- ఈ నెల 8వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు
- గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి
- నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
- ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు సూచించారు. నల్లగొం డలో ఎంసెట్ నిర్వహణపై సోమవారం స్థానిక ఎన్జీ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంసెట్ నిర్వహణకు జిల్లా కేంద్రంలో 17 ఇంజినీరింగ్ సెం టర్లు, 8 అగ్రికల్చర్, మెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 8,500 మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు, 4050 అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు.
ఈ నెల 22వ తేదీన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల న్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోరని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నిర్వహణలో ఏలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మాల్ ప్రాక్టీస్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీ సుల సహకారం తీసుకుంటామన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు, ఆపైన ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రత్యేక అబ్జర్వర్లను నియమించడంతో పాటు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నాగేందర్‌రెడ్డి, 17 మంది పరి శీలకులు, 17మంది చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
Published Tue, May 6 2014 2:09 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement