11 ఏళ్లకు బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్లకే ఎంఎస్సీ పూర్తి చేసి, 21 ఏళ్లకే డాక్టరేట్‌ని పొందాడు. ఆ విధంగా 22 ఏళ్ల వయసుకే ప్రతిష్టాత్మక ఐఐటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ అయ్యాడు. ఈ అపార ప్రతిభాశాలి పీహెచ్‌డీలో క్వాంటం సెర్చ్ అల్గారిథంపై పరిశోధన చేసి మంచి పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు తథాగత్ ప్రఖ్యాత శాస్త్రవేత్త లవ్ గ్రోవర్తో కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా రచించాడు అయితే అది ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన 2019లో ఐఐటీ బాంబే నుంచి తొలగించబడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగ పోరాటం చేస్తున్నారు. 2011లో తథాగత్ తీవ్ర జ్వరం బారినపడీ అలెర్జీకి గురయ్యాడు. ఆ అనారోగ్యం చాలా ఏళ్ల పాటు కొనసాగడంతో సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. చివరికి 2013లో ముంబై విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కారణాల వల్లే 2019లో తథాగత్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో నివసించడం సాధ్యం కాదని, తనని ప్రత్యేక కేసు కింద IIT ఢిల్లీకి బదిలీ కోసం అభర్థిస్తున్నారు తథాగత్. అందుకోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు సమాచారం. చివరగా తథాగత్ మాట్లాడుతూ..క్వాంటం కంప్యూటర్ల రంగం పరంగా నాదేశం అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ అంశంపైనే చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాను. కేవలం 17 ఏళ్ల వయసులో లవ్ గ్రోవర్ మార్గదర్శకత్వంలో దీనిపై పనిచేయడం ప్రారంభించాను. తన పరిశోధన ప్రొఫైల్ ముందు బాగానే ఉంది. ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ పరిశోధనపై ఫోకస్ పెట్టలేకపోయానని వాపోయారు. కానీ ఇప్పుడు తాను క్వాంటం కంప్యూటర్ల రంగానికి తోడ్పాలని కోరుకుంటున్నానని అన్నారు. అదీగాక మన భారతదేశంలో క్వాంటం కంప్యూటర్లపై రూ. 8 వేల కోట్లు ఆంక్షలు ఉన్నాయి. కావున ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈరంగంలో మంచి విప్లవం తీసుకురాగలనని ధీమాగా చెప్పారు తథాగత్ .సత్కారాలు, అవార్డులు..1994లో, తథాగత అవతార్ తులసిని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సత్కరించారు. ఆయన సాధించిన విజయానికి బహుమతిగా ఆయనకు కొంత డబ్బుని పారితోషకంగా ఇచ్చారు. కానీ తథాగత్ ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆయనకు ఒక మంచి కంప్యూటర్ని బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి సహాయపడింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం తథాగత్ సాధించిన విజయాలకు అబ్బురపడటమే గాక అతడిని ఘనంగా సత్కరించారు కూడా. (చదవండి: అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!) -
శ్రీవెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు
-
ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, కవి, రచయితగా గుర్తింపు పొందిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జీర్ణకోశ సంబంధిత సమస్యతో గత నెల 19న నిమ్స్‌లో చేరారు. నిమ్స్ డైరెక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో మెట్టు రంగారెడ్డి స్పెషల్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు. చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడుతోందని అనుకుంటుండగా ఇతర సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించింది. శనివారం రాత్రి 8.36 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి మౌలాలి జవహర్‌నగర్‌లో ఉన్న శ్రీనివాస హైట్స్‌లోని స్వగృహానికి సాయిబాబా పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద ఆయన భౌతికకాయాన్ని కొద్ది సమయం ఉంచుతామని కుటుంబ సభ్యులు చెప్పారు.బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే అంతిమయాత్ర 4 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి చేరుతుందని, సాయిబాబా కోరిక మేరకు ఆయన పారి్థవ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి దానం చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే ఆయన తన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. అమలాపురం నుంచి హస్తిన దాకా.. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన నాగ సాయిబాబాకు ఐదేళ్ల వయస్సులోనే పోలియోతో రెండుకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచి ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. అయినప్పటికీ స్థానికంగానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. 2013లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ రామ్‌లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరిలో ఆయనను పదవి నుంచి తొలగించారు. పదేళ్లు అండా సెల్లో జైలు శిక్ష సాయిబాబా అరెస్టు అనంతరం కేసును విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు 2017లో సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సాయిబాబా బాంబే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. బాంబే హైకోర్టు 2022లో ఆయనపై కేసును కొట్టివేసింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా విడుదలపై స్టే విధించింది. ఈ కేసును తిరిగి విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. బాంబే హైకోర్టు సాయిబాబా నిర్దోషి అని మళ్లీ తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది మార్చిలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. దీనికి ముందు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లోని అండా సెల్లో పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. జైల్లో ఉండగానే సాయిబాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైనా అనారోగ్య సమస్యలు కొనసాగడంతో కోలుకోలేకపోయారు. సాయిబాబా మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు. నిమ్స్ మార్చురీలో ఉన్న ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం పలువురు సందర్శించి నివాళులరి్పంచారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి: హరగోపాల్ ప్రొఫెసర్ సాయిబాబాకు నిర్బంధ వ్యతిరేక వేదిక కనీ్వనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, కో–కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాఘవాచారి, కె.రవిచందర్‌లు జోహార్లు అరి్పంచారు. సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయారని, ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.జైల్లో మగ్గిపోవడమే కారణం అక్రమ కేసులతో అన్యాయంగా జైలుకు వెళ్లి అక్కడే మగ్గిపోయారు. ఎట్టకేలకు ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకొని బయటకు వచ్చారు. మళ్లీ ప్రజల కోసమే పనిచేయాలనుకున్నారు. కానీ జైల్లో చుట్టుముట్టిన అనారోగ్యం నుంచి కోలుకోలేక పోయారు. చిన్న ఆపరేషన్ చేసినా శరీరం తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిమ్స్‌లో చికిత్స విజయవంతం అయినా తర్వాత తలెత్తిన ఇబ్బందులతో కన్నుమూశారు. – సాయిబాబా భార్య వసంత, కుమార్తె మంజీరా‘హింసల కొలిమిలో పదేళ్లు’ తప్పుడు కేసుల కారణంగా పదేళ్లు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో చిత్ర హింసల కొలిమిలో మగ్గిపోయానని ప్రొఫెసర్ సాయిబాబా ఈ ఏడాది ఆగస్టు 23న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో వాపోయారు. తన నిర్బంధం, అందుకు కారణాలు, తొమ్మిదేళ్ల జైలు జీవితంలో పడిన కష్టాలు, జైళ్లలో అంతర్గత రాజకీయాలు ఇలా అనేక అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.‘జైలు జీవితం అంతా చీకటి రోజులు. పదేళ్ల తర్వాత తెలంగాణలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నా. రాజ్యహింస నుంచి ఆదివాసీయులను కాపాడేందుకు ప్రయత్నించడం, ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే నా అరెస్టుకు ప్రధాన కారణం. జైల్లో నాకు సరైన వైద్యం అందించలేదు. పదేళ్లలో కొన్నిసార్లు మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన వైద్యం లేక నా ఎడమచేయి కూడా పడిపోయింది. పోలియో తప్ప ఏ ఇతర వ్యాధి లేని నేను 21 రకాల జబ్బుల బారినపడ్డా..’ అని చెబుతూ సాయిబాబా భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యమంతా అమలాపురంలోనే.. డిగ్రీ వరకూ ఇక్కడే చదివిన సాయిబాబాఅమలాపురం టౌన్: మానవ హక్కుల కార్యకర్త, విద్యావేత్త, కవి, రచయిత ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా బాల్యం, డిగ్రీ వరకు విద్యాభ్యాసమంతా అమలాపురంతో పాటు పరిసర గ్రామాల్లోనే సాగింది. సాయిబాబా కుటుంబం దాదాపు 40 ఏళ్ల కిందట అమలాపురాన్ని విడిచి హైదరాబాద్‌కు వెళ్లగా.. అమలాపురం, నల్లమిల్లి, సన్నవిల్లి తదితర గ్రామాల్లో ఆయనకుఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా మరణవార్త తెలియగానే వారంతా కన్నీరుమున్నీరయ్యారు. నల్లమిల్లి నుంచి ఢిల్లీకి.. సాయిబాబా స్వగ్రామం అమలాపురం రూరల్ మండలంలోని నల్లమిల్లి. ఆయన తండ్రి సత్యనారాయణమూర్తి ఒక సన్నకారు రైతు. తల్లి సూర్యావతి గృహిణి. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయిబాబా, రెండో కుమారుడు రామదేవ్. సాయిబాబాకు ఐదేళ్ల వయసులో పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. వీల్‌చైర్‌కే పరిమితమైనా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టువీడకుండా నల్లమిల్లిలో ప్రాథమిక విద్యనభ్యసించారు. తొలుత తమ అమ్మమ్మ ఊరు ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో వారి కుటుంబం ఉండేది. ఆ తర్వాత అమలాపురంలోని అద్దె ఇంట్లోకి మారారు. అక్కడే సాయిబాబా.. ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం వారి కుటుంబం అమలాపురంలోని గాం««దీనగర్‌లో ఇల్లు నిరి్మంచుకుంది. సాయిబాబా ఇంటరీ్మడియెట్, డిగ్రీ చదువు అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలోనే సాగింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సాయిబాబా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. తల్లిదండ్రుల మృతితో సాయిబాబా, ఆయన సోదరుడు రామదేవ్ హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. అన్యాయాన్ని సహించడు.. చిన్నతనం నుంచే సాయిబాబా ప్రశి్నంచేతత్వంతో ఉండేవాడు. అన్యాయాన్ని సహించేవాడు కాదు. నాకు కజిన్ అయిన సాయిబాబా మరణించాడని తెలిసి ఎంతో బాధపడ్డా. – గోకరకొండ గంగాజలం, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి, ఉప్పలగుప్తం నిరాధార ఆరోపణలతో హింసించారు మానవ హక్కుల వేదిక నాయకుడిగా, కవిగా, ప్రొఫెసర్‌గా సాయిబాబు ప్రజలు, విద్యార్థుల ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారు. దివ్యాంగుడైన వ్యక్తి.. ప్రభుత్వానికి ఎలా హాని తలపెడతారనే ఆలోచన లేకుండా కేంద్రం తొమ్మిదేళ్ల పాటు జైల్లో హింసించింది. లేకపోతే ఆయన మరిన్ని సంవత్సరాలు జీవించేవారు. పరోక్షంగా ఆయన మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత. – నామాడి శ్రీధర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు, అంబాజీపేటసీపీఎం, సీపీఐ సంతాపంసాక్షి, అమరావతి: ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కులనేత ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతిపట్ల సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘పంతం’పై కేసు నమోదుకు మీనమేషాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై 24 గంటలు దాటినా కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవుతోంది. దశలవారీ ఉద్యమాలకు ప్రభుత్వ వైద్యుల సంఘం సమాయత్తమవుతోంది. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును శనివారం ఎమ్మెల్యే నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.పవన్‌కళ్యాణ్‌కు బాధ్యత లేదా?కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఆవరణలోని వాలీబాల్ కోర్టుకు వైద్య విద్యార్థినులు సైతం ఆడుకోవడానికి వస్తుంటారు. ఇందులో కొంతకాలంగా ఎమ్మెల్యే అనుచరులు వాలీబాల్ ఆడుతూ బహిరంగంగా బెట్టింగ్‌లు వేస్తున్నారని, వైద్య విద్యార్థినులతోపాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మెడికోలు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు గతంలోనే తెలియచేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు రంగరాయ కళాశాల యాజమాన్యంతోపాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులతో మాట్లాడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే నానాజీ బెట్టింగ్‌రాయుళ్లను వెనకేసుకువస్తూ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించకపోవడాన్ని ఏమనుకోవాలని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. వైద్యుడిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అస్వస్థతకు గురైన బాధిత ప్రొఫెసర్ఎమ్మెల్యే, అతని అనుచరులు బెదిరింపులు, దాడితో ఫోరెన్సిక్ హెచ్‌వోడీ ఉమామహేశ్వరరావు మానసిక ఆందోళనతో ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన తన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్యసంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు ఉమామహేశ్వరరావును కలిసి సంఘీభావం తెలిపారు. కాగా, ఎమ్మెల్యే నానాజీ తీరును గర్హిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఆదివారం ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ రాసింది. వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంఘ అధ్యక్షుడు డాక్టర్ జయధీర్‌బాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీ ఆందోళనకు ఉపక్రమించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక న్యాయ సాధన సమితి డిమాండ్ చేసింది. సంస్థ అధ్యక్షులు డాక్టర్ భానుమతి, ప్రధాన కార్యదర్శి నవీన్‌రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోకా పవన్‌కుమార్, ముఖ్య సలహాదారులు అడ్వకేట్ జవహర్ అలీ, అయితాబత్తుల రామేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి జి.ఆస్కార్‌రావు, జిల్లా అధ్యక్షుడు రంగనాయకులు డాక్టర్ ఉమామహేశ్వరరావును పరామర్శించారు. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ మొక్కుబడిగా స్పందించారు. వైద్యులకు, విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేనూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా‘ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవర్తించాను. నేనేదో తగువు సెటిల్ చేద్దామని ఆర్ఎంసీ హాస్టల్‌కు వెళ్లాను. అక్కడ నేనే తగువులో పడిపోయాను. దానికి ఇప్పుడు సభాముఖంగా డాక్టర్‌కు సారీ చెబుతున్నాను. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో నిన్న అలా ఉన్నాను. తిరుపతి లడ్డూ విషయంలో ఎవరో చేసిన తప్పునకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆయనే దీక్ష చేపడుతున్నప్పుడు ఆయన పార్టీలో ఉండి, నేను తప్పు చేసి నేను ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయకూడదని భావించి సోమవారం కాకినాడ గొడారిగుంట ఇంటి వద్ద దీక్ష చేపడుతున్నాను’ అని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. అయితే ఈ ప్రకటనపై పార్టీనేతలు విస్తుపోతున్నారు. నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు అన్నట్టుగా ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి: కురసాల కన్నబాబుజనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచిత ప్రవర్తనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్ష్యుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. వైద్యుడిపై ఎమ్మెల్యే, అతని అనుచరుల దురుసు ప్రవర్తన, వ్యవహారశైలి, దాడి జనమంతా వీడియోల్లో చూశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాల్సిందే. చేసిందంతా చేసి ఇప్పుడు ప్రాయశ్చితం అంటూ దీక్షలు చేసినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదన్నారు.ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా..ఈ ఘటనపై శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆర్ఎంసీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం జిల్లా ఎస్పీ విక్రాంతపాటిల్కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారు అందుబాటులో లేదు. దీంతో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీరామకోటేశ్వరరావు, సర్పవరం సీఐ బొక్కా పెద్దిరాజుకు ఫిర్యాదు చేశారు. రెండుచోట్లా ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా ఆదివారం రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.మరోవైపు కేసు విషయంలో వితండ వాదన జరుగుతోంది. వైద్యుడు స్వయంగా ఫిర్యాదు చేయలేదు, ఆయన ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని కాకినాడ డీఎస్పీ రఘువీర్ పృథ్వీ చెబుతున్నారు. వైద్యుడిని చంపుతానని బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం ఎందుకు కేసు నమోదు చేయలేదని వైద్యులు, దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసనప్రభుత్వ వైద్యుల సంఘంసాక్షి, అమరావతి: ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ను ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) డిమాండ్ చేసింది. ఆదివారం జరిగిన సంఘ కార్యవర్గ సమావేశం వివరాలను అధ్యక్షుడు డాక్టర్ జయ«దీర్ మీడియాకు విడుదల చేశారు. సోమవారం నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని ప్రకటించారు.ప్రొఫెసర్‌పై దాడి హేయందాడికి పాల్పడ్డ జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబుసాక్షి, అమరావతి: మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హామీలు అమలు చేయలేక దాడులతో బెదిరింపులకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నాయకులను దాడులకు ప్రేరేపించడం, ఆ తర్వాత వారే క్షమాపణలు చెబుతున్నట్టు డ్రామా చేయడం నిత్యకృత్యమైందన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ప్రొఫెసర్, కాలేజీ స్పోర్ట్స్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరరావును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అసభ్య పదజాలంతో దూషించి చెంప దెబ్బకొట్టడం, జనసేన కార్యకర్తలు దాడి చేయడం ఇందుకు తార్కాణమన్నారు. దళిత అధికారుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు వైఎస్సార్ïÜపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దళిత అధికారిని అసభ్యంగా దూషించి దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.క్షమాపణ చెబితే చాలా!ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాధ్యక్షుడు సురేష్చల్లపల్లి (అవనిగడ్డ): విధి నిర్వహణలో ఉన్న దళిత ప్రొఫెసర్‌పై అందరూ చూస్తుండగా దాడి చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు ప్రశ్నించారు. ఉద్యోగులు, అధికారులపై దాడులు చేసే ప్రజాప్రతినిధులు, వ్యక్తులపై తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగులు అధికారులపై దాడులు పరిపాటిగా మారాయని చర్యకు ప్రతిచర్య ఉండాలన్నారు. దాడిని ఖండించిన జూడాలుసాక్షి, అమరావతి: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడటాన్ని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) తీవ్రంగా ఖండించింది. ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడి, దుర్భాషలాడిన ఘటన ఆరోగ్య సంరక్షకులను అగౌరవపరచడమేనని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన భద్రతా వైఫల్యానికి నిదర్శనమని తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ప్రొఫెసర్‌పై దాడి హేయం ఏపీ ఏఎఫ్‌ఎంటీ అధ్యక్షుడు సాయిసుదీర్కర్నూలు (హాస్పిటల్): ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి హేయమైన చర్య అని ఏపీ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ (ఏపీ ఏఎఫ్‌ఎంటీ) అధ్యక్షుడు డాక్టర్ టి.సాయిసుధీర్ ఖండించారు. ఏపీ ఏఎఫ్‌ఎంటీ, ఏపీ జీడీఏ, ఏపీ జేయూడీఏ, ఐఎంఏ సంస్థలను సంప్రదించి తదనంతర కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీపై డిప్యూటీ సీఎం పవన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దాడి సిగ్గుచేటువైఎస్సార్సీపీ వైద్య విభాగం ఉపాధ్యక్షుడు మెహబూబ్లబ్బీపేట (విజయవాడ తూర్పు): విధుల్లో ఉన్న మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌పై కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ బండబూతులు తిడుతూ దాడికి పాల్పడటం దుర్మార్గమని, సిగ్గుపడాల్సిన అంశమని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు ఇదే నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రొఫెసర్ జగదీష్ షేత్‌కు 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డు
గ్లోబల్ మార్కెటింగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (SIG).. 'ప్రొఫెసర్ జగదీష్ షెత్' 2024 గ్లోబల్ మార్కెటింగ్ అవార్డును గెలుచుకున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ మార్కెటింగ్ రంగంలో ఈయన చేసిన కృషిని గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించినట్లు వెల్లడించింది.2024లో ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీకి లీడ్స్ యూనివర్శిటీ బిజినెస్ స్కూల్ కాన్స్టాంటైన్ ఎస్. కాట్సికేస్ నాయకత్వం వహించారు. కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి రాబిన్ కౌల్టర్, మోల్డే యూనివర్సిటీ నుంచి కార్లోస్ సౌసా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.సుమారు 40 సంవత్సరాలుగా ప్రపంచ మార్కెటింగ్‌లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన ప్రొఫెసర్ షెత్.. ఈ రంగానికి సంబంధించి అనేక రచనలు కూడా చేశారు. ఇందులో ఒకటి 'ది గ్లోబల్ రూల్ ఆఫ్ త్రీ'. ఈ పుస్తకాన్ని 2020లో ప్రచురించారు. ఇది అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క జార్జ్ ఆర్. టెర్రీ అవార్డుకు నామినేట్ అయింది. ఇప్పటికే ఈయన 2020లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. -
దృష్టిని బట్టి.. సృష్టి!
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
రాత్రైతే నా భార్య రాక్షసిలా ప్రవర్తిస్తోంది
సుల్తాన్‌బజార్: తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి పోలీసులకు కోరారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు టెమూజియన్ తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. తనకు లక్ష్మీ గౌతమితో వివాహం అయినప్పటి నుండి ఆమె మానసికంగా శారీరకంగా హింసిస్తుందని ఆయన తెలిపారు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నారు. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమాలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపాడు. నగరంలోని మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ భార్యతో కలిసి అల్వాల్‌లో నివాసం ఉంటున్నట్లు వివరించారు. తమకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే పెళ్లి అయినప్పటి నుండి అకారణంగా హింసిస్తోందని వాపోయాడు. పలు మార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినా తీరు మారలేదన్నారు. ఇటీవల చంపేందుకు తనపై దాడి చేసినట్లు తెలిపాడు. ఈ విషయమై స్థానిక అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నంచారు. ఇప్పటికైనా పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. -
తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ..
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ చోటు చేసుకుంది. గతంలో తెయూ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ రవీందర్‌గుప్తా లంచం తీసుకుంటూ అవినీతి కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ యూనివర్సిటీ పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దేశంలోనే పదవిలో ఉన్న యూనివర్సిటీ వీసీ ఒకరు అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లడం అదే మొదటిసారి. ప్రస్తుతం తెయూ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ నిషేధిత డ్రగ్స్ (మాదకద్రవ్యాల) తయారీ కేసులో పోలీసుల చేతిలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం వర్సిటీ చరిత్రలో మరో మచ్చగా మారింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.శ్రీనివాస్ 2014లో తెయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. 2018లో వర్సిటీ అనుబంధంగా ఉన్న భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు. వర్సిటీ ఉద్యోగులకు లీన్ (డిప్యుటేషన్) పీరియడ్ కింద వర్సిటీ అనుమతితో ఐదేళ్లకు ఒక సంవత్సరం ఇతర సంస్థల్లోకి వెళ్లి పని చేసే అవకాశం కల్పిస్తారు. అయితే ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లకే నాటి వీసీని ప్రసన్నం చేసుకుని శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ఇలా ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల పాటు శ్రీనివాస్ లీన్‌పై వెళ్లారు. ప్రతి రెండేళ్లకోసారి వీసీలను మచ్చిక చేసుకుని లీన్ పొడిగింప జేసుకున్నారు. ఈ విషయాన్ని 2021లో గుర్తించిన వర్సిటీ పాలకమండలి సభ్యులు 53వ ఈసీ సమావేశంలో డిప్యుటేషన్‌పై ఉన్న వర్సిటీ ఉద్యోగులు వెంటనే లీన్ రద్దు చేసుకుని వర్సిటీలో తిరిగి చేరాలని 2021 లో తీర్మానం చేశారు. అయితే ఏ ఒక్కరూ పాలకమండలి ఆదేశాలను పాటించలేదు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో లీన్‌పై వెళ్లిన వారు అలాగే ఉండిపోయారు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులపై నోటీసులు ఇవ్వడంతో ఎట్టకేలకు శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చారు. తాను తిరిగి విధుల్లో చేరతానని చెప్పగా తొలుత రిజిస్ట్రార్ యాదగిరి అంగీకరించలేదు. దీంతో శ్రీనివాస్ రిజిస్ట్రార్‌తో తీవ్రంగా గొడవ పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ అతడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. సౌత్ క్యాంపస్‌లో తిరిగి విధుల్లో చేరిన శ్రీనివాస్ బయోమెట్రిక్ హాజరును పట్టించుకోకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు మాత్రమే చేసి వేతనం తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ విషయమై వర్సిటీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండేవారని ఇతర అధ్యాపకులు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా నిషేదిత డ్రగ్స్ తయారు చేస్తూ గత నెల 22న శ్రీనివాస్ అరెస్ట్ అయిన విషయం మూడు రోజుల క్రితం వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి రావడంతో శ్రీనివాస్ మార్చి నెల వేతనాన్ని నిలిపివేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్ట్ అయిన 48 గంటల్లో విధుల్లో నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై రిజిస్ట్రార్ యాదగిరిని సంప్రదించగా ఇంకా తనకు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని న్యాయసలహా మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మెడికెమ్ ల్యాబ్.. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారులో మెడికెమ్ ల్యాబ్ అనే సంస్థలో శ్రీనివాస్ మేనేజింగ్ పార్ట్నర్గా కొనసాగుతున్నారు. ఈ ల్యాబ్‌లో ఖరీదైన ఫార్మా డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఫార్మా కంపెనీలు సిండికేట్‌గా మారి ఇలా నిషేదిత డ్రగ్స్‌ను తయారు చేసి ఇతరదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు. కొన్ని కంపెనీలు అప్పుడప్పుడు పట్టుబడినప్పటికీ ఇందులో వచ్చే ఆదాయం వల్ల చాలా కంపెనీలు వీటిని ఇల్లీగల్‌గా కొనసాగిస్తుంటాయి. అయితే ఇలా హైదరాబాద్‌లో నిషేదిత డ్రగ్స్ తయారీ చేస్తూ పట్టుబడటం, అరెస్ట్ అయిన వారిలో తెయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండటం సంచలనంగా మారింది. నిషేదిత డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ముందుగా ఇంటర్‌పోల్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. శ్రీనివాస్‌ను ఏకంగా ఇంటర్‌పోల్ పోలీసుల సాయంతో హైదరాబాద్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), రాష్ట్ర ఎకై ్సజ్ పోలీస్ అధికారులు గత నెల 22న అరెస్ట్ చేశారు. వర్సిటీ అధ్యాపకులు ప్రభుత్వం అనుమతించిన ఫార్మా ఉత్పత్తులపై పరిశోధనలు చేయాల్సి ఉండగా ఇలా నిషేదిత డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తూ పట్టుబడటం సిగ్గు చేటని వర్సిటీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇవి చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు లింక్.. -
సెల్ఫ్–లవ్
వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది. ‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’ -
పీహెచ్డీ ఉన్నా కూరగాయల అమ్మకం
ప్రైవేట్ జాబ్‌లు చేసి.. అవి నచ్చక వ్యాపారం చేసినవారిని చూశాం. చాలీచాలని జీతాలకు కుటుంబాలను పోషించలేక పలు ఆదాయ మార్గాలను వెతుకున్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు సంబంధించిన వార్తలు కూడా చదివాం. అయితే తాగాజా ఓ వ్యక్తి నాలుగు మాస్టర్ డిగ్రీలు తీసుకొని.. ఏకంగా న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పంజాబ్‌కు చెందిన డా.సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పని చేసేవారు. అనుకోని పరిసస్థితుల్లో ఆయన తన ఉద్యోగం మానేసి ఇల్లూఇల్లు తిరుగుతూ కురగాయలు అమ్ముతున్నారు. యూనివర్సిటీలోని లా డిపార్టుమెంట్లో 11 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ సింగ్ నాలుగు మాస్టర్ డిగ్రీలు(న్యాయ శాస్త్రం, పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్)తో పాటు లా కోర్సులో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు. పంజాబ్‌లోని పాటియాలకు చెందిన సందీప్.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: Punjab: వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం -
గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిన ఐఐటీ ప్రొఫెసర్
లక్నో: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ వేదికపైనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి వ్యవహారాల డీన్‌గా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న సమీర్ ఖండేకర్(53)ని ఆహ్వానించారు. ఈ వేడుకలో ప్రసంగించే క్రమంలోనే ఆయన వేదికపై కుప్పకూలారని ఇన్స్టిట్యూట్ అధికారులు తెలిపారు. అత్యుత్తమ పరిశోధకుడిగా పేరుగాంచిన సమీర్ ఖండేకర్ ఆకస్మిక మరణం పట్ల ఐఐటి కాన్పూర్ మాజీ డైరెక్టర్ అభయ్ కరాండికర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖండేకర్‌కు ఐదు సంవత్సరాల క్రితం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఒక ప్రొఫెసర్ చెప్పారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనే ఆయన మృతదేహాన్ని ఉంచినట్లు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఖండేకర్ ఏకైక కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
షేక్స్పియరే తన పవర్
‘ఏ యుద్ధం ఎందుకు జరిగెనో? ఏ రాజ్యం ఎన్నాళ్లుందో? తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’... మహాకవి మాట తిరుగులేని సత్యం అయినప్పటికీ కొన్నిసార్లు యుద్ధాలు, తారీఖులు, ప్రేమ పురాణాలు, ముట్టడికైన ఖర్చులు... చారిత్రక పరిశోధనకు అవసరం. ఏ సమాచారమూ వృథా పోదు. వర్తమానంలో ఉండి ఆనాటి మొగల్, బ్రిటిష్ ఇండియాలోకి వెళ్లడం అంత తేలిక కాదు. అలుపెరగని పరిశోధన కావాలి. అంతకుముందు కనిపించని ప్రత్యేక వెలుగు ఏదో ఆ పరిశోధనలో ప్రతిఫలించాలి. అందమైన శైలికి అద్భుతమైన పరిశోధన తోడైతే...అదే ‘కోర్టింగ్ ఇండియా’ పుస్తకం. ఫ్రొఫెసర్ నందిని దాస్ రాసిన ‘కోర్టింగ్ ఇండియా: ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ప్రతిష్ఠాత్మకమైన బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్–2023 గెలుచుకుంది... ఇంట్లో, తరగతి గదిలో, పుస్తకాల్లో, టీవీల్లో విన్న కథల ద్వారా నందిని దాస్‌కు షేక్స్పియర్ ఇష్టమైన రచయితగా మారాడు. ఆ మహా రచయితపై ఇష్టం ఆంగ్ల సాహిత్యంపై ఇష్టంగా మారింది. ఆయన పుస్తకాలు తన మనోఫలకంపై ముద్రించుకుపోయాయి. అలనాటి ప్రయాణ సాహిత్యం నుంచి భిన్న సంస్కృతుల మధ్య వైరు«ధ్యాల వరకు నందినికి ఎన్నో అంశాలు ఆసక్తికరంగా మారాయి. పరిశోధిస్తూ, రాసే క్రమంలో తన మానసిక ప్రపంచం విశాలం అవుతూ వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో నందిని దాస్ ప్రొఫెసర్. షేక్స్పియర్ సాహిత్యం ఆమెకు కొట్టిన పిండి. ఆమె పేరు పక్కన కనిపించే విశేషణం...‘స్పెషలిస్ట్ ఇన్ షేక్స్పియర్ స్టడీస్’ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో బీఏ ఇంగ్లీష్ చేసింది నందిని. ఆ తరువాత స్కాలర్‌షిప్‌పై యూనివర్శిటీ కాలేజి, ఆక్స్‌ఫర్డ్‌లో చేరింది. కేంబ్రిడ్జీ, ట్రినిటీ కాలేజిలో ఎంఫిల్, పీహెచ్డీ చేసింది. ఒక ప్రచురణ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా పని చేసిన నందిని సంవత్సరం తరువాత మళ్లీ అకాడమిక్ రిసెర్చ్‌లోకి వచ్చింది. ఇక తాజా విషయానికి వస్తే... ‘ది పవర్ ఆఫ్ గుడ్ రైటింగ్’గా విశ్లేషకులు కీర్తించిన ‘కోర్టింగ్ ఇండియా’ యూరోపియన్ల హింసా ధోరణి గురించి చెప్పింది. రాయబార కార్యాలయాల అసమర్థతను ఎత్తి చూపింది. మొఘల్ రాజకీయాలను ఆవిష్కరించింది. ‘ ఆనాటి బ్రిటన్, ఇండియాలకు సంబంధించి వాస్తవిక చిత్రాన్ని ఆవిష్కరించింది నందిని. మొగల్ రాజుల ఒడిదొడుకుల నుంచి బ్రిటీష్ వైఖరి వరకు ఈ పుస్తకంలో ఎన్నో కనిపిస్తాయి’ అంటాడు బ్రిటీష్ అకాడమీ బుక్‌ప్రైజ్– ఛైర్ ఆఫ్ ది జ్యూరీ ప్రొఫెసర్ చార్లెస్ ట్రిప్. -
ప్రొఫెసర్ కారు బీభత్సం
శివాజీనగర: నగరంలో ఓ విద్యాలయం ఆవరణలో ప్రొఫెసర్ కారు అదుపుతప్పి విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. శనివారం మహారాణి క్లస్టర్ కాలేజీ ఆవరణలో వద్ద ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు... ఇంగ్లిష్ ప్రొఫెసర్ హెచ్.నాగరాజు కారు తీసుకొని వర్సిటీకి వచ్చారు, కారును పార్క్ చేస్తూ బ్రేక్‌కి బదులుగా యాక్సిలేటర్‌ను నొక్కడంతో కారు వేగంగా దూసుకెళ్లి దారిలో వెళ్తున్న ఇద్దరు యువతులను ఢీకొట్టింది, అలాగే మరో రెండు కార్లను ఢీకొని నిలిచిపోయింది. మొత్తం మూడు వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అశ్విని (19) అనే బీకాం విద్యార్థినికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది, మరో యువతి నందుప్రియకు స్వల్ప గాయాలు తగిలాయి, నాగరాజుకు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. డీసీపీ ఘోర్పడే ఘటనాస్థలిని పరిశీలించి మాట్లాడుతూ, నిందితుడు నాగరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో మరో ప్రొఫెసర్‌కు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. -
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలానికి వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రా మగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లోని మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థి వయసు 69 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా అవసరమైన డాక్యుమెంట్లతో dmerecruitment.contract@mail.com కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు. అదే నెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్, అసో సియేట్ ప్రొఫెసర్లకు ఆ రోజు ఉదయం 10 గంటలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అదే నెల 24వ తేదీ నాటికి వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1.25 లక్షలుగా ఖరారు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టిలకు రెమ్యునరేషన్‌తోపాటు అదనంగా నెలకు రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తారు. వీరి ఎంపిక దేశవ్యాప్తంగా వచ్చే అభ్యర్థుల నుంచి ఉంటుంది. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటారు. -
విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు..
న్యూఢిల్లీ: విద్య లేని వారిలోనే కాదు విద్యాధికుల్లో కూడా వింతపశువులు ఉంటారని రుజువు చేశాడు ఓ ప్రొఫెసర్. తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేసి తనని లైంగికంగా వేధించారని బాధితురాలైన 24 ఏళ్ల డాక్టర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ప్రొఫెసర్ ని అదుపులోకి రిమాండ్ కు తరలించారు పోలీసులు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుండి ముంబై బయలుదేరిన ఓ విమానంలో ప్రొఫెసర్(47), డాక్టర్(24) పక్కపక్కన సెట్లలో కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది మొదలు ప్రొఫెసర్ ఇష్టానుసారంగా తనపై చేతులు వేస్తూ లైంగికంగా వేధించారని, ప్రశ్నించినందుకు తనతోపాటు ఫ్లైట్ సిబ్బందితో కూడా వాదనకు దిగారని.. ఫ్లైట్ ముంబైలో దిగేంతవరకు ప్రొఫెసర్ వేధిస్తూనే ఉన్నారని బాధితురాలు చెప్పినట్లు వెల్లడించారు సహర్ పోలీసులు. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా నిందితుడైన ప్రొఫెసరుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
ఏయూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్‌కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు. చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
అగ్రరాజ్యంలో తెలుగు తేజం
తెనాలి: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యకు విశేష కృషి చేసినందుకు ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు గుంటూరుకు చెందిన తెలుగు మహిళ నీలి బెండపూడి (59). అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ నీలి బెండపూడి గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో సమావేశమైన వ్యక్తిగా వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలోని గొప్ప విద్యాలయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశాలకు అవసరమైన సిఫార్సులను చేసే కోచర్‌గా ఆమె నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ నీలి విశాఖపట్నంలో చదువుకున్నారు. అక్కడినుంచే అమెరికా వెళ్లారు. ఆమె జీవిత విశేషాల్లో విశాఖ వాసిగానే పేర్కొంటున్నారు. నిజానికి ప్రొఫెసర్ నీలి గుంటూరులో జన్మించారు. తల్లి దత్తావఝుల పద్మ, తండ్రి రమేష్. ఇద్దరూ ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేశారు. ఈ కారణంగా నీలి బీఏ, ఎంబీఏ వరకు చదువు మొత్తం అక్కడే సాగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉన్నత చదువుల కోసం 1986లో నీలి బెండపూడి అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో మార్కెటింగ్‌లో పీహెచ్డీ చేశారు. అకడమిక్ అడ్మినిస్ట్రేటర్‌గా నైపుణ్యం సాధించి.. తాను విద్య అభ్యసించిన కాన్సాస్ యూని వర్సిటీలో ప్రొవోస్ట్, ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్సలర్, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌తో సహా అనేక అడ్మినిస్ట్రేటివ్ హోదాల్లో సేవలందించారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఇనీషి యేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు హంటింగ్టన్ నేషనల్ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కస్టమర్ ఆఫీ సర్గానూ విధులు నిర్వర్తించారు. అకాడమీ ఆఫ్ మార్కె టింగ్, అత్యుత్తమ మార్కెటింగ్ టీచర్ అవార్డుతో సహా అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. 2018–21లో కెంటకీలోని లూయిస్విల్లే యూనివర్సిటీకి 18వ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2022 మే 10న పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ 19వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతిష్టాత్మక ‘ఇమ్మిగ్రెంట్ ఎచీవ్మెంట్’ అవార్డు అందుకు న్నారు. ప్రొఫెసర్ నీలి బెండపూడిని భారత్‌లోని ప్రముఖ వర్సిటీల్లో పరిశోధనను మెరుగుపరచి ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా 2 దేశాల మధ్య ఆరంభమైన కార్యక్రమానికి అవసరమైన సిఫార్సులను ప్రొఫెసర్ నీలి చేశారు. ఇందుకోసం ఆమె కోచర్‌గా నియమితులయ్యారు. -
Chat GPT చెప్పింది అని విద్యార్దులను ఫెయిల్ చేసాడు.. చివరికి ఏమైందంటే..
-
చాట్‌జీపీటీ చెప్పిందని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్..
ChatGPT false: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరమైనది కూడా. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడో ప్రొఫెసర్. రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడు. ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్! విద్యార్థులు వ్యాసాలు సొంతంగా రాస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఆ ప్రొఫెసర్ చాట్‌జీపీటీ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ అనేది ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌బాట్. ఇది వచనాన్ని రూపొందించగలదు. భాషలను అనువదించగలదు. వివిధ రకాల సృజనాత్మక కంటెంట్‌ను రాయగలదు. మీ ప్రశ్నలకు సమాచార రూపంలో సమాధానం ఇవ్వగలదు. తమ ఫైనల్ ఎగ్జామ్స్‌లో భాగంగా విద్యార్థులు తాము రాసిన వ్యాసాలను సమర్పించారు. వారి ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగించారు. అయితే విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాసినవని చాట్‌జీపీటీ సూచించింది. దీంతో విద్యార్థులు వ్యాసాలను సొంతంగా రాయలేదని భావించిన ప్రొఫెసర్ క్లాస్‌లోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు. అయితే, చాట్‌జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాశారని, కంప్యూటర్లను ఉపయోగించ లేదని స్పష్టమైంది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
విజిటింగ్ ప్రొఫెసర్‌గా ‘అలీబాబా’ జాక్ మా
టోక్యో: చైనా ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన పరిశోధన సంస్థ టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ కానున్నారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తి అంశంపై ఆయన పరిశోధనలు చేస్తారని వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రప్రెన్యూర్షిప్, కార్పొరేట్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో తన అనుభవాన్ని విద్యార్థులు, అధ్యాపకులతో జాక్ మా పంచుకుంటారని తెలిపింది. 1990ల్లో ఈ– కామర్స్ సంస్థ అలీబాబాను స్థాపించిన జాక్ మా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. -
ప్రొఫెసర్ విద్యావర్ధిని సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్ చేసిన అవకతవకలు, అక్రమాల్లో పాలుపంచుకున్న వృక్షశాస్త్రం ప్రొఫెసర్ విద్యావర్ధినిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పాలకమండలి తీర్మానించింది. బుధవారం హైదరాబాద్ లోని రూసా భవనంలో టీయూ పాలకమండలి సమావేశం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ ఆధ్వర్యంలో జరిగింది. వీసీ ప్రొఫెసర్ రవీందర్ హాజరు కాకపోవడంతో వాకా టి కరుణ సమావేశానికి చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చ నిర్వహించి కొన్ని తీర్మానాలు చేశారు. పాలకమండలి అను మతి లేకుండా ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన విద్యావర్ధిని పదవీకాలాన్ని గుర్తించేది లేదని నిర్ణయించారు. పైగా వీసీ విచ్చలవిడిగా చేపట్టిన అక్రమ నియామకాలు, ఆర్థిక అవకతవకల్లో పాలుపంచుకుని ఇష్టారీతిన సంతకాలు పెట్టినందున విద్యావర్ధినిని ప్రొఫెసర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానించారు. ఈ సస్పెన్షన్ తక్షణం అమలులోకి వస్తుందని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ఆర్థిక అవకతవకలపై విచారణ పూర్తయ్యేవరకు విద్యావర్ధిని వర్సిటీలోకి రావొద్దని ఆంక్షలు పెట్టారు. విద్యావర్ధిని నిర్ధోషిగా నిరూపించుకుంటేనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు అక్రమ మార్గంలో రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్న అకడమిక్ కన్సల్టెంట్ శ్రీనివాస్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ పాలకమండలి తీర్మానించింది. -
18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్ అయ్యాడు!
అతనికి 11 ఏళ్లు వచ్చే వరకు మాటలే రాలేదు. ఇక 18 ఏళ్లు వచ్చే వరకు ఆ యువకుడు చదవడం రాయడం నేర్చుకోలేకపోయాడు. కానీ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీకి ప్రోఫెసర్ అయ్యాడు. పైగా నల్లజాతీయుల్లో పిన్న వయస్కుడైన ప్రోఫెసర్‌గా నిలిచాడు. అదేలా సాధ్యం అనిపిస్తుంది కదూ!. కానీ జాసన్ ఆర్డే అనే వ్యక్తి అనితర సాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపి అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలిచాడు. అసలేం జరిగిందంటే..జాసన్ ఆర్డే అనే వ్యక్తి లండన్‌లోని క్లాఫామ్‌లో జన్మించాడు. అతను పుట్టుకతో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ డిజార్డర్ ఉండే పిల్లలకి సాధారణ పిల్లలో ఉండే పరిణతి ఉండదు. మానసిక ఎదుగుదల సంక్రమంగా ఉండక.. అందరి పిల్లల మాదిరి నేర్చుకోలేక వెనుకబడిపోతారు. జాసన్ ఈ సమస్య కారణంగా 11 ఏళ్లు వచ్చే వరకు మాట్లాడలేకపోయాడు. దీంతో చదవడం, రాయడం వంటికి 18 ఏళ్లు వచ్చే వరకు కూడా నేర్చుకోలేకపోయాడు. అదీగాక జాసన్‌కి ఎవరోఒకరి సాయం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఐతే జాసన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు, ఎలాగైనా.. తనంతట తానుగా ఉండగలగేలా, అన్నినేర్చుకోవాలి అని తపించేవాడు. తన తల్లి బెడ్రూంలో వరుసగా లక్ష్యాలను రాసుకుని ఎప్పటికీ చేరుకుంటానని ఆశగా చూసేవాడు జాసన్. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన క్షణాలు, 1995లో రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా సింబాలిక్ విజయాన్ని కైవసం చేసుకోవడం తదితరాలను టీవీలో చూసిన తర్వాత తన మనోగతాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. వారు పడ్డ కష్టాలను తెలుకుని చలించిపోయాడు. అప్పుడూ అనుకున్నాడు అత్యున్నత చదువులను అభ్యసించి.. కేంబ్రిడ్జి యూనివర్సిటికి ప్రోఫెసర్ కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఐతే అకడమిక్ పరంగా తనకు రాయడం, చదవడం వంటివి నేర్పించే గురువు లేరు కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకువాలి. నాలా బాధపడేవాళ్ల కోసం ఉపయోగపడేందుకైనా ముందు దీన్ని అధిగమించాలి అని గట్టిగా తీర్మానించుకున్నాడు. అలా జాసన్ ఎన్నో తిరస్కరణల అనంతరం రెండు మాస్టర్స్‌లో అర్హత సాధించాడు. సర్రే యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీస్‌లో డిగ్రీ పొందాడమే గాక 2016లో లివర్‌పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. 2018 తొలి సారిగా ప్రోఫెసర్‌గా తన తొలి పత్రాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో యూకేలో నల్లజాతీయులు అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రోఫెసర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన భాస్కర్ వీరా. జాసన్‌ని అసాధారణమైన ప్రోఫెసర్‌గా పిలుస్తుంటారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల ముఖ్యంగా నల్లజాతీయులు, ఇతర మైనార్టీ వర్గాల వరకు అండగా నిలవడమేగాక మార్గదర్శిగా ఉంటాడన్నారు. చదవండి: తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్ మరణం: జెలెన్స్కీ) -
ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్
లండన్: బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనా ఆసుపత్రుల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్–ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్టు సీఈఓగా భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ నియమితులయ్యారు. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ట్రస్టుకు ఒక మహిళ, అందునా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈఓ కావడం ఇదే తొలిసారి. ఆమె 2022 జూలై నుంచి ఓయూహెచ్ మధ్యంతర సీఈఓగా ఉన్నారు. కఠిన పోటీని ఎదుర్కొని తాజాగా పూర్తిస్థాయి సీఈఓ అయ్యారు. భాగస్వామ్య వర్సిటీలతో, ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ చారిటీతో కలిసి పనిచేస్తానని మేఘనా చెప్పారు. అత్యున్నత నాణ్యతతో కూడిన పరిశోధనలు, నవీన ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు. ఆమె అబ్స్టెట్రిక్స్, గైనకాలజీలో మేఘనా పండిట్ శిక్షణ పొందారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లో యూరోగైనకాలజీ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఎన్హెచ్ఎస్ ట్రస్టులో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, వార్విక్ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా చేశారు. -
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్‌లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్‌కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో కొంతకాలం చేసి, మహబూబ్‌నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్‌లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్‌కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్‌లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్‌కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
GN Saibaba Poems: ఒంటరి గానాలాపన
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) 2013 అక్టోబర్ నెలలో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే నెపంతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు, కవి, రచయిత ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను అరెస్ట్ చేసింది. ఆయన జైలుశిక్షకు ఎనిమిదేళ్ళు నిండాయి. బాంబే హైకోర్టు ఈ కుట్రకేసును కొట్టివేసినా, సుప్రీంకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఇవ్వాళ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. సాయిబాబా ఈ కేసు నుండి బయట పడతారు, ఎనిమిదేళ్ళ సాయి జైలు జీవితం పరిసమాప్తి అవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆశగా చూస్తున్నారు. ఇవాళ్టి కోనసీమ జిల్లాలోని అమలాపురం పక్కన చిన్న గ్రామంలో జన్మించారు సాయిబాబా. కొబ్బరి చెట్ల ఆకుల ఆవాసంలో, కిరోసిన్ దీపం వెలుగులో చదువుకొని, తన జ్ఞానపరిధిని ఢిల్లీ వరకు విస్తరించుకున్నారు. ఆదివాసులపై జరుగుతున్న దాడినీ, మధ్య భారతంలోని వనరుల దోపి డీనీ, బహుళజాతి సంస్థలు నిర్వహిస్తున్న మైనింగ్ అక్రమ దోపిడీనీ, ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. 2013లో అరెస్టు అయిన నాటికే సాయిబాబా ప్రజల గొంతుగా ఉన్నాడు. వికలాంగుడైనా ఆయన దృఢచిత్తుడు. జైలు జీవితమంటే జ్ఞాపకాల మధ్య జీవించడమే. ఈ ఎనిమిదేళ్ళ నిర్బంధంలో సాయిబాబా కవిగా రూపొందిన క్రమం చాలా చిత్రమైనది. జైలు కవిగా ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’, ‘కబీరు కవితలు’, ‘ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనువాదం’... అనేవి ఆయన కవిగా వ్యక్తీకరించుకున్న రచనలు. ‘నేను చావును ధిక్కరిస్తున్నాను’ విరసం ప్రచురణగా వచ్చింది. దీని ఆంగ్ల పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ బుక్స్, న్యూఢిల్లీ వారు ప్రచురించారు. సుదీర్ఘ కాలం జైలు జీవితంలోని అనుభవాన్ని సాయి కవిత్వం ద్వారా వ్యక్తీకరించాడు. జైలు, జైలు అధికారులు, సిబ్బంది నాలుగు గోడల మధ్య ఒక స్వాప్నికుని నిర్బంధం. క్లాసులో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ జైలు వంటి తరగతి గదిలో తన వంటి ఖైదీలతో జీవితాన్ని పంచుకునే విధానం... తన సహచరి, తోబుట్టువులు, తను పాఠాలు చెప్పే పిల్లలు... ఇవన్నీ సాయిబాబా కవితా వస్తువులు. తన రాజకీయ విశ్వాసాల కారణంగా తను ఎంచుకున్న వస్తువు కవితాత్మకంగా మలిచిన తీరు, కవిత్వ పరిభాషలో పరిణతి. విప్లవం, ప్రేమ, దిగాలు పడిన రాత్రులు, నూతన ఉదయాలు, జైలు గది కిటికీపై వాలిన ఒంటరి పిచ్చుక. ఈ కవిత్వం నిర్బంధితుని ఒంటరి గానాలాపన! సాయిబాబా విడుదల కావాలని ఢిల్లీలో విద్యార్థులు ప్రదర్శన చేస్తే ఏబీవీపీ ఆ విద్యార్థులపై దాడిచేసింది. ఆయన చేసిన నేరం మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని ఘోషించడం. – అరసవిల్లి కృష్ణ, విరసం అధ్యక్షులు -
థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం
-
థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్ విద్యార్థినిపై ఫ్రొఫెసర్ అత్యాచారయత్నం చేశాడు. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి యత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇప్పటికే రవిరంజన్‌పై మూడు కేసులు ఉన్నాయి. ప్రొఫెసర్ రవిరంజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఫ్రొఫెసర్ రవిరంజన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని.. -
సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ
నాంపల్లి (హైదరాబాద్): దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లుగా జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచిక దారుణంగా పడిపోయిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సామాజిక సదస్సులో పాల్గొన్న నాగేశ్వర్, సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు–ప్రభావాలు అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో 23 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని పేర్కొన్నారు. దేశ సంపదలో 20 శాతం కేవలం ఒక శాతం జనాభా చేతిలో ఉందన్నారు. బ్రిటన్ దేశాన్ని అధిగమించి ఐదవ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ భారతదేశం తలసరి ఆదాయం, బ్రిటన్ ప్రజల తలసరి ఆదాయం కంటే 20 రెట్లు తక్కువగా ఉందన్నారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పన్నును ఒకేసారి పది శాతం తగ్గించిందని చెప్పారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.లక్షా 80 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయిందని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ నివేదికలే చెప్తున్నాయని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఆలోచించడం, మతాచారాలను పాటించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా వ్యక్తుల ఇష్టాఇష్టాలు, వ్యక్తిగత సిద్ధాంతాల ప్రాతిపదికన పరిపాలన సాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణంతో పాటు ఎగుమతి, దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయన్నారు. కరోనా తర్వాతి కాలంలో కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యల్లోనూ నిజాయితీ లోపించడంతో ప్రజల కు ఏ రకమైన ఉపశమనం లభించలేదన్నారు. సద స్సులో టీఎన్జీఓ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
ఇదేం పాడు పని ప్రొఫెసర్.. విద్యార్థులకు అసభ్యకర వీడియోలు పంపి..
యశవంతపుర(బెంగళూరు): విద్యార్థులకు ఇన్‌స్టా గ్రాంలో అశ్లీల వీడియోలను పంపించిన మధుసూదన్ ఆచార్య అనే ప్రొఫెసర్‌ను నగరంలోని ఒక ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించింది. పోర్న్ వీడియోను విద్యార్థులకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న కాలేజీ పాలక మండలి ఆయనను ఇంటికి పంపించింది. గౌరవమైన పదవిలో ఉంటూ విద్యార్థులకు అసభ్యకరమైన పోస్టులు చేయడం తలవంపులు తెచ్చేదిగా పేర్కొంది. -
గురుభ్యోనమః.. నిరుపేద విద్యార్థుల కోసం షూ పాలీష్ చేస్తున్న ప్రొఫెసర్
తిరువళ్లూరు (చెన్నై): పేద, నిరాశ్రయ విద్యార్థుల చదువు కోసం నిధుల సేకరణలో భాగంగా తమిళ ప్రొఫెసర్ సెల్వకుమార్ పళవేర్కాడులో చెప్పులు, షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పాడియనల్లూరుకు చెందిన ప్రొఫెసర్ సెల్వకుమార్. అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కళాశాలలో తమిళ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. 2004లో మదర్ థెరిసా పాఠశాలను ఏర్పాటు చేసి 19 ఏళ్లుగా పేద, అనాథ విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో పాఠశాల నిర్వాహణ కష్టంగా మారడంతో వినూత్న రీతిలో నిధులను సేకరిస్తున్నాడు. కళాశాలకు సెలవు ఉన్న సమయంలో ప్రముఖ ప్రాంతాలకు వెళ్లి.. నేను మీ చెప్పులను తుడుస్తా. మీరు నావద్ద ఉన్న పిల్లల కన్నీటిని తుడవాలని కోరుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి తద్వారా వచ్చే నిధులను పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నాడు. ఇతడి ప్రయాణం ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో సాగింది. తాజాగా తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని కామరాజర్, అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. కోటైకుప్పం పంచాయతీ అధ్యక్షుడు సంపత్, మీంజూరు ధామోదరన్, పళవేర్కాడు సంజయ్‌గాంధీ సాయం అందించారు. -
రూ.23 లక్షల జీతాన్ని తిరిగి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. కారణం ఏంటంటే!
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటే పని చేసినా చేయకపోయినా సమయానికి జీతం తీసుకున్నామా, అందినంత వరకు సంపాదించుకున్నామా అన్నట్లు కొందరు ఉద్యోగులు ప్రవర్తిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా ఓ యూనివర్శిటీ మాష్టారు తన జీతం ఏకంగా రూ.23 లక్షలను తిరిగి తన పని చేసే కాలేజీ యాజమాన్యానికి తిరిగి ఇచ్చేశాడు. దీని వెనుక అతను చెప్పిన కారణం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షాకింగ్ నిర్ణయంతో బీహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రాంతంలోని నితీశ్వర్ కాలేజీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వార్తల్లో నిలవడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయంపై లాలన్ ఏమంటున్నారంటే.. నితీశ్వర్ కళాశాలలో అతను చేస్తున్న టీచింగ్‌తో సంతృప్తిగా లేనని తెలిపారు. ఏ మాత్రం తీసుకుంటున్న చేస్తున్న పనికి సమతూకంగా లేదని తన మనస్సాక్షి చెప్పినట్టుగానే తనకు వచ్చిన 33 నెలల జీతాన్ని మొత్తం( రూ. 23 లక్షలు) పని చేస్తున్న విశ్వవిద్యాలయానికి అంకితం చేస్తున్నాను అని అన్నారు. లాలన్ కుమార్ లేఖలో ఈ విధంగా రాశారు.. విద్యార్థులకు విధ్య నేర్పించకపోతే తానేందుకు జీతం తీసుకోవాలి. ఇక 25 సెప్టెంబర్ 2019 నుంచి కళాశాలలో పని చేస్తున్నాను. అండర్ గ్రాడ్యుయేట్ హిందీ విభాగంలో 131 మంది విద్యార్థులకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇక్కడి యూనివర్శిటీ విద్యార్ధులు చదువుకునే వాతావరణం లేదన్నారు. తనను మరో కళాశాలకు బదిలీ చేయాలని ఆ లేఖలో కోరారు. తాను రిజిస్ట్రార్‌కు లేఖ రాసిన కాపీలను వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, పీఎంవో, రాష్ట్రపతికి కూడా పంపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఠాకూర్ తన చెక్కును స్వీకరించడానికి మొదట నిరాకరించారు. బదులుగా అతనిని తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించమని కోరాడు. అయితే అతను తనను బదిలీ చేయాలని పట్టుబట్టాడు. -
Save Soil: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!
మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేశాడు. చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. గ్రహాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాడు. ఆ గ్రహాల మీద నీరు... మట్టి కోసం అన్వేషిస్తున్నాడు. ప్రాణికోణి నివసించే అవకాశం ఉందా అని పరిశోధిస్తున్నాడు. భూమికి ఆవల ఏముందో తెలుసుకునే ప్రయత్నమిది. అయితే... భూమి ఏమవుతుందోననే స్పృహను కోల్పోతున్నాడు. మన కాళ్ల కింద నేల ఉంది... ఆ నేల మట్టితో నిండినది. ఆ మట్టిని కాపాడుకున్నప్పుడే మనకు మనుగడ. ‘మట్టి ప్రమాదంలో పడింది... మట్టి ఆరోగ్యాన్ని కాపాడుదాం’... ... అని నినదిస్తున్నారు సేవ్ సాయిల్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ జయలేఖ. కేరళలో పుట్టి తెలుగు నేల మీద పెరిగిన ప్రొఫెసర్ జయలేఖ కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడింది. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ కోర్సు చేశారు. తొలి ఉద్యోగం ఇక్రిశాట్లో. ఆ తర్వాత బేయర్ మల్టీనేషనల్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేశారామె. పెర్ల్ మిల్లెట్ బ్రీడర్‌గా రిటైర్ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఆమె చదువు, ఉద్యోగం, అభిరుచి, అభిలాష అంతా నేలతో మమైకమై ఉండడంతో ఆమె ఉద్యమం కూడా నేలతో ముడివడి సాగుతోంది. మట్టికోసం సాగుతున్న ‘సేవ్ సాయిల్ గ్లోబల్ మూవ్మెంట్’లో చురుకైన కార్యకర్త జయలేఖ. ఆమె సాక్షితో మాట్లాడుతూ... ‘నేలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంద’న్నారు. ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్’ ప్రపంచాన్ని నిద్రలేపుతోంది. మట్టి ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తోంది. వ్యవసాయ నేలల్లో 52 శాతం నిస్సారమైపోయాయని గణాంకాలు చెప్పింది. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే 2050 నాటికి 90 శాతం నేల నిస్సారమవుతుందని, ప్రపంచం ఆకలి కేకలకు దగ్గరవుతుందని ‘యూఎన్‌సీసీడీ’ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులు 30 శాతం పడిపోయాయి. ఇప్పుడు కూడా ఉద్యమించకపోతే... నిర్లిప్తంగా ఉండిపోతే... ఇది నా సమస్య కాదు... ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు... అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే... వందేళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందని కూడా చెప్తోంది. సేవ్ సాయిల్ సామాజికోద్యమం అలా పుట్టిందే’ అని వివరించారు జయలేఖ. చైతన్య యాత్ర పిచ్చుక అంతర్థానమైన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించాం. కానీ మట్టి విషయంలో చేతులు కాలిన తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే ముందుగానే అప్రమత్తం కావాలి. మట్టి ప్రమాదంలో పడిందని ఇప్పటి వరకు తెలిసింది మేధావులకు మాత్రమే. ఈ వాస్తవం సామాన్యుడికి కూడా తెలియాలి. సామాన్యుల్లో చైతన్యం రావాలి. అందుకే ‘మట్టిని రక్షించు’ అని యాత్ర మొదలైంది. కాన్షియస్ ప్లానెట్ చొరవతో మొదలైన సేవ్ సాయిల్ థీమ్ ఇది. ఈశా ఫౌండేషన్, సద్గురు జగ్గీవాసుదేవ్ చేపట్టిన వంద రోజుల బైక్ యాత్ర మార్చి 21న లండన్‌లో మొదలైంది. మే నెల 29 నాటికి మనదేశంలోకి వచ్చిన సేవ్ సాయిల్ యాత్ర... ఐదు రాష్ట్రాలను చుట్టి ‘మట్టిని రక్షించు’ నినాదంతో ఈరోజు హైదరాబాద్‌కు చేరనుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడే ప్రభుత్వాలు తమ దేశంలో వాతావరణానికి, నేలతీరుకు అనుగుణంగా పాలసీలను రూపొందించడానికి ముందుకు వస్తాయి. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమం సఫలమవుతుంది. ఆ ఫలితం కోసమే మా ప్రయత్నం’’ అన్నారు జయలేఖ. – వాకా మంజులారెడ్డి మట్టికి ఆక్సిజన్ అందాలి మట్టి చచ్చిపోతోంది... చెట్టు ఎండిపోతోంది. మనిషి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన స్థితి. మట్టి సారం కోల్పోతే సంభవించే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... ఆహార కొరత, నీటి కొరత, జీవ వైవిధ్యత నశించడం, వాతావరణంలో పెనుమార్పులు, జీవన భద్రత కోల్పోవడం, పొట్ట చేత పట్టుకుని వలసలు పోవడం వంటివన్నీ భవిష్యత్తు మానవుడికి సవాళ్లవుతాయి. ఎంత తెలుసుకున్నప్పటికీ చేయగలిగిందేమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జీవం కోల్పోతున్న మట్టికి జవజీవాలనందివ్వాలి. వ్యవసాయ నేలలో ఏటా తప్పనిసరిగా యానిమల్ వేస్ట్, ప్లాంట్ డెబ్రిస్ ఇంకిపోవాలి. నేలను బీడు పెట్టకూడదు. చెట్టు పచ్చగా ఉంటే నేల చల్లగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఈ రెండూ గాడిలో ఉన్నప్పుడే మనిషి విశ్వాన్ని జయించగలిగేది. (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) మట్టికి ఏమైంది? మట్టిలో ఉండాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ నశించిపోతున్నాయి. అంటే మట్టిలో ఉండాల్సిన జీవం నిర్జీవం అవుతోంది. దాంతో మట్టిలోని సారం నిస్సారమవుంది. ఈ ఉపద్రవంలో కూడా అగ్రరాజ్యం అమెరికా పాత్ర తొలిస్థానంలో ఉంది. ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందనేది మనకు తెలియడం లేదు. కానీ ఇది భూగోళానికి మొదటి ప్రమాద హెచ్చరిక వంటిది. నేలలో సేంద్రియ పదార్థాల స్థాయి మూడు నుంచి ఆరుశాతం ఉండాలి. అలాంటిది యూరోపియన్ దేశాల్లో రెండు శాతానికి పడిపోయింది. మన దేశంలో అయితే 0.5 శాతమే ఉంది. ఆఫ్రికాదేశాల్లో మరీ అధ్వాన్నంగా 0.3 శాతం ఉంది. ఇలాంటి గణాంకాలు, నివేదికలు తెలిసిన వెంటనే ఇందుకు రసాయన ఎరువుల వాడకమే కారణం అంటూ... రైతును నిందిస్తుంటారు. అది పూర్తిగా తప్పు. వరదల కారణంగా భూమి కోతకు గురికావడం, అవగాహన లేక పంటలను మార్చకుండా ఒకే పంటను మళ్లీ మళ్లీ వేయడం... భూమిని బీడుగా వదిలేయడం వంటి అనేక కారణాల్లో రసాయన ఎరువులు ఒక కారణం మాత్రమే. అలాగే ఊరికి ఒకరో ఇద్దరో రైతులు ముందడుగు వేస్తే సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు వచ్చి పాలసీలు రూపొందించాలి. – ప్రొఫెసర్ ఎ.కె. జయలేఖ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి, savesoil.org -
పరీక్షలో ఫెయిల్ చేశారని పోలీసులకు ఫిర్యాదు!
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ విభాగంలో దురుద్దేశంతో తనతో పాటు కొందరు విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్ చేశారని, ఇందుకు బాధ్యులైన ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి రంగరాజుల గోపీనాథ్ తెలిపారు. సిలబస్‌లో లేని ప్రశ్నలు 50 శాతం ప్రశ్నపత్రంలో రావడంతో బోధకులను నిలదీశామని, దీనిపై కక్ష పెట్టుకొని ఫెయిల్ చేశారని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేయడం యూజీసీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పోలీసులు కేసునమోదు చేసి విచారణ నిర్వహించాలని కోరారు. విశ్వవిద్యాలయం అధికారులు స్పందించి ప్రత్యేక కమిటీ వేయాలని, జవాబు పత్రాలను ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన అర్హులైన బోధకులతో పునఃమూల్యాంకనం చేయాలని విన్నవించారు. ఈ విషయమై ఎచ్చెర్ల ఎస్సై కె.రాము వద్ద ప్రస్తావించగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: Kirru Cheppulu: ట్రెండ్ మారింది.. కిర్రు చెప్పుల ‘సోగ్గాడు’ -
ఫస్ట్ టైమ్: ఇక పాలన పాఠాలు
ప్రొఫెసర్ నీలోఫర్‌ఖాన్ ‘యూనివర్శిటీ ఆఫ్ కశ్మీర్’కు వైస్–చాన్స్‌లర్‌గా నియామకం అయ్యారు. ఫలితంగా ఆ యూనివర్శిటీ తొలి మహిళ వైస్–చాన్స్‌లర్‌గా చారిత్రక గుర్తింపు పొందారు. పాఠాలు చెప్పడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఖాన్‌కు విద్యార్థులలో మంచి గుర్తింపు ఉంది. ఆమె పాఠాలు వినడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహం చూపుతారు. ‘ఎంత సంక్లిష్టమైన విషయాన్ని అయినా, సులభంగా అర్థమయ్యేలా చెబుతారు’ అంటారు విద్యార్థులు. పాఠాలలోనే కాదు పాలన సంబంధిత విషయాలలోనూ ఆమెకు అపారమైన అనుభవం ఉంది. యూనివర్శిటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే యూనివర్శిటీ కౌన్సిల్, యూనివర్శిటీ సిండికేట్, అకాడమిక్ కౌన్సిల్... మొదలైన విభాగాలలో పనిచేశారు. ఆస్ట్రేలియా, మలేషియాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడి యూనివర్శిటీల పనితీరును అధ్యయనం చేశారు. ఆమె రచనలు దేశ, విదేశ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 20 పీహెచ్డీ స్కాలర్స్‌కు పర్యవేక్షకురాలిగా వ్యవహరించారు. ‘ఇంటర్నల్ కంప్లైంట్స్’ కమిటీకి చైర్‌పర్సన్‌గా పనిచేసిన ఖాన్‌కు యూనివర్శిటీ సమస్యల గురించి లోతైన అవగాహన ఉంది. విద్యార్థుల సంక్షేమం, యూనివర్శిటీని మరో స్థాయికి తీసుకువెళ్లడం తన ప్రాధాన్యత అంశాలుగా చెబుతున్నారు నీలోఫర్‌ఖాన్. -
కోరిక తీర్చకపోతే నీ అంతు చూస్తా.. విద్యార్థినికి అసభ్యకర వీడియోలు పంపి..
సాక్షి, చెన్నై: పాఠాలు బోధిస్తూ మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రొఫెసర్ పాడుబుద్ధితో విద్యార్థినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలని బాలికను హింసించేవాడు. చివరికి విద్యార్థిని వాటిని తట్టుకోలేక ఫ్రోఫెసర్పై కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఉదాంతం తమిళనాడులో చోటు చోసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులో కన్యాకుమారి కళాశాలో ఓ యువతి చదువుతోంది. ఆ కళశాలలోనే ప్రొఫెసర్‌గా పని చేస్తున్న వాసుదేవన్ విద్యార్థినిపై కన్నేశాడు. ఎలాగో ఒకలా ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. ఇక ఆ రోజు నుంచి ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలను పంపుతూ తరచూ వేధించేవాడు. అతని కోరికలని తీర్చాలని సదరు విద్యార్థినిని శారీరకంగా, మానసికంగానూ తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు.. ఆమె తన సోదరుడిని ఈ దారుణాన్ని చెప్పుకుంది. అనంతరం ఆమె సోదరుడు కళాశాలకు వచ్చి ప్రొఫెసర్ ను నిలదీయడంతో వారు బాధితులపైనే దాడి చేశారు. ఇక చేసేదేమి లేక చివరికి యువతి తన సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో ప్రొఫెసర్ ను సస్పెండ్ చేయాలని కళాశాలలో నిరసనలు చేపట్టారు. -
ఇది అసమానతలు పెంచే బడ్జెట్
ఒక సంపన్న దేశంగా మారాలనుకుంటున్నాం కానీ, ఒక సంక్షేమ దేశంగా మారాలనే స్వప్నాన్ని వదిలేశాం. ఈ నియో లిబరలిజం భావజాలమే మనకు ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏ దేశంలోనైనా అభివృద్ధి సాధించాలంటే రెండు రంగాలు ప్రధానం. మొదటిది విద్య, రెండోది వైద్య రంగం. రెండేళ్ల క్రితం ‘జాతీయ విద్యా విధానా’న్ని ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు విద్యారంగానికి ఎక్కువ డబ్బులు కేటాయించకపోవడం అనేది మనమెలా అర్థం చేసుకోవాలి! ఇక రెండోదైన వైద్య రంగంలో మనం కేటాయించే బడ్జెట్ గత 70 ఏళ్లుగా చాలా తక్కువే. దాదాపు 30 ఏళ్లుగా వైద్య రంగాన్ని కూడా పూర్తిగా మార్కెట్‌కు అప్పజెప్పే దిశలోనే ముందుకెళ్లాం. 80వ దశకం నుంచి బడ్జెట్ దృష్టంతా సంపద పెంపు పైనే ఉంది కానీ సంక్షేమం అనేది పూర్తిగా వెనక్కు నెట్టబడింది. దీని ఫలితంగా భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంత అసమానతలు పెరిగిపోయాయి. చాలా మంది బడ్జెట్‌ను ఆదాయాల, ఖర్చు పట్టికగా పరిగణిస్తారు. బడ్జెట్ అంటే కేవలం లెక్కలు చూపడమో, లేక ప్రభుత్వ కార్యక్రమాల మెనూ అనుకుంటారు. కానీ, భారతదేశం లాంటి దేశంలో బడ్జెట్ ఒక సామాజిక ప్రయోజనం, సామాజిక మార్పునకు సాధనంగా పరిగణించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో చాలా స్పష్టంగా అన్ని రకాల అసమానతలనూ తగ్గిస్తాం అని వాగ్దానం చేసింది. మనం ఈ అసమానతలను ఎలా తగ్గిస్తాం అనే ఒక సవాల్‌ను ఎదుర్కొంటే దేశ సంపదలను, ఉత్పత్తి సాధనాలను కేంద్రీకృతం కాకుండా సర్వ ప్రయోజనానికి దారి తీయాలని కూడా రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. ఈ సంపద పంచడం కానీ, లేదా ఉత్పత్తి సాధనాలను కానీ సమష్టి సమాజం చేతిలో కాకుండా వ్యక్తుల చేతిలోనే ఉండిపోయాయి. ఇక, అసమానతలను తగ్గించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం బడ్జెట్. 1950–60లలో మన దేశంలో సంపద పెరుగుతున్న కొద్దీ ప్రత్యక్ష పన్ను అదే నిష్పత్తిలో పెరుగుతూ వచ్చేది. అలా పెంచి, దాని ద్వారా వచ్చిన ఆదాయాలతో దేశంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారు. అలాగే సంక్షేమానికి ఆ వనరులను ఉపయోగించారు. 1970వ దశకంలో దేశ వ్యాప్తంగా అసంతృప్తి పెరిగినప్పుడు పేదరిక నిర్మూలన అనే ఒక నినాదం రావడమే కాక, బ్యాంకుల జాతీయీకరణ చేసి మొత్తంగా రాజ్యం పేద ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. 1980వ దశకం వచ్చేవరకు దేశ సంపద పెరగాల్సిన అంత వేగంగా పెరగడం లేదనీ, సంపద సృష్టికి సంపన్నులు తమ ఆదాయాన్ని పెంచుకునే వసతి కల్పిస్తే తప్ప దేశ సంపదను పెంచలేమనే పెట్టుబడిదారీ భావజాలం మన విధాన నిర్ణయాల్లోకి ప్రవేశించింది. ఇక, 80వ దశకం నుంచి బడ్జెట్ దృష్టంతా సంపద పెంపు పైనే ఉంది కానీ సంక్షేమం అనేది పూర్తిగా వెనక్కు నెట్టబడింది. దీని ఫలితంగా భారతదేశంలో గతంలో ఎన్నడూ లేనంత అసమానతలు పెరిగిపోయాయి. దేశ జనాభాలో ఒక్క శాతం ఉండే సంపన్నుల దగ్గర 56 శాతం ఆదాయం, దాదాపు 40 శాతం మంది ఉండే కింది వర్గాల దగ్గర మాత్రం 20 శాతం ఆదాయమే చేరుతోంది. ఒకప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో దాదాపు 40 – 50 శాతం వాటా ఉంటే, ఈ రోజు అది 13 శాతానికి తగ్గింది. దీంతో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితుల్లోకి వ్యవసాయ రంగం నెట్టబడింది. నిజానికి, దేశ జనాభాలో 45 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. కానీ, విధాన లోపం వల్ల అసమానతలు తీవ్రంగా పెరగడమే కాకుండా పేదరికం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యమే రైతాంగ ఉద్యమాలకు దారితీసింది. గత ఏడాది కాలంలో వాళ్లు ఉద్యమం చేయడమే కాక, ఏకంగా 700 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఇలా ఉన్నా బడ్జెట్లో దీని ప్రభావం మనకేమీ కనిపించడం లేదు. ఒకే ఒక్క అంశం ఏమిటంటే... కనీస మద్దతు ధర కోసం రూ. 2 లక్షల కోట్లు కేటాయించినట్టు విత్తమంత్రి ప్రకటించడం. విద్య, వైద్యాలకు ఇంతేనా? ఏ దేశంలోనైనా అభివృద్ధి సాధించాలంటే రెండు రంగాలు ప్రధానం. మొదటిది విద్య, రెండోది వైద్య రంగం. అమెరికా లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా కామన్‌స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేసి, అక్కడి పిల్లలందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. జపాన్, చైనా, దక్షిణకొరియా లాంటి దేశాలే కాక చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విద్యకు గణనీయమైన వాటా కేటాయిస్తున్నారు. విద్యారంగంలో పెట్టిన వనరులు ఆ దేశాల అభివృద్ధికి దోహదపడ్డాయి. రెండేళ్ల క్రితం ‘జాతీయ విద్యా విధానా’న్ని ప్రకటించిన ప్రభుత్వమే ఇప్పుడు విద్యారంగానికి ఎక్కువ డబ్బులు కేటాయించకపోవడం అనేది మనమెలా అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే, ఈ బడ్జెట్లో విద్యకు కేటాయింపు కొంత తగ్గించారు. ఇక విశ్వవిద్యాలయాల పరిస్థితులు కానీ, మొత్తం విద్యారంగ పరిస్థితి కానీ భవిష్యత్తుపై ఎలాంటి విశ్వాసాన్నీ కలిగించడం లేదు. విద్యను మార్కెట్ శక్తులకు అప్పజెప్పి ప్రైవేటు విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఈ దేశ సంక్షేమానికీ, భవిష్యత్తుకూ అపాయకరం. ఇక రెండోదైన వైద్య రంగంలో మనం కేటాయించే బడ్జెట్ గత 70 ఏళ్లుగా చాలా తక్కువే. దాదాపు 30 ఏళ్లుగా వైద్య రంగాన్ని కూడా పూర్తిగా మార్కెట్‌కు అప్పజెప్పే దిశలోనే ముందుకెళ్లాం. గత రెండేళ్ళుగా వైద్య రంగం ఎంత లోపభూయిష్ఠంగా ఉందో మనం చూశాం. మొత్తం సమాజం దాని దుష్ఫలితాలకు లోనైంది. వైద్య రంగ సదుపాయాలు సరిగ్గా లేక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు లేక ప్రజలు ఎన్ని రకాల బాధలు పడ్డారో మనమందరం చూశాం. ఈ బాధాకరమైన అనుభవం వల్ల వైద్య రంగానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని అందరూ ఆశించారు. కానీ చాలా ఆశ్చర్యంగా వైద్యరంగానికి కూడా కేటాయింపులు పెంచలేదు. సంపద సృష్టి దేని కోసమో తెలుసా? మన దేశం పెట్టుబడిదారీ పంథాయే కాక దానికి మించి ప్రమాదకరమైన నియో లిబరలిజం సాలెగూటిలో పడిపోతోంది. నియో లిబరలిజం కేవలం ఆర్థికవృద్ధిపై దృష్టి ఉంచి, సంక్షేమం అనేది అభివృద్ధికి అడ్డంకి అని వాదిస్తుంది. వాళ్ల సంపదను ఏ మాత్రం ముట్టినా దేశ అభివృద్ధి దెబ్బ తింటుందని ఈ విధానాన్ని అనుసరించే వారి వాదన. దేశంలో ప్రజలుంటారనీ, ప్రజల సంక్షేమం రాజ్యం యొక్క బాధ్యత అనీ, సంపద పెరగడంతో పాటు మనుషుల జీవితాలు మారాలనే ఆశయాలకు ఈ నియో లిబరలిజం పూర్తి వ్యతిరేకం. కానీ, మనం అనివార్యంగా అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే... ఏ సమాజంలోనైనా సంపద సృష్టి దేని కోసం అని? ప్రజల జీవితాలను మార్చకుండా, అందరికీ ఒక సుఖవంతమైన జీవితం కల్పించకుండా సమాజం సామరస్యంగా, సంతోషంగా ఉండడం సాధ్యం కాదు. ఈ మానవీయ దృక్పథాన్ని మనం కోల్పోతే ఒక అమానవీయ సమాజ నిర్మాణానికి దారితీస్తుంది. సంపన్న దేశమా? సంక్షేమ దేశమా? అందరం ఆలోచించాల్సింది మనకు ఎలాంటి సమాజం కావాలి? రాజ్యాంగమే ఎలాంటి సమాజ నిర్మాణం చేయాలో మనకు స్పష్టంగా సూచించింది. కానీ, రాజ్యాంగం నిర్దేశించిన దిశలో కాకుండా మొత్తంగా మన ఆలోచన, విధానాల దిశ మార్చుకుంటున్నాం. ఒక సంపన్న దేశంగా మారాలనుకుంటున్నాం కానీ, ఒక సంక్షేమ దేశంగా మారాలనే స్వప్నాన్ని వదిలేశాం. ఈ నియో లిబరలిజం భావజాలమే మనకు ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి స్కాండనేవియన్ దేశాల్లో సంపన్నుల దగ్గర దాదాపు 60–65 శాతం ఆదాయాన్ని రాజ్యం తీసుకొని, ప్రజలందరికీ ఒక భద్రత కలిగిన సమాజాన్ని సృష్టించుకున్నారు. ఆ దేశాల్లో ఘర్షణలూ తక్కువ, నేరాలూ తక్కువ. దాదాపు శాంతియుతంగా జీవిస్తున్న సమాజాలు అవి. మనం మాత్రం ఏ దారిలో పోతున్నామో, ఎక్కడికి పోతున్నామో అనే మార్గం తెలియని సందిగ్ధ సామాజిక స్థితిలోకి నెట్టబడ్డాం. బడ్జెట్ ఒక సామాజిక, ఆర్థిక మార్పునకు సాధనం అనే ఆశయాన్ని గుర్తిస్తే తప్ప బడ్జెట్లకు సంపన్నులకు చేసే సాధనాలుగా మిగిలిపోతాయి. ఇది సమాజ భవిష్యత్తుకు మంచిది కాదు! ప్రొ. జి. హరగోపాల్ వ్యాసకర్త ప్రముఖ సామాజికవేత్త, విశ్లేషకులు -
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..
Professor thrashes Principal inside his office: కొంతమంది పది మందికి బోధించే వృత్తిలో ఉండి కూడా అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అమానుషంగా దాడులు చేస్తారు. పైగా కనీసం తమ ఉనికిని కూడా మరిచిపోయి వొళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఒక ప్రొఫెసర్ అయ్యి ఉండి ప్రిన్స్‌పాల్‌పై అమానుషంగా దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకెళ్తే.. ఉజ్జయినిలోని ఘట్టియాలోని దివంగత నాగులాల్ మాలవ్య ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రహ్మదీప్ అలునె. అయితే ఏంజరిగిందో తెలియదు గాని ప్రొఫెసర్ బ్రహ్మదీప్ ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మేడంవార్ పై ఆగ్రహంతో దాడి చేశాడు. అంతేగాదు ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ వీడియోలో ప్రోఫెసర్ బ్రహ్మదీప్ కోపంతో ప్రిన్స్‌పాల్‌పై ఒక వస్తువును విసిరాడు. పైగా ఆగ్రహంతో ఊగిపోతూ అతని వద్దకు వచ్చి చేతులతో దాడి చేసినట్లు కనిపించింది. అంతేకాదు ఆ వీడియోలో బయటి నుంచి కొంతమంది వచ్చి ఆ ప్రొఫెసర్ని వెనక్కి లాగి కొద్దిసేపు సద్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఆ ప్రొఫెసర్ని వెళ్లిపోమని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా కోపంతో అక్కడే కుర్చిలాక్కుని మరీ కుర్చున్నాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్వచ్ఛందంగా ఆ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు ప్రిన్స్‌పాల్ శేఖర్ మాట్లాడుతూ..."ఆ ప్రొఫెసర్ బదిలిపై భోపాల్ నుంచి ఉజ్జయిని కాలేజికి వచ్చారని తెలిపారు. అంతేగాక అతను రోజు 5 కి.మీ దూరం నడిచి మరి కాలేజీకి వస్తాడన్నారు. అయితే మాకు సిబ్బంది తక్కువుగా ఉన్నారని, పైగా కాలేజీని కూడా వ్యాక్సిన్ కేంద్రగా మారుస్తున్నారనే విషయం గురించి మాట్లాడేందుకు పిలిచాను. అయతే అతను మాత్రం ఆగ్రహానికిలోనై దుర్భాషలాడుతూ కొట్టడం మొదలు పెట్టాడని చెప్పారు. (చదవండి: ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!) An assistant professor was booked for allegedly beating up principal of a Government College in Ujjain @ndtv @ndtvindia pic.twitter.com/egom5OIVjA— Anurag Dwary (@Anurag_Dwary) January 19, 2022 -
వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు
Japan Licking TV Screen With Food Flavours: ‘జపానోడు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే’.. అంటూ ఓ అరవ డబ్బింగ్ సినిమాలో ఫన్నీ డైలాగ్ ఉంటుంది. అయితే అడ్వాన్స్ టెక్నాలజీని పుణికిపుచ్చుకున్న దేశంగా జపాన్.. క్వాలిటీ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. ఈ తరుణంలో జపాన్ నుంచి వచ్చిన ఓ తాజా ఆవిష్కరణపై సరదా చర్చ మొదలైంది. ‘టేస్ట్ ద టీవీ’ TTTV పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించాడు ఓ జపాన్ ప్రొఫెసర్. ప్రొటోటైప్ టీవీ తెరను డెవలప్ చేసి దీనిని తయారు చేశాడు. ఇందులో తెర మీద రకరకాల రుచులను చూసే వీలు ఉంటుంది. ప్రత్యేకమైన సెటప్ ద్వారా టేస్టీ ట్యూబ్‌లను అమర్చి ఉంటుంది. చూడడానికి ఇది పది ఫ్లేవర్ల రంగులరాట్నం మాదిరి ఉంటుంది. మల్టీపుల్ సెన్సార్‌తో పని చేసేలా రూపొందించాడు ఆ ప్రొఫెసర్. వాయిస్ కమాండ్ తీసుకోగానే(ఏ ఫ్లేవర్ కావాలో.. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పాలి).. అప్పుడు తెర మీద ఉన్న ప్లాస్టిక్ షీట్‌పై ఆ ఫ్లేవర్ వచ్చి పడుతుంది. అప్పుడు ఎంచక్కా నాకి రుచిచూసేయొచ్చు. ప్రొఫెసర్ హోమెయి మియాషిటా.. మెయిజి యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇది తయారు చేయడానికి మియాషిటా ఆధ్వర్యంలోని 30 మంది విద్యార్థుల బృందం కష్టపడింది. ‘‘కరోనా టైంలో జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి కదా. అందుకే రెస్టారెంట్, వాళ్లకు నచ్చిన రుచి అనుభవం ఇంట్లోనే అందించేందుకు ఇలా ఫుడ్ ఫ్లేవర్లను అందించే డివైజ్‌ను రూపొందించాం’’ అని ప్రొఫెసర్ హోమెయి మియాషిటా చెప్తున్నారు. Taste the TV కమర్షియల్ వెర్షన్‌ను 875 డాలర్లకు అందించబోతున్నారు. వీటితో పాటు టేస్టింగ్ గేమ్స్, క్విజ్‌లను కూడా రూపొందించబోతున్నారు. పిజ్జా, చాక్లెట్ రుచిని అందించే స్ప్రేను సైతం తయారు చేయనుంది ఈ టీం. ఎక్స్‌క్యూజ్‌మీ.. కొంచెం మీ ముఖాన్ని అద్దెకిస్తారా? -
89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!
మనం ఏదోలా కష్టపడి చదివేసి ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు అనుకుంటాం. పైగా చాలామంది కలెక్టర్ అనో లేక మంచి కంపెనీలో మంచి హోదాలో ఉండే ఉద్యోగి కావాలనో అనుకుంటారు. కానీ కొంత వరకు ప్రయత్నించి ఈలోపు మధ్యలో ఏదైన చిన్న ఉద్యోగం వస్తే సెటిలైపోడానికే చూస్తాం. దీంతో మనం మన లక్ష్యాలను మధ్యలో వదిలేస్తాం. ఇంక మనం పెద్దవాళ్లమైపోయాం ఇంకేందుకు అనుకుంటాం. కానీ కొంత మంది మంచి ఉద్యోగం చేసి రిటైరైనప్పటికీ తమ లక్ష్యాన్ని, ఆసక్తిని వదులుకోరు. అచ్చం అలానే యూఎస్‌కి చెందిన 89 ఏళ్ల వృద్ధుడు పీహెచ్డా పూర్తి చేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. (చదవండి: నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!:వైరల్ అవుతున్న క్యూట్ వీడియో అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన మాన్‌ఫ్రెడ్ స్టైనర్ 89 ఏళ్ల వయసులో పిహెచ్డి చేసి భౌతిక శాస్త్రవేత్త కావాలనే తన కలను సాధించాడు. ఈ మేరకు స్టైనర్ ఈస్ట్ ప్రొవిడెన్స్, రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించాడు. అంతేకాదు స్టైనర్‌కి తన చిన్నతనం నుంచే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మాక్స్ ప్లాంక్‌ల గురించి చదివి తాను కూడా వారిలా భౌతిక శాస్త్రవేత్త కావాలని అనుకునేవాడు. అయితే స్టైనర్ తల్లి, మేనమామ సూచన మేరకు 1955లో వియన్నా విశ్వవిద్యాలయం నుండి తన వైద్యా విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత స్టైనర్ యూఎస్ వెళ్లి టఫ్ట్స్ యూనివర్సిటీలో హెమటాలజీని, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోకెమిస్ట్రీని అభ్యసించారు. ఈ మేరకు అతను 1985 నుండి 1994 వరకు బ్రౌన్‌లోని మెడికల్ స్కూల్లో హెమటాలజీ విభాగానికి అధిపతిగా సేవలందించాడు. ఆ తర్వాత స్టైనర్ 2000లో మెడిసిన్ విభాగం నుండి రిటైర్ అయ్యాడు. అయితే స్టైనర్‌కి వైద్య పరిశోధన సంతృప్తికరంగా ఉంది, కానీ భౌతికశాస్త్రం మీద తన ఆసక్తిని కోల్పోలేదు. దీంతో స్టైనర్ 70 ఏళ్ల వయస్సులో బ్రౌన్ వద్ద అండర్ గ్రాడ్యుయేట్ తరగతులు తీసుకోవడం ప్రారంభించాడు. పైగా 2007 నాటికల్లా పీహెచ్డీ ప్రోగ్రాం చేసేందుకు కావల్సిన అన్ని అర్హతలు సంపాదించాడు. ఈ మేరకు స్టైనర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ బ్రాడ్ మార్స్టన్ మాట్లాడుతూ..."స్టైనర్‌ను నా విద్యార్థిగా చేర్చుకోవడంపై మొదట చాలా సందేహించాను కానీ అతని అంకితభావానికి ముగ్ధుడునయ్యాను. ఇప్పుడతను నా పరిశోధనలకు సలహాదారుడిగా అయ్యాడు. అంతేకాదు నేను ఫిజిక్స్ పరిశోధనల్లో రాసినదానికంటే స్టైనర్ మెడికల్ సైన్స్‌లో చాలా పేపర్లు రాశాడు. యువ విద్యార్థుల్లో ఉండాల్సిన శాస్త్రీయ ఆలోచనా విధానం అభిరుచి ఇప్పటికి స్టైనర్ దగ్గర ఉంది."అని అన్నారు. అయితే స్టైనర్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీని పూర్తి చేయడం అనేది తనకు జీవితంలో అత్యద్భుతమైన విషయం అని అన్నాడు. పైగా తనకు ఉద్యోగం చేసే వయసు దాటిపోయిందని తాను కేవలం తన ప్రోఫెసర్ పరిశోధనలకు సలహదారుడిగా మాత్రమే ఉంటానని చెప్పుకొచ్చారు. (చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష) -
మళ్లీ ప్రొఫెసర్‌గానే పనిచేస్తా: థ్యాంక్యూ మోడీజీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ ఈ ఏడాది చివరితో తన బాధ్యతలకు విరామం పలకనున్నారు. తిరిగి బోధనా వృత్తికి వెళ్లిపోనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుబ్రమణియన్‌ను 2018 డిసెంబర్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా కేంద్రం నియమించింది. అంతకుముందు వరకు అరవింద్ సుబ్రమణియన్ ఈ బాధ్యతలు చూశారు. మూడేళ్ల పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసిపోనుంది. ఈలోపే కేవీ సుబ్రమణియన్ తన ఉద్దేశ్యాన్ని బయటపెట్టేశారు. తనకు మద్దతుగా నిలిచినందుకు, మార్గదర్శకంగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత బోధనవైపు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని సుబ్రమణియన్ ప్రకటించారు. -
కోచింగ్ సెంటర్ యజమానిపై కన్నేసిన ప్రొఫెసర్.. ఇంటికి ఆహ్వనించి
జైపూర్: ఉదయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వనించి.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. కాగా, బాధిత యువతి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, తాజాగా (సోమవారం) జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన బాధిత మహిళ స్థానికంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్‌ను నడుపుతుంది. దీంట్లో ఎందరో విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో.. నీరజ్‌కుమార్ అనే వ్యక్తి.. సదరు ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను తీసుకునేవాడు.కాగా, ఇతను ఉదయ్‌పూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేసేవాడు. అయితే, కోచింగ్ సెంటర్ లో క్లాసులు తీసుకోవడం వలన వీరిద్దరికి కొంత పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా నీరజ్ .. కోచింగ్ సెంటర్ యజమానిపై కన్నేశాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను లోంగదీసుకోవాలనుకున్నాడు. అదును కోసం చూడసాగాడు. దీంట్లో భాగంగానే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ యువతిని ఉదయ్‌పూర్‌లోని తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వనించాడు. అయితే, బాధిత యువతి తెలిసినవాడే కదా.. అని ఉదయ్‌పూర్ వెళ్లింది. కానీ, ప్రొఫెసర్ మనసులో ఉన్న దుర్భుద్ధిని మాత్రం గుర్తించలేకపోయింది. ఈ క్రమంలో అతగాడు..యువతి.. ఉదయ్‌పూర్ వచ్చాక ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత , ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దాని ప్రభావంతో ఆమె మత్తులోకి జారుకుంది. దీంతో.. అతగాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి మత్తు నుంచి తేరుకున్నాక.. సదరు యువతి ఆందోళనకు లోనైంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నీరజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న గోడుండా పోలీసులు నీరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వరల్డ్ ఫేమస్ దొంగల ముఠా.. ప్రతీదీ ట్విస్టే!
ఎంటర్టైన్మెంట్కి ఎల్లలు లేవు. అందుకే లోకల్ కంటెంట్‌తో పాటు గ్లోబల్ కంటెంట్‌కు ఆదరణ ఉంటోంది. ఇక ఓటీటీ వాడకం పెరిగాక.. దేశాలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లను డిజిటల్ తెరలపై చూసేస్తున్నారు మనవాళ్లు. ఆ లిస్ట్‌లో ఒకటే ‘మనీ హెయిస్ట్’. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ టీవీ సిరీస్‌కి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్.. అందులో తెలుగువాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కువమంది(ఇండియన్స్‌తో సహా) చూసిన నాన్–ఇంగ్లీష్ సిరీస్ కూడా ఇదే(ఇదొక రికార్డు). మనీ హెయిస్ట్కి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు.. ఈ సిరీస్ మూలకథ, ప్రధాన పాత్రలతో వ్యూయర్స్ పెంచుకున్న కనెక్టివిటీ. అందుకే ఐదో పార్ట్ రూపంలో అలరించేందుకు సిద్ధమైంది ఈ దొంగల ముఠా డ్రామా. సాక్షి, వెబ్‌డెస్క్: క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవాళ్లకు ‘మనీ హెయిస్ట్’ ఒక ఫుల్ మీల్స్. ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్–స్పానిష్ ఆడియెన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సిరీస్‌ను అందిస్తున్నారు. మొదటి సీజన్ 2017 మే 2న స్పానిష్ టీవీ ఛానెల్ ‘అంటెనా 3’ లో టెలికాస్ట్ అయ్యింది. స్పానిష్‌లో మనీ హెయిస్ట్ ఒక టెలినోవెలా.. అంటే టెలిసీరియల్ లాంటిదన్నమాట. మనీ హెయిస్ట్ టెలికాస్ట్ తర్వాత.. అప్పటిదాకా ఉన్న స్పానిష్ టీవీ వ్యూయర్షిప్ రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఆ పాపులారిటీని గుర్తించి నెట్‌ఫ్లిక్స్ మనీ హెయిస్ట్ రైట్స్‌ని కొనుగోలు చేసింది. అలా నెట్‌ఫ్లిక్స్ నుంచి ప్రపంచం మొత్తం ఈ ట్విస్టీ థ్రిల్లర్‌కు అడిక్ట్ అయ్యింది. మరో రికార్డ్ ఏంటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్న టీవీ సిరీస్ కూడా ఇదే!. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్లో ఐదో పార్ట్‌గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు వాల్యూమ్స్(ఎపిసోడ్స్‌గా) రిలీజ్ కానుంది. ఆ పై డిసెంబర్లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఎగ్జయిట్మెంట్ ఫ్యాన్స్‌లో మొదలైంది. ఎందుకంత అడిక్షన్? మనీ హెయిస్ట్ ఒరిజినల్(స్పానిష్) టైటిల్ ‘లా కాసా డె పాపెల్’. బ్యాంకుల దోపిడీ(హెయిస్ట్) నేపథ్యంలో సాగే కథ ఈ సిరీస్‌ది. దోపిడీకి ప్రయత్నించే గ్యాంగ్.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూసే పోలీసులు.. వెరసి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌తో కథ ముందుకెళ్తుంది. అలాగని స్టోరీ నార్మల్‌గా ఉండదు. సీన్‌కి సీన్‌కి ఆడియెన్స్‌లో హీట్ పెంచుతుంది. ట్విస్టుల కారణంగా ‘ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్‌లా’ అనిపిస్తుంది. కథలో తర్వాతి సీన్ ఏం జరుగుతుందనేది వ్యూయర్స్ అస్సలు అంచనా వేయలేరు. ఆ ఎగ్జయిట్మెంటే చూసేవాళ్లను సీటు అంచున కూర్చోబెడుతుంది. కథలో ఒక్కోసారి ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ వస్తుంటాయి. వాటి ఆధారంగానే కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఆడియెన్స్‌ని ప్రధానంగా ఆకట్టుకునే అంశం కూడా ఇదే. ఇక స్క్రీన్‌ప్లే సైతం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ చెప్పే డైలాగులు ఫిలసాఫికల్ డెప్త్‌తో ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యారంటే వదలకుండా చూస్తుంటారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ట్విట్టర్లో ఒకటి, రెండు రోజులు ట్రెండింగ్‌లో ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మనీ హెయిస్ట్ క్రేజ్ ఏపాటిదో. క్యారెక్టర్స్ కనెక్టివిటీ కాస్టింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్రతీ క్యారెక్టర్‌కి కరెక్ట్ సీన్లు పడటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ, మనీ హెయిస్ట్‌లో ప్రతీ క్యారెక్టర్‌కి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. ఈ కథ నారేటర్, దోపిడీ ముఠాలో ఫస్ట్ మెంబర్ ‘టోక్యో’. ఇక మెయిన్ క్యారెక్టర్ ‘ఎల్’ ఫ్రొఫెసర్. దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే. నిజానికి అతని యాక్చువల్ ప్లాన్ వేరే ఉంటుంది. ప్రొఫెసర్‌తో పాటు నైరోబీ, బెర్లిన్(ప్రొఫెసర్ బ్రదర్) అనే మరో రెండు క్యారెక్టర్లు టోటల్‌గా ఈ సిరీస్‌కే కిరాక్ పుట్టించే క్యారెక్టర్లు. అందుకే వాటికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు కథ విషయానికొస్తే.. ఆరంభంలో ఒక బ్యాంక్ దొంగతనం చేయబోయి ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంది ఒలివెయిరా(టోక్యో). ఆమెను పోలీసుల బారి నుంచి రక్షిస్తాడు ప్రొఫెసర్. ఆమెతో పాటు మరో ఏడుగురిని ఒకచోట చేర్చి భారీ దోపిడీలకు ప్లాన్ గీస్తాడు. ఆ ముఠాలో ప్రొఫెసర్ బ్రదర్ అండ్రెస్ డె ఫోనోల్లోసా(బెర్లిన్) కూడా ఉంటాడు.ఆ గ్యాంగ్‌లో ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. కానీ, ఎక్కడో దూరంగా ఉండి ప్రొఫెసర్ ఇచ్చే సూచనల మేరకు పని చేస్తుంటారు. పోలీసుల నుంచి రక్షించుకునే క్రమంలో జరిగే పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ క్రమంలో వాడే మోడరన్ టెక్నాలజీ, వెపన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. మధ్యమధ్యలో క్యారెక్టర్ల రిలేషన్స్, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్.. ఇలా కథ సాగుతూ పోతుంటుంది. కథలో ప్రతీ క్యారెక్టర్‌ను వ్యూయర్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టే.. అంతలా సూపర్ హిట్ అయ్యింది ఈ సిరీస్. సాల్వడోర్‌కు గౌరవసూచికంగా.. మనీ హెయిస్ట్ కథలో మరో ప్రధాన ఆకర్షణ.. క్యారెక్టర్ల పేర్లు. ముఠాలోని సభ్యులకు ఒరిజినల్ పేర్లు వేరే ఉంటాయి. వాళ్ల ఐడెంటిటీ మార్చేసే క్రమంలో వివిధ దేశాల రాజధానుల పేర్లు పెడతాడు ప్రొఫెసర్. టోక్యో, మాస్కో, బెర్లిన్, నైరోబీ, స్టాక్‌హోమ్, హెల్సెంకీ... ఇలాగన్నమాట. ఒకరకంగా ఈ పేర్లే మనీ హెయిస్ట్ను ఆడియెన్స్‌కి దగ్గర చేశాయి.. హయ్యెస్ట్ వ్యూయర్షిప్తో బ్రహ్మరథం పట్టేలా చేశాయి. కథలో ఆకట్టుకునే విషయం దోపిడీ ముఠా ధరించే మాస్క్‌లు. ఈ మాస్క్‌లకూ ఒక ప్రత్యేకత ఉంది. స్పానిష్ ప్రముఖ పెయింటర్ సాల్వడోర్ డాలి. ఆయన గౌరవార్థం.. ఆయన ముఖకవళికలతో ఉన్న మాస్క్‌ను ఈ సిరీస్‌కు మెయిన్ ఎట్రాక్షన్ చేశాడు ‘లా కాసా డె పాపెల్’ క్రియేటర్ అలెక్స్ పీనా. ఈ టీవీ షో తర్వాతే అలెక్స్ పీనా పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. ఆయనకి బడా ఛాన్స్‌లు తెచ్చిపెట్టింది. ఊపేసిన బెల్లా చావ్ మనీ హెయిస్ట్ థీమ్ మ్యూజిక్ కంటే.. ఈ సిరీస్ మొత్తంలో చాలాసార్లు ప్లే అయ్యే పాట బెల్లా సియావో(బెల్లా చావ్)కి ఒక ప్రత్యేకత ఉంది. బెల్లా సియావో ఒక ఇటాలియన్ జానపద గేయం. ఇంగ్లీష్‌లో దానర్థం ‘గుడ్‌బై బ్యూటిఫుల్’ అని. పాత రోజుల్లో ఇటలీలో మాండినా(సీజనల్ వ్యవసాయ మహిళా కూలీలు) తమ కష్టాల్ని గుర్తించాలని భూస్వాములకు గుర్తు చేస్తూ ఈ పాటను పాడేవాళ్లు. 19వ శతాబ్దం మొదట్లో నార్త్ ఇటలీలో వ్యవసాయ కూలీలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేవాళ్లు. ఆ టైంలో ఈ పాట ఉద్యమ గేయంగా ఒక ఊపు ఊపింది. 1943–45 టైంలో యాంటీ–ఫాసిస్టులు ఈ పాటను ఎక్కువగా పాడేవాళ్లు. ఆ తర్వాత ఈ పాట వరల్డ్ కల్చర్‌లో ఒక భాగమైంది. చాలా దేశాల్లో రీమేక్ అయ్యింది. 1969 నుంచి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా బెల్లా సియావో ఒక భాగమైంది. కానీ, మోస్ట్ పాపులర్ సాంగ్‌గా గుర్తింపు పొందింది మాత్రం మనీ హెయిస్ట్ సిరీస్‌తో. మెయిన్ క్యారెక్టర్స్ ఎల్ ప్రొఫెసర్, బెర్లిన్(అన్నదమ్ములు) కలిసి పాడిన ఈ పాట తర్వాత సీజన్ల మొత్తం నడుస్తూనే ఉంటుంది. 2018 సమ్మర్లో ‘బెల్లా సియావో’ యూరప్‌లో ఒక చార్ట్బస్టర్సాంగ్గా గుర్తింపు పొందింది. తెలుగులో మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’లో.. ‘పిల్లా.. చావే...’ సాంగ్ దీని నుంచే స్ఫూర్తి పొందిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
విషాదం: హెచ్‌సీయూ ప్రొఫెసర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నారు. మెడికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రిషీభరద్వాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెచ్‌సీయూలో ఆయన ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్. కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇడ్లీని అంతమాట అంటాడా
‘మాట పెదవి దాటితే పృథివి దాటుతుంది’ అని సామెత. నాలుక మీద అదుపును కోల్పోవద్దని చెప్పడమే ఈ సూక్తి ఉద్దేశం. అలా అదుపు కోల్పోయాడు బ్రిటన్‌లో ఒక ప్రొఫెసర్. అంతే... ఇడ్లీప్రియులు సంఘటితం అయ్యారు. దక్షిణ భారతావని శక్తి ఏమిటో తెలుసుకుంటున్నాడు ప్రొఫెసర్. ఇడ్లీ తన చావుకు తెచ్చిందని విచారిస్తున్నాడు. ఇంతకీ ఆ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ ఆండర్సన్ గారు అన్న మాట ఏంటంటే... ‘ప్రపంచంలో ఇడ్లీ అంతటి బోర్ కొట్టే పదార్థం మరొకటి ఉండదు’ అని. అంతే! సోషల్ మీడియాలో ఏకంగా యుద్ధమే మొదలైంది. ‘జీవితంలో ఎప్పుడైనా ఇడ్లీ తిన్నావా బాసూ’ అని ఒకరు, ‘ఇడ్లీ ఎలా చేయాలో తెలుసా’ అని ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘వేడి వేడి మినీ ఇడ్లీ మీద నెయ్యి, కారం పొడి చల్లి తిని చూడు బ్రదర్’ అని ఒకరు సూచన విసిరారు. ‘ఇడ్లీ రుచి తెలిసేటంతటి నాగరకత అలవడడం కష్టమే. ఆ ప్రొఫెసర్ ఇడ్లీ రుచి ఎలా ఉంటుందో తెలియకుండా జీవించేశాడు పాపం’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కొడుకు ట్వీట్‌కు జతకలుపుతూ ప్రొఫెసర్ పట్ల జాలి ప్రకటించారు. ‘ఇడ్లీ మీద సాంబార్ పోసి జారుడుగా తినవచ్చు. చట్నీతో గట్టిగా తినవచ్చు. యాపిల్ సాస్‌తో కూడా తినవచ్చు. తక్కువ సమయం లో తయారు చేసుకోగలిగిన బలవర్ధకమైన ఆహారం ఇడ్లీ. ఇడ్లీ మీద వచ్చిన విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడానికి, ఇడ్లీ ప్రాధాన్యతను కాపాడుకోవడానికి తమిళ రక్తం సిద్ధమవుతోంది’ అని మనస్విని రాజగోపాలన్ అనే నెటిజన్ ఓ హెచ్చరికను జారీ చేసింది. ‘మెత్తటి ఇడ్లీలను మటన్ షోరువాతో తిని చూడు’ అని నవీన్ చమత్కరించాడు. ‘ఇడ్లీని సాంబార్, కొబ్బరి చట్నీ, మటన్ ఖీమా, చికెన్ కర్రీ దేనితోనైనా సరే ఎనిమిది నుంచి పది ఇడ్లీల వరకు తింటాను. నా దగ్గరకు రా... ఇడ్లీ ఎలా తినాలో చూపిస్తాను. ఇడ్లీ చేయడం చేతరాని వాళ్లంతా ఇడ్లీని విమర్శించే వాళ్లయ్యారు’ అని కోపగించుకున్నాడు ఓ తంబి. ‘లండన్‌లో కూర్చుని మాట్లాడడం కాదు, కోయంబత్తూర్కొచ్చి అన్నపూర్ణ హోటల్లో రాత్రి ఏడు గంటలకు సాంబార్ ఇడ్లీ తిని అప్పుడు చెప్పమనండి’ అని శుభ విసుక్కుంది. తమిళులతోపాటు కన్నడిగులు కూడా ఈ ఇడ్లీ మద్దతు బృందంలో చేరిపోయారు. కర్ణాటక లో చేసే రకరకాల సాంబార్లు, బాంబూ ఇడ్లీ వంటి ప్రయోగాల గురించి తెలుసుకోకుండా ఏదో అనేస్తే ఎలా... ప్రదీప్ అనే మైసూరు నెటిజన్ గొంతు కలిపాడు. రెండు రాష్ట్రాలు ఏకమై పోరాడుతుంటే మనం చూస్తూ ఊరుకోవడం ఏమిటని ‘ఆంధ్రాలో ఇడ్లీలోకి ఎన్ని రకాల చట్నీలు చేస్తారో తెలుసుకోండి. ఒక్కో చట్నీతో ఒక్కోరకమైన రుచినిచ్చే ఇడ్లీని ఇంత మాట అంటారా’ అని అనిరుథ్ భృకుటి ముడివేశాడు. జ్యోతి మెనన్ అందుకుంటూ ‘నార్త్ మలబార్లో చేసే సాంబార్‌తో ఇడ్లీ తినండి’ అని ఆండర్సన్‌ను ఒక పోటు పొడిచింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆండర్సన్ ‘నాకు సౌతిండియన్ ఫుడ్‌లో దోశె, ఆప్పం చాలా ఇష్టం. ఇడ్లీ అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు’ అని సవరించుకున్నాడు. అయినా ఆ రెండో మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదటి మాట వేడి ఇంకా తగ్గనే లేదు. ఈ బృందం మరింత మందితో బలోపేతం అవుతూనే ఉంది. ఒక జాతిని ఏకతాటి మీదకు తీసుకురావడానికి ఓ చిన్న మాట చాలు... అని ఇప్పుడు ఇడ్లీ నిరూపించింది. ఈ టీ కప్పులో తుపానుకు కారణం జొమాటో. ‘జనం ఎందుకు అంతగా ఇష్టపడతారో అర్థం కాని ఒక వంటకం పేరు చెప్పండి’ అని అడిగింది. అప్పుడు ఎడ్వర్డ్ ‘ఇడ్లీ’ అని నోరు జారాడు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో అమ్మ ఇడ్లీ పెడితే... ‘నాన్నా! ఈ రోజు డెడ్లీ బ్రేక్‌ఫాస్ట్’ అని ఇడ్లీ పట్ల నిరసన వ్యక్తం చేసే పిల్లలు మన ఇళ్లలోనూ ఉంటారు. ఇదే పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చే సరికి వేడి వేడి ఇడ్లీ పెడితే ఆవురావురుమని తింటారు. ఇడ్లీని ఇడ్లీలా తినవచ్చు, ఉప్మాగా మార్చుకోవచ్చు.. ఇడ్లీని పొడవు ముక్కలుగా కట్ చేసి కార్న్‌ఫ్లోర్‌లో కానీ మంచూరియా మిక్స్‌లో కానీ ముంచి నూనెలో వేయించి కరకరలాడే స్నాక్‌గా తినవచ్చు. ఎన్ని రకాలుగా తిన్నా ఆ రుచికి మరేదీ సాటి రాదు. ఈ సంగతి తెలియక పాపం ఆండర్సన్ ఇలా చిక్కుకుపోయాడు. -
యువతిని వేధిస్తున్న అధ్యాపకుడి అరెస్టు
గుంటూరు ఈస్ట్: యువతిని వేధిస్తున్న ఘటనలో ఓ అధ్యాపకుడిని అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. వివాహితుడైన ఆ అధ్యాపకుడు ప్రేమ పేరుతో గతంలో యువతిని మోసం చేసి, అరెస్టయ్యాడు. బెయిల్‌పై వచ్చి తిరిగి వేధిస్తుండడంతో పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. అరండల్‌పేట ఎస్ఐ ఎస్.రవీంద్ర కథనం మేరకు.. స్తంభాలగరువు ఎల్ఐసీ కాలనీ ఒకటో లైనుకు చెందిన చిలికా శ్రీనివాసరావు బ్రాడీపేటలో ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండేవాడు. అతడికి గతంలోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఓ బీఈడీ కళాశాలలో చదువుతున్న ఓ యువతి శ్రీనివాసరావు వద్ద ఇంగ్లిష్ కోచింగ్ తీసుకునేది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు ప్రేమపేరుతో నమ్మించి నిశ్చితార్థం చేసుకుని రూ.2 లక్షలు తీసుకున్నాడు. అనంతరం తాను వివాహితుడినని చెప్పి పెళ్లికి నిరాకరించాడు. యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు తిరిగి యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి పుట్టిన రోజునాడు కేకులు కోసి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం, పెళ్లి చేసుకోవాలని వత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె తల్లిని దుర్భాషలాడాడు. యువతికి వివాహం కాకుండా చేస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో శ్రీనివాసరావును పోలీసులు సోమవారం మరోసారి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
కరోనా కొమ్ముల్లోని కొద్దిభాగమే వ్యాధికి కారణం
రాయదుర్గం: శ్యాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందిని కల్గించండం కరోనా ప్రధాన లక్షణమని హెచ్‌సీయూ విభాగం ప్రొ. లలితా గురుప్రసాద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఆమె చేస్తున్న పరిశోధనలను బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకజాతికి చెందిన గబ్బిలాలు ఈ వైరస్‌లకు కేంద్రస్థానాలని భావిస్తున్నామన్నారు. తరచుగా పొందుతున్న ఉత్పరివర్తనలతో ఈ వైరస్ ఇతర జంతువులకి వ్యాప్తిస్తోందన్నారు. కరోనా వైరస్ కొమ్ములాంటి ప్రోటీను నిర్మాణం ఉంటుందన్నారు. ఈ వైరస్ మనుషులలో రక్తపోటు కలిగించే ఎంజైమ్–2 గ్రాహకంగా మారుతోందన్నారు. అమెరికాలోని లాస్ ఆల్మాస్ జాతీయ ప్రయోగశాల పరిశోధకులు కూడా ఇలాంటి అభిప్రాయలనే వెలిబుచ్చారని గుర్తు చేశారు. -
5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా కోవిడ్-19 మహమ్మారితో అతలాకుతలమవుతున్న వేళ ఐఐటి-రూర్కీ ప్రొఫెసర్ కీలక విషయాన్ని వెల్లడించారు. కేవలం అయిదు సెకన్లలో కరోనా వైరస్ వ్యాధిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను తాను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి ఎక్స్-రే ఉపయోగించి ఐదు సెకన్లలోను వైరస్ ఉనికిని గుర్తించవచ్చని చెప్పారు. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, వైద్యులు ఒక వ్యక్తి ఎక్స్‌రే చిత్రాల ద్వారా సాఫ్ట్వేర్ రోగికి న్యుమోనియా లక్షణాలు ఉన్నాయా లేదా అని వర్గీకరించడమే కాదు, అది కరోనాకు సంబంధించిందా లేక ఇతర బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అనేది గుర్తించవచ్చన్నారు. తద్వారా ఈ వ్యాధి విస్తరణను అడ్డుకోవచ్చని తెలిపారు. దీని పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం) ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి 40 రోజులు పట్టిందని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ వెల్లడించారు. కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్లను విశ్లేషించిన తరువాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. అలాగే అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ ఛాతీఎక్స్-రే డేటాబేస్ ను కూడా విశ్లేషించానని చెప్పారు. ఈ సాఫ్ట్వేర్ పరీక్ష ఖర్చులను తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ నిపుణులు గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందన్నారు అయితే జైన్ వాదనకు వైద్య సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ రాలేదు. కాగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలను దాటేసింది. మరణాల సంఖ్య 718కి పెరిగింది. (జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్) -
మంగళగిరి ఎన్నారై కళాశాలలో కీచక ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, అమరావతి/మంగళగిరి: నా మాట వినకుంటే ప్రాక్టికల్ మార్కుల్లో కోత వేస్తానంటూ వైద్య విద్యార్థినులను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో రేడియాలజీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు వైద్య విద్యార్థినుల్ని లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం ఇటీవల వెలుగు చూడడం తెలిసిందే. ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వైద్య విద్యార్థినులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి తమ గోడు విన్నవించారు. దీనిపై వీసీ చర్యలకు ఉప్రకమించారు. రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్ పోలీసులు కీచక ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేయడమేగాక గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టులో హాజరు పరచగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్వీవీఎన్ లక్ష్మి.. అతనికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు.. డా.నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా ఎన్ఆర్ఐ వైద్యకళాశాలలోని రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే కళాశాలలో చదువుతున్న రేడియాలజీ పీజీ వైద్య విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం, రకరకాలుగా వేధించడం చేశారు. వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు ఎన్ఆర్ఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఎంసీఐ నిబంధనల మేరకు ప్రతి వైద్య కళాశాలలోనూ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి, అక్కడకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కళాశాల యాజమాన్యం ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థినులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. వీసీ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎన్ఆర్ఐ కళాశాలకెళ్లి విచారణ జరిపి ప్రొఫెనర్ వేధింపులు నిజమేనని తేల్చింది. దీనిపై యాజమాన్యాన్ని వీసీ వివరణ కోరగా... ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారని, ఆయన రాజీనామాను ఆమోదించామని బదులిచ్చారు. దీనిపై వీసీ.. రాజీనామా చేసి వెళ్లిపోతే వదిలేస్తారా, పోలీసు కేసు నమోదు చేయరా అంటూ నిలదీశారు. కళాశాల అంతర్గత విచారణలోనూ ప్రొఫెసర్ వేధించినట్టు నిర్ధారించాక పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. విద్యార్థినులు జిల్లా ఎస్పీని తాజాగా కలసి ఫిర్యాదు అందజేయడమేగాక ప్రొఫెసర్ తీరుపై వీడియోలతోసహా ఆధారాలను సమర్పించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించడంతో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడమేగాక నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ వేధింపులపై ఎథికల్ కమిటీకి సిఫార్సు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వేధింపులపై రెండు కమిటీలు వేయగా వేధింపులు నిజమేనని అవి రెండూ తేల్చాయి. దీంతో భారతీయ వైద్యమండలి ఎథికల్ కమిటీకి ఈయన విషయాన్ని సిఫార్సు చేస్తున్నా. వైద్య విద్యార్థినుల స్టేట్‌మెంటుతోపాటు విచారణ కమిటీ నివేదికనూ పంపిస్తాం. ఎథికల్ కమిటీ విచారణ జరిపి ఆయన ఎంసీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తుందా.. ప్రాక్టీస్ చేయకుండా చర్యలు తీసుకుంటుందా అన్నది వేచిచూడాలి. –డా.కె.వెంకటేష్, వైస్ చాన్స్‌లర్ (ఇన్చార్జి), ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
ప్రొఫెసర్‌కు మరణశిక్ష; పాక్‌ను అభ్యర్థించిన ఐరాస
సాక్షి, ఇస్లామాబాద్ : దైవ దూషణ ఆరోపణలపై ప్రొఫెసర్‌కు మరణ శిక్ష విధించడాన్ని ఐరాస మానవ హక్కుల కమిషన్ పాకిస్తాన్‌ను తప్పుపట్టింది. మరణశిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అపహాస్యమైనదిగా పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ప్రొఫెసర్ జునైద్ హఫీజ్‌కు హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, హైకోర్టు న్యాయమూర్తులు హఫీజ్‌ను నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. అసాధారణ కేసులలో మాత్రమే మరణ శిక్ష విధించాలని, లేకపోతే తిరుగులేని సాక్ష్యం అయినా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. హఫీజ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు కనుక శిక్షను అమలు చేయడమంటే ఈ చర్య ఏకపక్ష నిర్ణయంతో పాటు అంతర్జాతీయ చట్టానికి విరుద్దమని వారు తెలిపారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను చట్టబద్ధంగా వినియోగించే వ్యక్తులకు దైవ దూషణ చట్టాలు అడ్డంకిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, హఫీజ్‌ను ఐరాస మత స్వేచ్ఛా కమిషన్ ప్రపంచ బాధితుల జాబితాలో చేర్చింది. 2013లో మహమ్మద్ ప్రవక్తపై ప్రొఫెసర్ జునైద్ హఫీజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మిలిటెంట్ ఇస్లామిస్ట్ పార్టీకి చెందిన విద్యార్థులు ఆరోపించారు. 95 శాతం ముస్లింల జనాభా ఉన్న పాకిస్తాన్లో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే మరణ శిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో ఉదారవాద, లౌకిక అభిప్రాయాలు కలిగిన హఫీజ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అతని తరపు న్యాయవాది ఆరోపించారు. అంతకు ముందు 2014లో హఫీజ్ తరపున వాదించడానికి అంగీకరించిన న్యాయవాది రషీద్ రెహ్మీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ ఘటనలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా నిందితులుగా పేర్కొనలేదు. చదవండి : పాక్ : దైవదూషణ కేసులో ప్రొఫెసర్‌కు మరణశిక్ష -
వైద్య విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు?
మంగళగిరి: మండలంలోని ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థినులను ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం వెలుగులోకి రావడంతో కళాశాలలో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఏకంగా 11 మంది పీజీ మెడికల్ విద్యార్థినులను ఓ ప్రొఫెసర్ లైంగికంగా వేధించిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో విషయం బట్టబయలైంది. అయితే ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసేందుకు విద్యార్థినులు స్టేషన్‌కు వెళ్లారనే సమాచారం అందుకున్న యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకుని ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకుని విద్యార్థినులకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దీంతో మెత్తబడిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగినట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులపై విద్యార్థినులు తొలుత యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సదరు ప్రొఫెసర్ మరింత రెచ్చిపోయాడని, దీంతో విద్యార్థినులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే యాజమాన్యం జోక్యం చేసుకుని సదరు ప్రొఫెసర్‌ను తొలగించడంతో పాటు మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ కళాశాలలో పీజీ పూర్తిచేయాల్సి ఉండడంతో విద్యార్థినులు సైతం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇదే కళాశాలలోని హాస్టల్లో విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వాడుతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. -
విద్య కోసం పింఛను విరాళం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని విద్యా సంస్థల అభివృద్ధికి గాను ఓ మాజీ మహిళా ప్రొఫెసర్ నెలనెలా తనకొచ్చే రూ.50 వేల పెన్షన్‌ను విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. 2002 నుంచి ఇప్పటివరకు రూ.97 లక్షలు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విరాళమిచ్చినట్లు మాజీ ప్రొఫెసర్ చిత్రలేఖ మల్లిక్ వెల్లడించారు. కోల్‌కతాలోని బాగుతి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. విక్టోరియా ఇన్స్టిట్యూట్లో సంస్కృతం ప్రొఫెసర్‌గా ఆమె పనిచేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిశోధనలు చేస్తున్న వారికి ఆర్థిక సాయం అందించేందుకే ఇలా విరాళమిస్తున్నట్లు తెలిపారు. తనకు నెలకు పింఛన్ కింద రూ.50 వేలు వస్తున్నాయని, ప్రొఫెసర్‌గా పనిచేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీకి రూ.50 లక్షలు విరాళమిచ్చినట్లు పేర్కొన్నారు. తన పరిశోధనలకు మార్గనిర్దేశకత్వం చేసిన పండిట్ బిధుభూశణ్ భట్టాచార్య జ్ఞాపకార్థం గతేడాది రూ.50 లక్షలను వర్సిటీకి అందజేసినట్లు తెలిపారు. మొదటిసారిగా 2002లో తన పింఛన్ రూ.50 వేలను విక్టోరియా ఇన్స్టిట్యూట్ మౌలిక వసతుల కోసం విరాళమిచ్చినట్లు చెప్పారు. అలాగే హౌరాలోని ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్‌కు రూ.31 లక్షలు విరాళం ఇచ్చానని అన్నారు. -
ప్రియాంకారెడ్డి ఉన్నత ప్రతిభావంతురాలు
సాక్షి, హైదరాబాద్: ప్రియాంకారెడ్డి ఉన్నత ప్రతిభావంతురాలని, చదువుతోపాటు సామాజిక సమస్యలపైనా ఆమె ఎప్పటికప్పుడు చురుగ్గా స్పందించేవారని పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాంసింగ్ తెలిపారు. తమ వెటర్నరీ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారని, ఆమెకు తాను చదువు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 2017లో చివరిసారి స్నాతకోత్సవం సందర్భంగా తనను కలిసి జాబ్ చేస్తున్నట్లు ప్రియాంక చెప్పారని ఆయన తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఆమె మెరిట్లో జాబ్ సంపాదించారని తెలిపారు. యూనివర్సిటీలో ప్రియాంక చదువుకునేటప్పుడు హస్టల్ ఫుడ్, వాటర్ ఆమెకు పడకపోయేదని, అందుకే బుద్వేల్‌లో వాళ్ల అమ్మ దగ్గర ఉంటూ చదువుకున్నారని రాంసింగ్ చెప్పారు. కాలేజీ విద్యలో ప్రియాంక చాలా చురుకుగా ఉన్నారని చెప్పారు. క్యాంపస్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా అందరితో కలిసి ఆమె కూడా పాలుపంచుకునేవారని తెలిపారు. అయితే, ప్రియాంక సున్నిత మనస్కురాలని, కాలేజీలోనూ తన పని తాను చేసుకుంటూ పోయేవారని, తన చదువు. ఇల్లు తప్ప ఇతరత్రా పట్టించుకునేది కాదని, అలాంటి అమ్మాయిని రేప్ చేసి చంపేసిన మూర్ఖులకు కఠిన శిక్షలు పడాలని రాంసింగ్ కోరారు. -
కీచక అధ్యాపకుడి అరెస్టు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనవర్సిటీలో విద్యార్థినులను లైంగి క వేధింపులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంగ్లిష్ విభాగాధిపతి నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్రను అరెస్టు చేశామని స్థానిక సీఐ ఎంవీ సుభాష్ తెలిపా రు. విద్యార్థినుల సెల్ఫోన్లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ, వారిని లైంగికంగా వేధిస్తున్నాడంటూ రిజిస్టార్ ఆచార్య ఎస్. టేకి ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి క్రైమ్ నం.489/2019 యు/సెక్షన్స్, 354 (ఏ), 354 (డి), 509, 506 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ కేసులో ప్రత్యేక విచారణాధికారిగా వ్యవహరించిన రాజమహేంద్రవరం, ప్రకాష్‌నగర్ పోలీసు స్టేషనుకు చెందిన మహిళ ఎస్సై శ్రావణి కృష్ణా జిల్లా నందిగామలోని అతని స్వగృహంలో నిందితుడిని అరెస్టు చేసి, రాజమహేంద్రవరానికి తీసుకువచ్చారన్నారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. -
‘యూనివర్సిటీ ఘటనపై సీఎం సీరియస్‌గా ఉన్నారు’
సాక్షి, తూర్పుగోదావరి : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో విద్యార్ధినులకు వేధింపుల వ్యవహారంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం విచారణ నిర్వహించారు. యూనివర్సిటీలో వైస్ చాన్సలర్‌పై తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘నన్నయ్య యూనివర్సిటీలో అసాంఘిక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా ఉన్నారు. (చదవండి : కీచక అధ్యాపకుడిని నిలదీసిన మహిళలు..) గురుతరమైన వృత్తిలో ఉన్న కీచక ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రపై చర్యలు తీసుకోవడానికి వైస్ చాన్సలర్ ముందుకు రాలేదు. మహిళా సంఘాలు వచ్చిన తరువాతనే పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు’ అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్ర లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సోమవారం సస్పెండైన సంగతి తెలిసిందే. (చదవండి : నన్నయా... కనవయ్యా) -
ప్రొఫెసర్ రాఘవేంద్రపై సస్పెన్షన్ వేటు
సాక్షి, తూర్పు గోదావరి : లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్ర సస్పెండ్ అయ్యారు. రాఘవేంద్రపై లైంగిక ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ అతన్ని సస్సెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అంతకు ముందు యూనివర్సిటీ వద్దకు చేరుకున్న పలువురు మహిళలు రాఘవేంద్ర చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. వారిలో వైఎస్సార్సీపీ మహిళా నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర సాగించిన వేధింపులను వారు వీసీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రాఘవేంద్రను పలు అంశాలపై నిలదీశారు. అధ్యాపకుడు అయి ఉండి విద్యార్థినిలతో రాత్రి పూట చాటింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాఘవేంద్రపై చర్యలు తీసుకోవాలని.. ఆయన్ని కచ్చితంగా శిక్షించాలని కోరారు. విద్యార్థుల లేఖపై స్పందించి చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పాఠాలు చెప్పాల్సిన ఈ మాస్టారు ప్రేమ పాఠాలు చెబుతూ.. లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. చాలా కాలంగా ప్రొఫెసర్ వేధింపులను భరిస్తూ వచ్చారు. వేధింపులు ఇటీవల మితిమీరిపోవడంతో నలుగురైదుగురు విద్యార్థినులు ధైర్యం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ నుంచి ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను లేఖలో పూసగుచ్చినట్టు వివరించారు. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఉన్నత విద్యాశాఖను ఆదేశించారు. ఆ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ టేకీ ఆధ్వర్యంలో అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. -
కీచక అధ్యాపకుడిని నిలదీసిన మహిళలు..
-
భార్యను రేప్ చేసిన ప్రొఫెసర్!
అలీగఢ్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ దారితప్పాడు. భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన సదరు ప్రబుద్ధుడు.. అనంతరం విడిగా భార్యపై అత్యాచారం జరిపాడు. ఈ ఘటన అలీగఢ్‌లో జరిగింది. 58 ఏళ్ల నిందితుడిపై పోలీసులు లైంగిక దాడి (376), క్రిమినల్ బెదిరింపులు (506) తదితర ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన నిందితుడు ఏడాదిన్నర కిందట భార్యకు సత్వర త్రిపుల్ తలాఖ్ ద్వారా విడాకులు ఇచ్చాడు. 2017లో వాట్సాప్ ద్వారా, ఎస్సెమ్మెస్ ద్వారా అతడు తనకు ట్రిపుల్ తలాఖ్ చెప్పినట్టు భార్య తెలిపారు. ఈ క్రమంలో కొడుకు, కూతురితో కలిసి తాను అతనితో వేరుగా ఉంటున్నానని, కానీ, పిల్లలను చూసే నెపంతో అతడు తరచూ తన ఇంటికి వచ్చేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. గత నెల 29న అతడు తాము ఉంటున్న ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనను తుపాకీతో బెదిరించి.. తనపై లైంగిక దాడి జరిపాడని ఆమె పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్‌తో తనకు భర్త అన్యాయం చేశాడని, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని 2017లో బాధితురాలు ఆలీగఢ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎదుట ఆందోళన నిర్వహించారు. -
ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో తీసిన విద్యార్థి
సాక్షి, చెన్నై: ప్రొఫెసర్‌ను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరించిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రాకి చెందిన వివేశ్ (23) కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపాన గల ప్రైవేటు వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అంబత్తూరు ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ పార్ట్‌టైమ్‌గా ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. వివేశ్ చదువుతున్న వర్సిటీలో ఆంధ్రాకు చెందిన 25 ఏళ్ల యువతి ఒకరు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడంతో వివేశ్తో ప్రొఫెసర్ స్నేహంగా మెలిగారు. గత 19వ తేదీ వివేశ్ తన చదువు పూర్తవుతున్నందున పార్టీ ఇస్తానని తెలిపి ప్రొఫెసర్‌ను పిలిచాడు. ఇందుకు ప్రొఫెసర్ సమ్మతించింది. రాత్రి ఏడు గంటల సమయంలో షోలింగ నల్లూర్‌లో ప్రొఫెసర్ ఉంటున్న మహిళా హాస్టల్‌కు వివేశ్ వెళ్లాడు. అనంతరం ఆమెను తన బైకులో ఎక్కించుకుని ఈస్ట్ కోస్ట్ రోడ్డుకు వెళ్లాడు. పూంజేరి సమీపాన గల చీకటి ప్రాంతంలో వాహనాన్ని ఆపాడు. దీంతో భీతి చెందిన ప్రొఫెసర్ ఎందుకు ఇక్కడ ఆపావని ప్రశ్నించగా లోపల రిసార్ట్ ఉందని, అక్కడ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. తర్వాత పొదలు ఉన్న చోటుకు ఆమెను తీసుకెళ్లి కత్తి చూపి, దుస్తులు విప్పమని బెదిరించాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా వీడియో చిత్రీకరించాడు. ఈ విషయం బయట చెప్పకూడదని బెదిరించి మళ్లీ ఆమెను హాస్టల్లో దింపివేశాడు. తర్వాత తనతో గడపాలని, లేకుంటే నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో సెమ్మంజేరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివేశ్ను అరెస్టు చేసి ప్రొఫెసర్ నగ్న వీడియోను డిలీట్ చేశారు. అతన్ని సోమవారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. -
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
తెల్లవారు జామున ఒక చెట్టు కొమ్మల మీద పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. మరో చెట్టు తొర్రలో నుంచి పాలపిల్ల కువకువలాడుతోంది. సూర్యుడు నేలను చూడడానికి చెట్ల ఆకుల మధ్య నుంచి దారులు వెతుక్కుంటున్నాడు! ఇదేమీ చీమలు దూరని చిట్టడవి వర్ణన కాదు, కాకులు దూరని కారడవి వర్ణన కూడా కాదు. ఒక ప్రొఫెసర్ విశ్రాంత జీవనం గడుపుతున్న ప్రదేశం. ఏళ్లుగా కరెంటే లేని నివాసం. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఉంది బుధవారపేట. పెద్ద వ్యాపార కేంద్రం అది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ గూడ్స్ మార్కెట్‌కు ప్రసిద్ధి బుధవారపేట. ఆ బుధవారపేటలోనే ఉంది కరెంట్ లేని ఓ ఇల్లు. అది ఇల్లంటే ఇల్లు కాదు తోటంటే తోటా కాదు. చిన్న అడవిని తలపించే ప్రదేశం. అందులో ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్న ఓ కట్టడం. అందులో ఒంటరిగా నివసించే ప్రొఫెసర్ పేరు డాక్టర్ హేమా సనే. బాటనీ ప్రొఫెసర్‌గా రిటైరయ్యారామె. ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే హేమ కరెంట్ దీపాలు వెలిగిస్తే పక్షులకు అసౌకర్యం కలుగుతుందని కరెంట్ లేకుండానే జీవిస్తున్నారు. ఇప్పుడామెకి 79 ఏళ్లు. ‘‘కరెంట్ లేని రోజులను చూశాను, అప్పుడు కూడా హాయిగానే జీవించాను. ఇప్పుడూ అంతే. కరెంట్ సౌకర్యం కోసం పక్షులను ఇబ్బంది పెట్టలేను’’ అంటారామె. ఏది నాది? ‘‘తిండి, దుస్తులు, నీడ మాత్రమే మనిషికి కనీసవసరాలు. ఇక ఇతర అవసరాలేవీ తప్పని సరి కానే కాదు. నాకు ఈ మూడు కనీస అవసరాలు తీరుతున్నాయి. కరెంట్ లేని కారణంగా నాకు ఎదురవుతున్న అసౌకర్యం ఏమీ లేదు. నిద్రలేచేటప్పటికి పక్షుల కిలకిలరవాలు వినిపించకపోతే అసౌకర్యానికి లోనవుతాను తప్ప కరెంటు లేనందుకు కాదు. ఈ ప్రదేశాన్ని అమ్మేస్తే చాలా డబ్బు వస్తుందనే సలహాలు నాకు చాలా మందే ఇచ్చారు. ఈ నేల నా ఆస్థి కాదు. ఇక్కడ నాకు తోడుగా ఓ కుక్క, రెండు పిల్లులున్నాయి. వాటికి తోడు ఓ ముంగిస కూడా ఉంది. ఎన్నో రకాల చెట్లున్నాయి. ఆ చెట్ల మీద లెక్కలేనన్ని పక్షులున్నాయి. వాటన్నింటి ఆస్తి ఇది. నేను వాటి బాధ్యత చూసుకునే సంరక్షకురాలిని మాత్రమే. ప్రకృతి భూమిని ఏర్పరచింది పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ జీవించడానికే తప్ప మనిషి విపరీతమైన ఆకాంక్షల కోసం ఛిన్నాభిన్నం చేయడానికి కాదు. నన్ను చాలా మంది ఫూల్ అంటుంటారు కూడా. వాళ్లలా అన్నంత మాత్రాన నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తున్నాను. ఎవరికీ హాని కలిగించని రీతిలో జీవిస్తున్నాను కాబట్టి ఎవరికీ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’’ అంటారు హేమ నిష్కర్షగా. నిత్యాన్వేషణ నడుము వంగిపోయిన వయసులో ఆమె రోజూ తన అడవిలాంటి తోటంతా తిరుగుతారు. ఆమె సామిత్రీఫూలే పూనె యూనివర్సిటీ నుంచి బాటనీలో పీహెచ్డీ చేశారు. పూనెలోని గర్వారే కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. వృక్షశాస్త్రం– పర్యావరణం అంశం మీద ఆమె రాసిన అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. తన ఒంటరి జీవితాన్ని వృక్షశాస్త్ర అధ్యయనానికే అంకితం చేసిన హేమ ఇప్పటికీ కొత్త పరిశీలనలను గ్రంథస్థం చేస్తున్నారు. ఆ తోట మొత్తంలో ఆమెకు పేరు తెలియని పక్షి కానీ, చెట్టు కానీ లేవు. ప్రతి మొక్క, చెట్టు సైంటిఫిక్ నేమ్‌తో దాని లక్షణాలను వివరిస్తారు. ఇలాంటి విలక్షమైన జీవనశైలి ద్వారా సమాజానికి ఎటువంటి సందేశమూ ఇవ్వడం లేదని కూడా అంటారు డాక్టర్ హేమాసనే. అయితే అలా అడిగిన వాళ్లకు... ‘నీ జీవితంలో నీవు నడవాల్సిన దారిని నువ్వే అన్వేషించుకో’ అనే బుద్ధుని సూక్తిని ఉదహరిస్తారామె. – మంజీర -
అమ్మాయిలను పార్టీకి పిలిచాడని..
ఇస్లామాబాద్ : విద్యార్థినులను పార్టీకి ఆహ్వానించాడనే కారణంతో ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి చంపాడో స్టూడెంట్. ఈ సంఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఖలీద్ హమీద్ అనే వ్యక్తి బహవాల్పూర్లోని ప్రభుత్వ సాదిఖ్ ఎగెర్టన్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కాలేజీలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి విద్యార్థినులను కూడా ఆహ్వానించాడు. అయితే ఆడపిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధం అంటూ ఓ విద్యార్థి కత్తితో సదరు ప్రొఫెసర్ మీద దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రొఫెసర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెనక ఎలాంటి మతతత్వ సంస్థల ప్రమేయం లేదని తెలిపారు పోలీసులు. అయితే విద్యార్థి గత జీవితం, మానసిక పరిస్థితి వంటి అంశాల గురించి వాకబు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్‌లోని ఎగెర్టన్ కాలేజీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కళాశాలలో 4 వేల మంది ఆడ పిల్లలు చదువుతుండగా.. అబ్బాయిలు కేవలం 2000 మంది మాత్రమే ఉండటం విశేషం. -
మాస్టారు ఊళ్లో ఉన్నారా?
రఘునాథ శర్మ గురించి రాజమహేంద్రిలో ప్రస్తావన వస్తే, ముందుగా సాహితీ మిత్రులు అడిగే ప్రశ్న ఒక్కటే.. మాస్టారు ఊళ్లో ఉన్నారా? అని. దగ్గర దగ్గరగా ఎనభై వసంతాల వయసున్న ఈ మాస్టారు.. నేటికీ విరామమివ్వక, విశ్రమించక ప్రవచనాల బోధనకు పర్యటనలు చేస్తూనే ఉన్నారు. పట్టుమని పదేళ్ల ప్రాయం చేరుకోకమునుపే ఆ పిల్లవాడి తండ్రి కన్నుమూయడంతో నెలకు మూడు రూపాయల స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితి. చుట్టుపక్కలవారు ఎవరో చెప్పారు. ఆగిరిపల్లిలో భోజనం పెట్టి, చదువు చెబుతారని. కట్టుబట్టలతో తల్లి ఆ పిల్లవాడిని ఆగిరిపల్లిలో ఆ వదాన్యుల ఇంటికి చేర్చింది. పిల్లవాడు భాషాప్రవీణ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయి, బడిపంతులుగా ఉద్యోగపర్వంలోకి ప్రవేశించాడు. తనలోని విద్యాతృష్ణను అణచుకోలేక, ఎంఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయి, డాక్టరేట్ అందుకుని యూనివర్సిటీ ఆచార్యుని స్థాయికి ఎదిగాడు. సుమారు లక్షా పాతిక వేల శ్లోకాల వేదవ్యాస భారతానికి ప్రామాణికమైన తెలుగు అనువాదాన్ని అందించడమే జీవిత లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఇప్పటి వరకు ఇంచుమించు లక్ష శ్లోకాలకు ఆంధ్రానువాదం పూర్తి చేయడమే కాకుండా, 77 వసంతాల ముదిమిలో అలుపెరుగక దేశమంతటా పర్యటిస్తూ ఆర్షధర్మం, సనాతన ధర్మాలపై ప్రవచన పరంపరలు నిర్వహిస్తున్నాడు. ‘భారత భారతి’, ‘మహామహోపాధ్యాయ’ పురస్కారాలను అందుకుని, తెలుగు భాషకు విశిష్ట సేవలను అందించినందుకు గుర్తింపుగా ఇటీవలే భారత ప్రభుత్వ గౌరవ పురస్కారానికి ఎంపికయిన ఈ ‘పిల్లవాడి’పేరు.. శలాక రఘునాథ శర్మ. గోదావరీ తీరాన ‘‘అనంతపురం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పదవీ విరమణ చేసిన అనంతరం, ఆంధ్ర మహాభారత రచనకు శ్రీకారం చుట్టిన ఆదికవి నన్నయ భట్టారకుడు నడయాడిన రాజమహేంద్రిలో శలాక రఘునాథ శర్మ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. నెలకు కనీసం 20 రోజులు సాహితీసభలలో పాల్గొనడానికో, ప్రసంగాలు చేయడానికో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న శలాక రఘునాథ శర్మ గురించి రాజమహేంద్రిలో ప్రస్తావన వస్తే, ముందుగా సాహితీమిత్రులు అడిగే ప్రశ్న ఒక్కటే.. మాస్టారు ఊళ్లో ఉన్నారా? అని. శలాక గురించి బహుళ ప్రచారంలో ఉన్న జోక్.. మాస్టారు తరచు రైళ్లలో, అప్పుడప్పుడు రాజమహేంద్రిలో స్వగృహంలో ‘కూడా’ ఉంటారని. అలుపెరుగని తన సాహితీ ప్రస్థానం గురించి ఆయన మాటల్లో వినేందుకే బాగుంటుంది. గురువుల వాత్సల్యం కృష్ణాజిల్లా, గొల్లపాలెం అనే గ్రామంలో 1941లో జన్మించాను. మేము అయిదుగురు అన్నదమ్ములం, నాకు ఇద్దరు అక్కచెల్లెళ్లు. తండ్రి నరసయ్య నాకు రోజూ ఒక గంటసేపు అమరకోశం నేర్పేవారు, ఆ శ్లోకాలు నోట నానేవి. తండ్రి నాకు పదేళ్ల ప్రాయం రాకుండానే, 1950లో కన్నుమూశారు. అమ్మ నిర్వహణలో ఉన్న ఆస్తి నాస్తి అయిపోయింది. నెలకు మూడు రూపాయల స్కూల్ ఫీజు కట్టడం బరువై పోయింది. ఎవరో అమ్మకు చెప్పారు ఆగిరిపల్లిలో భోజనం పెడుతూ చదువు చెబుతారని. కట్టుబట్టలతో నన్ను అమ్మ వదాన్యులు గరికిపాటి పట్టాభి రామశాస్త్రి, రామ్మూర్తి అనే పెద్దల దగ్గర చేర్చింది. గరికిపాటి కుటుంబ వాత్సల్యం, గురువుల ఆశీస్సులు నాకు లభించాయి. మహా మహోపాధ్యాయులు, రాష్ట్రపతి పురస్కారగ్రహీతలు అయిన పేరి వేంకటేశ్వర శాస్త్రి, రామచంద్రుని కోటేశ్వర శర్మల వద్ద విద్యనేర్చుకునే మహదవకాశం నాకు లభించింది. 1955–60 మధ్యకాలంలో భాషాప్రవీణ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో మొదటి ర్యాంకులో ఉత్తీర్ణుడినయ్యాక, ఉద్యోగపర్వంలోకి ప్రవేశించాను. టీచర్‌గా తొలి ఉద్యోగం రాజమహేంద్రవరం, గౌతమీ విద్యాపీఠంలో నెలకు రూ.84 జీతం అందుకుంటూ గ్రేడ్–2 తెలుగు పండితునిగా ‘ఉద్యోగపర్వం’లో ప్రవేశించాను. ఆ తరువాత పండిట్ ట్రెయినింగ్ పూర్తి చేసుకుని, విశాఖపట్టణం, ఏలూరు, శ్రీశైలం పట్టణాలలో తెలుగు పండితునిగా పని చేశాను. ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏలో చేరాను. దివాకర్ల వేంకటావధాని అనుగ్రహంతో సీటు వచ్చింది. డాక్టర్ సి.నారాయణరెడ్డి, గిడుగురాజు రామరాజు, పాటిబండ్ల మాధవ శర్మ, పల్లా దుర్గయ్యలు నాకు గురువులు. 1967లో ఎం.ఏ బంగారు పతకం, డిస్టింక్షన్‌తో ఉత్తీర్ణుడినయ్యాను. 1968లో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకునిగా తిరిగి ఉద్యోగపర్వంలో ప్రవేశించి, 2001లో డీన్‌గా పదవీ విరమణ చేసి, రాజమహేంద్రవరంలో స్థిరపడ్డాను. భారతం మీదనే ఎందుకు? భాషాప్రవీణ చదువుతున్నప్పుడు సభాపర్వంలో ద్వితీయ ఆశ్వాసం పాఠ్యాంశంగా ఉండేది. శిశుపాల వధ ద్యూతం ఘట్టాలు చదువుతూంటే భారతం మీద ఆకర్షణ కలిగింది. శ్రీశైలంలో ఉన్నప్పుడు పెద్దగా పని ఉండేది కాదు. విశ్రాంతి సమయాలలో కవిత్రయ భారతంలో ప్రతిరోజూ ఒక ఆశ్వాసం చదివేవాడిని. నాటినుంచి నేటి వరకు ఆ ‘రుచి’ నన్ను వదలలేదు. ఆ సమయంలోనే వేదవ్యాసుని మూలభారతం అధ్యయనం చేయడం ప్రారంభించాను. సంస్కృత భారతాన్ని సులభమైన శైలిలో తెలుగు ప్రజలకు అందించాలన్న బలమైన కోరిక, ఈశ్వర ప్రేరణ నాలో ఏర్పడింది. నీలకంఠీయ వ్యాఖ్యానంతో, వ్యాసభారతంలోని 12 పర్వాలకు శ్లోకానువాదాన్ని, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలకు మూల విధేయాంధ్రానువాదాన్ని పూర్తి చేశాను’’ అని తెలిపారు రఘునాథశర్మ. మూడు వేల పేజీల పుస్తకం! ‘కొన్ని వేదమంత్రాలకు విస్తృతమైన భావం, వ్యాఖ్యానాలతో ‘మంత్రాక్షర మహావిభూతి’ అన్న గ్రంథాన్ని వెలువరించాలన్న ఆలోచన ఉంది. ఇదో బృహత్ ప్రాజెక్టు. మహాభారతం విషయానికి వస్తే, ఆదిపర్వంలోని తొలి అధ్యాయం, యక్షప్రశ్నలు (వనపర్వం), విదురనీతి, సనత్సుజాతీయం (ఉద్యోగపర్వం), భగవద్గీత (భీష్మపర్వం), భీష్మస్తవరాజం (శాంతిపర్వం), ఆనుశాసనిక పర్వంలోని విష్ణు, శివసహస్రనామాలు, అశ్వమేధపర్వంలోని అనుగీతలను ఒక బృహద్గ్రంథంగా.. (అచ్చులో సుమారు మూడువేల పేజీలు రావచ్చు) మహాభారత ప్రణవం పేరిట వెలువరించాలన్న ఆశయం ఉంది. మానవుని మాధవునివైపు మళ్లించే ఈ నిధిని తెలుగువారికి అందించాలని కోరిక. ఆ మంచిరోజు కోసం చూస్తున్నాను. -
ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!
రేడియేషన్ సమీపానికి వెళ్లాలంటే అందరికీ భయం. కానీ రేడియేషన్‌తో ఇప్పటి వరకు ఉన్న లాభాలే కాకుండా, కనీవినీ ఎరుగని రీతిలో మరొక అత్యంత కీలకమైన ప్రయోజనాన్నీ కనుగొన్నారు ముంబై యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వైశాలి బంబోలి. ముంబై యూనివర్సిటీ క్యాంపస్‌లోని బయో నానో ఫిజిక్స్ లాబ్‌లో గత ఐదేళ్లుగా పరిశోధనలు జరిపి ఆమె ఈ విషయాన్ని కనుగొన్నారు! ఉదయం వండిన వంటకాలు రాత్రి తినాలంటే ముఖం చిట్లించుకుంటాం. అయితే వాటిని రేడియేషన్ ద్వారా ఏకంగా వెయ్యి రోజులు.. అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు తాజాగా ఉంచవచ్చని ప్రొఫెసర్ వైశాలి కనుగొన్నారు! ఇది భవిష్యత్తులో మానవాళికి ఉపయుక్తమైన పరిణామాలకు నాంది అవుతుందని ఆమె భావిస్తున్నారు. ‘‘ముఖ్యంగా నేటి సమాజంలో ఆహారం కొరతను తగ్గించడంతోపాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారాన్ని దీర్ఘకాలం తాజాగా ఉంచి, అన్నార్తులకు అందించేందుకు వీలవుతుంది. అదే విధంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలున్న సరిహద్దులో ఉండే సైనికులకు కూడా తాజాగా ఆహారాన్ని అందించవచ్చు. మరో సంతోషకరమైన సంగతి.. అమెరికాతోపాటు దేశ విదేశాలలో ఉండే మనవారికి మన ఊరిలో మన ఇంట్లో తినే వంటలను తిన్పించేందుకు అవకాశం కలుగుతుంది’’ అన్నారు ప్రొఫెసర్ వైశాలి. ఏమిటా ప్రయోగం?! ‘రెడీ టు ఈట్’ ప్రాజెక్టులో భాగంగా.. వండిన పదార్థాలపై వైశాలి బృందం ఈ ప్రయోగం చేశారు. ఇడ్లీ, ఉప్మాతోపాటు తెల్లని డోక్లా (గుజరాతీ వంటకం) ను మూడేళ్లపాటు తాజాగా ఉంచవచ్చని తెలుసుకున్నారు. ప్రయోగ ఫలితాన్ని నిర్థారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. ‘‘ప్రత్యేకంగా రూపొందించిన మల్టీ లేయర్డ్ కవర్లలో (సంచులలో) ఆహార పదార్థాలను ఉంచి ప్యాక్ చేసి రేడియేషన్ ఇచ్చాం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ టెక్నాలజీ వినియోగించాం. ముఖ్యంగా ఎంత రేడియేషన్ ఇవ్వాలనేది కనుగొన్నాం. మేము అనేక తినుబండారాలపై చేసిన పరిశోధనలలో.. ముఖ్యంగా ఇడ్లీ, ఉప్మా, తెల్లని డోక్లాలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు మూడేళ్ల అనంతరం కూడా వాటి రుచితోపాటు వాటి నాణ్యత, వాటిలోని ప్రొటీన్స్, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్, మైక్రో సెన్సరీ వాల్యూస్ అన్నీ మూడేళ్ల కింద ఉన్నట్టే ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ ౖవైశాలి చెప్పారు. అయిదేళ్ల నాటి ఆలోచన ‘‘రేడియేషన్ సాధారణంగా వండిన వంటకాలపై కాకుండా కూరగాయలు, పండ్ల నిల్వ విధానానికి ఉపయోగిస్తారు. అయితే మనం వండిన వంటలపై వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయిదేళ్ల కిందట వచ్చింది. అయితే గామా రేడియేషన్‌కు కొన్ని సమస్యలున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం దక్కవచ్చని భావించాను. బోర్డ్ ఆఫ్ రేడియేషన్, ఐసోటోప్ టెక్నాలజీ (బిఆర్ఐటి) సంస్థలోని రేడియేషన్ యంత్రాన్ని నా పరిశోధన కోసం వినియోగించుకునేందుకు అనుమతి కోరాను. అనంతరం ముంబై యూనివర్సిటీలోని కలీనా క్యాంపస్‌లో బయో నానో ఫిజిక్స్ లాబ్ ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా రేడియేషన్ డోస్ ఎంత ఇవ్వాలనే దానిపై పరిశోధన చేశాం. అనంతరం వంటకాలను ఎలాంటి ప్యాకేజీలలో ఉంచి రేడియేషన్ ఇస్తే బాగుంటుందని ప్రయోగాలు చేశాం. మొదట పరిశీలనలో భాగంగా ముప్పై రోజుల అనంతరం రేడియేషన్ ద్వారా ప్రత్యేక ప్యాకెట్లో ఉంచిన ఇడ్లీ, ఉప్మా, డోక్లాను అన్ని రకాలుగా పరీక్షలు చేశాం. ప్యాకింగ్ చేసిన రోజు ఎలా ఉన్నాయో నెల తర్వాత కూడా ఆ వంటకాలు అలానే తాజాగా ఉండడం గమనించాం. అనంతరం వెయ్యి రోజుల పరీక్షలు నిర్వహించాం. అప్పటికి కూడా ఆ వంటకాలలో ఎలాంటి మార్పులేదు’’ అని వివరించారు వైశాలి. త్వరలో యంత్రాల అభివృద్ధి టేబుల్ టాప్ ఎలక్ట్రానిక్ రేడియేషన్ యంత్రం సహాయంతో రాబోయే రోజుల్లో ఇతర వంటకాలను కూడా తాజాగా ఉంచే పరిశోధనల్ని వైశాలి బృందం చేయబోతోంది. ‘‘అయితే ఇందుకోసం కావలసిన రేడియేషన్ యంత్రాలు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. చైనాలో టేబుల్‌టాప్ ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ధరలు భారీగా ఉన్నాయి. దీంతో మేమే అత్యంత తక్కువ ధరలో ఆ యంత్రాలను అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రొఫెసర్ వైశాలి తెలిపారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
ప్రేమ పేరుతో మోసం.. అధ్యాపకుడి నిర్వాకం
తార్నాక: పెళ్లయి భార్యతో విడాకులు తీసుకున్న అధ్యాపకుడు ప్రేమ,పెళ్లి పేరుతో ఓ విద్యార్థినిని నమ్మించి ఆమెతో సహజీవనం చేయడమేగాక ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మోహం చాటేశాడు.దీంతో బాధితురాలు ఓయూ పోలీసులను ఆశ్రయించింది. తార్నాకలోని ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ విద్యార్థిని ఇఫ్లూలో ఎం.ఏ ఇంగ్లిష్(ఈఎల్టీ) కోర్సు చదువుతోంది. కేరళకు చెందిన రంజిత్ తంగప్పన్ ఇఫ్లూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ సీతాఫల్మండిలో ఉంటున్నాడు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో వారి మధ్య పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా తీసుకున్న అతను ప్రేమ పేరుతో వలవేశాడు. తనకు వివాహమైందని, భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పి మరింత దగ్గరయ్యాడు. తనకు ఓ తోడు కావాలని, అందుకు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం సదరు విద్యార్థినిని హాస్టల్ నుంచి ఖాళీ చేయించి తన ఇంటికి తీసుకువెళ్లగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఈనెల 12న రంజిత్ బాధితురాలిపై చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని, హాస్టల్‌కు వెళ్లిపోవాలంటూ ఇంటి నుంచి గెంటేశాడు. ఆమె ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వకపోగా, ఆమె నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిన రంజిత్ ఈనెల 19 నుంచి వారం రోజులపాటు సెలవు పెట్టి కేరళకు వెళ్లిపోయాడు. దీంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
‘కన్యత్వంలేని అమ్మాయిలు సీల్‌లేని బాటిళ్లు!’
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలు సీల్‌లేని బాటిళ్ల వంటివారని ప్రొ.కనక్ సర్కార్ వ్యాఖ్యానించారు. సీల్ తీసిన కూల్‌డ్రింక్ బాటిల్‌ను, బిస్కెట్ ప్యాకెట్‌ను కొనుగోలు చేసేందుకు మీరు ఇష్టపడతారా? అని ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. అంతేకాకుండా చాలామంది యువకులకు కన్యత్వం ఉన్న అమ్మాయిలు దేవకన్యల వంటివారని సెలవిచ్చారు. ప్రొ.కనక్ సర్కార్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ వివాదాస్పదం కావడంతో భావప్రకటన స్వేచ్ఛ కింద అభిప్రాయాలను వెల్లడించానని స్పష్టం చేశారు. ఈ విషయం మీడియాలో వైరల్కావడంతో సర్కార్ తన పోస్టింగ్‌ను తొలగించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనక్ సర్కార్‌ను తక్షణం విధుల్లోంచి తప్పించడంతో పాటు వర్సిటీ ప్రాంగణంలో అడుగుపెట్టకుండా వైస్ ఛాన్స్లర్ సురంజన్‌దాస్ ఆదేశాలు జారీచేశారు. జాతీయ మహిళా హక్కుల కమిషన్, పశ్చిమబెంగాల్ మహిళా హక్కుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీచేశాయి. కమిషన్ల విచారణ పూర్తయ్యేవరకూ సర్కార్‌ను విధుల్లోకి తీసుకోబోమని వీసీ ప్రకటించారు. -
65 ఏళ్ల ఈ ‘యువకుడి’కి పెళ్లి ప్రపోజల్స్ కష్టాలు!
‘నేను అరవై ఐదేళ్ల యువకుడిని. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తావని అందరూ నన్ను అడుగుతున్నారు. ఇంకేం ఉంటుంది.. నేను మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతో మంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు నా వెంట పడుతున్నారు. పెళ్లి చేసుకోవాలంటూ విసిగిస్తున్నారు. కానీ ఈ విషయంలో తుది నిర్ణయం నా విద్యార్థులదే. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏదో ఒకటి తొందరగా తేల్చేయండి మిత్రులారా’ ఇది బిహార్ ‘లవ్‌గురు’గా పేరొందిన ప్రొఫెసర్ ముథుక్‌నాథ్ చౌదరి ఫేస్బుక్ పోస్ట్ సారాంశం. పదవీ విరమణ పొందిన తర్వాత వస్తున్న పెళ్లి కష్టాల గురించి ఇలా ఏకరువు పెట్టారు ఆయన. పట్నా యూనివర్సిటీకి చెందిన బీఎన్ కాలేజీలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేసే ముథుక్‌నాథ్ చౌదరి.. వయసులో తన కంటే 30 ఏళ్లు చిన్నదైన తన స్టూడెంట్ జూలీని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. 2006లో మొదలైన వీరి బంధం సుమారు దశాబ్ద కాలంపాటు కొనసాగింది. గతేడాది భర్త నుంచి విడిపోయిన జూలీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో బుధవారం పదవీ విరమణ పొందిన చౌదరిని.. మీ తదుపరి నిర్ణయం ఏమిటి అని అడిగిన విద్యార్థులకు ఇలా ఫేస్బుక్ పోస్టుతో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఈ వృద్ధ యువకుడి వాలకం చూస్తుంటే ‘ముసలోడికి దసరా పండుగ’ అనే సామెత గుర్తుకువస్తోంది కదా అంటూ కొంతమంది నెటిజన్లు చమత్కరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇందులో తప్పేం ఉంది. పెళ్లికి వయసుతో ఏం సంబంధం’ అంటూ ప్రొఫెసర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. మరి మీరేం ఏమంటారో!? -
విద్యార్థుల కాళ్లు మొక్కిన ప్రొఫెసర్
-
విద్యార్థుల కాళ్లు మొక్కిన ప్రొఫెసర్
భోపాల్ : అధ్యాపక వృత్తిలో ఉంటూ పాపం చేశానంటూ విద్యార్థులను వెంబడిస్తూ వారి కాళ్లను మొక్కుతున్న ఓ ఉపాధ్యాయుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సోర్‌లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో దినేశ్ గుప్తా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పరీక్షల ఫలితాలు జాప్యం అవుతున్నాయని ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు పవన్ శర్మ ఆధ్వర్యలో నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా దినేశ్ గుప్తా పాఠాలు చెబుతున్న తరగతి దగ్గరకి వెళ్లి స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. తన క్లాస్‌ను అడ్డుకోవద్దంటూ దినేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో భారత్ మాతాకీ జై, వందేమాతరం స్లోగన్‌లనే అడ్డుకుంటారా.. దినేశ్ గుప్తా దేశ ద్రోహి అంటూ స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. ప్రిన్సిపాల్ రవింద్ర సొహానీ జోక్యం చేసుకొని దినేశ్ గుప్తాతోపాటూ ఏబీవీపీ విద్యార్థులను సంయమనం పాటించాలని సూచించారు. ప్రొఫెసర్ తమకు క్షమాణ చెప్పాల్సిందేనని ఏబీవీపీ విద్యార్థులు పట్టుబట్టారు. దీనికి దినేశ్ గుప్తా ఒప్పుకోకపోవడంతో అతన్ని వెంబడిస్తూ దేశద్రోహి అంటూ స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దినేశ్ గుప్తా కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నారు. వెంటపడి మరీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏబీవీపీ ఉపాధ్యాయులను గౌరవిస్తుందని, రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో చోటు చేసుకున్న ఘటన బాధాకరమని ఏబీవీపీ జాతీయ నేత అంకిత్ గార్గ్ వ్యాఖ్యానించారు. పరీక్షా ఫలితాల్లో జాప్యం కారణంగానే ఏబీవీపీ విద్యార్థులు నిరసన తెలిపారని, దినేశ్ గుప్తాను దేశ ద్రోహి అని ఎవరూ అనలేదన్నారు. ఆ సమయంలో ప్రొఫెసర్ కోపంగా ఉన్నందును క్యాంపస్‌లో రచ్చ చేయడానికే విద్యార్థుల కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. 'నిరసన పేరుతో నా తరగతికి ఏబీవీపీ విద్యార్థులు అడ్డుతగిలారు. వాళ్లు నన్ను దేశ ద్రోహి అంటూ స్లోగన్లు ఇచ్చారు. నన్ను క్షమాణ చెప్పాలని కోరారు. సరే, అని వాళ్ల కాళ్ల మొక్కా. ఈ క్యాంపస్‌లో గత 32 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. వారికన్నా నాకే దేశభక్తి ఎక్కువ. దేశభక్తిని ఒకరికి చూపించాల్సిన అవసరం నాకు లేదు. విద్యార్థులు బాగా చదువుకోవాలనే నేను కోరుతున్నా. చదువుకుంటేనే జీవితం బాగుంటుంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని నేను అనుకోవడం లేదు' అని దినేశ్ గుప్తా తెలిపారు. ఇది అంత పెద్ద సమస్య ఏమీ కాదని, ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని ప్రిన్సిపల్ రవింద్ర సొహానీ అన్నారు. -
నాడు స్వీపర్..నేడు లెక్చరర్
చీపురు పట్టిన చేతులే సాహిత్యాన్ని బోధిస్తున్నాయి. ఒక కళాశాలలో స్వీపర్‌గా చేరి... అదే కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ డాక్టరేట్ డిగ్రీ పొంది అటు విద్యార్థులకు...ఇటు తోటి లెక్చరర్లకు ఆదర్శంగా నిలిచారు డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి. నేడు గురుపూజోత్సవం సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం. ప్రకాశం, మార్కాపురం: చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగిన వారు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎంతో మంది ఉన్నారు. అయితే తాను స్వీపర్‌గా పనిచేసిన కళాశాలలోనే ఏకంగా లెక్చరర్ అయ్యారు తిరుపతిరెడ్డి. మార్కాపురం మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన మందటి అనంతయ్య ఉపాధ్యాయుడు. ఆయన కుమారుడు తిరుపతిరెడ్డి మార్కాపురం ఎస్వీకేపీ ఎయిడెడ్ కాలేజీలో ఇంటర్మీడియెట్ అయిపోగానే 1980లో అదే కళాశాలలో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా స్వీపర్‌గా చేరాడు. అప్పట్లో ఆయనకు రూ.130 జీతం ఇచ్చేవారు. ఒక వైపు ఉదయం 8 గంటలకే కళాశాలకు వచ్చి చీపురు, బుట్ట చేతపట్టుకుని గదులు శుభ్రం చేసి లెక్చరర్లు, విద్యార్థులు వచ్చేసరికి తరగతి గదులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేవాడు. తన వయసులో ఉన్న వారు డిగ్రీలు చదువుతుంటే తాను ఇలాగే ఉండిపోవాలా అని ఆలోచించి కళాశాలలోనే తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కన్నెకంటి రాజమల్లాచారి స్ఫూర్తితో ప్రైవేటుగా తెలుగు సాహిత్యంలో బీఏ, ఎంఏ డిగ్రీలు పూర్తి చేశారు. అప్పుడే (1996)కళాశాలలో తెలుగు లెక్చరర్ పోస్టు ఖాళీ అయింది. దరఖాస్తు చేసుకోగా యాజమాన్యం రూల్స్ ఒప్పుకోవంటూ చెప్పటంతో కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు డివిజన్ బెంచ్ తిరుపతిరెడ్డికి అనుకూలంగా తీర్పు చెప్పటంతో 2001 ఫిబ్రవరి 9న అదే కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరాడు. అటు బోధన..ఇటు రచనలు: ఒక వైపు కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేస్తుంటే, మరో వైపు కథరేఖలు, ప్రేమ మందిరం, విజ్ఞాన దీపికలు, దైవచిద్విలాసాలు ఇలా అనేక రచనలు చేశారు. విశేషం ఏమిటంటే రచనలతో పాటు 2016 డిసెంబర్లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీ పొందారు. ఎంఏ హిస్టరీ, ఎల్ఎల్ఎం (న్యాయశాస్త్రం)లో డిస్టెన్స్ ద్వారా పట్టాలు పొందారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షునిగా ఉండే తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్‌లో సభ్యునిగా ఉన్న తిరుపతిరెడ్డి సుమారు 500 కథలు రిజిస్ట్రేషన్ చేయించాడు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యునిగా ఉన్నారు. 7వ తరగతి వరకు మార్కాపురం మండలంలోని వేములకోట, 10వ తరగతి వరకు మార్కాపురం జెడ్పీ బాలుర పాఠశాలలో చదివిన తిరుపతిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ ఏకలవ్యుడే తనకు గురువని, చదువుకోవాలన్న తపన ఉంటే ఎలాంటి కష్టానైనా ఎదిరించవచ్చన్నారు. తాను రాసిన పుస్తకాలు, సాహిత్యం (లీటరేచర్)ఆధారంగా ఈ ఏడాది నోబెల్ బహుమతికి నామినేషన్ కూడా పంపినట్లు తెలిపారు. -
స్కూల్ యాజమాన్యం అకారణంగా టీసీ ఇచ్చి పంపేస్తే..
సాక్షి, సిటీబ్యూరో : కుమార్తె చదివే స్కూల్ యాజమాన్యం అకారణంగా టీసీ ఇచ్చి పంపేస్తే.. ఆ కారణంగా చిన్నారి తీరని మనోవ్యధకు గురై అనారోగ్యం పాలైతే.. ఏం చేయాలి? ఎందుకొచ్చిన గొడవంటూ మరో స్కూల్లో చేర్పించి ఊరుకోవాలా? తమని అంతటి క్షోభకి గురిచేసిన కార్పొరేట్ విద్యాసంస్థపై కేసు వేసి న్యాయం కోసం పట్టు వదలక పోరాడాలా? ఈ ప్రశ్నలకు మనలో చాలా మంది మొదటి సమాధానమే వెతుక్కుంటారేమో గానీ.. ఢిల్లీలో నివసించే తెలుగువాడైన రఘురాం మాత్రం అన్యాయం చేసిన పాఠశాలపై అలుపెరగని పోరాటం చేసి గెలిచారు. ఇటీవల వెలుగు చూసిన ఆయన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఎందరో ప్రైవేట్‌పాఠశాలల బాధితుల్లో స్ఫూర్తిని నింపింది. ప్రస్తుతం ఆయన ప్రైవేట్ విద్యాసంస్థల చట్టవ్యతిరేకవిధానాలు, తీరుతెన్నులపై ఆగ్రహంగా ఉన్నవారికి దన్నుగా మారారు. మరెందరో తన బాటలోనడిచేందుకు కారణమయ్యారు. మా పాప ఢిల్లీలోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదివేది. పేరెంట్స్ మీటింగ్స్‌కి నేను అటెండయ్యేవాణ్ని. పలు అంశాలపై యాజమాన్య వైఖరిని తప్పుబట్టేవాడిని. స్కూల్లో అమలు చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులను ప్రశ్నించడంతో యాజమాన్యం నాపై కక్ష పెంచుకుంది. సరైన కారణం లేకుండా నా కూతుర్ని స్కూల్ నుంచి పంపేసింది. అనుకోని శిక్షకు మా పాప తల్లడిల్లింది. అనారోగ్యానికి గురైంది’ అంటూ చెప్పారు రఘురాం. ఢిల్లీలో ఇంద్రప్రస్థ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డీన్ రఘురాం.. దీనిని అంత తేలికగా వదలదలచుకోలేదు. న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. పాప భవిష్యత్తు ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉన్నా కార్పొరేట్ స్కూల్స్‌కి బుద్ధి చెప్పి మరెందరో పిల్లల తల్లిదండ్రులకు ఆసరా అందించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. . రఘురాం ఏంచెప్పారో ఆయన మాటల్లోనే.. ఐదేళ్ల పోరాటం.. ఈ అంశంపై కోర్టులో న్యాయం కోసం ఐదేళ్లు పోరాటం చేశా. ఎన్నో రకాల ఒత్తిళ్లు వచ్చాయి. అయినా లొంగలేదు. చివరికి సెషన్స్ కోర్టు మా చిన్నారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మా పాపను తరగతి గదిలోకి వెళ్లనీయకుండా బయటే ఉంచినందుకు, ఆమెని 7గంటల పాటు స్కూల్లో తరగతులకు హాజరు కానీయకుండా తీవ్రమైన మనోవేదనకు గురిచేసినందుకు.. నష్టపరిహారంగా చెరో రూ.2.5లక్షలు చొప్పున చెల్లించాలంటూ ప్రిన్సిపాల్, స్కూల్ డైరెక్టర్లను ఆదేశించింది. స్కూల్ విద్యార్ఙినులపై ఇప్పటివరకూ వచ్చిన తీర్పులు శారీరక హింస, వేధింపులకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే తొలిసారి చిన్నారి మనోవేదనకు సైతం విలువిచ్చి న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఎందరో తల్లిదండ్రులకు భరోసా అందించింది. ఈ నేపథ్యంలో ఇకనైనా కార్పొరేట్ స్కూల్స్ అవకతవకలపై పేరెంట్స్ అవగాహన పెంచుకోవాలి. వీటిపై దృష్టి పెట్టాలి.. స్కూల్లో అడ్మిషన్ల కోసం ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో పిల్లలకు, పేరెంట్స్‌కి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం చట్ట విరుద్ధం. వీటిని మనం అంగీకరించకూడదు. ఫీజులు ఎక్కువ వసూలు చేసే స్కూల్స్ తప్పనిసరిగా ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తున్నాయి. లేకపోతే పేరెంట్స్ ఊరుకోరు. పిల్లలకు పర్సనల్ అటెన్షన్ ఇవ్వలేకే కదా రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాం? మరి ఈ మార్కులు ఏమిటి ఇలా వస్తున్నాయి? అంటూ గొడవలకు దిగుతారు. దీంతో ఏదో రకంగా సరిగా చదవని పిల్లలకి కూడా మార్కులు వచ్చేలా చేసేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. యాక్టివిటీ ఛార్జెస్, మిస్లీనియస్ చార్జెస్ అవీ ఇవీ అంటూ సంవత్సరం మొత్తం మీద ఎన్నో రకాల వసూళ్లు చేస్తున్నారు. రకరకాల రూల్స్ పెట్టి వాటిని అతిక్రమించారంటూ పిల్లలకు ఫైన్లు అమలు చేస్తున్నారు. ఇటీవల కోల్‌కతాలోని ఒక స్కూల్లో పిల్లలు ఆడిడాస్ షూస్ వేసుకుని రావాలని రూల్ పెట్టారు. దీనిపై కోర్టుకి వెళితే... ఆ అధికారం మీ లేదంటూ హైకోర్టు మొట్టికాయలు వేసింది. స్కూల్ ఎంబ్లమ్ ఉండాలని నిబంధన పెట్టి యూనిఫామ్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలాంటివి తల్లిదండ్రులు గుర్తించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. -
వాజ్‌పేయిని విమర్శించాడని ప్రొఫెసర్‌ను చితకబాదారు
-
యురేనియం గ్రామాలకు కాలిఫోర్నియా ప్రొఫెసర్ రాక
సాక్షి ప్రతినిధి కడప: యురేనియం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో కార్పొరేట్ సోషియల్ రెస్పాన్షబులిటీ (సీఎస్ఆర్) ఫండ్ వినియోగంపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ రానున్నారు. ఈనెల 17, 18న ఆమె యురేనియం పరిశ్రమ పరిసర గ్రామాల్లో పర్యటించనున్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో యురేనియం తవ్వకాలతోపాటు శుద్ధి చేసే కర్మాగారాన్ని నిర్మించింది. తవ్వకాలు ప్రారంభమై దాదాపు పదేళ్లు కావస్తుండగా, శుద్ధి చేసే కర్మాగారం పనులు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయ్యింది. ఈనేపథ్యంలో ఆయా గ్రామాల్లో యూసీ ఐఎల్ చేపట్టిన అభివృద్ధి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా ప్రజల ద్వారా తెలుసుకునేందుకు డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ యురేనియం గ్రామాల్లో పర్యటించనున్నారు. అమెరికాకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీ తరఫున రీసెర్చిలో భాగంగా ఆమె భారత ప్రభుత్వం నేతృత్వంలో కొనుసాగుతున్న యూసీఐఎల్ గ్రామాల స్థితిగతులపై ఆరా తీయనున్నారు. ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలి. కాగా ఆయా గ్రామాల్లో ఏ మేరకు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేశారు. గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయనే దానిపై ఆమె ఆరా తీయనున్నారు. అంతేకాక ప్రాజెక్టు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను, జరుగుతున్న నష్టాలను, వారి ఆరోగ్య పరిస్థితులు తదితర అంశాలను గ్రామస్తులతో మాట్లాడి స్వయంగా తెలుసుకోనున్నారు. యురేనియం ప్రాజెక్టు పరిధిలోని ఈ గ్రామాల్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఏయే పనులు చేశారు, వాటి వల్ల ప్రజలకు ఎంత మేర ప్రయోజనం చేకూరుతుంది.. తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలు స్తోంది. ఆయా గ్రామాల్లో ప్రాజెక్టు వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా డాక్టర్ లెవెలన్ మిచ్చిగాన్ యూనివర్సిటీ నుంచి 2006లో పీహెచ్డీ పొందింది. 2008 నుంచి పదేళ్లుగా యూసీఎస్బీలో టీచింగ్ చేస్తోంది. గురువారం సాయంత్రానికి ప్రొద్దుటూరులో మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ ఇంటికి చేరుకోనున్నారు. ఆమేరకు 17, 18వ తేదీల్లో యురేనియం గ్రామాల్లో డాక్టర్ ఆన్ ఎలిష్ లెవెలన్ పర్యటించనున్నట్లు జయశ్రీ సాక్షికి ధ్రువీకరించారు. -
జేఎన్టీయూలో సెక్యురిటీపై ప్రొఫెసర్ దాడి..
-
జేఎన్టీయూలో రెచ్చిపోయిన ప్రొఫెసర్..
సాక్షి, హైదరాబాద్: కుకట్పల్లి జేఎన్టీయూలో ఓ ప్రొఫెసర్ రెచ్చిపోయారు. నో పార్కింగ్ ప్లేస్‌లో కారు పెట్టొదని చెప్పినందుకు సెక్యురిటీపై ప్రొఫెసర్ దాడి చేశారు. నాకే అడ్డు చెబుతావా అంటూ ప్రొఫెసర్‌తో సహా అతని భార్యా సెక్యురిటీపై దూర్భాషలాడారు. క్షమించండని చెప్పినా వినకుండా అతన్ని చితకబాదాడు. అతని దెబ్బలకి తట్టుకోలేక సెక్యురిటీ పక్కనే ఉన్న ఆఫీసు రూమ్‌లోకి పరిగెత్తాడు. అయినా ప్రొఫెసర్ అక్కడికెళ్లి నీ అంతు చూస్తానని చేయిచేసుకున్నారు. తప్పుచేశానని చెప్పినా, కన్నీరు పెట్టుకొని కాళ్లు పట్టుకున్నా.. ప్రొఫెసర్ కనికరించలేదు. -
అవిశ్రాంత పోరాటయోధుడు జాదవ్
హైదరాబాద్: ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అవిశ్రాంత పోరాటయోధుడని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఆధ్వ ర్యంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జాదవ్ సంస్మరణసభలో నాయిని మాట్లాడుతూ కేశవరావు జాదవ్ నిజమైన సోషలిస్టు నేత అని అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు 18 నెలలపాటు జైలు పాలయ్యారని, నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజమన్నారు. జాదవ్ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నించాలని, అందుకు తనవంతు సహాయ సహకారం అందిస్తానని, నగరంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాజ్యసభసభ్యుడు కె. కేశవరావు మాట్లాడుతూ నక్సలైట్ల సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని కోరుకోవడంతోపాటు ప్రభుత్వంతో చర్చలక్రమంలో ముందు నిలిచారని గుర్తుచేశారు. ఆయన మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో కేశవరావు జాదవ్ పాత్ర ఎనలేనిదని అన్నారు. సోషలిజం ఎప్పటికీ అంతం కాదని, నిర్బంధం సమస్యలకు పరిష్కారం కాదని చెబుతుండేవారన్నారు. కార్యక్రమం లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, రచయిత వసంతా కన్నాభిరాన్, విరసం సభ్యురాలు రత్నమాల, నదీజలాల కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు ఎం.వేదకుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత చిక్కుడు ప్రభాకర్, ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి, సీనియర్ న్యాయవాది జయవింధ్యాల, పీవోడబ్ల్యూ నాయకురాలు వి.సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనురాధ, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, హనుమాండ్లుతోపాటు జాదవ్ సతీమణి ఇందిరా, కుమార్తెలు నివేదిత, నీలు, చెల్లెలు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభ పాల్గొన్నారు. -
లైంగిక వేధింపుల కేసులో ప్రొఫెసర్ అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రొఫెసర్ చంద్రశేఖర్‌ను, ప్రొఫెసర్‌పై దాడి కేసులో ప్రజన్కుమార్ను ఆదివారం దర్గామిట్ట ఇన్స్పెక్టర్ వి.సుధాకర్‌రెడ్డి ఆదివారం అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఓ యువతి ఏసీఎస్సార్ ప్రభు త్వ వైద్యకళాశాలలో నాల్గో సంవత్సరం వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ నెల 14న ఆమె జీజీహెచ్‌లోని జనరల్ సర్జరీ విభాగంలోని డెమో గదికి వెళ్లింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆమెను లైంగికంగా వేధించా డం టూ ఆరోపిస్తూ బాధిత విద్యార్థిని తన కుటుం బ సభ్యులకు తెలిపింది. దీంతో వారు ప్రభు త్వ వైద్యకళాశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని బంధువు ప్రజన్కుమార్ ప్రొఫెసర్‌పై దాడిచేసి గాయపరిచారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్‌పై లైంగిక వేధింపుల కేసు, ప్రజన్కుమార్పై దాడికేసు నమోదుచేసిన విషయం విదితమే. -
వైద్య విద్యార్థినిపై ప్రొఫెసర్ వికృత చేష్టలు
-
మెడికల్ విద్యార్థినికి ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
-
విద్యార్థినికి ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల ఉదంతం కలకలం సృష్టించింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థినిని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు అసభ్యకరరీతిలో ప్రవర్తించిన ప్రొఫెసర్ చంద్రశేఖర్‌పై గురువారం దాడిచేశారు. ఈ దాడిలో మరో ఇద్దరు లెక్చరర్లకు గాయాలయ్యాయి. సక్రమంగా కళాశాలకు రాకపోవడంతో మందలించినందుకే తనపై సదరు విద్యార్థిని ఆరోపణలు చేసిందని ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆయనపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. -
అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుందాం
సాక్షి, మక్తల్ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వై రత్నం, కేఎన్పీఎస్ రాష్ట్ర నాయకుడు డి.చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఎస్ పంక్షన్హాల్లో కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మొదటి మహసభలో వారు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను చేయాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు దాటుతున్నా ఇంకా ప్రజలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పీడిత కులాల మహిళలను అవమానించే రీతిలో జోగిని, బస్వినీలుగా మార్చే సంస్కృతి నుంచి బయట పడాలని సూచించారు. తెలంగాణ వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని, మైనార్టీలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం విలువలను కాపాడాటానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కెఎన్పీఎస్ రాష్ట్ర నాయకులు భూరం అభినవ్, రాములు, బండారి నర్సప్ప, రమేష్, లింగన్న, కృష్ణ, శ్రీదేవి, రాంచందర్, మద్దిలేటి, వామన్, మున్వర్‌అలీ, బండారి లక్ష్మణ్, వెంకటేస్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి పేరుతో మోసం, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, తార్నాక : మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లిచూపులకు వచ్చాడు. నచ్చానని చెప్పి స్నేహం చేశాడు....పదేళ్లుగా తనతో స్నేహం చేయడమేగాక రూ.25లక్షలు తీసుకుని పెళ్లిచేసుకోకుండా మోసం చేశాడని అరోపిస్తూ ఓ యువతి ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓయూ ఇన్స్పెక్టర్ జగన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓయూ కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్న యువతి ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పని చేస్తోంది. ఉప్పల్‌కు చెందిన డాక్టర్ కిరణ్‌కుమార్ ఓయూ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఓయూ పరీక్షల విభాగంలో అదనపు కంట్రోలర్‌గా పనిచేస్తున్నాడు. ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా డాక్టర్ కిరణ్‌కుమార్ సంబంధం వచ్చింది. ఇద్దరు ఇష్టపడటం తో పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. పదేళ్లుగా స్నేహం కొనసాగిస్తున్న కిరణ్‌కుమార్ వివిధ అవసరాల పేరుతో సదరు యువతి నుంచి రూ.25లక్షలు తీసుకున్నాడు. ఇటీవల ఆమె తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చేయడంతో తన అక్కల వివాహం జరిగిన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తరువాత తనపై వేధింపులకు పాల్పడమేగాక తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డాక్టర్ కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిర్భయ కేసు పెట్టాలి: బాధితురాలు... తనతో పదేళ్ల పాటు స్నేహం చేసి లైంగికంగా, మానసికంగా , శారీరకంగా వేధింపులకు గురిచేసిన కిరణ్‌కుమార్‌పై నిర్భయ కేసు పెట్టాలని బాధితురాలు డిమాండ్ చేసింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.25లక్షలు తీసుకున్నాడని, తీరా మరో యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిసి నిలదీయండంతో దాడికి పాల్పడినట్లు తెలిపింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని కోరింది. -
ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు
-
కీచక ప్రొఫెసర్ పీచమణిచారు
పాటియాలా: విద్యార్థినుల ఫోన్లకు అసభ్యకరమైన సందేశాల పంపిన ఓ ప్రొఫెసర్‌కు దిమ్మతిరిగేలా బుద్ది చెప్పారు యూనివర్సిటీ అమ్మాయిలు. ప్రొఫెసర్ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బాలికల కళాశాలలో జరిగింది. పాటియాలాలోని ప్రభుత్వ కాలేజీకి చెందిన ఓ ప్రొఫెసర్ అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది అమ్మాయిలకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. దీంతో కోపోద్రిక్తులైన అమ్మాయిలు ఆ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కళాశాల నుంచి అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. ఇదంతా ఓ విద్యార్థిని వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. కాగా ఆ ప్రొఫెసర్ పేరు ఇంత వరకూ బయటకు వెల్లడించలేదు. బాధితులు పోలీసులను సంప్రదించారో లేదో స్పష్టత లేదు. ఎనిమిది మంది జేఎన్‌యూ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్ అతుల్ జోహారీ ఉదంతం మర్చిపోకముందే కళాశాలల్లో ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. -
ఢిల్లీ వీధుల్లో ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్, వైరల్ పోస్ట్
న్యూఢిల్లీ : చేతికి వచ్చిన కొడుకులు పట్టించుకోకుండా రోడ్డుపై వదిలివేసిన ఓ 74 ఏళ్ల ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్‌కు సోషల్ మీడియా ఓ గూడు చూపించింది. నాలుగు దశాబ్దాలుగా వీధుల్లోనే నివాసం గడిపిన ఇతనికి తలదాచుకోవడానికి చోటు కల్పించింది. ఈ ప్రొఫెసర్‌పై ఢిల్లీకి చెందిన అవినాష్ సింగ్ చేసిన ఫేస్బుక్ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాజా సింగ్ ఫూల్.. ఒకానొక సమయంలో ఎంతో ఖ్యాతి గడించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్. కానీ ఆయన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఎంతో దుర్భాంతకరమైన సంచార జీవితం గడుపుతున్నారు. 1960లో తన సోదరుడితో పాటు భారత్‌కు వచ్చిన రాజా సింగ్, ముంబైలో మోటార్ పార్ట్‌ల వ్యాపారం మొదలు పెట్టారు. కానీ తన సోదరుడు మరణిచడంతో ఆ వ్యాపారం కుదేలైంది. అంతేకాక అతని ఇద్దరు కుమారు కూడా రాజాసింగ్‌ను విడిచిపెట్టారు. కొడుకులను విదేశాలకు పంపించడానికి చాలా హార్డ్ వర్క్ చేశానని రాజా సింగ్, అవినాష్ చేసిన పోస్టులో చెప్పారు. రుణం తీసుకుని మరీ కొడుకుల్ని చదివించి, ఒకర్ని యూకేకి, మరొకర్ని అమెరికాకి పంపించినట్టు తెలిపారు. కానీ వారు ప్రస్తుతం తమ భార్యలతో పాటు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, కనీసం తండ్రిని చూడటానికి కూడా వారికి తీరిక దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీసా సెంటర్ బయట దరఖాస్తులను నింపుతూ రాజా సింగ్ తన కాలం గడుపుతున్నట్టు తెలిపారు. ‘దరఖాస్తులను నింపుతుంటా, వారికి సాయపడతుంటాను’ అని రాజా సింగ్ , అవినాష్ చేసిన ఫేస్బుక్ పోస్టులో చెప్పారు. కనీసం తల దాచుకోవడానికి ఓ ఇళ్లంటూ లేని ఈ 74 ఏళ్ల ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు సాయం చేయాలంటూ అవినాష్ ఈ పోస్టు చేశాడు. ఏప్రిల్ 21న షేర్ అయిన ఈ పోస్టుకు ఒక్కసారిగా అనూహ్య స్పందన వచ్చింది. 5000కు పైగా షేర్లు రావడమే కాక, రాజా సింగ్‌కు సాయం చేస్తామంటూ చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ని న్యూఢిల్లీలోని ఓల్డ్ ఏజ్ హోమ్‌కు తరలించారు. -
లైంగిక వేధింపులు: బుక్కైన మరో ప్రొఫెసర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల కేసు నమోదవ్వగా.. తాజాగా మరో ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది. ప్రొఫెసర్ అజయ్‌కుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ సైన్స్ విద్యార్థిని ఒకరు ఆరోపించారు. ఈ మేరకు ఆమె వసంత్‌కుంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. పోలీసులు సదరు ప్రొఫెసర్‌పై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎనిమిది మంది విద్యార్థినులు ఆయనకు వ్యతిరేకంగా కేసు నమోదుచేశారు. ఈ వ్యవహారంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో పోలీసులు ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. కానీ, మరునాడే అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. -
యువతులపై ‘పుచ్చకాయ’ వ్యాఖ్యలు.. కేసు
సాక్షి, తిరువనంతపురం : ముస్లిం యువతులను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేసిన కేరళ ప్రొఫెసర్ చిక్కుల్లో పడ్డారు. కోజీకోడ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీచేశారు. కోజీకోడ్లోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజ్ ప్రొఫెసర్ జౌహర్ మునవ్వీర్ ఈ మధ్య ఓ మీటింగ్ లో మాట్లాడుతూ.. కాలేజీలోని అమ్మాయిలు బుర్ఖాలు ధరించినప్పటికీ.. ఛాతి భాగాన్ని మాత్రం పూర్తిగా కప్పుకోరని .. ఆ భాగాన్ని పుచ్చకాయలా చూపిస్తూ ఆకర్షిస్తుంటారని, ఆపై లెగ్గిన్స్ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిచింది. కొందరు మహిళలు నగ్న ఫోటోలను పోస్ట్ చేయగా.. మరికొందరు పుచ్చ కాయలతో వక్షోజాలను కప్పిపుచ్చుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ తమ ఫోటోలను షేర్ చేశారు. భారతీయ మహిళలకు సరిపడ బట్టలు ఎంటో చెప్పండి అంటూ జౌహర్పై విమర్శలు గుప్పించారు. కాగా, అమ్రిత అనే యువతి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి, వారెంట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ గత నాలుగు రోజులుగా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
లైంగిక వేధింపుల కేసులో ప్రొఫెసర్ అరెస్ట్
న్యూఢిల్లీ: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) ప్రొఫెసర్ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్‌యూ లైఫ్ సైన్సెస్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అతుల్ జోహ్రి(54)తమను వేధిస్తున్నారంటూ సోమవారం కొందరు విద్యార్థినులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివిధ సంఘాలు, విద్యార్థులు, 54 మంది జేఎన్‌యూ ప్రొఫెసర్లు బాధితులకు మద్దతుగా పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. బాధితుల ఫిర్యాదులపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేయాలంటూ మంగళవారం కూడా వారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ప్రొఫెసర్‌పై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయటంతోపాటు అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా బెయిల్ మంజూరు చేశారు. -
ఎట్టకేలకు ప్రొఫెసర్ అరెస్ట్
న్యూఢిల్లీ : విద్యార్థుల ఆందోళనతో ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రొఫెసర్ అతుల్ జోహ్రీని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్‌యూ లైఫ్ సైన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అతుల్‌పై నాలుగు రోజుల క్రితం అదే విభాగానికే చెందిన విద్యార్థినులు తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగు రోజులు గడిచిన పోలీసులు అతుల్‌ని అరెస్ట్ మాత్రం చేయలేదు. అతుల్‌ని అరెస్ట్ చేయాలని 54 మంది అధ్యాపకులు డిమాండ్ చేసిన పోలీసులు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఢిల్లీ పోలీసులకు, యూనివర్సిటీకి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వీరికి తోడుగా మహిళ హక్కుల సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో సమస్య తీవ్రతను గ్రహించిన పోలీసులు అతుల్‌ని అరెస్ట్ చేశారు. మరికొంత మంది విద్యార్థినులు కూడా అతుల్‌పై ఇదే విధమైన ఆరోపణలతో ఫిర్యాదులు చేశారని, లోతైన దర్యాప్తు చేపడతామని డీసీపీ మౌనిక భరాద్వాజ్ తెలిపారు. -
జేఎన్‌యూలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జేఎన్‌యూలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పీహెచ్డీ విద్యార్థిని ఆరోపిస్తూ అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జేఎన్‌యూలో లైఫ్ సైన్స్ మొదటి సంవత్సరం స్కాలర్ పూజ కసానా రెండు రోజుల క్రితం హాస్టల్ విడిచి వెళ్లిపోయింది. ఆమె జాడ తెలియకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం లక్నోలో పూజని గుర్తించి, ఢిల్లీకి తీసుకొచ్చారు. తాను హాస్టల్ విడిచి వెళ్లడానికి తన మెంటర్ ప్రొఫెసర్ అతుల్ కుమార్ జోహ్రీ లైంగిక వేధింపులే కారణమని పూజ పోలీసులకు తెలిపింది. అతుల్‌ను తన ప్రవర్తన మార్చుకోవాలని ఈ మెయిల్ ద్వారా సూచించినా మార్పు రాలేదని తెలిపింది. ‘అతుల్ నువ్వు జేఎన్యూలోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ గైడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు నీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాలని ఆశపడవచ్చు, కానీ చదువుకోనివారు కూడా బుద్ధిలో నీ కన్నా నూరుపాళ్లు నయం. నేను పీహెచ్‌డీని వదిలి వెళ్లడానికి నీ ప్రవర్తనే కారణం. నీకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, నీ ప్రవర్తనతో ఎన్నో సార్లు విసుగు చెందిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని పూజ ఆ మెయిల్లో పేర్కొంది. మరోవైపు పూజ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అనుహ్యంగా గురువారం సాయంత్రం మరో 12 మంది లైఫ్ సైన్స్ విద్యార్థినిలు అతుల్‌పై ఇదే రకమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. అతుల్ తమకు అసభ్యకరమైన మెసెజ్‌లు చేయడం, శరీరాకృతి మీద కామెంట్లు చేసేవాడని వారు తెలిపారు. అతుల్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్టూడెంట్ ఫ్యాకల్టీ కమిటీ మెంబర్ ఒకరు వెల్లడించారు. దీంతో ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీ కూతురికి అదే గతి పట్టాలి: ఓ విద్యార్థిని
సాక్షి, న్యూఢిల్లీ : 'సార్ మీకు సభ్యత, సంస్కారం లాంటివి లేవు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా’ అంటూ వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌కి ఓ పీహెచ్డీ విద్యార్థిని ఈమెయిల్ చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తన నచ్చకనే వర్సీటీ నుంచి తాను పారిపోయానని చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన ఓ 26 ఏళ్ల యువతి జేఎన్‌యూలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్డీ చేస్తోంది. ఇటీవల ఆమె యూనివర్సిటీ నుంచి పారిపోయి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై విద్యార్థిని తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎ.కె.జోరి దురుసు ప్రవర్తన వల్లే యూనివర్సీటీని వదిలి వెళ్లాలని ఆ విద్యార్థిని లేఖ సారాంశం. ‘ గౌరవనీయులైన ప్రొఫెసర్ గారికి నమస్కారం. మీరు దేశంలోనే గొప్ప గైడ్ (నిర్దేశకుడు) అని అనుకుంటున్నారు. నేను కూడా మొదట్లో ఇలానే అనుకున్నా. మీరు మాకు గైడ్‌గా ఉండడం వరంగా భావించా. కానీ తర్వాత మీ నిజస్వరూపం తెలిసింది. మీకు సభ్యత, సంస్కారాలు తెలియవు. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. నీ దురుసు ప్రవర్తన వల్లే నేను వర్సీటీ వదిలి వెళ్లాను. నాలాగ మరో అమ్మాయి బలి కాకుడదని అనుకుంటున్నాను. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితే రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. కనీసం అప్పుడైనా అమ్మాయిల బాధ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ మెయిల్ పంపింది. కాగా ప్రొఫెసర్ ఎ.కె.జోరి తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తాను గత నెల 27న వరుసగా గైర్హాజరైన తొమ్మిమంది విద్యార్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపాను. ‘మీరు సరిగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా అయితే మీ పీహెచ్‌డీని పూర్తి చేయడం కష్టం. మీరు మరో ల్యాబ్‌ను చూసుకోండి’అని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అందరు విద్యార్థుల్లాగే రెగ్యులర్‌గా హాజరు కావాలని కోరానన్నారు. అందరితో ప్రవర్తించినట్లే ఆమెతోను వ్యవహరించానని తెలిపారు. ఆ విద్యార్థిని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రొఫెసర్ ఎ.కె.జోరి అన్నారు. -
పునరుత్పాదక ఇంధనాలదే భవిష్యత్
తెయూ(డిచ్పల్లి): కెమిస్ట్రీ, ఫార్మా కెమిస్ట్రీ రంగాలలో పరిశోధనలకు దక్షిణాఫ్రికా దేశంలో అపార అవకాశాలున్నాయని దక్షిణాఫ్రికాలోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ సుబూసింగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శిలాజ ఇంధనాలకు కాలం చెల్లుతుందని, రాబోయే రోజులన్నీ పునరుత్పాదక ఇంధనాలదేనన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘భవిష్యత్ ఇంధనాలు’ అనే అంశంపై సుబూసింగ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నిల్వలు తరిగిపోతున్నాయని, వాటి వాడకం వల్ల పర్యావరణం కలుషితమై భూతాపం పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా, సుస్థిర అభివృద్ధి, ఇంధన స్వయం సమృద్ధి సాధించాలన్నా పునరుత్పాదక ఇంధనాల వినియోగం, ఉత్పత్తి పెరగాలని ఆయన సూచించారు. శిలాజ ఇంధనాలు రాజకీయ, భౌగోళిక, ఆర్థిక కారణాలతో సరఫరా ఆగిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. హైడ్రోజన్ ఆధారిత ఇంధనాల అభివృద్ధి దిశగా తాము ప్రయోగాలు చేస్తున్నామని, ఇది భవిష్యత్ అవసరాలకు అనువుగా ఉంటుందన్నారు. దక్షిణాఫ్రికాలో పరిశోధనలకు విస్తృత అవకాశాలున్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఎంఎస్, పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లో చేరవచ్చన్నారు. అనంతరం సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ముఖాముఖిలో ఆయన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సుబూసింగ్ డర్బన్‌లోని క్వాజుల్ నటాల్ యూనివర్సిటీలో మూడు దశాబ్దాలుగా కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. టూటా అధ్యక్షుడు రాజారాం, కార్యదర్శి పున్నయ్య, పరీక్షల నియంత్రణాధికారి యాదగిరి, ఫార్మా విభాగం హెడ్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ శిరీష, సత్యనారాయణ, నాగరాజు, సాయిలు తదితరులు సుబూసింగ్‌ను సత్కరించారు. -
సాహితీ.. మహాసముద్రం
అనంతను కార్యక్షేత్రంగా మలుచుకుని సాహితీ సేవలు అందిస్తున్న వారిలో విశ్రాంత ప్రొఫెసర్ మహాసముద్రం కోదండరెడ్డి దేవకి ఒకరు. చిత్తూరు జిల్లా వరిగిపల్లి గ్రామంలో జన్మించిన ఆమె ఉద్యోగరీత్యా 1979 నుంచి 2011 వరకు ఎస్కేయూలోని తెలుగు విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేశారు. బాలల సాహిత్యంలో పరిశోధనలు చేసిన తొలి మహిళ దేవకితో ‘సాక్షి హృదయరాగం’ మీ కోసం.. మహిళా స్వేచ్ఛను హరిస్తున్నారు నాటి కన్యాశుల్కం రోజుల నుంచి నేటిదాకా నిత్యమూ బాధలనుభవిస్తోంది మహిళలే. అన్ని చోట్లా స్త్రీ.. దారుణంగా మోసపోతోంది. చిన్నతనంలో తల్లిదండ్రుల వద్ద, యుక్తవయసులో భర్త వద్ద వివక్ష కొనసాగుతోంది. భద్రత పేరుతో స్వేచ్ఛను హరిస్తున్నారు. మా పొలాల్లో కూలికి వచ్చే మగవారికి రెండు రాగి ముద్దలు, కొంత డబ్బు ఇస్తే.. అదే పని చేసిన ఆడవారికి అందులో సగం డబ్బు, ఒక రాగి ముద్ద ఇచ్చేవారు. అప్పట్లోనే దీన్ని నేను బాగా వ్యతిరేకించాను. యూనివర్సిటీలో చేరాక కూడా అనేక ఘోరాలు చూడాల్సి వచ్చింది. మహిళలను ఆటవస్తువులుగా చూడొద్దంటూ అరవడం అరణ్యరోదనే అని అర్థమైపోయింది. సమాజంలో మార్పు రానంత వరకు ఏమీ చేయలేం. – మహాసముద్రం కోదండరెడ్డి దేవకి ఇల్లే విద్యాలయం మా కుటుంబ నేపథ్యం చాలా ఆసక్తిగా ఉంటుంది. కేవలం మూడో తరగతి వరకు చదువుకున్న మా నాన్న కోదండరెడ్డి శ్రీ వేంకటేశ్వరస్వామిపై వేల కొద్ది పాటలు, పద్యాలు రాశారు. అవన్నీ ఛందోబద్ధంగా ఉన్నాయి. చిన్నాన్న బి.ఎన్.రెడ్డి.. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. అమ్మ, అక్కలు కూడా ఆసువుగా జానపద గేయాలను ఆలపించగలరు. ఈ నేపథ్యంలోనే నేను కూడా రాయగలననే నమ్మకంతో ప్రయత్నించాను. ఎదుటి వారిలో శక్తిని గుర్తిస్తే మనలోని ఎంత ప్రతిభనైనా వెలికితీయొచ్చన్నది నా కుటుంబం ద్వారా నేర్చుకున్నాను. టాలెంట్ హంట్ చేపట్టాలి మా ఆయన (ఆచార్య పీఎల్ శ్రీనివాసరెడ్డి)తో కలిసి నేను ‘రసలాస్య’ అనే కళా సాంస్కృతిక సంస్థను ఎస్కేయూలో ఏర్పాటు చేశాను. వర్సిటీలో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులలోని టాలెంట్‌ను గుర్తించడం, వాటిని ప్రదర్శించేందుకు సంగీతాన్ని ఆలంబనగా చేసుకున్నాము. దానికి మేము పెట్టిన ‘పురమాయిస్తుంది సమాజాన్ని సంగీతం సరిగ పదమని’ అనే ట్యాగ్‌లైన్ కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది. అందరూ ఓ చోట చేరి మనసారా ఆడిపాడుకోవడం వల్ల ఓ చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి ప్రయత్నం అన్ని చోట్లా సాగినపుడే అంతరాలు, అహం తొలిగిపోతాయి. ప్రతి కథలోను బాలసాహిత్యం బాల సాహిత్యం కోసం ఎన్నో ఊర్లు తిరగాల్సి వచ్చింది. ఎన్నో పుస్తకాలను అతి కష్టంపై సేకరించాను. నేను రాసిన ‘ తారంగం తారంగం, గోరుముద్దలు, బాలసాహిత్యం, జాతిరతనాలు, తెలుగు నాట జానపద వైద్య విధానాలు, దాక్షిణాత్య సాహిత్యం–తులనాత్మక పరిశీలన, ఇర్ల చెంగి కథలు, ముళ్ల దోవ, మండల వడిలో’ వంటి బాలల గేయాలు, వ్యాస సంపుటిలు..ఇలా ప్రతి దానిలో ఉత్తమ విలువలే చోటు చేసుకున్నాయి. మరో 10 పుస్తకాలు నా సంపాదకత్వంలో వెలువడ్డాయి. ‘జాతి రత్నాలు’ పేరిట ఉపవాచకంలో నా రచనలను 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు. ప్రపంచ తెలుగు సభల సందర్భంగా తెలుగు అకాడమీ వారు ‘బాల సాహిత్యం’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఇది అనంతకు దక్కిన గౌరవంగానే భావించాను. ఇప్పుడు సామెతలెక్కడున్నాయి? విస్తృతమైన భావాన్ని అతి కొద్ది మాటల్లో చురుగ్గా, సూటిగా అందించే సామెతలు ఒకప్పుడు నిత్య వ్యవహారంలో ఉండేవి. ఏ సందర్భంలో, ఏ అర్థంలో వాటిని వాడాలో మన తెలుగు వారికి తెలిసినంతగా మరెవరిలోనూ కనిపించదు. వాటి వాడకం తెలుసుకుంటే తెలుగు భాష మరింత అందంగా ఉంటుంది. దాని కోసమే నేను ‘సామెతల సూరమ్మత్త’ పాత్రతో వేలాది సామెతలు, పొడుపుకథలు సేకరించాను. వివిధ పత్రికల్లో వచ్చాయి. త్వరలో వాటికి గ్రంథ రూపం ఇవ్వాలనుకుంటున్నా. విద్యార్థులకు ఆటల పాటల రూపంలో పొడుపు కథలను విప్పమని చెప్పడం, లేదంటే వారు సేకరించిన పొడుపు కథలను చెప్పాలన్న నియమం పెట్టడంతో చాలా మంది ఆసక్తికరంగా నేర్చుకున్నారు. ఈ ప్రయోగాన్ని నేను పాతికేళ్ల పాటు కొనసాగించాను. ‘అనంత’ ఎప్పుడూ ప్రత్యేకతే అనంత ప్రత్యేకత ఎప్పటికీ భిన్నమే. వేరుశనగ గురించి చెప్పుకోవాలంటే దేశంలోనే అనంత పేరే ముందుగా గుర్తొస్తుంది. కానీ అనంత రైతాంగమే విలవిలలాడిపోతోంది. వారి ఆవేదన కూడా అనేక వ్యాసాలు, కథల రూపంలో వెలువరించాను. ఈ ప్రాంతంలో రేగిన ఉద్యమాలు కూడా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. కానీ ఇక్కడ కూడా మహిళలకు అన్యాయమే జరుగుతోంది. ఎంత మంది మహిళలను ఉద్యమకారులుగా, నడిపించే నేతలుగా గుర్తిస్తారు చెప్పండి. కాబట్టే మేము మా సాహిత్యంతోనే ఉద్యమాలలో పరోక్ష పాత్ర పోషించాం. కథలు రాయించిన నిరుద్యోగ జీవితం నేను పరిశోధన గ్రంథం సమర్పించిన తర్వాత నిరుద్యోగిగా ఆరు నెలల పాటు స్వగ్రామంలో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ‘తరం మారింది, సెలయేట్లో గులకరాళ్లు’ అనే రెండు నవలలు రాశాను.వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ రాసిన మొదటి నవలే ఎందరినో కదిలించింది. అలాగే మొదటి కథ ‘ఎంగిలాకు’ను అధ్యాపకులందరూ బాగుందన్న తర్వాత ‘ఆకలి చెప్పిన తీర్పు’ కథను రాశాను. కథల కాణాచి కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) అంతటి వారు నా కథల్ని ప్రశంసించడం పెద్ద అవార్డుగానే భావిస్తాను. తర్వాత ఎన్నో కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. స్త్రీ వాదంపై ఎన్నో వ్యాసాలు రాశాను. ఫకృద్దీన్ ఆలీ అహ్మద్‌తో కలిసి.. రాష్ట్రపతిగా 1974 – 77లో ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ ఉండేవారు. ఆ సమయంలో నేను బాలల అకాడమీలో సభ్యురాలిగా ఉండేదాన్ని. అప్పట్లో హైదరాబాదులో నాలుగురోజుల పాటు జరిగిన బాలల సదస్సులో ఆయన పూర్తిగా సమయాన్ని కేటాయించి విలువైన సలహాలు, సూచనలు అందించారు. బాలల సాహిత్యం పట్ల నేను చేస్తున్న కృషిని గుర్తించి ప్రత్యేకంగా నన్ను అభినందించడం మరచిపోలేను. ఇతరుల ప్రతిభను మెచ్చుకోవడం తక్కువ ఇటీవల ఇతరులలోని ప్రతిభా పాటవాలను గుర్తించకపోవడం, తెలిసినా వెనక్కు లాగడం ఎక్కువైంది. దీని వల్ల మంచి సాహిత్యం వెలుగులోకి రాకుండా పోయింది. బాలల సాహిత్యంలో నేను సాగిస్తున్న కృషికి తిక్కవరపు రామిరెడ్డి బంగారు పతకం, వెంకటకృష్ణారావు స్మారక పురస్కారం, సీతామహాలక్ష్మి పురస్కారం, ఉగాది పురస్కారాలతో పాటు భారత మహిళా పురస్కారం నన్ను వరించాయి. కర్నూలు తెలుగు భాషా వికాస ఉద్యమం వారు విశిష్ట మహిళా పురస్కారమందించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డునందించింది. జానపద సాహిత్యాన్ని మరవొద్దు మన జీవన విధానంలోని విభిన్న కోణాలు మన ఆచార వ్యవహారాలలో వ్యక్తమవుతాయి. ఏ తరం వారికైనా జానపద సాహిత్యం దిశానిర్దేశం చేస్తుందనేది నా భావన. ఆ దిశగా నేను రాసిన ఎన్నో జానపద సాహితీ గ్రంథాలు నాకు అవార్డులు, రివార్డులతో పాటు కొత్త ఒరవడికి నాంది పలికాయి. ఇవన్నీ మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర లాంటి చోట్ల కూడా అనంత వాసుల రచనలు పాఠ్యాంశాలుగా మారడం గర్వించదగిన విషయం. స్వయంగా నేను ఓ జానపదుల ఇంట పుట్టడం వల్ల జానపదుల స్థితి గతులపై విస్తారంగా చర్చించే అవకాశమొచ్చింది. బయోడేటా పూర్తిపేరు : మహాసముద్రం కోదండరెడ్డి దేవకి జన్మస్థలం : వరిగిపల్లి గ్రామం, చిత్తూరు జిల్లా తల్లిదండ్రులు : కోదండరెడ్డి, కమలమ్మ భర్త : ఆచార్య పి.ఎల్. శ్రీనివాసరెడ్డి విద్య : ఎంఎ.. పీహెచ్డీ., వృత్తి : ఎస్కేయూ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ రచనలు : ‘ తారంగం తారంగం’, ‘గోరుముద్దలు’, ‘బాలసాహిత్యం’, ‘జాతిరతనాలు’, ‘తెలుగు నాట జానపద వైద్య విధానాలు’ మొదలైనవి స్ఫూర్తి : కుటుంబమే పురస్కారాలు : ఉగాది పురస్కారం, భారత మహిళా పురస్కారం -
ఒక్కో ప్రొఫెసర్ ఒక్కో వసూల్ రాజా !
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రాణిస్తున్నారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గత వైభవ చరిత్రను మసకబారుస్తున్నాయి. పూర్వ విద్యార్థులు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ నిర్మాణానికి రూ.కోట్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే, అధ్యాపకులు మాత్రం వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కళాశాల పరువును బజారుకీడుస్తున్నారు. పరీక్షల పేరు చెప్పి వసూలు కళాశాలలో శనివారం నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పర్యవేక్షించేందుకు (ఎక్స్టర్నల్) ఇతర రాష్ట్రాల నుంచి ప్రొఫెసర్లు వచ్చారు. వీరికి ప్రభుత్వం టీఏ, డీఏలు ఇస్తుంది. అయితే, ప్రభుత్వ వైద్య కళాశాలలోని నాలుగు వైద్య విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు ఇన్విజిలేటర్లకు రూమ్‌లు, భోజన వసతులు కల్పించేందుకు అంటూ వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి రూ.20వేలు, హౌస్సర్జన్ల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాక్టికల్స్‌లో ఎన్ని మార్కులు వేయాలనేది ప్రొఫెసర్ల నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో విద్యార్థులు భయపడి నగదు ఇస్తున్నట్లు తెలిసింది. అవసరాన్ని బట్టి రూ.50 వేలు కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హాజరు శాతం పెంచాలన్నా నగదు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిరుపేద వైద్య విద్యార్థులను కూడా వదలకుండా వైద్యాధికారులు వసూళ్లకు పా ల్పడుతున్నారు. నిరుపేదలనే కనికరం లేకుండా.. ఆరోగ్యశ్రీ ఆపరేషన్ల ద్వారా పలువురికి వచ్చే పారితోషికాలను సైతం ప్రొఫెసర్లు బినామీ అకౌంట్లలోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత పరీక్ష విధానంలో మార్పులు తెస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అనేకసార్టు వైద్య కళాశాలకు వచ్చిన సమయంలో వెల్లడించారు. అయితే.. ప్రకటనలు తప్ప ఆచరణలో మాత్రం చూపలేదు. విచారణ జరుపుతాం.. కళాశాలలో డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఇన్విజిలేటర్లకు ప్రభుత్వం టీఏ, డీఏలు ఇస్తుంది. అందుకోసం ఎవరూ ఖర్చు పెట్టనవసరం లేదు. విచారణ జరిపి వసూళ్లకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సుబ్బారావు, ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల -
కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ బాబులు అరెస్ట్
-
కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, కాకినాడ : ఎంటెక్ విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్టీయూకే ఐఎస్టీ డైరెక్టర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ప్రొఫెసర్ కె.బాబులును సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. వైవా పరీక్షల సందర్భంగా ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సరం విద్యార్థినుల పట్ల బాబులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణాలు ఉన్నాయి. కాగా ఈ వ్యవహారంపై వర్శిటీ... ఇప్పటికే ప్రొఫెసర్ బాబులుపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. ప్రొఫెసర్ బాబులుపై విద్యార్థులు ఇచ్చిన లేఖ ఆధారంగా రిజిస్ట్రార్ సుబ్బారావు కాకినాడ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దీనిపై 254, 254ఎ, 509 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు అయ్యాయి. ఇవాళ ప్రొఫెసర్ బాబులును అదుపులోకి తీసుకున్నారు. -
అంతర్మథనంలో ఆచార్యులు
కుల పరిమితుల మీద రామానుజుడి వాదం సరైనదే. అయినా పెద్దలు ఈవిధంగా వ్యవహరించారనే ఉదాహరణగా మిగలడం తనకు ఇష్టం లేదు. ‘‘నా తక్కువ కులం నిజమే కదా రామానుజా. ఆమెకు తెలిసింది ఆమె చేసింది. తప్పేముంది. నాకు తగిన గౌరవాన్ని ఇచ్చిందనే నేననుకుంటున్నాను. నీకు నాపై అంతకుమించిన అభిమానం ఉంది, అది నా భాగ్యం. వరదరాజుని దయ అనుకుంటాను. నాకే బాధాలేదు సరేనా’’. కాంచీపూర్ణుల వ్యక్తిత్వం మీద నానాటికీ రామానుజుడిలో అభిమానం పెరుగుతూ వచ్చింది. ఆయనను మించిన గురువు దొరకడేమోనని అనుకున్నాడు. వారి దగ్గర శిష్యుడిగా నేర్చుకోవలసింది చాలా ఉందని భావించాడు. అందుకే ఆచార్యుడి భుక్తశేషం తీసుకోవాలని అభిలషించినాడు. కాని రక్షకాంబ తను గురువనుకుంటున్న అతిథిని నిరాదరించి అవమానించిందని ఆగ్రహించాడు. ఎప్పుడూ అంత కోపం రాలేదు. కాని కోపాన్ని అణచుకున్నాడు. మాటల్లో కాఠిన్యం తగ్గించేందుకు ప్రయత్నించాడు. భర్త ఆదరించిన పెద్దమనిషిని తాను కూడా ఆదరించాలన్న మర్యాద లేకపోవడం ఆమె చేసిన తొలి తప్పు అని నిర్ధారణ జరిగింది. ఇక మిగిలిన అవగాహన ఏముంది? ఆచార్యుని వివాహ జీవితానికి ఇది తొలి దెబ్బ. కాంచీపూర్ణుల సాన్నిధ్యమే తనకు ప్రశాంతతనిస్తుంది. అందుకే మళ్లీ కాంచీపూర్ణుడి చెంత కూర్చుని ఆయనతో చర్చలలో పడ్డారు. కాని అతని మనసంతా సందేహాస్పదంగా ఉన్నట్టు ఆయనకు అర్థమైంది. ‘‘నాయనా రామానుజా, నీ మాటల్లో మనసులో ఏదో సందేహం ఉన్నట్టు నాకు అర్థమవుతున్నది. మనసులో ఏ బాధా పెట్టుకోకు... నిస్సంకోచంగా అడుగు. నిశ్చింతగా ఉండు.... నీకేదో అడగాలని ఉన్నట్టుంది కదూ..’’‘‘అవును స్వామీ నన్ను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఆ సందేహాలకు వరదుడే సమాధానాలు చెప్పాలని మనసు కోరుకుంటున్నది స్వామీ. మీరు అడిగితే పెరుమాళ్ కాదనరు కదా ఆచార్యా’’ ఆరు దివ్యసమాధానాలు రామానుజుడు వెళ్లిపోయిన తరువాత కాంచీ పూర్ణులు వరదరాజస్వామి సన్నిధిలో కూర్చున్నారు. వారికి ఆత్మనివేదనం చేస్తున్నారు. వరదరాజ పెరుమాళ్ వింటున్నారు. ‘‘నంబీ (కాంచీపూర్ణులను తిరుక్కచ్చినంబి అనీ నంబీ అని పిలుస్తారు) నీ మనసులో ఏదో అడగాలనుకుంటున్నావు కదూ’’‘‘అవును భగవాన్, రామానుజుడు సాయంత్రం నా దగ్గర కూచుకున్నాడు. ఆతని మనసులో కొన్ని సందేహాలున్నాయి. వాటికి సమాధానాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని కోరినాడు ప్రభూ. తను అనుకున్నవి నెరవేరతాయా అనే ప్రశ్న అనుకుంటాను. ఏదో నిరాశగా ఉన్నాడు. మధనపడుతున్నాడు. ఆయన సందేహాలేమిటో చెప్పడు. నేనూ అడగలేదు. మీ సమాధానాలతో ఆయన సందిగ్ధత తీరుతుందేమోనని నేనూ అనుకుంటున్నాను’’. ‘‘అవునా, అతని పరిస్థితి నాకు తెలుసు. నా సంకల్పం తెలిసిన వాడే. యువకుడు, నా ప్రియసేవకులలో ఉత్తముడు. ఈ జన్మలో రామానుజుడికి అనేకమంది నుంచి గురూపదేశాలు లభిస్తాయి. కాని అవన్నీ లాంఛన ప్రాయమే. నేను ఆచార్యసాందీపని నుంచి ఉపదేశాలు స్వీకరించినవిధంగా. ఆయన మనోవేదన ఏమిటో మీకూ చెప్పలేదు కదా..నేను అతని పద్ధతినే అనుసరిస్తాను. ప్రశ్నలు లేకుండానే సమాధానాలే ఇస్తాను. యధాతథంగా నీవు అతనికి అందించు’’ అన్నారు పెరుమాళ్. రామానుజునికి వరదునికి మాత్రమే తెలిసిన ఆరు ప్రశ్నలకు వరదుని దివ్య సమాధానాలు ఇవి: (ప్రశ్నలతో సహా) 1. రామానుజ: సకల దేవతలలో పరాత్పరుడు ఎవరు? వరద: నేనే పరతత్వాన్ని, పరమ సత్యాన్ని. 2. రామానుజ: ఆత్మపరమాత్మఒకటేనా? వరద: ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనేదే పరమసత్యం. 3. రామానుజ: మోక్షసాధనకు నాలుగు ఉపాయాలలో శ్రేష్ఠమైన ఉపాయమేది? వరద: నా చరణాలను చేరడానికి ఆత్మశరణాగతి, ప్రపత్తి.. ఏకైక సులభమైన శ్రేష్ఠమైన మార్గం 4. రామానుజ: ప్రపన్నునికి మరణసమయంలో భగవన్నామ స్మరణ చేయడం అవసరమా? కాదా? వరద: నాకు సంపూర్ణశరణాగతిచేస్తే శరీరత్యాగ సమయంలో నన్ను ధ్యానించి స్మరించాల్సిన అవసరం కూడా లేదు. 5. రామానుజ: ప్రపన్నుడికి మోక్షం ఎప్పుడు? వరద: శరీరభావం నుంచి ముక్తుడైనప్పుడే ఆ జీవి నా సన్నిధిలో శాశ్వతంగా నిలుస్తాడు. 6. రామానుజ: నేను ఏ ఆచార్యుడి వద్ద ఆశ్రయం పొందాలి? వరద: మహాపూర్ణుడే రామానుజుని ఆచార్యుడు. ఆయన చరణాలు చేరాలి. కాంచీపూర్ణులు ‘‘ధన్యోస్మి స్వామీ, రామానుజుడి మనసు ఈ సమాధానాలతో శాంతిస్తుంది. సేద దీరి కర్తవ్యోన్ముఖుడవుతాడు’’. అని వరదుని సెలవుతీసుకుని త్వరగా రామానుజుడికి సమాధానాలు తెలియజేశారు. భవిష్యదాచార్యుడిని రామానుజుడిలో చూచి కాంచీపూర్ణుడు సంతోషిస్తే మార్గదర్శనం లభించినందుకు రామానుజుడు ఆనందించాడు. ఏ ప్రశ్నలు సామాన్యుడిని పదేపదే వేధిస్తాయో, ఏ సందేహాలకు నిర్దిష్టమైన సమాధానాలు అవసరమో ఆలోచించి మనసులో ప్రశ్నలుగా తీర్చిదిద్దుకున్నాడు రామానుజుడు. రాబోయే వేల సంవత్సరాలలో భక్తుడైన మానవుడు అడిగే ప్రశ్నలు ఇవే. ఆరోది మాత్రమే రామానుజుడి వ్యక్తిగత సందేహం. అయిదు పరమ సత్యాలు వరదుడిచ్చిన వరాలు. నిజంగా ఆయన వరదుడే. వరదుడిచ్చిన జవాబులు సరిపోయినాయా రామానుజా అని కాంచీపూర్ణుడు అడిగితే, తప్పకుండా... ప్రతిప్రశ్నకు సూటైన సమాధానం లభించింది మీ ద్వారా. పైకి చెప్పని నా సందేహాలకు సమాధానం వరదుడే ఇవ్వడం అంటే నాదెంతో మహాభాగ్యం. నా పూర్వీకులు ఎంత పుణ్యం చేస్తేనో ఈ మహద్భాగ్యం లభించింది. అవును నీవు అందరికన్నా దైవానుగ్రహం నిండా కలిగిన వాడివి. అన్నారు కాంచీ పూర్ణుడు. వరదుని ఆదేశం ప్రకారం, ఇక మహాపూర్ణుడిని ఆశ్రయించడమే తక్షణ కర్తవ్యమని భావించిన రామానుజుడు సెలవు గైకొన్నాడు. ప్రయాణానికి సిద్ధం అవుతున్నాడు. అక్కడ శ్రీరంగంలో యామునాచార్యుల శిష్యులంతా మహాపూర్ణుల చుట్టూ చేరి శ్రీవైష్ణవ పీఠాన్ని అధిరోహించగల అర్హతలున్న రామానుజుడిని శ్రీరంగానికి రప్పించాలని కోరారు. సరే అయితే కంచికి బయలుదేరతాను అన్నారు. అక్కడ రామానుజుడు కంచినుంచి బయలుదేరడం, శ్రీరంగంనుంచి బయలుదేరి మహాపూర్ణుడు రావడం దాదాపు ఒకేసారి జరిగాయి.కంచీపురం నుంచి బయలుదేరిన రామానుజుడు మధురాంతం చేరుకున్నారు. కోదండ రాముని దర్శనం చేసుకోవడానికి ఆలయంలోకి ప్రవేశించగానే మహాపూర్ణులు కనిపించారు. ‘‘నాకు మంచి రోజులు వచ్చినట్టున్నాయి. మీ శిష్యుడిగా చేరడానికి శ్రీరంగానికి నేను ప్రయాణమై మధ్యలో ఇక్కడ ఆగడం మీరు ఇక్కడే నాకు లభించడం నా అదృష్టం’’ అన్నాడు. ‘‘నేనూ నీకోసమే కంచికి వస్తున్నాను...నిన్ను శిష్యుడిగా స్వీకరించడం నాకూ సంతోషమే నాయనా... అయినా తొందరేముంది, శ్రీరంగంలోనో లేక కంచిలోనో గురూపదేశం చేస్తాను..’’ అని మహాపూర్ణులు అన్నారు. ‘‘స్వామీ, మీకూ తెలుసు, మనం ఎంత తొందరపడ్డా సమయానికి చేరలేకపోవడం వల్ల శ్రీరంగం లో ఏం కోల్పోయామో..ఈ శరీరాల్లో ఎవరెంతసేపు ఉంటారో ఎవరికి తెలుసు. ఇంక ఆలస్యం వద్దు...కంచికి చేరేదాకా అని వాయిదా వేయడం సరికాదని నాకనిపిస్తున్నది’’. ‘‘జ్ఞానం కోసం ఎంత తపన’’ అనుకున్నారాయన. ‘‘సరే కానీ ఆ వకుళ వృక్షం దగ్గరకు వెళ్దాం పద’’ అని కోదండరామాలయం ముంగిటి విశాల ప్రదేశానికి కదిలారు. రామానుజుడికి కుడివైపు కూర్చుని, కుడిచేతిని రామానుజుని శిరస్సున ఉంచి, ఎడమచేతిని çహృదయం మీద ఉంచుకుని, శిష్యుని కళ్లలోకి చూస్తూ, మనసులో యామునాచార్యులను ధ్యానం చేస్తూ, గురుపరంపరను తలచుకుంటూ, అష్టాక్షరీ మంత్రమును ద్వయ మంత్రమును ఉపదేశించారు. చక్రాంకణములు చేసినారు. సంస్కృత ద్రావిడ వేదములు ప్రమాణములు, భగవంతుడు ప్రమేయము (ప్రమాణముద్వారా తెలుసుకోవలసిన వాడు భగవంతుడు), ఈ జ్ఞానమును ప్రసాదించు ఆచార్యుడు ప్రమాత. ప్రమాణ ప్రమేయ ప్రమాతలనే సత్యత్రయమును ఉపదేశించిన తరువాత రామానుజులు పెరియనంబి (మహాపూర్ణులు) చేత మంత్ర దీక్ష తీసుకున్నారు. తండ్రి వాగ్దానం కారణంగా రాజ్యం తీసుకునే వీలు లేనందున, తన ప్రతినిధిగా పాదుకలను, పాలనను భరతుడికి వదిలి రాముడు అరణ్యదీక్ష తీసుకున్నట్టు, నీకు ఉపదేశం చేయడానికి సమయం చాలక తన ప్రతినిధిగా నీకు మంత్రోపదేశం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. నిజానికి నీకు ఆచార్యత్వం వహించాల్సింది నేను కాదు. నా ద్వారా యామునాచార్యుడే. ‘‘ఆచార్యవర్యా.. నాకు ఒక విషయంలో దారిచూపండి స్వామీ, సాధకుడెవరు, సాధించవలసిన లక్ష్యం ఏమిటి. ఆ సాధనా మార్గం ఏమిటి?’’ ‘‘కాంచీపురాన వెలసిన వరదరాజ పెరుమాళ్ మనం సాధించవలసిన గమ్యం, లక్ష్యం కూడా.. ఆయనను చేరడానికి నీవు ఉపదేశం పొందిన ద్వయమంత్రాలే సాధనాలు. సాధకుడివి నీవే. ఇక సాధనాలను ఉపయోగించి సాధించవలసిన బాధ్యత కూడా నీదే’’రామానుజులు గురువును, గురుపత్నిని వెంటబెట్టుకుని కాంచీపురం బయలుదేరారు. వారిరువురికి వసతి ఏర్పాటు చేసి ఆరునెలలపాటు వారి వద్ద దివ్యప్రబంధమును ఇతర శాస్త్రాలను అధ్యయనం చేశారు. వ్యాససూత్రాలు, నాలాయిర ప్రబంధంలో రెండు వేలపాశురాలు, నేర్చుకున్నారు. శఠగోపముని రచనలు తప్ప మిగిలినవన్నీ మహాపూర్ణుల వారు రామానుజుడికి నేర్పారు. రామానుజుని ఏకసంథాగ్రాహిత్వం, విమర్శనా రీతిని గమనించి మహాపూర్ణులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు ఇంట్లో ఉండగా ఒక శ్రీవైష్ణవుడు వచ్చాడు. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. ఆకలితో వణికిపోతున్నాడు. అది గమనించిన రామానుజుడు, ‘‘తంజా ఈ బ్రాహ్మణుడు చాలా ఆకలితో ఉన్నట్టుంది. సాపాటు వడ్డించు’’ అని చెప్పారు. ఇంకా వంట పూర్తికాలేదు స్వామీ. అని జవాబిచ్చింది. ‘‘సరే అయితే నిన్న వండగా మిగిలిన పదార్థాలేమయినా పెట్టు’’ అన్నారు. ‘‘అయ్యో అవి కూడా లేవండి..’’ అన్నది తంజ.తన భార్య సంగతి తెలుసు కనుక రామానుజుడు, ఏదో పనిమీద ఆమె బయటకు వెళ్లిన వెంటనే వంటయింటిలోకి వెళ్లి చూశారు. ముందే వండిన అనేక తిండి పదార్థాలు ఇంట్లో ఉన్నాయి. భార్య ఇంటికి రాగానే...‘‘ఇది రెండో సారి భాగవతులకు అపచారం చేయడం. పాపం ఆ వైష్ణవుడు ఆకలికి కింద పడిపోయే విధంగా ఉన్నాడు. అయినా నాతో అబద్ధం ఆడి, అతనికి భోజనం వడ్డించడానికి నిరాకరించావు. ఇంకోసారి ఈ తప్పు జరగకూడదు’’ అని హెచ్చరించారు. మరో సందర్భంలో తంజమ్మ, గురువుగారైన మహాపూర్ణుల వారి భార్య నీళ్లకోసం బావికి వెళ్లారు. తంజమ్మ స్నానంచేసి మడి కట్టుకుని బిందెతో నీళ్లుతీసుకుని బయలు దేరారు. అదే సమయంలో పెరియనంబి భార్య బట్టలు ఉతికి జాడిస్తూ ఉంటే రెండు చుక్కల నీరు ఈమె బిందెలో పడింది. తంజమ్మ ఉగ్రురాలై బిందెలోనీళ్లు గుమ్మరించి తన శుచికి భంగం ఏర్పడిందని కోపంతో తీవ్రంగా నిందించారు. ఆమె పొరబాటైందని, చూడలేదని ఎంత చెప్పినా వినకుండా నానామాటలూ అన్నారు. ఈమెకు తోడు మరికొంతమంది బ్రాహ్మణ స్త్రీలు కూడా కలవడంతో ఆమె అవమానంతో వెళ్లిపోవలసి వచ్చింది. తంజమ్మ మళ్లీ స్నానం చేసి బిందెడు నీళ్లు తీసుకుని ఇంటికి వచ్చింది. బాధపడుతూ భార్యచెప్పిన విషయం తెలుసుకున్న మహాపూర్ణులు ఇక కంచి లో ఉండి ప్రయోజనం లేదని గ్రహించి ఆమెను తీసుకుని శ్రీరంగం వెళ్లిపోయారు. భవిష్యదాచార్యుడిని రామానుజుడిలో చూచి కాంచీపూర్ణుడు సంతోషిస్తే మార్గదర్శనం లభించినందుకు రామానుజుడు ఆనందించాడు. ఏ ప్రశ్నలు సామాన్యుడిని పదేపదే వేధిస్తాయో, ఏ సందేహాలకు నిర్దిష్టమైన సమాధానాలు అవసరమో ఆలోచించి మనసులో ప్రశ్నలుగా తీర్చిదిద్దుకున్నాడు రామానుజుడు. రాబోయే వేల సంవత్సరాలలో భక్తుడైన మానవుడు అడిగే ప్రశ్నలు ఇవే. ఆచార్య మాడభూషి శ్రీధర్ -
లైంగిక వేధింపులపై చర్య తీసుకోరా?
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు యూనివర్శిటీల్లో పీజీ స్థాయి మగ పిల్లలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వారి క్లాసుకెళ్లి పాఠం చెప్పాలంటే భయమవుతుందంటూ మహిళా అధ్యాపకులు ప్రిన్సిపాల్ వద్దకెళ్లి మొరపెట్టుకునేవారు. అందుకు బాధ్యులైన ఆకతాయి విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరించడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరికలు చేసి పరిస్థితి చక్కదిద్దేవారు ప్రిన్సిపాల్. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. యూనివర్శిటీ కళాశాలల్లో డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థినులను అధ్యాపకులే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. వారిపై డిపార్టుమెంట్ హెడ్లకు, ప్రిన్సిపాళ్లకు ఫిర్యాదులు చేసినా, విద్యార్థినీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనకు దిగినా బాధ్యులైన అధ్యాపకులపై ఎలాంటి చర్యలు ఉండడం లేదు. ఎందుకని ? ఇందులో కూడా రాజకీయాలు ఉన్నాయా? పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్ యూనివర్శిటీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. కళాశాల కంపారేటివ్ లిటరేచర్ విభాగంలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థునులను లైంగికంగా వేధించారని, ఆయన్ని కళాశాల నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేయండంటూ ఏకంగా ఆదే విభాగానికి చెందిన డిగ్రీ, పీజీ స్థాయి ఐదు తరగతులకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా పై అధికారులు పట్టించుకోవడం లేదు. 2016, ఫిబ్రవరి నెలలో ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల గురించి తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఓ పీజీ విద్యార్థిని ధైర్యం చేసి తనను లైంగికంగా వేధించిన విషయాన్ని బయట పెట్టడంతో మరికొంత మంది విద్యార్థినులు కూడా తమను కూడా ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ తన ప్రవర్తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పుకొని ఏడాది పాటు సెలవుపై వెళ్లారు. మళ్లీ ఈ మార్చి నెలల్లో వచ్చి తన విధుల్లో చేరారు. ఆయన క్లాసుకు హాజరవడం తమకు ఇబ్బందిగా ఉందని, ఆయన్ని కళాశాల నుంచే పంపించేయండంటూ విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌పై గత జూలై నెల నుంచి వారు డిమాండ్ చేస్తున్నా కళాశాల యాజమాన్యం ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. దాంతో కొందరు ఆయన చెప్పే ఆప్షనల్ సబ్జెక్టును కూడా మార్చుకున్నారు. అలాంటి అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మీడియా వెళ్లి కళాశాల యాజమాన్యం ప్రశ్నించగా, ఇలాంటి వేధింపుల గురించి ఫిర్యాదులు చేయడానికి కళాశాలలో ఓ అంతర్గత కమిటీ ఉందని, ఆ కమిటీకి ఎలాంటి ఫిర్యాదు అందనందున తాము ఎలాంటి చర్య తీసుకోలేక పోతున్నామని యాజమాన్య వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని విద్యార్థిని విద్యార్థుల ముందు ప్రస్థావించగా, లైంగిక వేధింపులకు గురైన పీజీ విద్యార్థినులు తమను కోర్సును ముగించుకొని కళాశాల నుంచి వెళ్లిపోయారని, అందుకే ఫిర్యాదు చేయలేకపోయామని వారు చెప్పారు. ఈ విషయమై కళాశాలలో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం నాడిక్కడ సమావేశమైన విద్యార్థినీ విద్యార్థులు తమ ఆందోళనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. -
పాతికేళ్ల తర్వాత... కాలేజీలో క్లాసులు!
కళ్లజోడు... గళ్లచొక్కా... రెండిటికీ తోడు చక్కగా బూటులు వేసుకుని, టై కట్టుకుని పాతికేళ్ల క్రితమే వెంకటేశ్ పాఠాలు చెప్పారు. ‘సుందరకాండ’ సిన్మాలో! రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో జూనియర్ కాలేజ్ లెక్చరర్‌గా వెంకీ కనిపించారు. మళ్లీ ఇప్పుడు కాలేజీలో క్లాసులు చెప్పడానికి రెడీ అవుతున్నారట! తేజ దర్శకత్వంలో నటించే సినిమా కోసం! వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో వెంకీ కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపిస్తారట! ఎట్ ద సేమ్ టైమ్... ఆయన లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుందని సమాచారమ్. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న మొదలు కానున్న ఈ సిన్మాలో హీరోయిన్ ఎవరనేది చిత్రబృందం ఇంకా ప్రకటించనప్పటికీ... కాజల్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉందట!! -
ఏఎంయూ ప్రొఫెసర్‌పై సంచలన ఆరోపణ
ఆగ్రా : ఇస్లాం మత విధానాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు ఎదుర్కుంటున్న ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు తాత్కాలిక నిషేధం విధించినా కొందరు మాత్రం ఇంకా దానిని అనుసరిస్తూనే ఉన్నారు. తాజాగా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఒకరు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వటం కలకలం రేపుతోంది. యూనివర్సిటీ సంస్కృత భాషా విభాగాన్ని చైర్మన్ అయిన ప్రొఫెసర్ ఖలీద్ బిన్ యూసఫ్ ఖాన్ తన భార్యకు వాట్సాప్ ద్వారా తలాక్ సందేశం పంపారు. ఆపై మరో టెక్స్ట్ మెసేజ్ పెట్టి తలాఖ్ చెప్పాడు. అటుపై ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దీనిపై బాధితురాలు యాస్మీన్ ఖలీద్ మాట్లాడుతూ, వచ్చే నెల 11వ తేదీలోగా తనకు న్యాయం జరగకపోతే తన ముగ్గురు బిడ్డలతో కలిసి వీసీ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. న్యాయం కోసం తాను యూనివర్సిటీలోని క్రింది నుంచి పై స్థాయి అధికారుల వరకు అందర్నీ వేడుకుంటున్నానని, అయినా తనకు ఎవరూ సహాయపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన ప్రొఫెసర్ ఖలీద్... తాను షరియత్ చట్టప్రకారం విడాకులు పొందానని అన్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ లతోపాటు ఇద్దరు సాక్షుల ఎదుట నోటి మాటల ద్వారా కూడా తలాక్ చెప్పానని.. పైగా నిర్ణిత కాల పరిమితిని కూడా పాటించినట్లు ఆయన చెబుతున్నారు. -
ప్రొఫెసర్లకు అరవింద్ సుబ్రమణియన్ పాఠాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తాజాగా ప్రొఫెసర్లకు ఆర్థికాభివృద్ధి పాఠాలు నేర్పుతున్నారు. భారత ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సర్వేలో సమకాలీన ధోరణుల అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన తొలి లెక్చర్ ఇచ్చారు. దేశం నలుమూలల్నించి సుమారు 150 మంది ప్రొఫెసర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఏడు రోజుల పాటు సుబ్రమణియన్ 35 ప్రసంగాలు ఇవ్వనున్నట్లు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ కోర్సులో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, ఇటీవలి పరిణామాలు, ఎదురుకాబోయే సవాళ్లు, అనుసరించతగిన వ్యూహాలు మొదలైన వాటి గురించి లోతుగా తెలుసుకునేందుకు అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కోర్సు పూర్తయ్యాక స్థూల ఆర్థిక పరిణామాలు, విధానాలు తదితర అంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు, విశ్లేషించేందుకు తగిన ప్రావీ ణ్యం లభించగలదని జవదేకర్ చెప్పారు. ఒక విధానకర్త ఇలా ప్రొఫెసర్ అవతారమెత్తి, పాఠాలు బోధించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. -
'ఆ బిల్డింగ్‌కు సరైన డిజైనింగ్ లేదు'
-
ప్రొఫెసర్ వేధింపులు.. కుటుంబం చిన్నాభిన్నం
గుంటూరు: ఓ వైద్య విద్యార్థిని కుటుంబం ప్రొఫెసర్ వేధింపులకు బలైంది. గుంటూరు వైద్య కళాశాలలో గైనకాలజీ (డీజీఓ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలలో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ తన డైరీలో రాసి సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాది డిసెంబర్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ చిట్టిప్రోలు రవితో సంధ్యారాణి వివాహమైంది. సంధ్యారాణి మృతిని తట్టుకోలేక రవి బుధవారం ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రొఫెసర్ వేధింపులకు కుటుంబం చిన్నాభిన్నమైందని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంధ్యారాణి మృతితో గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ లక్ష్మి పరారీలో ఉన్నారు. నెల రోజులపాటు సెలవు పెడుతున్నట్లు ప్రిన్సిపాల్‌కు లెటర్ పంపారు. మృతురాలి తల్లిదండ్రులు తనపై నేరుగా ఫిర్యాదు చేయడం, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకుని పరారయ్యారు. సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేయాలని మెడికోలు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గురువారం కలెక్టర్‌ను కలిసిన వైద్య విద్యార్థులు ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. దీంతో ఈ వ్యవహారంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. మూడు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
పరారీలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్
► వైద్య విద్యార్థిని మృతిచెందిన రోజే అదృశ్యం ► ప్రకాశంజిల్లా పుల్లలచెరువు వద్ద సెల్ సిగ్నల్ గుర్తింపు ► ఆమె కోసం మూడు పోలీస్ బృందాల గాలింపు సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమె సూసైడ్ నోట్లో పేర్కొన్న ప్రొఫెసర్ పరారీలో ఉన్నారు. గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎ.వి.వి.లక్ష్మి వేధింపులు తట్టుకోలేకే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు మృతురాలు తన డైరీలో సూసైడ్ నోట్ రాసింది. ఆమె మృతితో గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీన్ని గుర్తించిన ప్రొఫెసర్ లక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల రోజులపాటు సెలవు పెడుతున్నట్లు ప్రిన్సిపాల్‌కు లెటర్ పంపారు. మృతురాలి తల్లిదండ్రులు తనపై నేరుగా ఫిర్యాదు చేయడం, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకుని పరారయ్యారు. పోలీసులు సెల్ నెట్‌వర్క్‌ను పరిశీలించగా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వద్ద ఆ ప్రొఫెసర్ ఉన్నట్లు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుర్తించారు. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలంటూ మృతురాలి బంధువులు, వైద్య విద్యార్థులు ధర్నాకు దిగిన విషయం తెలుసుకుని సిమ్‌ను వేరుచేసి పక్కనపడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్ష్మి కర్నూలు, కడప, అనంతపురం, బెంగళూరు వైపు వెళ్లిందా లేక ఎవరితోనైనా తన సెల్‌ను పంపి పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంపాలెం సీఐ మొహమ్మద్ హుస్సేన్ నేతృత్వంలో మూడు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి ప్రొఫెసర్ లక్ష్మి జీమెయిల్ ద్వారా మృతురాలిపై ఆరోపణలతోపాటు తన వివరణతో కూడిన ప్రకటనను అన్ని పత్రికా కార్యాలయాలకు పంపడంపై సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రొఫెసర్ లక్ష్మిపై సస్పెన్షన్ వేటు: లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గుంటుపల్లి సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఎంఈ ఆదేశాల మేరకు ఆమెను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. -
బుర్ర తిరుగుడు
హ్యూమర్ ప్లస్ ఎవడికీ అర్థం కాకుండా మాట్లాడ్డమే జ్ఞానమని ఒకాయన కనిపెట్టాడు. ‘‘మారుతున్న విలువల మానవీకరణ నేపథ్యంలో నిర్దిష్ట కార్యాచరణ సూత్ర చందోబద్ధమైన మనిషి అశాస్త్రీయ ఆలోచనల వితర్కమే నేటి సమాజం’’ అనేవాడు. అంతా అర్థమైనట్టే వుండేది కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. ఇలాంటి బ్రహ్మ పదార్థాలను చూస్తే మన యూనివర్సిటీలకి అమితానందం. కర్రకి బుర్రకి అవినాభావ సంబంధముందని నమ్మి, ఈ అంశంపై తులనాత్మక పరిశోధన కూడా చేసి డాక్టరేట్ పుచ్చుకున్న ఒక ప్రొఫెసర్‌కి పైన చెప్పిన భాషా శాస్త్రవేత్త తగిలాడు. ఇద్దరూ కలిసి ఒక సెమినార్ ఏర్పాటు చేసుకున్నారు. మన ప్రొఫెసర్ ప్రత్యేకత ఏమంటే ఆయన చేతిలో ఒక పొన్నుకర్ర వుంటుంది. తన వాగ్ధాటిని కంట్రోల్ చేయడం తనకే చేతకాని క్లిష్ట సమయాల్లో కర్రతో నెత్తిన ఒకటిచ్చుకుంటాడు. చేతివైద్యమన్నమాట. అప్పుడు రేడియోలో స్టేషన్ మారినట్టు ఆయన భావజాలం ట్యూనింగ్ మార్చుకుంటుంది. ఎదుటివాళ్లు ఎక్కువ మాట్లాడినా కూడా ఇదే ట్రీట్మెంట్. ఎవడైనా మైకుని కేకు కొరికినట్టు కొరకడం మొదలుపెడితే ఆయన బెల్లు కొట్టకుండా కర్రతో నెత్తిన కొడతాడు. తలాతోకా లేకుండా మాట్లాడేవాళ్లు కూడా ఈ దెబ్బకి కుదురుకుంటారు. లేదంటే తలకట్టే. సెమినార్ ప్రారంభమైంది. కర్ర పుచ్చుకుని ప్రొఫెసర్ అధ్యక్షత వహించాడు. భాషా శాస్త్రవేత్త మైకు తీసుకున్నాడు. ‘‘సమాజ చలన సూత్ర కాలానుగుణ పరిశీలనా క్రమగతిని పరిశీలిస్తే, నిరూపిత సత్య సంక్లిష్ట భావావేశమే సాహిత్యం. ఎగసిన వాయు వీచికల విధ్వంస నిర్లక్ష్య నిర్హేతుక సకల చరాచర ఎగసిపడిన కెరటమే కవిత్వం..’’ అని మొదలుపెట్టాడు. కర్రతో బుర్ర గోక్కుంటూ ప్రొఫెసర్ కూచున్నాడు. స్టూడెంట్లకు ఏమీ అర్థంకాకపోయినా అర్థమైనట్టే ముఖకవళికలు మార్చి చూస్తున్నారు. ఒకడు లేచి డౌట్ కూడా అడిగాడు. ‘‘సామ్రాజ్యవాద దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్థీకృత సరళతలో సాహిత్య పరాన్నభుక్కులు గరిటెడు విషవాయువుకి లోనై అదనపు విలువను మరిచిన మార్కెట్ శక్తుల మృదంగ ధ్వనిలో సాహిత్యపు ఉనికి ఆధారభూతమా? భ్రమా భరితమా?’’ అని అడిగాడు. తనకి సమవుజ్జీ దొరికాడని శాస్త్రవేత్త ఆనందపడ్డాడు. ‘‘నిరంకుశవాద దుష్టసంస్కృతి పరిరక్షణలో హక్కుల ఉద్యమ క్షీణదశ ఉత్థాన పతనాల ఆరోపిత పెట్టుబడిదారి సంక్షోభ విలయంలో సాహిత్యం హత్యాపాతక సదృశమై సన్నిహిత సామాజిక క్షణంలో...’’ ఇంకా ఏదో చెప్పబోతుండగా ప్రొఫెసర్ లేచి కర్రతో ఒకటిచ్చాడు. శాస్త్రవేత్త ఒక్కక్షణం బుర్ర తడుముకుని, పదాల్లో తడబడ్డాడు. ‘‘గంభీర తటాక తరంగ ఉత్తేజిత గండరగండ, గండభేరుండ గండపెండేరాన్ని గ్రహించిన వారికి గడకర్రకి, దుడ్డుకర్రకి లవలేశ తేడా నిర్మాణం తెలియకపోవచ్చు. ఇంతకీ నన్నెందుకు కొట్టావు?’’ అని అడిగాడు. ‘‘చేతన్ చేన్ తోడన్ తోన్’’ అనేది ఏ విభక్తో నాకు తెలియదు కానీ, కోట్ కొట్టున్ కొడుతూనే వుండనేది భక్తి విభక్తి. దండం దశగుణమన్నారు. దండానికి దండం పెట్టనివాడు లేనే లేడు’’ అన్నాడు ప్రొఫెసర్. ఇప్పుడు ప్రొఫెసర్ ప్రసంగ పాఠమొచ్చింది. కర్రని శాస్త్రవేత్త పుచ్చుకోబోతే ప్రొఫెసర్ వారించాడు. ‘‘నా బుర్ర తిరుగుడు నాకు చెడుగుడుతో సమానం. ఎవడి బుర్రని వాడు మరమ్మతు చేసుకోవడమే ఇప్పుడు సమాజానికి కావాల్సిన కసరత్తు. విద్వత్తు నత్తులు కొట్టదు. ఒత్తులు మరిస్తే భాషలో ఒత్తిడికి గురవుతాం’’ అని ప్రొఫెసర్ బుర్రని ఒకసారి టంగ్మనిపించుకుని మైకు తీసుకున్నాడు. ‘‘శూన్య పాలపుంత అంతరిక్ష మండల నక్షత్ర ధూళి సంవేదనా ధరిత్రిలో మనుగడ సాగిస్తూ, వాయుసమ్మిళిత బుడగలో ఆయువు వూదుతూ సంపూర్ణ అసంపూర్ణ అమానవీయ చారిత్రక విభాత సంధ్యల్లో విస్పష్ట వికసన...’’ ఇలా కాసేపు సాగిన తరువాత తనకి తానే బ్రేకు వేసుకుని బుర్రపై ఒకటిచ్చుకున్నాడు. ‘‘ఎవడికి వాడు హింసించుకోవడం నాగరికత, ఇతరుల్ని హింసించడం జరుగుతున్న కథ’’ అని గొణుక్కున్నాడు శాస్త్రవేత్త. ఇదే అదునుగా ఒక స్టూడెంట్ లేచి ‘‘నిర్జర గర్జర సాగర సంభ్రమంలో విభ్రాంతికర సమ్మోహితమై నిశ్శబ్దయుద్ధవేళ మనమెటు వెళ్ళాలి ప్రొఫెసర్’’ అడిగాడు. ప్రొఫెసర్ వెంటనే కర్రతో వాడి నోరు మూయించాడు. జ్ఞాన సభ పూర్తయిన వెంటనే అక్కడున్న చెత్తని వూడుస్తున్న వ్యక్తి ‘‘పాపం, వీళ్లంతా మెదడువాపు వ్యాధితో బాధపడుతున్నారు’’ అని నిట్టూర్చాడు. ‘‘మేధావులకి సామాన్యులు అర్థం కాకపోవడం, మేధావులు మేధావులకే అర్థం కాకపోవడం చాలా పాతకథ... ఇది అనంతం.’’ - జి.ఆర్. మహర్షి -
‘ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు’
-
ప్రొఫెసర్ తులసీరావుకు ‘పోలీస్’ బాధ్యతలు
ఎచ్చెర్ల: ఏపీ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ పోలీస్ బోర్డు ప్రాంతీయ సమన్వయ కర్తగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కో ఆర్డినేటర్, కాకినాడ జేఎన్టీయూ రిజస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబా ఉత్తర్వులు జారీచేశారు. తులసీరావు జిల్లాలోని పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణను సమీక్షించనున్నారు. నవంబర్ 6న జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా నుంచి 10,380 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. శ్రీకాకుళం డివిజన్లోని 22 విద్యాసంస్థల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పోలీస్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామని తులసీరావు తెలిపారు. ప్రయాణానికి వీలైన, మౌలిక సౌకర్యాలు ఉన్న విద్యాసంస్థలను మాత్రమే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. -
ఆదిత్య ప్రొఫెసర్ శ్రీనివాస్‌కు డాక్టరేట్
గండేపల్లి : సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాయుడు శ్రీనివాస్‌కు డాక్టరేట్ లభించినట్టు విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లెబిలింగ్ సెర్వికల్ లుంబర్ స్ఫైన్ ఎంఆర్ ఇమేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లుంబర్ ఇంటర్ విల్టిబ్రల్ డిస్క్S్ప యూజింగ్ స్టేటిస్టికల్ ఫ్యూచర్స్‌పై చేసిన పరిశోధనల జేఎన్టీయూకే పీహెచ్డీ అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టీకే రామకృష్ణారావు, ఎ.రమేష్ తదితరులు శ్రీనివాస్‌కు అభినందనలు తెలియజేశారు. -
ప్రకాశం అధ్యాపకుడికి అంతర్జాతీయ గుర్తింపు
కందుకూరు: ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.రామలింగారెడ్డి తన ఆర్టికల్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచారని కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామలింగారెడ్డి ఆర్టికల్స్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్స్ (ఐజెఐఆర్డీ)లో ప్రచురితమయ్యాయని తెలిపారు. దీంతో ఆర్టికల్స్ పరిశీలనార్థం కేంబ్రిడ్జి, స్టాన్‌ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సీటీ లైబ్రరీలలో ఉంచనున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఇది తమ కాలేజీ అధ్యాపకుల సామర్ధ్యాన్ని తెలియజేస్తుందని వివరించారు. తమ కాలేజీ ప్రొఫెసర్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడించడం గర్వకారణం అన్నారు. రామలింగారెడ్డిని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావుతో పాటు, తోటి అధ్యాపకులు డాక్టర్ రవికుమార్, శ్రీనివాస్, రాముడు, ప్రసాద్ అభినందించారు. -
'లెక్క' తప్పింది.. విమానం ఆగింది!
న్యూయార్క్: ఓ ప్రొఫెసర్ విమానం ఎక్కి.. సీరియస్‌గా లెక్కలు చేసుకోవడం.. ఆయనను చిక్కుల్లో పడేసింది. తోటి ప్రయాణికుల్లో అనుకోని భయాందోళనకు కారణమైంది. సదరు ప్రొఫెసర్ తన మానాన తాను గణిత సూత్రాల మీద కసరత్తు చేస్తుండగా.. ఓ మహిళ ఆ లెక్కలను చూసి 'సీక్రెట్ టెర్రరిస్టు కోడ్' అనుకొంది. అంతే గగ్గోలు పెట్టింది. విమానం సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో విమానాన్ని రెండు గంటలపాటు ఆపి.. ఆ ప్రొఫెసర్ గారి లెక్కలు.. ఉగ్రవాదుల 'కోడ్ భాష' కాదని నిర్ధారించుకున్నారు. ఇటలీకి చెందిన ఆర్థిక వేత్త, పెన్సిల్వేనియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గైడో మెంజియో (40)కు ఈ చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని ఫిలడెల్ఫియా నుంచి గురువారం కెనడాలోని సైరాకస్కు ఎయిర్ విస్కాన్సిన్ విమానంలో వెళుతుండగా ఆయన పక్కన ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు ఈమేరకు అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఆయనను ఫిలడెల్ఫియాలోనే దింపేసి.. భద్రతా సిబ్బంది ప్రశ్నించారు. విమానాన్ని రెండు గంటలపాటు నిలిపేశారు. కెనడా ఒంటారియోలోని క్వీన్స్ యూనివర్సిటీలో ఉపన్యసించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని మెంజియో వెల్లడించారు. ఈ ఘటనను ధ్రువీకరించిన సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ.. ప్రొఫెసర్ పక్కన కూర్చున్న 30 ఏళ్ల మహిళ అనుమానాలు వ్యక్తం చేయడం, తాను చాలా అస్వస్థతకు గురయ్యానని చెప్పడంతో ఇలా చేశామని చెప్పుకొచ్చింది. -
ప్రొఫెసర్‌ను కులం పేరుతో దూషించడంపై కేసు
చిలుకలగూడ (హైదరాబాద్): ఓ ప్రొఫెసర్‌ను కులం పేరుతో దూషించి దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్.కృష్ణయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ బ్రాహ్మణబస్తీలోని సాయిలోక్పూజ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆపార్ట్మెంట్ వద్ద పిల్లలు ఆడుకునే సమయంలో ఫ్రొఫెసర్ కృష్ణయ్యకు మరికొంత మంది మధ్య వివాదం జరిగింది. దీంతో కొంతమంది కులం పేరుతో దూషిస్తూ మూకుమ్మడిగా దాడిచేసి కృష్ణయ్యను గాయపర్చారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సాయి (21), విజయ (31)లపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
పగలు ప్రొఫెసర్.. రాత్రయితే పోర్న్ స్టార్!
లండన్: ఆయనకు 61 ఏళ్లు. ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.. ఆచార్య హోదా అంటే దాదాపు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉత్కృష్టమైనది. అన్ని అంశాల్లో తలపండినవాడు అంటుంటారు. అంతేకాకుండా ఎంతో పవిత్రంగా ఆ బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. కానీ, బ్రిటన్‌లో మాత్రం ఓ ప్రొఫెసర్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అతడు చేసే ఘనకార్యం కాదు. అవును.. ఉదయాన్నే చక్కగా వస్త్రాలు ధరించి టై, షూ కట్టుకొని వెళ్లి పాఠ్యాంశాలు బోధించే ఈ ఆచార్యుడు రాత్రి వేళ చేసేది మాత్రం రాస కార్యాలు. ఏ మాత్రం ఖాళీ దొరికినా వెంటనే పోర్న్ స్టార్ అవతారమెత్తుతాడు. 61 ఏళ్ల వయసును కలిగి ఉన్న అతడు తనకంటే దాదాపు 40 ఏళ్లు చిన్నవారయిన వారితో శృంగారంలో పాల్గొంటూ నీలి చిత్రాల్లో నటిస్తాడు. ఇన్ని రోజులు ఈ బాగోతాన్ని ఎంతో రహస్యంగా నడిపాడు. చివరకు అందరికి తెలిసేసరికి తనను తాను సమర్థించుకున్నాడు. విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో అది తన వ్యక్తిగత అంశమని, అందులో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని అంటున్నాడు. నికోలస్ గోడార్డ్ అనే పేరు గల ఈయన కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ లో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తాడు. అతడి వ్యవహారం తెలిసిన కొంతమంది విద్యార్థులు మాత్రం అతడి బోధన శైలిని చూసి హీరో అని అనుకుంటే కొందరు మాత్రం డ్రీమ్ హబ్బీ అనుకుంటుంటారంట. -
అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడు!
లిబియాలో కిడ్నాపైన ప్రొఫెసర్ల కోసం వారి కుటుంబ సభ్యుల ఆవేదన * 7 నెలల కింద బలరాం, గోపీకృష్ణలను బంధించిన ఐసిస్ ఉగ్రవాదులు * ఇప్పటికీ అందని క్షేమ సమాచారాలు * కన్నీటితో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు * లిబియా, ట్రిపోలీ, ఢిల్లీ.. ఎక్కడా లభించని భరోసా * ఇల్లు గడవడం కష్టంగా ఉందన్న గోపీకృష్ణ కుటుంబం * ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బలరాం భార్యాపిల్లలు సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: ఎలా ఉన్నారో.. ఎప్పుడొస్తారో తెలియదు.. నాన్న ఎప్పుడొస్తాడన్న పిల్లలకు ఏం చెప్పాలో తెలియదు.. నాన్నపై బెంగతో పిల్లలు ఏడుస్తుంటే, తమ కంట కన్నీటిని అదిమిపెట్టి వారినెలా ఓదార్చాలో తెలియదు.. తోడు నీడగా ఉండే వారు లేక, అసలు తమవారి పరిస్థితి ఏమిటో తెలి యక కుమిలిపోవడమే వారికి మిగిలింది. లిబి యాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో చిక్కిన తెలంగాణ, ఏపీలకు చెందిన ప్రొఫెసర్లు చిలువేరు బలరాం కిషన్, తిరువీధుల గోపీకృష్ణ కుటుంబ సభ్యుల ఆవేదన ఇది.. గతేడాది జూలై 29న లిబియా నుంచి ట్యునీషియా మార్గంలో ఐసిస్ ఉగ్రవాదులు నలుగురు భారత ప్రొఫెసర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అందులో కర్ణాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లను 2 రోజుల్లోనే విడిచి పెట్టిన ఉగ్రవాదులు... కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ బలరాం కిషన్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రొఫెసర్ గోపీకృష్ణలను విడుదల చేయలేదు. దీంతో దాదాపు ఏడు నెలలుగా వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు లిబియాలోని భారత అధికారులతో నిత్యం సంప్రదిస్తున్నా.. తమ వారి క్షేమ సమాచారం తెలియక విలవిల్లాడుతున్నారు. గడువులన్నీ తీరినా.. బలరాం కిషన్, గోపీకృష్ణల విడుదలకు సంబంధించి ఉగ్రవాదుల నుంచి విడుదలైన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్‌లు, భారత దౌత్య అధికారులు చెప్పిన గడువులన్నీ ఇప్పటికే తీరిపోయాయి. బందీల కుటుంబ సభ్యులైతే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు ప్రధాని మోదీని సైతం కలసి వారిని విడిపించాలని వేడుకున్నారు. విదేశాంగ శాఖ కార్యాలయం బందీల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు భరోసానిస్తూ వచ్చింది. అటు లిబియాలోని దౌత్యాధికారులు సైతం సిర్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల సహాయంతో సంప్రదింపులు జరిపి ఇద్దరు ప్రొఫెసర్ల విడుదల కోసం ప్రయత్నించారు. కానీ పురోగతి లేకపోవడంతో ఏం చేయాలో, బందీల కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ వారమే కీలకం లిబియాలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఉగ్రవాదులతో చర్చలు జరిపేం దుకు సానుకూల వాతావరణం ఏర్పడుతోం దని దౌత్యాధికారులు చెబుతున్నారు. ఈ వారంలో కొంత పురోగతి ఉండొచ్చని బందీల కుటుంబ సభ్యులకు భరోసానిస్తున్నారు. ఈనెల 29న ప్రొఫెసర్ గోపీకృష్ణ పుట్టినరోజు కావడంతో.. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన పుట్టినరోజుకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యే అవకాశముందని.. అది విడుదలపై సానుకూల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఇక వారం కింద బలరాం, గోపీకృష్ణల సెల్ఫోన్లు పనిచేశాయని... దీంతో వారు క్షేమంగానే ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ ఏ ఘటన జరిగినా సిర్త్ ఆస్పత్రికి తప్పక సమాచారం వస్తుందని చెబుతున్నారు. ఏమీ అర్థం కావడం లేదు ‘‘రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. సిర్త్ యూనివర్సిటీ, ఢిల్లీ అధికారులకు రోజూ ఫోన్లు చేస్తున్నా.. స్పందన కనిపించడం లేదు. ఇప్పటికే ఏడు నెలలవుతోంది. పిల్లల ఫీజులు, కుటుంబ వ్యయం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈనెల 29న నా భర్త (గోపీకృష్ణ) పుట్టినరోజు. ఆ రోజుకయినా ఆయన క్షేమ సమాచారం తెలుస్తుందన్న ఆశతో బతుకుతున్నాం. మా వారి విడుదల కోసం మరింతగా ప్రయత్నించాలని ప్రధాని మోదీని కోరుకుంటున్నాం..’’ - కల్యాణి, గోపీకృష్ణ సతీమణి ఇంత పెద్ద దేశం ఇద్దరినీ విడిపించలేదా? ‘‘మనది ఎంతో పెద్దదేశం.. శక్తివంతమైనది.. ఈ ఇద్దరిని ఎందుకు విడిపించలేకపోతోంది? మా వారు క్షేమంగా ఉన్నారని చెబుతున్నా... అసలు ఆచూకీని ఇంత వరకు చెప్పలేకపోతున్నారు. పెద్ద పదవుల్లో ఉన్న వారందరినీ కలసి వేడుకున్నాం. ఏమీ పాలుపోవడం లేదు. గత ఆదివారం మా వారికి ఫోన్ చేస్తే రింగ్ అయింది, కానీ ఎత్తలేదు. మెసేజ్ పెట్టినా రెస్పాన్స్ లేదు. నాన్న ఎప్పుడొస్తారని పిల్లలు అడుగుతున్నారు. ఏం చెప్పాలి..? ఈ నెలాఖరులో లిబియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మా వారి విడుదల జరుగుతుందని దౌత్యాధికారులు చెబుతున్నారు. దానికోసం ఎదురు చూస్తున్నాం..’’ - శ్రీదేవి, బ లరాం సతీమణి -
రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి
చాదర్‌ఘాట్ (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం... ముసారాంబాగ్‌కు చెందిన ఎం.కిషన్‌రావు (54) నల్లకుంటలోని ఓ విద్యా సంస్థలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కోఠి నుంచి ముసారాంబాగ్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వద్ద వెనుక నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కిషన్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇప్పుడిక ముస్లిం మహిళల పోరుబాట
న్యూఢిల్లీ: తాము శనిఆలయంలోకి ప్రవేశించి తీరుతామని శనిశింగాపూర్లో పలువురు మహిళలు ఇప్పటికే ఉద్యమిస్తుండగా.. అదే బాటలో ముస్లిం మహిళలు కదిలారు. తమను దర్గాలోకి అనుమతించాలంటూ ఆందోళన ప్రారంభించారు. ముంబయిలోని హజీ అలీ దర్గాలోకి తమకు ప్రవేశ అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జీనత్ షాకత్ అలీ అనే ముస్లిం మహిళ మాట్లాడుతూ తమను దర్గాలోకి రానివ్వకుండా అడ్డుకోవడం వెనుక పితృస్వామ్య ఆధిపత్యం ఉందని, మతపరమైన పరిమితులు తమకు లేవని చెప్పారు. తమకు నిషేధం విధించాలని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదని అన్నారు. రాజ్యాంగం తమకు అన్ని హక్కులను ఇచ్చిందని, ఇస్లాం రాజ్యాంగాన్ని అంగీకరిస్తుందని తెలిపారు. 'నేను ఒక ముస్లింనే, దర్గాల్లోకి, స్మశానాల్లోకి ప్రవేశించకూడదని ఇస్లాం మతంలో ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ పితృస్వామ్య నియంతృత్వ పోకడలు' అని ఆమె ఆరోపించారు. ఇటు ముస్లింలలో, అటు హిందువులలో వారి ఆధిపత్యమే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉదయ భాస్కర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్(ఏపీపీఎస్సీ) గా డాక్టర్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీపీఎస్సీ సిలబస్ మార్పుపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఏడాది పరీక్షల నిర్వహణ కోసం క్యాలెండర్ ను రూపొందిస్తామన్నారు. వసతులున్న భవనం దొరికితే ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని విజయవాడకు తరలిస్తామని ఉదయభాస్కర్ చెప్పారు. కాగా గుంటూరు జిల్లా వెలంపాడుకు చెందిన ఉదయభాస్కర్ గతంలో జేఎన్టీయూకే ప్రొఫెసర్‌గా పని చేశారు. అదే విధంగా కాకినాడ, విజయనగరాల్లోని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్‌గా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, విదేశీ విశ్వవిద్యాలయ సంబంధాల డెరైక్టర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉదయభాస్కర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయ భాస్కర్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూలో ( డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్) ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గోపికృష్ణ కిడ్నాపై 100 రోజులు..
హైదరాబాద్: లిబియాలో ఐఎస్ మిలిటెంట్ల చేతుల్లో తెలుగు ప్రొఫెసర్ గోపీకృష్ణ అపహరణకు గురై 100 రోజులు అవుతున్నా ఇప్పటికీ విడుదల కాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నగరంలోని నాచారం ప్రాంతంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురై 100 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస సమాచారం లేదని గోపీకృష్ణ భార్య కళ్యాణి సోమవారం మీడియా ముందు ఆవేదన చెందారు. మూడు నెలలుగా తన భర్త యోగక్షేమాలు తెలియక నరకం అనుభవిస్తున్నామని, పిల్లలు డాడి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. గోపీకృష్ణ మీద మూడు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఈ కుటుంబాలు గత మూడు నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నట్లు సోదరుడు మురళి కృష్ణ చెప్పారు. అపహరణకు గురైన వారిని విడిపిస్తామని ప్రధాని నరెంద్రమోదీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని, కానీ విడుదలలో ఎలాంటి పురోగతి లేదన్నారు. తమ్ముడు గోపికృష్ణ విడుదలకు కృషి చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులను కూడా మరోసారి కలుస్తామన్నారు. -
పని మనిషిపై ప్రొఫెసర్ వేధింపులు
అత్తాపూర్: ఇంట్లో పనిచేస్తున్న యువతికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధింపులకు గురి చేశాడో ప్రొఫెసర్. ఈ సంఘటన నార్సింగ్ పరిధిలో పప్పులగూడలో శనివారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముండే ఓ ప్రొఫెసర్ తన ఇంట్లో పని చేస్తున్న యువతితో మసాజ్ సెంటర్ పెట్టిస్తానని, ఆర్థికంగా లోటు ఉండదని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె శనివారం ఉదయం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదు: గంటా
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రోజున ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఆయన వచ్చారు. అనంతరం యువభేరీ సదస్సులో ఏయూ ప్రాఫెసర్లు, సిబ్బంది హాజరైన అంశంపై వీసీ జీఎస్ఎన్ రాజుతో మట్లాడారు. ఇప్పటివరకు ఏ ఆచార్యుడినీ సస్పెండ్ చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించారు. దీనిపై వర్సిటీ అధికారులు పరిశీలించాక చర్యలు తీసుకుంటారన్నారు. విశ్వవిద్యాలయాల్లో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని.. ఇటీవల జరిగిన సంఘటనలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వర్సిటీలో బయటి వ్యక్తుల ప్రవేశాలు పూర్తిగా నియంత్రించే దిశగా పనిచేస్తామన్నారు. పరిశోధకులు సైతం నిర్ణీత కాలంలో తమ పరిశోధనలు పూర్తిచేసి, వర్సిటీని వదిలి వెళ్లాలన్నారు. వీసీ జి.ఎస్.ఎన్రాజు మాట్లాడుతూ.. వర్సిటీకి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందని, ఆచార్యుల ప్రసంగాలను పరిశీలించిన తర్వాత ఏదైనా చెబుతామన్నారు. -
మరో తెలంగాణ ఉద్యమం
-
ముదిరిన శాతవాహన వివాదం
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో రగలిన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడ్డ 23 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమను సస్పెండ్ చేయడం సరికాదంటూ కళాశాల భవనం ఎదుట వారు ధర్నాకు దిగారు. తమపై పోలీస్ కేసులు పెట్టి మళ్లీ సస్పెండ్ చేయడం ఏంటని విద్యార్థులు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. బాలకృష్ణ అనే విద్యార్థి పరిపాలన భవనంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి యత్నించాడు. విద్యార్థులకు, ఆధ్యాపకులకు మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆర్ట్స్ కళాశాల, వసతిగృహాలకు రిజిస్ట్రార్లు సెలవులు ప్రకటించారు. -
'ఫుల్బ్రైట్-నెహ్రూ' చైర్మన్‌గా రాహుల్ జిందాల్
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక ఫుల్బ్రైట్-నెహ్రూ డిస్టింగ్విష్డ్ ప్రోగ్రామ్(విశిష్ట కార్యక్రమం) చైర్మన్‌గా ప్రముఖ భారతీయ అమెరికన్ వైద్యుడు రాహుల్ జిందాల్ ఎంపికయ్యారు. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్ఎల్ త్రివేదీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెన్సైస్ ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుంది. ఏటా 400 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ, అవయవ మార్పిడి విధానంలో కొత్త విధానాలను ఈ సంస్థ ఆవిష్కరిస్తోంది. డాక్టర్ జిందాల్ మేరీల్యాండ్‌లోని యూనిఫామ్డ్ సర్వీసెస్ వర్సిటీలో శస్త్రచికిత్సల విభాగం ప్రొఫెసర్‌గా ఉన్నారు. -
‘సహకారం’తో సామాజిక ప్రయోజనం
క్రమబద్ధమైన మార్కెట్లు, గ్రేడింగ్, ప్రామాణీకరణ, సరైన తూనికలు,కొలతలు, గిడ్డంగులు, నిల్వ సౌకర్యాలు, మార్కెట్ సమాచారం లభ్యత,సేకరణ, మద్దతు ధరల నిర్ణయం, మార్కెటింగ్ పర్యవేక్షణ డెరైక్టరేట్ ఏర్పాటు లాంటి ప్రభుత్వ చర్యలు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మెరుగుపర్చడానికి దోహదపడుతున్నాయి. పెద్ద రైతులకు విక్రయించిన తర్వాత మిగులు అధికంగా ఉంటోంది. ప్రభుత్వ చర్యల కారణంగా వీరే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు తమ ఉత్పత్తిలో అధిక భాగాన్ని పరపతి అవసరాల కోసం ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లకు విక్రయిస్తున్నారని అనేక అనుభవ పూర్వక ఆధారాలు తెలియజేస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందే క్రమంలో సహకార మార్కెటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు సహకార ప్రాతిపదికపై మార్కెటింగ్ సంఘాలుగా ఏర్పడి వస్తువులను విక్రయించుకునే విధానమే సహకార మార్కెటింగ్. సహకార మార్కెటింగ్ భారత్‌లో సహకార మార్కెటింగ్ వ్యవస్థ రెండు రకాలుగా ఉంది. మొదటి రకంలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ రెండంచెల్లో ఉంది. దీనిలో భాగంగా కిందిస్థాయిలో ప్రాథమిక సంఘాలు, అత్యున్నత స్థాయిలో రాష్ట్ర సొసైటీ ఉంటాయి. రెండో రకంలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ మూడంచెలుగా ఉంటుంది. ఈ విధానంలో.. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక సంఘాలు, జిల్లా స్థాయిలో కేంద్ర మార్కెటింగ్ సంఘాలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార సంఘం ఉంటాయి. ఆల్ - ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ సిఫారసుల ఆధారంగా రెండో పంచవర్ష ప్రణాళికలో సహకార మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు. వీటిని మూడో ప్రణాళికలో విస్తరించారు. ప్రస్తుతం సహకార మార్కెటింగ్ వ్యవస్థలో భాగంగా మండి స్థాయిలో 2633 సాధారణ అవసరాలకు సంబంధించిన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘాలు, నూనె గింజలకు సంబంధించి 3290 ప్రత్యేక ప్రాథమిక మార్కెటింగ్ సంఘాలు, 172 జిల్లా లేదా కేంద్ర మార్కెటింగ్ సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయిలో సహకార మార్కెటింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థగా ‘నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటీవ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ూఅఊఉఈ)’ను ఏర్పాటు చేశారు. సేకరణ, పంపిణీ, ఎంపిక చేసిన వ్యవసాయ వస్తువుల ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను ‘నాఫెడ్’ నిర్వహిస్తోంది. ఇది ప్రభుత్వానికి కేంద్ర నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ త్వరగా పాడవని పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర ఉత్పత్తులకు సంబంధించి మద్దతు ధర కార్యకలాపాలను నిర్వహిస్తోంది. త్వరితంగా కుళ్లిపోయే బంగాళాదుంప, ఉల్లిపాయలు, ద్రాక్ష, ఆరెంజ్, గుడ్లు, ఆపిల్స్, మిరపకాయలు, బ్లాక్ పెప్పర్ లాంటి విషయంలో మార్కెట్ జోక్యాన్ని చేపడుతుంది. సహకార వ్యవస్థ ద్వారా మార్కెటింగ్ చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. కానీ సహకార మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో ఒకేవిధంగా లేదు. అనేక రాష్ట్రాల్లో సహకార మార్కెటింగ్ సంఘాల ఆర్థిక ప్రగతి సంతృప్తికరంగా లేకపోవడం వల్ల ఇవి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఆహార ప్రాసెసింగ్: ప్రపంచంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తుల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం పండ్ల ఉత్పత్తిలో భారత్ వాటా 10% కాగా, కూరగాయల ఉత్పత్తిలో 13%. నేషనల్ హార్టికల్చర్ బోర్డ గణాంకాల ప్రకారం 2012-13లో భారత్‌లో పండ్ల ఉత్పత్తి 81.285 మిలియన్ మెట్రిక్ టన్నులు, కూరగాయల ఉత్పత్తి 162.19 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. పండ్ల ఉత్పత్తి విస్తీర్ణం 6.98 మిలియన్ హెక్టార్లు, కూరగాయల ఉత్పత్తి విస్తీర్ణం 9.21 మిలియన్ హెక్టార్లు. 2013-14లో పండ్లు, కూరగాయల ఎగుమతుల విలువ రూ. 8760.96 కోట్లకు చేరుకుంది. దేశంలోని మొత్తం పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 35% వృథా కావడానికి అవస్థాపనా సౌకర్యాలైన శీతల గిడ్డంగులు, గిడ్డంగులు, రిఫ్రిజిరేటేడ్ ట్రక్ల కొరత లాంటివి కారణమవుతున్నాయి. దేశంలో ఇటీవల ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధి ప్రాధాన్యం పెరిగింది. భారత్‌లో సహకార సంఘాల్లా ఏ ఇతర రంగం కూడా రైతులకు చేరువ కాలేదు. ఈ నేపథ్యంలో ఆహార ప్రాసెసింగ్ విషయంలో సహకార సంఘాలు దృష్టి సారించడం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. సహకార సంఘాలు గిడ్డంగి వసతి, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు, త్వరగా పాడయ్యే వస్తువుల రవాణా కోసం రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను సమకూర్చుకోవాలి. సహకార సంఘాలు - సామాజిక ప్రయోజనం 1. సహకార సంఘాల ఉత్పత్తులకు సంబంధించి కామన్బ్రాండ్లను అభివృద్ధి చేసి వాటిని వినియోగదారులకు చేరువ చేయడం ద్వారా సమాజానికంతటికీ ప్రయోజనం కలుగుతుంది. సహకార సంఘం సభ్యులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. తద్వారా వారి ఆదాయస్థాయి పెరుగుతుంది. ఉదా: ప్రాసెసింగ్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే ఆయా ప్లాంట్లలో సహకార సంఘ సభ్యులకు ప్రత్యక్షంగా, ప్రాసెస్డ్ ఫుడ్ (్కటౌఛ్ఛిటట ఊౌౌఛీ) తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకులను సరఫరా చేసే రైతులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 2. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సహకార సంఘాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. మార్కెట్లో ధరల స్థిరీకరణకు సహకార సంఘాల ఉత్పత్తులు దోహదపడుతున్నాయి. ప్రైవేట్ డెయిరీలు పాల ప్యాకెట్ల సరఫరా విషయంలో సహకార డెయిరీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందువల్ల ధరలు కొంతమేర నియంత్రణలో ఉంటున్నాయి. 3. వ్యవసాయ ఆధారిత సహకార సంఘాలు వాటి ఉత్పత్తుల మార్కెటింగ్‌లో విజయవంతమైతే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఫార్మింగ్ కో-ఆపరేటివ్స, సర్వీస్ సొసైటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఫెర్టిలైజర్ కో-ఆపరేటివ్స, ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ పనిముట్ల తయారీ యూనిట్లు మొదలైనవి వ్యవసాయ ఉత్పత్తులు, ఉపాధి పెంపుదలలో ప్రధాన భూమిక పోషిస్తాయి. 4. స్వదేశీ మార్కెట్లో సహకార ఉత్పత్తుల కామన్బ్రాండ్లు అభివృద్ధి చెందితే ఆయా ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం పెరిగి విదేశీ వాణిజ్యం వృద్ధి చెందుతుంది. భారత్‌లోని డెయిరీ, టెక్స్టైల్స్, తోలు ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఉత్పత్తులకు సంబంధించి మొదటగా స్వదేశీ డిమాండ్ పెరుగుదలపై సహకార సంఘాలు దృష్టి సారించాలి. 5. సహకార సంఘాల అభివృద్ధి ద్వారా పటిష్టమైన, విలువ ఆధారిత సమాజం రూపుదిద్దుకుంటుంది. తద్వారా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో సాధికారత సాధించవచ్చు. 6. {పజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తగిన సేవలు అందించడంలో సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బియ్యం, గోధుమ, పంచదార, గోధుమ పిండి, కిరోసిన్‌ను సబ్సిడీ ధర వద్ద పంపిణీ చేయగలుగుతాయి. ప్రభుత్వ ఉచిత పంపిణీ పథకమైన చేనేత వస్త్రాల (చీరలు, దోవతిలు) పంపిణీని సహకార సంఘాల ద్వారా చేపడుతున్నారు. మాదిరి ప్రశ్నలు 1. 1915లో తొలి సహకార మార్కెటింగ్ సంఘాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? 1) ఆంధ్రప్రదేశ్ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) పంజాబ్ 2. గిరిజనుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను ప్రైవేట్ వ్యాపారుల నుంచి రక్షించడానికి ఏర్పాటైన సంస్థ? 1) ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2) ఐఎఫ్ఎఫ్సీవో 3) ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 4) ఏదీకాదు 3. కేంద్ర గిడ్డంగుల సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1) 1957 2) 1963 3) 1964 4) 1969 4. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? 1) హైదరాబాద్ 2) కోల్‌కతా 3) న్యూఢిల్లీ 4) ముంబయి 5. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని సూచించిన కమిటీ? 1) రంగరాజన్ కమిటీ 2) వై.కె. అలఘ్ కమిటీ 3) పద్మనాభయ్య కమిటీ 4) వై.వి. రెడ్డి కమిటీ 6. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం? 1) 1961 2) 1962 3) 1963 4) 1964 సమాధానాలు: 1) 2 2) 3 3) 1 4) 4 5) 2 6) 3. సహకార మార్కెటింగ్ ప్రయోజనాలు: 1. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అంతిమ కొనుగోలుదార్లతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి. 2. రైతులకు తమ ఉత్పత్తుల విక్రయంలో బేరమాడే శక్తి పెరుగుతుంది. 3. సహకార మార్కెటింగ్ సంఘాల నుంచి రైతులు తగినంత పరపతి పొందగలుగుతారు. తద్వారా గిట్టుబాటు ధరలు లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించకుండా వేచి ఉండవచ్చు. ఫలితంగా వారికి లభించే ప్రతిఫలాల్లో పెరుగుదల ఉంటుంది. 4. సహకార మార్కెటింగ్ సంఘాలకు సొంత రవాణా సాధనాలు ఉండటం వల్ల రవాణా వ్యయంలో తగ్గుదల ఏర్పడుతుంది. 5. సహకార సంఘాలు గిడ్డంగి సౌకర్యాలను కల్పిస్తున్నందు వల్ల గిట్టుబాటు ధర లభించే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవచ్చు. 6. {శేణీకరణ, ప్రామాణీకరణ ఉంటుంది. 7. మార్కెట్ ధరలు, డిమాండ్, సప్లయ్, ఇతర మార్కెట్ సమాచారం ఎప్పటికప్పుడు సహకార సంఘాలకు లభిస్తుండటం వల్ల తదనుగుణంగా తగిన ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. 8. సహకార మార్కెటింగ్ సంఘాలు ఉత్పాదితాలైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, వినియోగ వస్తువులను అధిక పరిమాణంలో తక్కువ ధరలకే కొనుగోలు చేసి సభ్యుల మధ్య పంపిణీ చేసుకోగలుగుతారు. 9. సహకార మార్కెటింగ్ సంఘాలు ప్రాసెసింగ్ కార్యకలాపాలను చేపట్టవచ్చు. 10. రైతుల్లో ఆత్మవిశ్వాసం, సమష్టి కృషికి సంబంధించిన అవగాహన వల్ల వ్యవసాయాభివృద్ధి సాధించవచ్చు. 11. సమగ్రమైన ప్రణాళికల ద్వారా పంటల తీరులో మార్పు చేపట్టవచ్చు. 12. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి విక్రయం అయిన మిగులులో పెరుగుదల ద్వారా ద్రవ్యోల్బణ పరిస్థితులను అరికట్టవచ్చు. 13. సహకార సంఘాలు చట్టబద్ధంగా గుర్తింపు పొందిన సంస్థలు. వీటికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
కలకలం సృష్టించిన ‘సాక్షి’ కథనం
విధుల్లోకి రాని రంగారావు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరీక్షల ని యంత్రణాధికారిగా ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు పదవీకా లం గత నెల 24వ తేదీతో ముగిసినా ఆయన ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్న వైనంపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. ‘పదవీకాలం ము గిసినా కుర్చీ వదలని ప్రొఫెసర్’ శీర్షికన ఈ కథనం రావ డం తెలిసిందే. దీంతో రంగారావు పరీక్షల నియంత్రణాధికారి, ఇన్చార్జ రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తించేందుకు గురువారం క్యాంపస్‌కు రాలేదు. ఆ రెండు బాధ్యతల నుంచి రంగారావు తప్పుకున్నట్లేనని భావిస్తున్నారు. ఇక పరీక్షల నియంత్రణాధికారిగా పదవీకాలం ముగిసినందున ఇన్చార్జ రిజిస్ట్రార్‌గా కూడా బాధ్యతలు కూడా నిర్వర్తించే వీలు లేకుండా పోయింది. మళ్లీ పరీక్షల నియంత్రణాధికారిగా ఆయన పదవీకాలం పొడిగించే అవకాశము న్నా దీనికి ఇన్చార్జ వీసీ అప్రూవల్ ఉండాలి. కానీ ఇన్చార్జ వీసీ కె.వీరారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రంగారావు విషయమై స్పష్టత రావడం లేదు. కా గా, పదవీకాలం ముగిసిన విషయాన్ని ఉన్నత విద్యా కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లకపోవడం నిబంధనలకు విరుద్ధమేనని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయం వ్యక్తం చేశా రు. అయితే, యూనివర్సిటీలో కీలకమైన వీసీ, రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో పాలన స్తంభించినట్లయింది. ఇన్చార్జ వీసీ వీరారెడ్డి రాజీనామా చేసి ఇరవై రోజులు దాటుతున్నా ఉన్నతాధికారులు ఆమోదించలేదని సమాచారం. ఆయన రాజీనామాను ఆమోదించి మరొకరిని నియమిస్తేనే నియామకాలు చేపట్టే అవకాశముంటుంది. నిబంధనలకు విరుద్ధం కేయూ పరీక్షల నియంత్రణాధికారిగా పదవీకాలం ముగిసి 12రోజులు గడిచినా ఎంవీ.రంగారావు ఆ పదవిలో కొనసాగడం సరికాదని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ ఎఫ్) ఇన్చార్జ వంగాల సుధాకర్, అధ్యక్షుడు గాదెపాక అనిల్‌కుమార్ పేర్కొన్నారు. యూనివర్సిటీలో గురువా రం జరిగిన సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. పదవీకాలం ముగిసిన తర్వాత బాధ్యతలు నిర్వర్తించిన రంగారావు సంతకాలు చేసిన ఫైళ్లకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వం వెంటనే కేయూ వీసీతో పాటు మిగతా పదవులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో మురళి, కె.సునీల్, నేరెళ్ల విఠల్, దాట్ల నరే ష్, వంశీ, కృష్ణ, కరుణాకర్, శ్రీను పాల్గొన్నారు. -
ప్రధాని చొరవతో మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం
నోయిడా: ఆమె ఓ ప్రొఫెసర్. పేరు సవితా సురభి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఓ వర్సిటీ న్యాయ కళాశాలలో 2007 నుంచి 2013 వరకూ పనిచేశారు. అనంతరం తనకు రావాల్సిన గ్రాట్యుటీ రూ. 40 వేల కోసం ఏడాదిపాటు చెప్పులు అరిగేలా కళాశాల చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోవడంతో చివరి యత్నంగా ప్రధాని కార్యాలయం(పీఎంవో) తలుపు తట్టారు. జూలైలో ప్రధాని మోదీకి విజ్ఞాపన పత్రం పంపారు. వెంటనే ఆమె ఈ-మెయిల్‌కు పీఎంవో నుంచి సమాధానం వచ్చింది. లేబర్ కమిషనర్‌ను కలసి సమస్యను చెప్పుకోవాల్సిందిగా పీఎంవో సూచించింది.ఈ-మెయిల్ ప్రతిని యూనివర్సిటీ వ్యవస్థాపక సభ్యుడికి పంపింది. దీంతో వెంటనే ఆమె సమస్య పరిష్కారమైంది. ఆమెకు రావాల్సిన రూ. 40 వేల గ్రాట్యుటీని వర్సిటీ ఏకంగా రూ. 1.6 లక్షలకు పెంచడంతోపాటు సొమ్మును సత్వరమే చెల్లించింది. -
సైన్స్‌తోనే సామాజిక అభివృద్ధి
గెస్ట్ కాలమ్ దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రంగంలో రీసెర్చ్ కార్యకలాపాలను బాగా విస్తృతం చేయాలి. వాస్తవానికి సైన్స్ ఎడ్యుకేషన్‌లో దేశానికి దశాబ్దాల ఘన చరిత్ర ఉన్నప్పటికీ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థిల్లో సైన్స్ పట్ల మక్కువ తగ్గుతోంది. అయితే సైన్స్‌తోనే సమాజాభివృద్ధి సాధ్యం అవుతుందని గుర్తించాలి అంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - మొహాలీ క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ నారాయణసామి సత్యమూర్తి. కెమిస్ట్రీ విభాగంలో అన్నామలై యూనివర్సిటీలో బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసి తర్వాత ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్డీ, జె.సి.పొలానీస్ లేబొరేటరీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అందుకున్న ప్రొఫెసర్ సత్యమూర్తి.. ప్రపంచంలో ప్రముఖ కెమిస్ట్రీ ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 1978 నుంచి 2007 వరకు ఐఐటీ కాన్పూర్‌లో అధ్యాపక వృత్తిలో విధులు నిర్వర్తించి.. 2007 నుంచి ఐఐఎస్ఈఆర్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సత్యమూర్తితో ఇంటర్వ్యూ.. సైన్స్ దశాబ్దాల చరిత్ర మన దేశంలో ఎందరో శాస్త్రవేత్తలు దశాబ్దాల క్రితమే సైన్స్‌లో పలు ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఫిజిక్స్ విభాగంలో సర్ సి.వి. రామన్, ఎస్.ఎన్.బోస్, ఎం.ఎన్.సాహా వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణల ఫలితాలను ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న దేశం.. ఆధునిక యుగంలో మాత్రం సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌లో ఇతర దేశాల కంటే వెనుకంజలో ఉంది. దీన్ని గుర్తించి పోటీ ప్రపంచంలో ఇతర దేశాలకు ధీటుగా ఆవిష్కరణలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకోసం విస్తృతంగా లభిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. సైన్స్‌తోనే సామాజిక అభివృద్ధి జాతి పురోగమన దిశలో పయనించాలంటే సైన్స్ ఎడ్యుకేషన్‌ను అభివృద్ధి చేయాలని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారు. ఫలితంగా ఏర్పాటైనవే సీఎస్ఐఆర్ లేబొరేటరీలు. అదేవిధంగా అటామిక్ ఎనర్జీ విభాగంలో హోమీ జే బాబా, స్పేస్ టెక్నాలజీలో విక్రమ్ సారాబాయ్ వంటి శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఇటు అకడమిక్‌గా, అటు పరిశోధనల పరంగా సైన్స్ విభాగాన్ని ఎంతో వృద్ధి చేయాల్సిన అవసరముంది. ఈ ఉద్దేశంతోనే ఇంజనీరింగ్‌లో ఐఐటీల మాదిరిగా సైన్స్ విభాగంలో ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ (ఐఐఎస్ఈఆర్)లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైన్స్ పరిశోధనల దిశగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించేలా పలు కోర్సులను ఇక్కడ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఇండస్ట్రీ- ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ విధానంలో సాగే బోధన ద్వారా విద్యార్థులకు పరిశోధన పట్ల ఆసక్తి కలుగుతుంది. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్లే కాకుండా అన్ని యూనివర్సిటీల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అవగాహన పెంచే చర్యలు చేపట్టాలి. అప్పుడే విస్తృత స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతాయి. కొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తాయి. ఐఐఎస్ఈఆర్ మొహాలీలో మొత్తం ఐదు ఐఐఎస్ఈఆర్ క్యాంపస్‌లలో కరిక్యులం, బోధన విధి విధానాలు ఒకే విధంగా ఉంటాయి. మొహాలీలో ప్రతి విభాగానికీ ప్రత్యేక పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇటీవలే.. కొత్త క్యాంపస్‌లో న్యూక్లియర్ మాగ్నటిక్ రిసోనెన్స్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించాం. ఈ సెంటర్ ఉద్దేశం.. స్ట్రక్చరల్ బయాలజీ మొదలు క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు అన్ని విభాగాల్లో ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించడం. ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా ముందు కెళుతున్నాం. కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు విద్యార్థిల్లో కెరీర్ అంటే ఇంజనీరింగ్, దానికి మార్గంగా ఐఐటీలను భావిస్తున్న రోజులివి. కెరీర్ అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ సైన్స్ అంశాలు అంతర్గతంగా ఇమిడి ఉంటాయి. విద్యార్థులు ఈ అంశాన్ని గుర్తించడం లేదు. సైన్స్‌లోనూ అవకా శాలు పుష్కలం. రీసెర్చ్, పీజీ ఔత్సాహికులకు ఇప్పుడు స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ వంటివి లభిస్తు న్నాయి. మంచి లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి సైన్స్‌పై విద్యార్థుల అనాసక్తికి ప్రస్తుత విద్యా విధానం కూడా కొంత కారణమని చెప్పొచ్చు. వాస్తవానికి ఎంతో మంది విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలోనే సైన్స్ అంటే ఆసక్తి, ఉత్సుకత ఉంటున్నాయి. కానీ, పరీక్షలు-మార్కులు అనే మూల్యాంకన పద్ధతి, మల్టిపుల్ ఛాయిస్‌లో ఉండే పోటీ పరీక్షలు వంటివి విద్యార్థుల్లోని సృజనాత్మకతను దెబ్బతీస్తున్నాయి. ఈ విధానాల కారణంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్లాస్‌లో ముందుండాలనే భావిస్తున్నారు. తద్వారా వారి వాస్తవ అభిరుచులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. తమ పిల్లల ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా లభించే అవకాశాలు-మార్గాలపై అన్వేషణ సాగించడంతోపాటు సదరు విభాగంలో మరింత అవగాహన పెరిగేలా చేయూతనివ్వాలి. నిరంతర అన్వేషణే.. ఉన్నతికి మార్గం విద్యార్థులు కెరీర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే నైపుణ్యాలు పొందే విధంగా నిరంతరం అన్వేషణ సాగించాలి. ఐఐఎస్ఈ ఆర్ మొహాలీ లోగో క్యాప్షన్ కూడా ఇదే (ఇన్ పర్షుయిట్ ఆఫ్ నాలెడ్జ్). అన్వేషణే.. ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది. అవగాహన, అవసరమైన మౌలిక సదుపా యాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే విధంగా నేటి యువత అడుగులు వేస్తోంది. ఇతర దేశాల్లో ఆయా విభాగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచిన భారతీయులు ఎందరో ఉన్నారు. ఆ యువశక్తి విదేశా లకు తరలకుండా ఇక్కడే ఉండేలా.. సమాజాభివృద్ధికి తోడ్పడేలా మోటివేట్ చేయాలి. -
ఇక్ఫాయ్ ప్రొఫెసర్ ఆత్మహత్య!
కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణం హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇక్ఫాయ్ యూనివర్సిటీ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనాలసిస్ట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ) ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు ఆయన తనతో పాటు తీసుకెళ్లిన ఇద్దరు పిల్లల ఆచూకీ తెలియరాలేదు. దీంతో గురుప్రసాద్ భార్య సుహాసిని మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన రాఘవేంద్ర గురుప్రసాద్ (43)కు హైదరాబాద్‌లోని మల్కాజ్గిరి ఆనంద్‌బాగ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుహాసిని (38)తో 2004లో వివాహమైంది. వారికి విఠల్ విరించి (9), నంద విహారి (5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే.. ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో.. సుహాసిని గతేడాది ఏప్రిల్‌లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి గురుప్రసాద్ అల్వాల్‌లోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్‌లో తన తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. సుహాసిని ఇద్దరు పిల్లలతో మల్కాజ్‌గిరిలోని పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో గురుప్రసాద్ తన భార్యతో కలసి ఉండేందుకు అనుమతివ్వాలంటూ రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టులో గతేడాది సెప్టెంబర్‌లో పిటిషన్ వేశాడు. దాంతోపాటు తన ఇద్దరు పిల్లలను అప్పగించాలని కోరుతూ మరో పిటిషన్ కూడా వేశాడు. దీనిపై స్పందించిన కోర్టు ప్రతి నెల మొదటి, మూడవ శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పిల్లలను గురుప్రసాద్‌కు అప్పగించాలని సుహాసినిని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురుప్రసాద్ శని, ఆదివారాల్లో పిల్లలను తీసుకెళ్లి తిరిగి భార్యకు అప్పగించేవాడు. ఈ వ్యవహారం నడుస్తుండగానే.. తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ గత నెల 2న ఫ్యామిలీ కోర్టులో మరో పిటిషన్ వేశాడు. ఇదిలా ఉండగానే గురుప్రసాద్ గత శనివారం సుహాసిని వద్దకు వచ్చి పిల్లలను తీసుకెళ్లాడు. కానీ 12.30 గంటల ప్రాంతంలో ఒంటరిగా ఆమె దగ్గరకు వచ్చి కోర్టు వ్యవహారంపై నిలదీశాడు. పిల్లలు ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించగా.. ఒక దేవాలయంలో భోజనం చేస్తున్నారని, ముగిశాక తెస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడున్నర గంటల వరకూ వారి రాక కోసం ఎదురుచూసిన సుహాసిని భర్త మొబైల్‌కు ఫోన్ చేయగా... ఘటనా స్థలంలో ఉన్న రైల్వే పోలీసులు గురుప్రసాద్ ఆత్మహత్య విషయానిన సుహాసినికి చెప్పారు. అయితే గురుప్రసాద్ వెంట ఉండాల్సిన వారి ఇద్దరు పిల్లలు మాత్రం కనిపించలేదు. పోలీసులు గురుప్రసాద్ ఇంటికి వెళ్లి చూడగా... ఇంట్లో ఫ్యాన్ కింద ఓ తాడు, ఒక లేఖ కనిపించింది. చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. ఆ నోట్లో గురుప్రసాద్ భార్యతో వివాహం జరిగిన నాటినుంచి ఉన్న పరిణామాలను రాశాడు. ఆత్మహత్య ప్రస్తావన మాత్రం చేయలేదు. -
మంజుల్‌కు ‘గణిత నోబెల్’
సాక్షి, హైదరాబాద్: గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారంగా భావించే ‘ఫీల్డ్స్ మెడల్’ను భారతీయ సంతతికి చెందిన విద్యావేత్త మంజుల్ భార్గవ సాధించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన కొన్నాళ్లు గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరుగుతున్న అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సదస్సులో ‘ఇంటర్నేషనల్ మేథమెటికల్ యూని యన్(ఐఎంయూ)’ భార్గవకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భార్గవ జామెట్రీలో శక్తివంతమైన నూతన విధానాలను అభివృద్ధి చేశారు. 78 ఏళ్ల అంతర్జాతీయ గణిత సదస్సు (ఐసీడబ్లూ) చరిత్రలో భారతీయ మూలాలున్న శాస్త్రవేత్తకు ఈ పురస్కారం లభించడం ఇదే ప్రధమం. నాలుగేళ్లకోసారి ప్రకటించే ఈ పురస్కారాన్ని భార్గవతో పాటు మరో ముగ్గురు ఎంపికయ్యారు. అలాగే, భారతీయ సంతతికి చెందిన మరో గణిత శాస్త్రవేత్త సుభాష్ ఖోట్కు అల్గోరిథమ్ డిజైన్స్‌లో నూతన ఆవిష్కరణలకు గానూ ‘రోల్ఫ్ నెవాన్లిన్నా’ పురస్కారాన్ని ఐఎంయూ ప్రకటించింది. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన కూరంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ స్టడీస్‌లో సుభాష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సదస్సులో హెచ్‌సీయూ గణిత విభాగం ప్రొఫెసర్లు కుమరేశన్, సుమన్ కుమార్ పాల్గొంటున్నారు. -
మళ్లీ విధుల్లోకి కోదండరామ్
సుదీర్ఘ సెలవు తర్వాత ఓయూలో రిపోర్టు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ సారథి ప్రొఫెసర్ కోదండరామ్ మళ్లీ అధ్యాపకుడిగా అవతారం ఎత్తనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన కళాశాల బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిపోర్ట్ కూడా చేశారు. మరో రెండు రోజుల్లో సికింద్రాబాద్ పీజీ కళాశాలలో రాజనీతిశాస్త్ర అధ్యాపకునిగా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. 2015 సెప్టెంబర్‌లో ఆయన అధ్యాపకుడిగా పదవి విరమణ చేయనున్నారు. 2009 నవ ంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడిన మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు 2010లో అధ్యాపక విధులకు సెలవు పెట్టారు. ప్రస్తుతం పోలవరం ముంపు బాధితులకు అండగా పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు ఉద్యమ వ్యూహరచన చేస్తూనే మరో వైపు మధ్యమధ్యలో ఆరు మాసాల పాటు విద్యార్థులకు పాఠాలు బోధించారు. -
అనుమానాస్పదస్థితిలో ప్రొఫెసర్ మృతి
బాపట్ల టౌన్: స్థానిక ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మేకా విజయలక్ష్మి (32) గురువారం సాయంత్రం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా మార్టూరు మండ లం, రాజుపాలెం గ్రామానికి చెందిన విజయలక్ష్మికి ఏడాది క్రితం అదే మండలం పూనూరు గ్రామానికి చెందిన మేకా ఇస్సాక్‌తో వివాహమైంది. ఉద్యోగరీత్యా దంపతులు పట్టణంలోని భీమావారిపాలెం తాలింఖానా సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా.. ఎంటెక్ చేసిన ఆమె భర్త ఇస్సాక్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన విజయలక్ష్మి సాయంత్రం 6.30 గంటల సమయంలో మృతిచెందిందన్న సమాచారం తెలిసి విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు గోవతోటి రామారావు, రవికుమారిలు స్వగ్రామం నుంచి ఇక్కడకు చేరుకుని భోరున విలపించారు. తమ బిడ్డను అల్లుడే చంపి ఉం టాడని ఆరోపించారు. పదిరోజులుగా తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. తమతో కూడా కనీసం మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కట్నం తీసుకురమ్మంటూ వేధిస్తున్నాడని, తమ బిడ్డను చంపి ఉరివేసుకుందని చెబుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కగానొక్క కూతుర్ని చేతులారా చంపాడంటూ కన్నీరు మున్నీరుగా విలిపించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఉదయం తమ ఇద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణ చేసుకుందని మృతురాలి భర్త ఇస్సాక్ అంటున్నాడు. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకుని సాయంత్రం తాను బజారు నుంచి వచ్చేసరికి విజయలక్ష్మి ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఇస్సాక్ చెబుతున్నాడు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలి
హైదరాబాద్: ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.నాగాసాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలని పౌర, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ సంఘాల నాయకులు బొజ్జాతారకం, రవిచంద్ర, దుడ్డు ప్రభాకర్, ప్రొఫెసర్.లక్ష్మణ్, బల్లా రవీంద్రనాథ్, చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ వికలాంగుడైన సాయిబాబాను పోలీసులు చ ట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. సాయిబాబా కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి మావోలు, టైస్ట్లతో సంబంధాలున్నాయని ప్రచారం చేస్తూ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సాయిబాబా ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మద్దతు కూడగడుతున్నారనే సాకుతో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సాయిబాబా రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్) సంయుక్త కార్యదర్శిగా ఉండి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, అందుకే ప్రభుత్వం కుట్రపన్ని పోలీసులతో కిడ్నాప్ చేయించిందన్నారు. సాయిబాబాను విడుదల చేసే వరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సాయిబాబా తల్లి సూర్యవతి మాట్లాడుతూ వికలాంగుడైన తన కూమారుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని, వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్నకేసు అయితేనే పరిధి దాటిరాని పోలీసులు గడ్చిరౌలి నుండి ఢిల్లీకి వెళ్లి ఎత్తుకెళ్లడంలో కుట్ర దాగుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కోటి, రివేరా తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
- ఈ నెల 8వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు - గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి - నిమిషం ఆలస్యమైనా అనుమతించరు - ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు సూచించారు. నల్లగొం డలో ఎంసెట్ నిర్వహణపై సోమవారం స్థానిక ఎన్జీ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంసెట్ నిర్వహణకు జిల్లా కేంద్రంలో 17 ఇంజినీరింగ్ సెం టర్లు, 8 అగ్రికల్చర్, మెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 8,500 మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు, 4050 అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల న్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోరని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నిర్వహణలో ఏలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీ సుల సహకారం తీసుకుంటామన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు, ఆపైన ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేక అబ్జర్వర్లను నియమించడంతో పాటు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నాగేందర్‌రెడ్డి, 17 మంది పరి శీలకులు, 17మంది చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
కుల వ్యవస్థ నిర్మూలనతోనే సమాజ మార్పు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన జరగాలని మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రగాఢంగా కోరుకున్నారని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభా గం ప్రొఫెసర్ కే.శ్రీనివాసులు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బీసీ సెల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్- సమకాలీన భారతదేశంలో కులం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కుల వ్యవస్థ నిర్మూలన ద్వారానే దేశంలో నూతన సమాజ ఆవిష్కరణ జరుగుతుందని పూలే, అంబేద్కర్ స్పష్టం చేశారన్నారు. వారిద్దరూ కులవ్యవస్తను తీవ్రంగా వయతిరేకించారన్నారు. కుల వ్యవస్థకు అనుకూల, వ్యతిరేకవర్గాల మధ్య చరిత్రలో ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూనే ఉందన్నారు. కుల వ్యవస్థ విషయంలో మార్క్సిస్టుల అవగాహనకు, అంబేద్కర్ అవగాహనకు ఎంతో తారతమ్యం ఉందన్నారు. భారతీయ సమాజంలో కుల ప్రాధాన్యత తగ్గినట్లు గతంలో ఎంఎన్ శ్రీనివాస్ వంటి మేధావులు చెప్పినా, వాస్తవ ం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఇప్పటికీ కుల ప్రభావం నిమ్నవర్గాలను చిన్నచూపు చూస్తుందన్నారు. తెయూ వీసీ అక్బర్‌అలీఖాన్ సదస్సును ప్రారంభించి మాట్లాడారు. అన్నివర్గాల వారికి సమానమైన అవకాశాలు లభించాలన్నారు. అప్పుడే సమాజంలో శాంతి, సౌభాగ్యం వెళ్లివిరిస్తుందన్నారు. వనరుల పంపిణీ సమాన స్థాయిలో జరిగి అన్నివర్గాలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. కేయూ సామాజిక శాస్త్ర విభాగం మాజీ డీన్ ప్రొఫెసర్ రాములు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యా రు. తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సదస్సుకు అధ్యక్షత వహించారు. సదస్సులో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కనకయ్య, ఆర్ట్స్ విభాగం డీన్ ధర్మరాజు, బీసీ సెల్ డెరైక్టర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్..బరిలోనే
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఇరవై నాలుగు గంటల ఉత్కంఠకు తెరపడింది. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ఏ.సీతారాంనాయక్ దాఖలు చేసిన నామినేషన్‌ను అంగీకరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ పౌసుమిబసు తెలిపారు. జిల్లాతో పాటు తెంగాణవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదీ.. గొడవ వరంగల్‌లోని కాకతీయూ యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఏ.సీతారాంనాయక్ తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రతినిధిగా ఉన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇటీవల టీఆర్ఎస్లో చేరగా... జేఏసీ ప్రతినిధుల కోటా కింద ఆయనను మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈనెల 10వ తేదీన నామినేషన్ల పరీశీలన క్రమంలో సీతారాంనాయక్ అభ్యర్థిత్వంపై మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన కేంద్ర సహాయ మంత్రి బలరాంనాయక్ ఆర్ఓ వద్ద అభ్యంతరం లేవనెత్తారు. ప్రభుత్వం నుంచి వేతనం పొందుతూ లాభదాయక పదవిలో ఉన్న సీతారాంనాయక్ ఆ పదవికి రాజీనామా చేయకుండా నామినేషన్ వేశారని.. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆయన చెల్లదని పేర్కొంటూ తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. దీంతో నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇరుపక్షాలను పిలిచిన ఆర్ఓ.. ఇరువురు తమ వద్ద ఉన్న ఆధారాలతో శుక్రవారం సాయంత్రం 5గంటలకు రావాలని సూచించారు. కలెక్టరేట్‌కు హైకోర్టు న్యాయవాదులు ఎవరికి వారు తమ వాదన నెగ్గించుకునేందుకు హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దింపారు. బలరాం నాయక్ తరపున పట్టాభిరామారావు, సీతారాంనాయక్ తరఫున జె.రాచందర్‌రావు వాదనలు వినిపించారు. ఇలాంటి సందర్భాల్లో అభర్థులకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వారిద్దరు ఆర్ఓ ముందు ఉంచగా.. స్వతంత్య్ర ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారు ఎన్నికల్లో పోటీకి అర్హులేనని సీతారాంనాయక్ తరఫు న్యాయవాది రాంచందర్‌రావు వివరించారు. ఆయన వాదనతో ఆర్ఓ, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఏకీభవిస్తూ సీతారాంనాయక్ నామినేషన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం నుంచి హైడ్రామా టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాంనాయక్‌కు సంబంధించి అభ్యర్థిత్వంపై ఫిర్యాదు చేసిందికేంద్ర మంత్రి కావడంతో జిల్లా అధికారులు కాస్త సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో గురువారం సాయంత్రం విచారణ చేపట్టకుండా శుక్రవారానికి వాయిదా వేశారు. అలాగే, విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ దృష్టికి తీసుకు వెళ్లారు. అక్కడినుంచి సమాచారం వచ్చేలోగా నామినేషన్‌పై అభ్యంతరాలు లేవనెత్తిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి తోడు శుక్రవారం ఉదయం నుంచి తమ వకాలత్ నామా స్వీకరించాలని సీతారాంనాయక్‌తో పాటు ప్రత్యర్థి వర్గం వారు ఆర్ఓపై త్రీస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆర్ఓ నిరాకరించి అభ్యంతరం మాత్రమే స్వీకరిస్తామని, విచారణ తర్వాతేనిర్ణయం ప్రకటిస్తామని స్పష్టచేశారు. అలాగే, తమ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించడంతో అందరూ సాయంత్రం 4గంటలవరకు ఎదరుచూశారు. ఎట్టకేలకు 4.30నుంచి సుమారు రెండు గంటల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి బసు.. సీతారాంనాయక్ నామినేషన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. సీతారాంనాయక్ వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, న్యాయవాదుల జేఏసీకి చెందిన నబీ తదితరులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. న్యాయమే గెలిచింది.. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన తనను ఎన్నికల్లో ఎదుర్కోలేకే దొంగదారిలో దెబ్బ తీసేందుకు బలరాం నాయక్ యత్నించారు. అయితే, తెలంగా ణ ఉద్యమం మాదిరిగానే ఇక్కడ కూడా న్యాయమే గెలిచింది. నర్కసంపేటలో కూ డా జేఏసీ నేతకు టికెట్ ఇస్తే బలరాంనాయక్ అడ్డుకున్నారు. మంత్రి గా ఉండి భద్రాచలం ప్రాంతంలోని మండలాలు సీమాంధ్రలో కలిపేందుకు సహకరించిన బలరాంనాయక్ మళ్లీ గెలిపిస్తే పూర్తి భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుతారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నేను లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయం. - సీతారాంనాయక్ -
ప్రొఫెసర్ బెదిరింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వెంగళరావునగర్, న్యూస్‌లైన్: ప్రొఫెసర్ ఫెయిల్ చేస్తానని బెదిరించడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థిని తల్లి జయ తెలిపిన వివరాల ప్రకారం... కూకట్‌పల్లిలో ఉండే జయ, దివాకర్ల కుమార్తె మంజరి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలోని హాస్టల్లో ఉంటూ బ్యాచ్‌లర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్) ఫైనల్ ఇయర్ చదువుతోంది. తమ బంధువు మృతి చెందడంతో మంజరి ఇటీవల కళాశాలలో జరిగిన ప్రి-ఫైనల్ ఎగ్జామ్స్‌కు హాజరు కాలేదు. దీంతో కళాశాలలోని శాలక్య డిపార్ట్మెంట్ హెడ్, ఎగ్జామ్స్ ఇన్‌ఛార్జి అయిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ గత శుక్రవారం ఆ విద్యార్థినికి ఫోన్ చేశాడు. ఎందుకు పరీక్ష రాయలేదని ప్రశ్నించాడు. ఆమె చెప్తున్న సమాధానం వినకుండానే.. త్వరలో జరిగే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వైవాలో ఫెయిల్ చేస్తానని, మిగతా ప్రొఫెసర్లకు కూడా చెప్పి మిగతా సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన మంజరి సూసైడ్ నోట్ రాసి ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవడంతో పాటుగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. నర్స్‌గా పని చేస్తున్న తల్లి సాయంత్రం విధుల నుంచి తిరిగి వచ్చే సరికి కుమార్తె అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ఆమె కుమార్తెను మియాపూర్‌లోని ఆసుపత్రిలో చేర్పించింది. మంజరి ప్రస్తుతం ఐసీయూలో చికిత్సపొందుతోంది. తన కుమార్తె మెరిట్ స్టూడెంట్ అని, ఇప్పుడు ఫెయిల్ చేస్తామంటే ఆమె భవిష్యత్ ఏం కావాలని మంజరి తల్లి ప్రశ్నించింది. తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారకుడైన ప్రొఫెసర్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుకు సైతం ఫోన్ చేయగా వారి నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. శని, ఆదివారాల్లో సెలవు దినాలు కావడం వల్ల సోమవారం కళాశాలకు వచ్చినట్టు విద్యార్థిని తల్లి జయ తెలిపింది. ఆందోళన... మంజరి తల్లి సోమవారం ఆయుర్వేద కళాశాలకు వచ్చి ఆందోళనకు దిగింది. తోటి విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లును కలిశారు. తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్నగర్ పోలీసులు కళాశాలకు వచ్చి ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేశారు. ప్రొఫెసర్ సూర్యప్రకాశ్‌ను విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తరలించారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు తెలిపారు. సూర్యప్రకాశ్‌ను ఎగ్జామినేషన్ ఇన్చార్జి విధుల నుంచి తక్షణం తప్పిస్తున్నట్టు వెల్లడించారు. -
కీచక ప్రొఫెసర్‌కు దేహశుద్ధి
-
డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఓ యువ ప్రొఫెసర్ 130 గంటలపాటు (5 రోజులకు పైగా) నిరాఘాటంగా పాఠాలు బోధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. నిరాఘాటంగా పాఠాలు బోధించడంలో ఇప్పటి వరకు పోలాండ్ ఉపాధ్యాయుడి పేరుతో ఉన్న రికార్డును(121 గంటలు) అధిగమించారు. వివరాలు.. 26 ఏళ్ల అరవింద్ మిశ్రా స్థానిక గ్రాఫిక్ ఎరా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నిరాఘాట బోధనలో ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించాలనే ఉద్దేశంతో మెకానికల్ ఇంజనీరింగ్ అంశాన్ని 130 గంటలపాటు నిరాఘాటంగా బోధించారు. వర్సిటీలోని ఎంబీఏ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డ్ ప్యానల్ హాజరై యువ ప్రొఫెసర్ బోధన పట్ల అచ్చరువొందింది. కాగా, మిశ్రాను వర్సిటీ చైర్మన్ పొగడ్తలతో ముంచెత్తి రూ. లక్ష రివార్డు అందజేయడంతోపాటు పదోన్నతులు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. -
డెహ్రాడూన్ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఓ ప్రొఫెసర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల అరవింద్ మిశ్రా ఏకధాటిగా అత్యధిక సమయం బోధించిన టీచర్‌గా ఘనత సాధించారు. మెకానికల్ ఇంజనీరింగ్ బోధించే మిశ్రా.. ఇదే అంశంలో ఏకధాటిగా 130 గంటలకు పైగా ఉపన్యాసం ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ఆయన రికార్డు నెలకొల్పారు. ఇంతకుముందు ఈ రికార్డు పోలెండ్ టీచర్ ఎరోల్ ముజవాజి పేరిట నమోదైంది. ఆయన 2009లో వరుసగా 121 గంటల పాటు బోధించారు. -
వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి
నిట్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే ఇండియా లాంటి దేశాల్లో నీటి కరువును ఎదుర్కోవచ్చని జర్మనీ, డ్యూస్‌బర్గ్ ఎస్సెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వాటర్ మేనేజ్మెంట్ యునెస్కో మాజీ చైర్పర్సన్ డాక్టర్ డబ్ల్యూఎఫ్ గైగర్ సూచించారు. అర్బన్ స్ట్రామ్ వాటర్ మేనేజ్మెంట్పై టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఒకరోజు జాతీయ స్థాయి వర్క్‌షాపు వరంగల్ నిట్‌లోని న్యూ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా గైగర్ మాట్లాడుతూ డ్రెయినేజీ నీటిపై 1987లో తొలిసారిగా యునెస్కోకు మాన్యువల్‌ను తయారు చేసి ఇచ్చానన్నారు. 1992లో జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో మరో మాన్యువల్‌ను రూపొందించి ఇచ్చానన్నారు. 1996లో ఇండియాలో జరిగిన అర్బన్ డ్రెయినేజీ సిస్టమ్‌పై స్టడీ చేసి మూడో మాన్యువల్‌ను, 2001లో డ్రెయినేజీ నీటిని తిరిగి వాడటంపై కేస్ స్టడీ చేశానని తెలిపారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటేనే నీటి కరువును ఎదుర్కోవచ్చన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ కేవీ.జయకుమార్ ఇండియాలో ఉన్న నీటి మేనేజ్మెంట్ విధానాన్ని వివరించారు. ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వర్క్‌షాపులో నిట్ డైరక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు, రాష్ట్రంలోని 21మంది పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీర్లు, 9 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 150 మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మతి తప్పిన ప్రొఫెసర్.. నడిరోడ్డుపై హల్చల్
-
మతి తప్పిన ప్రొఫెసర్.. నడిరోడ్డుపై హల్చల్
సూర్యాపేట : అతనో ప్రొఫెసర్. అయితే ఉన్నట్టుండి ఆయన మానసిక పరిస్థితి అదుపు తప్పింది. అంతే నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. అతను చేసిన వింత ప్రవర్తన వల్ల చివరకు తాళ్లతో బంధించాల్సి వచ్చింది. వరంగల్ జిల్లా రాజుపేటకు చెందిన కృష్ణ విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. మానసిక ఆరోగ్యం బాగాలేకపోవటంతో అతడిని బంధువులు కారులో విజయవాడ నుంచి సొంతూరుకు తీసుకెళ్తున్నారు. కారు సూర్యాపేట వద్దకు రాగానే కృష్ణ మానసిక ఆరోగ్యం మరింత క్షీణించింది. ఏకంగా కారు అద్దాలు బద్దలుకొట్టి రోడ్డుపైకి వచ్చాడు. గట్టిగా అరుస్తూ రోడ్డుపై వచ్చిపోయేవారందరినీ బెదిరించాడు. దీంతో స్థానికులంతా కలిసి ప్రొఫెసర్‌ను తాళ్లతో బంధించారు. అనంతరం బంధువులు అతడిని కారులో తీసుకు వెళ్లారు. -
22 డిగ్రీస్
సీటీఆర్ఐ (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఇది జిల్లా ఉష్ణోగ్రత కాదు.. ఆయన సాధించిన డిగ్రీల సంఖ్య. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చునేమో గానీ ఆయన సాధనలో అన్నీ హెచ్చులే. నిత్యం వందలమంది రోగులకు వైద్యసేవలందిస్తూ క్షణం తీరికలేకపోయినా చదువుపై మమకారంతో విజయం సాధిస్తున్నారు. వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగాను ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రొఫెసర్ వైద్యలింగం జాతీయ సత్కారం అందుకున్నారు. రాజమండ్రిలోని దానవాయిపేటలోని మానస ఆస్పత్రి వైద్యుడు కర్రి రామారెడ్డి లాయరు..జర్నలిస్టు..డాక్టర్..ఇంజనీరు..ఉపాధ్యాయుడు..ఇలా అనేక రంగాల్లో ఎన్నో డిగ్రీలు సాధించారు. ఆయన సాధిం చిన డిగ్రీలు..అవార్డులు..విశిష్టసేవలపై ప్రత్యేక క థనం. జిల్లాలోని అనపర్తి గ్రామంలో 1954లో రామారెడ్డి జన్మిం చారు. కర్రి వెంకటరెడ్డి, కర్రి మంగాయమ్మ తల్లిదండ్రులు. నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే ఆయన గ్రాహకశక్తిని ప్రదర్శించారు. 1975లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆయన 1976లో హౌస్‌సర్జన్ పూర్తిచేసి, 1980లో రాజమండ్రిలో మానసిక రోగుల వైద్యాలయం ప్రారంభించారు. 1987 లో యం.ఏ (మాస్టర్ ఆఫ్‌సైన్స్), 1989లో యం.ఏ (పొలిటికల్ సైన్స్), డీసీఈ, 1991లో యంఏ (ఇంగ్లిషు లిటరేచర్), డీఎఫ్ఈ, 1994లో యంబీఏ, 2003లో డీఎఫ్ఎమ్, 2004లో యంసీఏ, 2007లో ఎల్ఎల్బీ, 2008లో ఎంటెక్, 2009లో మాస్టర్ ఆ్‌ఫ్ జర్నలిజం, 2009లో మరో ఎల్ఎల్ఎం, 2010 సైబర్‌లా, 2011లో ఎల్ఎల్ఎమ్ కానిస్ట్యూషనల్ లా, 2010 బీఈడీ, 2012లో ఎంఈడీ, 2013లో బీఎల్ఐఎస్సీ, వీటితో పాటు ఎంటెక్, ఎల్ఎల్బీలలోనూ పట్టాలు పొందారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం వైద్యుడిగా ఆయన సేవలు చేస్తునే పలు డిగ్రీలు సాధించడంతో ఆయన 2009లో లిమ్కాబుక్ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. అంతేకాక వైద్య సంఘాలు, వివిధ స్వచ్చం ద సంస్థలు, విద్యాలయాల్లో గౌరవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో మెంబర్‌గా కొనసాగుతున్నారు. వీటితో పాటు మరో 25 సంఘాల్లో కర్రి రామారెడ్డి పలుహోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇష్టంతో చదువుతా ఎంత బిజీగా ఉన్నా విద్యపై మక్కువతో ఇన్ని డిగ్రీలు సాధించగలిగాను. వైద్యసేవల అనంతరం ఎంతో ఇష్టపడి చదువుకుంటాను. ప్రస్తుతం మరో రెండు డిగ్రీలు చదువుతున్నాను. అవి త్వరలోనే పూర్తవుతాయి. - డాక్టర్ కర్రి రామారెడ్డి, మానసిక వైద్యులు -
మెడికోల వేధింపు కేసులో ప్రొఫెసర్ అరెస్టు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్) వైద్య కళాశాల మెడికోలపై వేధింపులకు పాల్పడ్డ కేసులో ప్రొఫెసర్ ఎంఏ సలాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ నారాయణ తెలిపారు. 2011లో రిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా ఎంఏ సలాం విధులు నిర్వర్తించారు. ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని 2011 జూన్ 28 అప్పటి రిమ్స్ డెరైక్టర్ శ్రీరాంబి రాథోడ్‌కు మెడికల్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత డెరైక్టర్ శ్రీరాంబి రాథోడ్ పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి డెరైక్టర్‌గా దుర్గాప్రసాద్‌ను నియమిం చారు. మెడికోలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఆయన ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని విచారణ నిమిత్తం నియమించారు. దీంతోపాటు మెడికోలు, డెరైక్టర్ స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెడికోల వేధింపులపై విచారణ చేపట్టిన అధికారులు డీఎంఈకి, అప్పటి కలెక్టర్‌కు పూర్తి నివేదిక అందజేశారు. నివేదికను పరిశీలించిన అనంతరం ఆరోపణలు రుజువైనందున అదే సంవత్సరం జూలై 13న ప్రొఫెసర్ సలాంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు కావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు బుధవారం ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు
వేలూరు, న్యూస్‌లైన్:రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో 1093 ఫ్రొపెసర్ పోస్టులను భర్తీ చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పయణియప్పన్ అన్నారు. వేలూరులోని ముత్తురం గం ఆర్ట్స్ కళాశాలలో అనకట్టు నియోజ క వర్గం నిధులు రూ. 30లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని మం త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 69 ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఉండేవని, అమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా 12 కళాశాలలను ప్రారంభించామన్నారు. పాఠశాల విద్య పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమం త్రి జయలలిత ఉన్నత విద్యాశాఖకు రూ. 100 కోట్లు కేటాయించారన్నారు. ఇండియాలో 9.2 శాతం విద్యార్థినులు, 12.4 శాతం విద్యార్థులు ఉన్నత విద్యకు చదువుతున్నారన్నారు. ఈ సంఖ్యను పెంచేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నా రు. వేలూరు జిల్లాలో మాత్రం జోలార్‌పేట, తిరుపత్తూరు, అరక్కోణం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నిర్మిం చేందుకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే వారందరికీ ఉచితంగా లాప్టాప్లను అందజేస్తున్న ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే మాత్రమే అన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేసి వీరమణి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నారని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేలూరులో క్రీడా మైదానం ఏర్పాటు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ. 30 లక్షల వ్యయంతో నూతన భవనం నిర్మించేందుకు అనకట్టు ఎమ్మె ల్యే కలైఅరసన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం కళాశాలలో నూతనంగా చేరే విద్యార్థులకు మంత్రులు అనుమతి పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ శంక ర్, ఎమ్మెల్యేలు కలైఅరసన్, మహ్మద్‌జాన్, మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, ఉన్నత విద్య అసిస్టెంట్ డెరైక్టర్ సదాశివం, కళాశాల ప్రిన్సిపాల్ జయపాల్, కౌన్సిలర్ చొక్కలింగం, కుమార్ పాల్గొన్నారు. -
విభజనతో..అంతటా అభివృద్ధి
సూర్యాపేట, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ప్రజాస్వామికీకరణ జరుగుతుందని, మూడు ప్రాంతాల్లో కొత్త అభివృద్ధికి అవకాశం కలుగుతుందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మూడు ప్రాంతాల ఉద్యమ నేతల ఉమ్మడి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. 1990 దశకంలో అంతర్జాతీయ పెట్టుబడులు తేవాలనే ప్రయత్నంలో మురికివాడలను తొలగిం చడం, రైతుల భూములు గుంజుకోవడం, చెరువులు పూడ్చివేయడం చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఐటీ, ఇతర రంగాల్లో కంపెనీలు పేరిట భూముల విలువలు విచ్చలవిడిగా పెంచుకున్నారని, ఇది రియల్ ఎస్టేట్ ప్రేరిత అభివృద్ధి తప్ప మరోటి కాదన్నారు. న్యాయం, స్వేచ్ఛ సమానత్వం కోసం జరిగిందే తెలంగాణ పోరాటమన్నారు. సమైక్య ఉద్యమం యాసిడ్ దాడి చేసే ప్రేమోన్మాదం లాంటిదని విమర్శించారు. సమైక్యాంధ్ర.. బూటకం, కమ్మ, రెడ్డిల నాటకం : పల్నాటి శ్రీరాములు సమైక్యాంధ్ర బూటకం.. కమ్మ, రెడ్డిల నాటకమని బహుజనాంధ్ర ఉద్యమ నేత పల్నాటి శ్రీరాములు ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రలో ఉద్యమం చేస్తున్న రాజకీయ పార్టీల నాయకులు సమైక్య పదం ఉచ్ఛరించడానికి అర్హత లేదన్నారు. ఏనాడైనా దళిత బహుజనులను కలుపుకునిపోయారా అని ప్రశ్నించారు. నిజమైన సమైక్యత ఉంటే సీమాంధ్ర, తెలంగాణలో రెండు కులాల చేతుల్లోనే పరిపాలన ఎందుకుంటుందని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర పాలనలో దళిత బహుజనులకు జీవించే హక్కు కాలరాశారని, అందుకు ఉదాహరణే కారంచేడు, చుండూరు మారణహోమాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామిక మనస్తత్వంతో ప్రజలంతా కదం తొక్కడం చాలా సంతోషకరమన్నారు. పెట్టుబడులు, ఆధిపత్యం కాపాడుకోవడం కోసం సమైకాంధ్ర ఉద్యమం నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు, కార్పొరేట్ విద్యార్థులు తప్ప ఉద్యమంలో ప్రజలు లేరన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే సమైకాంధ్ర జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారన్నారు . రాయలసీమ, సర్కారాంధ్ర కలిసి ఉండడం అసంభవం : డాక్టర్ భూమన్ తెలంగాణ వేరైతే రాయలసీమ, సర్కారాంధ్ర కలిసి ఉండడం అసంభవమని రాయలసీమ అధ్యయన వేదిక వ్యవస్థాపకుడు డాక్టర్ భూమన్ అన్నారు. సర్కారాంధ్రలో 112, రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏ తీర్మానం పెట్టినా తాము నెగ్గేదెలా అని ప్రశ్నించారు. మూడు ముక్కలాట.. మూడు రాష్ట్రాల మాట అని తాము ఆశామాషిగా మాట్లాడడం లేదని పేర్కొన్నారు. 1913 నుంచే తాము ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుతున్నామని గుర్తు చేశారు. మీ రాష్ట్రం మీకేర్పడితే మిగలబోయేది మా సమస్యలు, మా కన్నీళ్లేనని, మా పట్ల ఓ కన్నేయండని తెలంగాణ ప్రజలను కోరారు. రాయలసీమ రతనాల సీమా, రత్నగర్భ, అపారమైన ఖనిజ సంపద ఉన్న ప్రాంతమన్నారు. వైశాల్యం రీత్యా 10 జిల్లాలతో కూడిన రాష్ట్రమవుతుందన్నారు. మీకు బొగ్గు గనులు ఉంటే.. మాకు ఎర్రచందనం, ముగ్గు రాళ్లు, ఆస్బేస్టాస్లాంటి సంపద ఉందన్నారు. కేవలం ఫ్యాక్షనిజం వల్లే అక్కడ పరిశ్రమలు పెట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెవెన్యూ ఉందనడం అపోహే : ఎంవీ రమణారెడ్డి హైదరాబాద్‌లో రెవెన్యూ ఉందంటూ అది ఉమ్మడి రాజధాని కావాలని కోరడం సమంజసం కాదని రాయలసీమ జేఏసీ కన్వీనర్ ఎంవీ రమణారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలతో కలిసి ఉంది కాబట్టే సేల్స్ టాక్సీ ఎక్కువ రావడం సహజమని, ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత ఎవరి రెవెన్యూ వారికే వస్తుందన్నారు. నదీ జలాల విషయంలోనూ ప్రజలకు అపోహలు ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి నుంచి 1500 టీఎంసీల నీరు, కృష్ణా నుంచి 300 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తుందని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ఆనకట్టలు కట్టి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అన్ని ప్రాంతాల వారు కూర్చొని చర్చించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు తొందరపడాల్సిన అవసరం లేదని, నిగ్రహం, సంయమనం పాటించాలన్నారు. సచివాలయం నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సి వస్తుందనడంతో ఉద్యమం బలం పుంజుకుందన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం : కాట్రగడ్డ ప్రసూన హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అన్నారు. తెలంగాణలో ఎవరైనా ఉండొచ్చని.. ఇదొక పుష్ప గుచ్ఛంలాంటిదని కోదండరాం అన్నారని గుర్తు చేశారు. పొట్టకూటి కోసం వచ్చారని మాత్రం అనొద్దని విజ్ఞప్తి చేశారు. గ్లోబలైజేషన్లో ఎక్కడ నాగరికత ఉంటే అక్కడికి వెళ్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి హాని జరగలేదన్నారు. భవిష్యత్‌లో మాకొన్ని చట్టాలు కావాలని కోరడం తప్పులేదని భావిస్తున్నానన్నారు. నీళ్లు రావనుకోవడం రాయలసీమ వాసుల భ్రమ :విద్యాసాగర్‌రావు జల నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కృష్ణా బేసిన్లో ఉన్న 18శాతం వాటానే తప్ప తెలంగాణ ఏర్పడితే మాకు నీళ్లు రావని రాయలసీమ వాసులు అనుకోవడం భ్రమ అన్నారు. అదనపు నీళ్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నదుల అనుసంధానం ద్వారా న్యాయం చేయాలని అడగాలన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాకెలాంటి అభ్యంతరమూ లేదన్నారు. చట్టబద్ధంగా నికరజలాలైనా, మిగులు జలాలైనా తీసుకోవాలి తప్ప హక్కు లేని దానిని హక్కుగా భావించి అన్యాయం జరుగుతుందనడం భావ్యం కాదన్నారు. మా నీళ్లు.. మా నిధులు.. మా నియామకాల కోసమే పోట్లాడుతున్నాం తప్ప ఎవరికి అన్యాయం చేయమన్నారు. టీజేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ శాంతిని కోరుకుంటున్నాం.. రాష్ట్రాలుగా విడిపోవాలనుకుంటున్నామన్నారు. అడ్డుకుంటే మిగిలి ఉన్న సాయుధ పోరాట శకలాలను కొనసాగించడానికి వెనుకాడబోమన్నారు. ప్రజాస్వామిక ఆకాంక్షను వ్యతి రేకించే హక్కు ఎవరికి లేదన్నారు. విద్యుత్ జేఏసీ చైర్మన్ రఘు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పే మాటల్లో వాస్తవం లేదన్నారు. కార్యక్రమానికి జన చైతన్య వేదిక అధ్యక్షుడు పశ్య ఇంద్రసేనారెడ్డి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి బద్దం అశోక్‌రెడ్డి కార్యదర్శి నివేదిక సమర్పించారు. ఇంకా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ మీలా సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక సభ్యులు డాక్టర్ రామయ్య, కొల్లు మధుసూదన్‌రావు, యానాల యాదగిరిరెడ్డి, మర్రు హన్మంతరావు, ఏనుగు లింగారెడ్డి పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా జరిగాయి. వివిధ ప్రజా, ఉద్యోగ, విద్యార్థి సం ఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రముఖులు పాల్గొని జయశంకర్‌కు నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. సీమాంధ్రులకు పూర్తి రక్షణ సరూర్‌నగర్: భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం, స్వేచ్ఛా స్వాతంత్య్ర హక్కులు కల్పించిందని... ఈ ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రుల కు అన్ని విధాలా రక్షణ ఉంటుందని తెల ంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థు లు, అధ్యాపక బృందం మంగళవారం జయశంకర్ జయంతి నిర్వహించారు. ఇందులో కోదండరామ్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శనం చేసిన తొలి వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే కుషాయిగూడ: రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని బీజేపీ జాతీయ నాయకులు సి.హెచ్.విద్యాసాగర్‌రావు చెప్పారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య (టిఫ్) నిర్వహించిన ‘సద్భావనా సభ’ లో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... గిర్గ్లానీ కమిషన్ సిఫార్సులు, 610 జీఓ ప్రకారం నగరంలో అక్రమంగా ఉద్యోగాల్లో ఉన్న 1.50 లక్షల మంది తమ స్వస్థలాలకు వెళ్లాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఈటెల రాజేందర్, ‘టిఫ్’ అధ్యక్షుడు కె.సుధీర్‌రెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సీపీఐ ఫ్లోర్‌లీడర్ గుండా మల్లేష్, పీఓడ బ్ల్యు అధ్యక్షురాలు వి.సంధ్య, బీజేపీ నాయకులు ఎన్న్వీస్ ప్రభాకర్ పాల్గొన్నారు. జయశంకర్ సేవలను కొనియాడారు. జీహెచ్ఎంసీలో... సిటీబ్యూరో: తెలంగాణ మునిసిపల్ ఉ ద్యోగ, కార్మిక సంఘాల నాయకులు జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పిం చారు. జీహెచ్ఎంసీలోని జీ హెచ్ఎంఈయూల ఆధ్వర్యంలో గన్‌పా ర్క్, జీహెచ్ఎంసీలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మునిసిపల్ జేఏసీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్, ఎస్టీ, ఎస్టీ విభాగం అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు. -
జేఎన్ఏఎఫ్ఏయూలో విద్యార్థుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్ఏఎఫ్ఏయూ) పెయింటింగ్ విద్యార్థులు సోమవారం కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పెయింటింగ్ విభాగం అధిపతి స్టాన్లీ సురేష్ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వర్సిటీ పక్కనే ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ జయప్రకాశ్రావుకు ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు వినతిపత్రం ఇచ్చారు. ఇదిలావుండగా, మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షను బహిష్కరించి ఆందోళనకు దిగిన విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. కావాలనే ఆరోపణలు: స్టాన్లీ సురేష్ ఈ విషయమై ప్రొఫెసర్ స్టాన్లీ సురేష్‌ను వివరణ కోరగా.. ‘ఇప్పుడు పరీక్షల సమయం. విద్యార్థులకు మార్కులు, హాజరు శాతం వంటివి నా చేతుల్లో ఉన్నాయి. అందుకే నా మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. నేనంటే పడని తోటి ఉపాధ్యాయులు విద్యార్థులను ఎగదోస్తున్నార’ని పేర్కొన్నారు.